N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Monday, 17 February 2014

SwamiNarayan - Episode 15

మల్లయోధుని గర్వభంగం

ఒకరోజు సరయూనది ఒడ్డున ఘనశ్యాంమహారాజ్ మరియు అతని మిత్రులు ఆటలాడుకుంటున్నారు. నేపాల్ దేశం నుండి వచ్చిన ఒక మల్లయోధుడు అయోధ్యానగరపు మల్లయోధులను ఉద్దేశించినేను భారతదేశంలో ఉన్న అందరు మల్లయోధులను ఓడించాను, ధైర్యముంటే మీలో ఎవరైనా నాతో తలపడతారా?” అని సవాలు విసిరాడు. అక్కడే ఉన్న ఘనశ్యాంమహారాజ్ తన మిత్రులతో “మనం కూడా వారిలా మల్లయుద్దం చేద్దామా” అని అన్నాడు. మల్లయోధులు అక్కడ మల్ల యుద్ధపోటీలు జరుపుకొనుచుండగా ఘనశ్యాంమహారాజ్ తన మిత్రులతో కుస్తీ పోటీలు ప్రారంభించాడు. ఇది గమనించిన నేపాల్ మల్లయోథునికి కోపం వచ్చి తమను అనుకరిస్తూ కుస్తీ పడుతున్న పిల్లల వద్దకు వచ్చి కోపంగా మీరు మర్యాదగా కుస్తీ పోటీలను మాని వెళ్ళిపోండి” అని గర్జించాడు. 

అపుడు ఘనశ్యాంమహారాజ్ మీరు చెపితే మేము కుస్తీపోటీలు ప్ర్రారంభించలేదు, అయినా నువ్వెవరివి మాకు చెప్పడానికి? మేము చిన్నపిల్లలం, సరదాగా ఆడుకుంటుంటే” అని చిన్నగా మందలించాడు. ఆ మల్లయోధునికి కోపం వచ్చి “నువ్వు చిన్న పిల్లవాడివి, నాకు ఎదురు చెపుతావా!” అని అరిచాడు. ఘనశ్యాంమహారాజ్ కూడా అదే స్థాయిలో “ఇక్కడ నుండి మేము వెళ్ళే ప్రసక్తే లేదు, మా ఆటలు మేము ఆడుకుంటున్నాము” అని అరిచాడు. “ఐతే సరే, నాతో మల్లయుద్దానికి వస్తావా!” అని మల్లయోధుడు అడుగగా, ఘనశ్యాంమహారాజ్ సరేనని మల్లయుద్ధానికి ఒప్పుకున్నాడు. దీనిని దూరం నుండి చూస్తున్న మిత్రులందరు చాలా భయపడ్డారు. ఘనశ్యాంమహారాజ్ కొద్దిసేపు ఆ మల్లయోధునితో ఆడుకున్నాడు. చివరకు ఆ మల్లయోధునికి దొరికినట్లే దొరికి, ఒకే ఒక చావుదెబ్బతో ఆ మల్లయోధుని నేలకూల్చాడు. ఇదంతా చూస్తున్న మిగతా మల్లయోధులు ముక్కున వేలు వేసుకున్నారు. ఏమిటీ ఈ బాలకుడు, అంత ప్రసిద్దిచెందిన మల్లయోధుని మట్టి కరిపించినాడు అని ఆశ్చర్యపోయినారు.

ఈ వార్త అయోధ్యా నగరమంతా దావాలనంలా పాకిపోయింది. అందరూ ఈ విషయాన్ని కధలు కధలుగా చెప్పుకుంటున్నారు. అయోధ్యా నగరంలో ఒక ప్రసిద్ది చెందిన మల్లయోధుని గురువుగారైన శివప్రసాదుగారు ఆ బాలుని గురించి ప్రస్తావించి “మీరంతా ప్రొద్దుటే లేచి బాగా వ్యాయామం చేస్తారు. కాని ఒక బాలుని ఓడించలేకపోయారు” అని చెప్పగాఅపుడు వారంతా “ఆ నేపాల్ మల్లయోధుని ఓడించిన బాలకుని మనం సవాల్ చేద్దాం” అని అనుకున్నారు. అతనిని బహిరంగంగా రాజాస్థానంలోనే  మట్టికరిపించి మన పరువు నిలుపుకుందామని ఆ గురువుగారు నిశ్చయించినారు. వారి మహారాజు అయిన దర్శన్ సింఘ్ గారికి ఈ విషయం విన్నవించారు. ఈలోగా ఆ వార్త విన్న ఘనశ్యాంమహారాజ్ తల్లితండ్రులు, సన్నిహితులు అవాక్కై అంతా చింతాభ్రాంతులైనారు. ఎన్నోవిధాలుగా ఘనశ్యాంమహారాజ్ కి చెప్పిచూసారు. “అంత గొప్ప మల్లయోధునితో తలపడటం, ఈ పందెంలో పాల్గొనటం మాకు యిష్టం లేదు. మనం బ్రాహ్మణులం, ఈ మల్లయుద్ధాలు మనకెందుకు” అని చెప్పారు. అపుడు ఘనశ్యాంమహారాజ్ నవ్వుతూ “మీరంతా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. నేను తప్పకుండా వెళ్ళి అతని అహంకారం అణుస్తాను. 

