N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Tuesday, 27 May 2014

SwamiNarayan - Episode 20



కపట గురువు

గోపాల్ బాబా అంత్యక్రియలు పూర్తి చేసి వర్ణిరాజ్  తన ప్రయాణాన్ని ముందుకు సాగించాడు. ఒక చోట ఆయన విశ్రమిస్తుండగా తన శిష్యబృందంతో అటుగా వెళ్తున్న ఒక గురువుగారు వర్ణిరాజ్ ను గమనించి అతని దగ్గరకు వచ్చి "బాలకుడా ఎవరు నీవు" అని ప్రశ్నించగా "నా పేరు నీలకంఠ్" అని సమాధానమివ్వగా "ఆహా పరమశివుడి పేరే పెట్టుకున్నావు" అని గురువుగారు అన్నారు.  


అప్పుడు వర్ణిరాజ్అదేమిటి స్వామీ పేరును బట్టి గొప్పతనం ఉండదు కదా, మన కర్మలను బట్టి అది నిర్ణయింపబడుతుంది కదా” అని సమాధానమిచ్చారు. అపుడు గురువుగారునువ్వెక్కడికి బయలుదేరావు, నీకేమి కావాలి” అని అడుగగానేను సరయిన గురువు కోసం బయలుదేరాను” అని చెప్పగా అప్పుడు గురువు "ఇంకెవరో ఎందుకు, నేనే ఉన్నానుగా. దగ్గరలోనే నా ఆశ్రమం ఉంది, నాకు అసంఖ్యాకమైన భక్తులు ఉన్నారు, నాతో పద ఆలస్యం ఎందుకు" అని అన్నారు. దానికి నీలకంఠ్ ఒక క్షణం తటపటాయించి తరువాత సరే పదమని గురువుగారితో ఆయన ఆశ్రమానికి వెళ్లారు.  

అలా గురువుగారితో పాటు వెళ్ళగా ఆశ్రమంలో దృశ్యం చాలా గందరగోళంగా ఉంది. అక్కడి శిష్యులంతా కూడా చేతిలో చిరుతలు పట్టుకుని ఎంతో ఆనందంగా భజన చేస్తూ నృత్యం చేస్తూ ఉన్నారు. వారంతా మధ్య మధ్యలో గంజాయి సేవిస్తున్నారు. భక్తులు ఎంతో శ్రద్ధగా సమర్పించినటువంటి కానుకలను కొంతమంది శిష్యులు దొంగతనం చేసి దాచుకుంటున్నారు.  ఇదంతా ఒక ప్రేక్షకుడి మాదిరిగా నీలకంఠ్ గమనిస్తూ నిలుచుండిపోయాడు, కొంత ఆవేదనతోఅయ్యో భక్తులు దేవునికి సమర్పించనటువంటి కానుకలను ధూర్తులు ఎవరికి వారు దోచుకుంటున్నారు. దేవుని పేరు చెప్పి ఇలా చెడ్డ పనులు చేస్తున్నారు. ఇలా అయితే సమాజం ఏమవుతుంది” అని కాసేపు బాధపడ్డారు.
 
నీలకంఠ్ విధంగా ఆశ్రమంలో జరిగే విషయాలను గమనిస్తూ ఒక రోజు రాత్రి ఒక చిన్న సభ్యుల ముఠా కి నాయకునిగా ఉన్న ఒకతని దగ్గరకు వెళ్లిఆహాహా మీరెంత చాకిరి చేస్తున్నారు. అటు పక్కన మీ ప్రతిపక్షంలో ఉన్న వారు హాయిగా సుఖాలన్నీ అనుభవిస్తున్నారు. మీరిక్కడ అందరికి వంటలు చేసిపెడుతున్నారు, కాని వారు గురువుగారితో కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు”. అలా అనగానే వారుఅదేమిటి ఏమి చెప్తున్నావు” అనగానేను నిజమే చెప్తున్నాను, వారి నాయకుడు గురువుగారి తరువాత మఠాధిపతి అవుదామనుకుంటున్నదేమో, మీరే చూసుకోండి” అని ఆయన వెళ్ళిపోయారు. అక్కడి నుంచి గురువుగారి దగ్గరకు వెళ్లి నమస్కరించిగురువుగారు లంబకర్ణుడు అంటే అర్థం చెపుతారా” అనగాలంబకర్ణుడు అంటే గాడిద అని చెప్పగా అయితే మరి మీరు, మీ శిష్యులు గాడిదలా” అని ప్రశ్నించగా అదేమిటినువ్వేమి మాట్లాడుతున్నావు అనగా నేను అనలేదు, మీ ఆశ్రమంలో శిష్యులంతా రెండు వర్గాలుగా చీలిపోయారు దానిలో ఒకడు లంబకర్ణుడు అంటే  ఎవరో కాదు మన గురువుగారే” అని చెప్పాడు. మాటకి గురువుగారికి చాలా కోపం వచ్చింది.

