N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Sunday, 5 July 2015

SwamiNarayan - Episode 51,

స్వామి నారాయణ ఎపిసోడ్ – 51 (Part 2)

హీరాబాయి సేవాభావం
హీరాబాయి గోధుమ పిండి విసిరి తీసుకుని వచ్చి లోపల పెడుతుండగా అక్కడ ఉన్న సేవకులు, అనుచరులు అందరూ కూడా ఆవిడని అవమానించి విడిగా పెట్టమని కసురుకున్నారు. ఆవిడ ఏడుస్తూ ఆ పిండిని విడిగా పెట్టడానికి వెళ్ళుతుండగా ఇదంతా లోపల కూర్చుని ఉన్న స్వామి నారాయణ గారు విని బయటకి వచ్చి “ఏమిటీ? ఏం జరుగుతుంది? ఈవిడ తెచ్చిన గోధుమ పిండిని విడిగా పెట్టమని ఎందుకు అంటున్నారు? కష్ట పడి, చెమటోడ్చి చేసిన దాంట్లో పుణ్యమే ఉంటుంది కాని పాపం ఉండదు” అని అంటూ ఆయన హీరాబాయి వైపు తిరిగి తల్లీ ! ఈ గోధుమ పిండి నీవే విసిరావా? లేక ఇంకెవరి చేతనైనా విసిరించావా? అని అడిగితె లేదు ప్రభుశ్రీ  !


ఈ గోధుమల్ని నేనే స్వయంగా కూర్చుని విసిరాను. నేనే గోధుమపిండిని చేశాను స్వయంగా  అని విన్నవించుకుంది. అక్కడ నిలబడి ఉన్న మిగతా స్త్రీలందరి వైపూ చూస్తూ తల్లీ ! మీరేం చేశారు అని అనగా ఆవిడ నేను కొంత చేశాను, కొంచెం పనివాళ్ళ చేత చేయించాను ప్రభుశ్రీ! అని చెప్పింది. అలాగా ! అని చెప్ప ఇంకొక ఆవిడని చూసి అమ్మా! మరి మీరేం చేశారు? అని అడగ్గా  ఆవిడ నేను పనివాళ్ళ చేత మొత్తం గోధుమ పిండి అంతా చేయించాను ప్రభూ ! అని సమాధానం చెప్పింది. అక్కడే ఉన్న ఇంకొక మహిలని ఉద్దేశించి మరి మీరు? అని అనగా ఆ మహిళా నేను నా కోడలి చేత చేయించాను.

ఇంటి పని అంతా నా కోడలే చేస్తుంది.  నేను మ మాత్రం కూర్చుని ప్రభుశ్రీ యొక్క నామ జపం చేస్తుంటాను అని చెప్పింది. అప్పుడు ఆయన వారందరివైపూ చూస్తూ చూశారా! ఈమె ఒక్కటే హృదయపూర్వకంగా భక్తి శ్రద్ధలతో తానె స్వయంగా ఈ సేవ చేసింది. కష్టపడి భక్తి శ్రద్ధలతో చేస్తున్న సేవకి చాలా పుణ్యం ఉంటుంది. ఈమె విసిరిన పిండిని నేనే స్వయంగా ప్రసాదంలాగా స్వీకరిస్తాను. అంటే కాదు ఈవిడకి ఏ విధంగా నైతే ముక్తానానంద గారికి మోక్షము లభించిందో  అటువంటి మోక్షాన్ని నేను ఈవిడకి ఇస్తున్నాను అని అక్కడ చేరిన వారందరికీ చెప్పగా వారంతా చాలా ఆశ్చర్యపడి పోయినారు. హీరాబాయి తన చెవులని తానూ నమ్మలేకపోయింది. అందరూ నీవు పాపివి, నీవు పతితవి, నీవు కులతవి అని అవమానాలు చేస్తున్నారు. రాళ్ళు పెట్టి కూడా నన్ను కొట్టారు. ఇంత అవమానం చేస్తున్న నన్ను స్వామి ఎంత కరుణ చూపారు. ఎంత గౌరవాన్ని ఇచ్చారు అని కృతజ్ఞతా భావంతో కన్నీరు కారుస్తూ చేతులు జోడించి స్వామి వారికి నమస్కరించింది.

నా మాట కాదని ఇక్కడ ఎవరైనా ఈ గోధుమ పిండిని ప్రక్కన పెడితే వారందరికీ నేను దూరంగా వెళ్ళిపోతాను జాగ్రత్త సుమా ! అని మరో మారు హెచ్చరించి అమ్మా ! తీసుకుని రామ్మా  ఆ గోధుమపిండిని  అని ఎంతో ప్రేమగా హీరాబాయికి చెప్పగా ఆవిడ నిశ్శబ్దంగా తానూ తెచ్చిన గోధుమ పిండిని ఆయన పాదాల దగ్గర ఉంచి  రోదిస్తూ ఆయన పాదాలకి నమస్కారం చేసింది.ఇదంతా చూస్తున్న స్వామి నారాయణ గారి అనుచరులంతా చాలా ఆశ్చర్యపోయారు. మరి వాళ్ళంతా తక్కువ భూమికలో ఉన్నారు కదా ! సాక్షాత్తు భగవంతుని అవతారమైనట్టి స్వామి నారాయణ గారే వాళ్ళ దగ్గర ఉండగా ఆయనని అర్థం చేసుకోకుండా వాళ్ళే దూరంగా తొలగి పోతున్నారు కదా ! 
ఇదంతా చూస్తున్న సమయదేవత ఆహా ! ఏమి లీల! అయినా ఈ మనుషుల యొక్క విచిత్ర నైజం ఏమిటీ?అర్థం కాకుండా ఉండే! స్వామి వారి దగ్గరే ఉంటూ వారికి సేవ చేస్తూ ఆ భగవంతుడి యొక్క తత్వాన్ని , గుణాలని వీళ్ళు అర్థం చేసుకోలేక పోతున్నారే ! శరీరం కన్నా మనస్సు పవిత్రం కదా ! ఆలోచనలు పవిత్రం కదా ! పైకి ఎంతో నిరాడంబరంగా వస్త్రాలు ధరించి లోపల మనస్సు ఎంతో అపరిశుభ్రంగా ఉంటే లాభం ఏముంది? అయినా ప్రభువు భావప్రియుడు కాని బాహ్య ప్రియుడు కాదు కదా అయినా ఈ విధంగా స్వామీజీ ఆవిడకి ముక్తిని ప్రసాదించారు. ధన్య జీవి కదా ఆ హీరా బాయి !    అని ఎంతో సంతోషంగా అనుకుంది.  

