N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Friday, 7 November 2014

SwamiNarayan - Episode 33

అగ్ని పరిక్ష

రోజుల్లో మేఘ జీ (Meghji ) అనే తాంత్రికుడొకడు ఉండేవాడుఅతను యేవో చిన్న చిన్న తంత్రాలు నేర్చుకుని అవన్నీ ప్రజల ముందు ప్రదర్శిస్తుండేవాడు. అయితే అతను సల సలా కాగుతున్న నూనెలో చేయి పెట్టే వాడు. అంత మరుగుతున్న నూనెలో చేయి పెట్టినా అతని చేయి కాలేది కాదు. అతని మొహంలో కూడా ఏమాత్రం బాధ కనిపించేది కాదు. దీన్నే అతను సమాధి స్థితి అని అంటుండే వాడు. తంత్రానికి ప్రజలు ఆకర్షించబడి ఎంతో మంది అతనికి శిష్యులుగా చేరారు. సమాధి స్థితిని అందరికీ కలిగిస్తానని అతను చెప్తుండేవాడు


ఒక రోజు అతని ప్రియ శిష్యుడైన కైలాష్ అనే అతను సహజానంద స్వామి వారి గురించి ఇలా చెప్పాడు. గురువుగారూ ! సహజానంద స్వామి అనే అతను అందరికీ సమాధి స్థితిని కలిగించి వారి వారి ఇష్ట దైవాల దర్శనం ఇప్పిస్తున్నాడు  తానే  భగవంతున్ని అని చెప్పకుంటున్నాడు . ప్రజలందరూ అతన్ని భగవంతునిగా భావిస్తూ అతని శిష్యులై పోతున్నారు. అందుకని ఇక్కడ మన దగ్గర జనం తగ్గి పోతున్నారు. దానికి మేఘ (Meghji ) గారు ఏమిటీ నీవు చూసావా ? ఇదంతా నిజమేనా? ప్రపంచంలో సమాధి స్థితిని కలిగించే వాణ్ణి  నేనొక్కడినే. అది  అసాధ్యం  అని అహంకారంగా చెప్పాడు. లేదండీ ! నేను నిజమే చెప్పుతున్నాను. నేను ప్రత్యక్షంగా చూసాను, అనుభవించాను. అందుకనే మీకు చెప్పుతున్నాను అని కైలాస్ చెప్పాడు. మాటలతో తాంత్రికునికి చాలా కోపం వచ్చింది. అతని అహంకారం ఇంకా హెచ్చింది. అతను వెంటనే కైలాస్ తోటి మనమందరమూ సహజానంద స్వామి వారి సముఖానికి వెడదాం. ఆయనతో నేను పందెం కాస్తాను. సల సలా కాగుతున్న నూనెలో చేయి పెట్ట గలడా అతను ? అది మీ అందరి సమక్షంలోనే నేను తేల్చుకుంటాను. ఇటువంటి కపట సాధువుల్నివారు చేసే మోసాలని నేను బహిరంగంగా అందరి ఎదుటా బయట పెట్ట దలచు కున్నాను. కనుక తక్షణమే మనమంతా బయల్దేరి ఆయన దగ్గరకి వెళ్లి ఆయన బండారమంతా బయట పెడదాం పదండి అని చెప్పి తన శిష్యులతోటి , తన సామగ్రి తోటి శ్రీ స్వామి నారాయణగారి దగ్గరకి ఎంతో అహంకారంతో బయలు దేరాడు

