N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Wednesday, 13 January 2016

SwamiNarayan - Episode 66

ఝవేరి మనఃస్థితి
 ఏ విషయమైనా మీరు చేయాలి అని అనుకున్నప్పుడు కొద్ది సేపు దానిని గురించి ఆలోచించండి.వెంటనే ఆ పనిని చేయకండి. మరొక్కసారి లోపల ఉన్న మీ ఆత్మ మీకు ఇస్తున్న సూచనలని వినండి. దాని ప్రకారమే చేయండి అని స్వామి నారాయణ గారు చెప్పిన మాటలు గుర్తుకి వచ్చాయి. మిగతా వారు “ ఝవేరి ! ఏమిటీ ఆలోచిస్తున్నావు? తొందరగా ఆడు” అని తొందర పెట్టసాగారు. కాని వాళ్ళ ముఖాల మీద కొంత ఆశ్చర్యం కనిపిస్తుంది. క్షణ క్షణానికి ఝవేరి ముఖంలో భావాలు మారిపోతున్నాయి. వాళ్లకి ఏం జరుగుతుందో అన్నది అర్థం కాలేదు. లోపల అంతర్మ౦థనం ప్రారంభమయింది. అంతర్మంథనంసాగుతున్నప్పుడు ముందు విషం వచ్చినా తర్వాత అమృతం తప్పకుండా వస్తుంది కదా ! ఆడాలని తీవ్రమైన కాంక్ష మళ్ళీ అతనిలో మళ్ళీ వచ్చింది. పాపం ! అతను పెనుగులాడుతున్నాడు. విషయ వాసనలన్నీ అతన్ని గట్టిగా బంధించివేశాయి. కాని లోపల అంతర్వాణి అతన్ని మెల్లగా మెల్లగా అంధవిముక్తి న్ని చేస్తున్నాయి.



అతను  మరొక్కసారి ఆడడానికి ప్రయత్నించగా స్వామి నారాయణ గారు చెప్పినది ఆత్మ అనేది ఎటువంటి అస్త్రాలకి కాని శస్త్రాలకి కాని నాశనం కాదు.  వాయువు దాన్ని కదల్చ లేదు, అగ్ని దానిని కాల్చ లేదు, నీళ్ళు దాన్ని తడప లేవు ఆత్మ అంత స్థిరంగా ఉంటుంది అని  స్వామి నారాయణ గారు చెప్పిన మాటలలోని  గూడార్థం ఇప్పుడు అర్థమయింది. ఝవేరి ఇంటికి రాగానే అతను అత్తా, మామ్లతోటి అక్కడే కూర్చున్నాడు. ఎవరు ఏమీ మాట్లాడ లేదు. మౌనంగా కూర్చుని ఉన్నారు. కాని వాళ్లిద్దరు మాత్రం ఝవేరి లో వచ్చిన మార్పుని గమనిస్తూనే ఉన్నారు. అతను చాలా గంభీరంగా, మౌనంగా ఉన్నాడు. ఏదో దీర్ఘాలోచనలో పడ్డాడు. మామతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టున్నాడు. చివరికి అతను ఇలా చెప్పాడు. “మామా ! నేను కలలో కూడా అనుకోలేదు. స్వామి నారాయణ గారి పేరులో ఇంత మహత్తు ఉంటుందని. నేను చాలా తప్పులు చేశానని నాలో పశ్చాత్తాపం కలుగుతుంది. ఆయన్ని చూడగానే, ఆయన మాటలు వినగానే నాలో నాకే తెలియకుండా ఎన్నో  మార్పులు కలిగాయి. నేను సత్సంగిని కావాలనుకుంటున్నాను. స్వామి నారాయణ గారి శిష్యుణ్ణి కావాలని అనుకుంటున్నానుమామా ! నన్ను ఆయన తన శిష్యునిగా అంగీకరిస్తారా?” అని అడిగాడు. ఝవేరి కంఠంలో వినిపించిన ఒక దృఢ నిశ్చయం విని అతని మామయ్యా చాలా ఆశ్చర్యపోయాడు, సంతోషించాడు కూడా. “నాయనా ఝవేరి ! ఎందుకలా ఆలోచిస్తున్నావు? స్వామి నారాయణ గారి నామంలోనే అంత శక్తి ఉంది. పాపి యొక్క పాపాలని  చేసేంత శక్తి ఉంది. అక్షరం అనుకోగానే అన్ని పాపాలు నాశనమైపోతాయి. అలాగే స్వామి నారాయణ గారి దర్బార్ ఏళ్ళ వేళలా తెరిచే ఉంటుంది. 

