N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Monday, 16 March 2015

SwamiNarayan - Episode 43



దర్బార్ కాచర్ కుటుంబ సభ్యులతో సమావేశం

దర్బార్ కాచర్ ఇంట్లో సభ్యులందరూ ఒక చోట సమావేశమై,  నాన్నగారు మనందరినీ ఇక్కడకి ఎందుకు పిలిచారు అని వారి పుత్రికలు, పుత్రులు, భార్యలు అందరూ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వారి పుత్రిక అయిన పాంచాలి నాన్నగారు వస్తారు కదా అప్పుడు  ఆయన ఇక్కడకి ఎందుకు రమ్మని పిలిచారో మనకి తెలిసి పోతుంది. ఇంతలో ఈ తర్జన భర్జనలెందుకు అని అంటుండగానే దర్బార్ కాచర్ గారు ఆ గదిలోకి ప్రవేశించారు. ఆయన తన చేతిలో ఉన్న పత్రాన్ని కుటుంబ సభ్యులందరి ముందు పెట్టగా స్వామీ ! 


అదేమిటీ అనివారంతా అడిగారు. “ఇది అధికార పత్రం. నేను మీ అందరి తరఫున నోటి మాటగా స్వామి నారాయణగారికి నా సంపదంతా ధారపోశాను కదా ! దాన్ని దృఢపరుస్తూ నా ఆస్తంతా ఆయన పేరున ఈ పత్రంలో వ్రాశాను. మీరంతా కూడా ఈ సంపదలో హక్కుదారులు. కాబట్టి ఈ అధికార పత్రం మీద మీ అందరి సంతకాలు కావాలి. మీకు అంగీకారమవుతే, ఎలాంటి సందేహాలు లేకపోతె, ఈ పత్రాన్ని మీరు చదివి మీకు అభ్యంతరం లేకపోతేనే ఇందులో సంతకాలు చేయాలి అని నేను చెప్పదలచుకున్నాను” అని ఆయన చెప్పారు. ఆ మాటలకి ఆ కుటుంబ సభ్యులంతా ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు పరిశీలనగా చూస్తూ ఉండిపోయినారు.

దాదా కాచార్ గారి కుటుంబ సభ్యులతో శ్రీ స్వామి నారాయణ గారి భేటి (కలయిక)

దాదా కాచార్ హారతి పళ్ళెం చేతిలో పట్టుకుని, తన కుటుంబ సభ్యులందరినీ తీసుకుని “శ్రీ స్వామి నారాయణ గారికి జై” అంటూ జయ జయ ధ్వానాలతో తన మందిరం నుంచి శ్రీ స్వామి నారాయణ గారు బస చేసిన ప్రదేశానికి రా సాగారు. జయ జయ ధ్వానాలు విని దర్బార్ కాచర్ లోని సహచరులు, ఆంతరంగిక మిత్రులు, ఉద్యోగస్తులు, స్వామి నారాయణ గారి శిష్యులు అందరూ కూడా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనే కుతూహలంతో అక్కడ సమావేశమయ్యారు. జయ జయ ధ్వానాలు చేస్తూ స్వామి వారిని దర్శించుకున్నాక వాళ్ళంతా వినయంగా ఒక చోట నమ్రతగా నిలబడ్డారు.

