N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Monday, 9 March 2015

SwamiNarayan - Episode 42

ఆవేదన
గడ్పురం లేక దర్బార్ గడ్ అనే ఒక పట్టణానికి ఎబల్ కాచర్ అనే  సంస్థానాధిపతి ఉండే వాడు. అతను  మరియు అతని బంధువులంతా  కృష్ణ పరమాత్ముని యొక్క పరమ  భక్తులు. అతనికి ఎంతో కొంత అనుమానాలు ఉండేవి. ప్రతి రోజు కృష్ణుని యొక్క పూజలు విధిగా జరుగుతుండేవి. ప్రతి రోజు భగవద్గీతలో ఏదో ఒక అధ్యాయం చదువుతుండే వాళ్ళు. ఒక రోజు అతని కుమార్తె భగవద్గీతలో చెప్పబడిన “యదా యదాహి ధర్మస్య” అనే శ్లోకాన్నిచదువుతుంటే ఎబల్  కాచర్ చాలా ఆవేదన పడుతూ ఉన్నాడు. 


ఆయన తన పరివారంతో ఇలా అన్నాడు. నీవు ఎప్పుడూ చెప్పుతూ  ఉంటావు కదా భూమ్మీద ఎప్పుడెప్పుడు సంకటాలు వస్తాయో, ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడు భగవంతుడు భూమ్మీద అవతారం ఎత్తుతాడని. అదంతా అబద్ధం. నిజం కాదు అని అనగా కుటంబ సభ్యులంతా అదేమిటీ ఈయన ఇలా మాట్లాడుతున్నాడని ఆశ్చర్య పడిపోయారు. అవును చూడు ఈ సంఘంలో పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయి? అన్నదమ్ములిద్దరూ కూడా ఒకళ్ళ నొకళ్ళు చంపుకుంటున్నారు, స్త్రీలని ఎంతో హింసిస్తున్నారు, వాళ్లకి మాన భంగాలు చేస్తున్నారు, దోపిడీలు ఎక్కువైపోయాయి, పాలకులు, ప్రజలు అంతా దుర్మార్గంగా  ప్రవర్తిస్తున్నారు. మంచివాళ్ళకి ఎన్నో కష్టాలు ఎదురవుతున్నాయి, వారిని ఆదుకొనడానికి ఎవరూ లేరు. దేవుడెక్కడ ఉన్నాడు ?దేవుడెక్కడ ఉన్నాడు? ఇన్ని ఘోరాలు జరుగుతున్నప్పుడు ఆయన ఎక్కడ జన్మ ఎత్తాడు? 

ఏమిటీ ?అని చెప్పి ఆయన ఎంతో ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడే ప్రవేశించిన ఆయన బంధువు మాచా బాపూ ! మీరు అంత బాధ పడవలసిన అవసరం లేదు.అవతారోద్ధారణ జరిగింది. ఈ భూమ్మీద సాక్షాత్తు భగవంతుడు అవతరించాడు. నేను ఆయన్ని ప్రత్యక్షంగా చూశాను. మన గుజరాతు భూమ్మీద అడుగు పెట్టాడు. ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. సమాజంలో ఎన్నో మంచి మార్పులని తీసుకు వస్తున్నాడు. సాధువులని ఆయన రక్షిస్తున్నాడు. దుష్టుల మనస్సులని మార్చి వేసి వారిలోని దుష్టత్వాన్ని నిర్మూలించి మంచి మార్గంలోనికి తీసుకు వస్తున్నాడు అని చెప్పగా అందరూ ఆశ్చర్య పోయారు. స్వామి నారాయణ గారు కార్యాణి లో చేసిన మహిమ, అస్వస్థతగా ఉండి, మరణావస్థలో ఉన్న బాలున్ని తీసుకు వచ్చిన తల్లికి అభయమిచ్చి ఆ బాలున్ని ఎలా రక్షించాడో, ఆ ఊళ్ళో సమిష్టి కృషి తో తటాకాన్నిఎలా త్రవ్వించాడో, ఎలా అక్కడ క్షామ నివారణ చేశాడో (how he saved the village from famine) ఇవన్నీ కూడా వివరించాడు. స్వామి నారాయణ గారు చేసిన అద్భుతాన్ని గ్రామంలో ఉన్న ప్రజలంతా దగ్గర ఉండి చూశారు. బాపూ! మన కష్టాలన్నింటినీ హరించడానికి వచ్చాడు. దుష్ట శిక్షణ, సజ్జనుల రక్షణ , తన వాగ్దానాన్ని నెరవేర్చుకోడానికి ఆయన మన భూమ్మీదకి వచ్చాడు. ఎప్పుడెప్పుడైతే ధర్మానికి హాని జరుగుతుందో, ఎప్పుడైతే సజ్జనులకి కష్టాలు కలుగుతాయో, ఎప్పుడైతే దుష్ట