N. Sairam Garu : +91 7901268716 || Email: sridatta50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.Saturday, 13 June 2015

SwamiNarayan - Episode 48

వృద్ధురాలి సేవ
ఒకసారి స్వామి నారాయణ గారు తన అనుచరులతో ఒక గ్రామం పోలిమేరవైపు నడచి వెళ్ళుతుండగా ఆయన ఒక  అద్భుతమైన దృశ్యాన్ని చూశారు. ఒక వృద్ధురాలు తన చేతిలో ఆహారపు పాత్రను పట్టుకుని, మంచి నీళ్ళను తీసుకుని అక్కడకి వచ్చి , అక్కడే కూర్చున్నటువంటి అనాథ బాలకుల దగ్గర ఎంతో ప్రేమగా “నాయనలారా ! మీరు కడుపు నిండా తినండి. ఈ భోజనాన్ని స్వీకరించండి. నేను చాలా దూరంనుంచి శ్రమ పడి తీసుకుని వచ్చాను. కొద్ది కొద్దిగా ఈ నీళ్ళని త్రాగండి” అని దగ్గరుండి మంచి మంచిగా మాట్లాడుతూ ఆ భోజనాన్ని, ఆ జలాన్ని సమర్పించింది. స్వామి నారాయణ గారు ఈ దృశ్యాన్ని చూసి ద్రవించి పోయారు. ఆయన ఆ వృద్ధురాలిని సమీపించి, “అమ్మా ! మీరు ఎంతో పుణ్య కార్యాన్ని చేస్తున్నారు. ఆకలితో ఉన్న వారికి భోజనం ఇవ్వడం, దప్పికతో ఉన్నవారికి మంచినీళ్ళు ఇవ్వడం అంటే చాలా పుణ్యకార్యం. అలాంటి పుణ్య కార్యాన్ని మీరు చేస్తున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది.అని అన్నారు.
“ఏం చేయాలి నాయనా ? ఈ జేతల్పూర్ గ్రామంలో కరువుకాటకాలు వచ్చాయి. పంటలేమీ పండలేదు. ప్రజలంతా బాధ పడుతున్నారు. ముఖ్యంగా ఈ అనాథ బాలకులు , బీద వాళ్ళు, పేదవాళ్ళు ఎక్కువగా  బాధ పడుతున్నారు స్వామీ ! తినడానికి కూడా తిండి లేకుండా వాళ్ళు శుష్కించి పోతున్నారు. విలాసాలకి జనాలు డబ్బు ఖర్చు పెడతారు కాని ఇలాంటి పనులకి డబ్బు ఖర్చు పెట్టరు కదా !” అని ఆ వృద్ధురాలు అన్నది.

ఆ వృద్ధిరాలితో స్వామినారాయణ అనుచరులు “అమ్మా! నీవు చేస్తున్నావు కదా ఇంత సేవ ! నీవన్నది నిజమే ! చాలామంది తమ సుఖాల కోసము, జిహ్వ చాపల్యం కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు కాని ఇతరుల ఆకలి గురించి ఆలోచించరు.” అని అన్నారు.

 “నాయనలారా ! నా గురించి ఏమీ చెప్పవద్దు. నేను మాత్రం ఎంత చేస్తున్నాను ? ఎంత భోజనం పెడుతున్నాను? కొద్దిగా సెనగలు, దానితో పాటు కొంచెం బెల్లం అంతే. అంత కన్నా నేను ఎక్కువ ఏమీ చేయడం లేదు కదా !” అని స్వామి నారాయణ గారిని తేరిపార చూసి “అయ్యో ! నేను మిమ్మల్ని ఇదివరకే ఎక్కడో చూశాను. అవును, మీ ముఖం నాకు పరిచయమే. రోజూ ప్రాతఃకాల సమయంలో ఈయన ముఖం చూస్తూ ఉంటాను. నాకు ఈయన కనిపిస్తూనే ఉంటారు. కరుణాదృష్టి ప్రసారించే ఈయన కన్నులు, చాలా అందంగా కనిపించే ఈ ముఖము ఇవన్నీ నాకు తెలుసు. అయ్యో మీరా  ! నేను ఇంతసేపు మిమ్మల్ని గుర్తు పెట్టలేదు” అంటూ గబ గబా వంగి స్వామి నారాయణ గారి పాదాలను స్పృశించి ఎంతో భక్తి భావంతో కళ్ళ కద్దుకుంది. గొంతు గద్గదమైపోయింది. కళ్ళ నుండి అశ్రువులు కారుతున్నాయి. కృష్ణా ! నా కృష్ణుడు నాకు కనిపిస్తున్నాడు. నేను రోజు నా కృష్ణుడ్ని చూస్తున్నాను. నువ్వే నా రాముడివి, నీవే నా కృష్ణుడివి” అని ఆవిడ అంటుండగా స్వామి నారాయణ గారు, “ మాతా ! మీరు పెద్దవారు. కుమారుడి పాదాలు మీరు త్రాకితే నాకు పాపం రాదా?”అని ప్రశ్నించారు.