లోగా కొంత మంది స్వామి నారాయణ గారి శిష్యులకి సంగతి తెలిసి పరుగు పరుగున స్వామి వారి దగ్గరకి వెళ్లి స్వామి ! మేఘ జీ  అనే తాంత్రికుడు సల సలా కాగుతున్నటువంటి నూనెలో చేతులు పెట్టే తాంత్రిక విద్యలో ఆరి తేరిన వాడు , కృతఘ్నుడు, అహంకారి. అతను ప్రక్రియనే సమాధి స్థితి అని చెప్పుతూ ఉంటాడు. ప్రజందరు కూడా అతన్ని విధంగానే నమ్ముతూ ఉంటారు. అతడు మీ పేరు ప్రఖ్యాతులు విన్నాక ఎలాగైనా సరే మిమ్మల్ని ఇక్కడ ఇబ్బందిలో పెట్టాలి అని చెప్పి వాడు మీ దగ్గరకి బయలు దేరాడు. వాడు మంచి వాడు కాదు కాబట్టి మీరు అతనితో అంత ఎక్కువగా మాట్లాడకండి . మిమ్మల్ని సల సలా కాగుతున్న నూనెలో చేతులు పెట్టమని అంటాడు. అదే సమాధి స్థితి అని చెప్తుంటాడు. కనుక స్వామీజీ , మీరు జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు కాగుతున్న నూనెలో చేతులు పెట్ట వద్దు . వాడు తాంత్రిక విద్యలో ఆరి తేరిన వాడు అని చెప్పి వారు స్వామిని హెచ్చరించడం  జరిగింది. దానికి సమాధానంగా స్వామి వారు తన భక్తులనుద్దేశించి , "ఓహో !" "అలాగా !" "అయితే ఫరవాలేదు. మీరు నిశ్చింతగా ఉండండి . ప్రజల్లో ఉన్నటువంటి మూ విశ్వాసాల్నీ , అజ్ఞానాన్ని మనం పారద్రోలుదాం. ఇతను చేస్తున్నటువంటి కపట నాటకానికి మనం చరమాంకం పలుకుదాం. మీరు నిశ్చింతగా ఉండండి. నేను సల సలా కాగుతున్న నూనెలో చేతులు పెట్టను. పెట్టకుండానే నేను వాడికి తగిన విధంగానే పాఠం నేర్పుతాను.కాబట్టి మీరేమి గాభరా పడకండి. అతన్ని రానివ్వండి. వచ్చాక మనం చూద్దాం!" అని అనగా వారు కుతూహలంతో స్వామీజీ ! మీరు ఏం చెయ్యబోతున్నారు అని అడగ్గా దానికి సమాధానంగా మౌనంగానే ఉండి పోయారు

