N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Saturday, 20 February 2016

SwamiNarayan - Episode 71



సగ్రాం వాఘ్రి
కుక్క కోసం వేట – ప్రమాదం – పునర్జన్మ
అతను జమీందారు గారి దగ్గరికి వెళ్లి వినయంగా నమస్కరించి, “మహారాజా ! మీరెందుకు పిలిచారు?” అని అడిగాడు. దానికి ఆయన సగ్రాం ! సమయానికి వచ్చావు.చాలా సంతోషం. చూశావు కదా ఇప్పుడే నేను నువ్వు శిక్షణ ఇచ్చినటువంటి కుక్కని చంపేసాను. ఎందుకంటే అది ముసలిది అయిపోయి౦ది. నేను  ఐదు పక్షులని చంపితే అది మెల్లగా, చాలా నెమ్మదిగా రెండో మూడో పక్షులని మాత్రమే తీసుకుని రాగలుగుతుంది. అందుకనే నేను దానిని చంపేశాను. నా భవనానికి చాలామంది నా మిత్రులూ వాళ్ళూ వస్తూంటారు. 



మరి నేను చంపినవాటిలో కేవలం రెండో మూడో మాత్రమే అది తీసుకొస్తోంది కనుక నేను దానిని చంపేశాను’’ అని చెప్పారు. అప్పుడు సగ్రాం“మహారాజా ! ఆ తుపాకీ మోత నాకు కూడా  వినిపించింది. నేను శిక్షణ ఇచ్చిన కుక్క శవాన్ని కూడా నేను చూశాను. మహాప్రభూ ! ఏమి మీ ఆజ్ఞ? అనగా “సగ్రాం ! నీకు తెలుసు కదా! నాకు ఇప్పుడు ఇంకొక కొత్త కుక్క కావాలి. నువ్వు ఎలాగైనా సరే ఒక కొత్త కుక్కకి శిక్షణ ఇచ్చి నా దగ్గరకి పంపించాలి. అందుకోసం నీకు ఈ డబ్బు ఇస్తున్నాను” అని చెప్పి ఒక కాసుల సంచి అతని చేతిలో పెట్టి  ఈ పని మాత్రం నువ్వు కాస్త తొందరగా చెయ్యి అని చెప్పి అతనిని పంపించివేశారు. సగ్రాం చాలా సంతోషపడ్డాడు. ఎంతో హుషారుగా ఆ డబ్బుల సంచిని పట్టుకొని ఇంటికి వెళ్ళి తన తల్లికి , భార్యకి ఈ విషయాన్నంతా చెప్పాడు. అప్పుడు అతని భార్య చాలా సంతోషించింది. అలాగే తల్లి కూడా ఆమెకి వంత పాడింది. ఇద్దరూ కూడా సగ్రాం తో “నువ్వు తొందరగా ఒక కొత్త కక్కని సంపాదించి దానికి శిక్షణ ఇచ్చి జమీందారు గారికి అప్పగించు. ఆయన మళ్ళీ మనకి డబ్బులు ఇస్తారు” అని చెప్పసాగారు. అప్పుడు సగ్రాం, “ఈ జమీందారు గారు చాలా మంచివాడు. నేనెప్పుడు వెళ్ళినా చాలా మర్యాదగా నాతో మాట్లాడుతాడు. నాకు అప్పుడప్పుడు ఆ పక్షి మాంసం కూడా ఇస్తూ ఉంటాడు. అలాగే చాలా బహుమానాలుడబ్బులూ కూడా ఇస్తూంటారు. నేను ఎలాగైనా సరే మళ్ళీ  ఇంకో కుక్కకి శిక్షణ ఇచ్చి ఆయనకి అప్పగిస్తాను. ఆయన దగ్గర నుంచి చాలా బహుమానాలుడబ్బులు తీసుకుంటాను” అని చెప్పాడు.
