N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Friday, 12 February 2016

SwamiNarayan - Episode 70



సగ్రాం వాఘ్రి
బ్రహ్మనందగారు మరియు మిగతా స్వామి నారాయణ గారి శిష్యులందరూ కూడా ధర్మప్రచారానికి వివిధ గ్రామాలకి వెళ్తూ ఉండేవారు. అలాగే ఒకసారి బ్రహ్మానంద స్వామివారు తన తోటి సహచరుల తోటి లిమ్డి అనే గ్రామానికి ధర్మప్రచార నిమిత్తమై వచ్చారు. వారు అలా కాలినడకన వెళ్తూ ఉంటే అకస్మాత్తుగా ఆకాశంలో ఒక చిన్న మోత వినిపించి తక్షణమే ఆయన కాళ్ళ దగ్గర ఆకాశంలోంచి ఒక పక్షి ఎగురుకుంటూ వచ్చిపడింది. ఆయన ఒక్కక్షణం ఆశ్చర్యపోయారు. దాని మీద ఎంతో జాలి కలిగింది. అరె! దాన్ని ఎలాగైనా రక్షించాలి !” అని ఆలోచిస్తుండగానే ఎక్కడునుంచో ఒక కుక్క వచ్చిఆ గాయపడిన పక్షిని నోట కరుచుకొని వెళ్ళిపోయింది. ఆయన మనసంతా పాపం వికలమైపోయింది. "అయ్యో! ఈ పక్షి ఏమిటి సరిగ్గా నా దగ్గరకి వచ్చిపడిందినేనేమి చెయ్యలేకపోయానే" అనే బాధ ఆయనకి మనస్సునిండా ఉండిపోయింది. 



అది తలుచుకుంటూనే ఆయన భగవాన్ శ్రీ స్వామినారాయణ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ విషయం ప్రస్తావించారు. అప్పుడు ఆయన సాలోచనగా, "అయితే  బ్రహ్మానందగారు ఆ కుక్క ఎక్కడి నుండి వచ్చి౦దిదానికి శిక్షణ ఎవరు ఇస్తున్నారుఆ పక్షి ఆకాశం నుంచి వచ్చి మీ కాళ్ళ దగ్గరే ఎందుకు పడిందిఇవన్ని ఏమన్నా మీరు ఆలోచించారా?" అని అడిగారు. "ప్రభుశ్రీ ! నాకేమి అర్ధంకావటం లేదు" అని బ్రహ్మానంద స్వామి గారు సమాధానం చెప్పారు. అప్పుడు  ప్రభుశ్రీ “ఆ పక్షి మీతో ఏదో ఒక సందేశం చెప్పాలని అనుకుని ఉంటుంది. లేకపోతే అది సరిగ్గా మీ కాళ్ళ దగ్గరే ఎందుకు వచ్చి పడుతుందికొంచెం ఆలోచించారా?” అని అడిగారు. బ్రహ్మానంద స్వామి గారు, “స్వామీ ! మరి నాకు ఏమీ అర్ధం కావడం లేదు. నేను ఏ రకంగా కూడా ఆ పక్షికి సహాయం చెయ్యలేకపోయాను.

అదే బాధలో నేను ఉన్నాను. కానీ అది ఎందుకు నా కాళ్ళ దగ్గర పడిందిఏ  సందేశం ఇవ్వబోతోంది అన్నది నాకు తెలియదు. నేను ఈ పక్షిని ఎలా కాపాడాలనే కోరికతో ఉన్నాను స్వామీ!” అని చెప్పగానే  ప్రభుశ్రీ  నవ్వుతూ “బ్రహ్మానంద స్వామి గారూ ! బహుశా ఆ పక్షి మీ కాళ్ళ దగ్గర పడింది. అది ఎలాగూ బతకదు,కానీ మిమ్మల్ని ఈ హింసని ఆపే ప్రక్రియ చేయమని అడిగి ఉండవచ్చు కదా! మీరు కనుక ఈ విషయానికి మూలంలోకి వెళితే అన్ని విషయాలు తప్పకుండా తెలుస్తాయి. ఆ గ్రామం చాలా చిన్నది కాబట్టి,ఆ పక్షిని ఎవరు కాలుస్తున్నారు? ఆ కుక్కకి ఎవరు శిక్షణ ఇస్తున్నారు?తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఈ పక్షుల యొక్క ప్రాణాలు రక్షింపబడతాయి కదా!”అని చెప్పారు.

