N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Thursday, 5 February 2015

SwamiNarayan - Episode 39

 ధర్మ ప్రచారం
స్వామి నారాయణ గారు తన అనుచరులందరినీ సమావేశ పరిచి వారితో మనం మంచి పని చేయాలని అనుకున్నపుడు దానిలో ఎటువంటి ఆలస్యం చేయ కూడదు. కాబట్టి  మీరందరూ కూడా నలుగురు కలిసి ఒక జట్టుగా ఏర్పడి రేపు ఉదయం ప్రాతఃకాలమే మీకు నిర్దేశించిన ప్రదేశాలకి, గ్రామాలకి, పట్టణాలకి  వెళ్లి ధర్మ ప్రచారం చేయండి. ప్రజలకి మంచీ చెడు అనే విచక్షణా జ్ఞానాన్ని కలిగించండి. దురలవాట్లు మానిపించి ధర్మ మార్గంలోనికి వచ్చేటట్టుగా ప్రయత్నం చేయండి అని వారికి అనేక రకమైన సూచనలు ఇస్తూ పోయారు.
ప్రస్తుతం ప్రజలందరూ కూడా చాలా అంధకారంలో ఉండి పోయారు. వాళ్ళలో ఉన్నటువంటి రాక్షస ప్రవృత్తిని మీరు పారద్రోలి, వారిని వ్యసనముక్తులిగా చేసి,  శాంతిసుఖాలు అనుభవించేటట్లుగా వారికి మీరు మార్గోపదేశం చేయాలి. మనం వెళ్ళుతున్న మార్గంలో మనకి చాలా పరిక్షలు ఎదురవుతాయి. ఎన్నో కష్టాలు కలుగుతాయి. సంఘంలో దుష్ట శక్తులు మిమ్మల్ని నిరోధిస్తాయి. అయినప్పటికీ మీరు ధైర్యం కోల్పోకుండా ప్రజలకోసం, ఈ సమాజం కోసం ధర్మప్రచారాన్ని కొనసాగించండి, “కళ్యాణమస్తు”, అని దీవించి వారిని పంపించి వేశారు.
           ధర్మ ప్రచారం కోసం స్వామి నారాయణ గారి అనుచరుల ప్రయాణం
స్వామి నారాయణగారి ఆదేశం ప్రకారం మరునాడు ప్రాతఃకాలమే ఆయన అనుచరులందరూ చిన్న చిన్న జట్లుగా విడిపోయి వారికి నిర్దేశించిన ప్రణాళిక ప్రకారంగా వివిధ గ్రామాలకి, చిన్న చిన్న పట్టణాలకి ధర్మప్రచారం కోసం బయలుదేరారు. ఆ రోజుల్లో సంఘంలో చాలా మూఢాచారాలు, మూఢనమ్మకాలు ఉంటూ ఉండేవి. కరువుకాటకాలతో ప్రజలంతా సతమవుతూ ఉండేవారు. ఎక్కడకి వెళ్ళినా స్వామి నారాయణగారి శిష్యులు నలుగురు కలిసి జట్టుగా వెళ్ళుతుండేవాళ్ళు. అందులో ఒకడు నాయకుడిగా వ్యవహరిస్తూ ఉండేవాడు. నలుగురిగా వెళ్ళుతున్న ఆ జట్టు సభ్యులు ఒక చిన్న గ్రామపు పొలిమేరలో ప్రవేశించగానే అక్కడ పొలంలో ఒక బీద  రైతు పొలం దున్నుతూ కనిపించాడు. ఆ నలుగురూ అక్కడే ఆగిపోయినాక ఆ నాయకుడు వారితో ఇలా అన్నాడు. “చూడండి ! ఈ రైతు ఎంత కష్టపడుతున్నాడో , ఎండలో ప్రొద్దునంతా కష్టపడి మరి సాయంత్రం ఇంటికి వెళ్లేసరికి బాగా అలసి పోయి ఏవో రెండు ముద్దలు నోట్లో వేసుకుని పడుకుంటాడు కదా !” “అవును. నిజమే “ అని వాళ్ళు అన్నారు. స్వామి నారాయణగారు చెప్పినట్లుగా మనం ఇతనితో ధర్మప్రచారం మొదలు పెడదాం అని అనగా, స్వామీ ! అతను ఈ ఎండలో ఎంత కష్ట పడుతున్నాడో, అతని ధ్యాసంతా పొలం దున్నడంలోనే ఉంది. ఈ సమయంలో అతను మనం చెప్పేది వింటాడా? అని ఒకడు తన సందేహాన్ని వ్యక్త పరిచాడు స్వామి నారాయణ గారి ప్రవచనాలు చెప్పాలంటే మనం వేదిక మీదకి వెళ్లి ఉపన్యాసాలు ఇచ్చినట్లు కాదు కదా ! ఎక్కడంటే అక్కడ మనం మాట్లాడవచ్చును. కనీసం స్వామి నారాయణ గారి పేరైనా అతని చెవిలో పడుతుంది కదా! అని ఆ నాయకుడు తన అభిప్రాయాన్ని చెప్పాడు. మీరు ముగ్గురూ ఇక్కడే ఉంటె నేను అతని దగ్గరకి వెళ్లి మాట్లాడి ఇప్పుడే వస్తాను అని చెప్పి ఆరైతుకి దగ్గరగా వెళ్ళడం మొదలుపెట్టాడు. 

