N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Saturday, 29 November 2014

SwamiNarayan - Episode 35

సూత్రా మణి  యజ్ఞం
ఆ రోజుల్లో గుజరాత్ లో తాంత్రిక పూజలుశక్తి పూజలుయజ్ఞాలు చేస్తుండేవాళ్ళు. గుజరాత్ లోనే ఒక గ్రామంలో జగజీవన్రామ్కుబేర్ అన బడే ముగ్గురు సోదరులు ముగ్గురు వేర్వేరు రాజుల దగ్గర అమాత్యులుగా పని చేస్తుండే వాళ్ళు. ఆ ముగ్గురు కూడా అమ్మవారి భక్తులు. ఆ సోదరులు ఒకసారి సూత్రామణి అనే అమ్మవారికి సంబంధించిన ఒక యజ్ఞం చేయాలని తలిచారు. ఆ ముగ్గురు కూడా ఎంతో భక్తీ శ్రద్ధలతో అమ్మవారిని ఉద్దేశించి “తల్లీ ! నీ దయ వల్లనీ అనుగ్రహం వల్ల మేము ముగ్గురు సోదరులం మహారాజుల వద్ద అమాత్యులుగా పని చేస్తున్నాము . మాకు జీవితంలో కావలసిన అన్ని సుఖాలు కూడా మాకు అందించావు. మేము సూత్రామణి అనే యజ్ఞం చేయాలని సంకల్పించాము. చుట్టు  ప్రక్కల గ్రామాల్లో పట్టణాలలో ఉన్న అందరినీ ఆహ్వానించి పెద్ద ఎత్తున చేయాలని మేము అనుకుంటున్నాము. కాబట్టి మేము చేసే యజ్ఞానికి నీవు తప్పకుండా ప్రత్యక్షంగా రావాలివచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలి” అని ఆ తల్లిని  వేడుకున్నారు.

ఒక రోజు కుబేర్ అనబడే చిన్న సోదరుడు జగ్జీవన్రాం వాళ్లిద్దరినీ ఉద్దేశించి అన్నల్లారా ! మన ఊళ్లోనే సుందర్ గారి ఇంట్లో స్వామినారాయణగారు వేంచేసి ఉన్నారు,మీకు తెలుసా ? అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా ఒక సోదరుడు “చాలా ఆశ్చర్యంగా ఉందే ! వింతగా ఉందే ! ఎవరీయనభక్తులు భగవంతుని దర్శించాలనుకుంటే  గుడికి వెళ్ళతారు కాని ఇంట్లోనే ఒక మనిషిని పెట్టుకుని ఆయన్ని దేవుడిలాగా భావిస్తుంటారాఏమిటో నాకేమీ అర్థం కావడం లేదు” అని అన్నాడు. సరే ! ఇంతకి ఏం తెల్చుకున్నావుఅని కుబేర్ ని అడిగితే జగ్జీవన్ “అన్నా ! మీరలా ఆలోచించ కూడదు. స్వామి నారాయణ గారు  ఎలాగో మన ఊరికి వచ్చారు కదా ! ఆయన్ని కూడా మనం యజ్ఞానికి పిలుద్దాం. తప్పేముంది?” అని నా నిశ్చయం తర్వాత మీ ఇష్టం. దానికి సమాధానంగా అగ్రజుడు కొంచెం కఠినంగా ఉక్రోషంగా పౌరుషంగా నీకు పిలవాలని ఉంటే పిలువు. ఆయన వచ్చినందు వల్ల మనకు ఒరిగేదేమీ లేదుసౌభాగ్యం ఏమీ లేదు. వస్తారు . అందరిలాగా భోజనం చేసి వెళ్ళతారు. అంతే కదా !  పిలు. నాకేమీ అభ్యంతరం లేదు అని పరుషంగానే మాట్లాడాడు. అందరిలో చిన్నవాడైన కుబేర్ స్వయంగా స్వామి నారాయణ ఉన్న ఇంటికి వెళ్లి ఆయన్ని యజ్ఞానికి రమ్మని ఆహ్వానించారు . స్వామీజీ చాలా సాదరంగా తప్పకుండా వస్తానని చెప్పారు.

