N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Thursday, 24 July 2014

SwamiNarayan - Episode 28



                                వంటింట్లో కిటికి  

రఘునాథ దాసు గారి ఆజ్ఞ ప్రకారం వర్ని రాజ్ వంట గదిలోకి వెళ్లి వంట కార్యక్రమంలో మునిగి పోయారు.ఇంతలో అతనికి సహాయం చేయడానికి వచ్చిన హరి హర రాయ్ వంటింట్లో గోడలో ఉన్నకన్నంలో నుంచి ప్రక్క ఇంటిలో ఉన్న వాళ్ళ దగ్గర్నుంచి కొన్ని నిప్పు కణాలు స్వీకరించడం వర్నిరాజ్ గమనించారు.


ఏమిటీ సంగతి? ఏం చేస్తున్నారు? అక్కడ ఎవరుంటారు? అని అడగ్గా, ప్రక్క ఇంటిలో ఒక గృహస్థుడు సంసారం చేసుకుంటున్నాడు అని హరి హర రాయ్ సమాధానం చెప్పాడు. అంటే అక్కడ గృహస్థుడు తన భార్యా బిడ్డలతో ఉంటున్నాడు. ఇప్పుడు నిప్పు కణికలు ఇచ్చింది గృహిణియే కదా !  అని వర్నిరాజ్ అంటే అవును అన్నాడు దానికి సమాధానంగా మనం సన్యాసులం. సంసార బంధాలన్నీ వదులుకుని ఇక్కడకి వచ్చాము. అటువంటప్పుడు మనం గృహస్థులతో సంపర్కం పెట్టుకోవడమూ, వారి ఇంటినుంచి తీసుకున్న నిప్పు కణికలతొ వంట చేయడం శాస్త్ర విరుద్ధం. ఇలా జరుగుతుంది కాబట్టి నేను ఇక్కడ వంట మాత్రం చేయను అని నిష్కర్షగా చెప్పారు. అక్కడే ఉన్న రఘునాథ దాసు గారు వెంటనే వచ్చేసి నీవు ఏమనకుంటున్నావు ?ఎవరను కుంటున్నావు ?ఇక్కడ ఆశ్రమంలో మేము చెప్పినట్టుగా అందరూ నడుచుకోవాల్సి వస్తుంది. ఇక్కడ నియమాలని ఎవరైనా పాటించ వలసిందే.ఇక్కడి నియమాలని నీ ఒక్కడి కోసం మార్చలేము అని చెప్పగా వర్ని రాజ్ మీరు ఇదే విధంగా చేయ దలచుకుంటే నేను ఇక్కడ ఆశ్రమంలో ఉండ దలచుకోలేదు. క్షణాన్నే ఆశ్రమాన్ని వదిలి వెళ్ళదలచుకున్నాను అంటూ అక్కణ్ణుంచి నిష్క్రమించారు.

ఇదంతా తెలిసినట్టి స్వామి ముక్తానందగారు ఒక సభని ఏర్పాటు చేసి వర్ని రాజ్ ని పిలిచి ఏమిటీ, నేను విన్నదంతా నిజమేనా?  అని ప్రశ్నించారు.దానికి సమాధానంగా వర్ని రాజ్ , గురువుగారూ ! మనం సాధు సన్యాసులం . సంసారాన్ని త్యజించి వచ్చిన వాళ్ళం. అటువంటప్పుడు మనం సంసారులతో సంబంధాలు పెట్టుకోకూడదు. ఇక్కడ ఆధ్యాత్మిక విచారణ-విమర్శలూ,భజనలూ, కీర్తనలూ, యోగాభ్యాసము ఇటువంటివి మనం చేయ వలసి ఉంటుంది .అటువంటప్పుడు ఒక గృహస్థుని తో సంబంధం పెట్టుకోవడం శాస్త్ర విరుద్ధం.అలా జరక్కూడదు .అది ఆశ్రమ ధర్మానికి జరగరానిది అందుకోసమని నేను ఆశ్రమాన్ని వదల దలచుకున్నాను నేను కనక ఇక్కడ ఉండాలంటే గృహస్థునితో ఏం సంబంధం లేకుండా కన్నాన్ని మీరు పూడ్పించండి . అలా అయితేనే నేను ఇక్కడ ఉంటాను. లేకపోతే తక్షణమే నేను ఇక్కడ్నుంచి వెళ్ళిపోతాను అని అన్నారు. దానికి రఘునాథదాసు గారు చాలా కోపంగా వర్నిరాజ్ ! "నీవు చెప్పినట్లుగా ఇక్కడ ఆశ్రమధర్మాలు, నియమాలు మేము మార్చము. నీకు ఉండాలంటే ఉండు లేకపోతే వెళ్ళిపో ! " అని గట్టిగా అరిచారు  దానికి సమాధానంగా ముక్తానంద స్వామి గారు , నాయనా , వర్నిరాజ్ ! ఏమిటీ ఇదంతా ? ఏం జరుగుతుంది? అని ప్రశ్నించగా , వర్నిరాజ్ హరిహర రాయ్ ని ఉద్దేశించి నీకొక చిన్న పని చెప్తాను. సాయం చేస్తావా అని అర్థించారు. దానికి ఆతను  సరే తప్పకుండా చేస్తాను అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు వర్నిరాజ్ అతన్ని మీరు అటుప్రక్కకి వెళ్లి నిలబడండి అని అంటే హరిహర రాయ్ వెళ్లి అక్కడ నించున్నాడు. తర్వాత ప్రక్కన నిల బడండి అని అంటే ఆతను మళ్ళీ అక్కడకి వెళ్ళాడు. ఇలా అతన్ని వర్తులాకారంలో తిప్పించి మీరు ఎక్కడనుండి బయలుదేరారో అక్కడే నిలబడండి అని అన్నారు . ఇదంతా చూస్తున్న ఆశ్రమవాసులకి  ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాలేదు. రఘునాథదాసుగారికి మాత్రం చాలా కోపం వచ్చేసింది