బ్రహ్మానంద స్వామి “అవును ! ప్రభుశ్రీ ! నేను అలాగే చేస్తాను” అని చెప్పి మరలా ఆ లిమ్డి అనే చిన్న గ్రామానికి  వెళ్ళడం జరిగింది. అలా వెళుతూ వెళ్తూ ఆయన వాకబు చేస్తుండగా అక్కడ ఒక వ్యక్తి ఎదురుపడ్డాడు. అతని చేతిలో వేప పుల్లలు ఉన్నాయి. పళ్ళు తోముకోడానికి అతను ఆ గ్రామంలో అందరికీ ఆ వేప పుల్లలు ఇస్తూ ఉంటాడు. ఆయన ఈ స్వామీజీని పలకరించారు. అప్పుడు స్వామీజీకి ఆయన ”మీకు పళ్ళు తోముకోడానికి వేప పుల్లలు ఇస్తున్నాను”అని చెప్పగా,స్వామీజీ అతనిని “మీరు ఎవరు?ఏ౦ చేస్తూ ఉంటారు?” అని అడిగారు. అప్పుడు ఆయన నా పేరు "సగ్రాం వ్యాఘ్రి"“నేను ఇక్కడ చిల్లర చిల్లర పనులన్నీ చేస్తూ ఉంటాను. ఇలా వేప పుల్లలు అమ్మడంఉళ్ళో వాళ్ళు ఎవరన్నా చిన్న చిన్న పనులు చెబితే చెయ్యడం, అంతే కాకుండా నేను ప్రత్యేకంగా మా జమీందారు హరి సింగ్ గారి కోసం కుక్కలకి శిక్షణ ఇవ్వడం, ఇవన్నీ చేస్తూ ఉంటాను. అయినా మీకు తెలియదు కదా ! మా జమీందారు హరి సింగ్ గారు మంచి వేటగాడు. ఆయన గురి ఇంతవరకూ తప్పలేదు. ఆయన ఆకాశంలో వెళ్ళే పక్షులని రోజుకు కనీసం నాలుగోఐదో తూటాలతో పేల్చి చంపేస్తూ ఉంటారు. ఆ పడిన పక్షులని నేను శిక్షణ ఇచ్చినటువంటి కుక్క వెళ్ళి ఆయనకి స్వయంగా అందిస్తుంది. ఆయన మహా గొప్ప వేటగాడు” అని చెప్పసాగాడు. 

“మరి నువ్వు చేస్తూన్న ఈ పని వల్ల పాపం కలుగుతుందని నీకు తెలియదా పక్షులు ఏం తప్పు చేశాయి? వాటిని అలా చంపడం పాపం కదా !” అని స్వామీజీ అడగ్గా“ఏమో స్వామీ! నాకు అవన్నీ తెలియవు. మీలాంటి సంతులకి, మహా జ్ఞానులకి మాత్రమే పాపపుణ్యాల గురించి తెలుస్తుంది. మాలాంటి వాళ్ళకి  ఏం తెలుస్తాయి చెప్పండి. మా హరి సింగ్ గారు చాలా మంచివారు. అప్పుడప్పుడు నాకు ఆ పక్షి మాంసం కూడా ఇస్తూ ఉంటారుఅది నేను నా కుటుంబ సభ్యులతో కలిసి పంచుకుని తింటూ ఉంటాను. అంతే నాకు తెలుసు. నా పొట్ట కోసం నేను ఇవన్ని చేస్తున్నాను. అది పాపమా  పుణ్యమా అనే ఆలోచన నాకెప్పుడు రాలేదు. ఈ పాపపుణ్యాల సంగతి నాకు ఏమీ తెలియదుకనుక నన్ను వెళ్ళనివ్వండి. మీ పని మీరు చూసుకోండి, అని చెప్పి వినయంగా నమస్కరించి తిరిగి వెళ్ళబోయాడు.