హీరాబాయిలో కలిగిన పరివర్తన

ఆ రోజు రాత్రి వర్తకులంతా హీరాబాయి ఇంటికి వెళ్ళారు. ఇంకా హీరాబాయి రాలేదేమిటీ? కొంచెం తన ఆటపాటలతో మాకు హుషారు కలిగించు. ప్రోద్దున్నించి మేమంతా పనులుచేసి అలసి పోయి ఉన్నాము అని తొందర పెట్ట సాగారు. హీరాబాయి గారి పిన్ని వాళ్ళందరితో, కాస్త ఓపిక పట్టండి హీరాబాయి ఎవరు? ఒక అద్భుతమైన పాటని మీకు విన్పిస్తుంది. ఇంతవరకు ఇంత అద్భుతమైన పాట ఇక్కడ పాడడం జరగలేదు అని చెప్పింది. అక్కడ హీరాబాయి మామూలు వస్త్రాలతో అలంకరించుకుని కీర్తన మొదలు పెట్టింది. ఆవిడ ప్రభుశ్రీని ఉద్దేశించి ఎంతో పారవశ్యంతో ఒక భక్తీ గీతాన్ని పాడింది. తన జీవితాన్నంతా ప్రభుశ్రీకే అంకితం చేశాను అనే భావంతో అది ఎంతో భక్తీ భావంతో ఆవిడ పాట పాడుతుండగా అక్కడకి వచ్చిన ఆ వర్తకులంతా ఆశ్చర్య పోయారు. ఆవిడ నిరాడంబరత, ఆవిడ పాడుతున్న కీర్తన ఇవన్నీ కూడా వారికేమీ నచ్చలేదు.

 హీరాబాయి ఎంతో భక్తి పారవశ్యంతో కీర్తన పాడుతుంటే ఆ వర్తకులంతా ఆశ్చర్య పోయారుపాట అంతా పూర్తి అయినాక "మా సమయమంతా వృధా చేశారు.ఇటువంటి పాట వినడానికా మేము ఇక్కడకి వచ్చింది?" అని వాళ్ళు నానా గొడవ చేశారుదానికి సమాధానంగా హీరాబాయి పిన్ని గారు మరి హీరాబాయి ఈ రోజు నుంచి మీరు ఇక్కడ ఇలాంటి కీర్తనలే వింటారు. ఎటువంటి నృత్యగీతాలు ఉండవు. మేము ఇప్పుడు స్వామి నారాయణ గారి ఆశ్రయంలోనికి వచ్చాము. ఆయనే మమ్మల్ని చూసుకుంటారు కాబట్టి మీరంతా వెళ్లి రావచ్చును అని చెప్పి వారిని పంపించి వేసింది. హీరాబాయి ఆర్తితో పాడిన ఆ మధురమైన కీర్తన ఇక్కడ స్వామి నారాయణ గారి హృదయానికి తగిలింది. ఆయన అప్పుడు తన పరివారంతో ఉన్నారు. ఆ పరివారంలో ప్రముఖుడైన ఆనంద్ గారు ప్రభుశ్రీ ! మీరు ఒక పతితకి మోక్షాన్ని ఇచ్చారు. ఆహా ! ఆమె జన్మ ధన్యమైపోయింది కదా ! అని అనగా అవును ఒక్క సారి మనస్సు మరియూ చిత్తచాంచల్యం మూలంగా మనం మార్గం తప్పుతూ ఉంటాము. కాని లవలేశమైనా పవిత్రత మన మనస్సు లో వచ్చినప్పుడు భగవంతుని పట్ల భక్తి శ్రద్ధలు పెరిగినప్పుడు మనం మళ్ళా మంచి మార్గంలోనికి వస్తాము. ఆ కొద్దిపాటి సంస్కారమే మనకి మోక్షానికి దారి చూపిస్తుంది. ఇదే విషయం హీరాబాయి పట్ల జరిగింది. మోక్షమంటే మాటలు కావు. అంత త్వరగా లభించేది కాదు. ఇప్పుడు హీరాబాయి మనస్సూ, హృదయమూ పరిశుద్ధమై పోయినాయి. ఆమె స్వయంగా ముక్తానంద గారు ఎలాంటి మోక్షాన్ని పొందుతారో అదేలాంటి మోక్షాన్ని ఆవిడ కూడా పొందుతుందని చెప్పగాఅక్కడ ఉన్న వ్యక్తులందరూ స్వామి నారాయణ గారికి జయ జయ ధ్వానాలు చేశారు. ఈ విధంగా స్వామి నారాయణ గారు పతిత అని ముద్ర పడినటువంటి హీరాబాయికి మోక్షాన్ని ప్రాప్తింప చేశారు.