ఆ ప్రాంగణం లోకి వెళ్ళగానే మన మనస్సు ప్రక్షాలనమై పోతుంది. మన పాపాలన్నీ మెల్లమెల్లగా నశిన్స్చిపోతాయి, కాబట్టి నీవేలాంటి సందేహాలు మనస్సులో పెట్టుకోవద్దు నాయనా ! అని అని అతని అత్తయ్య  !  నేను రేపు ప్రొద్దున్నే వారి దర్శనానికి వెళ్తాను” అని చెప్పాడు. మేనమామకి నోట మాట రాలేదు. అతను ఝవేరిని ఎందుకు తీసుకొచ్చాను అని బాధ పడుతుండాలి, భయ పడ్డాడు కూడా. కాని స్వామి నారాయణ గారిని చూడగానే ఝావేరిలో ఇంత మార్పు వస్తుందని అతను కలలో కూడా అనుకోలేదు. అతనికి ఆశ్చర్యంతో నోట మాట రాక, అతనిలో కలిగిన మార్పుకి కళ్ళలో ఆనందాశ్రువులు కారుస్తూ అలాగే ఉండిపోయాడు.

ఎద్దుల యజ్ఞం
అంతక్రితం ఝవేరిని జూదం ఆడడానికి ప్రోత్సాహించిన వారందరు కూడా ఝవేరిని అంట తేలిగ్గా వదలదలచుకోలేదు. దుష్ట శక్తులు అంత తొందరగా వదిలి పెట్టవు కదా ! అతన్ని ఎలాగైనా సరే మార్చి మళ్ళీ ఈ త్రోవలోనికి తీసుకుని రావాలనే సంకల్పంతో ఒక స్నేహితున్ని అతని దగ్గరకి పంపితే అతను తిరిగి వచ్చేశాడు. ఏమైంది? ఎందుకు వచ్చేశావు? అని అడిగితే “ఝవేరి నేను రానని చెప్పాడు. నేను మద్యం త్రాగడం, జూదం ఆడడం అన్నీ మానివేశాను. ఏ రోజైతే నేను స్వామి నారాయణ గారిని కలిశానో ఆ రోజునుంచి నేను మారిపోయాను. సత్సంగిగా మారిపోవాలని అనుకుంటున్నాను. నేను నా జీవితంలో ఇక ముందెప్పుడూ ఈ రెండు వస్తువులని ముట్టుకోదల్చుకోలేదు. అలాగే మీ దగ్గరకి వచ్చి మీతో సహవాసం చేయ దల్చుకోలేదు అని నిష్కర్షగా చెప్పాడు” అని చెప్పగానే వాళ్ళందరూ ఆశ్చర్య పోయారు. ఈ వ్యసనాలకి మనం ఒకసారి లోబడ్డాక వాట్ని వదలడం అంత తేలిక కాదే మరి ! అంత తొందరగా వదిలి పెట్టడం సహజం కాదు కదా !  ఏం ఆశ్చర్యం ! మరి ఝావేరిలాంటి జూదగాడు, త్రాగుబోతు మనిషిలో ఇంత మార్పు వచ్చిందంటే మేము నమ్మలేక పోతున్నాం.ఈ స్వామి నారాయణ, ఆయన భక్తులు మరి ఝవేరి మీద ఏం మాయ చేశారో అర్థం కావడం లేదు. దీని సంగతేమిటో మనం కనుక్కుందాం, ఝవేరిని అంత తొందరగా మనం వదిలి పెట్టకూడదు అని వాళ్ళలో వాళ్ళు ఒక నిశ్చయానికి వచ్చారు.

