N. Sairam Garu : +91 7901268716 || Email: sridatta50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.Sunday, 6 July 2014

SwamiNarayan - Episode 26వర్ని రాజ్ - ఆశ్రమ సేవ

విధంగా  రఘునాథ దాసుగారు ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు చిన్నా పెద్ద అన్ని పనులు కూడా వర్ని రాజ్ కి అప్పచెప్పుతూ ఉండేవాడు. అతని నోటి దురుసుతనానికి భయపడి మిగతా వాళ్ళు ఎవరు కూడా వర్ని రాజ్ కి సహాయం చేసేవాళ్ళు కాదు. ఆవు పేడ సేకరించి పిడకలు తయారు చేయడం, ఆశ్రమమంతా శుభ్రం చేయడమూ, వంట-వార్పూ ఒకటేమిటీ అన్నీ పనులు వర్నిరాజ్ చేస్తుండే వారు


 ఒకరోజు ఆవు పేడ సేకరణ కోసం బుట్ట పట్టుకుని ఊరి పొలిమేరల్లో ప్రవేశించేసరికి అక్కడ ఉన్న స్త్రీలందరూ ఆయనకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆవు పేడంతా వాళ్ళే సేకరించడం మొదలు పెట్టారు. ఒక వేళ వర్నిరాజ్ ముందుకి వెళ్ళితే ఆతన్ని త్రోసేసి ఇది నాది, నాదనుకుంటూ ఆయనని గెలవనిచ్చే వాళ్ళు కాదు. ఏదో కొంచెం ఆవు పేడ సేకరించి ఆశ్రమానికి వస్తే రఘునాథ దాసు గారు నానా రకాలుగా అవమానిస్తుండేవారు."ఏమిటీ? కాస్తేనా తెచ్చింది?" అని వెటకారంగా మాట్లాడేవారు . అంతే కాకుండా పేడతో పిడకలు చేసే పని, ఆశ్రమమంతా శుభ్రం చేసే పని ,వంట పని , అందరికీ వడ్డనలు చేసే పని అన్నీ కూడా వర్ని రాజ్ చేస్తుండే వారు. కాని ఒక్క నాడు కూడా రఘునాథ దాసుగారికి ఎదురు సమాధానాలు చెప్పలేదు. అంతే కాకుండా ఊళ్లోకి వెళ్లి " భిక్షాందేహీ" అంటూ భిక్ష కూడా స్వీకరించి  తెస్తుండేవారు. ఇలా రొజూ ప్రొద్దున్నే లేచి ఆశ్రమ ధర్మాలన్నీ నిర్వహించి రాత్రి ముక్తానంద స్వామి గారికి ఎంతో సేవ చేస్తుండే వారు . త్వర త్వరగా అన్ని  పనులు ముగించుకుని కొంత సమయం అందరికీ యోగ విద్య నేర్పించడానికి కేటాయించేవారు.కాని రఘునాథ దాసు గారు మాత్రం యోగ విద్య నేర్చుకోవడానికి ఇష్ట పడే వారు కాదు "నన్ను ఇబ్బంది పెట్టకు" అని కసిరి కొడ్తుండేవారు. దానికి సమాధానంగా వర్ని రాజ్, నేను మన గురువుగారైన రామానంద స్వామి గారి ఆజ్ఞనే శిరసావహిస్తున్నాను. ఒక వేళ గురువుగారి ఆజ్ఞ మీకు స్వీకారం లేకపోతే నేనేం చేయ గలను? ఎవరికి   విద్య నేర్చుకోవాలని ఉంటే వాళ్ళకే నేర్పిస్తాను అని అంటుండేవారు. రఘునాథ దాసుగారు అయిష్టంగా పద పద అని చెప్పేసి ఏదో వెటకారంగా , విసుగ్గా ఆసనాలు చేస్తుండే వారు

ఆవు పేడ లో బ్రహ్మాండం ! !