అన్నమాట ప్రకారంగానే స్వామి నారాయణ గారు యజ్ఞ మండపానికి వచ్చాక అక్కడ ఉన్న జనులందరూ స్వామి నారాయణకి జయ జయ ధ్వానాలు పలికారు. స్వామి నారాయణ గారి ప్రక్కన ఉన్న ఒక శిష్యుడు స్వామి నారాయణతో “ఈ ముగ్గురు సోదరులు కూడా ముగ్గురు వేర్వేరు రాజుల దగ్గర అమాత్యులుగా పని చేస్తున్నారు. వీరిలొ పెద్ద వాడైన జగ్జీవన్ కి కొంచెం అహంకారం ఎక్కువ. ఎప్పుడూ ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతుంటాడు” అని చెప్పాడు. అక్కడ చేరిన వాళ్ళలో చాలా మంది స్వామి నారాయణ భక్తులు మిగతా వాళ్ళందరూ కూడా ఈ జగ్జీవన్ కి చాలా గర్వంఅహంకారంకూడా అని స్వామితో  చెప్పారు . పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలో కూడా తెలియదు కదా ! స్వామి నారాయణ గారు కూడా వచ్చారు . ఏం జరుగుతుందో అని కుతూహలంగా చూస్తున్నారు.ఇంతలో స్వామి నారాయణ గారుయజ్ఞ మంటపానికి  వచ్చి ఉచితాసనం మీద కూర్చోగానే అందరూ ఒక్క సారి "స్వామి నారాయణ కి జై","స్వామి నారాయణ కి జై"  అని జయ జయ ధ్వానాలు చేసారు. స్వామి వారు చాలా ప్రశాంతంగా కూర్చుని అక్కడ జరుగుతున్నటువంటి యజ్ఞాన్ని గమనిస్తూ ఉన్నారు. పూర్ణాహుతి సమయానికి బ్రాహ్మణులందరూ   కూడా వచ్చారు. ఇంతలో కుబేర్ వచ్చి స్వామీ ! యజ్ఞం పరి సమాప్తం అయి పోయింది. ఇప్పుడు పూర్ణాహుతి కాబోతుంది అని విన్నవించుకున్నాడు. బాగానే ఉంది ఈ ప్రక్కన మేకలన్నింటినీ కట్టారు ఎందుకు ?అని ప్రశ్నించారు . దానికి సమాధానంగా జగ్జీవన్ కల్పించుకుని అవన్నీ హోమానికి బలిగా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి అదే ఆహారాన్ని మేము భక్తులకి పెడతాము అని చెప్పాడు. దానికి సమాధానంగా స్వామి నారాయణ “జగ్జీవన్ అన్నా ! యజ్ఞంలో ఈ అమాయకమైన సాధు జంతువైన ఈ మేకల్ని బలి ఇవ్వడం అమ్మవారికి నైవేద్యం పెట్టడం చాలా పాపం. మీరు బ్రాహ్మణులై ఉండి  కూడా ఒక మేకని చంపుతూనే ఎలా చూడ గలుగుతారు దానివల్ల మీ బ్రాహ్మణత్వం నశిస్తుంది పాపం ముంచుకొస్తుంది. అమ్మవారికి పాలతో చేసిన పరమాన్నం ఎంతో ఇష్టం కాబట్టి   మీరు పరమాన్నాన్నే నైవేద్యంగా పెడితేనే బాగుంటుంది.

