N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Thursday, 16 April 2015

SwamiNarayan - Episode 44

లాడు దాంజి

లాడు దాంజి అనే ఒక కవి ఉండేవాడు. ఆయన తన కవితా వాణి చమత్కారంతో గుజరాతు లోని చాలా సామంత రాజులు, జమీందారులు, శ్రీమంతుల దగ్గరకి వెళ్లి తన కవితలు వినిపిస్తూ, పాటలతో వారిని ఆనందింప చేస్తూ, వారందరి మీద కూడా కవితలు వ్రాస్తూ బోలెడంత డబ్బు, కీర్తి సంపాదించి గొప్ప ఐశ్వరుడయ్యాడు. ఆయన ఒక రోజు ఒక సామంత రాజు గారి ఆస్థానానికి వెళ్ళినప్పుడు ఆయనకి ఘన స్వాగతాలతో సకల మర్యాదలు చేశారు. ఆ రోజు లాడు దాంజి రాజు గారి మీద పొగడ్తలతో ఎన్నో మంచి కవితలు చెప్పగా ఆ రాజు సంతోషపడి  నా రాజ్యాన్ని దానం చేశినా కూడా మీ ఋణం నేను తీర్చుకో లేను. నాదొక చిన్న విన్నపం. అదేమిటంటే మీరు కనీసం వారం రోజులైనా మా దర్బారు లో ఉండాలి. మీరు మా ఆస్థాన స్వర్ణకారుడైన సోనీ మహా జనుని కలవాలి అని అభ్యర్థించగా, లాడు దాంజి, ఓ ! అలాగే ! తప్పకుండా ఉంటాను. మీరు చెప్పినట్టుగానే మీ అతిథిగా వారం రోజులు ఇక్కడే ఉంటాను అని తన అంగీకారం తెలిపారు. లాడు దాంజి చాలా ఆడంబరంగా ఉండేవాడు. 


ఆయనలో ఎంతో కొంత అహంకారమూ, దర్పమూ ఉండేవి. ఎందుకంటే అతను తన కవిత్వాన్ని ధనవంతులు, చిన్న చిన్న రాజుల దగ్గర ప్రదర్శించి ఎన్నో బహుమానాలు పొందాడు.  ఆయనకి ఒక విలాసవంతమైన అతిథి గృహం లో బస ఏర్పాటు చేశారు. అక్కడ ఆయన ఉండగా అక్కడికి సోనీ మహాజన్ వచ్చి మీకు కావాల్సిన బంగారపు ఆభరణాలన్నీ నన్ను తయారు చేయమని రాజు గారు నాకు చెప్పారు. ముత్యాలతో, రత్నాలతో మీకొక తల పాగాను , ఇంకా మీకేం కావాలో మీ ద్వారా తెలుసుకుని ఆ వస్తువులన్నీ తయారు చేయమని చెప్పారు. ఒక ముత్యాల హారం కూడా చేయమని చెప్పారు. మరి ఇవన్నీ చేయడానికి కొంచెం సమయం పడుతుంది అని విన్నవించు కున్నాడు. అయితే లాడు దాంజి దృష్టి సోనీ మహాజన్ మేడలో వేసుకున్న హారం మీద, నుదుటి మీద  పడింది. వెంటనే ఆయన మీ మెడలో ఉన్న ఈ ప్ర్తత్యేకమైన మాల , మీ నుదుటిమీద  ప్రత్యేకంగా ఉన్నఅవి ఏ  సాంప్రదాయానికి చెందినవి? అని ప్రశ్నించాడు కుతూహలంగా. నేను స్వామి నారాయణ సాంప్రదాయానికి చెందిన వాడిని.  మీరు స్వామి నారాయణ గారి గురించి వినలేదా ?  ఆయన సాక్షాత్తు భగవంతుని అవతారమే. 