ఆ తరువాత అతను నిత్యం స్వామినారాయణ నామాన్ని జపిస్తూనే కొత్త కుక్క కోసం ఊరంతా తిరగసాగాడు. ఒకసారి అతనికి ఒక కుక్క ఒక చెట్టు కింద కనిపించింది. దాని వద్దకు స్వామినారాయణ నామాన్ని జపిస్తూ సగ్రాం వెళ్ళసాగాడు. అతని వద్ద పాలల్లో ముంచినటువంటి  రొట్టె ముక్కలు ఉన్నాయి. అతని ధ్యాసంతా ఆ కుక్క మీదే ఉంది. దాని వద్దకు వెళ్ళి స్వామినారాయణ మంత్రాన్ని జపిస్తూ“ఓ  కుక్కా ! నిన్ను నేనెలాగైనా సరే మచ్చిక చేసుకుంటాను” అని చెప్తూ దానిని ప్రేమగా పిలువసాగాడు. అతను ఆ కుక్కతో నేను నీకోసం పాలల్లో ముంచిన రొట్టె ముక్కలను తీసుకొచ్చాను "స్వామి నారాయణ","స్వామి నారాయణ". అలాగే ఈ పాలల్లో మత్తు మందుని కూడా కలిపాను "స్వామి నారాయణ"," స్వామి నారాయణ". ఈ రోజు ఎలాగైనా నిన్ను మచ్చిక చేసుకుంటాను. నా మిత్రుడిగా చేసుకుంటాను "స్వామి నారాయణ"," స్వామి నారాయణ" అంటూ చెప్పసాగాడు. ఇలా ఈ మత్తు మందు కలిపిన పాలతో ఉన్న రొట్టె ముక్కలను ఆ కుక్క తినగానే అది మత్తులో ఉంటుంది కనుక దానిని తీసుకువెళ్ళి శిక్షణ ఇవ్వాలని అతని ఆలోచన. ధ్యాసంతా అటువైపే ఉంది. అతను ఏ చెట్టు కిందనైతే కూర్చుని ఉన్నాడో ఆ చెట్టు పైన ఇద్దరు వ్యక్తులు కూర్చుని ఒక కొమ్మను నరుకుతున్నారు. ఆ నరికిన కొమ్మ పెద్ద శబ్దం చేస్తూ సగ్రాం కూర్చుని ఉన్న చోట పడబోయింది. కాని అదే సమయంలో ఎవరో తోసినట్టుగా అనిపించి అతను ధబాలున ముందుకు వెళ్ళి పడ్డాడు. వెంటనే ఆ చెట్టు కొమ్మ సగ్రాం ఇంతకు ముందు కూర్చుని ఉన్న స్థలంలో పడిపోయింది. అప్పుడు సగ్రాం చాలా ఆశ్చర్యపడి “ఏమిటీ? ఎందుకిలా జరిగింది? ఆ చెట్టు కొమ్మ నా మీద పడి ఉంటే  నా తల పగిలిపోయుండేది కానీ ఎవరో తోసినట్టు అనిపించడంతో నేను ముందుకు వచ్చి పడ్డాను” అని అనుకున్నాడు. ఆ చెట్టు నరుకుతున్న వాళ్ళు కూడా సగ్రాం ని చాలా కోప్పడ్డారు. “ఏమిటీ అంత పరధ్యానంగా ఉన్నావు? మేము ఈ చెట్టుని అంత పెద్ద శబ్దంతో నరుకుతూ ఉన్నా కూడా నువ్వు చూడలేదు. అది నీ నెత్తి మీద పడి ఉండేది. అప్పుడు నీ పని అయిపోయేది. జాగ్రత్తగా ఉండు !” అని మందలించారు.