అమాయకమైన ఈ మేకల్ని దయ చేసి మీరు వదిలి వేయండి . వాటిని హింసించ వద్దు. యజ్ఞంలో హింస అనేది జరగకూడదు. దానివల్ల అనేక ఉపద్రవాలు కలుగుతాయి. దయచేసి మీరు వాటిని వదిలివేయండి” అని విన్నవించు కున్నారు. జగ్జీవన్ గారి భార్య కూడా మీరు స్వామిగారు చెప్పినట్లే చేయండి అప్పుడు మనకి అన్ని విధాల కలిసి వస్తుంది కాబట్టి మీరు వాటిని వదిలి వేయండి అని అతన్ని ప్రార్థించింది. కాని జగ్జీవన్ చాలా కౄరంగాక్రోధంతో స్వామి ! మీరు మీ పని చేయండి. మేము మిమ్మల్ని పిలిచాము. యజ్ఞానికి వచ్చారు. యజ్ఞం చూడండి. అంతే కాని మీరు మేము చేసే కార్య కలాపాలలో జోక్యం చేసుకోకూడదు. తర తరాలుగా వస్తున్న సాంప్రదాయాన్ని మేము పాటిస్తున్నాము. ఇందులో తప్పేమీ లేదు. దానికి సమాధానంగా ఆయన చాలా ప్రశాంతమైన స్వరంతో ఇలా అన్నారు. నాయనా! ఎక్కడ అధర్మం జరుగుతుందో ఎక్కడ హింస జరుగుతుందో అక్కడ సజ్జనులు సాధువులు మాలాంటి వాళ్ళకి అలా జరక్కుండా చూడవలసిన బాధ్యత మాకు ఉంది. కాబట్టి నేను ఎంతో వినయంగా అడుగుతున్నాను. దయచేసి ఇటువంటి హింసా పూరితమైన యజ్ఞం చేయకండి. అమాయకమైన ఆ సాదు జంతువులని వదిలి వేయండి అని మరింకోకసారి ప్రార్థించారు. దానికి జగ్జీవన్ “స్వామీ ! మీకామాత్రం తెలియదా మన పురాణాలలోవేదాల్లో ఉంది కదా ! మనం ఏ జంతువునైతే బలి ఇస్తామో ఆ జంతువులు స్వర్గానికి వెళ్ళతాయి అని మీకు తెలియదా ?” అని గద్దించి అడగ్గా స్వామి శాంత స్వరంతో “నాయనా ! పురాణాల్లోవేదాల్లో కూడా ఎక్కడా హింసా యజ్ఞం చేయాలి అని చెప్ప లేదు. సరే నీవు చెప్పినట్లే బలి అయిన పశువులు స్వర్గానికి వెళ్ళతాయి మరి బలి ఇచ్చినవాడు ఎక్కడకి వెళ్ళతాడో తెలుసావాడు సరిగ్గా నరకానికే వెళ్ళతాడు. నరకంలో యమయాతనలు పడతాడు. బలి సమయంలో ఆ జంతువుకి మరణ వేదన ఎంత ఉంటుందో అంతకన్నా మూడు రెట్లు మరణ యాతన ఆ బలి ఇచ్చినవాడికి కలుగుతుంది. వాడు శాశ్వతంగా నరకంలోకే వెళ్ళతాడు.దానికి ప్రమాణంగా మీకు వేదాల్లో కాని పురాణాల్లో కాని ఎక్కడా ఏమీ లేదు నాయనా!” అని చెప్పారు. దానికి సమాధానంగా జగ జీవన్ క్రోధ స్వరంతో “స్వామీ ! పురాణాల్లో ,వేదాల్లో చెప్పినట్లుగానే యజ్ఞంలో బలికి మేము పశువుని సమర్పించుకుంటాము. పురాణాల్లోవేదాల్లో లేవని మీరు చెప్పినంత మాత్రాన మేము ఒప్పుకోము. మేము చేసే యజ్ఞంలో అమ్మవారికి తప్పకుండా బలికి నైవేద్యంగా ఈ మేకల్ని సమర్పించు కుంటాము” అని ఎదురు జవాబు చెప్పాడు. దానికి సమాధానంగా స్వామి నారాయణ గారు “వేదాల్లో కాని పురాణాల్లో కాని,దేవతలలో కాని ఇటువంటి అభిప్రాయం లేనే లేదు. వాళ్ళు హింసాకరమైన నైవేద్యాన్ని ఎప్పుడు స్వీకరించరు. అది కేవలం నీ అభిప్రాయం మాత్రమే. వేదాలుపురాణాలుదేవతల యొక్క అభిప్రాయం కానే