N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Thursday, 23 June 2016

SwamiNarayan - Episode 80



సుహాసిని వదిన గారు ఘన శ్యాం మహారాజ్  ఒక్కడే ఇన్ని వేల మందికి ఎవరి సహాయం లేకుండా అలా వంట చేయడం, అతని అవతారం చూసి చాలా దుఃఖ పడింది. చాలా గొడవ చేసింది. మనం మన ఘనశ్యాం మహారాజ్  ని తీసుకుని చపయ్యా వెళ్లి పోదాం. మన దగ్గర ఎంతో కొంత పొలం ఉంది కదా ! అది వ్యవసాయం చేసుకుంటూ హాయిగా ఉందా౦. ఇక్కడ ఘన శ్యాం మహారాజు ఒక్కడే ఇంత మందికి వంట చేస్తున్నాడు. ఒక్కళ్ళు కూడా సహాయం చేయడం లేదు అని చాలా బాధపడింది. అప్పుడు రాం ప్రసాద్ గారు ముక్తానంద స్వామి గారితో స్వామీ ! మరి వేలాది మంది భక్తులు, మీరు ఉన్నారు మరి మీరెవ్వరు కూడా  మా ఘన శ్యాం కి ఎందుకు  సహాయం చేయడం లేదు? ఘన శ్యాం ఒక్కడే ఇంత పెద్ద వంటచేస్తున్నాడు? మాకేమీ అర్థం కావడం లేదు ఏమిటీ ఇదంతా? అని అడిగారు. ముక్తానంద గారు చిరునవ్వు నవ్వి “ ఇదంతా స్వామి వారి ఆదేశమే ! వంటంతా తానొక్కడినే చేస్తానని చెప్పారు. మేమంతా మొట్టమొదటిసారిగా ఇలాంటి అవకాశాన్ని ఇప్పుడే చూస్తున్నాం. అందుకనే స్వామి వారి లీల ముందు ముందు మనకే తెలుస్తుంది. మేమంతా సాయం చేయడానికి సిద్ధంగానే ఉన్నాం కాని స్వామి వారు మా సహాయాన్ని నిరాకరి౦చారు అని చెప్పి మీరు కాసేపు ఓర్పు పట్టండి అని వారిని ఓదార్చి పంపించివేశారు. 


