N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Thursday, 30 October 2014

SwamiNarayan - Episode 31

                                                         సమాలోచన
ఇలా కొద్ది రోజులు గడుస్తుండగా శ్రీ రామానంద స్వామి గారు శిష్యులతో కూర్చుని స్వామి ముక్తానంద స్వామి గారి కోసం కబురు చేసి ఆయన కోసం ప్రతీక్ష చేస్తూ, ముక్తానంద గారు ఇంకా రాలేదేమీ అని అనుకుంటున్న సమయంలో ముక్తానంద గారు వచ్చి గురువుగారికి పాదాభివందనం చేసి ఏమిటీ నన్ను పిలిపించారు సంగతేమిటీ? అని ప్రశ్నించగా దానికి సమాధానంగా, ముక్తానంద్ ! నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను .కొన్ని విషయాల్లో నీ సలహాని తీసుకోవాలని నేను నిన్ను పిలిపించాను అని చెప్పారు. సర్వ సమర్థులైన మీకు నేనేం సలహా ఇవ్వగలను  అని ఎంతో వినయంగా ముక్తానంద గారు చెప్పారు.




దానికి రామానందగారు సర్వ సమర్థులకి కూడా వారిని సమర్థించేవారు కావాల్సి వస్తుంది అని నవ్వుతూ చెప్పారు.దీని వల్ల ఒక వేళ నేను ఏమైనా పొరబాటుగా నిర్ణయం చేసి ఉంటే అది సరి దిద్దుకొన వచ్చును. సమర్థులకి కూడా చాలా  సార్లు సమర్థవంతుల సలహా కావాల్సి వస్తుంది అని చెప్పేసి , నా తర్వాత ఆశ్రమపు బరువు బాధ్యతలు ఎవరికి అప్పగించాలా అని ఆలోచిస్తున్నాను. ఎవరికి అంత యోగ్యత ఉంది,ఎవరు అంత సమర్థవంతంగా ఆశ్రమాన్ని , ఆశ్రమ ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళతారో చెప్పగలరా అని రెట్టించి రెండు, మూడు సార్లు ముక్తానంద గారిని ప్రశ్నించారు. దానికి సమాధానంగా ముక్తానంద స్వామి గారు , ఇదొక సమస్య అని నేను అనుకోను. సమయం వచ్చినప్పుడు దీనికి పరిష్కారం  దొరుకుతుంది గురువుగారూ ,అని చెప్పగా సమయం ఆసన్నమయింది. అందుకనే నేను చెప్తున్నాను అని బదులిచ్చారు. రేపు నేనొక పెద్ద సభని ఏర్పాటు చేసాను. సభలో మన సాంప్రదాయాన్ని పాటించే శిష్యులు , మన ఆశ్రమ వాసులూ, ఊరి పెద్దలందరూ కూడా హాజరు అవుతారు అందరి సమక్షంలో నేను యోగ్యుడైన వ్యక్తి పేరు ప్రకటించాలి అందుకనే మీ సలహా కోసం నేను ఎదురు చూస్తున్నానని రామానంద స్వామి గారు చెప్పారు. స్వామీ ! ఎవరి పేరైతే మీ హృదయంలో అంకితమై ఉన్నదో అదే పేరు నా హృదయంలో కూడాఉంది . పేరు నా నాలుక మీద తీసుకు వచ్చే ప్రయాస అవసరం అంటారా అని ప్రశ్నించారు.పరస్పర హృదయాలు మాట్లాడుకునే స్థితిలో ఉన్నప్పుడు దాన్ని మనం నాలుక మీద తెచ్చినా తేకపోయినా ఒకటే కదా ! అని ఆయన వినయంగా జవాబిచ్చారు.

 శ్రీ రామానంద గారి ప్రకటన 

మరునాడు సభకి చుట్టు ప్రక్కల గ్రామాల్లో ఉన్న వారందరూ ,శ్రీ  రామానంద గారి శిష్యులూ, చాలా మంది రామానంద గారు సభలో ఏం ప్రకటిస్తున్నారో అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. శ్రీ రామానంద గారు సభ నుద్దేశించి , నాకు తెలుసు రోజు నేనేం చెప్ప బోతున్నానా అది తెలుసుకోవాలని మీ అందరికీ ఆత్రుతగా ఉంది. మీ అందరూ చుట్టు  ప్రక్కలనుంచి ఇక్కడకి వచ్చారు. మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారో నేను అదే చెప్పబోతున్నాను. సమయమనేది ఒక ప్రవహించే నది లాంటిది. అహర్నిశలూ ప్రవహించడమే దాని ధర్మం.