లోపల  మహా ఉద్రేకంగా కోపంతో మేఘ (Meghji ) గారు  స్వామి నారాయణ గారి దగ్గరకి రావడమూ , స్వామి నారాయణ గారు ! మేఘ (Meghji ) గారు   ! మీరు వచ్చారా ! స్వాగతం ! స్వాగతం ! రండి ! ఆశీనులు కండి అని కూర్చోవడానికి ఒక ఆసనం చూపించి ఎంతో సాదరంగా ఆయనను ఆహ్వానించారు. దానికి సమాధానంగా మేఘ (Meghji ) గారు  చాలా క్రోధంతో మీ అతిథి సత్కారం పొందడానికి నేను ఇక్కడకి రాలేదు సుమా ! మీలో ఉన్న అహంకారాన్ని అణచడానికి నీ అసలు నిజ స్వరూపం బయట పెట్టటానికి వచ్చాను అని స్వామి వారితో అనగా స్వామి వారు చిరునవ్వుతో మేఘ (Meghji ) గారు మీరు చాలా మంచి నిర్ణయంతో ఇక్కడకి వచ్చారు. అహంకారం ఉండటం అనేది చాలా పాపం. అటువంటి పాప కర్మని మీరు నిర్మూలించడానికి వచ్చారు అంటే నేను నిజంగా చాలా సంతొషించ వలసినటువంటి విషయం. రండి మరి ఇప్పుడు నన్నేం చెయ్యమంటారు? అని ఎంతో వినయంగా బదులు చెప్పారు . స్వామీజీ ! మీరు ప్రజలందరినీ తప్పు దారి పట్టిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మోసం చేస్తున్నారు సమాధి స్థితిని ఇస్తానని చెప్పి , వారికి మాయ మాటలు చెప్పి తద్వారా మీరు చాలా ప్రచారాన్ని పొందుతున్నారు. నేనే స్వయంగా భగవంతుణ్ణని చెప్పుకుంటున్నారు మీ భక్తులు కూడా అలాగే భావిస్తున్నారు. ఇలా ప్రజలని తప్పు దారి పట్టించడం పాపం కాదా? ఇంత కన్నా ఘోరమైన పాపం ఇంకా ఎక్కడైనా ఉందా అని గద్దించి అడిగారు. దానికి సమాధానంగా స్వామి వారు చిరునవ్వు నవ్వుతూ నీవు చెప్పిందంతా విన్నాను. మన భారతీయ సాంప్రదాయంలో ప్రజలందరూ కూడా భక్తి భావంతో ఎంతో శ్రద్ధగా ప్రతి వస్తువులో కూడా అంటే రాయి రప్పాలో కూడా భగవంతుడినే దర్శించుకుంటారు వారందరూ మరి మనుష్యులలో కూడా భగవంతుడి అంశం చూసి వారు నన్ను కూడా భగవంతుడిగా భావించడంలో వారి దోషం ఏమున్నది ? వారి మనసులో ఉన్న భావాలకి విరుద్ధంగా ఉండమని నేను వాళ్లకి చెప్పలేను కదా ! శ్రద్ధా, భక్తి ఎక్కడ అయితే ఉన్నాయో అక్కడ వాటి ప్రమాణం చూపించ వలసిన అవసరం లేదు . మరి భగవద్గీత చెప్పినటువంటి సాక్షాత్తు శ్రీ కృష్ణ భగవానుని భగవంతుడనే అనుకుంటున్నాం కదా ! మరి అటువంటి భగవద్గీత మీద శ్రీ కృష్ణ భగవానుని యొక్క హస్తాక్షరాలు లేవు కదా ! ఆయన చెప్పాడనే ఒక నమ్మకంతో , ఒక భక్తి భావంతో , ఒక శ్రద్ధా భావంతో అందులో ఆయన చెప్పిన విషయాలని మనము నమ్ముతున్నాము. కాబట్టి ఎక్కడ శ్రద్ధ ఉంటుందో, ఎక్కడ భక్తి ఉంటుందో దానికి ప్రమాణాలు చూపించ వలసిన అవసరం లేదు అని స్వామి వారు బదులు ఇచ్చారు

అగ్ని సంస్కారం 
మేఘ జీ పరివారంలోని ఒక ధూర్తుడు స్వామి నారాయణని ఉద్దేశించి మన లోని శక్తులని ప్రజల మంచి కోసం ఉపయోగించాలి కాని మీరు ప్రజల్ని తప్పు దారి పట్టిస్తున్నారు. కల్యాణ మేమీ చేయటం లేదు. సమాధి స్థితిని కల్పిస్తున్నట్టుగా ఒక భ్రమ కలిగించి  మీరు భగవంతుడి అవతారమని చెప్పుకుంటున్నారు.ఇది మంచి పధ్ధతి కాదని చెప్పాడు. అతనికి తోడుగా మేఘ జీ అవును ! మన శక్తులని మనం లోక కల్యాణం కోసం వినియోగించాలి కాని మీరు ఇలా ప్రజలని తప్పు దారి పట్టించడం సమంజసం కాదు. మీరు భక్తులకి ఇస్తున్నది సమాధి స్థితి కానే కాదు. అదంతా ఒక భ్రమని కలిగిస్తున్నారు కాని అది నిజమైన స్థితి కాదు. సమాధి స్థితిని కేవలం నేనే ఇవ్వగలను అది ఎవరి వల్లా సాధ్యం కాదు. అందుకు నేను మీకొక సవాల్ విసురుతున్నాను . ఇక్కడ సల సలా కాగుతున్న నూనెలో మీరు ధైర్యంగా చేయి పెట్ట గలరా అని చెప్పి స్వామి నారాయణని ఉద్దేశించి ప్రశ్నించాడు. అతని మాటల్లో పొగరుమోతు తనం, అహంకారం మరియూ వెటకారము ప్రతిధ్వనించాయి