అప్పుడు బ్రహ్మానంద స్వామి గారు అతనిని ఆపి“చూడు ! మీ జమీందారు గారు చేస్తూన్న పాపంలో నీకు కూడా భాగం ఉంది. నువ్వేమంటున్నావునేను చంపడం లేదు అనే భావన నీ మాటలలో  ఉంది. కానీ నువ్వు ఒక కుక్కని పట్టుకొచ్చి దానికి క్రింద గాయపడి పడిన పక్షులని తీసుకుని రావడానికి శిక్షణ ఇస్తున్నావు. ఆ శిక్షణ ఇచ్చిన కుక్క ఆ గాయపడిన పక్షులని పట్టుకొని వెళ్తూంటే  ఆ జమీందారు గారు పక్షి మాంసాన్ని నీకు కూడా పంచుతున్నారు. మరి ఆ పాపంలో నీకు కూడా భాగం లేదంటావా?  నీవు కనక ఆ కుక్కకి శిక్షణ ఇవ్వకపోతే ఇవన్నీ జరగవు కదా ! ఈ హింసాకాండ ఇక్కడే ఆగిపోతుంది కదా !  ఒకసారి ఆలోచించు” అని చెప్పారు. అప్పుడు సగ్రాం“స్వామీజీ ! మీకు నేను మళ్ళీ  చెప్తున్నాను. ఆ పాపం పుణ్యం నాకు తెలియదు. నా పొట్ట కోసం నేను ఈ వృత్తి చేస్తున్నాను”  అని చెప్పి వెళ్ళబోగా స్వామిజి అతనితో “ఒక్కసారి నా మాట విను. ఈ వేప పుల్లల్ని నువ్వు నాకు దానంగా ఇచ్చావు కదా ! దానికి ప్రతిఫలంగా నేను కూడా నీకోసం ఏదో ఒకటి చెయ్యాలి. మా సాధువుల దగ్గర డబ్బు ఏమీ ఉండదు” అని అన్నారు బ్రహ్మానంద స్వామి గారు.  
“మీరు నాకు ఆశీర్వాదం ఇవ్వండి చాలు ఇంకేమి అక్కర్లేదు” అని సగ్రాం చెప్పాడు. అప్పుడు బ్రహ్మానంద స్వామీ గారు “సరే ! ఒక పని చేస్తానునా ఆశీర్వాదం నీకు ఎలాగూ ఉంటుంది. నేను నీకు ఒక మంత్రం చెప్తానుఆ మంత్రం మహా శక్తివంతమై౦ది. నీ ప్రాణాలని రక్షిస్తూ ఉంటుంది. నిన్ను పాపాల నుంచి కాపాడుతూ ఉంటుంది. నీ కుటుంబాన్ని కూడా చక్కగా చూసుకుంటూ ఉంటుంది. ఆ మంత్రం ఏమిటంటే "జై స్వామినారాయణ ". దీన్ని నేను నీకు ఉపదేశిస్తున్నాను. నువ్వు ఎల్లప్పుడూ ఈ మంత్రాన్ని చేసుకుంటూ ఉండు నీకు శ్రేయస్సు కలుగుతుంది”  అని ఆశీర్వదించి ఆయన వెళ్ళిపోయారు.
అప్పుడు సగ్రాం ఇలా అనుకున్నాడు“సరేలే ! ఏదో చిన్న మంత్రమే చెప్పారు కదా! “స్వామినారాయణ”“స్వామినారాయణ” అని అనుకోవడంలో తప్పేముందిఅలాగే అనుకుంటాను అని చెప్పి ఆ బ్రహ్మానంద స్వామి గారికి నమస్కారం చేసి తన దారిన తానూ వెళ్ళిపోయాడు.

అప్పట్నుంచి అతను ఏ పని చేస్తూన్నా కూడా నిత్యం "స్వామినారాయణ","స్వామినారాయణఅని అనుకుంటూ ఉండేవాడు. అలా అనుకున్నందువల్ల తనకేమీ నష్టం ఉండదు కదా! అని భావిస్తూ ఉండేవాడు. ఇలా జరుగుతూండగా ఒక రోజు సగ్రాం తన పనిలో తాను హుషారుగా పాడుకుంటూ వెళ్తూ వుంటే అకస్మాత్తుగా అతనికి తుపాకీ పేల్చిన శబ్దం వినిపించింది. అతనలా మ్రాన్పడిపోయి ఉండిపోయాడు. ఈలోగా జమీందారు గారి భవనం నుంచి కొంతమంది సేవకులు ఒక చచ్చిపోయిన కుక్కని మోసుకుని వెళ్ళుతూ  కనిపించారు. అది సగ్రాం శిక్షణ ఇచ్చినటువంటి కుక్కే. అదే సమయంలో సగ్రాంని జమీందారు గారు పిలవటంతో అతను అక్కడికి వెళ్తూండగా ఈ సంఘటన జరిగింది.   
                                                                      (తరువాయి వచ్చే భాగంలో )