శక్తులు విజ్రుంభిస్తాయో అప్పుడు భూమ్మీద  అవతరిస్తానని చెప్పిన ఆ  భగవంతుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకొనడానికి స్వామి నారాయణ రూపంలో అవతరించారు. ప్రజలందరూ కూడా ఆయన్ని నరనారాయణుడి అవతారంలాగానే భావిస్తున్నారు అని ఎంతో భక్తి శ్రద్ధలతో చెప్పగా అందరూ ఆశ్చర్య పోయారు, ఆనంద పడ్డారు కూడా. ఇదంతా ఎబల్ కాచర్  మరియూ వారి పరివారమంతా ఎంతో భక్తి శ్రద్ధలతో విన్నారు. అక్కడే ఉన్నఎబల్ కాచర్ ఆంతరంగిక మిత్రుడైన సురా కాచార్ అనే అతను ఏమిటీ భగవంతుడు అవతరించాడా? మామూలు వైద్యుడు వైద్య ప్రక్రియ ద్వారా రోగ నివారణ చేసినట్టుగానే స్వామి నారాయణ చేయగానే భగవంతుడై పోయాడా? దీంట్లో పెద్ద ఘన కార్యమేముంది? ఏ వైద్యుడి దగ్గరకి తీసుకుని వెళ్ళినా చికిత్స చేసి బ్రతికిస్తాడు  అని వెటకారంగా అన్నాడు. దానికి మీకు స్వామి నారాయణ గారు భగవంతుడు కాదని  అనుమానంగా ఉందా అని కాచార్ అనగా అతను భగవంతుడైతే నాకు సంతోషమే కాని ఏ విషయాన్నైనా నిర్ధారణ చేసుకోవాలంటే ప్రమాణం ఉండాలి కదా ! అని అన్నాడు. భగవంతుడు తానూ భగవంతుడు అని చెప్పుకోవడానికి ఎటువంటి నిదర్శన అక్ఖర్లేదు. అయినా నిరూపించవలసిన అవసరం లేదు. అయినా ఎబల్ దర్బార్ గారు, మీరు శ్రీ కృష్ణుని భక్తులు కదా ! మరి ఒక పని చేయండి. ఆ శ్రీ కృష్ణుడిని నిష్కల్మష మనస్సుతో ప్రార్థన చేయండి. ఒక వేళ స్వామి నారాయణ గారు నిజంగా కనుక భగవంతుడైతే తప్పకుండా ఆయన మొహం శ్రీకృష్ణుని విగ్రహంలో కనిపిస్తుంది. ఆయనే స్వయంగా మీ దగ్గరకి వస్తాడు అని ఎంతో ధీమాగా , నిబ్బరంగా అభయ్ దర్బార్కి చెప్పాడు. కజడా గ్రామానికి అధికారి అయినటువంటి అభయ్ దర్బారు ఎబల్ కాచర్, సురా కాచర్ , వారి కుటుంబ సభ్యులు అందరూ కూర్చుని ఎంతో భక్తి శ్రద్ధలతో కీర్తనలు చేస్తూ ధ్యాన స్థితిలో ఉండగా వారికి శ్రీకృష్ణ పరమాత్ముని విగ్రహ ముఖంలో స్వామి నారాయణ గారి ముఖం సాక్షాత్కారమైంది. అప్పుడు అందరూ కూడా ఎంతో ఆశ్చర్య పోయారు. వారి ఒళ్ళంతా పులకరించి పోయింది. అప్పుడు అభయ్ దర్బారు ఇలా అన్నాడు “మా అందరికీ శ్రీ కృష్ణ పరమాత్ముని ముఖంలో సాక్షాత్తు స్వామి నారాయణ దర్శనమిచ్చారు. కాబట్టి ఈ పృథ్వీ వాసుల యొక్క సంకటాన్ని హరింప చేయడానికి శ్రీ కృష్ణుడే స్వామి నారాయణుడి రూపంలో ఈ భూలోకంలో అవతరిచారు” అని మేమందరమూ విశ్వసిస్తున్నాము అని అన్నాడు. అతని కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో ఆనంద పడ్డారు. ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటంటే స్వామి నారాయణ గారు ఈ పవిత్ర భూమికి రావాలని  కోరుకుంటూ ప్రార్థిద్దాం. ఆయనని ప్రత్యక్షముగా  దర్శనం చేసుకోవాలని మా అందరికీ మనస్సులో ఎంతో ఆరాటంగా ఉంది. ఆయన  కనక ఇక్కడకి వస్తే అప్పటి గోపికలు ఆయన్ని చూసి ఎంత సంతోషించారో మేము కూడా అంత సంతోషిస్తాము.  మన ఈ కజడా నగరం సాక్షాత్తు బృందావనమై పోతుంది. ఆయన ఎప్పుడు ఇక్కడకి వస్తారా అని ఆదుర్దాగా ఉంది. మనమందరమూ కలిసి ఆయన కోసం ప్రార్థన చేద్దాము అని ఎబాల్ కాచార్ భార్య  అన్నది.