చాలా ఎండగా ఉంది. రైతు ధ్యాసంతా పొలం దున్నడంమీదనే ఉంది. స్వామి నారాయణగారి అనుచరుడు అతని దగ్గరకి వెళ్లి “స్వామి నారాయణగారికి జై” అని అనగానే ఆ రైతు చాలా ఆశ్చర్యంగా ఆయన్ని తేరిపారగా చూడ సాగాడు. అప్పుడు ఆయన ఇలా చెప్పాడు. భగవంతుని దయ వల్ల ఎంతో దుర్లభమైనటువంటి మానవ జన్మ నీకు వచ్చింది. నీకు ప్రాణముంది అలాగే ఈ పశువులో కూడా ప్రాణముంది అని ధర్మప్రవచనాలు మొదలు పెట్టగానే ఆ రైతు ఏమీ వినకుండా తన పని తానూ చేసుకుంటూ ఆ ఎడ్లని అదిలించ సాగాడు.  అయితే స్వామి నారాయణ గారి శిష్యుడు మాత్రం వదిలి పెట్టకుండా, మీరు నేను చెప్పేది కొంచెం వినండి అంటూ వెంట పడసాగాడు. ఆ రైతు చాలా విసుగ్గా ఏమిటిది ? నా వెంట ఇలా ఎందుకు పడుతున్నారు? అని కసురుకున్నాడు. అప్పుడు స్వామి నారాయణ గారి శిష్యుడు చూడండి భగవంతుడు మీకు మనవ జన్మనిచ్చాడు. 

మనుష్యులు మాత్రమే ఆలోచించ గలుగుతారు. కాబట్టి ఆత్మ జ్ఞానం కోసం మీరు అ భగవంతుడ్ని గురించి ఆలోచిస్తూ విమర్శిస్తూ ఉండాలి. విమర్శనాత్మక జ్ఞానం పశువులకి లేదు. మీకు మాత్రమే ఉంది. మీరు నిష్ఠగా రోజు రెండు మాలలు స్వామి నారాయణ గారి గురించి జపం చేస్తే బాగుంటుంది అని చెప్పగా ఆ రైతుకి ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. అసలే ఎండగా ఉంది. పైగా బక్క ప్రాణం. అతనికి చాలా విసుగు వచ్చింది. చెప్పారు కదా! ఇక వెళ్ళండి. నా పనికి అడ్డం రావద్దు. నా పనిని నన్ను చేసుకోనివ్వండి అని కసురుకున్నాడు. మిగతా ముగ్గురు అనుచరులు కూడా దూరం నుంచి ఈ సంభాషణ అంటా వింటూ ఏం జరుగుతుందా అని ఆత్రుతగా చూస్తూ ఉన్నారు. ఆ రైతు చాలా విసుగ్గా మీరేదో జపమాలలు తిప్పమని చెప్పారు కదా! ఆ జపమేదో మీరే నాకోసం చేయండి . ప్రస్తుతం ఇప్పుడు మీరు నా పనికి అడ్డం రావద్దు అని చెప్పి విసుగ్గా ముందుకి వెళ్లి పోయాడు. అయినా ఆయన పట్టు వదలకుండా, కాదు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. భగవంతుడు  మానవ రూపంలో ఈ భూమి మీద అవతరించాడు అని అనగా ఆ రైతు సరే! భగవంతుడు అవతరించాడు కదా ! మీరు వెళ్లి దర్శనం చేసుకోండి. మధ్యలో అవన్నీ నాకెందుకు చెప్తున్నారు? మీరు చెప్పేది ఒక్క ముక్క కూడా నాకర్థం కావడం లేదు. నాకెంతో పని ఉంది. నన్ను విసిగించ వద్దు. దయచేసి మీరు ఇక్కడ్నుంచి వెళ్లి పొండి అని చాలా కోపంగా అరిచాడు. అయినా అ శిష్యుడు అలాగే వెంట పడ సాగాడు. ఆ రైతుకి చాలా కోపం వచ్చింది. ఎంత చెప్పినా ఆ సన్యాసి వినకుండా వెంట పడడమూ, పదే పదే తన పనిలో జోక్యం చేసుకోవడమూ ఇదంతా చూసి చూసి విసుగెత్తి అతను ఇలా అన్నాడు. మర్యాదగా చెప్పితే నా మాటలు మీకర్థం కావడం లేదు. మీకు తగిన గుణ పాఠం చెప్పాలి, ఉండండి అని చెప్పి క్రిందకి వంగి బలంగా ఉన్న ఒక కట్టెను తీసుకుని అతని నెత్తి మీద గట్టిగా బాదాడు. ఆ దెబ్బతో స్వామి నారాయణుడి గారి శిష్యుడు “జై స్వామి నారాయణ” అంటూ  క్రిందకి కుప్ప కూలి పోయాడు. ఆ దెబ్బ తగిలిన చోటునుంచి రక్తం ధారగా ప్రవహించ సాగింది. ఇదంతా చూస్తున్న మిగతా అనుచరులు గబగబా పరిగెత్తుకుని వచ్చారు. ఆ సాధువు స్పృహ తప్పి పడిఉన్నాస్వామి నారాయణ స్వామి నారాయణ అని గొణుక్కుంటూనే ఉన్నాడు. ఏమిటీ మీరు చోద్యం చూస్తున్నారు? తీసుకుని వెళ్ళండి అని చెప్పగా వాళ్ళందరూ ఆయన్ని మోసుకుంటూ వారు బస చేసిన ప్రదేశానికి తీసుకునివెళ్లి పోయారు.