అది నిరంతరమూ ప్రవహిస్తూనే ఉంటుంది. అది దాని యొక్క కర్తవ్యం. మన మనుషులందరమూ కూడా ప్రవహించే నది లాంటి వాళ్ళం. ప్రవహించే నదిలో మనం వేలు పెట్టినా నది ప్రవాహం ఆగిపోదు. ప్రవహిస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే మనం నదిలోంచి వేలు తీసేస్తామో వెంటనే ఖాళీ స్థలాన్ని నది నీళ్ళతో నింపేస్తూనే ఉంటుంది. ప్రవాహం అలా సాగి పోతూనే ఉంటుంది . ఇప్పుడు సరిగ్గా సమయం ఆసన్నమయింది. నీటిలోంచి మన వేలు తీసే సమయం ఆసన్నమైంది. ఉద్ధవ సంప్రదాయాన్ని ఇంత కాలం నుంచి నిర్వహిస్తున్నాను. నేను పదవిని త్యాగం చేద్దామన్ని నిర్ణయం తీసుకున్నాను నా తదనంతరం బరువు బాధ్యతలని ఇంకొకళ్ళకి అప్పగించాలని నిర్ణయించు కున్నాను అని చెప్పి సభలో నాలుగు వైపులా నింపాదిగా చూడ సాగారు.

అక్కడ చేరిన శిష్యులు, జనులందరూ కూడా ఆయన ఏం చెప్ప బోతున్నారో అని చెవులు నిక్కించి వినాలని కుతూహలంగా ఉన్నారు. వ్యక్తి ఎవరో కాదు సహజానందస్వామి వారు. ఆయన్నే నేను నా ఉత్తరాధికారిగా  నిర్ణయించానని చెప్పారు. ఆమాటలకి అక్కడే ముందు వరసలో కూర్చున్న రఘునాథ దాసుగారు ఉలిక్కి పడ్డారు. వెంటనే తన ప్రక్కనే ఉన్న స్వామి సుఖానంద గారితో "అయి పోయింది," "అయి పోయింది," "అంతా అయి పోయింది," సర్వ నాశనమై పోయింది" అని ఆయన చాలా వెటకారంగా మాట్లాడారు. శ్రీ రామానంద గారు ఎంతో ప్రేమగా "సహజానంద్" అని పిలవగానే సహజానంద స్వామి ఎంతో వినయంగా, గురువుగారూ !  ఇప్పటిదాకా మీరు నాకిచ్చిన కార్యక్రమాలన్నీ నేను ఎంతో భక్తి భావంతో చేస్తూనే ఉన్నాను. ఇక ముందు కూడా నేను చేస్తూనే ఉంటాను. ఇంత పెద్ద సాంప్రదాయ బరువు-బాధ్యతలని మాత్రం మీరు నా మీద ఉంచ వద్దు అని వినయంగా జవాబిచ్చారు. ఎందుకు అని  శ్రీ రామానంద గారు ప్రశ్నించగా , గురువుగారూ ! నాకంత అర్హత , సామర్థ్యం లేవని వినయంగా చెప్పారు.