గడ్పూర్ లేక దర్బార్ గడ్  నగరానికి స్వామి నారాయణ గారి ఆగమనం
ఆ కుటుంబంతో పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో  అభయ్  దర్బారు ఆంతరంగిక మిత్రులు స్వామి నారాయణగారు తమ గ్రామానికి రావాలని ఎంతో ఆర్తితో ప్రార్థించారు. ఈ ప్రార్థనలన్నీ స్వామి నారాయణ గారి చెవిలో పడ్డట్టుగా స్వామి నారాయణ గారు ఆ కజడా నగరానికి రావడం జరిగింది. ఎంతో ఆడంబరంగా అభయ్ దర్బారుగారు మరియూ ఆ ఊరి ప్రజలంతా స్వామి నారాయణ గారికి ఘనస్వాగతం ఇచ్చారు. ఆయన్ని ఊరంతా ఊరేగించి, రాజప్రాసాదానికి తీసుకుని వచ్చి ఒక ఉచితాసనం మీద కూర్చుండ బెట్టి అందరూ ఆయన చుట్టూ చేరారు. అభయ్ దర్బార్ చేతులు జోడించి, “ ప్రభూ ! నాదొక ప్రార్థన “ అని అన్నాడు. “అదేమిటీ?” అని స్వామి నారాయణ గారు అడగ్గా మీరు మా ప్రార్థనలు విని మా నగరానికి విచ్చేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఎప్పుడూ ఇక్కడే ఉండిపోవాలి. ఎక్కడకీ వెళ్ళకూడదు ఇదే మా అభ్యర్ధన అని చెప్పాడు. దానికి స్వామి నారాయణ గారు నవ్వి, నాయనా ! నేను ఒకే ప్రదేశానికి బండిలాగా ఉండలేను ఒక వేళ అలా ఉండవలసి వస్తే నేను మీ నగరానికి వచ్చేవాడిని కాదు కదా ! అందుకని నేను ఒక స్థానానికి పరిమితమై ఉండలేను అని ఆయన చాలా మర్యాద గా చెప్పారు. ప్రభూ ! అది నిజమే కాని మీరు సాక్షాత్తు ప్రభువులే ! మీరు “సర్వే వ్యాప్తి” మీరు లేని చోటు ఉంటుందా? ఉండదు కదా ! మీరు అంతటా ఉంటారు. మీరు ఈ స్థానం నుంచే మీ దివ్యవాణిని వినిపించ వచ్చును కదా ! అని అన్నాడు. అతని భక్తి శ్రద్ధలకి స్వామి నారాయణ గారు ఎంతో సంతోషించి, కాసేపు ఆలోచించి ఇలా అన్నారు. 

సరే ! నేను ఎక్కడకి వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి ఇక్కడకే వస్తాను అని అభయమిచ్చారు. ఆ మాటలకి అందరూ సంతోషించి స్వామి నారాయణ గారికి జయ జయ ధ్వానాలు పలికారు.

