N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Monday, 30 June 2014

SwamiNarayan - Episode 25



వర్నిరాజ్ గారు, బాల తపస్వి మీ దర్శనాన్ని అపేక్షిస్తున్నారు.ఎప్పుడు వస్తున్నారు అని అడుగుతున్నారు అని ఉత్తరం గురించి చెప్పి, ఇక్కడ రెండవ ఉత్తరం కూడా ఉంది వర్నిరాజ్ గారు తన దస్తూరితో వ్రాసారు అది కూడా చదివి వినిపిస్తాను అని ఆయన చెప్పారు. ఆయన తన చుట్టూ ఉన్న భక్తులతో వర్నిరాజ్ గారు తన దర్శనాన్ని అభిలాషిస్తున్నట్టు చెప్పగా రామానందస్వామి గారిని ఆయన శిష్యులు స్వామీ !
సాక్షాత్తు ఆయన దర్శనాన్ని మీరు చేసుకోవాలి అని అనుకుంటున్నప్పుడు మరి ఆయన మీ దర్శనాన్ని అభిలాషించడం చాలా విడ్డూరంగా ఉంది కదండీ అని అంటే దానికి సమాధానంగా రామానంద స్వామి గారు సాక్షాత్తు భగవంతుడే నరావతారం ఎత్తినప్పుడు మానవ ధర్మాన్ని ఆయన పాటిస్తూ ఉంటారు అలాగే మనల్ని కూడా మానవ ధర్మాన్ని పాటించమని ఆదేశిస్తూ ఉంటారు. కాబట్టి మనం కూడా జగన్నాటకంలో ఆయన ఎలా ఆడిస్తే కీలు బొమ్మల్లాగా అలా ఆడ వలసిందే అని చెప్పగా సత్సంగ్ లో ముఖ్యంగా గంగారాం గారు, స్వామీజీ ! వర్నిరాజ్ గారిని ఇక్కడకి ఆశ్రమానికి రమ్మని చెప్పండి మేము కూడా ఆయన దర్శనం చేసుకో గలుగుతాము. నరావతారంలో ఉన్నట్టి అద్భుతమైన భగవంతుణ్ణి మేము దర్శించుకున్నట్టుగా ఉంటుంది అని చెప్పగా దానికి సమాధానంగా నేనెవర్నీ ఆయనని రమ్మని ఆహ్వానించడానికి,మనం ఎక్కడ ఎప్పుడు కలవాలి అని నిర్ణయించడానికి .అన్నీ ఆయనే నిర్ణయిస్తారు. ప్రత్య్త్తరంలో సమాధానం చెప్పమన్నారు . సమాధానం ఇచ్చేంత శక్తి నా దగ్గర ఎక్కడ ఉంది.నేను భగవంతుడైన ఆయనకి ఆదేశం ఏమి ఇవ్వగలను? ఆయన నా మనస్సులో ఎలాంటి ప్రేరణలు కలిగిస్తారో దాని ప్రకారమే ప్రత్యుత్తరం వ్రాస్తాను. నా చేత ప్రత్యుత్తరం వ్రాయించేవాడు కూడా సాక్షాత్తు భగవంతుడే అని ఎంతో వినయంగా అందరి ముందటా చెప్పటం జరిగింది
  
రామానంద స్వామి గారు వ్రాసిన ప్రత్యుత్తరం.  

