N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Monday, 25 January 2016

SwamiNarayan - Episode 67


నందోల్ గ్రామానికి శ్రీ స్వామి నారాయణ గారి ఆగమనం
ఒక సారి స్వామి నారాయణ గారు నందోల్ అనే గ్రామంలో అహింసా యజ్ఞం తలపెట్టారు. ఆ గ్రామపు ముఖియా ఇంకా వేరే గ్రామస్థులందరూ స్వామి నారాయణ గారి దర్శనం చేసుకుని ఆ అహింసా యజ్ఞంలో పాల్గొన్నారు. యజ్ఞం అయిపోయాక ఆ గ్రామాధికారి స్వామి నారాయణ గారికి నమస్కరించి “ప్రభూ ! మీరు మా నందోల్ గ్రామానికి వచ్చి ఈ భూమిని పవిత్రం చేశారు. అహింసా యజ్ఞం ఎలా ఉంటుంది అన్నది మేం మొట్టమొదటిసారిగా చూశాం. 


ఇంతకు  మునుపు యజ్ఞం లో జంతుబలి అనే ప్రక్రియ ఉండేది. ఆ ప్రక్రియ లేకుండా అంటే హింస లేకుండా అహింసా మార్గంలో యజ్ఞం ఎలా చేయాలన్నది మేము చూశాం. మాకు చాలా సంతోషం కలిగింది “. అని విన్నవించుకున్నాడు. స్వామి నారాయణ గారి శిష్యబృందంలో ముఖ్య శిష్యుడు గ్రామాధికారి తోటి “అవును ! మీరు చెప్పింది నిజమే ! మరి  ఇక్కడ మా స్వామి నారాయణ గారు చౌరాసి అనే యజ్ఞం ఒకటి చేయాలని అనుకుంటున్నారు. అందుకని ఈ గ్రామంలో ఉన్న బ్రాహ్మణులందరికి బ్రహ్మభోజనం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. మరి మీరు ఈ ఊళ్ళోని బ్రాహ్మణులందరికి కబురు చేశారా? వాళ్ళందరు వచ్చి స్వామి నారాయణ గారు చేసే ఈ అన్న దాన వితరణలో పాల్గొనాలి అని చెప్పారా?” అని అడిగాడు. దానికి స్వామి నారాయణ గారు కూడా “అవును ! మీరు బ్రాహ్మణులందరినీ పిలిచారా?’’ అని అడిగారు. గ్రామాధికారి గారు దానికి సమాధానంగా “ స్వామి గారూ ! ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. పూర్వం ఏదో చిన్న తగాదా మూలంగా ఈ ఊళ్ళో బ్రాహ్మణులు చోటా గడ్కి, బడా గడ్కి అని రెండు వర్గాలుగా విడిపోయారు. ఒకళ్ళ ముఖాలు ఇంకొకళ్ళు చూసుకోరు. ఒకరి ప్రక్కన ఇంకొకరు నిలబడరు.  మీరు నిర్వహించే ఈ చౌరాసి యజ్ఞానికి వాళ్ళందరు కలిసి వస్తారో లేదో నాకు తెలియదు కాని నేను మటుకు చోటా గడ్కి , బడా గడ్కి ఈ రెండు  వర్గాల బ్రాహ్మణులని ఆహ్వానించాను అని చెప్పాడు. దానికి స్వామి నారాయణ గారు ఆ ! వస్తారు లే తప్పకుండా ! అని అన్నారు. 

ఇలా వాళ్ళు మాట్లాడుకుంటుండగానే స్వామి నారాయణ గారి శిష్యుడు “అదిగో ! మనం అనుకుంటుండగా నే ఆ బ్రాహ్మణు లిద్దరు వచ్చేశారు. చూడండి అటు ! అని అన్నాడు. స్వామి నారాయణ గారు వారిని సాదరంగా ఆహ్వానించి కూర్చోమని చెప్పగానే వారిద్దరూ అక్కడ కూర్చున్నారు. ముఖియా గారిని చూసి స్వామి నారాయణ గారు మరి మీరు వారిని నాకెవరో పరిచయం చేయరా? అని అడిగారు. వెంటనే ముఖియా గారు అందులో ఒకరిని చూపించి ప్రభూ ! ఈయన జటాశంకర్ గారు “ అని చెప్పగానే ఆయన  “నేను బడా గడ్కికి చెందినవాణ్ణి” అని చెప్పుకున్నాడు. ఇంకొకరిని చూపించి ఈయన గిరిజా శంకర్ గారు అని చెప్పగానే ఆయన కూడా “ నేను చోటా గడ్కికి చెందినవాణ్ణి” అని పరిచయం చేసుకున్నాడు.