కాసేపటికి స్వామినారాయణ గారి అనుచరుడు లేచి గంభీరంగా ఉండడంతో మిగతావాళ్ళు మీరేమిటంత ఆలోచిస్తున్నారు? అని ప్రశ్నించారు. ఏమీ లేదు. మనం సాయంత్రం ఈ గ్రామంలో గుడి దగ్గర ఉన్న రచ్చ బండ దగ్గరకి వెళ్దాము. గ్రామంలో ఉన్న ప్రజలందరూ సాయంత్రం పూట అక్కడ గుమిగూడతారు కదా! బహుశా ఆ రైతు కూడా అక్కడకి రావచ్చును. మనం వెళ్ళితే బాగుంటుందేమో! అని అన్నాడు. ఏమిటీ స్వామీ ! మీకు అక్కడ మళ్ళీ దెబ్బలు తినాలని ఉందా? ప్రాణాలమీద ఆశ లేదా అని అడిగారు. మన ప్రభువు మనకి ఏం చెప్పాడు? ఎప్పుడూ అధైర్య పడకూడదు. ధైర్యంగా ఉండాలి అని చెప్పారు కదా! ప్రాణాలు తీసేవాళ్ళు ఎంతమంది ఉన్నా ఆ  ప్రాణాల్ని రక్షించే ప్రభువు వేయి రకాలుగా మనలని కాపాడుతూ ఉంటాడు. మనం అక్కడకి వెళ్ళదాము. ఆ రైతు అక్కడ ఉంటాడేమో చూద్దాం అని ఆయన పలికాడు. ఇక్కడ రైతులందరూ కూడా ప్రతి సాయంత్రం పిచ్చాపాటి మాట్లాడుకునే స్థలంలోనే అందరూ కలిసి ఇష్టాగోష్టి చేస్తూ ఉన్నారు. అక్కడ ప్రొద్దున్న స్వామి నారాయణ గారి శిష్యుణ్ణి కొట్టిన రైతు తనతోటి రైతులతో అదే విషయం చెప్తున్నాడు. అసలే ఎండ మండుతూ ఉండాలి. నేను నా పనిలి మునిగి ఉన్నాను. ఆ సాధువు వచ్చి ఒకటే వేదాంతం ఏదో చెప్తూ ఉన్నాడు. ఒక్క ముక్క కూడా నాకర్థం కాలేదు. నా పని మధ్యలో అడ్డం రావద్దు అని ఎన్నిసార్లు చెప్పినా వినడంలేదు. ఇంక నాకు తిక్క రేగి ఒక దుడ్డు కర్ర తీసుకుని నెత్తిమీద ఒక్కటి మోదాను. అంతే సంగతులు అనగా అందులో కొందరు పకపకా నవ్వారు. చూస్తూ ఉండండి. ఈ దెబ్బ తిన్న సాధువు మిగతా శిష్యుల్ని తీసుకుని ఈ గ్రామంనుంచి  వెళ్ళిపోతారు సుమా! అని అతను చెప్పసాగాడు. “స్వామి నారాయణ”, “స్వామి నారాయణ”, అని నేను జపం చేస్తూ ఉంటే నా కడుపు నిండుతుందా? మీరు చెప్పండి అని అనగా అందరూ నవ్వారు.                