ఇక్కడ ఝవేరి స్వామి నారాయణ గారి మంచి భక్తుడిలాగా మారిపోయాడు. సదాచారుడైపోయాడు. చెడుమార్గాలని వదిలివేశాడు. త్రాగడం, జూదం ఆడడం, ఆడపిల్లల్ని వేధించడం లాంటి పనులన్నీ మాని వేశాడు. ఒక మచి వ్యక్తిగా అద్భుతంగా మారిపోయాడు. స్వామి నారాయణ గారు చెప్పిన మార్గంలోనే నడిచి ఆనతి కాలం లోనే అతను మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ అద్భుతమైన మార్పు కొడుకులో కలగడం చూసిన ఆ తల్లి అమితంగా సంతోషించింది. కాని ఊళ్ళో ఉన్న కొంత మంది మాత్రం “ వీడు అన్నీ నాటకాలు చేస్తున్నాడు. వ్యసంననికి అలవాటు పడ్డ వాళ్ళు ఒక పట్టాన దాన్ని వదల్లేరు. అది అసాధ్యమైన పని. పైగా వీడు మంచి జూదరి , చెడు అలవాట్లు బాగా ఉన్నాయి” అని చుట్టుప్రక్కల గ్రామాల్లో అందరికి తెలిసిపోయింది. అంత చెడ్డ సహవాసంలో ఉన్నవాడు స్వామి నారాయణ గారి భక్తుడి లాగా నటిస్తున్నాడేమో” అనే అనుమానాన్ని వెలిబుచ్చారు. ఇదంతా అబద్ధం అని తేలిపోయింది. అసుర శక్తులు ఝావేరిని వదిలి పెట్టలేదు. అతని చుట్టుప్రకాల వాళ్ళందరూ కూడా ఏవేవో విషయాలు చెప్పారు. నీవు పైపైనే నటిస్తున్నావు . ఈ వ్యసనాలు మానడం చాలా కష్టం. అయితే నీకు స్వామి నారాయణ గారి మీద అంత భక్తీ, శ్రద్ధలు, అంత నమ్మకం ఉన్నాయా ? అని అడిగారు. “ అవును ! నాకు ఉన్నాయి” అని ఝవేరి బదులు ఇచ్చాడు.
“ అయితే స్వామి నారాయణ గారు నీకు ఏళ్ళ వేళలా రక్షణ ఇస్తారా?” అని  అడిగారు.

”భగవంతుని యొక్క పని అదే కదా ! స్వామి నారాయణ గారిని నేను సాక్షాత్తు భగవంతుడనే భావిస్తున్నాను . ఆయన్నే నమ్ముకున్నాను కాబట్టి ఆయన్ని నమ్ముకున్నవారిని ఆయనే అన్ని రకాలుగా కాపాడుతుంటారు, రక్షిస్తుంటారు అనే దృఢ విశ్వాసం నాకుంది.”చాలా శాంత స్వరంతో ఝవేరి చెప్పాడు. ఆ సమూహానికి ఇతని మాటలు చాలా సందేహాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించాయి.  వీడు నిజంగానే మారాడా? స్వామి నారాయణ్ గారంటే నిజంగా వీడికి అంత భక్తీ ఉందా ? నిజంగా స్వామి నారాయణ గారిలో అంత శక్తి ఉందా ? అని వాళ్ళలో వాళ్ళు తర్కించుకున్నారు. “నీ శ్రద్ధా భక్తుల్ని నీవు ఎలా నిరూపించుకుంటావు?” అని ఎదురుప్రశ్న వేశారు. ఎలాగైనా సరే వాడి దృఢ నిశ్చయాన్ని బలహీన పరచాలని వాళ్ళు నిశ్చయించుకుని ఒక పథకం వేశారు. “సరే ! అయితే మనం ఒక పందెం వేద్దాం ! రేపు ప్రొద్దున నీవు కోటేశ్వరి మందిర  శిఖరం నుంచి క్రిందకి దూకాలి” అని చెప్పారు. ఆ మాటలకి ఝవేరి భగత్  ప్రశాంత చిత్తంతో , ప్రశాంతమైన స్వరంతో  “సరే ! అలాగే చేస్తాను’’ అని చెప్పి వెళ్ళిపోయాడు.
భక్తుడి విశ్వాసం.