కాదు. అందుకనే నేను నీకు మరొక్కసారి చెప్తున్నాను. దయ చేసి ఈ హింసను మానేయండి. మీకు  శ్రేయస్సు కలుగుతుంది. అనవసరంగా అమాయకమైనట్టి ఈ మూగ జీవులైన పశువుల్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టకండి. చక్కగా పరమాన్నం మీరు సమర్పించుకోండి” అని మరొక్కసారి ఎంతో వినయంగా చెప్పారు. దానికి సమాధానంగా జగజీవన్ “స్వామీ ! మీకు మరొక్కసారి చెబుతున్నాను. ఈ యజ్ఞంలో మా ఇష్ట ప్రకారమే ఈ పశువుల్ని సమర్పించు కుంటాము” అని చెప్పగా దానికి స్వామి నారాయణ గారు “ఎక్కడైతే హింస జరుగుతుందో ఎక్కడైతే అసత్య ప్రచారం జరుగుతుందో అక్కడ ఉన్న సాధువులు,సజ్జనులు దాన్ని నివారించాలి. అలా నివారించ లేని పక్షంలో వాళ్ళు అక్కడనుంచి నిష్క్రమించాలి. మీకు నేను శత విధాల చెప్పినా మీరు నా మాట వినటం లేదు కాబట్టి ఇక్కడ జరుగుతున్న హింసకి సాక్షిగా నేను ఉండలేను. ఆపలేనప్పుడు నేనిక్కడ ఉండడం మర్యాద కాదు కాబట్టి నేను తక్షణమే ఈ యజ్ఞశాలను వదిలి పెట్టి వెళ్లి పోతున్నాను” అని చెప్పేసి ఆయన లేచి గబ గబా తన శిష్యులతో సహా బయటకి వెళ్లి పోయారు. అక్కడ జనమంతా అవాక్కై  పోయారు. కుబెర్ మాత్రం అన్నగారికి ఎదురు చెప్పలేక పోయాడు వారి స్త్రీ జనానికి కూడా ఈ హింస ఏమాత్రం ఇష్టం లేక పోయినప్పటికీ జగ జీవన్ అందరిలో పెద్దవాడవటం వల్లా కోపిష్టి స్వభావం ఉండడం వల్లా  ఎవ్వరూ అతనికి ఎదురు చెప్పా లేక పోయారు.  
 ఏ యజ్ఞంలో పాపం జరుగుతుందోజంతు హింస జరుగుతుందో దాన్ని ఆపడం మా కర్తవ్యం. ఒక వేళ మేము ఆపలేకపోతే ఆ హింసని చూస్తూ ఇక్కడే ఉండి పోవడం మా అభిమతం కాదు కాబట్టి సంతులారా ! లేవండి ! మనం ఈ క్షణమే ఈ యజ్ఞ శాలనుంచి బయటకి వెళ్లిపోదాం అని చెప్పేసి స్వామి నారాయణ గారు కొంత ఆగ్రహంతో తన పరివారంతో ఆయన యాగాస్థలం నుంచి వెళ్లి పోయారు. జగజీవన్  స్వామి నారాయణ గారు వెళ్ళిపోగానే వెటకారంతో పాపం పుణ్యం   గురించి మహా నీతులు చెప్పడానికి వచ్చాడు. అసలు పాపం  ఈయనే మూట కట్టుకుంటున్నాడు కదా ! ఇంత పవిత్ర కార్యమైన యజ్ఞ తంతు పూర్తిగా చూడకుండానే మరి ఆ జంతు మాంసాన్ని ప్రసాదంగా స్వీకరించాకుండానే ఎంతో పాపం మూట కట్టుకుని వెళ్ళిపోయాడు. ఆహా ! వచ్చాడు పెద్దగా పాపం పుణ్యం చెప్పడానికి ! అని అతను ఆగ్రహంగా స్వామి నారాయణ గురించి మాట్లాడాడు. అక్కడ అతని పరివారమంతా అతను ఆగ్రహావేశాలతో ఉన్నందువల్ల ఏం మాట్లాడలేక పోయారు.ఇంకా ఏమిటీ చోద్యం చూస్తున్నారు?అంతా లేవండి. బలికి సిద్ధంగా అన్ని ఏర్పాట్లు చేయండి. ఆ పశువులన్నింటినీ ఆ బలిపీఠం దగ్గరకి తీసుకు వెళ్ళండి అని హుకుం జారీ చేసి జగ జీవన్ అక్కడునుంచి వెళ్లి పోయాడు. అమాయకమైన ఆ మేకలన్నీ కూడా బలిపీఠం దగ్గరకి తీసుకు వెళ్ళబడినాయి.

