N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Sunday, 13 July 2014

SwamiNarayan - Episode 27



వర్ని రాజ్ - బరువు బాధ్యత

ఇలా జరుగుతుండగా ఆశ్రమానికి చుట్టుప్రక్కల ఉన్న రైతులందరూ కూడా వారు వారు పండించిన పంటలో ఎంతో కొంత ఆశ్రమానికి పంపడం మామూలే. ఒక రైతు ఒక నాడు ఆశ్రమానికి వచ్చి రఘునాథ దాసు గారిని కలిసాడు. ఏమిటీ విశేషాలు? అని రఘునాథ గారు అడగ్గా , రఘునాథ దాసు గారూ! ఈసారి చిమ్డీ కాయల పంట చాలా బాగా పండింది. దానితో మీరు ఊరగాయ పెట్టుకోవచ్చును. కాబట్టి మీరు ఆశ్రమం నుండి ఎవరినైనా పంపిస్తే అది బస్తాలో ఎక్కించి మీ ఆశ్రమానికి పంపుతాను అని చెప్పాడు సరే అని రైతుని పంపించి రఘునాథ దాసు గారు కేవలం చిన్న వాడైన వర్ని రాజ్ ని మాత్రం తీసుకుని పొలం దగ్గరకు వెళ్ళారు .అప్పటికే వాళ్ళు చిమ్డీకాయలని బస్తాలో ఎక్కించి ఉంచారు.


బస్తా  చూపించి ఇవి మీకు చాలతాయా? మీరు బస్తాని మోయడానికి ఆశ్రమ వాసులేవరినైనా తీసుకుని వచ్చారా అని అడగ్గా ,ఆశ్రమ వాసులు  ఎందుకయ్యా? ఇదిగో ! అబ్బాయి వర్ని రాజ్ ఉన్నాడు కదా, చాలు. పిల్లవాడు అన్నీ మోసుకోస్తాడు అని రఘునాథ దాసుగారు చెప్పిన సమాధానం విని రైతుకి పాపం వర్ని రాజ్ మీద ఎంతో జాలి వేసి ఇలా అన్నాడు, స్వామీజీ ! " ఇంకా మీసం కూడా మొలవనట్టి బాల సన్యాసి ఇంత బరువు ఎలా మోస్తాడు? చాలా కష్టం కదా ! అందుకని మీరు కొంత మందిని సాయంగా తెస్తే బాగుంటుంది. దానికి రఘునాథ దాసు గారికి కోపం వచ్చి ఇతని సంగతి మీకేం తెలియదు .

ఆవుపేడని సేకరించడానికి వెళ్ళినప్పుడు ఊళ్ళో ఉన్న మహిళలందరినీ దడిపించాడు. ఇతను మామూలు మనిషి కాదు . ఫరవాలేదు బరువులు మోయడం ఇతనికే తగును కాబట్టి, మీరేమీ జాలి పడక్ఖర లేదు అని గద్దించాడు . ఏం చెప్పాలో తెలియక ఆతను ఇంక ఏమీ మాట్లాడ లేదు.  ఉండబట్ట లేక మరొకసారి రఘునాథ గారితో ఇలా అన్నాడు, " బరువు మోయటంలో చిన్న పిల్లవాడు కాళ్ళు చేతులు విరగగొట్టు కుంటాడేమో !   చిన్న పిల్లవాడితో బస్తా మోయడం సాధ్యం కాదు అని ఎన్ని విధాల రైతు చెప్పినా వినకుండా రఘునాథ దాసు గారు వర్ని రాజ్ ని చూసి ,"ఏమిటీ అలా నిలబడి చూస్తున్నావు? ఆశ్రమం  దాకా బస్తాని మోసుకురా " అని ఆజ్ఞాపించారు. వర్ని రాజ్ కొద్దిసేపు అలాగే నిల బడి తర్వాత ముందుకు వచ్చి సునాయాసంగా అంత బరువైనట్టి బస్తాని నెత్తి మీద పట్టుకుని వడి వడిగా నడవ సాగాడు .