ప్రస్తుతం ఆయన కజడా నగరంలో బస చేసి ఉన్నారు.  నేను నాలుగైదు రోజుల తర్వాత ఒక సారి ఆయన దర్శనం చేసుకోవా డానికి వెళ్ళుతున్నాను. మీకు కనక అభ్యంతరము లేక పోతే స్వామి నారాయణ గారి దర్శనం చేసు కోవడానికి  నాతో పాటే రావచ్చును అని విన్నవించాడు లాడు దాంజి జవాబేమీ చెప్పకుండా  ఆలోచనలో పడి పోయాడు. మర్నాడు రాజా వారితో మాట్లాడుతున్నప్పుడు స్వామి నారాయణ గారి ప్రస్తావన వచ్చినప్పుడు ఆ  రాజా వారు నేను కూడా ఆ స్వామి నారాయణ గారి గురించి  ఎంతో విన్నాను. మరి ఆయన సాక్షాత్తు భగవంతుని అవతారమే అని ప్రజలు చెప్పుకుంటారు అని అన్నారు. దానికి సమాధానంగా లాడు దాంజి  రాజా గారూ ! నేను మాత్రం స్వామి నారాయణ గారు భగవంతుని అవతారమని విశ్వసించను. నాకేమాత్రం నమ్మకం లేదు అని అనగా సరే ! మీరు  ఒక పని చేయండి  సోనీ మహాజన్ ఈ రోజు కజడా నగరానికి వెళ్ళుతున్నాడు మీకు ప్రయాణానికి  కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తాను. మీరు వెళ్లి ఆయన దర్శనం చేసుకోండి. 

ఇదే అలంకారాలతో ఆయనని కలవండి. ఆయన సంగతి ఏమిటో  తెలుసుకోండి. నిజంగా అతను భగవంతుని అవతారమా? లేక పాఖండీయా ? అన్న విషయాన్ని ధ్రువ పరచుకొండి అని సలహా ఇచ్చాడు. ఆ తర్వాత సోనీ మహాజన ని కలిసినపుడు లాడు దాంజి మీరు స్వామి నారాయణ భగవంతుని అవతారమని ఎలా నిర్ణయం తీసుకున్నారు? అని ప్రశ్నించాడు. ఎక్కడ శ్రద్ధ ఉంటుందో అక్కడ రుజువులు అవసరం ఉండవు అని సోనీ మహాజన్ అన్నాడు. శ్రద్ధ ఉండాలంటే అక్కడ కారణాలు కూడా ఉండాలి కదా ! అని బదులిచ్చాడు సోనీ మహాజన్. క్షమించండి సోనీ మహాజన్ గారూ ! శ్రద్ధ ఉంటె సరిపోదు. శ్రద్ధ ఉంది కాబట్టే మీరు ఇలా చెప్తున్నారు. దానికి రుజువులు, ప్రమాణాలు ఉండాలి కదా ! అంత తొందరగా మనం ఎలా విశ్వసించ గలుగుతాము? అటువంటి ప్రమాణాలు ఏమీ  లేకుండా నేనెలా నమ్మగలను? అని అన్నాడు. దానికి సమాధానంగా సోనీ మహాజన్ నా దగ్గర అలాంటి ప్రమాణాలు కానీ రుజువులు కానీ లేవు. మీరు ఎప్పుడైతే స్వామి నారాయణ గారిని దర్శనం చేసుకుంటారో అప్పుడు మీ హృదయంలో దివ్యమైన వాణి వినిపిస్తూ ఉంటుంది. మీ అంతరంగంలో  ఎంతో మార్పు వస్తుంది , ఎంతో ప్రశాంతత కలుగుతుంది. 

మీ బుద్ధి కూడా ఇతను సామాన్యుడు కాదనే విషయం చెప్తుంది. కేవలం శ్రద్ధ ఉంది కాబట్టే మీరు అలా నమ్ముతున్నారు మరి నాకు అలా నమ్మడం చాలా కష్టం. పోనీ ఒక పని చేద్దాం. నాకు నాలుగు సంకల్పాలు ఉన్నాయి. ఆ నాలుగు సంకల్పాలు కనుక నేను అనుకున్నట్టుగా జరిగితే స్వామి నారాయణ గారు భగవంతుడి అవతారమని నేను విశ్వసిస్తాను. నా మొదటి సంకల్పం ఏమిటంటే మనం ఆయన దర్బారుకి వెళ్లేసరికి అక్కడ పురాణ కాలక్షేపము లేకపోతె భగవంతుని మీద ప్రవచనాలు జరుగుతూ ఉండాలి. రెండవది నా పరిచయం ఇవ్వకుండానే ఆయన నన్ను చూడగానే నా పేరుతొ పిలవాలి. మూడవది నాకు ఆయన ఒక గులాబీ పువ్వును ప్రసాదంగా ఇవ్వాలి. అని అనగా సోనీ మహాజన్ ఆశ్చర్య పోయాడు. ఎన్నో రకాల పుష్పాలు ఉంటాయి కదా ! గులాబీ పువ్వు ఈ భూమి మీద పెరగనే పెరగదు. గులాబీలు దొరకనే దొరకవు. మరి అలాంటిది నీకు ఆయన గులాబీ పూలు ఎలా ఇస్తాడు? అని ప్రశ్నించాడు. ఎందుకు సాధ్యం కాదు? నీవు ఆయన సాక్షాత్తు భగవంతుని అవతారం అని అంటున్నావు కదా ! 

