N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Thursday, 13 November 2014

SwamiNarayan - Episode 34



ధర్మ సందేహం 

స్వామి సహజానంద గారు భక్తులకిస్తున్నటువంటి సమాధిస్థితిని గురించిన విషయం ఇంకా ముక్తానంద స్వామిగారి దాకా రాలేదు. ఆయన తన ఆశ్రమంలో తన దైనందిన కార్యక్రమాల్లో మునిగి ఉండగా ఒక రోజు అర్థరాత్రి మాయారం భట్టుగారు వెళ్ళడం జరిగింది. మాయారం భట్టు అంత అర్థ రాత్రి రావడం గమనించిన ముక్తానంద గారు, ఏమిటండీ మాయారం భట్టుగారూ! మీరు ఇంత ఆదుర్దాగా,ఆత్రుతగా అర్థ రాత్రి వచ్చారు. అంతా కుశలమే కదా! సమస్యలేమైనా ఉన్నాయా? అంతా బాగున్నారా? అని ప్రశ్నించగా దానికి మాయారం భట్టుగారు స్వామి! సమస్య ఉన్నదా లేదా అని నాకు తెలియదు.


కాని సహజానంద స్వామిగారు చేసే పనులు నాకేమీ అర్థం కావటం లేదు. అది సమస్య అనే నేను అనుకుంటున్నాను. సహజానందగారు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించగా స్వామి వారు ఈమధ్య ఎక్కడకి వెళ్ళినా కూడా తన భక్తులందరికీ సమాధి స్థితిని ప్రాప్తింప జేస్తున్నారు. ఆయన సమక్షంలో అందరు కూడా తన్మయావస్తలోకి వెళ్లి పోయి వారి వారి ఇష్ట దేవతలనీ, ఆరాధ్య దేవతలని సమాధి స్థితిలో చూడ గలుగుతున్నారు. ఇదంతా చూసినాక వేలకు వేల ప్రజలు సహజానంద స్వామిగారి దగ్గరకి వచ్చి సమాధి స్థితిని అనుభవించి శిష్యులుగా మారుతున్నారు. మరి ఇదంతా నాకు అర్థం కావడం లేదు. మరి అది నిజమైన సమస్య అవునో కాదో అన్నది నాకేమీ తెలియడం లేదు. పెద్ద వారు మీకు తెలుస్తుంది కదా అని మీ దగ్గరకి వచ్చి విన్నవించు కుంటున్నాను అని చెప్పారు. దానికి సమాధానంగా మీరు ప్రత్యక్షంగా ఇటువంటి దృశ్యాన్ని చూడడం జరిగిందా అని ప్రశ్నించగా స్వామీ జీ! ఇవన్నీ నేను ఒక సభలో ప్రత్యక్షంగా చూసాను. ప్రజలంతా కూడా ఒక విధమైనటువంటి తన్మయానంద స్థితిలో ఉండి పోయారు. ఉన్మాద స్థితిలో ఉండి వారి వారి ఇష్ట దైవాలని చూడ గలుగుతున్నారు. ఒక భక్తుడు నాకు మీలో శివున్ని చూడాలని ఉంది అని ప్రార్థించి, నాకు మీరు శివ దర్శనం చేయించాలి అని చెప్పగా సహజానంద గారు అతనికి అనుభూతిని ప్రసాదించారు. సహజానంద స్వామిలో భక్తుడు సాక్షాత్తు శివున్ని చూశానని తర్వాత చెప్పటం జరిగింది. ఇదంతా నాకు గందరగోళంగా ఉంది. స్వామీజీ! నాకేమీ అర్థం కావడం లేదు. అందుకనే మీ దగ్గరకి పరిగెత్తుకుని వచ్చాను అని అన్నారు. ఓహో! అలాగా! అని చెప్పి ముక్తానంద గారు కూడా ఒక వింత ధర్మ సందేహంలో పడి పోయినారు. ఆయన రాత్రంతా దీని గురించే ఆలోచిస్తూ కూర్చుండి  పోయారు. ఏమిటీ మామూలు వ్యక్తి లాగా ఉండే వ్యక్తి మరి ఇటువంటి సమాధి స్థితిని ప్రజలకి ఇవ్వడం ఏమిటీ? వారి వారి ఇష్ట దేవతల దర్శనం చేయించడమేమిటి చాలా ఆశ్చర్యంగా ఉందే అని చెప్పేసి ఆయన సహజానంద స్వామి గురించి కొన్ని సందేహాల్లో పడి పోయినారు