"జై స్వామి నారాయణ " అని అనుకుంటూ ఝవేరి అక్కడనుంచి వెళ్లి పోయాడు.
మర్నాడు ప్రొద్దున్నే లేచి ఝవేరి కోటేశ్వర్ మందిరానికి వెళ్ళాడు. జై స్వామి నారాయణ ఇప్పుడు ఇక్కడ భక్తికి, శ్రద్ధకి పరీక్ష జరగబోతుంది. నేను దానికి సిద్ధంగా ఉన్నాను.ప్రభూ ! నీవే నన్ను చూసుకోవాలి. నీ మీద నాకు సంపూర్ణ విశ్వాసముంది అని చేతులు జోడించి స్వామి నారాయణ గారిని ప్రార్థించి, అతను నిజంగానే ఆ కోటీశ్వర  మందిరాన్ని ఎక్కసాగాడు. అది చోస్సిన ఆ దూర్తులందరూ ఆశ్చర్యపోయారు. మనం ఈ రకంగా ప్రాణభయం పెట్టి తే, వాడి విశ్వాసం మారిపోయి మళ్ళీ మాలోచేరి చక్కగా జూదం ఆడుతూ ఉంటాడు , వాడ్ని మనం మార్చేద్దాం అని అనుకున్నాం. కాని వీడేమో నిజంగానే ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు!” అని ఝవేరిని తిరిగి రమ్మని పిలవసాగారు. ఇదంతా క్షణంలో ఆ గ్రామంలో పాకిపోయింది. ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరు, అతని మేనమామ, అత్తా,అమ్మతో సహా ఆ మందిరం దగ్గరకి వచ్చేశారు. ఝవేరి చేస్తున్న ఆ దుస్సాహసాన్ని చూశారు. అతను నిచ్చెన ఎక్కి ఆ మందిరపు శిఖరం వైపు గబగబా వెళ్ళసాగాడు. ఝవేరి తల్లి, మేనమామ, అతని భార్యా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. క్షణంలో ఈ వార్త విని వచ్చిన ప్రజలందరూ అక్కడ చుట్టూ చేరి గట్టిగా అరుస్తూ గగ్గోలు పెట్టసాగారు. ఝవేరి తల్లి, మేనమామ, అత్తా ముగ్గురూ కలిసి “ఝవేరి ! నాయనా ! క్రిందకి దిగు ! ఇలాంటి దుస్సాహసం చేయకు ! అని ఎంతో ప్రాధేయ పడ్డారు. గ్రామస్థులంతా ఎన్నో రకాలుగా  ఇలాంటి దుస్సాహసం చేయవద్దు, క్రిందకి వచ్చేసేయ్ అని గట్టిగా చెప్పారు. అయినా కూడా ఝవేరి వారి మాటలు లెక్ఖ చేయలేదు. శిఖరం ఎక్కడం మాన లేదు. అతను ఏవీ వినకుండా ఒకే ఒక లక్ష్యంతో స్వామి నారాయణ గారి నామం జపిస్తూ ఆ శిఖరం పైకి ఎక్కాడు. అతను ఇంకా వేగంగా శిఖరాగ్రానికి వెళ్ళసాగాడు. అతనిలి ఏ తడబాటు కాని,జంకు గాని, భయం, తొట్రుపాటు గాని లేవు. ఉన్నది కేవలం స్వామి నారాయణ గారి నామజపమే. అడుగడుగునా స్వామి నారాయణ గారి నామమే పలుకుతుంది. “స్వామి నారాయణ”, “స్వామి నారాయణ”, “స్వామి నారాయణ” అనుకుంటూ శిఖరాగ్రానికి చేరి, అక్కడ నిల్చుని ప్రార్థిస్తూ “జై శ్రీ స్వామి నారాయణ” అంటూ ఒక్కసారిగా అంత పైనున్న  ఆ శిఖరాగ్రం నుంచి  క్రిందకి దూకాడు. అందరూ భయ పడ్డారు, ఆశ్చర్య పోయారు. అంత ఎత్తు నుంచి క్రిందకి దూకినవాడు ప్రాణాలతో బయటపడ్తాడా? చాలా కష్టం. అతడు గాలిలోంచి క్రింద పడుతుండగా కూడా స్వామి నారాయణ మంత్రం మాత్రం వదిలిపెట్టలేదు. కళ్ళు మూసుకుని స్వామి నారాయణ మంత్రం జపం చేస్తూనే క్రిందకి దూకాడు. అద్భుతంగా స్వామి నారాయణ గారు అక్కడ ప్రత్యక్షమయ్యారు. అలా క్రింద పడుతున్న ఝవేరిని జాగ్రత్తగా తన చేతుల్లో పట్టుకున్నారు. మెల్లగా అతన్ని భూమ్మీద దింపారు. ఝవేరి భగత్ స్వామి నారాయణ గారి హస్త స్పర్శతో కళ్ళు తెరిచాడు. అమోఘం ! అద్భుతం ! ఆశ్చర్యం ! ఆనందం !  ఇలా అన్ని రకాల భావాలు అతనిలో ఒక్కసారిగా విజృ౦భి౦చాయి. స్వామి నారాయణ గారు  మాత్రం ప్రేమతో అతన్ని తదేకంగా చూస్తూ నిలబడి పోయారు. ఝవేరి భగత్ ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామి నారాయణ గారి పాదాల మీద పడిపోయి “ప్రభూ ! మీరు నా విశ్వాసాన్ని నిలబెట్టారు. నేను అవమాన పాలు కాకుండా , మీకు చెడ్డపేరు రాకుండా నన్ను కాపాడారు.” అని అన్నాడు.