కొద్ది క్షణాలు ఆయన్ని చూస్తూ శ్రీ రామానంద గారు, మరి ఎవరు సమర్థులంటావు? అని ప్రశ్నించారు. అయ్యో ! సభలో నాకన్నా పెద్దవాళ్లు స్వామి ముక్తానంద గారు, సుఖానంద గారు , రఘునాథ దాసు గారు, ఇంత మంది ఉన్నారు కదా గురువుగారూ ! అని జవాబిచ్చారు. వీరందరూ  కూడా సమాజాన్ని సరి అయిన దిశలో నడిపేటటువంటి సామర్థ్యం ఉన్నవాళ్లు అని చెప్పగా వెంటనే రఘునాథ దాసు గారు శ్రీ రామానంద గారిని ఉద్దేశించి, రామానంద గారూ ! సహజానంద గారు సరిగ్గానే చెప్తున్నారు. అతని మాట వినండి అని చెప్పారు. నిజమైన జ్ఞాని ఎవరంటే తాను అజ్ఞాని అని తెలుసుకున్నవాడే నిజమైన జ్ఞాని అని రఘు నాథ దాసుగారు చెప్పారు. సహజానంద గారికి చాలా బాగా తెలుసు ఇటువంటి బరువు బాధ్యతలని నిర్వర్తించడానికి ఆయన వయస్సు సరిపోదు. ఇంకా ఆయన పరిపక్వ దశకి రాలేదని ఆయనకి తెలుసును. ఇంత పెద్ద సాంప్రదాయాన్ని ప్రభావితం చేసేటటువంటి   శక్తి-సామర్థ్యం ఆయనకి లేదు. మీకు తెలియనిదేముంది ? ప్రభావం చూపించ లేనప్పుడు ఎద్దులు లేని ఎడ్లబండి మాదిరి గానే ఉంటుంది కదా ! బండి ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటుంది. దానికి పురోగతి ఉండదు కదా ! అది నడవలేదు కదా స్వామీ ! అని చెప్పగా  శ్రీ రామానంద గారు అతని వైపు చూసి మీరంతా ఉన్నారు కదా ! మీరందరూ సహజానంద గారికి సహాయ సహకారాన్ని అందించ లేరా మీరు? ఇంత కాలంగా మీరు మీ సహాయ సహాకారాలని నాకు అందిస్తున్నారో అదే విధంగా మీరు సహజానంద స్వామి గారికి ఇవ్వ వచ్చును కదా అని మందలించి , సహజానంద గారూ ! అని పిలిచి , ఎంతో  ఆలోచించి నేను నిర్ణయానికి వచ్చాను. సమయం కూడా అదే ఆశిస్తుంది. కాబట్టి ప్రస్తావనని స్వీకరించు నాయనా ! అని ఎంతో ప్రేమగా చెప్పారు. దానికి సమాధానంగా సహజానంద గారు స్వామీజీ ! ప్రస్తావన నేను స్వీకారం చేయలేను. కాని నా మనస్సులో ఒక సమస్య ఉంది. నేను సన్యాసిని.  స్త్రీలనుంచి దూరంగా ఉంటాను. మరి నా దగ్గరకి స్త్రీలు, పురుషులూ ఇద్దరూ ఉపదేశం కోసం వస్తుంటారు కదా ! నేను స్త్రీ నీడ కూడా పడకుండా ఎంతో జాగ్రత్తగా ఉంటాను. మరి దీనికి నన్నేం చేయమంటారు? అని ప్రశ్నించారు. నాయనా సహజానంద్ ! నీవు చెప్పింది చాలామటుకు నిజమే. స్త్రీ యొక్క సంపర్కం వల్లే బ్రహ్మచర్యవ్రతం భంగమౌతుంది. కాని నీవు అటువంటి బ్రహ్మచారి మాత్రం కావు. ఎన్ని వేల స్త్రీలు నీ ముందు వచ్చినా నీవు చలించేవాడివి కావు. సమాజంలో ఉన్న స్త్రీ పురుషులందరినీ ఉద్ధరించ వలసిన అవసరమూ , బాధ్యతా మీ మీద ఉంది కనుక నా ప్రస్తావన మీరు స్వీకరించండి. భూలోకంలో మీకు ధర్మాన్నిస్థాపించవలసిన బాధ్యత ఉంది కాబట్టి నా అభ్యర్థనని మీరు స్వీకరించండి అని ఆయన ప్రేమతో చెప్పగా సహజానంద స్వామి గారు," అలాగేనండి, నేను తప్పకుండా స్వీకరిస్తాను " అని తన అంగీకారాన్ని తెలియజేసారు. వెంటనే ప్రాంగణమంతా జయ జయ ధ్వానాలతో నిండి పోయింది. స్వామి రామానంద గారు చాలా సంతోష పడి పోయారు. సంతోషం పట్టలేక ఆయన సహజానంద గారిని , నాయనా సహజానంద్ ! నాకు చాలా సంతోషంగా ఉంది. నీకు ఏం కావాలో కోరుకో. నీవేం ఆడిగిన నేను తప్పకుండా తీరుస్తాను అని ఆయన వాగ్దానం చేసారు. ఇదంతా చూస్తున్న రఘునాథ దాసు గారికి ఒళ్ళు మండి పోయింది.