శ్రీ రామానంద స్వామి గారు ప్రత్యుత్తరం వ్రాసినాక మయారాం  భట్టు గారిని పిలిచి ఆయనకి   ఉత్తరం ఇచ్చి లోజ్ కి తిరుగు ప్రయాణం కమ్మని ఆదేశమిచ్చారు. భట్టుగారు ఉత్తరం తీసుకుని శ్రీ రామానంద స్వామి గారికి నమస్కరించి లోజ్ ఆశ్రమానికి బయలుదేరి అనతి కాలంలోనే ఆశ్రమం చేరుకుని, గురువుగారైన శ్రీ ముక్తానంద స్వామి గారికి ఉత్తరం అందజేయడమూ, ఆయన దాన్ని చదవడమూ జరిగాయి. కాని అందులో  మాత్రం వర్నిరాజ్ ని ఎప్పుడు ఎక్కడ కలవాలి అన్నది వ్రాయలేదు. వర్నిరాజ్ ని తానూ వచ్చేంత దాకా అక్కడే ఆశ్రమంలో ఉండవలసిందిగా ఆదేశించారు. ముక్తానంద స్వామి గారు గురువుగారి ఆదేశాన్ని వర్ని రాజ్ కి చెప్పి మీరు ఇకనుంచి ఇక్కడే ఆశ్రమంలో ఉండాలి. మిగతా సభ్యులందరికీ యోగ విద్య నేర్పించాలి అని రామానంద స్వామి గారు ఆదేశించారని చెప్పడం జరిగింది. వ్యవహారాన్నంతా చూస్తున్న రఘునాథ్ దాసుకి ఒళ్ళు మండి పోయింది . "ఆహా ! అబ్బాయి వచ్చాడు మనకి యోగ విద్య నేర్పడానికి ! అని వెటకారంగా అన్నాడు . లోగా మౌనంగా ఉన్న వర్నిరాజ్ని శ్రీ రామానంద గారు మీకు కూడా ఉత్తరం వ్రాసారు కదా అని అంటే వర్ని రాజ్ ,అవును. నాకు కూడా అదే వ్రాసారు కాని ఎక్కడ ఎప్పుడు కలుస్తాము అన్నది వ్రాయలేదు అని చెప్పారు . అప్పుడు మయారాం భట్టు గారు మిమ్మల్ని ఆశ్రమంలో స్తంభాన్ని పట్టుకుని ఉండమన్నారు అని చెప్పారు. వర్నిరాజ్ గారు నెమ్మదిగా లేచి ఆశ్రమంలో ఉన్న స్తంభాన్ని పట్టుకుని నించున్నారు. అది చూసి సుఖానంద గారు , మిగతా వాళ్ళందరూ కూడా వర్నిరాజ్ ! మీకు మేము చెప్పగలిగే అంత వాళ్ళం కాదు. ఇక్కడ స్తంభాన్ని పట్టుకుని ఉండడం అంటే ఆశ్రమానికి మూల స్తంభమైన శ్రీ ముక్తానంద గారిని అనుసరించి ఉండడం అని అర్థం కాని నిజంగా స్తంభాన్ని పట్టుకుని ఉండడం కాదు. మీకు తెలియనిది ఏముంది అని ఎంతో వినయంగా చెప్పారు.

దానికి సమాధానంగా వర్ని రాజ్ ఎంతో వినయంగా ముక్తానంద స్వామి గారికి నమస్కరించి గురువుగారు చెప్పినట్టుగానే ఆయన ఆజ్ఞ శిరసావహిస్తాను. రోజునుంచి నేను ఆశ్రమంలో అతిథిగా ఉండను. నేను కూడా సేవకుడి లాగానే ఉండి ఆశ్రమంలో అన్ని పనులు చేస్తాను అని చెప్పడం జరిగింది. రోజు నుంచి వర్నిరాజ్ ఆశ్రమంలో ఒక సభ్యుడి లాగా, ఒక సేవకుడి లాగా ఆశ్రమాన్ని పరిశుద్ధం చేయడమూ, చీపురు కట్ట పట్టుకుని అంతా ఊడవడమూ ,  శుభ్రం చేయడమూ మొదలు పెట్టాడు. సందర్భాన్ని ఊహించుకున్నటువంటి రఘునాథ్ ఎంతో ఠినంగా వర్నిరాజ్ కి రక రకాలుగా ఆదేశాలు ఇవ్వడం మొదలు పెట్టాడు.బయటకి వెళ్లి ఆవు పేడని సేకరించడమూ వగైరా వగైరా.