N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Saturday, 25 April 2015

SwamiNarayan - Episode 45


లాడు దాంజి (Ladu Danji) నిశ్చయం
ఆ రోజు వారిద్దరూ తాము బస చేసినప్రదేశానికి వెళ్ళాక సోనీ మహాజన్లాడు దాంజిని ఉద్దేశించి," లాడు దాంజి గారూ! నేను స్వామి నారాయణ గారి దర్శనం చేసుకుని  తిరుగు ప్రయాణం అవుదాము” అని అనుకుంటున్నాను. “మరి నేను నా వ్యాపారాన్ని కూడా చూసుకోవాలి కదా! నేను వచ్చిన పని అయింది. స్వామి నారాయణ గారి దర్శనం అయిపోయింది. ఆయన ఆశీర్వాదం లభించింది అందుకనే నేను మా గ్రామానికి తిరిగి వెళ్లి పోవాలి అని అనుకుంటున్నాను . మీరు కూడా నాతొ పాటే వస్తున్నారు కదా !” అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా లాడు దాంజి“సోనీ మహాజన్ గారూ! నేను మీతోబాటు రావడం లేదు. ఇక్కడే ఉండదలచుకున్నాను. స్వామి నారాయణ గారు భగవంతుడు అనే రంగులో నేను కూడా ఒక రంగులాగా పూర్తిగా కలిసి పోదాము” అని అనుకుంటున్నాను. నాకు భగవంతుని దర్శనం లభ్యమయినది.

నాకు సరి అయిన స్థానం స్వామి నారాయణ గారి చరణాల దగ్గరే అని గ్రహించుకున్నాను. అక్కడే నాకు సుఖముశాంతిమోక్షము అన్నీ కూడా ఇక్కడే వారి సాన్నిధ్యంలో లభిస్తాయి” అని గద్గద స్వరంతో సోనీ మహాజన్ కి విన్నవించుకున్నాడు. ఇంత అపారమైన సంపదని వదిలి పెట్టి నేను నీతో రాదలచుకోలేదు. కాబట్టి మీరు వెళ్ళండి”, అని అనగా సోనీ మహాజన్ లాడు దాంజి గారూ ! అంతా బాగానే ఉంది నేను రాజు గారికి ఏం చెప్పాలి?” అని ప్రశ్నించాడు. మీరు ఏమీ చెప్పవలసిన అవసరం లేదు ఎప్పుడైతే మీరు ఒంటరిగా వెనక్కి వెళ్ళ తారో అప్పుడు ఆయనకి అంతా అర్థం అయి పోతుంది. నేను మాత్రం స్వామి నారాయణ గారి పాదాలు వదిలి పెట్టి ఎక్కడికీ వెళ్ళ దలచు కోలేదు అనిచాలా నిశ్చయంగా చెప్పారు. అలాగే అని చెప్పి మరునాడు సొనీ మహాజన్ తిరుగు ప్రయాణానికి తయారు కాసాగాడు.