“ ఎదురుగా దేవుడు కనిపించినప్పుడు ఆయన చరణస్పర్శ చేయకుండా ఉంటేనే పాపం వస్తుంది. మరి ఎదురుగుండా నా కృష్ణుడు నాకు కనిపించినప్పుడు నేను ఆయన చరణస్పర్శ చేయకుండా ఎలా ఉండగలను ప్రభూ?”

“అవును ! నాకు ఇప్పుడు గుర్తుకి వచ్చి౦ది. మీరు స్వామి నారాయణే కదా! మా గురువైన శ్రీ రామానంద స్వామి వారి ఉత్తారాధికారి మీరే కదా ! ఆహా ! ఏమి సౌభాగ్యం ! ఆహా ! ఏమి అదృష్టం! జేతల్పూర్ గ్రామంలోకి మీరు అడుగు పెట్టారు. ఇక మా కష్టాలన్నీ తీరి పోతాయి. ఈ కరువు కాటకాల సమస్య కూడా సమసిపోతుంది. ఈ రోజు నాకు ఎంత సంతోషంగా ఉందో” అని ఆవిడ ఇలా సంతోషంగా రకరకాలుగా మాట్లాడ సాగింది. అదే రకమైన అనేక భావాలు కలిసి ఒక్కసారిగా ఆవిడని ఉక్కిరిబిక్కిరి చేశాయి.

కరువు రక్కసి

స్వామి నారాయణగారు జేతల్పూర్ గ్రామంలోకి వచ్చారని తెలియ గానే అనిక మంది గ్రామస్థులు ఎదురువెళ్ళి ఆదరంగా ఆయన్ని ఊళ్లోకి తీసుకుని వచ్చారు. అక్కడ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ జేతల్పూర్ గ్రామం ప్రస్తుతం అకాల పరిస్థితుల వల్ల కరువు అనే రక్కసి చేతిలో నలిగి పోతున్నది. ముఖ్యంగా బీదవాళ్ళు చాలా బాధ పడిపోతున్నారు. ఈ గంగా బాయి రెండు చేతులతో తనకు తోచిన సేవ చేస్తూనే ఉంది. కాని ఇక్కడ తినిపించవలసిన నోళ్ళు కొన్నివేల సంఖ్యలో ఉన్నాయి. అదే కదా మన సమస్య. ఈ కరువు నివారణ చేయడం కోసమే నేను ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాను. ఈ గంగా బాయిలాంటి వాళ్లకి ఆసరాగా, సహాయంగా మనమందరమూ కూడా సమిష్టిగా చేతులు కలపాలి. అందరూ కలిసి పని చేయాలి. అప్పుడు ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఆశారా౦ గారూ ! ఈ సందర్భంలో ఇదే నేను మీ అందరికీ చేస్తున్న అభ్యర్థన. ఆశారాం గారూ ! ఈ సందర్భంలో నేను మీ అందరికీ ఒక కథ చెప్పదలచుకున్నాను.

సాధువు ఆలోచన

ఒకప్పుడు ఒక రాజ్యంలో ఒకసారి కరువు తాండవించింది. ఆ పట్టణపు మహారాజు చాలా దయగలవాడు. అతను తన భాండాగారాన్ని తెరచి తన సంపద అంతా ప్రజలందరికీ ఆహారం కోసం విడుదల చేశాడు. అయినప్పటికీ చాలా మంది ఆకలి దప్పులతో చని పోసాగారు. ఆ మహారాజుగారికి ఏం చేయాలో పాలుపోలేదు. తన భాండాగారమంతా ఖాళీ అయిపోయింది. తన సర్వస్వం ప్రజలకి ధారపోశాడు. అతనికి ఏం చేయాలో తోచక ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. ఆ సమావేశంలో ఆ మహారాజుగారు కరువు పరిస్థితుల గురించి చెప్పుతూ ఎవరు  మనకు ఈ సమయంలో సహాయం చేయగలుగుతారు అని ప్రశ్నించారు. అప్పుడు సమావేశంలో కూర్చున్న ఒక సాధువు లేచి నిలబడి “మహారాజా ! ఆ పని నేను చేస్తాను” అని అన్నాడు. ఆ మాటలకి రాజు గారు ఆశ్చర్య పడిపోయి నీవు సాధువ్వి. నీవే భిక్ష ఎత్తుకు౦టావు కదా ! మరి నీవెలా సాయం చేయగలవు? అని ప్రశ్నించారు.