మనం అహంకారపూరితుడైన మల్లయోధుని అహంకారాన్ని రూపుమాపాలి” అని అన్నాడు. కాని వారు ససేమిరా ఒప్పుకోలేదు, “నిన్ను  గృహ నిర్బంధం చేస్తాం, నిన్ను బయటకు వెళ్ళనిచ్చే ప్రసక్తే లేద”ని చెప్పారు. అపుడు ఘనశ్యాం మహరాజ్ “ఒక షరుతు మీద మీరు చెప్పిన మాట వింటాను. నేను గృహత్యాగం చేస్తాను” అనగా, వారి మాత, సుహాసిని వదిన గారు ససేమిరా ఒప్పుకోలేదు. అపుడు ఘనశ్యాం మహరాజ్ “మీరు పంపినా, పంపకున్నా మహారాజు గారి సిపాయిలు వచ్చి మన ఇంటి మీద పడతారు, కావున నన్ను వెళ్ళనివ్వండని” వారిని కోరాడు. ఈలోగా ఆ వూరిలో 8 ఏళ్ళ బాలునికి, అయోధ్యా మల్లయోధునికి మధ్య మల్లయుధ్ధ పోటీ అని చాటింపు వేయడం జరిగింది. ఈ చాటింపు విన్న అయోధ్యా ప్రజలు, చుట్టుప్రక్కల గ్రామాల వాళ్ళు తండోపతండాలుగా అయోధ్యానగరానికి వచ్చారు. నిర్దేశించిన సమయానికి ఘనశ్యాం మహరాజ్ తన మిత్రులతో అక్కడకు వచ్చాడు. ఈలోగా మహారాజు దర్శన్ సింఘ్ కూడా విచ్చేసారు. ఆ మల్లయోధుడు మహారాజుతో “ఈ 8 ఏళ్ళ బాలుని ప్రాణాలకు ఎటువంటి హామీ లేదు” అని విన్నవించాడు. “మల్లయుధ్ధానికి ముందు ఒక బలప్రదర్శన చేస్తాను” అని ఆ మల్లయోధుదు గురువుగారి కాళ్ళకు బలమైన ఇనుప సంకెళ్ళను వేసి ఆ గొలుసులను లాగి గురువుగారిని పడవేయాలి అని  చెప్పాడు. అక్కడ ఉన్న కొంతమంది మల్లయోధులు ఆ గొలుసును లాగడానికి ప్రయత్నించగా, గురువు గారి పాదం ఏమాత్రం కదలలేదు. 

అపుడు ఘనశ్యాం మహరాజ్ పరివారం భయభ్రాంతులై, “నాయనా! నీవు నీ ఓటమిని ఒప్పుకో, మనం ఇంటికి వెళ్ళిపోదామని” ప్రాధేయపడ్డారు. అపుడు ఘనశ్యాం మహరాజ్ ముందుకు వచ్చి “మహారాజా! నేను బ్రాహ్మణ బాలకుడను, మాకు ఒకరి రక్తం చిందించడం సుతరాము ఇష్టం లేదు. అయినా వారు అహంకారంతో చేస్తున్న సవాల్ని నేను స్వీకరిస్తున్నాను.  ఈ మల్లయోధునితో కుస్తీపడతాను” అని చెప్పి తన తలపాగా తీసి నడుముకు చుట్టుకుని, ఆ బలమైన ఇనుప సంకెళ్ళను పట్టుకుని గట్టిగా లాగి ఆ గురువుగారిని క్రిందకు పడవేశాడు. సభాసదులు, మహారాజుతో సహా అందరూ ఆశ్చర్యపోయినారు. అపుడు ఘనశ్యాం మహరాజ్ ఆ గురువుతో  “నీవు ఎంత బలవంతుడివైనా ఆ భగవంతుడి ముందు చిన్నవాడివే, అహంకారంతో నీవు చేసిన సవాల్ కి ఇదే నా సమధానం” అని చెప్పి  అందరి హర్షధ్వానాల మధ్య సభ నుండి వెళ్ళిపోయాడు.