సురా కాచర్ ప్రస్తావన
అభయ్ కాచర్ కి ఆంతరంగిక మిత్రుడు సురా కాచర్. ఒక రోజు రాత్రి ఆయన స్వామి నారాయణగారి దగ్గరకి వచ్చి నమస్కరించి నిలబడ్డాడు. ఏమిటీ సంగతి ? ఏమిటీ సమస్య? అని స్వామి నారాయణగారు అడగ్గా స్వామి ! మీకు తెలియనిదేముంది? సంసారి ఒక సమస్య కదా! అని అన్నాడు. అదేమిటో వివరంగా చెప్పు అని స్వామి నారాయణ గారు అన్నారు. స్వామి ! మీకు తెలుసు. అభయ్ కాచర్ కి మీరంటే యెనలేని భక్తీ విశ్వాసాలు. తన సంపదనంతా మీకు ధార పోశాడు . అతనికి ఇద్దరు భార్యలు, నల్గురు పుత్రికలు, ఒక పుత్రుడు ఉన్నారు. మరి ఆయనది కూడా ఒక పెద్ద సంసారమే. అయినా సంసారి యొక్క బాధలు మీకేం తెలుస్తాయి? మీరు సన్యాసి. సాధు తత్పురుషులు. మీరు సాక్షాత్తు శ్రీకృష్ణుని యొక్క అవతారమే. అయినా స్వామీ ! మీకు సంసారంలో అనుభవం లేదు కదా ! మరి సంసారంలో ఉన్నప్పుడు సంసారి నెరవేర్చవలసిన బాధ్యతలు సంసార యజమానివే కదా ! మీకు తెలియనిదేముంది? అభయ్ కాచార్ తన సంపదనంతా  మీకే ధారపోశాడు. మరి వారి కుటుంబ సభ్యుల పోషణ కోసం ఎంతో కొంత డబ్బు అవసరం కదా ! అతను చేసిన పని అతని కుటుంబంలోని సభ్యులందరికీ ఇష్టం లేక పోవచ్చును కదా ! ఆ కుటుంబ సభ్యులందరికీ ఆ సంపద మీద హక్కు ఉంటుంది కదా ! వారి సమ్మతి లేకుండా అభయ్ కాచార్ ఆ సంపదని మీకెలా ధారా పోస్తాడు చెప్పండి. మీరే న్యాయం చెప్పండి అని ప్రశ్నించాడు. ఇలా వారి సమ్మతి లేకుండా అభయ్ కాచర్ తన సంపదనంతా మీకు ధార పోస్తే ఆ కుటుంబ సభ్యులు అభయ్ కాచర్ ని అపార్థం చేసుకోరా ? వారి కుటుంబంలో ఉన్న  సుఖ శాంతులు సర్వ నాశనం అవడానికి  ఆస్కారం లేదంటారా? పోనీ ఇవన్నీ మనం ఒక ప్రక్కన పెడదాం. అభయ్ కాచర్ మిమ్మల్ని వెళ్ళిపొండి అని చెప్పగలడా ? కాని ఒక్కటి మాత్రం నిజం. అతని ప్రాణం పోయినా కూడా అతను మిమ్మల్ని ఇక్కడ్నుంచి వెళ్ళిపొండి అని చెప్పడు, చెప్పలేడు. మరి దీనికేమిటీ మార్గం? అని అన్నాడు. స్వామి నారాయణగారు కొంత సేపు ఆలోచించి  సురా కాచర్ గారూ ! దీనికేం చేద్దాం? మీరే చెప్పండి. పోనీ నన్ను ఇక్కడ్నుంచి నిశబ్దంగా వెళ్ళిపోమ్మంటారా ?అని అడిగారు. దానికి సురా కాచార్ అమ్మ..... మ్మ.....మ్మ ...  ! మీరు అంత  మాట అనకండి. మీరు ఇక్కడ్నుంచి వెళ్లిపోయారని కనుక అభయ్ కాచర్ కి తెలిస్తే అతను ప్రాణ త్యాగం చేస్తాడు. ఏది ఏమైనా మీరు ఆ పని మాత్రం చేయకండి అని అన్నాడు. సురా కాచార్ నిష్కల్మషమైన హృదయం కలవాడు, చాలా భోలా మనిషి. అందుకనే స్వామి నారాయణ గారితో ఈ విషయాలన్నీ ధైర్యంగా చెప్పగలిగాడు. అతనికి  స్వామి నారాయణ గారంటే మనస్సులో ఎనలేని భక్తీ విశ్వాసాలు కూడా ఉన్నాయి. ఒక ప్రక్క సాధు సంతువైన స్వామి నారాయణ గారు ఈ సంసారంలో ఎలా ఉండగలరని సందేహంగా కూడా ఉండాలి. పరస్పరమైన విరుద్ధమైన భావాలతో అతను ఉన్నాడు అందుకనే అమాయకంగా తన మనసులోని భావాలని పైకి చెప్పేశాడు. సురాకాచర్ గారూ ! అంతా బాగానే ఉంది మరి నన్నేం చేయమంటారు? అని మళ్ళీ ప్రశ్నించారు స్వామి నారాయణ గారు.  భగవాన్ ! నేను మీకు చెప్పగలిగే అంత వాడిని కాను. అయినా మీరు అప్పుడప్పుడు మీ భక్తులకి పరీక్ష పెడుతుంటారు. ఈ సమస్యకి సమాధానం ఆలోచిస్తే  మీకే తెలుస్తుంది నేనేం చెప్పగలను? అని చాలా తెలివిగా సమాధానం చెప్పాడు. స్వామి నారాయణ గారు దీర్ఘాలోచనలో మునిగి పోయారు. ఎబాల్ కాచార్ గడ్పూర్ సంస్థానానికి ఒక పెద్ద సామంత  రాజు. అతని దగ్గర ధన ధాన్యాలకి ఎటువంటి  లోటు లేదు. సకల ఐశ్వర్యాలన్నీ అతని దగ్గర ఉన్నాయి.
