N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Wednesday, 6 January 2016

SwamiNarayan - Episode 65

త్రాగుబోతు, జూదరి ఝవేరి భగత్ 
కోటేశ్వర్ అనే గ్రామంలో ఝవేరి భగత్ అనేవాడు ఉండేవాడు. వాడి  చిన్నతనం లోనే  తండ్రి పోవడంతో వాడి అమ్మ ఎంతో కష్ట పడి వాడ్ని పెంచ సాగింది. దురదృష్టవశాత్తు వాడు అన్ని దురలవాట్లకి లోనయ్యాడు. తన సమ వయస్కులైన యువకులందరినీ ఒక ముఠాలాగా  చేర్చి  పగలు-రాత్రులు బీడీలు, మద్యం త్రాగడం, జూదం ఆడడం, ఆడవాళ్ళని వేధించడం ఇలాంటివి చేస్తూ, వాడు ఆ ఊరికి ఒక తల నొప్పిగా తయారయ్యాడు. ఇలా ఉండగా ఒకనాడు అతనికి, ఆ ముఠా వాళ్ళకి మధ్య ఒక పందెం జరిగింది. ఆ ముఠా వాళ్ళు అతనితో “ చూడు అక్కడ ! ఆడవాళ్ళు కడవలతో నీళ్ళు పట్టుకుని వెళ్ళుతున్నారు. నీకు ధైర్యం ఉంటే వెళ్లి వాళ్ళని ఏడిపించు !  చూద్దాం !” అని అన్నారు.


ఆ మాటలకి ఝవేరికి పంతం వచ్చింది. అసలే బాగా త్రాగి ఉన్నాడేమో మాటలు కూడా ముద్దు ముద్దుగా వస్తు౦డాలి.” సరే ! పందెం ! నేను కనక గెలిస్తే మీరు నాకు మద్యం ఇవ్వాలి. ఐదు రూపాయలు కూడా  మీరు నా చేతిలో పెట్టాలి” అని అన్నాడు. సరే ! వాళ్ళలో ఏ అమ్మాయిని ఏడిపించాలో చెప్పండి అని అంటే “ఫలానా అమ్మాయిని ఏడిపించు” అని వాళ్ళు చెప్పారు. అంతే కాకుండా వాళ్ళు ఆ అమ్మాయి గురించిన మరి కొన్ని వివరాలు కూడా చెప్పారు. అ అమ్మాయి , ఫలానా వారి అమ్మాయి, వాళ్ళకి చాలా పలుకుబడి ఉంది, ఆ అమ్మాయికి ఇద్దరు అన్నలు ఉన్నారు, జాగ్రత్త ! అని అన్నారు. దానికి సమాధానంగా ఝవేరి “ ఫరవా లేదు. నాకెవారైనా భయం లేదు. చూస్తూ ఉండండి . ఐదు రూపాయలు సిద్ధంగా ఉంచండి “ అని చెప్పి చేతిలో  ఒక  రాయి తీసుకుని ఆ అమ్మాయి నెత్తి మీద కడవతో వస్తూ ఉండగా విసిరివేశాడు. దానితో ఆ కడవకి చిల్లి పడి నీళ్లన్నీ కారిపోయి ఆమె బట్టలన్నీ తడిసి పోయాయి. ఆ ఆడపిల్లలందరూ ఆశ్చర్య పడిపోవడమే కాకుండా భయపడిపోయారు. ఇంతలో ఝవేరి వచ్చి ఆ అమ్మాయి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఆమెని  వేధించ సాగాడు. ఆ ఆడపిల్లలందరూ భయంగా నీటి కడవలతో వారి వారి ఇళ్ళకి పారిపోయారు.