ఘనశ్యాం మహరాజ్ కి 8 ఏళ్ళు వచ్చేసరికి, వారి తల్లితండ్రులు అతనికి ఉపనయనం చేయనిశ్చయించారు. వారిద్దరూ అయోధ్యానగరానికి వెళ్ళి ఉపనయనం చేయించి, అందరికి తగు సత్కారాలు చేయిద్దామని సంకల్పించి ఒక శుభముహూర్తాన అయోధ్యానగరంలో ఘనశ్యాం మహరాజ్ కు ఉపనయనం చేయించారు. అందరి దగ్గరా ఘనశ్యాం మహరాజ్ “భవతీ భిక్షాం దేహీ” అంటూ సుహాసిని వదిన గారి వద్దకు రాగానే, వారు ఘనశ్యాం “నీకు నేను చేసిన లడ్డూలు అంటే ఇష్టం కదా, ఆ లడ్డూని నీ జోలెలో వేస్తాను” అనగా నా జోలెలో ఖాళీ లేదు” అని అన్నాడు. “నీ జోలెలో  ఖాళీలేకపోయినా, నీలో దయ, కరుణ, జాలి పుష్కలంగా ఉన్నాయి కాబట్టి నేను వేసే లడ్డూకి స్థలం లేదనడం భావ్యం కాదు” అని అంటూ ఎంతో భక్తిశ్రద్దలతో ఆ లడ్డూని అతని జోలెలో వేసింది. ఉపనయన మహోత్సవంలో భాగంగా కాశీయాత్ర కార్యక్రమం ఉంటుంది. కాశీయాత్ర అని చెప్పి కొద్ది దూరం ముందుకి పోయేసరికి వటువు మేనమామ అతనిని తిరిగి వెనక్కి తీసుకువస్తారు. ఘనశ్యాం మహారాజ్   తన మేనమామ అయిన వర్షురాం ఆశీర్వాదం తీసుకుని నిజంగానే కాశీయాత్రకి బయలుదేరాడు. అందరు ఇక్కడే ఎక్కడో ఉంటాడులే అని అనుకుని వెతగ్గా ఘనశ్యాం మహారాజ్ ఊరి పొలిమేరల వద్ద నడుస్తూ కనిపించగా వర్షురాం ఘనశ్యాం మహారాజ్ ని బ్రతిమాలి వెనక్కి తీసుకువచ్చాడు.  ఉపనయనం తరువాత ఘనశ్యాం మహరాజ్ లో చాలా మార్పు వచ్చింది. ఎప్పుడు చూసినా వైరాగ్య స్వభావంతో ఉండేవాడు. అతను ఒక్కొక్కసారి కనిపించకపోయేసరికి వారు వెతుకగా ఎక్కడో ఒక చోట హరికథాకాలక్షేపం చేస్తూనో, పురాణ శ్రవణం చేస్తూనో కనపడేవాడు. ఒకరోజు ఘనశ్యాం మహరాజ్ తండ్రిగారైన ధర్మదేవ్ దగ్గరకు వెళ్ళి తనకు గృహత్యాగం చేయడానికి అనుమతి ఇవ్వవలసిందిగా ప్రార్ధించాడు. అతని తండ్రి నిరాకరించాడు. సుహాసిని వదినగారు కూడా ఇల్లు వదిలి వెళ్ళడానికి అనుమతించలేదు. 
                                                                                                                                                  ఒక రోజు మీర్ అనే సరస్సు వద్ద ఆడుకుంటుండగా, ఒక జాలరి చేపలను పట్టుకోవడం చూచి ఘనశ్యాం మహరాజ్ హృదయం ద్రవించిపోయింది. ఆ జాలరి పట్టిన చేపలను ఆ సరస్సులో వదిలివేయగా ఆ జాలరికి కోపం వచ్చి ఘనశ్యాం మహారాజుని కొట్టటానికి రాగా, ఆ జాలరికి ఘనశ్యాం మహరాజ్ కి బదులు యముడు కనిపించాడు. అతను భయభ్రాంతుడై ఘనశ్యాం మహరాజ్ పాదాలపై పడగా జీవించటానికి నీకు ఎంత హక్కు ఉందో, ఆ చేపలకు కూడా అంతే హక్కు ఉంది” అని అహింసా మార్గాన్ని భోధించాడు. ఈ విధంగా ఘనశ్యాం మహారాజ్ చాలామంది అహంకారాన్ని, గర్వాన్ని రూపుమాపాడు.  

ఇలా కాలం గడుస్తుండగా ఘనశ్యాం మహరాజ్ తల్లిగారు జబ్బు పడ్డారు. కుమారుని దగ్గరకు పిలిచి, “ఘనశ్యాం మహరాజ్ నీవు సాక్షాత్తు భగవంతుని అవతారం, నాకు మోక్షం ప్రసాదించమని” కోరింది. “తల్లీ, ఎవరైతే జై స్వామినారాయణ్ అని భక్తితో ఆరాధిస్తారో, వారిని భవసాగరం దాటించి ముక్తిమార్గాన్ని ప్రసాదిస్తాను” అని చెప్పారు. ఆమె సంతోషంతో సుహాసిని వదినగారిని, మిగతా పరివారాన్ని పిలిచి  “ఘనశ్యాం మహరాజ్ మానవమాత్రుడు కాడు, సాక్షాత్ భగవత్స్వరూపుడు” అని చెప్పి తనువు చాలించింది.