ఆ రోజు స్వామి నారాయణ గారి విశ్రామ మందిరంలో గంగారం గారు వచ్చి చేతులు జోడించి నమస్కరించి “ప్రభూ ! మీరు సాక్షాత్తు భగవంతుడి యొక్క అవతారంగానే భావిస్తాము. ధర్మానికి ప్రతీక అని మేము అనుకుంటూ ఉంటాము. మీరు వెళ్ళ బోతున్న యజ్ఞస్థలంలో జంతు హింస జరుగుతుందని తెలిసీ కూడా మీరు అక్కడకి వెళ్ళారుకాని అక్కడ మనం ఏమీ చేయలేక పోయాము కదా! హింస జరుగుతుందనితెలిసీ కూడా మీరు ఎందుకు యజ్ఞం చూడడానికి వెళ్ళారో నాకు అర్థం కావడం లేదు” అని ప్రశ్నించగా “అవును నిజమే! ఎక్కడ జంతు హింస జరుగుతుందిఎక్కడ పాపాలు జరుగుతున్నాయి అని తెలిసినప్పుడు సాధువు ఆ ప్రదేశానికి తప్పకుండా వెళ్ళాలి. అక్కడ జరగబోతున్న హింసని ఆపడానికి తనవంతు ప్రయత్నం తానూ తప్పకుండా చేయాలి. అది వారి యొక్క కర్తవ్య౦. అదే ఉద్దేశ్యంతో నేను కూడా అక్కడకి వెళ్లాను. నాకు అక్కడ జంతు హింస జరుగుతుందని  తెలుసు కాబట్టే నేను అక్కడకి వెళ్లి నా సహాయ శక్తులా అది అరికట్టడానికి ప్రయత్నం చేశాను. ఇది మన అందరి కర్తవ్యం కూడా కాబట్టి వెళ్ళవలసి వచ్చింది” అని జవాబు చెప్పారు. కేవలం సాధువులుపుణ్య పురుషులు,మహాత్ములే కాదు సాధారణమైన  మానవులు  కూడా ఎక్కడన్నా అన్యాయం జరుగుతుంది అపచారం జరుగుతుంది అని తెలిసి నప్పుడు తప్పకుండా ఆ ప్రదేశానికి వెళ్లి దాన్ని నిరోధించడానికి ప్రయత్నం చేయాలి. ఇది మానవుల యొక్క కనీస కర్తవ్యం అని చెప్పారు. “ప్రభూ! మీది సదుద్దేశ్యమే.అక్కడ జంతు హింసపాపాచారం ఆపడానికి మీరు వెళ్ళారు కాని ఏం జరిగింది మనం ఏమైనా చేయగలిగామాక్షమించండి ప్రభూ! సాక్షాత్తు భగవంతుని అవతార మైన మీరే ఈ పాపాచారాన్ని హింసని అరి కట్ట లేనప్పుడు మరి సామాన్య మానవులమైన మేము ఎలా నిరోధించగలం?” అని ఎంతో వినయంగా ప్రశ్నించాడు. ఇంతటి హింసని ఎవరు ఆపాలి ఎలా ఆపాలి ?  అని అతను తనలో తానూ అనుకుంటూ అక్కడనుంచి నిష్క్రమించాడు.

                        ఇక్కడ సూత్రామణి  యజ్ఞం జరిగే ప్రదేశంలో అందరూ స్వామి నారాయణని విమర్శిస్తూ మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో అక్కడ రాజు గారి దగ్గర పని చేస్తున్నా ఒక పెద్ద అధికారి భ్రాంతి  ఫతే మహమ్మద్ గారు ఈ సోదరుల ఆహ్వానాన్ని మన్నించి ఆ యజ్ఞం జరిగే ప్రదేశానికి విందు కోసం వేంచేశారు. ఆయనని చూడగానే ఆ సోదరులు రండి! రండి! ఫతే మహమ్మద్ గారు! మీ కోసమే ఎదురు చూస్తున్నాము అని ఎంతో స్వాగత సత్కారాలు పలికారు. భ్రాంతి  ఫతే మహమ్మద్ గారు ఆసనాన్ని స్వీకరించాక మీరు ఈ యజ్ఞానికి అందరినీ ఆహ్వానించి ఉంటారు కదా! అందులో మీరు ఆయన్ని కూడా పిలిచే ఉంటారు కదా ! అని అనగా వారంతా ఎవరు ఆ ప్రముఖవ్యక్తి ?