N. Sairam Garu : +91 7901268716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.Saturday, 1 November 2014

SwamiNarayan - Episode 32

స్వామి నారాయణ గారి సమాజ సేవ

విధంగా ప్రథమ సమావేశంలో తన ముఖ్య శిష్యులందరినీ ప్రచారానికి వివిధ పట్టణాలకి, గ్రామాలకి వెళ్లవలసినదిగా ఆదేశించినటువంటి స్వామి సహజానంద గారు, తానూ కూడా స్వయంగా ధర్మ ప్రచారానికి చుట్టు ప్రక్కల గ్రామాలకి పయనించ సాగారు. ఆయన సందర్భంగా మంగ్రోల్ అనే గ్రామానికి విచ్చేశారు. గ్రామంలో ని ప్రజలంతా కూడా ఎంతో సాదరంగా, ఘనంగా స్వాగతమిచ్చి మేళ తాళాలతో ఊళ్లోకి తీసుకెళ్ళారుఒక ప్రశాంతమైన ప్రదేశంలో, ఒక చెట్టు క్రింద ఆయనకి ఆసనం సమర్పించగా, ఆయన ఆసనం మీద కూర్చుని, చుట్టూ ఉన్న శిష్యుల్ని పరిశీలిస్తుండగా ఆయనకి గ్రామంలోని స్త్ర్రీలందరూ కూడా చేతుల్లో కడవలతో (అంటే బిందెలతో) ప్రయాణం చేస్తూ కనిపించారు.
అప్పుడు ఆయన ఊరి ప్రముఖుడైన గోవర్ధన్ గారిని ఇదే ప్రశ్న అడిగారు. గోవర్ధన్ గారూ! ఇక్కడ మహిళలంతా ఇంత ఎండలో కడవలు పట్టుకుని బయల్దేరుతున్నారు ? ఏమిటీ సంగతి? స్త్రీలందరూ కూడా సత్సంగకి రాలేక పోతున్నారెందుకు? మరి నీళ్ళ కోసం బిందెలు పట్టుకుని ఎక్కడకి వెళ్ళుతున్నారు? దానికి సమాధానంగా ఆయన మహిళలందరూ కూడా నీళ్ళ కోసం దూర ప్రదేశాలకి వెళ్ళుతున్నారు. ఇక్కడ నీటి ఎద్దడి (నీటి కొరత) చాలా ఉంది . అందుకని వాళ్లు సత్సంగకి రాలేక పోతున్నారు అని సెలవిచ్చారు. అదేమిటీ ? ఎందుకంత దూరం వెళ్ళ వలసి వస్తుంది ? మంగ్రూల్ గ్రామంలో బావులు లేవా అని ఆయన ఆరా తీసారు

స్వామీ! ఊళ్ళో చాలా బావులున్నాయి కాని ఏం లాభం? బావిలో కూడా ఒక్క చుక్క  నీళ్ళు లేవు. అన్నీ అడుగంటి ఉన్నాయి. అందుకని గ్రామంలో ఉన్న అక్క - చెల్లెళ్లు నీళ్ళు లేకుండా బ్రతకడం చాలా కష్టం కాబట్టి తమ కడవలతో ఎంతో దూరం ప్రయాణించి వేరే గ్రామానికి వెళ్లి అక్కడనుంచి నీళ్ళు తీసుకు రావడంజరుగుతుంది అని వివరించగా గోవర్ధన్ గారూ! మన ఇంటి ఆడపడుచులు ఇంత కష్ట పడి అంత దూరం వెళ్ళుతున్నారు కదా! మరి గ్రామమంతా "సిగ్గు పడ వలసిన విషయం "అని ఆయన అన్నారు. మరి సమస్యని ఇలాగే వదిలేస్తే ఎలా? మనం దీనికి తప్పకుండా పరిష్కారం కనుక్కోవాలి అని అనగా దీనికి పరిష్కారమేమిటో  మీరే  సెలవియ్యండి అని గోవర్ధన్ గారు అన్నారు. మనందరమూ  కలిసి  సమిష్టిగా  కృషి  చేస్తే  ఎటువంటి  సమస్యలైనా చాలా సులభంగా పరిష్కారం కనుక్కో గలుగుతాము అని చెప్పి సహజానంద గారు తన ప్రణాళికని వివరించారు ఊరి వారందరూ కూడా శ్రమ దానానికి సిద్ధ పడి ఆయన చెప్పిన విధంగానే సమావేశమయ్యారు

