N. Sairam Garu : +91 7901268716 || Email: sridatta50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.Monday, 7 September 2015

SwamiNarayan - Episode 55అహ్మదాబాదు వర్తకుల ఫిర్యాదు
శ్రీ స్వామి నారాయణ గారు తానూ చేస్తున్న విష్ణు యాగం 18 రోజులు అయిపోయినాకపూర్ణాహుతి కూడా అయిపోయినాక దగ్గరలో ఉన్న అహ్మదాబాదు వైపు ప్రయాణం సాగించారుఎందుకంటే అక్కడ ఉన్న స్వామి నారాయణ గారి భక్తులు తమ నగరానికి రావలసిందిగా ఆయన్ని ఆహ్వానించారుఒక రోజు అహ్మదాబాదులో ఉన్న వర్తకులు,వారి నాయకుడు అందరూ కలిసి ఆ ఊరి రాజుగారిమంత్రి అయిన పీష్వా దగ్గరకి వెళ్ళారుపీష్వా ఆహ్వానం మీద లోపలకి వెళ్లి తాము తెచ్చిన కానుకలనీ సమర్పించిమీరు ఈ కానుకలు స్వీకరించండి.మీరు కలకాలం ఈ పట్టణాన్ని ఏలాలి అని ప్రజలందరూ మీ పాలనలో సుఖ సంతోషాలతో ఉండాలని మేము కోరుకుంటున్నాముఅయితే కేవలం ఈ ప్రసాదాల వల్ల పని జరగదుమహారాజామేము త్వరలోనే బిచ్చం ఎత్తుకునే పరిస్థితి కూడా వస్తుందిమీ రాజ్యానికి కూడా ఒక పెద్ద ముప్పు రాబోతుందిమీకు మేము భారీ ఎత్తులో చేసే వ్యాపారాల మీద పన్నులు చెల్లిస్తున్నాముఇక మీద ఆ పరిస్థితి ఉండదుకాబట్టి మీ  ధనాగారంలో తగినంత డబ్బు ఉండదుదాని వల్ల ప్రజలకి మీరు చేసే కార్యక్రమాలన్నీ ఆగిపోతాయిమేము చేస్తున్న ఈ పొగాకు వ్యాపారంబీడీ, తమలపాకులు వగైరా వగైరా వ్యాపారాలన్నీ ఆగిపోతాయిమూల పడిపోతాయి.మేము బిచ్చమెత్తుకునే పరిస్థితిలో కూడా ఉండముమహాప్రభూఈ రకంగా మీరు మీ రాజ్యాన్నికూడా  కోల్పోయే ప్రమాదం ఉంది అని  అని రక రకాలుగా పీష్వాగారికి చెప్పారు. ఆ మాటలన్నీ విన్నాక  “అన్నీ చెబుతూనే ఉన్నారు దానికి కారణాలేవిటో మీరు నాకు సరిగ్గా చెప్పడం లేదు సంగతేమిటో సరిగ్గా వివరించండి” అని అన్నారు.

మహారాజా ! సాక్షాత్తు తానే  భగవంతుడినని చెప్పుకునే స్వామి నారాయణ గారు జేతల్పూర్ లో విష్ణు యాగం చేయించారుఅటువంటి యాగం మహారాజులు కూడా చేయించలేరు అంత బ్రహ్మాండంగా 18 రోజులు వారు చేశారువారు త్వరలోనే అహ్మదాబాదు వైపు ప్రయాణం చేసి మన నగరానికి రాబోతున్నారుపెద్ద ప్రమాదం ముంచుకొస్తుంది” అని అన్నాడు.

“మహాజన్!” మీరు చెప్తున్నదేమిటో నాకేం అర్థం కావడం లేదువారు వస్తున్నందువల్ల మనకేం నష్టం?” అని ప్రశ్నించారు.  