తర్వాత ఆయన ఒక రోజు ఆశ్రమం ముందు ఉన్నటువంటి ఉద్యాన వనంలోకి వెళ్లి దేవతార్చన కోసం పూలు కోస్తుండగా వెనుక నుంచి ఒక గంభీర మైన స్వరం "జై శ్రీ కృష్ణా" అని వినిపించింది  ఎవరబ్బా ఇంత హఠాత్తుగా వచ్చి "జై శ్రీ కృష్ణా" అని అంటున్నారు అని వెనక్కి తిరిగి చూడగా ఆయనకు సాక్షాత్తు తన గురువైనట్టి శ్రీ రామానంద స్వామి వారి దర్శనం కలిగింది. దిగ్భ్రాంతితో ఆయన అలాగే కొంచెం సేపు నిశ్చేష్టుడై నిల్చుండి పోయినారు. అది కలయా , నిజమా , భ్రాంతియా అని ఆయన తేల్చుకోలేక పోయినారు. కొద్ది సేపటికి తెప్పరిల్లి గురువుగారూ! మీరా! ఏమిటీ ఇంత ఆకస్మాత్తుగా వచ్చారు. నిజంగా నేను నాగురువుగారైన రామానంద గారినే చూస్తున్నానా అని సంభ్రమాశ్చర్యాలతో ఆయన ప్రశ్నించారు. అవును! నేనే రామానందని . నీ మనస్సులో కొన్ని సందేహాలున్నాయి . అవి తీర్చడానికే వచ్చాను అని చెప్పగా అవును స్వామీ! మీదగ్గర నేనేమీ దాచలేను ఎవరి  మనస్సులో ఏం ఆలోచనలున్నాయో మీకు తక్షణమే తెలుస్తుంది . దాచవలసినదేమీ లేదు. సహజానంద గారు చేస్తున్న పనుల మీద సందేహాలున్నాయి. అది మాత్రం నిజమే అని ముక్తానంద స్వామి గారు చెప్పారు. నాయనా! నీవను కుంటున్నట్టుగా సహజా నంద స్వామి క్షుద్ర దేవతలని ఆరాధించడం లేదు. ఆయన సాక్షాత్తు ఈశ్వరుని యొక్క అవతారమే. క్షుద్ర శక్తులని నిర్మూలించడానికే వచ్చారు. సమాధి స్థితి ద్వారా ప్రజలని మంచి మార్గానికి తెచ్చి, వారిలో ఉన్న రాక్షస ప్రవృత్తులని నాశనం చేయాలనే ఉద్దేశంతో భూమ్మీద అవతరించి నటువంటి శ్రీ కృష్ణుని యొక్క అవతారమే కాని మానవుడు మాత్రం కాదు. అదే స్వామి! అదే! నేను చాలా సందేహాలలో మునిగి పోయాను. మరి మీరు సాక్షాత్తు ఉద్ధవుడి అవతారమే  కదా!  

ఇలాంటి కలి యుగంలో ప్రజలకి సమాధి స్థితిని  సాధారణ మానవుడు ఎలా ఇవ్వగలడు  అని నేననుకుంటూనే ఉన్నాను అని అనగా నాయనా! పొరబాటు పడు తున్నావు . ఆయన సాక్షాత్తు నారా నారాయణుని అవతారమే . ఆయన ఎన్నో బాల్య లీలలని చేసారు. ఆయన చంటి పిల్లవాడుగా అంటే నెలల   పిల్లాడుగా ఉన్నప్పుడే కృత్యా   అనే మహా రాక్షసిని తన దయా గుణంతో మార్చి వేసారు. అలాగే పరమ దుర్మార్గుడై నటువంటి కాళిదాసుని అతి చిన్న వయస్సులోనే ఎంత చెప్పినా వినక పోయే సరికి అతన్ని సంహరించక తప్పలేదు అని చెప్పి స్వామి  వారు చిన్నప్పుడు చేసిన బాల్య క్రీడలన్నీ   కూడా వివరంగా స్వామి ముక్తానంద గారికి చెప్పేశారు.  నాయనా! నీవు   ధన్యుడివి.  అటువంటి సహజానంద స్వామిని సేవించే అవకాశం నీకు కలిగింది కాబట్టి నీవెటువంటి సంశయాలు పెట్టుకోవద్దు. సంశయాలు పెట్టుకున్న చోట అక్కడ నీకు భగవంతుడు ప్రత్యక్షం కాడు. దాని బదులు శ్రద్ధ భక్తి నీవు అమర్చుకుంటే సహజానంద స్వామి ఎవరో నీకే తెలుస్తుంది నాయనా అని క్షణంలో ఆయన అదృశ్యమై పోయినారు

