N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Monday, 7 October 2013

Annadaanam / Food Donation

                                           అన్నదానం విశిష్టతప్రయోజనాలు

ఆకలిగా వున్న ప్రాణులకు ఆహారాన్ని అందించటం ద్వారా అనేక పాపాలు నశించి పోతాయి.కలరా వంటి మహామ్మారులు అయిన విషజ్వరాలు కూడా పారిపోతాయి.అందుకే ఊరిలో వాళ్ళ చేత ఊరి బయట సరిహద్దుల్లో వున్న జీవరాశులకు ఆహారంగా గోధుమ పిండి చల్లించారు బాబా.మనం కూడా రోజూ భోజనం చేయబోయే ముందు ఓ పిడికెడు అన్నం మెతుకులను చేతిలోకి తీసుకోని ఆ పరబ్రహ్మ స్వరూపానికి  మనసారా నమస్కారం చేసుకొని భక్తితో లేచి వెళ్లి ఏ పిట్టగోడ మీదో,నేల మీదో పెట్టి "ఆకలి గొన్న ప్రాణులు అందరికి ఈ ఆహారం అందజేయుబడుగాక" అని ప్రేమతో అందివ్వటం ద్వారా అనేక మహా పాతకాలు నశించి పోతాయి.ఆకలి గొన్న ప్రాణులకు అన్నం పెట్టడం వల్ల ఎన్నో మహా ప్రయోజనాలు వున్నాయి. 

ముఖ్యంగా మన అన్నమయ కోశము శుద్ధి చేయబడుతుంది.మన శరీరంలో ఏ వ్యాధి అయినా  అది చిన్నది కావచ్చు, కాన్సర్ లాంటి భయానకమైనది కావచ్చు మనకి ఫైకి కనిపిస్తున్న ఈ శరీరంలోకి ప్రవేశించి మనల్ని మంచాన పడేసి వేధించుకు తినబోయే ముందు మొట్టమొదట మన శరీరంలోని అన్నమయ శరీరంలో ప్రవేశించి అక్కడ బాగా బలం పుంజుకుంటుంది.ఆకలిగా ఉన్నవారికి ఆకలి తీర్చటం ద్వారా మనలో ఉన్న రకరకాల రోగాలతో పాటు, పాడై పోయి దెబ్బతింటున్న అన్నమయ శరీరము శుద్ధి చేయబడుతుంది.కాబట్టి రాబోయే రోజుల్లో సంక్రమిపబోయే రకరకాల వ్యాధులను నివారణ చేసుకునేందుకు మానవుల మైన మనము మానవత్వంతో మనం తినబోయే ముందు మన ఇంటి చుట్టు పక్కల ఉన్న పశు పక్ష్యాదులకు ఆకలి తీర్చటం విధిగా,క్రమంగా తప్పకుండా చేయగలిగితే చాలా మంచిది.అదే బాబాగారు మనకి ఇచ్చినటువంటి సందేశం. రాజకీయాలలో మంచి పదవులు సాధించాలి అంటే కూడా అన్నదానం చేయాలి.ఇలా అన్న సంతర్పణలు చేసే వారి మూలాధార చక్రానికి సంబంధించిన దోషాలు పోయి ప్రజలలో 'అందరివాడు' అని పేరు తెచ్చుకుంటారు.ఇలాంటి వారికీ రోగాలు రావు.

ఎప్పుడు అయితే ఇతరుల ఆకలి తీరుస్తావో, నీ శరీరంలో నీకు తెలియకుండా చేరిన చెడ్డ బ్యాక్టీరియా,విష క్రిములు నిన్నేమి చేయలేవు.అందుకే శ్రీశ్రీ శ్రీ గొలగమూడి వెంకయ్య స్వామి వారు ఆకలిగొన్న వారికి అన్నం  పెట్టమని అన్నారు.గీతలో భగవానుడు ఇలా తెలియజేసారు."నీకోసం నువ్వు వండుకున్న ఆహారము విషముతో సమానము.అసలు దానిని మించిన దొంగతనము ఇంకొకటి లేదు.దొంగతనం చేసిన వారికి ఎలాంటి శిక్ష పడుతుందో వీరికి అదే శిక్ష పడుతుంది."

పుణ్యక్షేత్రాలలో అన్నదానం విశిష్టత:
విశ్వజఠరాగ్నికి మనిషిలో ఉన్నజఠరాగ్నితో అనుసంధానం కలిగి వుంటుంది. జఠరాగ్నికి మణిపూరక చక్రానికి సంభందం వుంటుంది.ఈ జఠరాగ్నికి, ఆకలికి దగ్గర సంభందం వుంటుంది. ఏ క్షేత్రంలో అయితే శక్తిపాతం జరుగుతుందో, అంటే ఏ దేవుని యొక్క శక్తి ఉత్పన్నం అవుతుందో  మరియు నిత్య పూజలు జరుగుతాయో అక్కడ శక్తి చాలా ఎక్కువ స్థాయిలో వ్యాపించి వుంటుంది. దానికి అక్కడ అన్నశాంతి తప్పకుండా జరగవలెను.ఎప్పుడు అయితే ఈ జఠరాగ్నికి అన్నశాంతి జరపబడుతుందో అక్కడ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి మనుష్యులలో మానసిక పరిస్థితి మెరుగు పడుతుంది. అన్నమయ కోశము పరిశుద్ధి అవుతుంది తద్వారా ప్రాణమయ, మనోమయ,విజ్ఞానమయ,ఆనందమయ కోశములు పరిశుద్ధి అవుతాయి. తద్వారా మనుష్యులలో భావ స్పందనలు  సాత్వికంగా మారతాయి. క్రమక్రమంగా మనుష్యులలో ప్రమశాంతిస్నభావాలు కలిగి విశ్వశాంతికి దారి తీస్తుంది.

విషయ సేకరణ:
శ్రీ పరమపూజ్య డా.మారెళ్ళ రామకృష్ణ గారి ప్రవచనాల నుండి మరియు  శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతం నుండి..