సమిష్టి కృషి ఫలితం

సహజానంద స్వామి వారు గ్రామానికి విచ్చేశారు అన్న వార్త తెలిసిన వెంటనే చుట్టూ ప్రక్కల ఉన్న గ్రామాల్లోని ప్రజలంతా అక్కడ సమావేశమయ్యారు. మనమందరమూ కలిసి ఐకమత్యంగా, సమిష్టి కృషి చేస్తే మనం జీవితంలో ఏదైనా సాధించ వచ్చును కాబట్టి మీకున్న రక రకాల పనిముట్లతో మనం నేను చెప్పిన ప్రదేశాన్ని త్రవ్వడం మొదలు పెడదాం అని సహజానంద స్వామి వారు వాళ్లకి చెప్పారు. వాళ్ళందరిని ఈయన ఎంతో ప్రోత్సాహకరంగా మాట్లాడగా జనులు అందరూ రెట్టింపు ఉత్సాహంతో గడ్డ పారలు, పారలు, తట్టలు భూమిని త్రవ్వడానికి పనిముట్లయితే ఉన్నాయో  అవన్నీ పట్టుకుని వచ్చారు. వారిలో కొంత మంది వారి ఇంటిలో ఉన్న ధాన్యాన్ని కూడా పట్టుకుని వచ్చారు. కొంత మంది అక్కడ నీటి వ్యవస్థ ఏర్పాటు చేసారు. చాలా మంది అంచెలంచెలుగా, వంతులవారిగా స్వామి ఆదేశం ప్రకారం ఆయన నిర్దేశకత్వంలో , ఆయన మార్గదర్శకత్వంలో అక్కడ ఒక బావి త్రవ్వడం మొదలు పెట్టారు. దేవుని యొక్క భజనలూ, కీర్తనలూ పాడుకుంటూ ఒకళ్ళ నొకళ్ళు ఉత్సాహ పరచుకుంటూ , మధ్యలో వారి సేద తీరుస్తూ మొత్తానికి స్వామి వారి పర్యవేక్షణలో, వారి సన్నిధిలో గ్రామ ప్రజలే కాకుండా ప్రక్క ఊరి నుండి వచ్చిన వేలాదిమంది గ్రామస్థులు కూడా తామంతా ఒకటే కుటుంబ సభ్యుల్లాగా , జాతి మత భేదాల్లేకుండా వాళ్ళంతా అన్నదమ్ములవలె కలిసిపోయారు. స్వామి వారి శరీరం నుండి కాంతిమయ కిరణాలు వెలువడి  అన్ని వైపులా వెదజల్ల బడుతున్నాయి. కిరణాలు , తేజస్సు నీలి రంగుతో ఎంతో అద్భుతంగా కిరణం తగలగానే మనుషులలో ఒక చెప్పలేనటువంటి శాంతి , ప్రేమ, సౌభ్రాతృత్వాన్నిఇవన్నీ కలిగిస్తూ ఉంది. కొన్ని కిరణాలు భూమిలోకి చొచ్చుకుని పోగా భూమాత పులకించి పోయింది కొన్ని కిరణాలు గ్రామస్థుల శరీరం చుట్టూతా వలయాకారంలో ఏర్పడి పోయినాయి. ప్రతి గ్రామస్థుని, స్త్రీ పురుషుల మనస్సులో "తామంతా ఒకటే" అనే భావం, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అనే తత్వం వాళ్ళలో కలిగించింది.