భగవంతునికి సాధ్యం కానిది ఏమైనా ఉంటుందా? అసంభవం అనేది ఏమైనా ఉంటుందా? ఆయన తలచుకుంటే ఏదైనా చేయగలడు కదా ! అని ప్రశ్నించగా సోనీ మహాజన్ అవును అది సాధ్యమే అవుతుంది. నాల్గవ సంకల్పము షరతు ఏమంటే  నేనేమీ అడక్కుండానే ఆయన చరణాలలో మంగళ కరమైనటువంటి షోడస చిహ్నాలని, గుర్తులని నాకు చూపించాలి. ఇవన్నీ విన్న సోనీ మహాజన్ చాలా ఆశ్చర్య  పడ్డాడు. ఎటువంటి సంకల్పాలు మీరు మనస్సులో పెట్టుకున్నారు ? పోనీ లెండి ! ఇదంతా భగవంతుని లీలయే అని నేననుకుంటాను. అని సోనీ మహాజన్ అన్నాడు.
                                      
లాడు దాంజి సందేహ నివృత్తి

వాళ్ళు మార్గ మధ్యంలో ఏవేవో మాట్లాడుకుంటూ స్వామి నారాయణ గారు వేంచేసిన కజడా నగరానికి, ఆయన దర్బారు లోకి ప్రవేశించారు. అప్పటికే అక్కడ ఆధ్యాత్మిక చర్చ జరుగుతుంది, గ్రంథ పఠనం కూడా జరుగుతుంది. భక్తులు వచ్చి వాళ్లకి తోచిన కానుకలు సమర్పిస్తున్నారు. సోనీ మహాజన్ ప్రక్కనే ఉన్న లాడు దాంజి తోటి, "చూశారా ! మీ మొదటి సంకల్పం నెరవేరింది" అని అన్నాడు. లాడు దాంజి అదేమిటీ అని ప్రశ్నించగా గ్రంథ పఠనం జరుగుతుంది ఇక్కడ మీ మొదటి సంకల్పం అదే కదా ! అని అన్నాడు. 

దానికి లాడు దాంజి , దీనిలో ఆశ్చర్యమేముంది? ఇటువంటి దర్బారులో గ్రంథ పఠనం, పురాణ పఠనం మామూలే కదా రెండవది కూడా చూద్దాం అని అన్నాడు. సోనీ మహాజన్! వద్దనుకుని కూడా నేను ఈ దర్బారులో కూర్చున్నాను. నేను ఎప్పుడు కూడా ఇక్కడకి రాలేదు.నేను  స్వామి నారాయణ గారిని ఎప్పుడూ చూడలేదు. ఆయన కూడా నన్నెప్పుడూ చూడ లేదు మరి ఆయన నన్నెలా గుర్తు పడతాడు? అది కూడా చూద్దాం! అని అంటుండగానే " రండి",  " రండి", లాడు దాంజి గారూ ! అని స్వామి నారాయణ గారు ఎంతో ఆదరంగా సాదరంగా ఆయన్ని ఆహ్వానించారు. రండి  లాడు దాంజి కవి గారూ ! మీకు స్వాగతం !" అని పలకరించడం తో లాడు దాంజి నిశ్చేష్టుడై పోయాడు, నిరుత్తరుడై పోయాడు, ప్రతిమ లాగే అక్కడే నిల్చుండి పోయాడు. అంతకు ముందే చిన్న విశేషం జరిగింది. సోనీ మహాజన్లాడు దాంజి స్వామి నారాయణ గారి దర్బారులోకి ప్రవేశించక ముందు ఇంకొక స్వామి నారాయణ గారి భక్తుడు వచ్చాడు. ప్రభూ ! స్వామి నారాయణ గారూ ! నేను స్వతహాగా ఇక్కడే ఉండేవాడిని, ఈ దేశావాసున్నే కాని ఎక్కడో దూరంగా ప్రదేశంలో ఉన్నాను. మీ దర్శనం కోసం నేను వచ్చాను అని చెప్పిఆయన కొన్ని కానుకలు స్వామి నారాయణ గారి దగ్గర ఉంచి భక్తి ప్రపత్తులతో అక్కడ కూర్చుని ఉండి పోయాడు. 

