N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Tuesday, 5 August 2014

SwamiNarayan - Episode 29


వర్ని రాజ్ యొక్క  గంభీర ఆలోచన 

సంఘటన జరిగాక వర్నిరాజ్ ఏకాంతంగా, నిర్లిప్త స్థితిలో ఉండి  గంభీరమైన ఆలోచనలో పడి పోయారు. సుఖానంద స్వామి గారు వర్ని రాజ్ ని వెతుక్కుంటూ వచ్చి ఆయన్ని గమనించి వర్ని రాజ్ ! మేరేరు ఏదో గంభీరమైన , దీర్ఘమైన ఆలోచనలో పడి ఉన్నట్టున్నారు. ఇలా ఒంటరిగా కూర్చుని , నిద్ర కూడా  లేకుండా నిన్నట్నుంచి ఎందుకిలా ఆలోచనలో ఉన్నారు? నిద్ర రావడం  లేదా ? అని ప్రశ్నించారు . అందుకు వర్ని రాజ్ నేనొక గంభీరమైన సమస్య గురించి ఆలోచిస్తున్నాను. దాని మూలంగా నిద్ర కూడా పట్టటం లేదు అని బదులు ఇచ్చారు. ఏమిటీ గంభీరమైన సమస్య ?కిటికీ వ్యవహారం ఇంకా మిమ్మల్ని వెంటాడుతూనే ఉందా?
కిటికీ శాశ్వతంగా మూయించేసారు కదా ! ఇంకా దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు ? విజయం పొందారనే అహంకారంతో ఇలా గంభీరంగా ఆలోచిస్తున్నారా ? చెప్పండి అని ప్రశ్నించగా , "లేదు " "లేదు " నాకు విజయం ప్రాప్తి కలిగిందని కొంచెం కూడా గర్వం లేదు. నేనసలు దాని గురించి ఆలోచించటం లేదు . సద్గురువు కోసం చిన్నతనంలోనే అన్నీ త్యాగం చేసి , గురువుని వెతుక్కుంటూ, వెతుక్కుంటూ ఆఖరికి ప్రాంతానికి వస్తే. మీరు నన్ను ఆశ్రమానికి తీసుకు వచ్చి ముక్తానంద స్వామి వారిని పరిచయం చేసారు.ఆయన్ని చూసాక ఆయన నాకు గురువు అని అనిపించి అలా పిలవడం ప్రారంభించాను. కాని ఇక్కడ జరిగిందంతా చూస్తుంటే నేనేమైనా భ్రమలో పడ్డానా అని ఆలోచిస్తున్నాను . ముక్తానంద గారు సంపూర్ణంగా గురుధ్యానం చేసారని నాకనిపించడం లేదు . వారు ఇంకా తన పరివారంతో సంబంధాలు పెట్టుకున్నారా అని నేను తీవ్రంగా ఆలోచిస్తుండడం వల్ల నా మనస్సు కలవర పడింది . మనం గృహ త్యాగం చేసినప్పుడు సంపూర్ణంగా గురు ధ్యానం చేయాలి. గృహస్థులతోఏమాత్రం సంబంధం పెట్టుకో కూడదు. ప్రతి విషయాన్ని కూడా మనం కూలంకుషంగా ఆలోచించాలి. మరి ఆలోచన ముక్తానంద గారికి ఎందుకు రాలేదని నేను అల్లోచిస్తున్నాను. ఒక వేల ఆయన గురుధ్యానం సంపూర్ణంగా చేసి ఉంటె కిటికీ వ్యవహారం ఆయన దృష్టిలో పడగానే ఎందుకు మూయించ లేదు అని ఆలోచిస్తున్నాను అని చెప్పగా సుఖానంద స్వామి గారు , వర్ని రాజ్ ! మీరు ముక్తానంద స్వామి గారిని అపార్థం చేసుకుని అనుమాన పడ్తున్నారు. ఆయన సంపూర్ణంగా గురు ధ్యానం చేసినటువంటి వ్యక్తియే . మీరు ఆయన్ని సంపూర్ణంగా అర్థం చేసుకో లేదు అని అన్నారు.