ఒక్క మనిషి పది  మనుషులంతా శక్తివంతుడిగా తయారై పోయి వాళ్ళు తమ పనిని స్వామి వారు చూపించే ప్రదేశంలో ఒక పెద్ద కూపాన్ని ఆడుతూ పాడుతూ  తవ్వారు.దానిలో బ్రహ్మాండంగా మరి నీటి ఊట మాత్రం తన గంగా ప్రవాహాన్ని బయటకు తీసింది. గ్రామస్థులంతా ఎంతో సంతోష పడి పోయినారు. ఎప్పుడైతే సహజానంద స్వామి వారు నారాయణ మంత్రం ఉపదేశించారో ఆయన అనుయాయులందరూ ఆయన్ని భగవాన్ స్వామి నారాయణుడిగా పిలవడం మొదలు పెట్టారు .అదేవిధంగా అక్కడ చేరినటువంటి అశేష జనం "స్వామి నారాయణ కీ  జై"  "స్వామి నారాయణ కీ  జై"  అంటూ  జయ  జయధ్వానాలు చేశారు. అక్కడే శ్రీ కృష్ణ పరమాత్ముని యొక్క విగ్రహం ఒకటి ప్రతిష్ఠించి దానికి వాళ్ళు పూజ చేశారు. సమయ దేవత మరి మిగతా అందరు దేవతలు కూడా ఇలా అనుకున్నారు . "ఆహా! సమిష్టి కృషి" అందరు కూడా కలిసి సమిష్టిగా ఉండి ఒకటే శక్తిగా మారినప్పుడు ఎన్ని అద్భుతాలు జరుగుతాయో!  కరువు కాటకాలు  కాని  మరి ఎటువంటి సమస్యలు కాని ఉండవు కదా ! ఎప్పుడైతే మనుష్యులు భేద భావాలు లేకుండా ప్రేమగా ఐకమత్యంగా ఉంటూ , ఒకరికొకరు సహాయం చేయాలి అనే భావంతో ఉంటూ మనమంతా ఒక్కటే అనే భావం వచ్చినప్పుడు సంఘంలో ఎంత మంచి పరివర్తన వస్తుందో ! .

ఇన్ని సంవత్సరాలనుంచి నీళ్ళ కోసం కట కటలాడుతూ ఉన్న గ్రామ ప్రజలు ఎప్పుడైతే సమిష్టిగా వాళ్ళంతా ఒక చోటికి వచ్చి మనమంతా ఒక్కటే, మన కుటుంబమంతా ఒకటే అనే ఒక ప్రేమపూరిత భావంతో మంచి పనిని స్వామివారి అధ్వర్యంలో ఎప్పుడైతే మొదలు పెట్టారో కొన్ని వందల సంవత్సరాలనుంచి ఉన్నటువంటి సమస్య క్షణంలో మటుమాయమై పోయింది కదా! ఆహాప్రేమకి ఎంత గొప్ప శక్తి ఉందో! స్వామి వారు ఈవిధంగా తన లీలను ప్రకటన చేశారు కదాఅని వాళ్ళలో వాళ్ళు చర్చించుకున్నారుముఖ్యంగా అక్కడ ఉన్న మహిళలు ఎంతో సంతోష పడి పోయినారు ఎన్నో ఏళ్ళ తర్వాత వాళ్ళ మొహంలో సంతోషం తాండవించింది . ఆహా! ఎన్నాళ్ళకి  మన కష్టాలు తీరి పోయాయి! మంగ్రోలు అనే గ్రామానికి కోడలుగా రావడం అందరూ ఒక శాపంగా భావించే వాళ్ళు. అందరూ భయపడి పోయే వాళ్ళు. ఊరికి కోడలిగా రావాలని ఎవ్వరూ అనుకునేవాళ్లు కాదు. అలాగే ఊరి ఆడ పిల్లలని ఎవ్వరూ వివాహం చేసుకునే వారు కాదు. కాని సహజానంద స్వామి వారి దయ వల్ల రోజుకి మన బాధలన్నీ తప్పి పోయాయి. ఎండలో ఎంతో దూరం వెళ్లి, ఎంతో శ్రమతో  కడవలలో నీళ్ళు నింపుకుని ఇంటికి రావడం చాలా నరక ప్రాయంగా ఉండేది కదా! ఇప్పుడు నీళ్ళు కూడా ఎంత  తియ్యగా ఉన్నాయి! ఆహా!  ఏమి స్వామి నారాయణ యొక్క మహిమ! అని వాళ్ళు  వేనోళ్ళ పొగడ సాగారు. మరి కొంత మంది జనులు అదేమిటీ ఇక్కడ బావుల్లోఅసలు నీళ్ళే ఉండేవి కావు. కొద్దో గొప్పో ఉన్నా అవి చాలా చేదుగా ఉండేవి. మనమసలు త్రాగ లేక పోయేవాళ్ళం. ఏమిటీ విచిత్రం! ఇప్పుడు ఇక్కడ బావులన్నీ కూడా స్వచ్చమైన  తియ్యటి నీళ్ళతో నిండి ఉన్నాయి కదా! సహజానంద స్వామి ఎవరో కాదు. ఆయన సాక్షాత్తు భగవంతుడైన స్వామి నారాయణే సుమా