తన అక్కసంతా బయటకి వెళ్ళ కక్కారు. "అయి పోయింది", "అయి పోయింది",ఇంక ఏముంది? ధనమూ, వైభవమూ రెండే కోరుకుంటాడు కదా ! వాటికోసమే దొంగ వేషంలో ఆశ్రమానికి వచ్చాడు.  "చూద్దాం ! "చూద్దాం ! అని ఆయన అన్నారు తన సహచరులతోటి. గురుదేవా ! నేనేదడిగినా ఇస్తారా ? అన్న సహజానంద గారిని ,"ఎందుకు, నామీద నమ్మకం లేదా అని ఎదురు ప్రశ్న వేశారు శ్రీ రామానంద గారు. "లేదు గురువుగారూ ! నాకలాంటి ఆలోచన లేదు. మీరు వాగ్దానం తప్పకుండా నిలబెట్టుకుంటారు అని సహజానంద గారు జవాబిచ్చారు. అయితే అడుగు మరి అని అన్న శ్రీ  రామానంద గారితో ,అయితే నేను గద్దె ఎక్కే ముందే నాకు రెండు వరాలు కావాలి అని సహజానంద గారు అడిగారు. దానికి సమాధానంగా తప్పకుండా అడుగు అని గురువుగారు ప్రోత్సాహించారు. అయితే నాకు రెండు వరాలు కావాలి. సరే ! తప్పకుండా అడుగు. నిస్సందేహంగా అడుగు.అని సహజానంద గారు జవాబు చెప్పేలోగా రఘునాథ దాసుగారు, గురువుగారూ ! మిమ్మల్ని వచనబద్దున్ని చేస్తున్నాడు. వాగ్దానంతో కట్టి పడేస్తున్నాడు. ఒక వేళ ఈయన అడిగిన వరాలు  మీరు ఇచ్చినా అపకీర్తి వస్తుంది , ఇవ్వక పోయినా అపకీర్తి వస్తుంది.

ఎటువంటి వరాలని ఈయన అడగదలచుకున్నాడో జాగ్రత్తగా ఉండండి అని రఘునాథ దాసుగారు హెచ్చరించారు. సన్యాసి ఐన నేను ఒక వరం ఇచ్చినందువల్ల గాని , ఇవ్వనందువల్ల గాని అపకీర్తి ఎందుకు వస్తాయి నా దగ్గర ఏముంది? అని ఆయన ఎంతో నిబ్బరంగా జవాబిచ్చారు. సహజానంద్ ! అని శిష్యున్ని పిలవగానే నా మొదటి వరం ఏమిటంటే ఉద్ధవ సంప్రదాయంలో ఉన్న శిష్యులందరికీ కూడా ప్రారబ్ధ కర్మల వల్ల దరిద్రం ఉండ కూడదు. అటువంటి వారందరికీ వారి ప్రారబ్ధ కర్మలూ, వారి దరిద్రమూ అంతా కూడా నాకు సంక్రమించేటట్టుగా వరం ఇవ్వాలి అని అడిగారు. వారింట్లో అన్నానికి కాని , వస్త్రానికి కాని దేనికీ లోటు లేకుండా సుఖ సంతోషాలతో ఉండాలి. వాళ్లకి చిన్న బాధ కలిగినా కూడా బాధ నాకు కలిగేటట్టుగా మీరు చేయాలి అని అడిగారు. ఆయన అడిగిన వరాలకి అక్కడ ఆశ్రమంలో ఉన్న స్వామి రామానంద గారి శిష్యులు, ఉద్ధవ సాంప్రదాయాన్ని గౌరవించే జన సమూహమంతా కూడా ఎంతో ఆనంద పడ్డారు. తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు కరతాళ ధ్వనులద్వారా, జయజయకారాల ద్వారా. రఘునాథ దాసు గారికి ఏం మాట్లాడాలో తెలియక నిరుత్తరుడై పోయారు. రామానంద స్వామి గారు కూడా చాలా సంతోష పడి పోయారు. ఆయన సభ ముగించి లేవబోతున్నప్పుడు తన పాదాలకి నమస్కరించబోతున్న సహజానంద గారిని గట్టిగా హృదయానికి హత్తుకున్నారు. సభ ముగిసిన అనంతరం ఉత్తరాధికారికి  జరపవలసినటువంటి ఉద్ధవ సాంప్రదాయ సంస్కారాలన్నీ కూడా ఘనంగా జరిగాయి. తర్వాత సహజానంద గారి వేషధారణ కూడా శ్రీ రామానందగారి ఆదేశ ప్రకారమే జరిగింది. విధంగా సహజానంద గారు ఉత్తరాధికారిగా నియమించబడ్డారు. తంతు చూడ్డానికి చుట్టు ప్రక్కల  గ్రామాలనుంచి  నుంచి కూడా విశేషంగా జనం తరలి వచ్చి కార్యక్రమాలన్నీ కూడా ఎంతో సంతోషంగా వీక్షించి వాళ్లకి తోచిన భక్తి భావంతో కీర్తనలు పాడి , నృత్యం చేసి తమ సంతోషాన్ని ప్రకటించారు. అక్కడ చేరిన ఆశ్రమవాసుల్ని, విశేషమైన ప్రజలనుద్దేశించి స్వామి రామానంద గారు రోజునుంచి నా ఉత్తరాధికారిగా , ఉద్ధవ సాంప్రదాయానికి ప్రతినిధిగా స్వామి సహజానంద గారిని నేను ప్రకటిస్తున్నాను. ఇకనుంచి మీరు సహజానంద స్వామి వారు చెప్పే ఆదేశాలని పాటించాలి. ఇంతకాలంగా మీరు  మీ సహాయ సహకారాలని నాకు ఎలా అందించారో అదే విధంగా ఇక ముందు కూడా మీ సహాయ సహకారాలని, మీలో ఉన్న చిన్న చిన్న అహంకారాలని వదిలేసి ఇతనికి అందించవలసిందిగా కోరుతున్నాను. స్వామి నారాయణ ఎవరో కాదు సాక్షాత్తు నరనారాయణుడి అవతారమే.      
         