మహారాజా సౌరాష్ట్రలో వారు ఎబాల్ ఖాచర్ అనే ఒక చిన్న రాజు గారింట్లో మకాం వేశారుతర్వాత ఆ రాజైన ఎబాల్ ఖాచర్ గారు తన రాజ్యం మొత్తం కూడా స్వామి నారాయణ గారికి ధారాదత్తం చేశారుఈయన ఆయన పరివారంతో సహా అక్కడ తిష్ఠ వేశాడుఆ రాజు గారు ఆ ఊరిలోనే మారుమూల ఒక ప్రాంతంలో ఆయన కుటుంబంతో సహా నివసిస్తున్నారుసకల రాజ భోగాలు స్వామి నారాయణగారికి ఉన్నాయి త్వరలోనే అక్కడ నివసిస్తున్నగ్రామస్థులు, ప్రజలు, సౌరాష్ట్ర ప్రజలందరూ కూడా చుట్టబీడీ ,తంబాకు సేవనం పూర్తిగా మానేశారుమహాప్రభూ దానివల్ల వర్తకులందరికీపొగాకు పండించే రైతులందరికీ కూడా భారీ నష్టం జరిగిందిఇప్పుడు స్వామి నారాయణగారు కనుక అహ్మదాబాదుకి వస్తే మా వ్యాపారమంతా మూల పడిపోతుందిమరి మేము మా వ్యాపారాలన్నీ మానుకున్నాక మీకు ఏ విధంగా కూడా పన్నులు చెల్లించలేము.అలాగే రైతులందరూ కూడా భారీ మొత్తంలో నష్ట పోతారుఎందుకంటే పొలంలో వారు పండించిన పొగాకు పంట అంతా అమ్ముడు పోకుండా వారు నిర్ధనులై పోతారుఈ విధంగా పన్నుల రూపంలో మీ కోశాగారానికి రావలసిన దానం కూడా రాదు కాబట్టి ఓ మహా ప్రభూ ఆ రకంగా మీ రాజ్యానికి పెద్ద ప్రమాదం ముంచుకు వస్తుంది అని వివరంగా చెప్పారుదానికి ఆ పేష్వా గారు తల పరికించి ఓహో ! అలాగా! అర్థమైంది అని చెప్పారురానీయండిజాగ్రత్తగా ఆలోచించి ఆయన్ని తుద ముట్టించే ప్రయత్నం చేద్దాంమన చేతికెటువంటి మలినం అంటకూడదు కదా అని చెప్పారు.