ఆ అమ్మాయికి మాత్రం కోపం విపరీతంగా వచ్చింది. వెంటనే ఆమె తన ఇద్దరన్నల దగ్గరకి వెళ్లి కోపంగా “ రక్షా బంధన్ (రాఖీ)” పండగ నాడు చెల్లెలికి రక్షణ ఇస్తామని అన్నలు ముంజేతి మీద ( on the wrist) రాఖీలు కట్టించుకుంటారు. మీరేం అన్నలు? ఏ మాత్రం మీ చెల్లెలికి మీరు రక్షణ ఇస్తున్నారు?” అని అడిగింది. ఆ మాటలకి అన్న గార్లే కాకుండా అక్కడ ఇంట్లో ఉన్నసభ్యులందరూ “ఏమయింది ? ఏమిటీ సంగతి? ఎందుకంత కోపంగా ఉన్నావు?’’ అని అడిగారు.  “ఏ ఆడ పిల్లలకి ఈ ఊళ్ళో తలెత్తుకుని తిరగడానికి ధైర్యం లేదు. ఆ ఝవేరి భగత్ అందరినీ వేధిస్తున్నాడు, అసభ్యంగా  మాట్లాడుతున్నాడు. మీ అందరు మరి గాజులు వేసుకుని కూర్చున్నారు. మీ ఎవ్వరికీ అతన్ని ఎదిరించే ధైర్యం లేకుండా పోయింది.” అని ఆ అమ్మాయి జరిగిందంతా చెప్పగానే ఆ ఇంటికి రోజూ వచ్చే సభ్యులు, ఆ అమ్మాయి అన్నలు అందరు కర్రలు పట్టుకుని, కోపంగా  ఝవేరి భగత్ ని వెతకడానికి బయల్దేరారు. అక్కడ ఝవేరి ఏమీ గమనించకుండా యథాప్రకారం తన స్నేహితులతో జూదం ఆడుకుంటూ, అల్లరి చేస్తూ గడుపుతున్నాడు. ఈ యువకులందరు “వీడిని కొట్టండి రా, పట్టుకు తన్నండి రా!” అని అరుస్తూ ఒక్కసారిగా వాడిని కొట్టబోతుండగా ఎక్కడ్నుంచో ఝవేరి తల్లి అడ్డం వచ్చి వాళ్ళని ప్రార్థించింది. “ నాయన లారా ! నా కొడుకుని కొట్టకండి. నేను వాడి సంగతి చూసుకుంటాను. ఈ సారికి వాడిని వదిలివేయండి. నేనెంతో కష్టపడి వాడిని పెంచుతున్నాను. ఈ సారినుండి వీడు ఎవరి జోలికి వెళ్ళకుండా  నేను చూసుకుంటాను” అని చేతులు జోడించి ప్రార్థించింది. ఆమె మీద జాలిపడి అతన్ని వదిలి వేశారు.   “ఝవేరి ! నీ తల్లి మూలంగా ఈరోజు నీవు బ్రతికి పోయావు. కాని మళ్ళీ ఇంకొక్క సారి ఇలా పిచ్చి పిచ్చి వేషాలు ఏమైనా  వేశావో నీ తల్లి కాదు కదా నిన్ను ఆ భగవంతుడు కూడా రక్షించ లేడు. జాగ్రత్తగా ఉండు.” అని హెచ్చరించి వెళ్లి పోయారు. అక్కడ ఉన్న అతని మితృలు కూడా అక్కడనుంచి పలాయనం చిత్తగించారు. ఝవేరి వాళ్ళ అమ్మ మటుకు అతన్ని నానా విధాలుగా తిడుతూ , “మీ నాన్న పోయాక నేనెంతో కష్ట పడుతూ నిన్ను పెంచుతుంటే నీవేమో ఊరివాళ్ళందరితో తగాదాలు పడడం, ఆడపిల్లల్ని వేధి౦చడం, ప్రొద్దున్న లేస్తూనే పేకాటలు ఆడడం చేస్తుంటావు. నీ మూలంగా ఈ ఊళ్ళో నేను తలెత్తుకుని తిరగ లేక పోతున్నాను. మళ్ళీ కనక ఇలాంటి గొడవ ఏమైనా జరిగిందనుకో నన్ను ఈ ఊళ్లో౦చే అందరు వెళ్ళగొడతారు, నన్ను బ్రతకనివ్వరు. సరే ! ఒక పని చేస్తాను. మీ మామయ్యని ఇక్కడికి పిలిపిస్తాను. నిన్ను ఈ ఊరినుంచే పంపించి వేస్తాను. నీవు మామయ్యతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదువు గాని!” అని ఝవేరి భగత్ ని నానా రకాలుగా నచ్చ చెప్పడానికి,  భయ పెట్టడానికి ప్రయత్నించింది.