 శ్రీ రామానంద గారి దేహ త్యాగం 



ఆశ్రమ బాధ్యతలన్నీసహజానంద స్వామి వారికి అప్ప చెప్పాక శ్రీ రామానంద గారు బ్రహ్మ భోజనం ఒకటి బ్రాహ్మణ భోజనం ఏర్పాటు చేసారు. ఆయనకి బ్రాహ్మణులంటే చాలా ప్రేమ, భక్తి, గౌరవం ఉండేవి. అందుకని తరచుగా ఆయన బ్రాహ్మణ భోజనం ఏర్పాటు చేస్తుండేవారు. అదే విధంగా ఆయన బ్రహ్మ భోజనం అంటే బ్రాహ్మణ భోజనం ఏర్పాటు చేయగా అనేక వేల మంది బ్రాహ్మణులు చుట్టు  ప్రక్కల గ్రామాలనుంచి రావడమూ , విందు భోజనాన్నిసంతృప్తిగా ఆరగించడం ఇవన్నీ శ్రీ రామానంద గారు తన శిష్యుడైన సహజానంద స్వామి వారితో అక్కడే కూర్చుని ఇదంతా పర్యవేక్షించడం జరిగింది. తదనంతరం ఆయన ప్రక్కనే ఉన్న నదికి స్నానానికి వెళ్లి , స్నానానంతరం తన ఏకాంత గది ధ్యానమందిరంలో  శ్రీ కృష్ణ పరమాత్ముడి ముందు పద్మాసనంలో కూర్చుని ధ్యాన స్థితిలోకి వెళ్లి పోయి, ధ్యాన స్థితిలోనే పరమాత్మునిలో ఐక్యమై పొయినారు. కొద్ది సేపటికి అక్కడకి వచ్చిన ఆయన శిష్యులంతా ఆయన ధ్యానంలో ఉన్నారని గ్రహించారు. ఎంతసేపైనా ఆయన ధ్యాన స్థితినుంచి బయటకి రాకపోవడంతో ఆయనని పలకరించారు. ఎంత పలకరించినా ఆయన లేవక పోవడంతో వాళ్ళు ఆయన దగ్గరకి వచ్చి చూసి శ్రీ రామానంద గారు దేహ త్యాగం చేసారని తెలుసుకుని గొల్లున ఏడవడం మొదలు పెట్టారు. వార్త ఆశ్రమమంతా వ్యాపించి అందరూ కూడా రామానంద గారి దగ్గర చేరి దుఃఖించడం మొదలు పెట్టారు.ఇదంతా వింటున్న సహజానంద స్వామి వారు ఎంతో నింపాదిగా , ప్రశాంతంగా అక్కడకి వచ్చి , అందరినీ ఉద్దేశించి , ఇలా మీరందరూ ఏడవడం వల్ల ఏమిటీ లాభం? రామానంద స్వామి వారు ఇచ్చా మరణాన్ని పొందారు కనుక ఆయన కోసం మీరు దుఖించడంలో అర్థం లేదు. ఆయన ఆదేశ ప్రకారం మనమంతా సమాజానికి సరైన దిశ చూపించి ప్రజలని ఉద్ధరించ వలసిన అవసరం ఎంతైనా ఉంది. లక్ష్యంతోనే ఆయన జీవించారు.ఆయన జీవితాశయం కూడా ఇదే. కాబట్టి మీరంతా దుఃఖించడం  మానండి.