“మహారాజా ! మీరు శ్రీమంతులు. మీరే కాకుండా మిగతా శ్రీమంతులకి ఎప్పుడు ఒకరికి ఇవ్వడమే గాని ఒకరి దగ్గర్నుంచి  పుచ్చుకోవడం తెలియదు కదా ! వాళ్ళు సహాయం అడగడానికి ఇబ్బంది పడతారు. మాకటువంటి ఇబ్బంది లేదు. ఎవరినైనా సరే మేము యధేచ్చగా భిక్ష అడుగుతాము. మా సాధువుల౦దరమూ ఒక సమూహంగా ఏర్పడి ప్రతీ ఇంటికి వెళ్లి మేము దానం అడుగుతాము. వాళ్ళు ఇచ్చినటువంటి అన్నదానంతో, వస్త్రదానంతో మేము ఈ ప్రజలందరికీ భోజనం సమకూర్చ గలుగుతాము, మహారాజా ! మీరు సందేహించకండి” అని చెప్పాడు.

ఈ కథ విన్న స్వామి నారాయణ గారి అనుచరుడొకడు “స్వామీ ! మీరు ఏం చెప్పదలచుకున్నారో మాకు అర్థం అయిపోయింది. అప్పుడు ఆయన స్వామి నారాయణ గారి అనుచరులతోటి, మిగతా గ్రామస్థులందరితోటి కూడా మనం ప్రతీ ఇంటికి వెళ్లి భిక్ష అడుగుదాము. వాళ్ళు ఇచ్చే అన్నదానంతో మనం ఈ ప్రజల ఆకలి మంటలని చల్లార్చ గలుగుతాము. ఏమంటారు మీరందరూ? వస్తారా? భిక్షా కార్యక్రమం మొదలుపెడదాము” అని అన్నాడు. అందరూ సరే అలాగే ! మనం ఈ భిక్షా కార్యక్రమం మొదలు పెడదాం. అని అన్నారు. అందులో ఒక గ్రామస్థుడు ఈ కరువుకాటక పరిస్థితుల్లో వాళ్ళకే కష్టంగా ఉంటు౦ది కదా ! పైగా వాళ్ళు వాళ్ళకున్న ధాన్యాలని రాబోయే రోజుల కోసం దాచిపెట్టుకుంటారు కదా !  మరి వాళ్ళు మనకి ఏమీ దానం చేయకపోతే? అని అనుమానాన్ని వ్యక్త పరిచాడు. “కోడేదాసు గారూ ! దానికి కూడా నా దగ్గర ఒక ఉపాయం ఉన్నది” అని స్వామి నారాయణ గారు చెప్పారు.