స్వామి ముక్తానంద గారి బాల్యం 
ముక్తానంద గారి పేరు ముకుందుడు. ఆయన రాధాబాయి, ఆనందరావు దంపతులకి ఒక్కగానొక్క సంతానం. ఆయనకి పుట్టినప్పట్నుంచే వైరాగ్యంగా ఉండేది. చిన్న పిల్లల్లాగా అల్లరి, వినోదం , ఆట పాటలు లాంటివి ఉండేవి కావు నిరంతరమూ ధ్యాన స్థితిలోనే ఉండేవారు. తండ్రిగారు ఆయనకి సంగీతము, శాస్త్రాల గురించి చదువు చెప్పించారు.అతని తోటి పిల్లలు ఆట పాటల్లో మునిగి ఉంటే ముకుందుడు ఎప్పుడు ధ్యానం చేసుకుంటూ ఉండే వారు.సాత్విక భోజనం తీసుకుంటూ ఉండేవారు. ఎప్పుడు మౌనం గానే ఉండేవారు. ఇది గమనించిన అతని తల్లిదండ్రులు బాధ పడ సాగారు. తల్లి రాధాబాయి ఒక నాడు తన భర్తతో ఇలా అన్నది." బాల ముకుందుడి వ్యవహారం నాకేం అర్థం కావటంలేదు. సరిగ్గా భోజనం చేయడు,సాత్విక ఆహారమే తీసుకుంటాడు. ఎవ్వరితో మాట్లాడడు,ఆడుకోడు. ఎప్పుడు సంగీతం పాడుకోవడమో,ధ్యానం చేసుకోవడమో తప్ప దేనిలో ఆసక్తి చూపడు. ఏమిటో వీన్ని చూస్తుంటే నాకు చాలా బెంగగా ఉంది. వాడి సంగతి మీరు కూడా ఆలోచిస్తే బాగుంటుంది. అది విని తండ్రి ఆనంద రావు గారు నాకు కూడా అదే బాధగా ఉంది.ఏమిటీ ఇంత విపరీతంగా ప్రవర్తిస్తున్నాడు,బాల్యావస్థ దాటుతున్నాడు.ఎప్పుడు ధ్యానం చేసుకుంటూ పరధ్యానంగా ఉంటాడు ఏం చేయాలా అని నేను ఆలోచిస్తున్నాను అని అన్నారు. ఒకనాడు బాలముకుందుడు ఎంత రాత్రైనా ఇంటికి రాక పోయేసరికి వాళ్ళు చాలా గాభరా పడ సాగారు. మధ్య రోజూ ఆలస్యంగా వస్తున్నాడు ఎక్కడకి వెళ్ళుతున్నాడు అని కంగారు పడ సాగారు.

బాల ముకుందుడు ఎప్పుడూ దేవుని అన్వేషణలో, మంచి గురువు దొరకాలని చుట్టూ ప్రక్కల గ్రామాల్లో సాధువు. సన్యాసి వచ్చినా వాళ్ళ దగ్గరకి వెళ్ళు తుండేవాడు.ఇలాగే ఒకసారి ఒక సాధువుని కలుసుకోవడానికి ప్రక్క గ్రామానికి వెళ్లి , వినయంగా ఆయన చెప్పిన మాటలన్నీ విన్నారు. కాసేపు అయినాక మహాత్ముడు కుర్రవాణ్ణి చూసి ఎందుకొచ్చావు, ఏం కావాలి? అని అడిగారు .బాల ముకుందుడు తన పేరు చెప్పుకుని , మహాత్మా ! నాకు మీ ఆశీర్వాదం కావాలి. నేను బ్రహ్మచర్య దీక్ష పొంద దలచుకున్నాను శ్రీ కృష్ణుడి యక్క సాక్షాత్కారం కావాలి. అది కేవలం మీ ఆశీర్వాదం వల్లనే అవుతుందని నా నమ్మకం అని చెప్పగా ఆయన నవ్వి , బాల ముకుందా ! కొన్ని విషయాలు కేవలం ఆశీర్వాదంతో సంభవం కావు. కలి కాలంలో చుట్టూ ప్రక్కల పరిస్థితుల ప్రభావం వాళ్ళ మనస్ఫూర్తిగా బ్రహ్మచర్యం పాటించడం చాలా కష్టం. స్త్రీ యొక్క ఆలోచన లేకుండా ఐహిక సుఖాలకి దూరంగా ఉండడం అన్నది దాదాపు అసాధ్యం. చూడు ! ఇన్నేళ్ళ నుంచి నేను కాషాయ వస్త్రాన్ని ధరిస్తూ ఉన్నాను. నేను కూడా బ్రహ్మచారి గా ఉందామనే వచ్చాను. నీవు ముముక్షువు కాబట్టి నా జీవితంలో జరిగిన సంఘటన చెప్తాను జాగ్రత్తగా విను నాయనా! అని విధంగా చెప్పా సాగారు.