ముక్తానంద స్వామి గారు నిజంగా చాలా ఆశ్చర్య పోయారు. తన గురువుగారైన శ్రీ రామానంద స్వామి వారు ఎక్కడ నిన్చున్నారో భూమ్మీద నుంచి మట్టి తీసుకుని ఎంతో శ్రద్ధా భక్తులతో నుదుట దిద్దుకున్నారు. ఆయన సహజానంద స్వామి గారిని పూర్తిగా అర్థం చేసుకుని, మారినట్టి నిష్కల్మషమైన మనస్సుతోటి, హృదయం తోటి "జై స్వామి నారాయణ " అని జయ జయ ధ్వానాలు చేశారు. విధంగా ధర్మ సందేహంలో ఉన్నటువంటి అసలైన సిసలైన శిష్యుడు ముక్తానంద స్వామికి సాక్షాత్తుగా ఆయన గురువుగారే వచ్చి సందేహ నివారణ చేయడం జరిగింది. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే ఎంత గొప్పవాళ్ళైనా సరే ఎదురు గుండా ఉన్న మనిషి ఎన్ని అద్భుతాలు చేస్తున్నప్పటికీ తాత్కాలికంగా వాళ్ళని భగవంతుని అవతారంగా భావించినా మాట మాటకి మాయలో పడి పోయి వారిని సామాన్య మానవుల్లాగానే భావిస్తూ ఉంటారు.ఇది కాలంలో సహజమై పోయింది కదా !

విధంగా ముక్తానంద స్వామి గారి సందేహాలన్నీ గురువుగారైన శ్రీ రామానంద స్వామి నివారణ చేయడం తోటి స్వామి ముక్తానంద గారు చాలా పశ్చాత్తాపం చెందారు

పశ్చాత్తాపం 

విధంగా ముక్తానంద స్వామి వారి సందేహాలన్నీ గురువుగారైన శ్రీ రామానంద స్వామి  గారు నివారణ చేయడం తోటి స్వామి ముక్తనంద గారు చాలా పశ్చాత్తాపం చెందారు. రాత్రంతా కూడా ఆయన చాలా బాధ పడుతూ ఉండాలి. తెల్లవారగానే ఆయన పరుగు పరుగున సహజానంద స్వామి వారున్న ప్రదేశానికి బయలు దేరి సరాసరి ఆయన దర్శనం చేసుకుని ఆయన పాదాల మీద పడి పోయినారు. స్వామి! "నన్ను క్షమించండి,"నన్ను క్షమించండి,నేనెంతో ఘోరమైన పాపం చేసాను, దానిని నివృత్తి ఎలా చేసుకోవాలో, ప్రాయశ్చిత్తం ఎలా చేసుకోవాలో నాకు తెలియటం లేదు స్వామి! నేను చాలా పొరబాటు చేసాను" అని విలపించ సాగారు. ఎంతో ఆదరంతో సహజానంద స్వామి వారు ఆయన భుజాలు పట్టుకుని లేపి స్వామి ముక్తానంద గారూ! మీరేం చేస్తున్నారు? ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? అని అన్నారు. దానికి సమాధానంగా భగవాన్! మీకు తెలియదా? మీకు అన్ని విషయాలు తెలుసు. తెలిసి కూడా మీరు నన్ను ప్రశ్నిస్తున్నారు. మీకు సర్వం తెలుసు కదా! నేను చాలా పొరబాటు చేశాను. నన్ను క్షమించండి అని మరొక్కసారి ఆర్తితో ఆయన ప్రార్థించగా స్వామి ఆయన్ని ఎంతో ఆదరంగా దగ్గరకి తీసుకున్నారు. ఇద్దరూ కలిసి మౌనంగా నడవ సాగారు
  
స్వామి నారాయణ మంగళ హారతి 

అమృత స్పర్శ కలిగినటువంటి స్వామి ముక్తానంద గారు మాటల్లో చెప్పలేనటువంటి ఒక తన్మయావస్థలో   బ్రహ్మాండ మైనటువంటి బ్రహ్మానందాన్ని అణువణువునా అయన పొంద సాగారు. ఆయనలో దాగినటువంటి కవితత శక్తి విజ్రుంభించింది. మొట్టమొదటి సారిగా అయన స్వామి నారాయణ మీద ఒక మంగళ హారతి చెప్పారు. అది అప్పట్నుంచి ఇప్పటికీ ఆయన చెప్పిన మంగళ హారతి ఆయన ఆలయంలో భక్తులందరూ పాడుతూ ఉంటారు. విధంగా పరమ భక్తుడైనట్టి , మహాత్ముడైనట్టి స్వామి ముక్తానంద గారిలో ఉన్నటువంటి చిన్న లవలేశమై నటువంటి సందేహాన్ని శ్రీ రామానంద స్వామి గారి ద్వారా నివృత్తి చేసి ఆయన్ని పరమ భక్తుడిగా మార్చేశారు

స్వామి ముక్తానంద స్వామి చెప్పి నటువంటి మంగళ హారతి చాలా ప్రహారం చెందింది ప్రప్రథమంగా స్వయంగా భగవాన్ స్వామి నారాయణ ని ఒక ఆసనంలో కూర్చో బెట్టి సంస్థానంలో హారతి ఇస్తూ ఒక తన్మయావస్థలో, ఆనందావస్తలో స్తోత్రాన్ని చేయటం జరిగింది.