N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Thursday, 25 February 2016

SwamiNarayan - Episode 73



ఖయ్యా ఖత్రి
స్వామి నారాయణ గారు తరచుగా సత్సంగులతో పాటు చుట్టుప్రక్కల గ్రామాలకి వెళ్లి సత్సంగాలను నిర్వహిస్తూ ధర్మ ప్రచారం చేస్తుండేవారు. ధర్మ ప్రవచనాలు ప్రజలందరికి చెప్తూ ఉండేవారు. అలాగే ఒకసారి ప్రక్కనే దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్లాలని సంకల్పించారు. శిష్యులందరితో పాటు వెళ్ళుతుంటే బ్రహ్మానంద స్వామి వారితో “ మనం ఒక తమాషా చేద్దాం. నేను మీ శిష్యుడిగా, మీరు నాకు గురువుగా వ్యవహరిద్దాం “ అని స్వామి నారాయణ గారు చెప్పారు. బ్రహ్మానంద స్వామి వారికి ఏమీ అర్థం కాలేదు. ప్రభుశ్రీ తనతో ఏదో లీల చేయబోతున్నారు అని మాత్రం గ్రహించారు. “ అలాగే స్వామి !” అని ఆయన అంగీకరించారు. ఆ గ్రామం లోనే ఖయ్యా ఖత్రి అనే ఒక వేద పండితుడు ఉండేవాడు. అతను పరమ అహంకారి. అతని తల్లి స్వామి నారాయణ గారి పరమ భక్తురాలు. 



స్వామి నారాయణ గారు పచ్చి మోసగాడని, అతనికి ఆధ్యాత్మిక విషయాలేవీ తెలియవని, స్వయంగా తానే భగవంతుడిని అని ప్రకటించుకు౦టున్నాడని ఆయనకి స్వామి నారాయణ గారి మీద అమితమైన కోపంగా ఉండేది. ఆ గ్రామానికి వచ్చిన స్వామి నారాయణ గారికి తగిన బుద్ధి చెప్పాలి, అతని నిజ స్వరూపం ప్రజలందరికి  బట్టబయలు చేయాలని ఆయన భావించారు. కాని ఆయన తల్లి మాత్రం ఆయన్ని వారించింది. “ నాయనా ! స్వామి నారాయణ గారు ఎవరనుకుంటున్నావు? ఆయన సాక్షాత్తు నారాయణుడి స్వరూపమే. ఆయన ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. ఎంతో మంది ప్రజల్లో మంచి ప్రవర్తన కలిగించి వాళ్ళని మంచి మార్గంలోకి తీసుకుని వస్తున్నారు. కాబట్టి నీవు అహంకారంతో నాకన్నీ తెలుసు, ఆయనకి ఏమీ తెలియదు అనే భావంతో వెళ్లి ఆయనతో వాగ్వివాదం పెట్టుకోవద్దు. అహంకారం చాలా చెడ్డది అని నయాన భయానా చెప్పినా కూడా ఖయ్యా ఖత్రి ఏమాత్రం వినలేదు. ఆయనకి చుట్టు ప్రక్కల అంతా మహారాజులు , విద్వాంసులు, పండితుల వద్ద చాలా మంచి పేరు, గౌరవం, ప్రతిష్ట ఉంది. దానితో పాటు భోగభాగ్యాలు కూడా ఉన్నాయి. అదే అహంకారంతో ఆయన ఆ గ్రామంలో బస చేసి సత్సంగం చేస్తూ ధర్మ ప్రవచనాలు చెప్తున్నటువంటి బ్రహ్మానంద స్వామి వారిని స్వామి నారాయణ గారు అనుకుని వారి దగ్గరకి వెళ్లి చాలా క్రోధంగా" చాలు ! చాలు ! ఈ ధర్మ ప్రవచనాలు చెప్పడం మానండి . ప్రజలందరినీ మోసం చేస్తున్నారు మీరు. మీ నిజస్వరూపమేమిటో నాకు తెలిసిపోయింది. అది అందరి ఎదుటా బట్టబయలు చేయడానికే వచ్చాను నేను అని చాలా అహంకారంగా మాట్లాడాడు. దానికి మొదట్లో బ్రహ్మానంద స్వామి గారు కాస్త గాభరా పడ్డారు. “నాయనా మీరెవరు?” అని ఆయన ప్రశ్నించగా ఆ సభలో ఉన్న పెద్దవారు “ఈయన ఖయ్యా ఖత్రి అనే మహా విద్వాంసుడు.” అని చెప్పారు. అప్పుడు బ్రహ్మానంద స్వామి గారు . తన శిష్యుడుగా నటిసున్న స్వామి నారాయణ గారితో గుసగుసగా “ స్వామీ జీ ! మన నిజస్వరూపం బయట పెట్టడానికే వచ్చానంటున్నాడు, మనమేవరో తెలుసంటున్నాడు. నేను మీరని, మీరు నేనని అతనికి తెలిసిపోయిందో ఏమో !” అని అన్నారు. స్వామి నారాయణ గారు ప్రశాంతంగా “ముందు ఆయన ఏం చెప్తాడో విను!” అని సలహా ఇచ్చారు. జరుగుతుందంతా ఖయ్యా ఖత్రి చూస్తూ “ ఏమిటీ మీ శిష్యుడితో మీరు గుసగుసలాడుతున్నారు?’’ అంటూ బ్రహ్మానంద స్వామి గారిని గద్దించి అడిగాడు. దానికి బ్రహ్మానంద స్వామి గారు “మీరు దేనికోసం వచ్చారు?” అని ప్రశ్నించారు. ‘’మీరు ప్రజలకి చేస్తున్న మోసాన్ని స్వయంగా బయట పెట్టడానికే వచ్చాను’’ అని బదులిచ్చాడు. “ఖయ్యా ఖత్రి గారూ ! రండి ! కూర్చోండి ! అని బ్రహ్మానంద స్వామి గారు అంటే “ నేను ఇక్కడ కూర్చోడానికి రాలేదు. ప్రజలందరినీ మోసం చేస్తూ మీరు పొట్ట నింపు కుంటున్నారు.దాన్నే బయట పెట్టడానికి నేను వచ్చాను. నేను ధర్మపరమైన, శాస్త్రపరమైన ప్రశ్నలు అడుగుతాను. మీరు దానికి సమాధానాలు చెప్పాలి” అని ఖయ్యా ఖత్రి అన్నాడు.