ఇలా ఉండగా ఒక రోజు వర్ని రాజ్ బుట్ట తీసుకుని ఆవు పేడ సేకరణకి బయలు దేరారు. ఆయనతో పాటు మిగతా సత్సంగులు కూడా బుట్టలు తీసుకుని బయలు దేరారు. యథాప్రకారంగా ఎవరు కూడా వర్నిరాజ్ ని ఆవు పేడ దగ్గరకి రానీయకుండా ఆడవాళ్ళందరూ ఆవు పేడ సేకరణలో మునిగి పోయారు. చేసేదేమీ లేక వర్నిరాజ్ నిర్లిప్తంగా ఒక చోట కూర్చుండి పోయారు. అక్కడే ఒక మహిళ ఆవు పేడ సేకరణ కోసం వెళ్ళగా అక్కడ ఆవు పేడలో ఆవిడకి ఆకాశమూ, నక్షత్రాలు కనిపించాయి. దానిలోంచి ఒక వాణి వినిపించింది "ప్రకృతి సంపదలో అందరికీ సమాన భాగం ఉంది. అందరూ సమంగా పంచుకోవాలి అంతే కాని స్వార్థంగా అంతా నాకే కావాలి అని వేరే వాళ్లకి దక్కనీయకుండా చేయడం పొరబాటు" మాటలకి మహిళ భయపడి అక్కణ్ణుంచి పారి పోయి వేరే చోట పేడ సేకరణకి వెళ్ళితే అక్కడ కూడా ఆవుపేడలో అగ్ని కనిపించింది మళ్ళీ అవే మాటలు వినిపించాయి. దెబ్బకి ఆవిడ భయపడి పరుగు పరుగున అక్కణ్ణుంచి వెళ్ళిపోయింది. వర్ని రాజ్ నిర్లిప్తంగా ఆవు పేడని సేకరించి ఆశ్రమానికి వెళ్లి పోయారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న రఘునాథ దాసుగారు, ఏమిటీ సంగతి? అందరూ ఇక్కడ ఎందుకు చేరారు? ఎందుకు అన్ని బుట్టలు ఖాళీగా ఉన్నాయి ఒక్క బుట్ట మాత్రమే నిండుగా ఉంది అని గట్టిగా  అరుస్తున్నట్టుగా మాట్లాడారు. నిండు బుట్ట వర్నిరాజ్ ది అని తెలిసి ఆశ్చర్యంగా,"అదేమిటీ ఇదెలా సాధ్యం?వర్నిరాజ్ ఎప్పుడు ఖాళీ బుట్టతోనే వస్తాడు    ఆడవాళ్ళు అంటేనే అర మైలు  దూరం పారిపోతాడు. పైగా ఇంత తొందరగా రావడం ,అది కూడా నిండిన బుట్టతో !" అని అంటే మిగిలిన సత్సంగులు ,"మీరు చెప్పింది నిజమే. వర్నిరాజ్ ఆడవాళ్ళ దగ్గరకే వెళ్ళడు.అని అన్నారు.  వాళ్ళ మీద ఏదో ప్రయోగం చేసి ఉంటాడు సరే చూద్దాం అని రఘునాథ దాసు గారు వర్నిరాజ్ దగ్గరకి వెళ్లి ఆడవాళ్ళ మీద ఏం ప్రయోగం చేసావు? చెప్పు అని గట్టిగా దబాయించి మాట్లాడారు. దానికి సమాధానంగా వర్నిరాజ్ "నా తల్లి కూడా ఒక స్త్రీయే అని మీరు గుర్తు పెట్టుకోండి.అలాగే మీ తల్లి గారు కూడా ఒక మాత్రు మూర్తియే. నేను ప్రతి స్త్రీలో ఒక చెల్లెల్ని గాని మాత్రుమూర్తిని గాని చూస్తాను.నేను చేసే పనిలో అయినా స్వార్థం ఉండదు "అని ఎంతో వినయంగా విన్నవించుకున్నారు. తర్వాత ఎంతో నిర్లిప్తంగా ఆయన అక్కణ్నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కాని వర్నిరాజ్ చెప్పిన మాటలు మాత్రం రఘునాథ దాసు గారికి సూటిగా తగిలాయి మనమంతా సన్యాసులం ఎటువంటి స్వార్థం లేకుండా అన్ని పనులు చేస్తుంటాము చేసే పనుల్లో స్వార్థం చూసుకునేవాళ్ళు కొంత మంది ఉంటారు అది నా స్వభావం కాదు అని చెప్పడం రఘునాథ దాసుగారికి మొహం మీద కొట్టినట్టుగా అనిపించింది. కోపంతో ముక్తానంద స్వామి గారి దగ్గరకి వర్నిరాజ్, అతని సహచరులని తీసుకుని వెళ్లి అబద్ధపు ఆరోపణ వర్నిరాజ్ మీద వేసారు. అదేమంటే వర్ని రాజ్ స్త్రీలకి చాలా దూరంగా ఉంటారు. కానీ మధ్య అతను  తీసుకు వచ్చే బుట్టలో ఆవు పేడ పూర్తిగా ఉంటున్నది. ఇతను ఒక మహిళని భయ పెట్టడం వల్ల  ఆవిడకి జ్వరం వచ్చి జబ్బు పడి పోయింది అని ఫిర్యాదు చేయగా, అదేమిటీ ,అదెలా సంభవం అని ముక్తానంద స్వామి గారు అడగ్గా నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది అని ధైర్యంగా రఘునాథ దాసు గారు చెప్పారు. ఆవిడని భయ పెట్టడం వల్ల  జ్వరం వచ్చి , జ్వరంలో కూడా పలవరింతలు, ఆవు పేడ పేరెత్తితేనే ఆవిడ భయ పడి పోతున్నది. వర్ని రాజ్ పైకి మంచి వాడు లాగా కనిపిస్తున్నాడు. ఇతని మొహం చూసి మీరు మోస పోకండి. మన ఆశ్రమ పరువు ప్రతిష్టలని మంట కలుపుతున్నాడు. ఇతన్ని ఆశ్రమం నుంచి వెళ్ల గొట్టండి అని రఘునాథ దాసు గారు గట్టిగా, కోపంగా చెప్పారు. ముక్తానంద స్వామి గారు ఇది సంభవం కాదు. నేను నమ్మను అని అంటే మీకు వర్నిరాజ్  అంటే పక్షపాతం అని రఘునాథ దాసు గారు అన్నారు. అప్పుడు ముక్తానంద స్వామి గారు వర్ని రాజ్ ని చూసి ,"ఏమిటీ నేను విన్నదంతా నిజమేనా?" అని అడిగారు. వర్ని రాజ్ కి సమాధానం చెప్పే అవకాశం ఇవ్వకుండా రఘునాథ దాసు గారే, ఎవరైనా ఇలాంటి వెధవ పని చేసినప్పుడు అడిగితే నిజం ఒప్పుకుంటారా? మనం మహిళ ఇంటికి వెళ్లి కనుక్కుందాము.అని వర్ని రాజ్ ని, కొంత మంది సహచరులని  సుఖానంద స్వామి గారిని తీసుకుని మహిళ ఇంటి కి వెళ్ళారు

