N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Sunday, 20 March 2016

SwamiNarayan - Episode 76



జనా బాయి ప్రార్థన 

మర్నాడు జునాగడ్ లోని ప్రముఖులందరూ, స్వామి నారాయణ గారిని గౌరవించే వాళ్ళందరు ఒక సమావేశాన్ని  నిర్వహించారు. వారందరిలో జనాబాయి “ప్రభుశ్రీ ! మేమందరం ఎంతో భక్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తే మీరు మా ఆహ్వానాన్ని అందుకుని ఈ జునాగడ్ భూమిని మీ పాద స్పర్శతో పవిత్రం చేశారు. స్వామీ ! మా అందరి మనస్సులలో ఒక చిన్న కోరిక ఉంది. స్వామి నారాయణ మందిరాన్ని నిర్మించాలనే మా అభ్యర్థనని మీరు స్వీకరించాలి. స్వామి నారాయణ గారి ప్రముఖ శిష్యుడు ఒకాయన “మీ సంకల్పం మరి బాగానే ఉంది. కాని మీరు మీ సంకల్పం గట్టిగా చేసుకోవాలి. దీనికి స్వామి నారాయణ గారి సంప్రదాయం వాళ్ళు ఏదో రకంగా చేయూత నివ్వాలి. మంచి భూమిని చూసుకోవాలి. మిగతా సదుపాయాలన్నీ మనం చూసుకోవాలి. మన సంకల్పం కనుక గట్టిగా ఉంటే మందిర నిర్మాణం తప్పకుండా జరుగుతుంది” అని అన్నాడు. 

వెంటనే జనాబాయి “ప్రభుశ్రీ ! నా హవేలిని (భవనాన్ని) మందిరంగా మార్చడానికి ఇప్పుడే నేను మీకు సమర్పిస్తున్నాను’’ అని చెప్పింది. “జనాబాయి ! మందిర నిర్మాణం నీ మనసులో ఉండగానే జరిగిపోయింది. తప్పకుండా మందిర నిర్మాణం అవుతుంది” అని ప్రభుశ్రీ అన్నారు. జనాబాయి ఆయన్ని ఈవిధంగా “ఈ మందిర నిర్మాణం పూర్తి అయ్యేంతవరకు మీరు జునాగడ్లోనే ఉండవలసింది అని నేను  మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను” అని అభ్యర్థించింది. దానికి స్వామి నారాయణ గారు మందిర నిర్మాణం ప్రారంభం అవగానే నేను ఆ మందిర నిర్మాణాన్ని బ్రహ్మానంద స్వామి వారికి అప్పగిస్తాను. ఆయన పర్యవేక్షణలోనే ఈ మందిర నిర్మాణం జరుగుతుంది. ఈ మందిర నిర్మాణం పూర్తయ్యేంత వరకు బ్రహ్మానంద స్వామి వారు ఇక్కడే ఉంటారు అని చెప్పి ఆ పనిని బ్రహ్మానంద స్వామి గారికి అప్పగించారు. దానితో అక్కడ చేరిన వారందరూ సంతోష పడ్డారు.
నవాబు గారితో బ్రహ్మానంద స్వామి వారి భేటి 