‘‘ఖయ్యా ఖత్రి గారూ ! మీరేమన్నారు? మేము ధర్మ ప్రవచనాలు చెప్పి, ప్రజల్ని మోసం చేసి మా పొట్టలు నింపుకుంటున్నా౦” అని అన్నారు కదా ! “మరి మీరేం చేస్తున్నారు? మీరు ధరించినట్టి ఈ ఖరీదైన దుస్తులు, వేసుకున్న అమూల్యమైన ఈ ఆభరణాలు ఇవన్నీ మీకేక్కడ్నుంచి వచ్చాయి? మీకేమైనా పాడిపంటలున్నాయా ? వ్యవసాయమేమైనా చేస్తున్నారా లేక ఏదైనా ఉద్యోగం చేస్తున్నారా? ఇవన్నీ మీరెలా సంపాదిస్తున్నారు? మీరు మహారాజుల దగ్గరకి, సామంతుల దగ్గరకి, శ్రీమంతుల దగ్గరకి వెళ్లి, వాళ్లకి శాస్త్ర విషయాలు, పురాణ విషయాలేవో చెప్పి,  తద్వారా వచ్చిన ధనంతోటే కదా మీరివన్నీ అనుభవిస్తున్నారు. అంటే  మీరు ధర్మాన్ని, శాస్త్రాన్ని  అమ్ము కోవడం లేదా ?” అని ఆయన గద్దించి అడిగారు.  అంతే కాదు ! మేం చేస్తున్నదేమిటీ? మేము ధర్మాన్ని పంచు తున్నాం, అమ్మడం లేదు.” అని బ్రహ్మానంద గారు అన్నారు. బ్రహ్మానంద గారు అడిగిన ప్రశ్నలకి సమాదానమేం చెప్పాలో ఖయ్యా ఖత్రి కి అర్థం కాలేదు. మారు మాట్లాడకుండా ఆయన “ నేను 108 శాస్త్ర సమ్మతమైన ప్రశ్నలు అడుగుతాను. మీరు దానికి సమాధానం చెప్పాలి. మీరు కనుక చెప్పకపోతే మీరు జనాలందరినీ మోసం చేస్తున్నారని ఇక్కడ అందరికీ తెలిసిపోతుంది” అని చాలా క్రోధంతో చెప్పారు. బ్రహ్మా నంద గారు “ప్రశ్నలు అడగవచ్చును. అడిగే హక్కు ప్రతి ప్రాణికి కూడా ఉంటుంది. ఇంతకీ ఏం ప్రశ్నలు మీరు నన్ను అడగదలచుకున్నారు?”అని అన్నారు. నేను చెప్పాను కదా ! 108 ప్రశ్నలు అడుగుతాను. మీరు వాటికి సమాధానాలు చెప్పాలి అని అంటే బ్రహ్మానంద స్వామి గారు కొంచెం ఆలోచించి “సరే ! మీ ప్రశ్నేమిటీ?” అని అడిగారు. “ మనుషుల్లో ఎన్ని తత్వాలు ఉంటాయి?” అని ప్రశ్నించాడు. బ్రహ్మానంద స్వామి గారు అతన్ని చూస్తూ “ఖయ్యా ఖత్రీ! ఇటువంటి చిన్నచిన్న ప్రశ్నలకి నా చిన్న శిష్యుడే సమాధానం చెప్పగలుగుతాడు. నా దాకా రావక్ఖర్లేదు” అని చెప్పి ఆయన శ్రీ స్వామి నారాయణ గారి వైపు సాలోచనగా చూశారు. అప్పుడు స్వామి నారాయణ గారు ముందుకు వచ్చి “ అడగండి మీ ప్రశ్నలు. సమాధానం చెప్తాను “ అని అన్నారు. మనుషుల శరీరం 24 తత్వాలతో తయారు చేయబడి ఉంటుంది” అని స్వామి నారాయణ గారు సమాధానం చెప్పారు. ఈ రకంగా వారిద్దరి మధ్య శాస్త్రీయ చర్చ జరిగింది. ఖయ్యా ఖత్రి  అడిగిన నూటా ఎనిమిది (108) ప్రశ్నలకి శిష్యుడుగా నటిస్తున్న స్వామి నారాయణ గారు సమాధానాలు చక్కగా చెప్పడంతో ఖయ్యా ఖత్రి అహంకారం నీరు కారి పోయింది. అహంకారం అనే అగ్నిలో అయన చెడు సంస్కారాలన్నీ దహించబడిపోయి ఆయన బ్రహ్మానంద స్వామి వారి కాళ్ళ మీద పడిపోయాడు. “స్వామి నారాయణ గారూ ! నన్ను క్షమించండి ! నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను” అని అనగా “మీరు ఇప్పుడు కూడా అదే పొరబాటు చేస్తున్నారు. నిజానికి నేను స్వామి నారాయణ గారిని కాను. ఆయన శిష్యుణ్ణి. మీకు సమాధానాలు చెప్పిన ఆయనే భగవాన్ శ్రీ స్వామి నారాయణ గారే !” అని చెప్పారు బ్రహ్మానంద స్వామి వారు. వెంటనే ఖయ్యా ఖత్రి స్వామి నారాయణ గారి దగ్గరకి వెళ్లి ఆయన కాళ్ళ మీద పడి, ఏడుస్తూ క్షమా భిక్షని కోరాడు.