"స్వామి నారాయణ మహారాజు  కీ  జై" అంటూ వాళ్ళు వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేసారుఆహా! ఏమి చమత్కారం ! ఏమి లీల! అని జనులందరూ కూడా మాట్లాడుకో సాగారు. వార్త క్షణంలో చుట్టూ ప్రక్కల ఉన్న అనేక గ్రామాల్లో విస్తరించి జనులందరూ కూడా సహజానంద స్వామి వారిని సాక్షాత్తు భగవంతుడైన శ్రీ స్వామి నారాయణే అని భావించసాగారు. స్వామి వారి కీర్తి నలు దిశలా ప్రాకి పోయింది.

సహజానంద స్వామి వారి ఉపదేశం 
తర్వాత   ఊరి  ప్రజలందరూ కూడా ఒక చోట స్వామి వారి సమక్షంలో సమావేశమైనారు. సత్సంగలో స్వామి వారు మాట్లాడుతూ భగవంతుడి లాగా ఉండడం చాలా సరళమైన ప్రక్రియ. అదే భగవంతుడు మానవునిగా జన్మ ఎత్తి  పనులు  చేయడమనేది  చాలా కష్టం.  
         
ప్రభువుగా ఉండడం చాలా సరళమైనది. మనిషిగా పుట్టి, మనిషిగా జీవించడమనేది చాలా కఠినమైనది హృదయంలో శ్రద్ధ ఉంది, తోటి మనుష్యులకి సహాయం చేయాలనే తలంపు ఉంది, కష్ట పడే తత్త్వం కనుక ఉంటే అక్కడ భగవంతుడు తనంతట తానే  ప్రత్యక్షమౌతాడు. మీరు భగవంతుడికి పూజలు-పునస్కారాలు చేయక పోయినా ఫరవాలేదు కాని తోటి మనుష్యుల కోసం మంచి పనులు మీరు ఎంతో శ్రద్ధగా, నిష్కామంగా చేయండి. అప్పుడు ప్రభువు మీ అందరి ముందు తనంతట తానే ప్రత్యక్షమవుతాడు . మీతో పాటుగానే ఆయన ఉంటారు. జల ప్రాప్తి కోసం మనం చేసిన కృషి అటువంటిది. సమిష్టి కృషి ఫలితాన్ని మీరంతా చవి చూశారు కదా !