బ్రహ్మానంద స్వామి వారు ఇదివరకే కవి రాజుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు కాబట్టి ఆయనకి ఈ రాజులు, రాణులు, నవాబుల పరిచయాలు ఉన్నాయి. దానిని పురస్కరించుకుని ఆయన ఒక సారి నవాబు గారి కోరిక ప్రకారం ఆయన దర్బారుకి వెళ్లి ఆ నవాబు గారికి ఎంతో మర్యాదగా నమస్కారం చేశారు. నవాబు గారు ఆయన్నెంతో ఆదరంగా సాదరంగా ఆహ్వానించారు. ఆయన్ని కూర్చుండబెట్టి “బ్రహ్మానంద గారూ ! మీరెంతో బాగా పాటలు పాడతారు, ఎంతో బాగా కవిత్వం చెప్తారు. మీరు ఈ రోజు మాకు ఒక పాటను వినిపించి మా అందరినీ ఆనంద పరచాలి అని ప్రార్థించారు. బ్రహ్మానంద స్వామి గారు తన గాన మాధుర్యంతో  భగవంతుని గుణాలమీద మీద భక్తిశ్రద్ధలతో ఒక చక్కటి పాట పాడి అందరినీ సంతోష పరిచారు.  అందులో భగవంతుని శక్తిని, భగవంతుని ప్రేమ, కరుణని  వర్ణిస్తూ అతను పాడిన పాట అందరికీ సంతోషం కలిగించింది. 
నవాబు గారి ప్రస్తావన
బ్రహ్మానంద స్వామి గారు దర్బారు లో ప్రవేశించినప్పుడు ఆయన పాట పాడక మునుపు మందిర నిర్మాణం ఎలా జరుగుతుంది అని దాని గురించి ఆయన ప్రశ్నించగా బ్రహ్మానంద స్వామి గారు స్వామి నారాయణ సంప్రదాయాన్ని పాటించే భక్తులంతా వారికి తోచిన ధన సహాయం ఇంకా రకరకాలుగా తమ సహాయ సహకారాలు అందిస్తూ ఎంతో భక్తిశ్రద్ధలతో మందిర నిర్మాణానికి సేవ చేస్తున్నారు. ఏవో కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నామని సెలవిచ్చారు. దాని తర్వాతనే పాట పాడడం జరిగింది. పాట పూర్తయ్యాకనే నవాబు గారు ఒక ప్రస్తావన తెచ్చారు. “బ్రహ్మానంద గారూ ! మీరు మమ్మల్ని స్తుతిస్తూ ఒక పాట పాడి మమ్మల్ని ఆనంద పరచండి” అని చెప్పారు. “అలా కనుక మీరు చేయగలిగితే జోలె పట్టుకుని వాళ్ళని వీళ్ళని భిక్ష అడగక్ఖర్లేదు. మీకు అయ్యే ఖర్చు అంతా మేమే భరిస్తాం” అని చెప్పారు. దానికి బ్రహ్మానంద గారు “నేను కేవలం అందరికీ యజమాని అయిన ఆ భగవంతున్ని మాత్రమే స్తుతిస్తూ పాటలు పాడతాను, రచనలు రచిస్తాను. కాని నవాబుగారూ ! మీరు అందరికీ మాలిక్ (యజమాని) కాదు కదా ! అటువంటప్పుడు మీమీద  నేను ఎటువంటి కీర్తనలు రచించడం కాని పాడడం కాని చేయలేను”  అని సమాధానం చెప్పారు. ఆ సమాధానం విని సభికులందరు కూడా చాలా ఆందోళన పడ్డారు. “అమ్మో ! ఇప్పుడేమవుతుంది?” సాక్షాత్తు నవాబుగారినే ధిక్కరించాడు కదా !” అని వాళ్ళు ఏం జరుగుతుందా అని చెప్పి ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. నవాబు గారు అంతకుమునుపు కఠినంగా మాట్లాడి చిన్న పరిక్షకి గురి చేశారు. ఈ సమాధానం వినగానే ఆయనకి సంతోషం కలిగింది. ఎంతో నమ్రతా భావంతో ఆయన “ మీరు నా ఎదురుగా నా అధికారాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఇంత ధైర్యంగా సమాధానం చెప్పారు. మామూలు మనుష్యులైతే ఇంత ధైర్యంగా సమాధానం చెప్పగలిగే వాళ్ళు కానే కారు. కాబట్టి మీరు కూడా మహాత్ములే. ఆ భగవాన్ స్వామి నారాయణ గారికి నిజమైన భక్తులే మీరు. అందుకనే అంత ధైర్యంగా మీరు నాకు సమాధానం చెప్పారు. నాకు చాలా సంతోషంగా ఉంది. బ్రహ్మానంద స్వామి గారూ !
చెప్పండి ! ఈ సారి నేను నిజంగానే అడుగు తున్నాను. ఈ మందిర నిర్మాణానికి నా దగ్గర్నుంచి మీకెటువంటి సహాయం కావాలన్నా సరే  నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను” అని ఎంతో సంతోషంగా చెప్పారు. దానికి సమాధానంగా బ్రహ్మానంద స్వామి గారు “నవాబు గారూ ! అవసరమైతే మీ సహాయ సహకారాలు తప్పకుండా మేము మిమ్మల్ని అడుగుతాం. కాని ప్రస్తుతం ఈ మందిర నిర్మాణం స్వామి నారాయణ గారి సత్సంగుల యొక్క  భక్తి , శ్రద్ధ, సమర్పణ భావంతో  జరుగుతుంది. అంతే కాని శాసనపు దానానికి ఎటువంటి ఆవశ్యకత లేదు”. “జై శ్రీ కృష్ణ” , “జై స్వామి నారాయణ” అంటూ నవాబు గారికి నమస్కారం పెట్టి ఆయన అక్కడనుంచి నిష్క్రమించారు. నవాబు గారు ఎంతో గౌరవంతో “ఆహా ! ఎటువంటి దేవుడు! ఆయనకి తగినటువంటి ఎటువంటి శిష్యుడు ! “ అంటూ ఆ గురు శిష్యులైన స్వామి నారాయణ గారిని, బ్రహ్మానంద స్వామి గారిని ఎంతో మెచ్చుకున్నారు.