ఏదో ఆలోచిస్తూ అతను మనస్సులోనూపైకి కూడా స్వామి నారాయణ మంత్రాన్ని జపించుకుంటూ ఇంటికి చేరాడు. అతనితో పాటు ఆ కుక్క కూడా అతని ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చినాక  కూడా సగ్రాం ఒకవిధమైన పరధ్యానంలో పడిపోయాడు. అతను జరిగిన ప్రమాదాన్ని గురించి ఆలోచిస్తూ "స్వామి నారాయణ", "స్వామి నారాయణ" అనుకుంటూ ఉండగా అతని భార్య ,తల్లి ఇద్దరూ వచ్చి “అసలేం జరిగింది ? ఎందుకలా పరధ్యానంగా ఉన్నావు?” అని ప్రశ్నించారు. అప్పుడు సగ్రాం వారితో చాలా అద్భుతం జరిగింది అంటూ జరిగిన విషయమంతా చెప్పాడు. ఈ స్వామి నారాయణ మంత్రంలోనే ఏదో మహాత్మ్యం ఉంది లేకపోతే నేను ఈ రోజు మీతో ఇలా మాట్లాడుతూ ఉండేవాడిని కాదు అని చెప్పసాగాడు. ఇదేవిధంగా స్వామి నారాయణ జపాన్ని పదే పదే ఉచ్ఛరిస్తూ సగ్రాం దీర్ఘాలోచనలో పడిపోయాడు. అతడికి బ్రహ్మానంద స్వామి గారు చెప్పినటువంటి మాటలు గుర్తుకురాసాగాయి. “సగ్రాం ! నువ్వు పాపం చేస్తున్నావు. ఆ పక్షి మాంసాన్ని తింటూ జమీందారు గారు చేస్తూన్న పాపంలో కూడా నువ్వు పాపం పంచుకుంటున్నావు. ఆ కుక్కలకి ముసలితనం రాగానే చాలా నిర్దాక్షిణ్యంగా జమీందారు గారు చంపేస్తున్నాడు. నువ్వు చాలా పాపం చేస్తున్నావు. జాగ్రత్త సుమా !” అని చెప్పిన వాక్యాలు అతనికి పదే పదే గుర్తుకు వస్తున్నాయి. మొట్టమొదటి సారిగా తను ఏదో తప్పు చేస్తున్నట్టుగాపాపం చేస్తున్నట్టుగా అతనికి అనిపించింది. ఇలా పరధ్యనంగానే అతను రోజులు గడపసాగాడు.

 సగ్రాం వాఘ్రి – పునర్జన్మ రెండవ సారి  

కొద్ది రోజులకి జమీందారు గారి భటులు సగ్రాం ఇంటికి వచ్చి అతని తల్లినిభార్యని గట్టిగా నిలదీశారు సగ్రాం ఎక్కడికి వెళ్ళాడని. ఈలోగానే సగ్రాం ఇంటికి రావడంతో అతనిని పట్టుకుని రెక్కలు విరిచి జమీందారు హరి సింగ్ గారు నీ మీద చాలా కోపంగా ఉన్నారు. నిన్ను తీసుకురమ్మన్నారని చెప్పి లాక్కొని వెళ్ళిపోయారు. సగ్రాం తల్లి ,భార్య భయాందోళనలతో ఆలోచిస్తూ అలాగే కూర్చుండిపోయారు. అయితే సగ్రాం మాత్రం స్వామినారాయణ మంత్రాన్ని జపిస్తూ చాలా ధైర్యం గానే జమీందారు గారి దర్బార్ కి వెళ్ళాడు. ఆ దర్బార్ లో జమీందార్ హరి సింగ్ గారితో పాటు ఆయన స్నేహితులు కూడా చాలా మంది ఉన్నారు. సగ్రాం ని చూడగానే ఆయన ఎంతో ప్రశాంతంగానే “సగ్రాం ! ఎలా ఉన్నావు?” అని ప్రశ్నించారు. దానికి సగ్రాం నేను చాలా బాగున్నానని జవాబు చెప్పాడు. అప్పుడు జమీందారు గారు అతనితో