ఆశ్చర్యంలో ఆశ్చర్యం ఏమిటంటే ఎదురుగుండా ఆ దెబ్బ తిన్న శిష్యుడు సాధువు మిగతా శిష్యుల్ని తీసుకుని అతని దగ్గరకి వచ్చాడు. నాయనా! నీ ఆలోచనలు చాలా తప్పు. నీ లాఠిలో ఉన్న శక్తి కన్నా భగవాన్ స్వామి నారాయణ పేరులోనే ఎక్కువ శక్తి ఉన్నది. నీ లాఠికున్నశక్తితో ప్రాణం తీయవచ్చును. కాని సామి నారాయణ అనే లాఠి వాడినప్పుడు అది ప్రాణం పోతుంది. ప్రాణాన్ని నిలుపుతుంది సుమా! అని చెప్పగా వారు విసుక్కున్నారు. నీవు నడిచేటప్పుడు నీవు వాడుతున్న లాఠి నీకు ఊతంగా పనికి వస్తుంది. స్వామి నారాయణ అనే లాఠి వాడినప్పుడు నీ జీవితాన్నే, మంచి మార్గంలోనికి తీసుకు వెళ్ళుతుంది. నీ లాఠి ప్రజలందరినీ దడిపిస్తే, ప్రభువు యొక్క లాఠి ప్రజలందరికీ అభయం ఇస్తుంది. నీకు మృత్యువు అంటే భయముంది, కాని మాకు లేదు. ఎందుకంటే భగవాన్ స్వామి నారాయణ గారి అభయం మాకుంది. కాబట్టి సోదరా! నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విను అని అతను ఇంకా ఏదో చెప్పబోతుండగా ఆ రైతు ఆయన్ని కొట్టడానికి లేచాడు. అది చూసి వెంటనే మిగతా రైతు సోదరులందరూ అర్జున్! ఎందుకంత ఆవేశ పడుతున్నావు? అలా స్వామి మీద నీవు చేయి వేసుకోవడం చాలా తప్పు కదా ! అయినా ఆయన నీకేమీ చెడు చెప్పడం లేదు. నీ మంచికోసమే చెప్తున్నారు కదా! అని గట్టిగా పట్టుకుని ఆపారు. ఈ విధంగా ఆ రైతు నాయకుడు అర్జున్ని మెత్తగా  మందలించాడు. నీవు చాలా పొరబాటు చేశావు. ఈ సాధువు నీ మంచి కోసమే చెప్తున్నప్పుడు కొట్టడం అనేది మంచి పధ్ధతి కాదు కదా అని చెప్పి చేతులు జోడించి మా రైతు సోదరుని తరఫున నేను మీకు క్షమాపణలు చెప్పుకుంటున్నాను. దయ చేసి ఇతన్ని క్షమించండి అని చేపేసి అందరు కూడా అర్జున్ని కోప్పడి నీవు కూడా క్షమాపణలు కోరుకో అని చెప్పారు. అప్పుడు తను చేసిన తప్పేమిటో అర్జున్ తెలుసుకుని స్వామీ! నన్నుక్షమించండి” అనీ కాళ్ళ మీద పడబోతుండగా ఆ సాధువు అతన్ని వారించి నాయనా! క్షమించడానికి కాని , దండించడానికి కాని నేనెవర్నీ?అంతా ఆ ప్రభువే చూసుకుంటాడు. నేను అంత దూరంనుంచి “స్వామి నారాయణ” పేరు మీరందరూ పలుకుతుంటే వినాలని వచ్చాను. కాబట్టి మీరందరూ నాతోబాటే స్వామి నారాయణ గారి పేరు ఉచ్చరించండి అని చెప్పి “భగవాన్ స్వామి నారాయణగారికి జై” అని అనగానే అందరూ స్వామి నారాయణగారికి జయ జయ ధ్వానాలు చేశారు. అ సాధువు అందరినీ దీవించి అక్కడనుంచి విశ్రమించాడు.
ఆ సమూహానికి నాయకుడైన ఆ సాధువుగారు తన జట్టు సభ్యుల్నిఉద్దేశించి మీరందరూ వేరే దిశగా వేరే గ్రామానికి వెళ్లి ధర్మప్రచారం చేయండి. నేను ఈ గ్రామంలో కొన్ని రోజులుండి ఈ గ్రామ కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉంటాను అని చెప్పి వాళ్ళను పంపించి వేశాడు. అయితే ఆ జట్టులో మిగతా వాళ్ళు ముందు భయపడినా తమ నాయకుడికి స్వామి నారాయణ మీద ఉన్న భక్తీ విశ్వాసాలు ఎంతగా పని చేశాయో ప్రత్యక్షంగా చూశారు కాబట్టి ధైర్యం వచ్చి ధర్మ ప్రచారానికి వాళ్లకి నిర్దేశించిన గ్రామాలకి వాళ్ళు వెళ్లి పోయారు.
                                       గ్రామ పరిశుద్ధత
ఈ గ్రామంలో వెనక ఉండిపోయిన ఆ సాధు మహారాజు గ్రామంలో పర్యటిస్తూ, ఒక వీధిలోకి రాగానే ఆయన మీద మురికి నీళ్ళ వర్షం కురిసింది. ఒక ఇల్లాలు బక్కెట్లోని మురికి నీళ్ళు తీసుకు వచ్చి వీధిలోకి చల్లగా అవన్నీ వచ్చి ఆయన వస్త్రాల మీద పడ్డాయి. ఆయన నేమ్మిగా ఆ గృహస్థుని దగ్గరకి వెళ్లి , నాయనా! ఇలా మీ ఇంట్లో ఉన్న చెత్తంతా వీధిలో పారేయడం మంచిది కాదు. మీ ఆరోగ్యానికి హానికరం. మీ ప్రాంగణాన్ని శుభ్రంగా పెట్టుకుంటే మీకు ఈ జబ్బులు రావు.