అవును! అవును!  అది నిజమే! మీరే సాక్షాత్తు ప్రభువు అని అందరూ ఏక కంఠంతో ఎలిగెత్తి స్వామి వారిని ఉద్దేశించి అన్నారు. అక్కడ సమావేశ మైనట్టి   ప్రజలందరికీ  కూడా స్వామి నారాయణ గారు ఒక్క క్షణం దివ్యమైన తేజస్సుతో కనిపించారు. అప్పుడు వారందరూ కూడా ముక్త కంఠంతో ప్రభుజీ! మీరు మంగ్రోలు గ్రామంలోనే స్థిర నివాసం చేసుకోండిమీకు సేవ చేసే అదృష్టాన్ని మాకు ప్రసాదించండి అని ఆయన్ని ప్రార్థించారు. భగవంతుని యొక్క స్థానము మనుషుల యొక్క, జీవుల యొక్క హృదయంలో ఉంటుంది. అక్కడే ప్రతిష్టించబడి ఉంటుంది.మానవులు తలచుకుంటే తమ శరీరాలనే భగవంతుడి యొక్క మందిరం లాగా తయారు చేసుకొన వచ్చును. భక్తి శ్రద్ధలతో శ్రద్ధగా ధ్యానం చేస్తే మీ అందరికీ కూడా సమాధి స్థితి ప్రాప్తిస్తుంది. మీరందరూ ఎప్పుడైతే భక్తి శ్రద్ధలతో , ఏకాగ్రత చిత్తంతో మీ మీ ఇష్ట దైవాలని స్మరిస్తూ ఎప్పుడైతే ధ్యానం చేస్తారో అప్పుడు మీ అందరికీ కూడా ఒక అద్భుత మైనటువంటి అనుభూతి తప్పకుండా కలుగుతుంది. మీ అందరికి సమాధి స్థితి కూడా కలుగుతుంది అని ఆయన చెప్పారు. మీ అందరికీ కూడా సాక్షాత్తు ప్రభువు మీ హృదయంలోనే ప్రత్యక్షమవుతారు. దైవాన్నయితే మీరు చూడాలని అనుకుంటారో దైవమే మీ హృదయంలో మీకు కనిపిస్తారు అని ప్రేమగా చెప్పారు. మరి మీరందరూ మీ మీ ఇష్ట దేవతల దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నారా ? అని ప్రశ్నించగా అందరూ కలిసి ఏక కంఠంతో అవును ప్రభుజీ! అవును! మేమందరమూ కూడా మా మా ఇష్ట దేవతలని చూడాలని అనుకుంటున్నాము అని బదులు చెప్పారు . అందులో పరివారంలో ఉన్న ఒకతను ధైర్యంగా, కానీ ప్రభూ! కలి యుగంలో సమాధి స్థితి అనేది కలగడం అసాధ్యం కదా! అని తన సంశయాన్ని వెలిబుచ్చాడు. ప్రభువు యొక్క కృప కనుక ఉంటే అన్నీ సాధ్యమవుతాయి. అసాధ్యమంటూ ఏమీ ఉండదు. అన్నీ సంప్రాప్తిస్తాయి అని సహజానందస్వామి గారు బదులు ఇచ్చారు