విష్ణు యాగం  

దానికి సమాధానంగా స్వామి నారాయణగారు మనం విష్ణు యాగమనే ఒక యజ్ఞాన్ని చేద్దాం. ధర్మ ప్రచారంకోసమై చేస్తున్న ఈ యాగానికి ప్రజలందరూ తప్పకుండా వచ్చి స్వచ్చందంగా తమకి తోచిన విరాళాలు వస్త్ర రూపంలో గాని, ధన రూపంలోగాని ఇస్తారు. ఎంతో కొంత విరాళంగా ఇచ్చి కాస్తైనా పుణ్యం సంపాదించుకోవాలి అనే తాపత్రయం ప్రతీ వాళ్లకి ఉంటుంది కాబట్టి స్వచ్చందంగా వాళ్ళే ఈ యజ్ఞంలో పాల్గొంటారు. ఇక్కడ అందరికీ ప్రవేశం ఉంటుంది. ఇక్కడ ఎవరైనా భోజనాలు చేయవచ్చును. సరిగ్గా ఈ యజ్ఞం మనం 18 రోజులు చేద్దాము. అయితే ఈ యజ్ఞం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఇది అహింసా యజ్ఞం మాదిరిగా ఉంటుంది. ఇవ్వాళ రేపు ఎక్కడ చూస్తున్నా ఈ యజ్ఞాలలో జంతుబలి చేస్తూ ఉంటారు. కాని మనం మాత్రం మనం చేసే ఈ యజ్ఞంలో కూరగాయలు మాత్రమే వండి అందరికీ అన్నదానం చేద్దాము. ఈ అహింసా యజ్ఞం మూలంగా ప్రకృతి మాత శాంతిస్తుంది. సంతోషిస్తుంది. జేతల్పూర్ గ్రామంలో తప్పకుండా ఈ 18 రోజుల తర్వాతా కరువు కాటక పరిస్థితులు ఉండనే ఉండవు, అవన్నీ దూరంగా పారిపోతాయి అని స్వామి నారాయణ గారు అక్కడ సమావేశమైన అందరికీ చెప్పారు. అదే విధంగా చుట్టూ ప్రక్కల గ్రామాల్లో కూడా ఈ విష్ణుయాగం గురి౦చి బాగా ప్రచారం జరిగింది. అనేక మంది ప్రజలు, భక్తులు తమకు తోచిన విధంగా విరాళాలు ధనరూపంలోనో, వస్తు రూపంలోనో బండ్ల మీద యాగం జరిగే స్థలానికి తీసుకుని రాసాగారు. స్వామి నారాయణ గారు చేస్తున్న ఈ విష్ణు యాగంలో గంగాబాయి చాలా ఉత్సాహంగా పాల్గొన్నది. వచ్చిన కూరగాయలన్నింటినీ చక్కగా కడిగి తరిగి పెట్టడమూ, భోజనాలు వడ్డించడమూ ఇలా తనకు తోచిన విధంగా ఆవిడ అక్కడ సేవ చేయడం మొదలు పెట్టింది. 

ఇదే రీతిన స్వామి నారాయణ గారి మిగతా అనుచరులు కూడా ఏదో ఒక విధంగా సేవ చేయడం మొదలు పెట్టారు. ఈ విష్ణు యాగం గురి౦చి తెలిసి వేలాది ప్రజలు తండోపతండాలుగా యజ్ఞం చూడడానికి వచ్చి తృప్తిగా భోజనం చేశారు. వాళ్ళందరికీ భోజనాలతో పాటు దక్షిణ ఇవ్వడం కూడా జరిగింది. ఇది చూసి అందరూ చాలా ఆశ్చర్య పోయారు. ఈరోజుల్లో కూడా, ఇంత విషమ పరిస్థితుల్లో , ఇంత భయంకరమైన కరువుకాటక పరిస్థితుల్లో కూడా వచ్చిన వాళ్ళందరికీ లేదనకుండా మధురమైన పదార్థాలతో, పంచ భక్ష్య పరమాన్నాలతో భోజనం పెట్టడమే కాకుండా బీదవాళ్ళందరికీ దక్షిణ ఇవ్వడం కూడా చూసి వచ్చిన వారంతా ఆశ్చర్య చకితులయ్యారు. ఈ విష్ణు యాగంతో స్వామి నారాయణ గారి కీర్తి దశదిశలా మారుమ్రోగి పోయింది. ఎవరినీ “దేహీ” అని అడక్కుండానే, యాచించకుండానే ఈ విష్ణు యాగానికి కావలసినవి అన్నీ స్వచ్చందంగా, అయాచితంగానే విరాళ రూపంలో చేకూరినాయి. ధాన్యాగారపు గది, వంట గది చాలా సందడిగా, కోలాహలంగా ఉండిపోయింది. వేలాదిమంది ప్రజలు ఈ సేవలో పాల్గొన్నారు.

భిక్షకుల విరాళం

ఆ గ్రామంలో కొంత మంది బిచ్చగాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రతి రోజు బిచ్చమెత్తుకుని వారి వారి కుటుంబాలని పోషించుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళ ఊళ్ళో జరుగుతున్నా విష్ణు యాగాన్ని వాళ్ళు గమనించారు. ఆ బిచ్చాగాళ్ళలో ఒకతనికి ఒక ఆలోచన వచ్చింది. అతను చల్ల గంభీరంగా ఏదో ఆలోచనలో ఉన్నట్టు గమనించిన మిగతా బిచ్చగాళ్ళు సంగతి ఏమిటీ అని అడిగారు. అతను ఈ విధంగా చెప్పాడు. మనము ఇలా రోజు బిచ్చమెత్తుకుని ఆ వచ్చిన దానితో మన కుటుంబాలని మనం పోషించుకున్తున్నాము. అక్కడ విష్ణు యాగంలో స్వామి నారాయణ గారు వచ్చిన వాళ్ళందరికీ అన్నదానంతో పాటు వస్త్ర దానం కూడా చేస్తున్నారు. దానికి సమాధానంగా ఇంకొక బిచ్చగాడు అవును! వాళ్లకి మనకి తేడా ఏముంది? మనమూ ధర్మం పేరుతొ బిచ్చం అడుక్కుంటున్నాము, వాళ్ళూ ధర్మ౦ పేరుతొ బిచ్చమడుక్కు౦టున్నారు! ఇది మన వ్యాపారం.

