N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Saturday, 20 February 2016

SwamiNarayan - Episode 72



స్వామి నారాయణ ఎపిసోడ్ -72
సగ్రాం వాఘ్రి – పరివర్తన
ఈ రోజు నా జీవితంలో ఒక చమత్కారం జరిగింది. నేనింకా బ్రతికే ఉన్నాను అని జరిగిన విషయమంతా చెప్పాడు. అప్పుడు అతని భార్య "నా జీవితంలో కూడా చమత్కారం జరిగింది."మనమేదో తప్పు చేస్తున్నామన్న భావన నాలో కూడా కలిగింది. ఇన్ని రోజులూ కూడా నేను డబ్బులకి వ్యామోహపడి ఈ తప్పులు చేసేలా మిమ్మల్ని ప్రోత్సహించాను. ఆ హరి సింగ్ గారు చేస్తున్న పాపంలో భాగం పంచుకున్నాం. కానీ ఈరోజు మీరు చాలా మంచి పని చేసారు. ఇకనుంచి మనం స్వామినారాయణ గారి శరణార్ధులు గానే బ్రతుకుదాం అని చెప్పింది. 

అతని తల్లి కూడా ఆమెతో అంగీకరించింది. వారిద్దరూ చెప్పింది విని సగ్రాం చాలా ఆశ్చర్యపోయాడు. అప్పుడు సగ్రాం "నేను కేవలం నామస్మరణ చేసిన దానికే నాకు రెండు సార్లు ప్రాణదానం జరిగింది. మరి అటువంటి అద్భుత వ్యక్తిని కనుక కలుసుకుంటే మన జీవితంలో ఇంకెంత మార్పు వస్తుందో కదా! ఆయనని కలుసుకోవడం ఎలా?” అని ఆలోచించసాగాడు. అప్పుడు అతని భార్యతల్లి కూడా నీకు స్వామినారాయణ మంత్రాన్ని ఏ చోట అయితే  స్వామీజీ చెప్పారో అక్కడికి వెళ్లి శ్రద్ధగా ఎదురుచూడు. ఆయన ఇంకా ఈ గ్రామంలోనే ఉండి ఉంటారు. నీకు తప్పకుండా ఆయన దర్శనం అవుతుంది అని చెప్పారు. అయితే అతని భార్య "స్వామి నారాయణ గారు మరియు వారి శిష్య బృందం అంతా కూడా ఉత్తమ జాతి కుటుంబంలో పుట్టినవారు మరి మనమేమో నీచ కులంలో పుట్టినవాళ్ళం కదా ! మనకి నిజంగా స్వామీజీ ఆశ్రయమిస్తారా మనల్ని స్వీకరిస్తారా?” అని తన సందేహాన్ని వెలిబుచ్చింది. ఏది ఏమైనా సరే నాకు సలహా ఇచ్చిన ఆ స్వామీజీని నేను తప్పకుండా కలుస్తాను అని దృఢ నిశ్చయంతో స్వామి నారాయణ మంత్రాన్ని జపిస్తూ తను ఎక్కడైతే బ్రహ్మానంద స్వామిగారిని కలిసాడో అక్కడికి వెళ్లి సగ్రాం ఆయన కోసం శ్రద్ధగా ఎదురుచూడసాగాడు.