 మహిళ చెప్పిన వృత్తాంతం  

ఆవిడని ప్రశ్నించగా ఆవిడ ఇలా చెప్పింది. నేను ఆవు పేడ సేకరణకి వెళ్ళగా నాకు ఆవు పేడలో బ్రహ్మాండ మైనటువంటి అగ్ని  కనిపించింది. అగ్ని నన్ను   దహించి వేస్తుందేమో అనే భయంతో అక్కణ్ణుంచి పారి పోయాను. ఇంకొక చోట ఆవు పేడ కనిపించగా అక్కడికి  వెళ్ళితే అక్కడ కూడా ఆవు పేడలో బ్రహ్మాండం కనిపించింది. అంతే  కాకుండా నాకు అక్కడ ఒక  వాణి  విన్పించింది. కన్యా ! భగవంతుడు ఇచ్చిన సంపద మీద మానవులందరికీ సమానమైన అధికారం ఉంది  నీవు స్వార్థంగా ఇలా చేయడం మంచిది కాదు అని అనేసరికి నాకు  చాలా భయం వేసింది. ఒక్కసారిగా నిస్సత్తువ వచ్చేసి అతి కష్టం మీద ఎలాగో ఇంటికి చేరుకున్నాను. ఇదీ జరిగిన సంగతి. అని చెప్పగా వర్ని రాజ్ యేవో సిద్ధ శక్తులు నేర్చుకుని ఈవిడని భయపెట్టాడు అని రఘునాథ దాసు గారు తనకు తానె తీర్మానించారు దానికి మహిళ, స్వామి ! అక్కడ చుట్టూ ప్రక్కల   సమయంలోవర్ని రాజ్ కనిపించలేదు అని వక్కాణించి చెప్పింది. దానికి రఘునాథ దాసు , లేదు లేదు, నీవేదో మతి లేక ఇలా మాట్లాడుతున్నావు అని మహిళ  ఎంత  చెప్పినా ఆవిడ మాటని సాగనీయ లేదు. ఇలా మహిళని భయ పెట్టినవాడు ఆశ్రమంలోనే కాదు ఊళ్ళో కూడా ఉండకూడదు అని అతన్ని ఎలాగైనా సరే గ్రామంనుంచి వెళ్ళగొట్టాలని నిర్ణయం తీసుకుని ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోయారు

హరిహరరాయ్ కి కలిగిన అనుభవం 

ముక్తానంద గారు అంతా విన్నాక రఘునాథ దాసు గారు ! మీరు చెప్పిందంతా విన్నాక నాకు వర్నిరాజ్ లో దోషమూ కనిపించటం లేదు అని అంటే నా దగ్గర మరొక సాక్ష్యం కూడా ఉంది అది కూడా మీరు విని చూడండి అని చెప్పి హరిహరరాయ్ అనే  ఒక సహచరున్ని పిలిచి మహిళని వర్నిరాజ్ జడిపించడం నీవు నీ కళ్ళారా చూసావు కదా ! నిజం చెప్పు అని గద్దించి  అడిగాడు ఇదంతా చూస్తున్న వర్ని రాజ్ నిర్వికారంగా," చూడు ! మనమంతా ఇక్కడ ఆశ్రమానికి  సత్యాన్వేషణ కోసం వచ్చాము కాబట్టి సత్యమే మనం చెప్పాలి. ఇది న్యాయ స్థానం కాదు .న్యాయ స్థానంలో ఏవిధంగా విచారణ జరుగుతుందో అలా ఇక్కడ జరగటంలేదు. మన ఆశ్రమ వాసులకి  సత్యాన్వేషణ  మంచి దారి చూపించి స్వర్గానికి నిచ్చెనలు వేస్తుంది.అసత్యం అంటే అబద్ధం చెప్పితే నరక యాతన అనుభవించాల్సి వస్తుంది.కాబట్టి నీకు తెలిసిన నిజమేమిటో నిర్భయంగా అందరి ముందూ చెప్పు" అని అన్నారు.

 కొంత సేపటికి ఆతను గట్టిగా ఆర్తనాదాలు చేస్తూ, హాహాకారాలు   చేసి ఎంతో భయ పడిన వాడిలాగా గజ గజా వణికిపోతూ ముక్తానంద స్వామి గారి కాళ్ళ మీద పడి పోయాడు. అతనికి ఎదురుగా మంటల్లో నరకం కనిపించింది. దృశ్యం ఎవరికీ కనిపించలేదు . "నాకేమీ తెలియదు. నేనేమీ చూడలేదు . సంఘటన జరిగినప్పుడు అసలు నేనక్కడ లేనే లేను" అని చెప్పాడు. ఇదంతా చూస్తున్న రఘునాథ దాసుగారికి బాగా కోపం వచ్చి గట్టిగా గద్దించ పోయాడు. కాని అందరికీ అక్కడ జరిగినటువంటి వాస్తవమేదో తెలిసి పోయింది.

రోజు రాత్రి అందరు నిద్రిస్తున్న సమయంలో రఘునాథ దాసు గారు మెల్లగా లేచి హరిహరరాయ్ ని  లేపి , "ఏమిటీ నీకు నేనేం చెప్పాను? నీవేం చేసావు? అందరిలో  నా పరువు తీసేశావు  కదా! "అని ఉగ్ర స్వరంతో అన్నారు. దానితో ఆతను భయ పడి పోయి. రఘునాథ దాసు గారూ ! ఏం చేయమంటారు ? వర్ని రాజ్ చెప్పిన విధంగానే అబద్ధం చెప్ప వలసి వస్తే నరకంలో ఎంత యాతన కలుగుతుందో అంత యాతన కొద్ది సేపట్లో నేను అనుభవించాను.నిజంగా అబద్ధం చెప్పి ఉంటే నా పని అలాగే అయి పోయేది.అందుకనే నేను నిజం చెప్పాల్సి వచ్చింది అని చెప్పగా రఘునాథ దాసు గారికి ఏం చెప్పాలో, ఏం చేయాలో తెలియక వచ్చిన దారినే వెళ్ళడం జరిగింది . అంతా గమనిస్తున్న వర్ని రాజ్ మాత్రం ఏమీ జరగనట్టుగానే మౌనముగా  ఉండి పోయారు