 చిత్త చాంచల్యం 
నేను దాదాపు 40 ఏళ్ళ క్రితం తీర్థ యాత్ర కోసం దేశాలమీద బయలు దేరి , ఒక రోజు మహంకాళిని   దర్శించుకోవాలని ప్రయాణం చేస్తూ ఒక గ్రామపు పొలిమేర చేరాను. ఎటువైపు వెళ్ళాలో తెలియక అక్కడే నిలుచుని ఉన్నప్పుడు ఒక అందమైన స్త్రీ కనిపించింది. ఆవిడని దారి అడగ్గా ఆవిడ వివిధ భంగిమలతో ఎలా వెళ్ళాలో మార్గ దర్శనం చేసింది  అయితే దృశ్యం అందమైన స్త్రీ.మార్గ దర్శనం కోసం  ఆవిడ చేసిన వివిధ భంగిమలు నా మనస్సులో ఇప్పటికి కూడా బలంగా నాటుకు పోయి రోజు కూడా స్త్రీని నేను తలచుకుంటూ ఉంటాను. అటువంటిది ఇంత చిన్న వయసులో. కలి యుగంలో నీవు సంపూర్ణంగాఈ ప్రపంచాన్ని వదిలేసి బ్రహ్మచర్యం పాటించడం కష్టం కనుక నీ తల్లిదండ్రుల ఆశీస్సులతో, వారి అనుగ్రహంతో వారి నీడలోనే ఉంటే బాగుంటుంది. హాయిగా నీవు నీ తల్లి దండ్రులు చెప్పినట్టుగా నడుచుకో నాయనా! నీవు పూర్తిగా ఇటు సన్యాసి కాలేవు అటు గృహస్థుడివి  కాలేవు. కనుక నా మాట విని ఆలోచనలన్నీ కట్టి పెట్టు అని చెప్పేసి ఆయన్ని పంపించేసారు
                   
 బాల ముకుందుడి నాటకం 
ఒక రోజు బాల ముకుందుడు ధైర్యం చేసి తానూ వివాహం చేసుకోకుండా బ్రహ్మచర్య దీక్ష తీసుకుని, గురువుగారిని వెతుక్కుని, సన్యాసి ఆశ్రమం స్వీకరిస్తానని తల్లిదండ్రులకి చెప్పాడు. అది విని తండ్రికి బాగా కోపం వచ్చింది. గృహస్థాశ్రమం తీసుకోకుండా సన్యాసి అవుతానంటావేమిటీ ? నీకేమైనా పిచ్చెక్కిందా?నీవు ఒక పిచ్చి వాడివి. నేను నేకు అనుమతి ఇవ్వను. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకో అని గట్టిగా చీవాట్లు పెట్టారు. తల్లి అతని మాటలు విని మనం ఏదో ఒక మంచి సంబంధం చూసి తొందరగా పెళ్లి చేసేద్దాము. పెళ్లి చేస్తే ఏమైనా మారుతాడేమో అని అంది. సరే అని మంచి సంబంధం చూసి పెళ్లి నిశ్చయించుకుని పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించారు. ఉన్నట్టుండి బాలముకుందుడికి తండ్రి "నీవు పిచ్చివాడివి"అన్న మాటలు గుర్తుకి వచ్చి పదే పదే మననం చేసుకుంటుంటే ఒక ఉపాయం తట్టి వెంటనే అమలులో పెట్టాడు. "నేను పిచ్చి వాడిని " , "నేను పిచ్చి వాడిని "  అని గట్టిగా అరుస్తూ ,వేరే వాళ్ళ మీద రాళ్ళు రువ్వుతూ, పిచ్చి పిచ్చిగా నవ్వుతూ, రక రకాల పిచ్చి చేష్టలు చేయడంతో తల్లిదండ్రులు,చుట్టుప్రక్కల వాళ్ళు కూడా గాభరా పడి పోయారు. పిచ్చి వాడితో పెళ్ళేమిటీ అని ఆడ పెళ్లి వాళ్లు పెళ్లి మానుకుని వెళ్లి పోయారు