విధంగా సహజానంద స్వామి వారు శ్రీ రామానంద స్వామి గారి అనుయాయులందరినీ కూడా ఎంతో శాంత వచనాలని చెప్పి వారి దుఃఖాన్ని నివారించే ప్రయత్నం చేశారు. ఆయన నిలబడి స్వామి రామానంద గారి అంతిమ   సంస్కారాలన్నీ కూడా నిర్వర్తించాక ఒక రోజు స్వామి రామానంద అంటే ఉద్ధవ సాంప్రదాయానికి చెందినవారినందరికీ వర్తమానాలు పంపించి స్వామి సహజానంద గారు ప్రప్రథమంగా ఒక సభను ఏర్పాటు చేయడం జరిగింది.


 శ్రీ  సహజానంద గారి ప్రప్రథమ సమావేశం  

శ్రీ రామానంద గారు దేహ త్యాగం చేసిన తర్వాత మొట్ట మొదటిసారిగా సహజానంద స్వామి గారు ఒక సభను ఏర్పాటు చేసారు. దాని కోసం వివిధ గ్రామాలనుంచి అనేక వేల మంది ఉద్ధవ సాంప్రదాయం నెలకొల్పినట్టి శ్రీ రామానంద స్వామి గారి అనుయాయులు, శిష్యులందరూ,వేల సంఖ్యలో విచ్చేశారు.సహజానంద స్వామి వారు ఆసనంలో కూర్చోగానే స్వామి  వారి  పరివారంలోనే ఒకరు స్వామీ  !  శ్రీ రామానంద స్వామి తర్వాత ఉద్ధవ సాంప్రదాయాన్ని నిలబెట్టటానికి , వ్యాపింప చేయడానికి మీరు మా గురువుగా వచ్చారు. కాబట్టి మిమ్మల్ని మాకీ రోజు మంచి ఉపదేశాన్ని ఇవ్వవలసినదిగా మేము ఎంతో ఆర్తితో ప్రార్థిస్తున్నాము. స్వామీ ! చాలా మంది గృహస్థులు అందరూ కూడా వారికి తగినట్టుగా వారి ఇష్ట దేవుని గురించి వ్రతాలు, పూజలు , యజ్ఞాలు కూడా వాళ్లు చేస్తూ ఉంటారు. కాని చాలా మందికి మంత్రాలూ సరిగ్గా ఉచ్చరించడం, శ్లోకాలు సరిగ్గా చదవడం , చెప్పటం వాళ్లకి అస్సలు చేత కాదు. అంతే కాకుండా శ్లోకాలకి , మంత్రాలకి అర్థం అసలే తెలియదు. బీజ అక్షరాలతో ఉన్న మంత్రాలు గాని శ్లోకాలు గాని సరిగ్గా ఉచ్చరింప బడనప్పుడు దాని వల్ల విపరీత పరిణామాలు , పాపాలు  కలుగుతాయి అని పెద్దలు చెప్తుంటారు. వీటి వల్ల శుభాలు  జరిగేచోట అశుభాలు జరుగుతుంటాయి. కాబట్టి మీరు మా అందరికీ సరి అయిన ఉచ్చారణ తో మంత్రాలు, శ్లోకాలు నేర్పించండి అని నివేదించాడు.

