N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Wednesday, 7 May 2014

SwamiNarayan - Episode 19



గోపాల్ యోగి

విధంగా వర్ణిరాజ్ మాయరాణి రాజ్యంలోంచి బయటికి వచ్చాక మళ్లీ అరణ్యంలో ప్రయాణం సాగిస్తూ  చివరికి ఒక సరోవరం దగ్గర ఉన్న గోపాల్ బాబా గారి ఆశ్రమం చేరుకోవడం జరిగింది. గోపాల్ బాబాగారు మహా యోగి. అష్టాంగ యోగంలో ప్రావీణ్యం సంపాదించారు. జనానికి దూరంగా అరణ్యంలో నిరంతరం భగవధ్యానంలో జీవితాన్ని గడిపే సాధువు గోపాల్ బాబా. తన దగ్గరకి వచ్చినటువంటి శిష్యులను వారి యోగ్యతను పరీక్షించాకే వారికి అష్టాంగ యోగం నేర్పుతూ ఉంటారు. వర్ణిరాజ్ ఆశ్రమానికి వచ్చి సరోవరంలో కాళ్ళు చేతులు కడుక్కుని ఎంతో శ్రద్దగా తపస్సమాధిలో నిశ్చలంగా ఉన్న గోపాల్ బాబా ముందు ఎంతో వినయంగా చేతులు కట్టుకుని ఆయననే తదేకంగా చూస్తూ ఉండిపోయారు.

ధ్యానంలో ఉన్న బాబాగారికి తన ఎదురుగా నరనారాయణుడి రూపమైన ఒక బాలకుడు నిలిచి ఉన్నాడని గ్రహించి కనులు తెరిచి ఎంతో ఆనందంతో "వర్ణిరాజ్ మీరు నా దగ్గరకి వచ్చారా.  మీరెవరో  నేను గ్రహించాను, నా జీవితం ధన్యం అయ్యింది" అని ఎంతో ఆర్తితో ఆయనను ఆహ్వానించారు.

 దానికి సమాధానంగా వర్ణిరాజ్  "దయ చేసి మీరు నన్నులజితుడిని చేయవద్దు. నేను మీ దగ్గర అష్టాంగ యోగ   విద్య నేర్చుకోవడానికి వచ్చాను" అని ఎంతో వినయంగా సమాధానం చెప్పారు. "మీరు నా దగ్గర అష్టాంగ యోగం నేర్చుకోవడానికి వచ్చారా, యోగం చాలా కష్టమైనది" అని చెప్పగా వర్ణిరాజ్ "కష్టమే కాని అసాధ్యమైనది కాదు కదా" అని బదులిచ్చారు. దానికి గోపాల్ బాబా "అసాధ్యమంటూ ఏది ఉండదు" అని అన్నారు. విచిత్రం ఏమిటంటే త్రికాలజ్ఞుడైన గోపాల్ బాబా వర్ణిరాజ్ ని గుర్తించి కూడా క్షణకాలంలో మాయలో పడిపోయారు. అందుకనే సాక్షాత్తు నరనారాయణుడి రూపమైన వర్ణిరాజ్ తో అష్టాంగ యోగం చాలా కష్టమని చెప్పడం జరిగింది. యమములు, నియమములు, ఆసనములు, ప్రాణాయామం, ప్రత్యాహర్, ధారణ, ధ్యానము, సమాధి ఇవన్నీకలిసి అష్టాంగ యోగం అంటారు. ఇది చాలా కష్టమైన విద్య.  

గోపాల్ బాబా "వర్ణిరాజ్, అష్టాంగ యోగ విద్య చాలా కఠినమైన నియమాలతో కూడుకున్నది. దీని సాధించాలంటే తామసిక ఆహారం వదిలేసి కేవలం సాత్విక ఆహారమే తీసుకోవాలి. ఏకాంతంగా నదీ తీరాన లేదా పర్వత ప్రాంతంలో సాధన చేయాలి. ఇది ఎంత కఠిన తరమైనది అంటే నిత్య సాధన చేస్తుంటే ఇది పూర్తిగా నేర్చుకోవడానికి కనీసం 20 ఏళ్ళు పడుతుంది. అంత కష్టమైనది విద్య" అని వివరించారు. ఇంత కఠినమైన విద్యను వర్ణిరాజ్ కేవలం ఒకే ఒక సంవత్సరంలో అభ్యసించారు. ఇదంతా చూస్తున్న సమయ దేవత "సాక్షాత్తు భగవంతుని అవతారమైన వర్ణిరాజ్ కు సంపూర్ణ జ్ఞానం ఉంది, ఆయనకు అష్టాంగ విద్య నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇలా ఎందుకు చేస్తున్నారు అని ఆలోచిస్తే నాకేం అనిపిస్తుందంటే  భగవంతుడు మానవ అవతారంలో వచ్చినపుడు మానవ నియమాలు పాటించాలి కాబట్టి, సమాజానికి ఆదర్శప్రాయుడిగా ఉండాలి కాబట్టి, గురువు లేకుండా విద్యా నేర్చుకోకూడదు కాబట్టి ఆయన గోపాల్ బాబగారిని తన గురువుగా ఎంచుకున్నారు". విధంగా 20 సంవత్సరాల విద్యను కేవలం 12 నెలలలో వర్ణిరాజ్ సాధించడం జరిగింది. తరువాత గోపాల్ బాబా వర్ణిరాజ్ కి నమస్కరించిభగవాన్, మీరు నా దగ్గరకి శిష్యరికం చేయడానికి వచ్చి నాకు గురు పదవిని ప్రాప్తించారు అంతకన్నా నాకు జన్మకి కావలసినది ఏముంది ప్రభు. చిరస్థాయిగా మీ పేరు తలచుకున్నపుడల్లా నా పేరు కూడా జనులు స్మరిస్తారు కదా. ఇదే నా ఆఖరి కోరిక, తీరిపోయింది. కనుక నేను నా దేహాన్ని మీ పాదాల వద్దే వదిలి వేద్దామనుకుంటున్నాను కాబట్టి అనుమతించండి” అని ప్రార్ధించాడు.  

తరువాత ఆయన స్వామికి సాష్టాంగ దండ ప్రణామం చేసి నిర్లిప్తంగా ఉన్నటువంటి వర్ణిరాజ్ ముందు సమాధి స్థితిలో దేహత్యాగం చేసారు. వర్ణిరాజ్ ఎంతో నిర్లిప్తంగా తన గురువుగారికి స్వయంగా అంత్యక్రియలు జరిపించారు. ఇదంతా చూసి పైన ఉన్న దేవతలు చాలా ఆశ్చర్యంతో "ఆహ గోపాల్ బాబా ఎంత అదృష్టవంతుడు. అటువంటి మహాత్ముడికి స్వయంగా నరనారాయణుడే  అంత్యక్రియలు జరిపించి శాశ్వతంగా మోక్షాన్ని ప్రసాదించారు. ఇంతకన్నా భక్తులకి కావలసినది ఏముంది" అని వాళ్ళలో వాళ్ళు చర్చించుకున్నారు. అంత్యక్రియలు ముగిసాక వర్ణిరాజ్ యధావిధిగా తన ప్రయాణాన్ని కొనసాగించారు.