స్వామి నారాయణ గారి ఆహ్వానం

బడా గడ్కికి చెందిన జటా శంకర్ గారూ, చోటా గడ్కి బ్రాహ్మణ సముదాయానికి చెందినా గిరిజా శంకర్ గారూ , మీ ఇద్దరికీ నా మనఃపూర్వక స్వాగతం ! నేను మీ ఇద్దర్నీ ఇక్కడికి ఎందుకు పిలిపించానంటే నేను ఈ నందోల్ గ్రామంలో ఆహి౦సాయుక్తమైన ఒక యజ్ఞాన్ని చేయాలని తలపెట్టాను. దానికి ముందు చౌరాసి అనే వ్రతాన్ని చేయాలని సంకల్పించాను. కాబట్టి ఈ ఊళ్ళో ఉన్న బ్రాహ్మణులందరు జటా శంకర్ గారూ మీరు , గిరిజా శంకర్ గారు మీరు మీ బృందం తోటి, మీ భార్యా మితృలతో సహా సోమవారం ప్రొద్దున్నే మీరు చౌరాసి వ్రతానికి రావాలి. మా బ్రహ్మ భోజనం సేవించి మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి అని ఆశీస్తున్నాను. ఈ బ్రహ్మ భోజనం వల్ల నాక్కూడా ఎంతో పుణ్యం వస్తుంది. నేను బ్రాహ్మణుల నే దేవతలుగా భావిస్తాను. కాబట్టి సోమవారం ప్రొద్దున్నే మీరందరూ తప్పకుండా రండి అని ఎంతో గౌరవంగా వారిని స్వామి నారాయణ గారు ఆహ్వానించారు. ఆ బ్రాహ్మణు లిద్దరు కూడా మౌనంగానే ఉండి పోయారు. స్వామి నారాయణ గారు వారిని చూసి “ఓ బ్రాహ్మణ దేవతల్లారా ! ఏమీ మాట్లాడకుండా ఎందుకలా మౌనంగా ఉన్నారు? అని అడిగారు. వారిద్దరూ కూడా ఒకే రకమైనసమాధానం ఇచ్చారు. “మాకైతే అభ్యంతరం ఏమీ లేదు. కాని మేము మా పరివారాన్ని కూడా సంప్రదించాలి కదా ! వాళ్ళేం చెప్తారో విని మేము మీకు చెప్తాం” అని సమాధాన౦ ఇచ్చారు. అది విని స్వామి నారాయణ గారి శిష్యుడు “మీరు తప్పకుండా ఆ పని చేయండి. మీ మీ పరివారాలకి సరిగ్గా చెప్పండి. భగవాన్ స్వామి నారాయణ గారు నందోల్ గ్రామానికి విచ్చేసి బ్రాహ్మణు లందరినీ కూడా ఆయన ఇచ్చే బ్రహ్మ భోజనానికి రమ్మని ఆయన స్వయంగా ఆహ్వానిస్తున్నారు” అని చెప్పండి. ఈ లోపల స్వామి నారాయణ గారు “ మనం ఇలా అతిథులని కూర్చో బెట్టి మాట్లాడుతున్నాం కదా !  వారికి అల్పాహారాలేవైనా ఇవ్వరా ?” అని అడిగారు. దానికి వెంటనే గిరిజా శంకర్ గారు లేచి “ లేదు ! లేదు ! అలాంటి అవసరం లేదునాకు పని ఉంది. అది ఇప్పుడే గుర్తుకి వచ్చింది. నేను వెళ్ళాలి  అని చెప్పేసి, నమస్కారం పెట్టి అక్కడనుంచి గబ గబా వెళ్ళిపోయాడు.  అక్కడే ఉన్న జటా శంకర్ గారిని ఉద్దేశించి స్వామి నారాయణ గారు ఇదే ఆదేశాన్ని తన అనుచరులకి చెప్పగానే జటా శంకర్ గారు “లేదు ప్రభుశ్రీ ! నేను కూడా వెళ్లిపోవాలి , ఒక చోట సగం పూజ చేసి నేను వచ్చాను, అని చెప్పి , ఆయన కూడా నమస్కారం పెట్టి గబ గబా అక్కడ్నుంచి వెళ్లి పోయాడు. వారిద్దరూ వెళ్లి పోగానే స్వామి నారాయణ గారి శిష్యుడు ఇప్పుడు వాళ్లిద్దరు వెళ్లి వారి వారి బృందాలతో స్వామి నారాయణ గారు మనందరినీ బ్రహ్మ భోజనానికి పిలిచారు అని మాట్లాడుతారు అని చెప్పాడు. వెంటనే రెండవ శిష్యుడు “అవును ! అవును ! ఇది వినగానే అందరు తప్పకుండా మనం బ్రహ్మ భోజనానికి వెళ్దాం అని చెప్పి అందరు వస్తారు, దీని గురించి అక్కడ పెద్ద చర్చ అవుతుంది ” అని అన్నాడు. ఆ మాటలకి గ్రామాధికారి మాత్రం “ప్రభుశ్రీ  ! వీరిద్దరూ బ్రహ్మ భోజనానికి వస్తారు అని నేననుకోవడం లేదు. కనీస౦ ప్రక్క ప్రక్కల కూడా కూర్చోలేని ఈ రెండు వర్గాల వారు మీ దగ్గరకి భోజనాలకి వస్తారని మాత్రం నేననుకోను. కలిసి భోజనం చేయడం అనేది అసాధ్యంగానే కనిపిస్తుంది అని అన్నాడు. దానికి సమాధానంగా స్వామి నారాయణ గారి శిష్యుడు

“ లేదు గ్రామాధికారి గారూ ! మన ప్రభుశ్రీ తలుచుకుంటే వాళ్ళు తప్పకుండా వస్తారు. మన ప్రభుశ్రీ లీలలు అసాధ్యమైనవి సాధ్యమయ్యేటట్టుగానే ఉంటాయి” అని చెప్పాడు.
                            (to be continued.....)