ఇలా సాగుతుండగా ఒక నాడు తల్లి ఆవిడ భర్తతో ఇలా అంది పాపం ! వాడు మర్యాదగా మన దగ్గరకి వచ్చి నేను పెళ్లి చేసుకోను సన్యాసం పుచ్చుకుంటాను అని అంటే మనం వినకుండా వాడికి పెళ్లి చేద్దామని ప్రయత్నం చేసాము. ఇప్పుడేమో వాడు ఇటు   సన్యాసికి కాని అటు గృహస్థుడికి కాని ఎటు పనికి రాకుండా ఇలా పిచ్చివాడిలాగా తయారయ్యాడు ఏం ప్రారబ్ధమో ! అంటూ బాధ పడింది. మనం చాలా పొరబాటు చేసాము అని అన్పిస్తున్నది. ఇప్పటికైనా వాడిని మనం వదిలేస్తే బాగుంటుంది. పెళ్లి ప్రస్తావన తేకుండా ఉంటే స్థిరంగా ఉంటాడేమో అని అంది. మాటలు విన్న ముకుందుడు "అమ్మయ్య"! , మనం బ్రతికి పోయాం ! " అని చాలా సంతోషించాడు

 గురువుగారి కోసం అన్వేషణ 
సంఘటన జరిగాక తల్లిదండ్రులు బాల ముకుందుడు ఎక్కడకి వెళ్ళుతున్నాడో పట్టించుకోవడం మానేశారు. బాల ముకుందుడు సాధువులు, సన్యాసులు ఎక్కడ ఉంటారో తెలుసుకుని అక్కడికి వెళ్తుండే వాడు. అక్కడికి కొద్ది దూరం లోనే బజరంగ దాస్ అనే భక్తుడు ఉన్నాడని తెలిసి అతని దగ్గరకి వెళ్ళగా, ఆతను బాల ముకుందుని చూసి ముచ్చట పడి ఏం కావాలని అడిగితే, స్వామీ ! నేను సన్యాసం పుచ్చుకోవాలని అనుకుంటున్నాను. అందుకనే మీ దగ్గరకి శిష్యరికం కోసం వచ్చాను. నీకు నా దగ్గర నుంచి ఏం కావాలి అని అడిగితే , నాకు శ్రీ కృష్ణ పరమాత్ముని దర్శనాన్ని మీరు ఇప్పించగలరా అని ఎంతో భక్తి శ్రద్ధలతో అడిగాడు. తప్పకుండా అని చెప్పి "జై శ్రీరాం " అని మాట మాటకి ఉచ్చరిస్తూ ఇలా మాట్లాడ సాగాడు. " నీవు దైవాన్నయితే చూడాలని అనుకుంటున్నావో దైవాన్ని స్మరించి చిలుములో ఉన్న గంజాయిని ఒక్కసారి పీల్చుకో. సాక్షాత్తు నీవు స్మరించిన భగవంతుడు కనిపిస్తాడు " అని చెప్పి ఫరవాలేదు, ఫరవా లేదు ఒక్కసారి పీల్చి చూడు భగవంతుడికి దగ్గర అవుతావు అని చెప్పేసి బాల ముకుందున్ని ఎంతో ప్రోత్సహించాడు. కాని బాల ముకుందుడు అతన్ని వారించి స్వామీ ! నేనా పని చేయలేను. నా వల్ల కాదు అని చెప్పగా, సరే నీ ఇష్టం!. నీకేం కావాలో అదే చేయి అని బజరంగ దాసు చెప్పగా , బాల ముకుందుడు మౌనంగా అక్కణ్నుంచి వస్తుంటే ఆయన గురువైన తులసీ దాసుగారు జరిగిందంతా తెలుసుకుని ముకుందా, రోజే ఆశ్రమానికి వచ్చిన నిన్ను నేను ఆహ్వానిస్తున్నాను. తప్పకుండా మా ఆశ్రమంలో ఉండు. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పారు. బాల ముకుందుడు ఆశ్రమంలో చేరి పోయి అనతి కాలంలోనే ముకుంద స్వామిగా పిలవబడ సాగాడు. అన్నిపనులు చేస్తూ అనతి కాలం లోనే అతను అందరికీ ప్రీతి పాత్రుడయ్యాడు. ఇలా ఉండగా ఆశ్రమంలో ఉన్న కొంత మంది ఊరికి వచ్చిన ఒక మహాత్ముడి గురించి ఇలా మాట్లాడ సాగారు. మనం ఎంత అదృష్టం చేసుకున్నామో మహాత్ముడు మన ఊరికి వచ్చారు. మనం తప్పకుండా వెళ్లి కలవాలి అని వాళ్ళు మాట్లాడుకుంటుండగా విని బాల ముకుందుడు బజరంగ్ దాస్ ని ఉద్దేశించి , మన ఆశ్రమానికి చాలా తక్కువ మంది వస్తున్నారు కారణమేమిటీ అని అడగ్గా దానికేముంది సాక్షాత్తు ఉద్ధవుడిగా భావించే రామానంద స్వామి వచ్చారు. ఆయన చేసే సత్సంగానికి జనాలు తండోప తండాలుగా వెళ్ళుతున్నారు అందుకనే మన ఆశ్రమానికి వచ్చే జనాలు తగ్గి పోయారు. ఇది విని బాల ముకుందుడు తానూ కూడా స్వయంగా