ఇలా కొంత సమయం గడిచాక బ్రహ్మానంద స్వామి గారు అటువైపు రాసాగారు. ఆయన వద్దకు వెళ్ళి," స్వామీజీ ! నన్ను గుర్తు పట్టారా?" అని సగ్రాం అడిగాడు. నేను నిన్ను గుర్తు పట్టాను అని స్వామీజీ అతనితో చెప్పారు. “స్వామీ ! నా జీవితంలో చాలా మహిమలు జరిగాయి” అని జరిగినదంతా సగ్రాం ఆయనకి వివరించాడు. నేను ఎలాగైనా సరే స్వామి నారాయణ గారిని కలవాలి ఆయన ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. మీరంతా ఉత్తమ కులంలో పుట్టినవాళ్ళు మరి నేనేమో నీచ కులంలో పుట్టినవాణ్ణి. నాకు స్వామి నారాయణ గారు దర్శనం ఇస్తారా? నన్ను ఆశీర్వదిస్తారా?” అని అడిగాడు. అప్పుడు బ్రహ్మానంద స్వామి గారు నవ్వి “నాయనా! ఉత్తమ కులం, నీచ కులం అనే భేద భావాలు ధర్మాత్ములు సాక్షాత్ భగవత్ స్వరూపం అయినటువంటి శ్రీ స్వామి నారాయణ గారికి ఉండవు. ఎవరైతే మంచి పనులు చేస్తారోసమాజానికి పనికివచ్చే పనులు చేస్తారో,తన తోటి వారిని ప్రేమగా చూసు కుంటారో, ఎటువంటి అసూయద్వేషం లేకుండా సమాజ సేవ చేస్తారో వాళ్ళందరినీ కూడా ఉత్తమ జాతి వారి గానే మేము భావిస్తా౦ అని చెప్పారు. నువ్వు ఆయన నామజపం చేస్తూవుండు తప్పకుండా స్వామి గారు నీకు ఆశ్రయం ఇస్తారు” అని అభయం ఇచ్చి ఆయన వెళ్ళిపోయారు. అలాగే అతను జరిగిన విషయమంతా భార్యకితల్లికి  చెప్పి నిరంతరం స్వామి నారాయణ జపం చేస్తూ ఆయన కోసం పరి పరి విధాలుగా ప్రార్ధించసాగాడు.
జరిగిన సంగతంతా బ్రహ్మనందస్వామి గారు స్వామి నారాయణ గారితో చెప్పగా ఆయన చిరునవ్వు నవ్వారు. అయితే స్వామి నారాయణ గారు దీర్ఘాలోచనలో ఉన్నట్టుగా గమనించిన బ్రహ్మానంద స్వామి గారు “ప్రభుశ్రీ ! ఏవిషయం గురించి ఆలోచిస్తున్నారు? అని అడుగగా “ఎవరో భక్తుడి ఆవేదన నా హృదయానికి  తగిలింది నేను ఆ భక్తుడి గురించే ఆలోచిస్తున్నాను” అని చెప్పారు. “స్వామీ ! మీ లీలలన్నీ ఇలాగే ఉంటాయి కదా! ఎవరినైనా సరే మీరు ఎంతో కరుణతో ఆశీర్వదిస్తూ ఉంటారు” అని అనుకొని వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అక్కడ నిరంతరం నామజపం చేస్తూ ఉన్న సగ్రాంకి అకస్మాత్తుగా ఒక దివ్య పురుషుని దర్శనం కలిగింది. చాలా సంభ్రమాశ్చర్యాలతో సగ్రాం , అతని కుటుంబ సభ్యులంతా కూడా స్వామి నారాయణ గారికి నమస్కారం చేసి“స్వామీ ! మీరు మా ఇంటికి వచ్చారా? మేమేక్కడో కడ జాతి వాళ్ళం కదా! మమ్మల్ని కరుణించారా స్వామీ ! అనగా“నాయనా! అటువంటి భేద భావాలు నాకు ఉండవు. ఎవరైతే  నిర్మల హృదయంతోనిష్కామ కర్మలు చేస్తూజీవ హింస చేయకుండావ్యసనాలకి బానిసలు కాకుండా సమాజ శ్రేయస్సుకి పాటుపడుతూ ఉంటారో వాళ్ళందరినీ కూడా మంచి జన్మలో ఉన్నట్టుగానే భావించాలి. కనుక నేను నిన్ను అనుగ్రహించడానికే వచ్చాను. నువ్వు ఏమీ కలత చెందవద్దు. ఇప్పుడు నీ మనసులో ఎంతో మార్పు వచ్చింది. నువ్వు ఇలాగే మంచి పనులు చేస్తూ ధర్మమార్గంలో నడవవలసింది” అని ఆశీర్వదించారు. అప్పుడు సగ్రాం ఆయనతో “మహాప్రభూ! నన్ను మీ ఆశ్రమంలో చేర్చుకోండి” అని అడిగాడు. తప్పకుండా నువ్వు ఆశ్రమానికి వచ్చి స్వామి నారాయణ ఆదేశాల ప్రకారంగా నీ జీవితాన్ని సాగించు. మీ అందరికి శుభం కలుగుగాక !” అని దీవించి వెళ్ళిపోయారు.

ఈ విధంగా భగవాన్ శ్రీ స్వామి నారాయణ తన భక్తునికి ఇటువంటి అపారమైన అనుగ్రహాన్ని ప్రసాదించారు. ఏ మనుషుల్లో అయితే మంచితనం ఉంటుందో,భావ శుద్ధి ఉంటుందోసన్మార్గంలో నడుస్తూ ఉంటారోభగవంతుడి పట్ల శ్రద్ద భక్తులు ఉంటాయో అటువంటి భక్తుల దగ్గరకే స్వయంగా భగవానుడు పరిగెత్తుకుంటూ వచ్చి అనుగ్రహిస్తాడు అనే సందేశాన్ని ఈ కధలో స్వామి నారాయణ గారు సమాజానికి అందించారు. ఎంతో కొంత అహంకారంతోదర్పంతోఅధికారం ఉన్నదని చెప్పి భగవంతుని దగ్గరకి ఎవరైతే వెళతారోకొన్ని లక్షల మంది ఆ భగవంతుడిని దర్శించడానికి వేచి వుండగా ఎవరైతే ప్రత్యేక దర్శనాల పేరుతో మధ్యలోనే వెళ్ళిపోతూ ఉంటారో వారికి స్వామి వారి దర్శనం భౌతికంగా కలిగినా అనుగ్రహం మాత్రం కలగదని మనం నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. భగవంతునికి ఉత్తమ జాతి, నీచ జాతి అనే భేద భావాలూ ఉండవు. ఎంతటి మహారాజైనా కూడా భగవంతుని దర్శనానికి వచ్చినప్పుడు తనని సేవకుడిలా భావించుకుని, ఎంత కష్టమైనా సరే వేచి ఉండి సామాన్య మానవుల లాగానే సేవించుకోవాలి తప్ప అధికార దుర్వినియోగం మాత్రం చెయ్యరాదు. అలా అధికార దర్పంతో కనుక భగవంతుడిని సేవించినట్లైతే  ఆయన అనుగ్రహం ఎప్పటికీ కలగదని మనం గ్రహించవలసి వస్తుంది.