శారీరికంగా బాగుంటుంది. మానసికంగా ఉల్లాసంగా ఉంటుంది. ఈ ఊరి చివర ఉన్న ప్రదేశానికి వెళ్లి అక్కడ ఈ చెత్త పారవేస్తే మీ ప్రాంగణమంతా చాలా శుభ్రంగా ఉంటుంది కదా !ఈ వీధంతా చాలా చక్కగా శుభ్రంగా ఉంటుంది అని చెప్పారు. ఇదంతా విని ఆ గృహస్థుని భార్య  ఏమిటే నేను ఈ చెత్తంతా తీసుకుని అంత దూరం నడిచి వెళ్లి అక్కడ పారవేయాలా? అంటూ ఎంతో వెటకారంగా మాట్లాడింది. ఏమో మాట్లాడుతున్నారు. స్వామీ! అసలు మీరెవరు? మీరు ఇక్కడ ఏం చేతున్నారు? నాకు పెళ్ళయి నేను ఇక్కడకి వచ్చినప్పట్నుంచి చెత్త ఇక్కడే వేస్తున్నాను. ఇక్కడ చెత్త వేయకూడదని మాకెవ్వరూ ఇప్పటిదాకా సలహా ఇవ్వలేదు. మీరెవరు మాకు వచ్చి ఇటువంటి సలహాలిస్తున్నారు అని ప్రశ్నించారు.నాయనా! నేను భగవాన్ స్వామి నారాయణగారిఅనుచరుణ్ణి. ఆయన ఆదేశం ప్రకారం ధర్మ ప్రచారం కోసం గ్రామం గ్రామం తిరుగుతూ ఉంటాను. స్వామి వారు శుచి శుభ్రత నేర్పించి , చెడు అలవాట్ల నుంచి ప్రజలను విముక్తుల్ని చేయమని మమ్మల్ని పంపించారు అని చెప్పాడు. స్వామీ! ఉపదేశాలు ఇవ్వడం చాలా సులభంగా ఉంటుంది కాని వాటిని ఆచరణలో పెట్టడం చాలా కష్టం. ఆ గృహస్థుడు, ఇక్కడ ఆచరణలో పెట్టడం చాలా కష్టం కాబట్టి మీరు ఇక్కడకి వచ్చి చెప్పవలసిందేమీ లేదు అని కసురుకున్నాడు. దానింకి సమాధానంగా ప్రశాంతంగా ఆ సాధువు నాయనా! ఒక పని చేయి. సంధ్యాసమయంలో కొంచెం సమయం తీసుకుని నీవు మా గురువుగారి ప్రవచనాలు వినడానికి రావాలి అని సలహా ఇచ్చ్ వెళ్లి పోయాడు. సరే! సరే! చూద్దాం లే! మీరు వెళ్లి రండి! అని చాలా దురుసుగా వాళ్ళు జవాబు ఇచ్చారు. “స్వామి నారాయణ్ గారికి జై” అనుకుంటూ ఆ సాధువు వెళ్ళిపోయాడు.
               ఆ రోజు ఆ గ్రామంలో చాలా మందికి చెప్పడం వల్ల ఆ స్వామి ఏం చెప్తారో వినాలని అక్కడ సాయంత్రం పూట చాలా మంది సమావేశమయ్యారు. ఆయన ముందు శుభ్రత గురించి చెప్పాడు. ఎక్కడ శుభ్రత ఉంటుందో అక్కడ పవిత్రత ఉంటుంది. ఎక్కడ పవిత్రత ఉంటుందో భగవంతుడు అక్కడ స్వయంగా ఉంటాడు. కాకపోతే అది మన ఇల్లు, మన వీధి, మన హృదయం, మన గ్రామంకాని కావచ్చును. ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ భగవంతుడు విరాజిల్లుతూ ఉంటాడు. అని ఆయన చెప్పారు. ఇలా మనం చెత్తాచెదారం వేయడం, మనస్సులో మాలిన్యమనే ఆలోచనలు పెట్టుకోవడం మంచిది కాదు కదా! మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? మన శరీరంలోని
కణ కణాల్లోఈశ్వరుడే ఉంటాడని, అలాంటప్పుడు  అటువంటి కణాల్లో మనం చెత్తా చెదారం వేస్తె బాగుంటుందా? ఆలోచించండి. భగవంతుడు మన జీవకణాల్లో, మన మనస్సులో, మన హృదయంలో ఉంటాడని శాస్త్రాలు చెప్తున్నప్పుడు మరి  మన శరీరాన్ని , మన మనస్సుని శుభ్రంగా పెట్టుకోవలసిన బాధ్యత మనకి ఉన్నది కదా! మనం చెడ్డ వాసన వచ్చే చెత్త, మాలిన్యమంతా వేయడం కాదు శుభ్రంగా ఉన్నటువంటి వస్తువులని మనం వాడాలి. అలాగే పరిసరాలు కూడా మంచి ఆలోచనలనే సుగంధంతో నింపాలి. ముందుగా మన మనస్సుని పరిశుభ్రం చేసే ముందు మన ఇంటిని శుభ్రం చేసే కార్యక్రమం మొదలు పెడదాం. ఆ తర్వాత వీధిని శుభ్రం చేద్దాం. తర్వాత మన గ్రామాన్ని శుభ్రంగా పెట్టుకుందాం. అదే మనల్ని భగవంతుడి దగ్గరకి చేర్చుతుంది అని చెప్పగా అక్కడ చేరిన స్త్రీ పురుషులందరూ ఆయన చెప్పింది చాలా శ్రద్ధగా విని “జై స్వామి నారాయణ “ అని గట్టిగా అరుచుకుంటూ వెళ్లి పోయినారు. ఈ విధంగా ఆ సాదు పురుషుడు అవకాశం వచ్చినప్పుడల్లా చిన్న చిన్న సభలు నిర్వహిస్తూ మొత్తం మీద ఆ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచే విధంగా ఆ గ్రామస్థులందరినీ ప్రభావితం చేశాడు. కొద్ది రోజుల్లోనే గ్రామంలో ఉన్న వీధులన్నీ పరిశుభ్రంగా ఉండసాగాయి.