వెళ్లి ఆయన దర్శనం తీసుకుంటే బాగుంటుందని తలచి ఒక రోజు ఆయన దర్శనానికి వెళ్ళాడు. అక్కడ రామానంద స్వామి భక్తులను ఉద్దేశించి ఎవరైతే భగవంతున్ని పొందాలనుకుంటారో వారు వారి హృదయం మొత్తం కూడా ఆయన నామాన్ని ఉచ్చరిస్తూ సర్వస్య శరణాగతి పొందగలిగితే అప్పుడే సాక్షాత్తు భగవంతుడిలాగా మారి పోయి ఇద్దరూ కలిసి పోతారు. భగవంతున్ని తెలుసు కోవాలంటే అంతటి భక్తి అవసరం అని సత్సంగ్ లో చెప్తూ ఉండగా బాల ముకుందుడికి చాలా సంతోషం వేసింది. అందరూ వెళ్లి పోయాక, స్వామీజీ ! నన్ను మీ చరణాల దగ్గర శిష్యుడిగా తీసుకుంటారా అని అడిగాడు . దానికి సమాధానంగా రామానంద గారు బాలున్ని చూసి ప్రస్తుతం నీవు ఏం చేస్తున్నావు నాయనా? అని అడిగారు . నేను తులసీ దాసు గారి ఆశ్రమంలో ఆయన శిష్యుడి లాగా ఉన్నాను అని చెప్పాడు. నీవు నా శిష్యుడి లాగా రావాలనుకుంటే నీ గురువు యొక్క అనుమతి పత్రం అవసరం. ఒక వేళ మీ గురువు గారు కనక అనుమతి పత్రం ఇస్తే అది తీసుకుని నా దగ్గరకు రా అప్పుడు నేను తప్పకుండా నీ విషయం ఆలోచిస్తాను అని చెప్పారు. బాల ముకుందుడు తిరిగి వెళ్లి తులసీ దాసుకి విషయం చెప్పగా ఆయన అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు."నీకేమైనా మతి పోయిందా నా తర్వాత ఆశ్రమ అధికారాలన్నీ నీకే అప్ప చెప్పాలను కుంటున్నాను. నా ఉత్తరాధికారివి నీవేనని ప్రకటించ దలచుకున్నాను. గురువుని మార్చినంత మాత్రాన నీవనుకున్నది సాధిస్తావా? పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్నీ మానుకో. నీకు అనుమతి పత్రం ఇవ్వడం అన్నది అసాధ్యం. కాబట్టి  నా మాట విని నీవు ఆశ్రమ విధులన్నీ యథావిధిగా పాటించు" అని చాలా కోపంగా మాట్లాడి వెళ్లి పోయారు. మళ్ళీ నన్ను  "పిచ్చివాడు","పిచ్చివాడు" అని అంటున్నారు అని మాటలు మననం చేసుకుంటూ ఒక ఉపాయం ఆలోచించాడు. అప్పట్నుంచి ముకుంద స్వామిలో మార్పు వచ్చింది. ఆశ్రమానికి చాలా మంది భక్తులు వస్తుంటారు. వారు రక రకాల వస్తువులు , ధనమూ వగైరా వగైరా కానుకలుగా సమర్పించు కుంటూ ఉండేవారు అలా వచ్చినవన్నీ ధారాళంగా యథేచ్ఛగా వచ్చిన వాళ్ళందరికి  ఉచితంగా ఇవ్వడం మొదలు పెట్టాడు.  "తీసుకు పొండి" , "తీసుకు పొండి ", "అంతా మీదే " కొంచెం ఎందుకు తీసుకుంటున్నారు? మొత్తం ఇచ్చేయండి అంటూ ఆశ్రమానికి వచ్చిన సంపదలు, వస్తువులు , సర్వం భక్తులకి పంచి పెట్ట సాగాడు. వార్త విన్న తులసీ దాసుకి కోపంతో పాటు భయం కూడా వేసింది. అతను వెంటనే వచ్చి ముకుంద స్వామిని  "ఏం చేస్తున్నావు నీవు?"  అని గద్దించి అడిగాడు. స్వామీ ! నా పని నేను నిర్వహిస్తున్నాను అని ఎంతో వినయంగా చెప్పగా , ఏమీ అక్ఖర్లేదు. వచ్చిన సంపదంతా నీవు అందరికీ దోచి పెడ్తున్నావు. కనుక నీవు తక్షణమే  ఇక్కడ్నుంచి వెళ్లి పోవలసిందే అని చెప్పగా దానికి బాల ముకుందుడు అలాగే , నేను తప్పకుండా వెళ్తాను. నాకు మీ దస్తూరితో అనుమతి పత్రం ఇవ్వండి అని అనగా దస్తూరి పత్రమా ? అది యివ్వడానికి వీల్లేదు అని అంటే సరే ! నేను ఇక్కడే ఉండి అందరికీ సేవ చేసుకుంటూ ఉంటాను అని బదులు ఇచ్చాడు. ఇక గత్యంతరం లేక తులసీ దాసుగారు ఆయనకి అనుమతి పత్రం ఇచ్చారు. దాన్ని తీసుకుని ఆయన సంతోషంగా బయలు దేరాడు