బ్రహ్మానంద స్వామి గారు ఆయన గురువైన శ్రీ స్వామి నారాయణ గారిని ఉచితాసనం మీద కూర్చో బెట్టి మరొక్కసారి చెప్పారు. “ నాయనా ! ఖయ్యా ఖత్రీ ! నీకు చెప్పాను కదా ! నేను స్వామి నారాయణ ని కానని. ఈయనే మా గురువుగారు సాక్షాత్తు భగవాన్ స్వామి నారాయణ గారు!”

మళ్ళీ ఆయన దగ్గరకి వెళ్లి ఖయ్యా ఖత్రి వల వలా ఏడ్చాడు. నేను అహంకారంతో మిమ్మల్ని అనవసరంగా నానా మాటలు అన్నాను. ఇప్పుడు నా అహంకారం నశించి పశ్చాత్తాప పడుతున్నాను. క్షమా భిక్షని కోరుతున్నాను” అని వేడుకున్నాడు. బ్రహ్మానంద స్వామి గారు విద్య నేర్చుకున్న వాడికి, విజ్ఞానం, జ్ఞానం ఉన్న వాడికి వినయ-విధేయతలు అలంకారాల్లాగా ఉంటాయి. అహంకారం పతనావస్తకి తీసుకుని వెళ్ళుతుంది. ఎంత గొప్ప వాడి వైనా విద్యతో పాటు వినయం నేర్చుకో ! నీవు శాస్త్రాల్లో పరిజ్ఞానం ఉన్నవాడివి. కాని అహంకారమనేది తగదు.” అని హితబోధ చేయగా అతను అందరినీ క్షమాభిక్ష కోరాడు. అక్కడ ఉన్న అందరు ఒక్కసారిగా "స్వామి నారాయణ గారికి జై అంటూ" జయజయధ్వానాలు చేశారు. అక్కడితో ఆ రోజు ఆ సభ ముగిసి పోయింది. పశ్చాత్తాపంతో మళ్ళీ ఖయ్యా ఖత్రి తన గృహానికి వెళ్ళిపోయాడు