ఎంత మాత్రమూ తొణక్కుండా, బెణక్కుండా, అటు ఇటు పడకుండా నిశ్చలంగా నడుస్తున్న పసి పిల్లవాడిని, దృశ్యాన్నిచూసి   ఎంతో ఆశ్చర్యంగా వాళ్ళలో వాళ్ళే పైకి గట్టిగా మాట్లాడ సాగారు."ఇంకా మీసం కూడా రానట్టి, కోమలమైన బాలుడు ఇంత బరువు ఎలా మోస్తున్నాడబ్బా!" అని ఒకరంటే "ఎంత  శక్తిమంతుడు!" అని ఇంకొకరు తలా ఒక విధంగా మాట్లాడ సాగారు. చిన్నా, పెద్ద ,ఆడా మగా  అందరూ వాళ్ళు చేస్తున్న పని ఆపేసి విచిత్రంగా వర్ని రాజ్ ని చూడ సాగారు

విధంగా  పొలం నుంచి ఎంతో దూరంలో ఉన్న ఆశ్రమానికి వర్ని రాజ్ ఏమాత్రం ఆయాస పడ కుండా బస్తాని మోసుకొచ్చి అక్కడ పెడితే ముక్తానంద స్వామి గారు, మిగతా అందరూ కూడా ఆశ్చర్య చకితులై "ఆహా ! " "ఓహొ ! " "ఏమి శక్తి?" " ఏమి అద్భుతం?" అని ప్రశంసించకుండా  ఉండ లేక పోయారు.   బస్తాని దింపగానే రఘునాథ దాసు మాత్రం కఠినంగా, వర్ని రాజ్ ! " బస్తాని మోసుకెళ్ళి వంట ఇంటిలో పెట్టాలి. కాయలతో పచ్చడి చేసి, వంట చేసి, ఆశ్రమ వాసులందరికీ భోజనం వడ్డించాలి. బస్తాని మోసుకొచ్చి నీ పరాక్రమ ప్రదర్శన చేసినంత మాత్రాన మిగతా పనులనుంచి ముక్తి వస్తుందని ఆశ పడకు. అదేమీ లాభం లేదు . నీ పనులు నీవే చేయాలి"  అని కఠినంగా ఆజ్ఞాపించాడు. మారు మాట్లాడకుండా అలాగే నిలబడి ఉన్న వర్ని రాజ్ ని ఉద్దేశించి రఘునాథ దాసు ఇలా అన్నారు. "నీకివిషయం తెలుసా? గాడిదలు కూడా బరువులు సునాయాసంగా మోస్తాయి. నీవేమి పెద్ద ఘన కార్యం చేయలేదు " అని అందరి ముందూ అవమానంగా మాట్లాడారు. వర్ని రాజ్ ఏమి మాట్లాడకుండా ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి తీక్షణంగా చూసారు.

వర్నిరాజ్ కళ్ళనుంచి బయటపడిన కాంతికిరణంఒక శక్తి రఘునాథ దాసు గారికి తగిలి ఆయన అడుగులు తడబడటం జరిగింది. మళ్ళీ అదే విధంగా వర్నిరాజ్ చూడడంతో రెండవసారి కూడా రఘునాథ్ దాసుగారి  అడుగు తడబడింది. మూడవసారి ఇంకాస్త తీక్షణంగా చూసేసరికి అమాంతంగా దభేలుమని క్రింద పడి పోయారు. ఇదంతా అంటే వర్నిరాజ్ కళ్ళలోంచి కాంతి కిరణం రావడం, అది రఘునాథ దాసు గారికి తగలడమూ సమయదేవత గమనించింది . అక్కడున్న వాళ్ళెవరికీ కనిపించ లేదు. రఘునాథ గారు అలా పడడం చూసి అందరూ భయభ్రాంతులై ఆయన చుట్టూ మూగి "ఏం జరిగింది?" "ఏం జరిగింది?"  అని అడగ్గా ఆయన "మీరు వెళ్లి మీ పనులు చేసుకోండి ,నాకేం కాలేదు "అని అందరినీ కోపంగా కసురుకున్నారు. అందరూ వెళ్లి పోయాక వర్ని రాజ్ క్రింద పడినట్టి రఘునాథ గారి దగ్గరకి వచ్చి ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి చూసి ఏం మాట్లాడకుండా తన దారిన తానూ రఘునాథ గారి ఆజ్ఞ ప్రకారం వంట గదివైపు వెళ్ళారు.
            
ఇంత జరిగినాక కూడా రఘునాథ గారికి కించిత్తైనా పశ్చాత్తాపం కలగ లేదు. ఏం చేస్తాం ! ఇలాంటి కర్కశ స్వభావం ఉన్నవాళ్ళు కూడా తటస్థ పడతారు అని సమయ దేవత ధరణి దేవతతో అన్నది