పొగాకు వ్యసనం నుంచి గ్రామస్తులని విముక్తుల్ని చేయడం
ఆ సాధు మహారాజు ఆ గ్రామంలో ఇలా తిరుగుతూ తిరుగుతూ, ఒక చోటికి వచ్చేసరికి అక్కడ కొంత మంది కూర్చుని బీడీలు త్రాగుతూ, కొంతమంది పొగాకు నములుతూ కనిపించారు. ఈయన వెళ్ళగానే వాళ్ళంతా కొంచెం గాభరా పడ్డారు. మీరు ఇలా పొగాకు నమలదమూ, బీడీలు, చుట్టలు త్రాగడం మీ ఆరోగ్యానికి హానికరం. ఇది మనస్సుని పాడు చేస్తుంది. మనస్సునే కాదు సంసారాన్నే సర్వ నాశనం చేస్తుంది. కాబట్టి ఇటువంటి చెడు అలవాట్లని మీరు మానేయండి అని వారికి ఉపదేశం చేశారు. ఆయన మాటలు విన్న కొంతమంది స్వామీజీ! మీరు చెప్పింది నిజమే. పొగాకు తినడమూ, త్రాగడం వల్ల ఆయుశ్శు తగ్గిపోతుంది, ఆరోగ్యం చెడిపోతుంది. కాని ఏం చేయాలి? చిన్నప్పట్నుంచి మాకు ఇది అలవాటై పోయింది. ఒక్కరోజు కనక త్రాగక పోతే మాకు తల నొప్పి వస్తుంది అని ఒకడు, ప్రొద్దున వెళ్ళ వలసిన కాలకృత్యాలు అన్నీ ఆగిపోతాయి ఈ పొగాకు కనక తినకపోతే  అని ఒకడు,ఇంకొకడు ఏం చేయమంటారు స్వామి అని అనగా ఇంకొకడు అవును స్వామీ! నేను శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను ఈ పొగాకు నమలడం, త్రాగడం మానేయాలని, కాని అది మటుకు నన్ను వదిలి వేయకుండా గట్టిగా పట్టుకుని ఉన్నాయి అని అంటే అందరూ గొల్లున నవ్వారు. వారి సమాధానాలు విన్నస్వామి కాసేపు ఏదో ఆలోచనలో పడిపోయాడు. కాసేపయినాక ఆ స్వామి ఒక పెద్ద వృక్షాన్నికావలించుకుని “నన్ను వదిలిపెట్టు” నన్ను వదిలి పెట్టు” అని గట్టిగా అరవడం మొదలు పెట్టాడు. అట్నుంచి వెళ్ళుతున్న కుర్రవాడొకడు అదేమిటీ ఈ స్వామిజీ చెట్టుని పట్టుకుని “నన్ను వదిలి పెట్టు” నన్ను వదిలి పెట్టు” అని అంటున్నాడు. ఈయన పిచ్చివాడా ఏమిటీ? అని చెప్పేసి వాడు గ్రామంలో అందరి దగ్గరకు వెళ్లి, “ఆ మహాత్ముడు పిచ్చివాడై పోయాడు” ,”ఆ మహాత్ముడు పిచ్చివాడై పోయాడు” అంటూ వెళ్ళండి, “చూడండి” అని గట్టిగా అరుస్తూ అందరికీ సందేశాలు ఇవ్వడం మొదలు పెట్టాడు. అదే విధంగా ఆ చుట్టలు, బీడిలు, పొగాకు నములుతుండే వాళ్ళ దగ్గరకి వెళ్లి, ఆ మహాత్ముడు పిచ్చివాడు ఆ చెట్టుని పట్టుకుని “నన్ను వదిలి పెట్టు”, “నన్ను వదిలి పెట్టు” అని అంటున్నాడు అని చెప్పాడు. ఆ గ్రామస్తులంతా ఆ చెట్టు చుట్టూ సమావేశమయ్యారు. ఆ మహాత్ముడు ఆఖరిసారిగా చెప్పుతున్నాను “నన్ను వదిలి పెట్టు”, “నన్ను వదిలి పెట్టు” అని ఆ చెట్టుతో మాట్లాడం మొదలు పెట్టాడు. అక్కడ చేరిన వాళ్ళందరూ కూడా ఈ మహాత్ముడికి పిచ్చి పట్టిందా ఏమిటీ? అని అనుకుంటున్నారు. ఈలోగా చుట్ట, బీడీ, పొగాకు తింటున్న వాళ్ళంతా అక్కడకి వచ్చి, “మహాత్మా! ఏమిటీ మీరు ఇంత తెలిసిన వాళ్ళుఅయి ఉండి కూడా ఇలా చేస్తున్నారేమిటీ? మీరే కదా చెట్టుని గట్టిగా పట్టుకున్నారు. చెట్టుని గట్టిగా పట్టుకుని చెట్టు నన్ను వదలడం లేదు, గట్టిగా పట్టుకుంది, నన్ను వదిలి పెట్టు, నన్ను వదిలి పెట్టు అని చెట్టునంటున్నారు. ఇదంతా చాలా విడ్డూరంగా ఉంది కదా!” అని అన్నారు.