ఈలోగా నీలకంఠ్ వంట చేస్తున్నటువంటి ఇంకొక వర్గపు ఆశ్రమవాసి దగ్గరకు వెళ్లి అతనితో విధంగా అన్నాడు,” చూడు నీ శత్రుపక్షంలో ఉన్నవాడు నీ మీద గురువుగారికి చాడీలు చెబుతున్నాడు, నువ్వు పప్పులో ఉప్పు చాలా వేసేసావుట దాని వాళ్ళ గురువుగారి ఆరోగ్యం దెబ్బతిన్తోందిట” అని చెప్పగానే అతనికి చాలా కోపం వచ్చింది. “అవునా, అది అసత్యం కదా, నేను అటువంటి పని ఎప్పుడు చెయ్యలేదు కదా” అని అనగాఏమో నాకేం తెలుసు అని అక్కడి నుంచి చల్లగా జారుకున్నాడు. అతను కోపంతో వాడి సంగతి ఏమిటో చూస్తాను” అని అటు వైపు వెళ్ళాడు. ఈలోపు నీలకంఠ్ తన కపట గురువుగారి వద్దకు వచ్చిఅయ్యా అక్కడ గొప్ప యుద్ధం జరగబోతోంది, మీ శిష్యులు అక్కడ కొట్టుకుంటున్నారు” అని చెప్పగాఏం జరిగింది” అని అడుగగా ఏమో తెలీదు బహుసా ఆశ్రమానికి అధిపతిగా ఎవరు ఉండాలో అని నిర్ణయించే విషయంలో వారు గొడవ పడుతున్నట్లు ఉన్నారు” అని చెప్పగాఅదేమిటి నేను బ్రతికే ఉన్నాను కదా” అనగాఏమో మరి, ఈవాళ కాకపోయినా ఏదో ఒక రోజు మీరు పోవాల్సిందే కదా మరి అప్పుడు ఎవరో ఒకరు ఆశ్రమానికి ఉత్తరాదికారిగా ఉండవలసిందే కదా” అనగాఎవరన్నారు మాట, నేను అంత తొందరగా పోయే వ్యక్తిని కాదు. వారు అలా మాట్లాడుకోవడం నేను విన్నాను, సిద్ధంగా ఉండండి అక్కడ గొప్ప యుద్ధం జరగబోతోంది. మరి మీరు కూడా అలాగే వచ్చారుట కదా” అనగా అతను ఉలిక్కి పడి  

నీకెవరు చెప్పారు మాట అనగా ఏమో వారు అక్కడ అదే అనుకుంటున్నారు. నేను వారిని భ్రష్టాచారం అంటే ఏమిటి అని ప్రశ్నించగా భ్రష్టాచారం అంటే దానికి ఉదాహరణ మన గురువుగారు లంబకర్ణుడే, ఆయన బ్రతికుండగానే తన గురువుని చంపేసి ఆశ్రమానికి అధిపతి అయ్యారుగా” అని వారు పరిహసిస్తున్నారు అని చెప్పగా అతనికి చాలా కోపం వచ్చి వారి సంగతేమిటో చూద్దాం పద” అని వడివడిగా శిష్యుల దగ్గరకు వెళ్ళాడు. లోపల ఇరు వర్గాలు ఒకరినొకరు నిందించుకుంటూ దెబ్బలాడుకోసాగారు. నేను మఠాధిపతిని అవుతానని ఒకరికొకరు వాగ్వివాదం చేసుకోసాగారు.  

ఇదంతా విన్న గురువుగారు చాలా కోపంతో "మీరంతా వీధిలో పడి భోజనం లేక అడుక్కు తింటుంటే మిమ్మల్ని చేరదీసి అన్నం పెట్టి మీకు సర్వ సుఖాలని అందిస్తే మీరు నేను బ్రతికుండగానే మఠాధిపతి కావాలనుకుంటున్నారా” అని తిట్టాడు. గంజాయి మత్తులో వాళ్ళు గురువుగారి మీద తెగపడిమీరు మాకు స్వర్గాన్ని చూపించారా, అలాగైతే మీకు భారత వర్షం, హిమాలయాలు చూపిస్తాం అని గురువుగారి మీదకు దాడికి దిగారు”. ఆశ్రమంలోని వారందరూ రెండు వర్గాలుగా చీలిపోయి కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఇదే అదను అనుకుని నీలకంఠ్  తన నాటకాన్ని ముగించి మెల్లగా ఆశ్రమం నుంచి బయటికి జారుకున్నారు

ఇదంతా చూస్తున్న సమయదేవత, ధరిత్రి మాత చాలా ఆశ్చర్యపోయారు. భూమాత సమయదేవతతోచూసావా, ఎంతోమంది సాదుపురుషులు, సిద్ధపురుషులు కల హిమాలయాలలో ఇటువంటి కపట సన్యాసులు, ధూర్తులు ఉన్నారు, వీరు సమాజాన్ని ఎంత భ్రష్టుపట్టిస్తున్నారు, మన భారతీయ సంప్రదాయానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు” అనగా సమయ దేవత :అవును అందుకనే భగవాన్ నీలకంఠ్ సరయిన నాటకం ఆది బుద్ధి చెప్పారు కదా" అని ఆయనకి నమస్కరించారు.