సహజానంద స్వామి గారు భక్తులకి సమాధి స్థితిని కలిగించడం 

సరే అయితే మీరందరూ నిశ్చలంగా కూర్చుని కళ్ళు మూసుకోండి అని ఆయన ఆదేశమివ్వగానే  అక్కడ ఉన్న భక్తులందరూ కూడా ఎంతో  భక్తి శ్రద్ధలతో కళ్ళు మూసుకుని ఆయన చెప్పిన విధంగానే కూర్చుండి పోయారు. అద్భుతంగా స్వామి శరీరం నుండి, నయనాల నుండి వెలువడిన   కాంతి పుంజాలు అక్కడ కూర్చున్న భక్తులందరికీ తగిలి వారి శరీరంలోకి అవి ప్రవేశించినాయి. అప్పుడు స్వామి గారు మీరందరూ కూడా ఏకాగ్రత చిత్తంతో మీ మీ ఇష్ట దైవాలని, మీ ఆరాధ్య దేవతలల్ని స్మరిస్తూ ఉండండి. వారి నామాన్ని మీరు మనస్సులో ఉచ్చరించుకోండి అని చెప్పారు. కొంచెం సేపయినాక స్వామి వారు మీ ఇష్ట దేవతలు మీకు కనిపించారా? అని ప్రశ్నించగా అందులో ఒకరు అవును ప్రభూ! నాకు సాక్షాత్తు శివుని దర్శనమయింది అని అంటే, ఇంకొకతను నాకు గణేష్ మహారాజ్ కనిపించారు, ఇంకొకతను నాకు శ్రీ కృష్ణ భగవానుడు కనిపించాడు, ఇంకొక స్త్రీ నాకు పార్వతీ మాత దర్శనం కలిగింది అని భక్తులందరూ కూడా వారికి కనిపించిన వారి వారి ఇష్ట దేవతలు, వారి ఆరాధ్య దేవతల గురించి స్వామికి విన్నవించుకున్నారు. స్వామీ ! రోజు మీమూలంగా మా ఇష్ట దేవతలు సమాధి స్థితిలో మాకు కనిపించడం జరిగింది అని చెప్పి అక్కడ చేరిన జన సమూహమంతా  ఏదో తెలియనటువంటి ఒకాధ్యాత్మిక తన్మయత్వంలో మునిగి పోయారు. వాళ్ళందరూ కూడా మహానందంతో ఒకళ్లకొకళ్ళు నాకు శివుడు దర్శనమయ్యాడు, నాకు హనుమంతుడు దర్శనమయ్యాడు, సాక్షాత్తు రాముడు దర్శనమయ్యాడు, నాకు పార్వతీ దేవి కన్పించింది అని పట్టలేని ఆనందంతో వారికి కలిగిన అనుభవాలను, అనుభూతులను సమిష్టిగా పంచుకొన సాగారు. విధంగా స్వామి నారాయణ గారు తన భక్తులందరికీ సమాధి స్థితిని కలిగించి వారి వారి ఇష్ట దేవతలని వారికి  కనిపించేటట్టుగా ఒక అనుభవాన్ని ప్రసాదించారు

క్షణంలో జరిగినటువంటి అద్భుతం చుట్టు ప్రక్కల గ్రామాలకు వ్యాపించింది. అనుభూతి కలిగిన వాళ్ళు, కలగని వాళ్ళు అందరు కూడా సహజానంద స్వామి ఎవరో కాదు సాక్షాత్తు భగవాన్ స్వామి నారాయణనే అని చెప్పడానికి ఇదే నిదర్శనము. కలి యుగంలో ఇష్ట దేవతల దర్శనం కలగడం అనేది అసంభవం. అటువంటి సమాధి స్థితిని కలిగించి ఇష్ట దేవతల దర్శనం ఇప్పించి నటువంటి వ్యక్తి సామాన్య పురుషుడై ఉండడు. తప్పకుండా అతను అవతార పురుషుడే అయి ఉంటాడు కాబట్టే ఇన్ని వేల ప్రజలకు ఒకే ఒక్కసారి సమాధి స్థితిని కలిగించి వారి వారి ఇష్ట దేవతల దర్శనం చేయించ గలిగారు అని అలా ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటూ పోయారు. దానిలో ఒక సత్సంగుడు ఇంతమంది జనులకి ఇన్నిరకాలుగా, రక రకాలుగా ఇష్ట దేవతల దర్శనమైంది అంటే దీనిలోని పరమ సత్యం ఏమిటంటే "భగవంతుడు ఒక్కడే, ఆయన రూపాలు వీరు " అని ఇప్పడు మనకి తేట తెల్లమయింది . ఇటువంటి సత్పురుషుని శరణు కోరడం ఒక్కటే మనకి మార్గము. అన్ని దేవతలు ఒక్కటే సుమా! అని విధంగా వాళ్ళలో వాళ్ళు తర్కించుకో సాగారు .