అన్న మాట ప్రకారం ఝవేరి భగత్ వాళ్ళ అమ్మ తన అన్నయ్యని పిలిపించి ఝావేరిని అతనికి అప్పచెప్పింది. ఝవేరి వాళ్ళ మేనమామ తన చెల్లెలి అభ్యర్థన మన్నించి మేనల్లుణ్ణి తన గ్రామానికి తీసుకుని వచ్చాడు కాని అతని మనస్సులో చాలా బాధగా ఉండాలి. ఆయన తన భార్యతో “ఈ ఝవేరి భగత్ ని తీసుకుని వచ్చి నేను పెద్ద పొరబాటు చేశానేమో ! అని అనిపిస్తుంది. ఎందుకంటే నేను వాడిని తీసుకుని వస్తుండగా వాడు వాడి అమ్మనే కొట్టడానికి చేయి పైకెత్తాడు, దుర్భాషలాడాడు. ఇటువంటి దుర్మార్గున్ని నేనేం బాగు చేయగలను? పైగా వాడు తన దురభ్యాసాలు మానకుండా ఇక్కడ దుష్టులతో సహవాసం చేస్తే నా పరువు పోవడమే కాకుండా నా చెల్లెలు నా మీద పెట్టుకున్న నమ్మకం వమ్మై పోతుంది కదా ! అనవసరంగా నేను అపనిందల పాలవుతానేమో ! ఇటువంటి కౄరున్ని, దుష్టున్ని మనమేం బాగు చేయగలం? ఏం చేయాలో నాకేం అర్థం కావడం లేదు. అదే నాకు బాధగా ఉంది” అని అన్నాడు. ఇంకొకవైపు నా చెల్లెలి బాధ చూడలేక పోయాను. “అన్నయ్యా ! ఎలాగైనా నీవు కాస్త తీసుకుని వెళ్లి వాడి మనస్సు మార్చు. నీ శిక్షణలో ఏమన్నా మారుతాడేమో అని ఒకటే ప్రాధేయపడింది. ఆ ఊళ్ళో ఉంటె వాడ్ని చంపేస్తారు. ప్రతి రోజు ఏదో ఒక దెబ్బలాట, తగాదా ఇంటిమీదకి తీసుకుని వస్తాడు. వాడిలో మానవత్వం అన్నది పూర్తిగా నశించి పోయింది” అంటూ కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. నేను తన మాట కాదనలేక వీడ్ని తీసుకుని వచ్చాను. కాని వీడ్ని చూస్తే మాత్రం వీడు మారుతాడు అనే ఆశ ఏ కోశానా కనిపించడం లేదు. చిన్నప్పట్నుంచి ఉన్న అలవాట్లు ఎలా పోతాయి వాడిలో మార్పు ఎలా వస్తుందబ్బా ? వాడిలో ఉన్న దురభ్యాసాలు తొందరగా పోవు కదా ! ఏం చేయాలో నాకేమీ అర్థం కావడం లేదు” అని తన బాధను వెళ్ళబోసుకున్నాడు. తర్వాత మాటల సందర్భంలో అతనికి గుర్తు వచ్చింది. అన్నట్టు మర్చి పోయాను. మన స్వామి నారాయణ గారు  మన గ్రామానికి వేంచేశారు. నేను ఆయన దగ్గరకి వెళ్లి నా మేనల్లుని సంగతంతా వివరిస్తే అతన్ని తన దగ్గరకి తీసుకుని రమ్మని చెప్పారు. ఆయన చెప్పే ప్రవచనాలు ఒకటో రెండో వాడి చెవిన పడితే వాడిలో మార్పేమన్నా వస్తుందేమో అని ఆశగా ఉంది అని అన్నాడు. వెంటనే ఆయన భార్య “ మనమెప్పుడు మంచి పనిని  ఆలస్యం చేయకూడదు. మీరు  వెంటనే ఝవేరి భగత్ ని ఆయన దగ్గరకి తీసుకుని వెళ్ళండి” అని అర్థించింది.

ఇంతకి ఝవేరి భగత్ ఎక్కడ ఉన్నాడు? అని అడిగాడు. ఝవేరి భగత్ లోపల ఎక్కడో ఉన్నాడు . ఏదో తయారవుతున్నట్టున్నాడు. నేనింక ఆలస్యం చేయ దలచుకోలేదు. ఈ క్షణమే నేను వాడ్ని ప్రభుశ్రీ దగ్గరకి తీసుకుని వెళ్తాను అని చెప్పి తన మేనల్లుణ్ణి వెంట పట్టుకుని స్వామి నారాయణ గారి దగ్గరకి వెళ్ళాడు. అదే సమయంలో ఆయన ప్రవచనాలు చెప్తున్నారు. ఒక్కొక్కసారి మానవుడు విపత్కరమైన పరిస్థితుల్లో ఉంటాడు. సమస్య వచ్చినప్పుడు ఏ మార్గంలో వెళ్ళాలి, ఏం చేయాలి ? మనం మంచి మార్గంలో ఎలా వెళ్ళాలి? మనం వెళ్ళవలసిన మార్గాలేవి? అని రకరకాల ప్రశ్నలు మనస్సులో ఉదయిస్తూ ఉంటాయి. ఏది మంచి? ఏది చెడు? ఒక వేళ చెడు ఉంటే దాన్ని మంచి గా ఎలా మార్చాలి? అనే ఆలోచనలు ప్రతి వారి మనస్సులో అల్లకల్లోలాన్ని లేపుతుంటాయి. దానికి మార్గం ఏమిటంటే మనం ఆ క్షణంలో సరిగ్గా ఆలోచించుకుని నిదానంగా ఒక నిర్ణయానికి రావాలి. ఎప్పుడైతే మనం నిశ్శబ్దంగా మనస్సులో ఆలోచించుకుంటామో అప్పుడు మనలో ఉన్న ఆత్మ ఏది మంచిదో, ఏది చెడో , ఎటువైపు వెళ్ళాలో, మనస్సు ఎలా నిగ్రహించుకోవాలో అన్నది  చెప్తుంది.