మేఘ జి సవాల్ 

స్వామి నారాయణ్ గారు మౌనంగా ఉండడం చూసి. ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ఏది ఏమిటీ వెనక్కి వెళ్ళుతున్నారు ? ధైర్యం లేదా? సల సలా  కాగుతున్న నూనె లో చేయి పెట్ట లేరా?మీ చేయి కాలి పోతుందని భయమేమో . తప్పకుండా మీ చేయి కాలుతుంది. ఇప్పుడు అసలు సంగతేమిటో  నిజం జనాలకి తెలిసిపోతుంది. పాలకి పాలు  , నీళ్ళకి నీళ్ళు రెండూ కూడా విడి పోతాయి.మీ నిజ స్వరూపం బయట పడి పోతుంది. దానికి స్వామి నారాయణగారు నవ్వుతూ అవును ! అగ్నిఅన్నింటినీ పరి శుద్ధం చేస్తుంది. పాలలో ఉన్న నీళ్ళని వేరు చేయాలంటే దానికి అగ్ని తగల వలసిందే. అలాగే మనుషుల్లో ఉన్నచెడ్డ గుణాలు, అహంకారమనేవి కూడా అగ్ని తత్వానికి అణగారి పోవలసిందే. అవి ఆవిరై పోవాల్సిందే అని అనగా దానికి ధూర్తుడు నాకు మాత్రం ఏం కాదు.నేను చేయిని సల సలా కాగుతున్న నూనెలో  పెట్టినా కూడా నాకేమీ కాదు అని చెప్పి సవాల్ విసిరాడు. తాంత్రికుడైనట్టి మేఘజి స్వామి నారాయణ గారి దగ్గరకి వచ్చి పందెం వేసాడు అన్న విషయం తెలిసి అక్కడ  చుట్టు ప్రక్కల ఉన్నగ్రామాల్లో ఉన్న ప్రజలు  తండోపతండాలుగా వింతని చూడడానికి వచ్చారు. జనులలో ఎంతో కుతూహలం, ఉత్సుకత ,ఆసక్తి కూడా కలిగింది.  కొంచెం భయం కూడా వేసింది. వాళ్ళు మరి ముందే చెప్పారు కదా మేఘజితొ పందెం వెళ్లకూడదని ! కాబట్టి వారందరూ కూడా ఊపిరి బిగబట్టి ఏం జరుగుతుందా  అని చెప్పేసి  ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. స్వామి నారాయణా ! మీ సమాధి స్థితిమీద మీకంత నమ్మకం ఉంటే మరి ఆలస్యమెందుకు ? నూనెలో చేయి పెట్టి చూడు. నీళ్ళకి నీళ్ళు పాలకి పాలు రెండు బయట పడతాయి. ప్రజలందరికీ నిజం తెలిసి పోతుంది. నీకంత నమ్మకం ఉంటే కానీయి అని ప్రశాంత స్వరంతో చెప్పినా ధూర్తుడు నాకేం కాదు నేనోక్కడ్నేసమాధి స్థితిని ఇవ్వగలను. నాకేం కానే కాదు ! ఏమనుకుంటున్నావు నీవు ?  చూడండి ! అందరి ముందే నేను పరీక్షలో నిలబడతాను. అగ్ని దేవుడు నా చేతినేమీ కాల్చడు. అంతే కాదు ఆయన ఒక్క వెంట్రుకని కూడా కాల్చలేదు అని వాడు వికటాట్టహాసంతో "జై శ్రీ కృష్ణా !" , "జై గురుదేవా !" అని మూడు మార్లు ఉచ్చరించి ఎంతో ధైర్యంతో ప్రజలందరూ ఏం జరుగుతుందా అని ఊపిరి బిగబట్టి చూస్తున్న సమయంలో వాడు ఎంతో నింపాదిగా, హాయిగా తన చేయిని సల