 రామానంద గారి శిష్యరికం 
అనుమతి పత్రాన్ని తీసుకుని  రామానంద గారిని కలిసి దానిని సమర్పించి ఆయన పాదాల వద్ద కూర్చుని, ఇలాగే మీ చరణాల దగ్గర కూర్చోనిస్తారా? నాకు మీ శిష్యరికాన్ని ప్రసాదిస్తారా? మీ దగ్గర ఉండి మీకు సేవ చేసే భాగ్యం నాకు ప్రసాదిస్తారా? మిమ్మల్ని నా గురువులాగా నేను భావిస్తున్నాను అని వినయంగా అడగ్గా దానికి రామానంద గారు అంగీకరించడం జరిగింది.

విధంగా బాల ముకుందుడు రామానంద స్వామి దగ్గర చేరి ముక్తానంద స్వామి అనే సన్యాసి నామాన్ని అంగీకరించారు. అతను పూర్తిగా శ్రీ కృష్ణ పరమాత్ముడిలో కలిసి పోయినటువంటి మహా జ్ఞాని , మహా భక్తుడు. అటువంటి ముక్తానంద స్వామిగురించి సందేహ పడడం అంటే మనని మనం సందేహ పడినట్టుగానే ఉంటుంది అని భావించాలి అని చెప్పి సుఖానంద స్వామి గారు వర్నిరాజ్ కి ముక్తానంద స్వామి గారి చరిత్ర అంతా వివరించారు .