“నాయనా !  నీవు చేస్తున్న పని మంచిది కాదు. ఒక్క ఐదు నిమిషాలు ఆలోచించు “ అని ఆత్మ ప్రతి వాళ్లకి చెప్తూ ఉంటుంది. మనం కనక మన ఆత్మ చెప్పిన సంకేతాలను వింటే మన సమస్యలు పరిష్కరించుకో గలుగుతాం. ఎందుకంటే ప్రతి  మనిషి యొక్క ఆత్మలో భగవంతుని యొక్క తత్వముంటుంది. భగవంతుని యొక్క నిజమైన వాణి ఉంటుంది. అది సాక్షాత్తు పరమాత్ముని యొక్క వాణిగా మనం భావించాలి. భావించడం ఏమిటీ? అది సాక్షాత్తు పరమాత్ముని యొక్క వాణియే. ఎప్పుడైతే మనం ఆ వాణిని వింటామో అప్పుడు మన సమస్యలకి పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. కాని  మనం ఆ భగవంతుని యొక్క వాణి ని గుర్తించాలి. అది చెప్పినట్టుగా వినాలి. అని చెప్తుండగా ఈ మాటలు ఝవేరి మనస్సుకి సూటిగా హృదయానికి తగిలాయి. అతనిలో ఏదో తెలియని మార్పు వస్తుంది. ఆయన సన్నిధిలోకి రాగానే అతని మనసెందుకో ప్రశాంతంగా ఉంది. అదే సమయంలో కొంత అసహనంగా కూడా ఉండాలి. అతను వెంటనే ఆ సమూహం నుంచి  లేచి ప్రక్కకి వెళ్ళాడు. లోపల ఉన్న ఉత్తేజాన్ని ఆపుకోడానికి అతను ప్రయత్నం చేస్తున్నాడు. అయితే స్వామి వారి మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆత్మ అనేది ఎటువంటి అస్త్ర, శస్త్రాలకి లోబడదు. ఏ అస్త్త్రం కాని శస్త్రం కాని దాన్ని నాశనం చేయలేదు. అగ్ని దానిని దహించలేదు. నీరు దాన్ని ఏమాత్రం ముంచలేదు, తడపలేదు. వాయువు దాన్ని అసలు కదల్చ లేదు. ఆత్మ అనేది అమరమైనది, శాశ్వతమైనది. దానికి మరణం లేదు.  ఝవేరి  మనస్సు  ఆవేదనతో నిండిపోయింది. మనస్సులో ఆలోచన అన్నది మొదలయింది. అది మంచి మార్గం వైపే ప్రయాణం చేస్తున్నది. అతని మనస్సు కొట్టుమిట్టులాడుతుంది. ఇటువంటి పరిస్థితి అతనికి ఎప్పుడు కూడా కలగలేదు. స్వామి నారాయణ గారి యొక్క శుద్ధమైన భావ తరంగాలు ఎంతో శక్తివంతమైనవి. ఝవేరి ఎప్పుడైతే స్వామి నారాయణ గారి భావ తరంగాలలోకి వచ్చాడో ఆ తరంగాలు అతని హృదయానికి తగిలి, అతనిలో ఉన్న కల్మషాన్ని క్రమ క్రమంగా దూరం చేయ సాగాయి. ఇలాంటి పరిస్థితి అతని జీవితంలో మొట్టమొదటిసారిగా వచ్చింది. అతను ఇంటివైపు నిశ్శబ్దంగా వెళ్ళుతుండగా అతని మనస్సులో, అతని చెవిలో స్వామి నారాయణగారు చెప్పిన ప్రవచనాలు ప్రతిధ్వనిస్తూ ఉండాలి. అతను అన్యమనస్కంగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు.