అవును నీవు చెప్పింది నిజమే ! కాని వాళ్ళు ధర్మం పేరున బిచ్చం అడుగుతున్నా నిస్వార్థంతో వాళ్ళు ప్రజలకి సేవ చేస్తున్నారు. వాళ్ళు బిచ్చం అడుక్కున్నా ఆ వచ్చే బిచ్చం తో ఆకలితో నక నకలాడుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్న ప్రజలకి అన్న దానం చేసి వాళ్ళ పోతున్న ప్రాణాలని నిలబెడుతున్నారు. అంతే కాదు వస్త్రదానం కూడా చేస్తున్నారు. కాని మనం ఏం చేస్తున్నాము? ధర్మం పేరున ప్రతీ వాళ్ళని “ధర్మం చేయండి”, “ధర్మం చేయండి” అని అడిగి ఆ వచ్చిన డబ్బుని కేవలం మన కుటుంబాలని పోషించడం కోసం మనం ఉపయోగిస్తున్నాము. మనం చేస్తున్న పనికి వాళ్ళు చేస్తున్న సేవకి తేడా లేదంటారా? వాళ్ళు చేస్తున్న సేవ నిస్వార్థంతో కూడినది అయితే మనం చేస్తున్న సేవ స్వార్థంతో కూడినది, అదే నేను చాలా గంభీరంగా ఆలోచిస్తున్నాను అని అన్నాడు.

అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటావు? అని రత్న అనే కుంటి బిచ్చగాడు అడిగాడు. “మనకి వచ్చిన డబ్బులో ఎంతో కొంచెం స్వామి నారాయణగారు చేస్తున్న విష్ణు యాగానికి విరాళ౦గా ఇస్తే బాగుంటుంది. మనం ఇచ్చే డబ్బుతో ఒక్క పొట్ట అయినా నిండుతుంది. ఈ మంచి పనిలో పాల్గొన్నందుకు మనకి కూడా కొంచెం పుణ్యం లభిస్తుంది. ఎందుకు మనం ఈ మంచి పనిలో భాగం తీసుకోకూడదు?” అని వాళ్ళలో వాళ్ళు సంప్రదించుకుని స్వామి నారాయణ గారి దగ్గరకి వెళ్ళారు.