సలా కాగుతున్ననూనెలో పెట్టాడు. అయితే ఈసారి ఎప్పటిలాగా కాకుండా చేయి పెట్టగానే వాడి నుంచి భయంకరమైనటువంటి ఆర్తనాదం బయట పడింది. "అయ్యో !", "అయ్యో !", " రక్షించండి !", " రక్షించండి !" అని . అతను ఎంత వరకు తన చేతిని నూనెలో ముంచాడో అంత వరకు దానిని అక్కడ ఉన్న రోమాలతో సహా అగ్ని దేవుడు స్వాహా చేసాడు. వాడు బాధ భరించ లేక  అటు గెంతుతూ, ఇటు గెంతుతూ "అయ్యో! ", "అయ్యో !" నా చేయి కాలిపోయింది అని ఆర్తనాదాలు  చేస్తూ నన్ను రక్షించండి ! అని చెప్పలేనటువంటి బాధతో అటూ-ఇటూ పరిగెత్త సాగాడు.వాడికి ఆశ్చర్యం మాట అటు ఉంచి , రోమ రోమాల్లో కూడా భయం వాడిలో ప్రవేశించింది. అక్కడ ఉన్న జనులందరూ కూడా భయభీతులై పోయారు. చాలా హడలి పోయారు. ఏమిటీ తాంత్రికుడు ఇన్నేళ్ళనుంచి ప్రక్రియ చేస్తున్నాడు. ఎప్పుడు కూడా వాడికేమీ కాలేదు.మరి రోజు ఎందుకిలా జరిగింది? అని ఆశ్చర్య పోయారు. దాంట్లో కొంత మంది స్వామి నారాయణ గారి భక్తులు మరి భగవంతుడి అవతారమైనట్టి  స్వామి నారాయణని వాడు వచ్చిఇలా  వెటకారంగామాట్లాడడం , వారిని ఉద్దేశించి నిందా వాక్యాలు పలకడమూ, ఇలా పందెం వేయడమూ వగైరా వగైరా లాంటి దుష్ట క్రియలు చేసినందుకు ఫలితంగా వాడి అహంకారమనే అగ్ని జ్వాలలోనే వాడి చేయి కాలి పోయింది అని అనుకున్నారు. ఘటనతో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా దూరం నుంచే స్వామి నారాయణ పాదాలు మొక్కడమూ , సాష్టాంగ  ప్రణామం చేయడం సంభవించింది. ఇదంతా చూస్తున్న స్వామి నారాయణ గారు నవ్వుతూ చూసారా మేఘ గారూ ! మీకు మీ శరీరం లో అణువణువులో అహంకారమనే అగ్ని మండి పోతున్నది . మీ అహంకారాన్ని   రోజు సాక్షాత్తు అగ్నిదేవుడే దహించి వేసాడు. అహంకారమనేది మనకు తెలియకుండానే మనలో ప్రవేశిస్తుంది.  మనం ఏదో ఒక సాధన చేసి ఏదో కొంచెం శక్తి వచ్చినప్పుడు శక్తిని దుర్వినియోగం చేయ కూడదు అని ఎంతో వినయ స్వరంతో చెప్పి ఇంకా ఇలా అన్నారు. మనం శక్తిని ప్రజా శ్రేయస్సు కోసం వినియోగించాలి , అహంకారంతో వేరే వారిని నిందించడం ,భక్తులని తప్పు దారి పట్టించడం అనేది తగదు. రోజు ఏమైంది? నీ అహంకారాన్ని సాక్షాత్తు అగ్నిదేవుడు దహించి వేసాడు కదా ! అని అన్నారు. నీకున్నకొద్ది పాటి శక్తితో ప్రజలు అగ్ని పాల పడకుండా చూడ వలసిన బాధ్యత మీకుంది. అది మీరు విస్మరించారు అని చెప్పగా 