వర్నిరాజ్ ! "ఏమిటీ చిన్న పిల్లవాడి చేష్టలు? ఏం చేయ దలచుకున్నావో , ఏం చేయాలో సూటిగా చెప్పు.మాకేమీ అర్థం అవటంలేదు అతన్ని అలా ఎందుకు చక్రంలాగా తిప్పిస్తున్నావు? " అని గద్దించి అడిగారు .
నేను మీకు అదే చెప్పదలచుకున్నాను. హరి హర రాయ్! నీవు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? అని అడగ్గా నేను ఎక్కణ్ణుంచి బయలు దేరానో అక్కడే ఉన్నాను కదా అని బదులు ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏమిటీ? నీవు ఇంత దూరం ప్రయాణించినా ఏమాత్రం ప్రగతి లేకుండా ఎక్కడ ఉన్నావో అక్కడే ఉండటం జరిగింది కదా ! అని వర్నిరాజ్ చెప్పగా ముక్తానంద స్వామి గారు వర్తులాకారంలో అంటే చక్రంలో తిరుగుతున్నవారు ఎక్కణ్ణుంచి బయలుదేరారో మళ్ళీ అక్కడికే వస్తారు కదా ! అలా చక్రంలో తిరుగుతున్న వారికి ప్రగతి ఉండదు, వాళ్ళు చక్రంలో అలానే తిరుగుతూ ఉంటారు అని జవాబు చెప్పగా దానికి వర్నిరాజ్ నేను కూడా మీకు అదే చెప్పదలచుకున్నాను. మనం సాధు సన్యాసులం. సంసారం త్యాగం చేసి, మన వాళ్ళందరినీ వదిలేసి ఇలా బయటకి వచ్చేసాము. తపస్సు చేస్తూ భగవంతుని పొందడమే మన ధ్యేయం. అలాగే సంసారులకి కూడా మనం ఆధ్యాత్మిక విషయాలు చెప్పి భగవంతుని వైపు మార్గాలు చూపించే ధర్మాన్ని మనం ఎన్నుకున్నాము. కనుక  మనం గృహస్థులతో రకమైనటువంటి భౌతికపరమైన సంబంధాలు, వంటకి ఉపయోగించే పనిలో వస్తువులు తీసుకోవడమూ, ఇవ్వడమూ , అది శాస్త్రానికి విరుద్ధంగా ఉంటుందని నేను భావిస్తున్నాను . ఇలా మనం బంధనాలు పెట్టుకున్నంత కాలం మనకి ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి ఉండనే ఉండదు అని నేను చెప్పదలచు కున్నాను. ఇదే విధంగా మీరు ఆశ్రమాన్ని నడప దలచుకుంటే మాత్రం  నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకుండా తక్షణమే మీ ఆశ్రమాన్ని వదిలి వేసి వెళ్ళిపోతాను అని చెప్పి, నమస్కారం పెట్టి ఆశ్రమంనుంచి నిష్క్రమించడానికి ఉపక్రమించారు.

                                        ముక్తానంద స్వామి గారి అభ్యర్థన 

అప్పుడు స్వామి ముక్తానంద వర్నిరాజ్ ని వారించే ప్రయత్నం చేస్తూ, వర్ని రాజ్ ! ఆగండి ! మీరు ఆశ్రమం విడిచి వెళ్ళకూడదు. ఇకనుంచి సంసారులతో కాని, గృహస్థులతో కాని   ఆశ్రమానికి ఎటువంటి సంబంధం ఉండదు అని నేను మీకు వాగ్దానం చేస్తున్నాను. కాబట్టి మీరు ఇక్కడే   నిశ్చింతగా ఉండవలసింది అని వర్నిరాజ్ ని కోరడం జరిగింది. మాటలు విని వర్నిరాజ్ ఆశ్రమం వదిలి వెళ్లిపోవాలి అనే అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఇదంతా చూస్తున్న రఘునాథదాసు గారికి మాత్రం పట్టరాని కోపం వచ్చింది. ఆయన పైకే విసుగ్గా, అంతా అయిపొయింది అనుకుంటూ లోనికి వెళ్ళిపోయారు. తక్షణమే వంటింట్లో ఉన్నటువంటి కిటికి  శాశ్వతంగా మూయించి వేసారు.వర్నిరాజ్ చూసి చాలా తృప్తిగా తల పంకించారు. ఈలోగా రఘునాథ దాసుగారు ముక్తానంద స్వామి గారి దగ్గరకి వెళ్లి , స్వామీజీ ! మీరు వర్నిరాజ్ ని వెళ్ళకుండా ఎందుకు వారించారు? అతని మానాన అతన్ని వెళ్ళ నిస్తే బాగుండేది కదా ! అని కొంత అసహనంతో ప్రశ్నించారు. దానికి సమాధానంగా స్వామి ముక్తానంద అదేమిటి రఘునాథదాసు గారూ !  మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు ? అని అడిగారు  