“ఝవేరి భగత్ ! నీ ఇక ముందెప్పుడూ ఇలాంటి పందాలు వేయకూడదు. చూడు ! నీకోసం నేను అంత దూరం నుంచి పరిగెత్తుకుని రావాల్సి వచ్చింది కదా !  నమ్మకం, శ్రద్ధ, భక్తి ఉన్న భక్తుణ్ణి రక్షించుకోవడం నా ధర్మం కదా ! భక్తునికి సేవ చేయడమే కదా నా లక్ష్యం. నిన్ను కాపాడుకోవడానికే నేను ఇక్కడకి వచ్చాను అని ఆయన చెప్పారు. అక్కడ సూది పడితే వినబడుతుంది అంత నిశ్శబ్దంగా ఉండాలి. అక్కడ చేరిన జనాలందరికి నోట మాట రాలేదు. ఏం  మాట్లాడాలో ఎవ్వరికి అర్థం కాలేదు. అది నిజమా, భ్రాంతియా తెలియని  సందిగ్ధావస్థలో పడిపోయారు. తల్లి, మేనమామ,అత్తా , మిగిలిన వారందరూ కూడా స్వామి నారాయణ గారికి  నమస్కారం చేశారు. అక్కడ చేరిన గ్రామస్థుల హృదయాల్లో కూడా పరివర్తన వచ్చింది. ఆ జూదరులందరూ ఈ దెబ్బతో తమ వ్యసనాలన్నీ మానుకొని స్వామి నారాయణ గారి భక్తుల్లాగా మారిపోయారు. ఆ గ్రామం అంతా స్వామి నారాయణ గారికి దాసోహమంది. ఈ రకంగా భక్తి శ్రద్ధ, నమ్మకం ఉన్న భక్తుల్ని సాక్షాత్తు భగవంతుని అవతారమైన స్వామి నారాయణ గారు రక్షించారు.