అది విని ఆ స్వామి నవ్వుతూ చెట్టుని వదిలివేసి నాయనా! అదే నేను మీకు చెప్పదలచుకున్నాను అలవాటు మిమ్మల్ని పట్టుకొన లేదు. ఏ విధంగా నన్ను ఈ చెట్టు పట్టుకోలేదో అదేవిధంగా ఈ బీడిలు,చుట్టలు త్రాగడం, పొగాకు నమలడంలాంటి అలవాట్లు మిమ్మల్నిపట్టుకోలేదు. మీరే వాటిని గట్టిగా పట్టుకుని కూర్చున్నారు అని చెప్పగా గ్రామస్తులంతా ఆశ్చర్య పడి పోయారు. కొంత మంది పశ్చాత్తాపం చెందసాగారు. ఈ విధంగా ఆ గ్రామంలో ఆయన మెల్ల మెల్లగా అందరినీ వ్యసన విముక్తిల్ని చేయడం, రోజూ సాయంత్రం వాళ్ళందరినీ సత్సంగానికి పిలిచి మంచీ-చెడు చెప్పడం ఇలాంటివన్నీ చేయడం వల్ల త్వరలోనే ఆ గ్రామంలో ఈ వ్యసనాన్ని పూర్తిగా అందరూ మానేసి వ్యసన ముక్తులయినారు.
                             పొగాకు వ్యాపారస్తుల ఆగ్రహం
ఈ విధంగా అసంఖ్యాక మైనటువంటి స్వామి నారాయణ గారి అనుచరులు ప్రతి చిన్న చిన్న గ్రామాలకి, చిన్న చిన్న పట్టణాలకి వెళ్లి ఈ ధర్మ ప్రచారం చేయడంతోటి గ్రామస్థాయిలోని వాళ్ళందరూ కూడా వారి వారి గృహాలని, వారి గ్రామాలని పరిశుభ్రంగా పెట్టుకోవడం, బీడిలు, పొగాకు త్రాగడం, నమలడం వగైరా వగైరా పూర్తిగా మానేశారు. అలాగే తమలపాకులు, తమలపాకుల్లో పొగాకు పెట్టుకుని నమలడం ఇవన్నీ కూడా మానేశారు. దీని యొక్క ప్రభావం ఆ గ్రామాల్లో, పట్టణాలలో, నగరాల్లో ఉన్నటువంటి పొగాకు అమ్మే వ్యాపారస్తుల మీద పడింది. వాళ్ళు తెచ్చిన సరుకంతా నెల రోజులైనా అలాగే ఉండి పోయేసరికి వారికి భయం కలిగింది. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోసాగారు. ఈ నెల రోజులనుంచి ఒక్క మనిషి కూడా నా దగ్గరకి రావడం కాని, పొగాకు కొనడం కాని, తమలపాకులు, బీడీలు కావాలని అడగడం కాని జరగలేదు. వ్యాపారమంతా మూల పడి పోయింది. మనకు సరుకులు ఇచ్చిన అతను వచ్చి మనల్ని డబ్బు కనక అడిగితే అతనికి మనం డబ్బు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాము. ఏం చేయాలో తోచడం లేదు. అయినా నాకర్థం కాక అడుగుతున్నాను అసలు ఎందుకిలా జరిగింది? ఇంత అకస్మాత్తుగా వీళ్ళందరూ తమలపాకులు నమలడం, పొగాకు నమలడం, త్రాగడం ఎందుకు మానివేశారు?
అర్థం కాకపోవడానికి ఇందులో ఏముంది? ఈ ఊళ్ళో స్వామి నారాయణ గారి శిష్యులు వచ్చారు కదా! వాళ్ళు వచ్చినప్పట్నుంచి ప్రజలలో మార్పు వచ్చింది. వాళ్ళు ఈ వ్యసనం నుంచి విముక్తులయ్యారు. ఎవ్వరు కూడా ఇక్కడకి వచ్చి బీడీలు కాని , పొగాకు కానీ కొనడం లేదు అని చెప్పగా ఇప్పుడేం చేద్దాం మనం ? మనమందరమూ కలిసి మనకు ఇవి అమ్మిన పెద్ద వ్యాపారస్తుడి దగ్గరకి వెళ్లి మన బాధలు చెప్పుకుందాం పదండి అని అందరూ ఆ పెద్ద పెద్ద వ్యాపారస్తుల దగ్గరకి వెళ్ళారు.