అని ఎదురు ప్రశ్న వేయగా ఇంకెవరూ మీరు వారిని "అల్లా" అనండి "ఈశ్వరుడు"అనండి స్వామినారాయణ! అతన్ని మీరు తప్పకుండా పిలిచే ఉంటారు కదా ! అని ప్రశ్నించారు. “ఆహా !” “ఆయనా !” “ఆయన్ని మేము పిలిచాము. వచ్చారు కూడా. కాకపోతే వెళ్లి పోయారు కూడా ! ప్రసాదం కూడా తీసుకోకుండా ఆయన వెళ్ళిపోయారు” అని చెప్పగా “అదేమిటీ ప్రసాదం కూడా తీసుకోకుండా ఆయన వెళ్లి పోయారా ?” అని ఫతే మహమ్మద్ గారు ప్రశ్నించారు. జగ్ జీవన్ ఎంతో కోపంగా లేచి “ఫతే మహమ్మద్ గారూ !” “మీరు అతన్ని "అల్లా"అంటున్నారు. నిజానికి అతను అల్లా కాదు అతను భగవంతుడు  కానే  కాదు. అతను తానూ భగవంతున్ని అని చెప్పుకుంటున్నాడు. అతను మేము చేస్తున్న ఈ యజ్ఞాన్ని ఆపడానికి వచ్చాడు. జంతు బలిని నిరోధించడానికి ప్రయత్నం చేసాడు. అతడు అల్లా ఎందుకవుతాడు అతను పాఖండుడు మంచి వాడు కాదు” అని ఆగ్రహంతో చెప్పగా స్వామి నారాయణ అంటే ఎంతో భక్తి భావం ఉన్నా ఫతే మహమ్మద్ గారికి చాలా కోపం వచ్చింది. అతను స్వామి నారాయణ గారి గురించి అలా దుర్భాష లాడ కూడదని జగ జీవన్ ని హెచ్చరించారు. శాస్త్రాల్లో చెప్పబడిన వాటికి విరుద్ధంగా ఆయన యజ్ఞం చేయమని చెప్పారు అతడు అల్లా ఎలా అవుతాడుమీలాంటి మూర్ఖులకి మాత్రమె అతను అల్లాఈశ్వరుడు,భగవంతుడు అవుతాడు కాని మాలాంటి వారికి కాదు అని జగ్ జీవన్ గట్టిగా సమాధానం చెప్పాడు. దానికి ఎంతో కోపంగా ఫతే మహమ్మద్ గారు నాలుకని సంభాలించుకోండి అని హెచ్చరించారు. "మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి . లేక   పోతే ... లేక పోతే ...” అని కోపంగా మాట్లాడారు. “లేకపోతె ఏం చేస్తారు  మీరు?” అని జగ జీవన్ గద్దించి ఫతే మహమ్మద్  గారిని అడిగాడు. ఫతే మహమ్మద్ గారు దానికి సమాధానంగా “చూడండి ! మీరు స్వామి నారాయణ గారి గురించి ఇలా నిందా వాక్యాలు మాట్లాడడంఆయన్ని గురించి చెడ్డగా చెప్పడం నేను భరించలేను. జాగ్రత్తగా ఉండండి. ఇంకొక శబ్దం ఆయన్నిగురించి చెడ్డగా మాట్లాడితే ఏం జరుగుతుందో ఒక్కసారి చూసుకోండి” అని అనగా ఆ ! ఏం జరుగుతుంది నీవేం చేస్తావు అని జగ్ జీవన్ గద్దించి అడిగాడు. ఇదంతా వింటున్న స్త్రీ పరివారమంతా చాలా భయపడ సాగారు. అయ్యో ! స్వామి నారాయణ గారు నా భర్తకి ఎంతో నచ్చ చెప్పారు జంతు హింస చేయ కూడదని దాని వల్ల పాపం కలుగుతుందని. ఈయనేమో ఆయన మాట వినలేదు. ఇప్పుడు ఆవేశాలు ,రోషాలు కట్టలు తెంచుకుని వస్తున్నాయి. హారి భగవంతుడా ! ఇప్పుడు ఏం జరుగుతుందో ! అని ప్రాణాలు బింక పెట్టుకుని కూర్చున్నారు. కాని ఎవ్వరికీ కూడా మధ్యలో మాట్లాడాడానికి ధైర్యం చాలటం లేదు. చాలా కోపంతో ఉన్న ఫతే మహమ్మద్  గారు తన ఒరలో నుంచి కరవాలాన్ని బయటకు లాగారు. అది చూసి జగ్ జీవన్ “మేము కూడా ఈ కరవాలంతో ఆటలాడు కోన గలము. ఇది