అన్నిరుచుల సమ్మేళనం – వంకాయ కూర అద్భుతం
ఇక్కడ స్వామి వారు వంట చేస్తున్న తీరుని చూసిన దర్బార్ అంటే సుర్ కాచర్ నానా గగ్గోలు పడుతున్నాడు. మెదడు పని చేయడం మానేసింది. ఆయన ముక్తానంద స్వామి గారు రాగానే “ముక్తానంద స్వామి గారూ ! ఇక్కడ ఏం జరుగుతుందో ఏమిటో నాకేమీ అర్థం కావడం లేదు . స్వామి వారేమిటీ ఇలాంటి వంట చేస్తున్నారు? మరి కూరగాయల్లో ఒక్క వంకాయ కూర తోటే అన్ని దాంట్లోనే వేస్తున్నారు. పసుపు , పచ్చి మిరపకాయలు, పంచదార దాంట్లోనే వేసారు. తర్వాత ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా మసాలాలన్నీ కూడా గుప్పించేస్తున్నారు. మరి ఇట్లాంటి వంట తిన్నాక రుచుల సంగతి ఎలా ఉంటుంది ఏమిటీ ? మన స్వామి నారాయణ సాంప్రదాయమంతా కూడా అపఖ్యాతి పాలవుతుంది. అసలు ఇలాంటి భోజనం ఎలా చేస్తాం? రొట్టెలు లేవు , పూరీలు లేవు . నాకిష్టమైన అప్పడాలు కూడా లేవు? ఇదేం వంట స్వామీ ? నాకేం అర్థం కావడం లేదు. నా మతి పోతుంది. అయ్యో ! అయ్యో ! ఇప్పుడెట్లా?” అని చెప్పేసి ఒకటే గగ్గోలు పెట్టసాగాడు. నిజంగా స్వామి వారి వంట చేసే తీరు ఎవరికీ అర్థం కాలేదు. స్వామి ముక్తానంద గారు స్వామి నారాయణ గారి ప్రతి యొక లీల చూశారు కాబట్టి దీనిలో కూడా ఏదో పరమార్థం, ఒక ఆధ్యాత్మిక లీల ఉంది అని గ్రహించి ఆ దర్బార్ కాచర్ గారికి ఏం ఫరవాలేదని ధైర్యం చెప్పారు. ప్రభుశ్రీ వంట బాగానే ఉంటుందని నేను భావిస్తున్నాను. మీరేమీ గాభరా పడవద్దని ఓదార్చారు. కాని దర్బార్ గారికి మాత్రం మనస్సు మనస్సులో లేదు. అతనికి ఈ వంట ఏమిటో, ఉత్త వంకాయ కూరలో ఇన్ని రకాల పదార్థాలు వేసి ఈ వంట ఎలా చేస్తున్నారో, దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏమిటో ఆయనకి అంతుపట్టకుండా పోయింది. ఇక్కడ స్వామి నారాయణ గారు మాత్రం అందరు సత్సంగులు వచ్చి వారి వారి స్థానాల్లో కూర్చున్నప్పుడు ఆయన కూడా అక్కడకి రావడం జరిగింది. దానిలో కొందరు భోజనానికి వచ్చినవాళ్ళు అదేమిటీ ఈ భోజనంలో మరి లడ్లు లేవు, రొట్టెలు లేవు, పూరీలు లేవు ఏమిటబ్బా ఈ వంటంతా విచిత్రంగా ఉందే? అని అన్నారు. దాంట్లో ప్రక్కనే ఉన్న ఇంకొక సత్సంగి “ మరి ఇది శాకోత్సవం కదా ! మరి కూరగాయల తోటే ప్రభుశ్రీ మనకి విందు ఇస్తున్నారు” అని చెప్పాడు.
 ఇంతలో దర్బార్ కాచర్ గారు వచ్చి అందరికీ భోజనం చేయవలసిందిగా ఆదేశించారు. వెంటనే సత్సంగులందరు భోజనం చేయడం మొదలు పెట్టారు. అందులో ఒకడు మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే “ ఆహా..హా !... ఎంత ..బా..గుం...ది !” అంతా లడ్డు స్వాదమే ఉంది ! ఎంత బాగుందో ! ఎంత మధురంగా ఉందో !” అంటూ ఒకటే ప్రశంసిం  చడం మొదలు పెట్టాడు. ఆ ప్రక్కనే కూర్చున్న ఇంకొకడు కూడా నోట్లో ముద్ద పెట్టుకుని “ ఆహా ! ఈ రుచి చాలా బాగుంది !” ఒక ప్రక్క తియ్యగా ఉంది, పుల్లగా ఉంది , కొంచెం ఉప్పగా, కొంచెం కారంగా భలే భలే రుచిగా ఉంది అని చెప్పేసి లొట్టలేసుకుంటూ తినసాగాడు. ఇలాగే ప్రతివాళ్ళకి వారికిష్టమైన పదార్థాల రుచి వారికి అనుభూతికి రాసాగింది. అందరూ అలా తృప్తిగా తింటుంటే దర్బార్ గారికి మతి పోయింది. ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే ‘కారం”, “కారం” అని అంటారేమో అని అనుకున్న అతనికి ఆశ్చర్యం కలిగింది. అతను కొంత ప్రసాదాన్ని చేతిలో తీసుకుని వాసనను చూడగా ప్రభుశ్రీ అక్కడే ఉన్నారు కనుక “ఏమిటీ సుర్ కాచర్ ?దానిలో నీకు అప్పడాల వాసన వస్తుంది కదా!  అని చెప్పి చిరునవ్వు నవ్వారు. అప్పుడు దర్బార్ గారికి నిజంగానే ఆశ్చర్యం వేసింది. “స్వామి ముక్తానంద గారూ !”, “ఇవేమిటీ !” “ఇంత అద్భుతమైన వంటలు !” నాకేమీ అర్థం కావడం లేదు. అని చెప్పారు. అప్పుడు ముక్తానంద గారు “ నేను మీకు మొదట్నుంచి చెప్తూనే ఉన్నాను కదా ! అదంతా మన ప్రభుశ్రీ లీలయే ! ఇది శాకోత్సవం కాబట్టి ఆయన ఒక్క వంకాయ కూరతోటే సమస్తమైన రుచులు సమ్మేళి౦చి వంట అద్భుతంగా చేశారు. అన్నీ సమపాళ్ళలోనే ఉన్నాయి కదా !” అని చెప్పి స్వామి వారి కీర్తిని ప్రశంసించారు. అక్కడ చేరిన స్వామి నారాయణ గారి భక్తులంతా ఒక్క పట్టున జయ జయ ధ్వానాలు చేశారు. ఈ విధంగా శాకోత్సవం బ్రహ్మాండంగా జరిగిపోయింది.