వీళ్ళ౦దరినీ చూసి స్వామి నారాయణ గారు “మీరందరూ ఎవరు? ఎక్కడనుంచి వస్తున్నారు ? ఏమిటీ సంగతి?’’ అని అడిగారు. దానికి వాళ్ళు “స్వామీ ! మేమంతా చిన్నవాళ్ళము. మీరేమో పెద్దవారు.  మీరు ఇతరుల మంచి కోసం బిచ్చం తీసుకుంటారు. మేము మా స్వార్థం కోసం బిచ్చం తీసుకుంటాము. మీరు ఆకలితో ఉన్న ఇతరుల పొట్టలని నింపుతుంటే మేము మా పొట్టలని నింపుకుంటున్నాము” అని చెప్పారు.
 “ఇంతకీ మీరు ఇక్కడకి ఎందుకు వచ్చారు? ఏం చేయాలి?”అని అనుకు౦టున్నారు? అని స్వామి నారాయణ గారు ప్రశ్నించారు. “
“శ్రీహరీ ! మేము భిక్షగా తీసుకున్న ఈ ధనంలో కొంచెం మీరు చేస్తున్న ఈ యాగానికి విరాళంగా ఇద్దాము అని అను కుంటున్నాము. ఒకరు తింటున్న రొట్టె మీదైనా మా నామం వ్రాసి ఉంటుంది కదా! కొంచమైనా పుణ్యాన్ని మేము సంపాదించుకోవాలి అని అనుకుంటున్నాము అని చెప్పి వాళ్ళు తెచ్చిన డబ్బుల మూటలో ఉన్న నాణాలని స్వామి నారాయణ గారికి ఇవ్వాలి అని లెక్క పెడుతుండగా అక్కడ ఉన్న వర్తకులు చాలా హేళనగా మాట్లాడారు. ఏమిటీ? ఇక్కడ ప్రతి రోజు కొన్ని వేల మంది వచ్చి భోజనాలు చేసి వెళ్ళుతున్నారు. మీరు ఇచ్చే ఈ మూడో నాలుగో నాణాలతో అన్నదానం ఏం జరుగుతుంది అని మీరను కుంటున్నారు?తుచ్చమైన మీ దానాన్ని స్వీకరించడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు. మీరందరూ ఇక్కడకు వచ్చి కడుపు నిండా తృప్తిగా భోజనం చేసి వెళ్ళండి కాని మీరు ఇక్కడ ఏమాత్రం డబ్బు ఇవ్వవలసిన అవసరం లేదు. అంటే కాని మీరు తెచ్చిన ఈ ౩, 4 పైసలతో ఎవ్వరి కడుపు నిండదు అంటూ వ్హాలా అవహేలంగా మాట్లాడారు. దానికి పాపం ! ఆ బిచ్చగాళ్ళంతా చాలా బాధ పడిపోయారు. ఏం చేయాలో, ఏం మాట్లాడాలో వాళ్లకి దిక్కు తోచకుండా ఉంది.అప్పుడు స్వామి నారాయణ గారు “శేటుగారూ ! ఇదివరకు నేను మీకు ఒక కథ చెప్పాను గుర్తుందా?అయితే అప్పుడు నేను ఆ కథని పూర్తిగా చెప్ప లేదు. ఇప్పుడు ఆ మిగతా కథని చెప్పుతాను.”
ఆ సాధు మహాత్ముడు చెప్పినట్టుగానే మిగతా సాధు సమాజంతో కలిసి బయల్దేరి  ఆ గ్రామంలో ప్రతీ ఇంటికి వెళ్లి భిక్షను గ్రహించడం మొదలు పెట్టారు. అనుకోకుండా వాళ్లకి విరాళాలు ధన రూపేణా, వస్తురూపేణాసమృద్ధిగా వచ్చాయి.    అందించారు. ఒక రోజు ఆ సాధు మహారాజు భిక్ష పాత్ర పట్టుకుని భిక్ష కోసం వెళ్ళుతుండగా చెట్టు చాటునుంచి ఒక స్త్రీ గొంతు ఇలా వినిపించింది. సాధు మహాత్మా ! ఆగండి ! నేను కూడా మీకు దానం చేయాలి అని అనుకుంటున్నాను అని ఆవిడ చెప్పింది. సాధు మహారాజు సరే అని అటువైపు వెళ్లి చూడగా ఆ స్త్రీ వంటిమీద జీర్ణావస్థలో ఉన్న బట్టలతో కనిపించింది. ఆమె చెట్టు చాటున వెళ్లి తన ఒంటిమీద ఉన్న వస్త్రాన్ని తీసి భిక్ష పాత్రలో వేసి స్వామీ ! నా దగ్గరే ఇదే ఉన్నది. ఇంతకన్నా మించి నేనేమీ చేయలేను. దయ చేసి నా  భిక్షని స్వేకరించండి అని ఆ సాదు మాహారాజు గారిని ఎంతో ఆర్తితో ప్రార్థించింది. సరే అని ఆ సాధుమహాత్ముడు ఆ భిక్షని స్వీకరించాడు. దానం చేసే ప్రతీ వ్యక్తి తన దగ్గర ఉన్నది కొంచెం దాచుకుని కొద్దిగా