ఆ ఊళ్ళో ఝవేరిలాంటి యువకులు కొంత మంది ఉన్నారు. వాళ్ళంతా దుష్టుల సహవాసంలో చేరి చెడిపోయిన వారే. వారికి తెలిసిందల్ల ఒక్కటే. అదేమిటంటే ప్రతి రోజు జూదం ఆడడం, మద్యం సేవించడం. వాళ్ళందరి దృష్టి ఈ ఝవేరి మీద పడింది. అందులో ఒకడు ఇలా అన్నాడు. “అదుగో చూడండి ! మనకి ఝవేరి అనేవాడు కనిపించాడు కదా ! వాడూ మనలాంటి వాడే. ఎలాగైనా సరే మనం వాడిని మన గుంపులో చేర్చుకుందాం. జూదంలో వాడిని దోచుకుందాం “ అని చెప్పి “ ఓ ఝవేరి ! నీవు ఇక్కడకి రా !” అని చెప్పి పిలవడం మొదలుపెట్టాడు. ఈ పిలుపు విని ఝవేరి వాళ్ళ  దగ్గరకి వెళ్లి “ఏం కావాలి?  ఎందుకు పిలిచారు?” అని అడిగాడు.

“అదేంట్రా తమ్ముడూ ? నీవు మా ఊరికి మొట్ట మొదటిసారిగా వచ్చావు. కనీసం మమ్మల్ని కలవనన్నా కలవలేదు. మనమంతా ఒకే గూటికి చెందినవాళ్ళం కదా ! రా ! కూర్చో కాసేపు. మనమంతా కాసేపు ఈ పేకాట ఆడుకుందాం. అతనికి చిన్నప్పట్నుంచి అలవాటైనటువంటి  ఈ విషయ  వాసనలు ఒక్కసారిగా బయటకి వచ్చాయి. అనాలోచితంగా అతను “సరే! ఆడదాం పదండి !” అని అక్కడే కూర్చున్నాడు. వాళ్ళు అందరికి పేక ముక్కలు వేశారు. ఝవేరి పేక ముక్కల్ని చేతిలో పట్టుకున్నాడు. కాని అతని చెవిలో స్వామి నారాయణ గారి మాటలు ప్రతిధ్వని౦చాయి. ఒక్కొక్కసారి మనిషి జీవితంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయంటే ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది మంచో , ఏది చెడో, మంచి  మార్గంలో ఎలా వెళ్ళాలో అనే ప్రశ్నలు ఉదయిస్తుంటాయి. మిగతా వాళ్ళు “ఏమిటీ ఆలోచిస్తున్నావు? ఆట మొదలు పెట్టు” అని అనగా ఝవేరి తన పేక ముక్కల్ని సర్దుకుంటూ పోయాడు.


ఇదివరకు ఉన్న ఆలోచనలు, ఆ విషయ వాసనలన్నీ కూడా వంద రెట్లు  విజ్రుంభించి  పైకి వచ్చాయి. కాని ఏదో ఒక మూల స్వామి నారాయణ గారు మాట్లాడిన మాటలు ప్రతిధ్వనిస్తూ అతన్ని హెచ్చరిస్తున్నాయి. అటువంటి విపత్కర పరిస్థితిలో ఉన్నప్పుడు మనిషి ఎవరి సలహా తీసుకోవాలి? ఎవరి దగ్గరకి వెళ్ళాలి? ఎవ్కర్ని అడగాలి? అని సమస్య వచ్చినప్పుడు ప్రతి మనిషిలో ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మలోనే  పరమాత్ముని యొక్క దివ్య వాణి   ఉంటుంది. అదే మంచి  మార్గాన్ని చూపిస్తుంది. ఏది మంచో, ఏది చెడో అనే విచక్షణా జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తుంది అని చెప్పిన ఆయన మాటలు గుర్తుకి వచ్చాయి. అంత ఉత్సాహంగా పేకముక్కలు ఆడడానికి తీసుకున్న అతను ఆగిపోయాడు. మళ్ళీ అతనికి స్వామి నారాయణ గారు చెప్పిన మాటలు  గుర్తుకి వచ్చాయి. అంత ఉత్సాహా౦గా మరి పేక ముక్కలు చేతిలో తీసుకుని ఆడబోయిన వాడు ఆకస్మాత్తుగా ఆగి పోయాడు. మళ్ళీ స్వామి నారాయణ గారు చెప్పినవి గుర్తుకి వస్తున్నాయి