అక్కడ సమావేశానికి వచ్చిన ప్రజలందరూ వాదాన్ని సమర్థించారు. ప్రముఖ శిష్యుడు స్వామీ ! మీరు మీ మొట్ట మొదటి ఉపదేశం మాకు ఎంతో కొంత సరళంగా , మా అందరికీ అర్థమయ్యేటట్టుగా , సామాన్య జనుల్ని కూడా ఉద్ధరించేటట్టుగా ఉండే ఉపదేశాన్నోకటి ఇవ్వవలసినదిగా ప్రార్థిస్తున్నాను. దీనివల్ల ఎంతో మంది జనులు ఉద్దరించ బడతారు. సమాజం కూడా బాగుపడుతుంది అని ప్రార్థించగా, దానికి సహజానంద స్వామి వారు నవ్వుతూ, మీరందరూ జ్ఞానులు . ఎన్నో విషయాలు కూలంకుషంగా తెలిసిన వాళ్ళు. అటువంటి మీకు నేను ఎలాంటి ఉపదేశాన్ని ఇవ్వగలను చెప్పండి. శ్రీ రామానంద గారు మనందరినీ వదిలేసి వెళ్ళిపోయిన నాల్గవ రోజు ఇది. ఆయన మన  మధ్యలో  లేరని  దుఃఖ పడటం భావ్యం కాదు. దుఃఖము , అశ్రువులు ఆత్మకు చాలా భారంగా పరిణామిస్తాయి. అవి  ఆత్మకి ఎంతో ఆవేదనని కలిగిస్తూ ఉంటాయి. ఆయన తన సంకల్పానుసారమే జన్మ ఎత్తారు. అలాగే ఇచ్చా మరణం పొందినటువంటి మహానుభావులు. మన మొట్ట మొదటి కర్తవ్యం ఏమిటంటే శ్రీ రామానంద గారు చూపించిన మార్గాన్ని సమాజ శ్రేయస్సు కోసం , సమాజ కల్యాణం కోసం విస్తరింప చేయాలి. దాన్ని వ్యాపింప చేయాలి. శ్రీరామానంద గారు చెప్పినటువంటి మార్గోపదేశాలు మనం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలి. కనుక రఘునాథ దాసు గారూ ! మీరు అహ్మదాబాదు వెళ్ళండి. స్వామి ముక్తానంద గారూ ! మీరు కచ్  వైపు ప్రయాణం చేసి  అక్కడ మన ధర్మ ప్రచారాన్ని సాగించండి

సహజానంద స్వామి వారి మూల మంత్రం 

ఇకపోతే మీరడిగిన మంత్రం గురించి సమస్త విశ్వ కల్యాణం కోసం నేను ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను . సత్సంగయితే మంత్రాన్ని త్రికరణ శుద్ధిగా పఠిస్తాడో , జపం చేస్తాడో అతను జీవితాంతం కూడా ఎప్పుడూ దుఃఖం అనేది  ఎరగకుండా ఉంటాడు. సుఖం , శాంతి , సమృద్ధి  మరియూ మోక్షం కూడా పొందుతాడు. పరమాత్మ ఉపదేశించిన మంత్రం కాలము, కర్మము , మాయ వీటన్నిటికీ కూడా స్వయంగా ఆయనే స్వామిగా ఉన్నాడు. ఆయన మరెవరో కాదు.  "స్వామి నారాయణుడు ".

అది అసలు పరమాత్ముని యొక్క నామము. మీరందరూ కూడా షడాక్షరి  మంత్రాన్ని జపిస్తూ ఉండండి. స్వామి నారాయణ అనేది ఒక పరమాత్ముని నామము స్వామి అనేది నామానికి విశేషణము. "స్వామి నారాయణ" అనే మూల మంత్రాన్ని మీ అందరికీ నేను ఉపదేశిస్తున్నాను. మీరు చెప్పిన విధంగా మరి గృహస్థులకి యజ్ఞాలు చేయడం, శ్లోకాలు, మంత్రాలు చదవడం కష్టం కాబట్టి సులభ సాధ్యమైనటువంటి, మహత్తరమైనటువంటి ఎంతో మహత్తు కలిగినటువంటి   నామాన్ని మీకు ఉపదేశిస్తున్నాను అని ఆయన సెలవిచ్చారు. అందరూ ఎంతో ఆనందంగా, సంతోషంగా "జై స్వామి నారాయణ్ "  అని జపిస్తూ తమ హర్షాన్నివ్యక్తం చేసారు. అంతటితో రోజు సభ ముగిసింది