బలరాజ్! ఏమిటీ ఇదంతా? ఎందుకింత హడావుడి పడుతున్నారు అని ప్రశ్నించారు. దానికి స్వామీ! మీకు ఈ అధికార పత్రాన్నిమేము అందజేస్తున్నాము. ఈ క్షణం నుంచి మేము ఈ నగరానికి పాలకులము కాము కేవలం సేవకులం మాత్రమే. మా యావదాస్తిని మేము మీకే సమర్పించుకున్నాము స్వామీ! కాబట్టి మేము ఈ రోజు నుంచి మీ సేవకులము అని వినయంగా చెప్పగా , మీ ఆస్తంతా నా పేరుమీద వ్రాసి ఇస్తున్నారు మీకు మనస్సులో ఎలాంటి దుఃఖం లేదు కదా! అని స్వామి నారాయనగారు అడిగారు. దాదా కాచర్ సతీమణి స్వామి నారాయణ గారిని ఉద్దేశించి ప్రభూ! మాకు చాలా సిగ్గుగా, బాధగా ఉంది అని అనగా ఎందుకు అని స్వామి వారి ని ప్రశ్నించారు. స్వామి ఈ మొత్తం ఆస్తి అంతా  మీకే చెందింది. సాక్షాత్తు భగవంతుడి అవతారమైనట్టి మీకే ఈ సంపదంతా చెందుతుంది. అటువంటిది మేము మీకు కాగితం మీద వ్రాసి ఎలా ఇస్తాం స్వామీ? అలా ఇచ్చినందువల్ల మా మనస్సెంత బాధ పడుతుందో మీకు తెలుసు అని ఎంతో భక్తీ శ్రద్ధలతో విన్నవించింది. దానికి వత్తాసుగా మిగతా కుటుంబ సభ్యులందరూ అవును స్వామీ! ఈ పని చేయడం వల్ల మాకు కూడా ఎంతో కొంత లాభం కలిగింది కదా! మీకు లాభం కలిగిందా? అది ఎలా? అని శ్రీ స్వామి నారాయణ గారు అడిగారు. స్వామీ ! మీ అనుగ్రహం మాకు కలిగింది కదా! మీ దయ, మీ ఆశీర్వాదాలు మాకు కలిగాయి కదా! అంతకన్నా మాకేం కావాలి ప్రభూ! అని ఒక సభ్యురాలు అంటే ఇంకొక సభ్యురాలు ఈ క్షణం నుంచే బరువు బాధ్యతలన్నీ మీకే అప్పగించాము కదా స్వామీ! అన్నీ మీరే చూసుకుంటారు కదా మేము నిశ్చింతగా ఉండవచ్చును. ఇంతకన్నా మాకు జీవితంలో కావలసినది ఏముంటుంది స్వామీ ?అని ఎంతో భక్తీ శ్రద్ధలతో వినయంగా నమస్కరించి చెప్పింది. వీటన్నింటితో పాటు మోక్షం కూడా లభిస్తుంది కదా మాకు అని ఇంకొకరు అన్నారు. దాదా కాచార్ భక్తితో చేతులు జోడించి స్వామీ! ఈ ఆస్తులు పాస్తులు, ఈ పంటలు, పొలాలు మీకిచ్చినందువల్ల మాకు మీ కృప దొరికింది కదా! మీ  కృపని మించిన ఆస్తులు ఏమున్నాయి స్వామీ చెప్పండి ? అంత కన్నామించిన సంతోషం, తృప్తి మాకు ఏముంటాయి స్వామీ? అని వినయంగా చెప్పాడు. "స్వామి నారాయణ భగవాన్ కీ జై” అంటూ జయ జయ ధ్వానాలు చేయసాగారు అభయ్ దర్బారు. అక్కడ ఉన్నవారంతా స్వామి నారాయణ గారికి జయ జయ ధ్వానాలు చేశారు.

ఇదంతా గమనిస్తున్న సురా కాచర్ స్వామి నారాయణ గారి దగ్గరకి పరిగెత్తుకుని వచ్చి ఆహా! స్వామి నారాయణ గారూ!  ఏం చమత్కారం చేశారండీ ! ఒక భక్తుడికి ఏం పరీక్ష పెట్టారండి! కాని అభయ్ కాచార్ కూడా ధన్యుడు. అంతటి అనన్య భక్తితో మిమ్మల్ని సేవించాడు. తృణ ప్రాయంగా తన ఆస్తినంతా, తన సంపదనంతా మీకు సమర్పించాడు. మీరు పెట్టిన పరీక్షలో అతను నెగ్గాడు. ఆహా! ఆహా! ఏమి భక్తుడు! ఏమి భక్తుడు! మీ ఇద్దరి మధ్యా ఎంత అనుబంధం ఉంది! ఇదంతా చూసి నేను చాలా సంతోష పడిపోతున్నాను స్వామీ! ఇంకా  నాకు చెప్పడానికి మాటలు కూడా రావడం లేదు. మొత్తం కుటుంబ సభ్యులందరూ భక్తి భావంతో మనస్సులో ఎటువంటి సంకోచం లేకుండా యావదాస్తిని  మీకు అర్పించారు.  ఆ .. హా ..  ఏమి భక్తి! .... ఏమి   భక్తి! ... అని పదే పదే అంటూ ఆ స్వామి వారిని మరియూ దాదా కాచరి ని , వారి కుటుంబ సభ్యులందరినీ పొగడ్తలతో ముంచి వేశాడు.

ఇదంతా గమనిస్తున్న సమయ దేవత, మిగతా దేవతలంతా కూడా చాలా ఆశ్చర్య పడిపోయారు మరియు ఆనంద పడిపోయారు. లోకంలో దేవుడు మానవుడి అవతారంలో వచ్చినప్పటికీ కూడా ఆయన చేసే పనులకి అబద్ద్దాలు, అపోహలు సృష్టించేవాళ్ళు ఎక్కువ మందే ఉంటారు. భగవంతుడికి, భక్తునికి, అపఖ్యాతి, అపకీర్తి రాకుండా  సురా కాచార్ అనే సూత్రధారునితోటి స్వామి నారాయణ గారు మంచి నాటకం రచించారు. దీనివల్ల ఇద్దరికీ ఎటువంటి అపఖ్యాతి లేకుండా అంటా సవ్యంగా జరిగి పోయింది. ఇటు స్వామి నారాయణగారిని కూడా ఎవ్వరూ ఏమీ అనలేరు అదేవిధంగా అభయ్ కాచరి కి కాని , వారి కుటుంబ సభ్యుల మనస్సులో కాని ఎటువంటి భావనలు లేకుండా ఎంత చక్కగా స్వామి నారాయణ గారు చెప్పారు అని అందరూ సంతోషించారు. స్వామి నారాయణ గారు  మాత్రం నిర్లిప్తంగానే ఉండి పోయినారు.