సురా కాచర్ విచారం
మర్నాడు సోనీ మహాజన్ స్వామి నారాయణ గారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం చేస్తుండగా అతనికి ఎదురుగా  సురా కాచర్ కనిపించాడు. సోనీ మహాజన్ గారూ ! ఏమిటీ మీరు వెళ్లి పోతున్నారామీరు ఒక్కరే వెళ్లి పోతున్నారులాడు దాంజి మీతో రావడం లేదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించగా సోనీ మహాజన్ నేనొక్కడినే వెళ్ళు తున్నాను. లాడు దాంజి గారికి స్వర్గం ఇక్కడే దొరికింది. స్వామి నారాయణ గారి దగ్గరే ఉండ దలచు కున్నాడు అందుకనే నేనొక్కడినే వెళ్లి పోతున్నాను అని చెప్పినమస్కరించి అతను వెళ్లి  పోయినాడు. ఆ మాటలకి సురా కాచర్ కొంచెం గాభరా  పడ్డాడు. అతను “అభయప్పా” ! “అభయప్పా” ! అంటూ అభయ్ దర్బారుని ఉద్దేశించి ఎలుగెత్తి పిలుస్తూ  ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. అక్కడ ఉన్న సభ్యులు, అభయ్ కాచర్ కనిపించగా రేపు మీరు ఇక్కడ ఉండగలుగుతారో లేదో అని నాకనుమానంగా ఉంది అని అనగా ఎందుకంత గాభరాగా అడుగుతున్నారు అని అడిగారు. ఇంకా మీకేమీ తెలియ లేదా ? అంటూ ఇంకా ఏముందిసోనీ మహాజన్ వెళ్లి పోయాడు. కాని లాడు దాంజి మాత్రం దర్బారు గడ్ లోనే ఉండడానికి   నిశ్చయించు కున్నాడు. ఇలా జరుగుతూ ఉంటె ఈ ప్రదేశమంతా  సాధువులుసన్యాసులతో నిండి పోతుంది అప్పుడు మీకు ఇక్కడ ఉండడానికి కూడా జాగా ఉండదు కదా ! అభయ్ కాచర్ ! ఎంత పని చేశావు నీవునీ ఆస్తి అంతా, నీ సర్వస్వం స్వామి నారాయణ గారి పేరున వ్రాసి ఎంత పొరబాటు చేశావు? మీకు ఇక్కడ ఉండడానికి కూడా ఖాళీ ప్రదేశం ఉండదు. ఇప్పుడు ఎలాగా? అంటూ చాలా బాధ పడి పో సాగాడు. దానికి సమాధానంగా అభయ్ కాచర్ సర్వస్య శరణాగతి పొందాను కదా ! నా సర్వస్వం ఆయనకే అర్పించాను. ఇక ఆయనే మమ్మల్నందరినీ  చూసుకుంటాడు అనే నమ్మకం నాకుంది. ఆయన ఏం చేసినా అన్నీ ఆలోచించే చేస్తాడు సుమా ! అని చెప్పాడు. అభయ్ కాచర్ గారూ ! మీ ఇద్దరి కూతుర్ల పెళ్ళిళ్ళు చక్కగా అయిపోయాయి. మంచి అల్లుళ్ళు దొరికారు. వాళ్ళు స్థిర పడిపోయారు. ఇంకా మీకు పెళ్లి కాని  ఇద్దరు పుత్రికలు ఉన్నారు. మరి వారి వివాహాలు చేయ వలసిన బాధ్యత మీ ముందు ఉన్నది కదా ! మరి ఇవన్నీ స్వామి నారాయణ గారే చూసుకుంటారా? అని ప్రశ్నించాడు. సురా కాచర్ మాటలు వింటున్న అభయ్ కాచర్ ఇద్దరు కుమార్తెలు తాము వివాహం చేసుకోమని సురా కాచర్ కి గట్టిగా చెప్పేశారు. దానితో సురా కాచార్ చాలా ఆశ్చర్య పడిపోయాడు. అతనికి ఏం సమాధానం చెప్పాలో తెలియ లేదు. అభయ్ కాచార్ కుమార్తెలు తాము కన్యల్లాగే ఉండిపోవడానికి నిశ్చయించు కున్నామని మరొక్కసారి ఖచ్చితంగా చెప్పేశారు.

స్వామి నారాయణ గారితో విన్నపం
ఈ మాటలు విన్న సురా కాచర్కి , అభయ కాచర్ కుటుంబ సభ్యులకి ఏం చేయాలో తెలియక స్వామి నారాయణ గారి దగ్గరకి వెళ్లి ఈ విషయం ప్రస్తావించారు. దానికి సమాధానంగా ఆయన ఇది వారి వ్యక్తిగత విషయం కాబట్టి వాళ్ళే నిర్ణయించు కోవాలి. సంసార ఆశ్రమానికి కాని, సన్యాసి ఆశ్రమానికి కాని రమ్మని నేను చెప్పలేను. ఇది వారి వ్యక్తిగత నిర్ణయం. సమయమే దీనికి పరిష్కారం చూపుతుంది  కాబట్టి మీరు ఎటువంటి ఆందోళన పడ వలసిన అవసరం లేదు అని వారికి ఆయన సాంత్వన వచనాలు చెప్పి వారిని పంపించి వేశారు. .