N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Monday, 20 June 2016

SwamiNarayan - Episode 79



ఒక నాడు స్వామి నారాయణ గారు విశ్రాంతి తీసుకుంటుండగా ముక్తానంద స్వామి వారు ఒక ప్రస్తావన తీసుకుని వచ్చారు. ప్రభుశ్రీ ! లోకులందరు కూడా మిమ్మల్ని సాక్షాత్తు భగవత్ స్వరూపంలాగా భావిస్తున్నప్పటికీ కొంత మంది ధూర్తులు మీ గురిచి విమర్శనలు చేస్తున్నారు. మీరు ఏ కుటుంబం నుంచి వచ్చారు? ఏ జాతి వారు? ఏ కులం వారు? అని చెప్పి ఆ ధూర్తులు మీ మీద దుష్ప్రచారం చేస్తున్నారు. మరి ఇది కలియుగం  కదా ప్రభుశ్రీ ! సాక్షాత్తు భగవంతుడు  శ్రీ కృష్ణుని అవతార౦లో ఉన్నప్పుడు ఆయనకు కూడా ధూర్తుల  అపవాదాలు, తిరస్కరాలు, దూషణలు ఇవన్నీ కూడా ఆయనకి లభించాయి  కదా ! అదేవిధంగా ఇక్కడ కూడా ఈ మనుష్యులు ఎప్పుడు కూడా చంచల స్వభావులే.   
 
ప్రభుశ్రీ ! మీకు తెలియని దేముంది? ఏవో చిన్న చిన్న కోరికలు భగవంతుణ్ణి కోరుతూ ఉంటారు. అవి తీరితే భగవంతుని  నెత్తి మీద పెట్టుకుంటారు. తీరక పోతే భగవంతుణ్ణి తిట్టి పోస్తుంటారు. ఇదే కదా ఈ  ప్రపంచం తీరు. ఇది విన్నప్పుడల్లా అంటే మీ గురించి ఇలాంటి దుర్వ్యాఖ్యాలు వింటున్నప్పుడల్లా మా అందరికి చాలా బాధ కలుగుతుంది. దయ చేసి మీ పరివారాన్నందరినీ ఇక్కడికి ఆహ్వానించి వారందరినీ మాకు పరిచయం చేయవలసిందిగా ప్రార్థించారు. అప్పుడు ప్రభుశ్రీ “ నేనెప్పుడో ఆ సంసారాన్ని త్యజించాను. చాలా ఏళ్ళయింది. కాని మరి మీరు చేస్తున్నఅభ్యర్థనలో ఎంతో కొంత సత్యం ఉంది. అలాగే కానీయండి. ఈ మాట మీ నోటి వెంటే వచ్చింది కదా ! ఈ ప్రస్తావన మంచిదే అని భావిస్తున్నాను. వెంటనే మా పరివారానికి ఆహ్వానం పంపించండి. వారు శాకోత్సవ సమయానికి వస్తారు. వారు అయోధ్యా నగరం దగ్గర చౌపయ్యా  అనే గ్రామంలో ఉంటారు అని చెప్పారు. కొంత మంది సత్సంగులు  ఆ ఊరికి ప్రయాణమై రాం ప్రసాద్ గారి కుటుంబాన్ని కలిసి స్వామి వారి గురించి వివరాలన్నీ చెప్తూ ఆహ్వానాన్ని అందించారు. ముఖ్యంగా సుహాసిని వదిన గారు ఆ ఆహ్వానం విని సంతోషంతో మైమరచిపోయింది. పాత జ్ఞాపకాలు తిరిగి రాసాగాయి. ఆమెలో ఉన్న మాతృత్వం ఘన శ్యాం మహారాజ్ పట్ల  ఒక్కసారిగా పెల్లుబికి  పోయింది. ఒక్క క్షణం కూడా ఆవిడ స్థిరంగా నిలిచి ఉండలేకపోయింది. అందరు సంతోషంతో వారి బంధుమిత్రుల సమేతంగా లోయ అనే గ్రామంలో అప్పుడు బస చేసిన భగవాన్ శ్రీ స్వామి నారాయణ గారి దగ్గరకి బయలుదేరారు. మరిది బిడ్డలకి, తన పిల్లలకి సుహాసిని వదిన గారు ఘన శ్యాం మహారాజు గారి  చిన్నప్పటి సంగతులు ఎన్నో చెప్పసాగారు. పిల్లలు కూడా కుతూహలంగా విన సాగారు. ఘన శ్యాం మహారాజు చిన్నప్పుడు అంటే మూడేళ్ళ వయసులోనే సూరి శక్తిని సంహరించారు. అన్ని వివరాలు చెప్పారు. అంతే కాదు నా పుట్టింటివారు నాకు ఇచ్చిన ఒక బంగారపు ఉంగరం మీద నాకు చాలా వ్యామోహం ఉండేది. నాలో తెలియని గర్వం ఉండేది. కనిపించిన ప్రతివాళ్ళకి సందర్భం ఉన్నా లేకపోయినా కూడా నాకు మా పుట్టింటివాళ్ళు ఈ ఉంగరం ఇచ్చారు అని చెప్పుకుంటూ ఉండేదాన్ని. ఒక రోజు ఏమైందో తెలుసా? ఆ ఉంగరాన్ని ఎవరో దొంగిలించారు. అప్పుడు పిల్లలంతా ఆ దొంగలించిన ఉంగరాన్ని  ఘన శ్యాం  మహారాజు గారు కనుక్కున్నారు కదమ్మా  ! అని అన్నారు. ఘన శ్యాం మహారాజ్ కనుక్కోవడమేమిటీ ? స్వయాన ఘన శ్యాం మహారాజు గారే దాన్ని దొంగిలించారు. అని అంది. ఆ మాటలకి పిల్లలంతా ఆశ్చర్య పడ్డారు. అదేమిటీ ఘన శ్యాం మహారాజ్ గారు ఉంగరాన్ని ఎందుకు దొంగిలించారని? నాకు ఆ ఉంగరం పట్ల ఉన్న వ్యామోహం,గర్వం  మోహం, అహంకారం మొదలైన గుణాలన్నింటినీ పోగొట్టాలని ఘన శ్యాం మహారాజు గారు అలా చేశారని ఆ కథని సుహాసిని గారు వాళ్లకి చెప్పారు. ఇలా స్వామి నారాయణ గారి దగ్గరికి చేరేవరకు ఆవిడ స్వామి వారి చిన్నప్పటి సంగతులన్నీ తన  పిల్లలకి, మిగతా వారందరికీ చెప్ప సాగింది.  ఎప్పుడు చేరతామా, ఎప్పుడు చేరతామా ఘన శ్యాం మహారాజ్ ని ఎప్పుడు చూస్తామా? అని ఆ కుటుంబ సభ్యులంతా ఆత్రుతగా ఎదురు చూడ సాగారు.