రాజా వారి ఆహ్వానం
స్వామి నారాయణగారు అహ్మదాబాదు పట్టణానికి  విచ్చేసి తన భక్తుల నివాసంలో మకాం వేశారు. ఆయన ఎక్కడకి వెళ్ళినా ఆయనతో పాటు 5౦౦ మంది సహచరులు వెళ్ళుతూ ఉండేవాళ్ళు. మహాజన్ తన మిత్రులతోబాటు స్వామి నారాయణ గారి నివాస స్థానానికి వచ్చి, ఆయన్ని కలిసి, నమస్కరించి స్వామీ! మీరు మా అహ్మదాబాదు నగరానికి వేంచేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా రాజావారు విఠోబాగారు మిమ్మల్ని ఆహ్వానించారు. కాబట్టి మీరు తప్పకుండా వారి దర్బారుకి రావాలి అని విన్నవించాడు. స్వామి నారాయణ గారు వీరందరినీ తేరిపార చూసి నెమ్మదిగా నాకు చాలా సంతోషంగా ఉంది నేను తప్పకుండా వస్తాను. కాని నాతోబాటు ఉన్న నా సహచరులందరూ, నామిత్ర బంధువులు, సాధువులందరూ కూడా రాజ దర్బారుకి వస్తారు. వాళ్ళు ఉండడానికి, భోజనానికి కావలసిన వసతులన్నీ ఏర్పాట్లు చేయమని మీ రాజావారికి చెప్పండి అని ఆయన బదులు చెప్పారు. దానికి సమాధానంగా మహాజన్ “స్వామి నారాయణగారూ! రాజావారు మిమ్మల్ని శాస్త్ర చర్చలకోసం పిలవలేదు. మీ పవిత్రమైన చరణాల్ని స్పర్శించడానికి మాత్రమే ఆయన మిమ్మల్ని ఒక్కరినే ఆహ్వానించారు. కాబట్టి తాము ఒక్కరే రావాలి” అని అభ్యర్థించాడు. అయితే స్వామినారాయణ గారి శిష్యులు స్వామివారిని ఒప్పుకోవద్దని సైగ చేశారు. స్వామి నారాయణ గారు వెంటనే సమాధానం చెప్పలేదు. స్వామి నారాయణ గారు “అలాగే ! నేను తప్పకుండా వస్తానని మీ రాజాగారికి చెప్పండి” అని ఆయన్ని పంపించి వేశారు. ఆయన వెళ్ళిపోగానే స్వామి నారాయణగారి శిష్యులందరూ “ప్రభూ! మీరు ఈ ఆహ్వానాన్ని ఎందుకు అంగీకరించారు? మీరు ఒంటరిగా వెళ్ళడం క్షేమం కాదు. ఈ పీష్వా పరమ దుర్మార్గుడు. ఈ ఆహ్వానం వెనుక ఏదో కుట్ర దాగి ఉంటుంది” అని తమ ఆందోళనని వ్యక్తం చేశారు. దానికి సమాధానంగా స్వామి నారాయణ గారు , “ ఈ పీష్వా  మామూలు వాడు. చూద్దాం ! ఈ ఆహ్వానం వెనుక అతను ఏం కుట్ర పన్నాడో, ఏం పథకం వేశాడో చూద్దాం ! మీరేమీ భయపడకండి. నేను చూసుకుంటాను” అని స్వామి వారు తన సహచరులందరికి కూడా అభయం ఇచ్చారు. 
రాజావారి కుట్ర
ఇంతలో కొంత మంది వర్తకులు పీష్వా గారి దగ్గరకి వెళ్లి “మహారాజా ! మీరు ఎందుకు స్వామి నారాయణ గారిని రాజ దర్బారుకి ఆహ్వానిస్తున్నారో మాకేమీ అర్థం కావడం లేదు. ఆయన వస్తే పెద్ద ప్రమాదమనీ, మా వ్యాపారమంతా దెబ్బ తింటుందదనీ మేము ముందే మీకు హెచ్చరించాము కదా !” అని అన్నారు. పీష్వా గారు అతిథిని బట్టే మనం ఇచ్చే ఆహ్వానం ఉంటుంది అని చెప్పితే వాళ్లకి అర్థం కాలేదు. సరే రండి చూపిస్తాను అని ఆయన వారిని ఒక చోటకి తీసుకుని వెళ్లి అక్కడ తివాచీ పరచి ఉన్న మెట్లు ఎక్కి ఇక్కడ కనిపిస్తున్నదేమిటీ?అని అడిగారు. ఇక్కడ ఏం కనిపిస్తుంది మహా ప్రభూ? ఇక్కడ సింహాసనం ఉంది అని సమాధానం చెప్పారు.  అయితే మీరనుకుంటున్నట్లుగా ఈ సింహాసనం స్థిర ప్రదేశంలో లేదు. దీనిక్రింద ఒక బావి ఉంది. ఆ బావి మీద వెదురు పుల్లలు పెట్టి వాటిని తివాచీతో కప్పిపుచ్చి దానిమీద సింహాసనం ఏర్పాటు చేశాను. ఎప్పుడైతే స్వామి నారాయణ గారు సింహాసనం మీద కూర్చుంటారో అప్పుడు ఆ వెదురు పుల్లలు విరిగి ఆయన దభేలుమని ఆ బావిలో పడిపోతారు. జీవంతో ఆ బావిలోపడి మృతదేహంతో ఆయన బయటకి వస్తారు. అహ...హా ! చూశారా ! ఇది  నా పథకం ! అంటూ మన చేతికి మట్టి అంటకుండా, ప్రజలు మనని అనుమాని౦చకుండా నేను ఆయన్ని చంపడానికి ఈ ఏర్పాట్లు చేశాను అని ఆ వర్తక సమూహానికి చెప్పారు. ఆ వర్తకులంతా స్వామి నారాయణ గారి పీడా విరగడై పోతుంది అని చాలా సంతోషించారు. మీరు ఎన్నన్నా చెప్పండి స్వామి నారాయణ గారికి లక్షల కొద్ది అనుచరులున్నారు, శిష్యులున్నారు. ఆయన కీర్తి దేశదేశాలా ప్రాకింది అటువంటి వ్యక్తిని తలుచుకుంటే క్షణంలో నేను చంపగలను. అలా చేసినందువల్ల మనకి అపకీర్తి వస్తుంది. ఈ రకంగా కనుక మనం ఆయన్ని హతమారిస్తే ప్రజలంతా అకస్మాత్తుగా జరిగిన ప్రమాదమని అనుకుంటారు. పాము చచ్చిపోతుంది, లాఠీ భద్రంగా ఉంటు౦ది అంటూ వికటాట్టహాసం చేశారు. ఆయనతో పాటు అక్కడ ఉన్న వర్తక సమూహమంతా నవ్వుకుంటూ ఆనందించారు. ఆ ఘడియ ఎప్పుడు వస్తుందా అని వాళ్ళంతా ఎదురుచూస్తూ ఉన్నారు.
(concluding part in the next episode)