రఘునాథదాసు గారు ఇలా చెప్పసాగారు. వర్నిరాజ్ ని ఆశ్రమంలో ఉండనిస్తే ఆతను మన ఆశ్రమానికి మంచి చేయడం కన్నా హాని ఎక్కువ చేస్తాడు అని చెప్పగా అదెలా సంభవం? అని ముక్తానంద స్వామి గారు ప్రశ్నించగా, ఒక చిన్న బాలకుడి ముందు మీరు తల వంచాలి వచ్చింది. ఆతను చెప్పినాట్టుగానే మనం నడచు కోవాల్సి వచ్చింది. ఇదంతా ఇంతటితో పోదు. ముందు ముందు బాలకుడు ఏం చెప్పితే అది మనం చేయాల్సి వస్తుంది అది మనకు తలవంపులు కాదా ?అని రఘునాథ దాసు గారు  ప్రశ్నించారు.

చూడండి రఘునాథ దాసు గారూ! నేను బాలకుని ముందు తల వంచలేదు. అతను చెప్పినటువంటి సత్యం ముందు తల వంచాను. మీరు కొంచెం అర్థం చేసుకోండి అని కాస్త గట్టిగానే సమాధానం చెప్పారు. కాని సమాధానం రఘునాథదాసు గారికి ఏమాత్రం సంతృప్తి కలగలేదు. ఆయనకి ఇంకా కోపంగానే ఉంది. అప్పుడు ముక్తానంద స్వామిగారు ఇంకా ఇలా చెప్పారు మనమందరమూ కూడా మనల్ని మనం వదిలేసుకున్నాము . మన పరివారాలతోటి, ప్రపంచంతోటి సంబంధాలన్నీ తెంచుకున్నాము. వారందరితో వ్యవహారాలూ అనే కిటికీ మూసివేయడం జరిగింది.అలాంటప్పుడు మళ్ళీ మనం కిటికీ ఎందుకు తెరిచి ఉంచాలి?  అలాంటప్పుడు కిటికీ తెరిచి ఉన్నా , మూసి ఉన్నా దానితో మనకు సంబంధం ఏమిటీ?  ఇవన్నీ మనం ఆలోచించడం వల్ల కలిగే లాభమేమిటీ అని చెప్పారు. అయినా రఘునాథదాసు గారు తన పట్టు వదలకుండా మీరు నేను చెప్పేది సరిగ్గా అర్థం చేసుకోండి , చిన్న పిల్లవాడి ముందు తల వంచు కోవాల్సి వచ్చిందే అని నేను బాధ పడుతున్నాను అని అన్నారు. దానికి ముక్తానంద స్వామి మీకు నేను అప్పుడే చెప్పాను మనం సిగ్గు పడాల్సిన అవసరమేమీ లేదు. సత్యానికి మాత్రం మనం తల వంచాము కాని ఇక్కడ ససేమిరా ఒక వ్యక్తికి కాదు. అది మనం ఎప్పుడు తెలుసుకుంటామో అప్పుడు మనకి అహంకారం ఉండదు. సత్యం ఎవరి నోటినుంచి వచ్చినా దానిని మనం తప్పకుండా గౌరవించాల్సిందే కదా అని ఎంతో అనునయంగా చెప్పారు. మీరు ఇంకొక విషయం ఇక్కడ మరిచి పోతున్నారు. మన గురువైన రామానందస్వామి గారు తానూ వచ్చేంత వరకు వర్ని రాజ్ ని ఇక్కడే ఉండమని ఆదేశించారు. విషయం మీకు గుర్తు ఉందనుకుంటాను అని అన్నారు. దానికి తిరుగు సమాధానం చెప్పలేక , చేసేదేమీ లేక రఘునాథదాసు గారు నోరు మూసుకుని మాట్లాడకుండా ఉండి పోయారు.

ఇదంతా సాక్షిగా  చూస్తున్న సమయ దేవత ఇలా అనుకుంది. కిటికీ వృత్తాంతం పరిష్కారమై పోయింది. వర్నిరాజ్ కోరిక ప్రకారం కిటికీ శాశ్వతంగా మూసి వేయడం జరిగింది.దీని   మూలంగా వర్నిరాజ్ కి కించిత్తైనా విజయ గర్వం కలగ లేదు. ఆనందం కాని అలాంటి భావాలేవి లేకుండా మామూలుగానే ఉన్నారు