ఇంకొక చోట బీడీ కార్మీకులందరూ, మహిళలందరూ అక్కడ చేరి రండి, రండి, ఈ పొగాకు అంతా చుట్టల్లో, బీడీల్లో చుట్టాలి కదా అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఏర్పాట్లు చేసుకుంటుండగా వారి యజమాని వచ్చి మీరిక్కడ ఏం చేస్తున్నారు? అని అనగా మేము ఈ పొగాకు బీడీలలో, చుట్టలలో కడుతున్నాము అని చెప్పారు. ఏమీ అక్ఖర్లేదు ఇప్పటికే బోలెడన్ని బీడీలు అలాగే పడి ఉన్నాయి. ఎవ్వరూ కొనుక్కోవడానికి కూడా రావడం లేదు. అవే కాకుండా మీరింకా బీడీలు తయారు చేస్తే అవి కూడా అలాగే పడి ఉంటాయి ఎవ్వరు కొనేవాళ్ళు లేకుండా, అందుకనే  ఏమక్ఖర్లేదు అని అన్నాడు. మరి శెట్టిగారూ! మాకు కూలి ఎప్పుడు ఇప్పిస్తారు? పాత కూలీ కూడా అలాగే ఉండి పోయింది కదండీ! అని అడిగారు. ఇంకా కూలీ నేనెక్కడ్నుంచి తెచ్చి ఇవ్వాలి? మీ పాత సరుకే అమ్ముడు పోలేదు ఇంవరకు. ఒక్కళ్ళు కూడా నా సరుకు కొనడానికి రాలేదు. ఆ సరుకంతా అలా మూల పడి ఉంది. నాక్కూడా డబ్బులు అవసరమే కదా! నేను కూడా నా సంసారాన్ని పోషించుకోవాలి కదా! నేను మీకు డబ్బులు ఎక్కడ్నుంచి తీసుకుని ఇవ్వాలి? నేను కూడా వేరే ఏదైనా వ్యాపారం చూసుకుంటాను. మీరు కూడా వేరే ఏదైనా వ్యాపారం చూసుకోండి అని గట్టిగా మందలించి వెళ్లి పోయాడు.
ఈ చిన్న విక్రేతదార్లందరూ కూడా తమకు సరుకు ఇచ్చి నటువంటి ఆ వర్తకుడి దగ్గరకి వెళ్లి మేము మీదగ్గర తీసుకున్న సరుకంతా వాపసు ఇస్తున్నాము. మా దగ్గరకి ఇవి కొనడానికి ఎవ్వరూ రావడం లేదు కాబట్టి మా డబ్బులు మాకు వాపసు ఇచ్చేయండి మేము ముందే సరుకులకోసం మీకు  డబ్బులు చెల్లించేశాము అని గట్టిగా దబాయించారు. లేకపోతే మా కుటుంబమంతా మీమీదే పడవలసి వస్తుంది. అతను కూడా నన్నేం చేయమంటారు? నేను కూడా డబ్బులు ఎక్కడ్నుంచి తీసుకు రావాలి? నేను కూడా మీలాగే డబ్బులు ఇచ్చి కొన్నాను కదా! నా దగ్గర ఎక్కడ డబ్బులు ఉన్నాయి? నేను కూడా ఇక సన్యాసుల్లో కలవాల్సిన పరిస్థితులే ఉన్నాయి. కాబట్టి మనమందరమూ కలిసి నాకయితే ఎవరు సరుకులిచ్చాడో ఆ పెదమనిషి దగ్గరకి వెళ్ళదాము పదండి అని చెప్పి అందరు కలిసి ఆ పెద్ద వర్తకుడి దగ్గరకి వెళ్ళారు. వాళ్ళందరూ సమూహంగా వెళ్లి ఎవరైతే పొలంలో పొగాకు పండించాడో ఆ పటేల్ దగ్గరకి బయల్దేరి వెళ్లి ఆయన్ని గద్దించి అడగ్గా ఆయన , నేను మాత్రం ఏం చేస్తాను?మనమందరమూ ఒక్కటే పొగాకు అనే నావలో ప్రయాణం చేస్తున్నాము. మనందరి బాధలు ఒక్కటే అని అన్నాడు. నేను కూడా మరి మీలాగే బోలెడంత డబ్బులు పొదుపు-మదుపు పెట్టి పొగాకు పండించాను. నేను మాత్రం ఏం చేస్తాను చెప్పండి. కాకపోతే మనమందరమూ కలిసికట్టుగా ఏదైనా ఉపాయం ఆలోచించాలి అని అంటే అందరూ సరే అని అన్నారు. ఈ విధంగా పొగాకు వ్యాపారంలో ఉన్న వర్తకులు, పొగాకు కర్మాగారంలో పని చేస్తున్న కార్మీకులు, పొగాకు పండించే రైతులందరూ కలిసి ఒక సమూహంగా ఏర్పడ్డారు. ఈ స్వామి నారాయణగారి శిష్యుల ద్వారా గ్రామాల్లో జరుగుతున్నటువంటి ధర్మ ప్రచారం మూలంగా ప్రజలంతా వ్యసనం నుంచి విముక్తి పొంది పొగాకు త్రాగడం కాని, నమలడం కాని మానేశారు. దీనిమూలంగా వారి వ్యాపారమంతా మూల పడి సర్వ నాశనమై పోయింది. అందుకని వాళ్ళంతా కలిసి స్వామి నారాయణ గారి శిష్యుల మీద దాడి చేసి, వారిని ఊరినుంచి తరిమి కొట్టాలని, వాళ్ళు మళ్ళీ ఈ ఊళ్ళో అడుగు పెట్టకుండా చేయాలని ఒక పన్నాగం పన్నారు.