ఆ తర్వాతే సోనీ మహాజన్లాడు దాంజి ఆ దర్బారులోకి ప్రవేశించారు. అలా ప్రతిమ లాగా నిశ్చేష్టుడై నటువంటి లాడు దాంజిని ఉద్దేశించి, "కవి గారూ ! ఎందుకు మీరు అక్కడే ఆగి పోయారు? ఇలా దగ్గరకు రండి" అని ఆహ్వానించి అక్కడే ఆయన్నికూర్చోబెట్టారు. పోయాడు. ఆశ్చర్యం కన్నా రెట్టింపు ఆనందంతో నిండి పోయాడు. ఇంక నాల్గవ సంకల్పం నేరవేరాలి. స్వామి నారాయణ గారు లాడు దాంజిని సాదరంగా ఆహ్వానించి తన ఆసనం ప్రక్కనే ఆయన్ని కూర్చోబెట్టాడు. లాడు దాంజి గారూ ! మీ ప్రయాణ మేలా సాగింది? మార్గ మధ్యంలో మీకేమీ అసౌకర్యం కలగలేదు కదా ! ప్రయాణ మంతా బాగా జరిగిందా? అని ప్రశ్నించి యాదాలాపంగా తన కుడి కాలిని ఎడమ కాలి మీద పెట్టుకోగా ఆయన పాదం లాడు దాంజి కి కనిపించేంత దగ్గరలో వచ్చింది. 

అప్పుడు లాడు దాంజి దృష్టి శ్రీ చరణాల మీద పడగా దానికి పదహారు మంగళ కరమైనటువంటి చిహ్నాలు, గుర్తులు   కనిపించి ఆయన చాలా ఆశ్చర్య పడి పోయాడు. ఏం మాట్లాడాలో తెలియ లేదు. మనసులో తానూ అనుకున్న ఈ నాలుగు షరతులు లేక సంకల్పాలు అన్నీ కూడా స్వామి నారాయణ గారి సమక్షంలో నేరవేరినాయి లాడు దాంజికి ఈ అనుభవం కొత్తగా ఉంది, అద్భుతంగా  ఉంది. అత్గాను మనసా, వాచా, కర్మణా ఆ క్షణమే స్వామి నారాయణ గారికి దాసాను దాసుడైనాడు. ఆ కవి రాజు లోని కవిత్వం పెల్లుబికిపోయింది మామూలుగా రాజుల దగ్గర మనుష్యుల గురించి పొగడ్తలు తో కవిత్వం చేసిన ఆ కవి శ్రేష్టుడు అప్పటికప్పుడే స్వామినారాయణ గారి మీద భక్తి ప్రపత్తులతో కీర్తన మొదలు పెట్టాడు. స్వామి నారాయణ గారి మీద  అతను అప్పటికప్పుడే ఆశువుగా హృదయాంత రంగం లో నుంచి వచ్చిన ఒక భక్తి పరవశమైన గీతాన్ని ఆలాపిస్తూ, నృత్యం చేస్తూ ఉండి పోయాడు. అతనితో బాటు మిగతా భక్తులందరూ కూడా ఒక విధమైన టువంటి  ఆవేశం వచ్చి వాళ్ళందరూ కూడా అతనితో పాటు నృత్యం చేయ సాగారు . ఇదంతా చూసి స్వామి నారాయణ గారు చాలా సంతోషించారు. సోనీ మహాజన్ కూడా తన కళ్ళని తానే నమ్మ లేక పోయాడు.అంత దర్పంగా, అహంకారంగా ఉండే లాడు దాంజి స్వామి వారి ముందు ప్రణామం చేసి, ఆయన ముందు నృత్య గానాలతో సభనంతా అలరింప జేయడం అతనికి  చాలా ఆనందం కలగ చేసింది. స్వామి నారాయణ గారి పట్ల ఆతని భక్తి ప్రత్తులుఇంకా ఎన్నో రెట్లు పెరిగాయి. కీర్తన అయిపోయిన వెంటనే అతను ఆనందాశ్రువులు కార్చుతూ,సాష్టాంగ ప్రణామం చేశాడు స్వామి నారాయణ గారికి. ఆ తర్వాత చేతులు జోడించి నమస్కరించి, స్వామీ ! 