మాత్రమే దానం చేస్తారు. కాని ఈ పేదరాలు నిరుపెడగా ఉంది ఒంటిమీద చిరిగి పోయిన వస్త్రాలే ఉంటే అవి కూడా స్వార్థం లేకుండా, జరుగుతున్నవిపరీత పరిస్థితులకి మనస్సు ద్రవించి ఆచ్చాదంగా ఉన్న ఆ ఒక్క జీర్ణావస్థలో ఉన్న వస్త్రాన్ని సహృదయంతో దానం చేసింది. అదే విధంగా ఈ నలుగురు సోదరులు కూడా వాళ్ళు సంపాదించింది సర్వస్వమూ మనకి విరాళంగా ఇస్తున్నారు కదా ! ఇది తుచ్చమైన దానం ఎలా అవుతుంది శేటు గారూ ? ఇప్పుడు  మనకు వచ్చిన దానాలన్నింటిలో వీళ్ళు ఇస్తున్నదే శ్రేష్టమైన దానం అని మీరందరూ గ్రహించండి అని చెప్పి, “సోదరులారా ! మీరు ఆ దానాన్ని ఇవ్వండి” అని చెప్పి ఆయనే స్వయంగా వారి దగ్గరనుంచి ఆ  విరాళాన్ని స్వీకరించారు. శేటుగారు సిగ్గుతో తల దిన్చుకున్నారు. ఒక్కసారిగా అక్కడ గుమిగూడిన జనాలు “స్వామి నారాయణ గారికీ జై “ అని జయజయ ధ్వానాలు చేశారు. ఈ విధంగా స్వామి నారాయణ గారు ఆ బిచ్చగాళ్ళు ఇచ్చిన దానానికి నిర్వచనం చెప్పారు. అది కూడా సహజమే కదా ! దానం ఇచ్చేవాళ్ళు ఎంతో కొంత దాచుకుంటూ ఉంటారు. కొంతమంది తమకున్న సర్వస్వం దానంక్రింద అర్పించుకుంటారు. మరి వారిద్దరిలో తేడా ఉంటుంది కదా ! అని అందరూ అనుకున్నారు. దిగులు పడిపోయిన ఆ బిచ్చగాళ్ళ మనస్సులు సంతోషంతో  నిండి పోయింది. సాక్షాత్తు భగవంతుడైన స్వామి నారాయణ గారు వాళ్ళు ఇచ్చిన దానానికి సర్వ శ్రేష్టతని ఆపాదించడం వాళ్లకి ఎంతో సంతోషం కలిగించింది. ఆనందబాష్పాలతో వాళ్ళు చేతులు జోడించి ఎంతో భక్తితో నమస్కరించారు. 
వర్తకుల కుట్ర
ఈ విధంగా ఆ గ్రామంలో జరుగుతున్న విష్ణు యాగం వల్ల ప్రతి నిత్యం కొన్ని వేలాదిమంది ప్రజలు అక్కడకు వచ్చి అన్నదానము, దానితో పాటు వస్త్ర దానము, దక్షిణ కూడా స్వీకరించడం వల్ల స్వామి నారాయణ గారి ఖ్యాతి పెరగడం అక్కడ ఉన్న వర్తకులు జీర్ణించుకోలేక పోయారు. వాళ్ళ వ్యాపారం దెబ్బ తిన్నది. ఆహారా ధాన్యాలన్నీ వాళ్ళు సేకరించి, వాటిని ఒక గిడ్డంగిలో దాచి, ఈ కరువుకాటక  పరిస్థితుల్లో వాటిని అధిక ధరలతో అమ్మి లాభాలను సంపాదించుకునే ఆ వర్తకుల దగ్గరకి ధాన్యాన్ని కొనడానికి ఇప్పుడు ఎవ్వరూ రావడం లేదు ఎందుకంటే ఆ చుట్టుప్రక్కల ఉన్న సంపన్న రైతులు వారి పొలాల్లో పండి౦చిన ధాన్యాన్నిబండ్లతో విష్ణు యాగం జరిగే ప్రదేశానికి తీసుకుని వచ్చి దానం చేస్తు౦డడంతో వీరి వ్యాపారమంతా కుంటుపడి పోయింది. అంటే కాకుండా వాళ్ళకి చెడ్డ పేరు రావడం మొదలు పెట్టి౦ది. అందరికీ తెలిసి పోయింది. ఈ వర్తకులంతా సరుకులను దాచి ఈ కరువు కాటక పరిస్థితుల్లో అధిక ధరలకు అమ్మి లాభాలను చేసు కుంటున్నారని  అందరికీ తెలిసిపోయింది. అందుకని వారందరూ కలిసి ఒక కుట్ర పన్నారు. ఆ వర్తకుల నాయకుడు, “చూడండి! మన వ్యాపారమంతా కొట్టుకు పోయింది. ఎక్కడ చూసినా స్వామి నారాయణ గారి పేరే మరు మ్రోగుతుంది. మానని ఎవరూ పట్టించుకొనడం లేదు. మానని ఎవరూ ఖాతరా కూడా చేయడం లేదు. ఆఖరికీ మనం ప్రభుత్వానికి కూడా పడకుండా పోయాం. ప్రభుత్వం కూడా ఇప్పుడు స్వామి నారాయణ గారి మాటే వింటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అని వాళ్ళలో వాళ్ళు చర్చించు కుంటూ ఉండగా అతను మనం ఎలాగైనా సరే స్వామి నారాయణ గారిని హత్య చేయాలి అని అన్నాడు. ఈ మాట విని అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. మనం వర్తకులం కాని హంతకులం కాము కాబట్టి మనం ఇటువంటి ఆలోచనలు మాను కోవాలి వెర్రె విధంగా ఆయన ఆత్మా హత్య చేసుకునే పరిస్థితులు కలిగించాలి అని వారి నాయకుడు చెప్పగా అదెలా సాధ్యం? అని మిగతా వర్తకులందరూ అడిగారు. ఎలా సాధ్యమంటే మనమందరమూ స్వామి నారాయణ గారి శిష్యుల్లాగా మారువేషాలు వేసుకుని వాళ్ళు యాగానికి , అన్నదానానికి కావలసిన ఉప్పు, సామగ్రి అంతా ఎక్కడ పెట్టారో అక్కడకి అర్ధ రాత్రి  వెళ్లి ఆ సామగ్రి అంతా దొంగిలించి వాటన్నింటినీ మనం ఊరు ప్రక్కనే ఉన్న సరోవరంలో పారేద్దాం. మరునాడు అక్కడ వంట వండడానికి సామగ్రి ఏమీ ఉండదు కదా ! పాత్రలన్నీ ఖాళీగా ఉంటాయి కదా ! ప్రజలంతా హాహాకారాలు చేస్తారు. స్వామి నారాయణ గారిని దూషిస్తారు. ఆ దూషణలని వినలేక , మరి ఈ అవమానాన్ని భరించలేక ఆయన ఆత్మా హత్య చేసుకుంటారు. మళ్ళీ మన వ్యాపారాన్ని ఉప్పడిగాముప్పడిగా మనం పెంచు కొనవచ్చును అని తన పథకాన్ని వివరించాడు. అరె ! ఈ పథకం చాలా బాగుందే ! అని వారందరూ ఒప్పుకుని ఎప్పుడు రాత్రి అవుతుందా అని అందరూ కాచుకుని కూర్చున్నారు. అనుకున్న ప్రకారంగానే ఆ వర్తకులందరూ స్వామి నారాయణగారి శిష్యుల మాదిరిగా వేషధారణ చేసుకుని అర్ధరాత్రి ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తూ అంధకారమనే ముసుగులో వారు ఆ విష్ణు యాగం జరుగుతుండే ప్రదేశానికి వచ్చారు. వస్తు సామగ్రి దాచి ఉన్న ఆ గదివైపు వెడుతుండగా అనుకోకుండా వారికి స్వామి నారాయణ గారి అనుచరుడొకడు కనిపిచాడు. దానితో తొట్రుపాటు పడుతూ “స్వామి నారాయణ” , “స్వామి నారాయణ” ,  అని పలకరించారు. అతను కూడా “స్వామి నారాయణ” ,    అని ఏమిటీ అర్ధ రాత్రి ఇక్కడ ఏం చేస్తున్నారు? అని అడిగితే “ఆహా ! ఏమీ లేదు అంతా సరిగ్గా ఉందో లేదో చూస్తున్నాము”  అని జవాబివ్వగానే “స్వామి నారాయణ” అనుకుంటూ అతను తన దారిన తానూ వెళ్లిపోవడంతో “అమ్మయ్య “ అని వారంతా ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత అక్కడ ఉన్న అన్ని వస్తువులని,తినుబండారాలని, కూరగాయాలని, తినడానికి కావలసిన సమస్త ఆహార  సామగ్రిని తాముముందే  తెచ్చుకున్న సంచుల్లో ఒక్కటి ఒక్కటిగా వాటిల్లో వేయ సాగారు.  వారిలో జిహ్వ చాపల్యం ఉన్న ఒక వ్యాపారి తినుబండారాలని తినబోతుండగా వారి నాయకుడు మీరు అవేవీ తినకండి. తినగానే మీ మనస్సు మారి పోతుందిమనం అనుకున్న పని చేయలేము  అని వారించాడు. ఈ విధంగా అక్కడ నిలవ ఉంచిన మొత్తం ఆహార సామగ్రి అంతా దోచుకున్నారు. పదండి ! ప్రక్కనే ఉన్న ఈ సరస్సులో ఈ వస్తువులన్నీ మనం పార వేద్దాం. రేపు అక్కడ ఏం జరుగుతుందో మనమంతా  తమాషా చూద్దాం అని చెప్పి ఆ ధూర్తులందరూ సమస్త సామగ్రిని సరస్సులో పారవేసి తమ దారిన తాము వెళ్ళిపోయినారు.