మాకు కూడా క్రీడే . మేమేమీ చేతులకి గాజులు తొడుక్కుని కూర్చోనలేదు. మేము కూడా మీతో యుద్ధం చేయగలము. ఇలా కత్తిని చూపి బెదిరించి స్వామి నారాయణ భగవంతుడని మాచేత ఒప్పించుకోవాలని అనుకుంటున్నారేమో ! అది ససేమిరా జరగదు” అని చెప్పి జగ్ జీవన్ కూడా తన కరవాలాన్ని బయటకి లాగాడు. ఆయన ఫతే మహమ్మద్  గారికి కత్తి చూపిస్తూ నీవు పరమ మూర్ఖుడివి . నీవు వెంటనే ఇక్కడ్నుంచి వెళ్లి పోవాల్సింది . నా సమక్షంలో ఉండటానికి వీల్లేదు అని గద్దించి పలకగా ఫతే మహమ్మద్  గారు అతనితో కత్తి యుద్ధానికి వెంటనే తలపడ్డారు. ఇద్దరూ ఘోరమైన యుద్ధం చేయసాగారు.స్త్రీ పరివారమంతా అటూ ఇటూ పరిగెత్తుతూ అయ్యో ! రక్షించండి ! రక్షించండి ! యుద్ధం చేయకండి అని గట్టిగా ఆర్తనాదాలు చేయ సాగారు. ఆ యుద్ధంలో ఫతే మహమ్మద్  గారి చేతిలో జగ్ జీవన్ హతుడయ్యాడు.స్త్రీ పరివారం యొక్క  హృదయ విదారకమైన రోదనలతో ఆ చుట్టూ ప్రక్కల ప్రదేశమంతా ప్రతిధ్వనించ సాగింది. మరి   మధ్యాహ్నం జంతు బలి జరుగుతున్నప్పుడు ఆ ప్రాంగణమంతా జంతువుల రోదనలతోఆర్తనాదాలతో  నిండి పోయింది. ఇప్పుడు జగ జీవన్ యజ్ఞం తలపెట్టిన యజమాని మృత్యువాత పడడంతోటి అతని భార్య హృదయవిదారకంగా ఏడవసాగింది. స్వామీ ! “మీరు ప్రభు స్వామి నారాయణ గారు  చెప్పినట్లు ఈ పాపాచారాన్నిజంతు హింసని కనుక మాని ఉంటే ఇలాంటి అవాంతరాలు వచ్చి ఉండేవి కావు కదా !” “చూడండి ! ఆయన చెప్పిన మాట వినక పోవడం వాళ్ళ ఎంత ఘోరం జరిగింది” అని వాళ్ళు పడే పడే ఏడవసాగారు. ఈ వార్త విన్న స్వామి నారాయణ గారి శిష్యులు ఆయన దగ్గరకి వచ్చి ప్రభూ ! మీరు సర్వాంతర్యామి ! మీకు అన్నీ తెలుసు. అక్కడ జంతు హింస జరగబోతుంది . మీరు నివారించే ప్రయత్నం చేస్తారు అది విఫలమవుతుందనిపాపానికి పరిహారంగా జగ జీవన్ హత మార్చ బడతాడని కూడా మీకు తెలుసు అయినా మీరు ఏమీ తెలియనట్టుగా ఉండి పోయారు . ప్రభూ ! మీ లీలలన్నీ మాకెప్పటికప్పుడు  కొత్తగానే ఉంటాయి కదా! అవును మాంసాహారం తీసుకోవడం జంతువులని హింసించడంమన జిహ్వ రుచి కోసం ఇంకొక ప్రాణిని హింసించి దాన్ని భుజించడమనేది చాలా పాపం. మంచిది కాదు. అది ఎక్కడ జరుగుతున్నా ఆపవలసిన ప్రయత్నం మనది. “గంగారాం గారూ !” “ఇది రాక్షస క్రుత్యంతో సమానం. మనం చేసే పాపాలకి మనం తప్పకుండా పరిహారం చెల్లించక తప్పదు. ఏ మనిషికైతే తన మాటల్లో తన శక్తి మీద అహంకారం ఉంటుందో ,గర్వం ఉంటుందో అతను ఎప్పుడైతే ప్రభువు (భగవంతుడు)మాటలు వినడో  పెడ  చెవిన  పెడతాడో  స్వయంగా  అతను చేస్తున్న  ఆ పని అతనిని నాశనం చేస్తుంది. అందుకనే మహాత్ములు పెద్దలు చెప్పిన సలహా వింటే వారికి శ్రేయస్సు కలుగుతుంది.” అందరూ స్వామి నారాయణగారికి   జై అంటూ జయ జయధ్వానాలు చేశారు.