త్రిశంకు స్వర్గం 

ధూర్తుడు ఇంకా అతని అహంకారం తగ్గలేదు కాబట్టి స్వామీ ! మీరు అసుర శక్తితో నాకున్న విద్యను తీసి వేసారు. గ్రామంలో , ప్రజల ముందు నన్ను అవమాన పాలు చేసారు. ఇంక జీవితం నాకు అక్ఖర్లేదు. ప్రజల ముందే నేను నా ప్రాణ త్యాగం చేస్తాను అని వాడు ఇంకా అతని అహంకారం పూర్తిగా పోనందువల్ల స్వామిని ధిక్కరించి మాట్లాడడం మొదలు పెట్టాడు . దానికి స్వామీజీ నవ్వుతూ, ఇప్పటికీ ఇంకా మీ అహంకారం పూర్తిగా తగ్గలేదు. మీరు దేహాన్ని చాలించాలి అని అనుకుంటున్నారు. అది సాధ్యం కాదు. మరి మీరు నిజంగానే ప్రాణ త్యాగం చేయ గలిగితే నేను మీకు శిష్యుణ్ణి అవుతాను . ఒక వేళ మీరు అలా చేయ లేకపోతే మరి మీరు నా శిష్యుడిగా అవుతారా ? అని స్వామి అతనిని  ప్రశ్నించారు. అంతే కాక స్వామి ఏమన్నారంటే నీవు ప్రాణ త్యాగం చేసి దేవుని దగ్గర వెళ్ళే లోపే మధ్యలో త్రిశంకు లాగా మిమ్మల్ని వేలాడ దీస్తాను అటు మీకు ప్రాణం పోదు ఇటు మీరు భూమి మీద కూడా ఉండరు. మధ్యలో శూన్యంలోనే తల క్రిందులుగా మీరు వేళ్ళాడు తుంటారు. మరి దానికి సిద్ధంగా ఉండండి. మరి మీరు నేను చెప్పినదానికి ఒప్పుకుంటారా ? అని ఆయన ప్రశ్నించారు. దానికి నీవు నా శిష్యుడిగా ఉండటానికి సిద్ధంగా ఉండు. నేను ప్రాణ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని అతను ప్రగల్భాలు పలికాడు.

ఇదంతా ప్రేక్షకుల్ల మాదిరిగా గమనిస్తున్నట్టి స్వామి వారి ప్రముఖశిష్యులూ, ముక్తానంద స్వామిగారితో సహా అందరూ నోట మాట రాకుండా నిశ్చేష్టులై పొయినారు. స్వామి వారు పందెంలో ఓడిపొతే ఆయన తన శిష్యులతో సహా తాంత్రికుడికి అంటే మేఘజీకి శరణు కోరతాననడం , ఆయన్ని గురువుగా స్వీకరిస్తానని అనడం ఇదంతా వారిని ఆశ్చర్యంలో ముంచింది. అసలు వాళ్ళలో ప్రక్రియా లేకుండా ప్రతిమల్లాగా నిశ్చేష్టులై పొయినారు. సమయ దేవత కూడా సమయం ఆగి పోయినట్టుగా వింత దృశ్యాన్ని ఏం జరుగుతుందా అని చూస్తూ ఉన్నారు