ఇక్కడ శాకోత్సవానికి అన్ని ప్రయత్నాలు వేగంగా జరిగిపోతున్నాయి. బళ్ల కొద్ది కూరగాయలు గ్రామాల నుంచి వచ్చేశాయి. ప్రభుశ్రీ! కాచర్ ఈ ప్రయత్నాల్లో మనకి ప్రప్రథమంగా ఆయనే దగ్గరుండి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

స్వామీ ! బళ్ల కొద్ది కూరగాయలు చాలా వచ్చాయి. మరి ముఖ్యంగా వంకాయలు చాలా వచ్చాయి. మరి వంట ప్రయత్నాలన్నీ మొదలు పెట్టాలి కదా !” అని ఆయన అనుచరులు అన్నారు. దానికి  “అవును! ముందు కూరగాయలన్నింటికీ పోపు పెట్టాలి కదా! అదెంత పని?” అని స్వామి వారు అన్నారు. “కాదు ! కొన్ని వేల మంది భక్తులు  వస్తారు మరి శాకోత్సవానికి. దానికోస౦ చాలా పెద్ద పెద్ద పాత్రలు చాలా కావలసి వస్తాయి. మసాలా దినుసులు ఇంకా ఎన్నో అవసరం వస్తాయి. మనం అన్నింటికీ ముందే ప్రయత్నాలు చేసి పెట్టుకోవాలి. సురా కాచర్ అలాగే స్వామీ ! నేను వంట చేసే వాళ్ళందరినీ కూడా ముందే పిలుస్తాను. వంటవాళ్ళను పిలవ వద్దు. నేనే స్వయంగా వంట చేస్తాను సాధు సత్సంగులకి కూడా నేనే స్వయంగా వండి పెడతాను.అని స్వామి వారు  సురా కాచర్ తో చెప్పారు.