నేను ఇంత కాలం మహారాజులు, శ్రీమంతుల దగ్గర వారి మీద పొగడ్తలతో ఎన్నో కవితలు చెప్పివాళ్ళిచ్చే కానుకలు తీసుకుని నా జీవితం గడుపుతూ వచ్చాను. కాని ఈ రోజు మీ దగ్గరకి వచ్చాక, మిమ్మల్ని చూశాక, మీ దర్శనం కలిగాక నేను ఎంతో పొరబాటు చేశాను అని నేను లెక్క వేసుకున్నాను. జీవితంలో నేను ఎంతో   సంపాదించాను అని అనుకునేవాడిని. కాని మీ దర్శనం అయ్యాక నేనెంత కోల్పోయానో అని నాకు నిజమైన పశ్చాత్తాపం కలుగుతుంది ప్రభూ ! నేను నా తప్పుని సరి దిద్దుకోవాలి అని అనుకుంటున్నాను. నేను ఈ రోజు నుంచి మనుషుల మీద కవిత్వం చదవను, కవితలు చెప్పను. నా నాలుక ఈ క్షణం నుంచి భగవంతుని కీర్తనలని మాత్రమే పాడుతుంటుంది. స్వామీ ! నన్ను కనికరించండి. 

నన్ను ఉద్ధరించండి. మీ చరణాల దగ్గర నాకు ఆశ్రయమివ్వండి. నేను సర్వస్య శరణా గతితో మీ దగ్గరే ఉండాలని అనుకుంటున్నానని కన్నీళ్లు కారుస్తూ ఆయన్ని అర్థించాడు.  స్వామి నారాయణ గారు అతని తోటి ఎవరైతే తనకి తాను భగవంతునికి సమర్పించు కుంటారో వారి యొక్క స్థానం భగవంతుని పాదాలలో కాదు భగవంతుని హృదయంలో ఉంటుంది అని ఎంతో ప్రేమగా లాడు దాంజికి చెప్పారు. అప్పుడు భక్తుడు, భగవంతుడు కూడా ఒక్కటై పోతారు. మీరు ఒక పని చేయండి. మీరు కొద్ది రోజులు ఇక్కడే ఉండండి.మీ హృదయాన్ని పరిశుద్ధం చేసుకోండి. ఎందుకంటే ఈ మార్గం చాలా కఠినమైనది. 

ఆ తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి. దాని ప్రకారమే  మనం చేద్దాం అని ఆయనకి  సర్ది చెప్పారు. ఈ మార్గం లోకి మీ మనస్సును మళ్ళించడం చాలా కష్టం. కాబట్టి మీరు కొద్ది రోజులు ఇక్కడే ఉండండి తర్వాత  ఒక మంచి రోజు చూసుకుని నేను మీకు దీక్ష ప్రదానం చేస్తాను అని చెప్పారు. ఈ సంఘటన చూస్తున్న స్వామి దర్బారులో ఉన్న భక్తులందరూ స్వామి వారి లీలను చూసి ఎంతో ఆశ్చర్య పోయారు. అందరూ ఒక్కసారే స్వామి నారాయణ గారికి జయ జయ ధ్వానాలు చేశారు. అక్కడితో సభ ముగిసింది.