స్వామి నారాయణ గారు చాలా నిశ్చలంగా , చాలా ప్రశాంతంగా సుఖాసీనులై తదేక దృష్టితో తాంత్రికుడినే చూస్తుంటే అతని కేదో దయ్యం పట్టినట్టుగా అతను  గంతులు వెయ్య సాగాడు. ఆహా ! అనుకుంటూ ఆర్తనాదాలతో నాట్యం చేస్తున్నట్టుగా పిచ్చి గంతులు వేస్తూ అక్కడే పిల్లి ముగ్గులు వెయ్యసాగాడు. ఇంకా ఏం జరుగుతుందా అని తండోపతండాలుగా చూస్తున్న జనానికి భయం వేసింది . కొంత మందికి భక్తి కూడా కలిగింది. ఇంకా ఏం జరుగుతుందా అని చూసే లోపల నేల మీద నుంచి అతను గాలిలో తేల సాగాడు. తల క్రిందులుగా వేలాడ సాగాడు. స్వామి వారు మాత్రం ఏం జరగనట్టుగా నిదానంగా అంతా  చూస్తూ ఉన్నారు. అతనికి మరి ఒళ్ళంతా మంటలుగా ఉండాలి. అతను పూర్తిగా భూమ్మీద కాకుండా పూర్తిగా ఆకాశంలో వెళ్ళకుండా మధ్యలో త్రిశంకు లాగా వేలాడడం  మొదలు పెట్టాడు. అతనిలో ఉన్న అహంకారమంతా పోయి అతను "నన్ను రక్షించండి", "నన్ను రక్షించండి", "శరణం" , "శరణం" , "పాహిమాం", "పాహిమాం" అంటూ ఎంతో దీనంగా ప్రార్థించ సాగాడు.స్వామి వారి కరుణారస దృష్టి ప్రసరించాగానే అతను మామూలు స్థితిలోకి వచ్చాడు. అప్పుడు అతను "శరణం స్వామి " అంటూ పాదా క్రాంతుడయ్యాడు.శరణం స్వామి , తప్పై పోయింది , నా  అహంకారమంతా అణగి పోయింది. సాక్షాత్తు దేవతా స్వరూపులు మీరు మిమ్మల్ని లేని పోని మాటలతో చాలా నిందలు వేసాను. నాకు బుద్ధి వచ్చింది స్వామి ! నన్ను రక్షించండి అని అనగా స్వామి కరుణా దృష్టితో అతని శిరస్సు మీద చేయి పెట్టగానే అగ్ని జ్వాలలు శాంతించాయి. అతని కాలి పోయిన చేయి కూడా సహజ స్థితిని పొందింది. అతను "అన్యథా శరణం నాస్తి "అనుకుంటూ పూర్తిగా స్వామికి తనని తానూ అర్పించుకుంటూ సాష్టాంగదండ ప్రణామం చేసాడు. ఇదంతా చూస్తున్నటువంటి స్వామి వారి శిష్యులందరు కూడా ఆశ్చర్య పోయారు. చాలా ఆనంద పడి పోయారు. స్వామి వారి గురించి అక్కడి ప్రజలు అందరూ ఏక కంఠంతో "స్వామి నారాయణ కీ జై " , "స్వామి నారాయణ కీ జై ", ఇలా జయ జయ ధ్వానాలతో అంటా దద్దరిల్లి పోయింది. అతను రోజు నుంచి స్వామికి మహా భక్తుడైపోయి తన దారిన తానూ వెళ్లి పోయాడు. స్వామి వారు అతన్ని మంచి మార్గంలో ఆలస్యంగా నైనా ఉండేటట్టు చేసారు. జనమంతా కూడా ఎవరి దారిన వాళ్ళు వెళ్లి పోయారు

వార్త చుట్టు  ప్రక్కల గ్రామాల్లోనే  కాకుండా పెద్ద పెద్ద పట్టణాలలో కూడా వ్యాపించి పోయింది. స్వామి నారాయణ యొక్క ఖ్యాతి పెరిగి పోయింది. సమయ దేవత భూమాతకి ఇవన్నీ చెప్పబోగా భూమాత నేను ఇవన్నీ ప్రత్యక్షంగా చూశాను. "ఆహా  ! ఏమి  లీల ! స్వామి పాద  స్పర్శతో అది పావనమై పోయింది కదా ! తాంత్రికుడిలో ఉన్న కౄరత్వాన్ని, అహంకారాన్ని ఎంత చక్కగా హరించి వేసాడు అని ఎంతో ఆనందంతో స్వామిని స్తుతించ సాగారు. స్వామి వారు మాత్రం ఏమీ జరగనట్టుగా నిర్లిప్తంగా, నిర్వికారంగా ఉండి పోయారు