వింత  వంట
ప్రభుశ్రీ సురా కాచర్ కి  చెప్పిన విధంగానే  పాత్రలు అన్నీ వచ్చాయి. ఆయన చెప్పిన విధంగానే వాటిలో  కూరగాయలన్నింటినీ వేసి వంట వండ సాగారు. గ్రామస్థులు గ్రామంనుంచి తమకి తోచిన వస్తువులు వాళ్ళు పండించిన కూరగాయలు, ధాన్యాలని తీసుకుని రా సాగారు. అలాగే కొంత మంది సత్సంగులు ముక్తానంద స్వామి ని స్వామి వారు చేస్తున్న వంట శాలకి తీసుకుని వెళ్తూ ఒకరు తెచ్చిన పసుపుని, ఇంకొకరు తెచ్చిన మిరపకాయల్ని ఒకే పాత్రలో వేయమని చెప్పగా ఇదంతా చూస్తున్న సురా కాచర్కి మతి పోయినట్టయింది. అదేమిటీ? అలాగే మిర్చీలు, పసుపు చేస్తున్న వంటలోనే వేయమని చెప్పడం ముక్తానంద స్వామి వారికి కూడా ప్రభుశ్రీ ఏదో కొత్త లీలలని చేయబోతున్నట్టుగా అనిపించింది. ఇలా స్వామి వారు స్వయంగానే  వంట ప్రారంభించారు. వెంటనే ఒక పెద్ద గరిట తీసుకుని పెద్ద పాత్ర లో అన్ని వస్తువులు ఒకే పాత్రలో వేసి వాటిని కలియబెడుతూ, ఒంటినిండా చెమటలు కారుతుంటే వస్త్రంతో తుడుచుకుంటూ మిర్చీ ఘాటుకి కళ్ళఎర్రగా అయి  నీళ్ళు కారుతుంటే ఆ నీళ్ళను తుడుచుకుంటూ , పొయ్యిలు భగభగా మండుతుంటే వచ్చే పొగని పీల్చుకుంటూ అలాగే   నిర్వికారంగా ఏమీ పట్టకుండానే వంట చేస్తూ ఉన్నారు. ఆ వంటలన్నీ చూసి నిజంగానే దర్బార్ కాచర్ కి మతి పోయినట్టయింది. ఈ లోగా మరి కొందరు పంచదార , మరి కొందరు ఇంకా ఏ వేవో వస్తువులు తీసుకుని రావడం, స్వామి వారు వాటన్నింటినీ పాత్రలో వేయమని చెప్పడం ఇదంతా చూస్తున్న సత్సంగులకి స్వామి వారు చేస్తున్న ఈ వింత వంట ఏమిటబ్బా? ఎలా ఉంటుందో ఏమిటో ఇన్ని మిరపకాయలు వేశారు కదా ! దీని రుచి ఎలా ఉంటుంది అన్నది వారికి అంతు పట్టకుండా ఉంది. ఇలా స్వామి అదే కొన్ని వేల మందికి స్వయంగా వండుతూ ఉన్నారు. బహుశా భక్తుల ప్రారభ్ద కర్మలన్నీ ఆయన ఈ విధంగా వండుతున్నారేమో అని అనిపించసాగింది.  ఈలోగా స్వామి వారి పరివారమంతా కూడా ఆశ్రమానికి చేరుకోవడం ఎప్పుడు ఘన శ్యాం మహారాజ్ ని చూస్తానా అని సుహాసిని వదిన గారు ఆతృత పడడం, స్వామి ముక్తానంద గారు వారిని కొంచెం సేపు వేచి ఉండమని చెప్పడం, ఆవిడ ఆతృత అంతా గమనించిన ఆయన వెంటనే ఆవిడని వంటగదికి తీసుకుని వెళ్లి  స్వామి వారు వంట చేస్తున్న దృశ్యాన్ని చూపించడం జరిగింది. అది చూసి సుహాసిని వదిన గారు నీరసించి పోయింది. కళ్ళవెంట ధారాపాతంగా కన్నీళ్లు కారసాగాయి. ఘన శ్యాం మహారాజ్ , అతని వంట, అతను చేస్తున్న తీరు చూసి ఆమె తట్టుకోలేక పోయింది. మరి మాతృ వాత్సల్యం కదా !