                                 స్వామి నారాయణగారి దీర్ఘాలోచన 
స్వామి నారాయణగారు ఏదో దీర్ఘాలోచనలో ఉండి అటూ ఇటూ పచార్లు చేస్తున్నారు. అభయ్ కాచర్ అతన్నే దర్బార్ గడ్ అని కూడా అంటారు. అతను స్వామి దర్శనానికి అక్కడకి వచ్చాడు. ఆయన్ని అంత దీర్ఘాలోచనలో చూసి ఆయన హృదయం ద్రవించి పోయింది. నిష్కల్మషమైన అతని హృదయంలో ఆవేదన నిండుకు పోయింది. ఆయన ఎంతో ఆర్తితో స్వామీ ! మీరు ఎందుకింత గంభీరంగా ఉన్నారు? మీ ముఖమెందుకు ఇంత విచారంగా ఉంది? మీరేం ఆలోచిస్తున్నారు?  మీరు దయ చేసి నాకు చెప్పవలసింది. మీరంటే  మాకు అచంచలమైన భక్తీ, విశ్వాసము, ప్రేమ, గౌరవము అన్నీ ఉన్నాయి . మీరెందుకు అలా ఉన్నారు? దయ చేసి చెప్పండి స్వామీ! అని పరి పరి విధాల ప్రార్థించ సాగాడు. సాక్షాత్తు భగవంతుడి అవతారమైన మీరే ఇంత గంభీరంగా ఉంటె సామాన్యులమైన మా గతి ఏం కావాలి ప్రభూ! అని చేతులు జోడించి ప్రార్థించాడు. అప్పుడు చివరకి స్వామి నారాయణ గారు అతన్ని బనరాజ్ అని సంబోధిస్తూ బనరాజ్ ! మానసికంగా నాకు కొంత వేదన ఉండడం వాస్తవమే. నేను ఒక పెద్ద పొరబాటు చేశాను. అనగానే దర్బార్ కాచార్ గజ గాజా వణికి పోయాడు. అదేమిటి స్వామి మీరు అలా ఎందుకు మాట్లాడుతున్నారు? అని అడిగాడు. దానికి సమాధానంగా స్వామి నారాయణగారు “అవును ! నేను నీ ప్రస్తావన అంగీకరించి పెద్ద పొరబాటు చేశాను. నేను మీకు అతిథిగా వచ్చాను. అందుకని నేను ఎక్కువ కాలం ఇక్కడ ఉండకూడదు. నేను ఎప్పటికీ ఇక్కడే ఉండి పోవడమనేది నీకు తీరని అన్యాయం చేసినట్టే లెక్క “ అని నేను భావిస్తున్నాను అని అనగా “ప్రభూ! ఇది అంతా మీదే కదా ! నాదేముంది చెప్పండి. మీరెందుకు అలా అనుకుంటున్నారు అని చాలా బాధగా అన్నాడు. స్వామి నారాయణ గారు దానికి సమాధానంగా నీకు నా పట్ల భక్తీ, శ్రద్ధ , ప్రేమ, గౌరవం ఉన్నాయి. కాబట్టి నీవు అలా మాట్లాడుతున్నావు. కాని నేప్పటికీ ఇక్కడే ఉండి పోవడమనేది నీ కుటుంబ సభ్యులందరికీ అంగీకారమో లేదో మనకి తెలియదు. వారి మనస్సులని నొప్పించడం మంచిది కాదు కదా ! అని ఆలోచిస్తున్నాను. ఈ లోకంఏవిధంగా ఆలోచిస్తుంది ఈ ప్రజలు ఏ రకంగా ఆలోచిస్తారు?స్వామి నారాయణ గారు తన అనుచరులతో ఇక్కడకి అతిథిగా వచ్చి ఇక్కడే తిష్ఠ వేయడమనేది బాగుంటుందా? ఒక సంసారి ఇంట్లో తన అనుచరులందరినీ తీసుకు వచ్చిస్వామి నారాయణ గారు  ఉండడమేమిటీ అనే ఒక అపకీర్తి మా అందరికీ రాదంటావా ?అని అడిగారు.