నీకు గుర్తుందా సగ్రాం? నేను నీకు ఒక కుక్కకి  శిక్షణ ఇవ్వమని చెప్పి చాలా రోజుల క్రితం చెప్పాను. కొన్ని డబ్బులు కూడా ఇచ్చాను తెలుసా ? అన్నాడు. “తెలుసు మహాప్రభూ !” అని సగ్రాం అన్నాడు. మరైతే నువ్వు ఎందుకు నాకు ఆ శిక్షణ ఇచ్చిన కుక్కని అప్పగించలేదు? అని అడిగారు. సగ్రాం సమాధానంగా“మహారాజా ! నా మనస్సు ఎందుకో అంగీకరించట్లేదు. మనం పాపం చేస్తున్నామన్న భావన నాకెందుకో కలుగుతుంది. మీరు చేస్తున్న పాపంలో కొంత భాగం నాక్కూడా ఇస్తున్నారేమో !  అనిపిస్తుంది” అని చాలా నిర్భయంగాఅమాయకంగా చెప్పాడు. దాంతో జమీందార్ గారికి చాలా కోపం వచ్చింది. “ఏమిటీ? కొత్తగా నీతి వాక్యాలు చెప్తున్నావు?అసలేం జరిగింది నీకు” అని అడిగారు. “నేనెప్పుడూ కూడా స్వామి నారాయణ గారి జపంలోనే ఉంటాను. అందుకే నాలో ఈ భావనలు కలిగాయి” అని సగ్రాం చెప్పాడు. “ఓహో! అయితే నువ్వు స్వామి నారాయణ గారి దగ్గర పనిలో చేరావన్నమాట !” అని చెప్పి ఆయన పక్కనే ఉన్న తుపాకీని పట్టుకున్నాడు. ఆ స్వామి నారాయణ గారు నిన్ను ఎలా రక్షిస్తారో చూస్తాను అని చెప్పి తుపాకీని సగ్రాం తలకి గురిపెట్టాడు. అయితే సగ్రాం మాత్రం ఏమీ భయం లేకుండా "స్వామి నారాయణ", "స్వామి నారాయణ", "స్వామి నారాయణ" అంటూ నామజపం చేయసాగాడు. అక్కడ ఉన్న పరిచారకులు కొంత మంది భయపడి అక్కడినుంచి పారిపోయారు. అక్కడ ఉన్న స్నేహితులు కూడా ఏ౦ జరుగుతుందా అని దిగ్బ్రాంతితో చూస్తున్నారు. కాని జమీందార్ గారిని వారించడానికి ఎవరికీ కూడా అంత ధైర్యం లేకపోయింది. చాల దగ్గరగా తుపాకీని గురిపెట్టి హరి సింగ్ గారు దానిని పేల్చారు. ఆశ్చర్యంగా తుపాకీలో నుంచి శబ్దం వచ్చింది కానీ తూటా ఏమీ రాలేదు. స్వామి నారాయణ జపం చేస్తూ ఉన్న సగ్రాం కూడా తనకు ఏమీ జరగనందుకు చాలా ఆశ్చర్యపోయాడు. హరి సింగ్ గారికి కూడా ఏమి అర్ధంకావడంలేదు. పొద్దున్న నేను ఈ తుపాకీలో తూటాలు పెట్టాను కదా ! అవన్నీ ఏమైనాయని అయన అనుకోసాగాడు. మొట్టమొదటి సారిగా నేను గురి తప్పాను. “బహుశా సగ్రాం ! నీకు ఇంకా కొద్ది రోజులు బ్రతకాలని రాసి ఉన్నట్లుంది అందుకే నిన్ను వదిలేస్తున్నాను” అని చెప్పి అతణ్ణి పంపించివేశారు.సగ్రాంకి  కలో,నిజమో అర్ధంకాలేదు. నడవడానికి కాళ్ళు కూడా రావట్లేదు. ఇద్దరు  మనుషులు తోడ్కొని అతనిని ఇంటికి తీసుకువెళ్ళారు. చాలా అన్యమనస్కంగాపరధ్యానంగా ఉన్న సగ్రాంని చూసి అతని తల్లి ,భార్య ఏ౦ జరిగిందని అతనిని అడిగారు.