“ప్రభూ ! దయ చేసి మీరంత మాట అనవద్దు. మీరనుకుంటున్నట్టుగా ఏమీ జరగదు. నిజంగా మీరు మీ పరివారంతో ఇక్కడ్నుంచి కనుక వెళ్ళిపోతే మేము మా కుటుంబ సభ్యులంతా ప్రాణ త్యాగం చేస్తాము. అప్పుడు  లోకమంతా ఏమనుకుంటుంది? అభయ్ కాచర్ అతని పరివారం నిజమైన భక్తులు కారు. వారు నోటి మాత్రంగానే అంటే పైపైకి మాత్రమే స్వామి నారాయణగారిని  ఇక్కడ ఉండి పొండి అని చెప్పారు. వారికి మనస్సులో భక్తీ కాని ప్రేమ కాని లేదు అనే అపకీర్తి మాకు మాత్రం రాదంటారా? అని ప్రాధేయ పడ్డాడు. అభయ్ కాచర్ తన మాట తప్పాడు. సర్వం ధారపోసిన అతను స్వామి నారాయణ గారు ఇక్కడ్నుంచి వెళ్ళిపోతున్నారు అంటే తప్పకుండా అక్కడ  ఏదో లోపం జరిగే ఉంటుంది అని అందరూ అనుకుంటారు కదా! అయినా భగవంతుడికి, భక్తుడికి ఇచ్చి పుచ్చుకోవడం లోనే అంతా వ్యవహారం ఉంటుందని అనుకుంటున్నారా స్వామీ? నేను మాట తప్పినవాడిని కాదా? నలుగురిలో నేను చులకనైపోనా స్వామీ ? అని చాలా బాధగా అన్నాడు.
బలరాజ్! నేను కూడా అదే చెప్పుతున్నాను. భగవంతుడైనా, ఎవరైనా సరే  వారి వారి మర్యాదలు అతిక్రమించకూడదు. ఎవరి పరిమితుల్లో వాళ్ళు తప్పకుండా ఉండాలి.”

ప్రభూ ! మీరలా మాట్లాడ కూడదు. నిర్మలమైన హృదయంతో చెప్పుతున్నాను. నా దగ్గర ఉన్న సర్వస్వమూ మీదే. అంతా మీదే స్వామి నాదేమీ లేదు అని ఎంతో భక్తితో చెప్పాడు. దానికి స్వామి నారాయణ గారు కొద్దిగా ఆలోచించి దీనికి ప్రమాణమేమిటీ? రుజువేమిటీ? అని ప్రశ్నించారు. దర్బార్ కాచర్ కి ఒక్క క్షణం ఆయన ప్రశ్న ఏమిటో అర్థం కాలేదు. ఏం ప్రమాణం, ఏం రుజువు మీకు నేను చూపించాలి స్వామీ ? భక్తీ శ్రద్ధలు కనిపించవు కదా ! ఏం చేయాలో చెప్పండి ! తప్పకుండా చేస్తాను అని దర్బార్ కాచర్ చెప్పాడు. నోటిమాటలతో నీ సర్వస్వం నాది అని చెప్పితే ఎలా కుదురుతుంది?వ్రాతపూర్వకంగా ఈ సంపద అంతా నాకే చెందుతుంది అనే పత్రాన్ని నీవు నాకివ్వగలవా ?అని స్వామి నారాయణగారు అడగ్గా తప్పకుండా స్వామీ ! నేను ఆ పత్రాన్ని ఇవ్వగలను అని చెప్పి అభయ్ కాచర్ అక్కడనుంచి వెళ్లి పోయాడు.