N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Tuesday, 26 July 2016

SwamiNarayan - Episode 86

అహ్మదాబాదు నగరానికి శ్రీ స్వామి నారాయణ గారి రాక

 స్వామి నారాయణ గారు దర్బారులో ఉండి ధర్మ ప్రవచనాలు చెప్తుండగా మోతీ రాం వార్తను తీసుకుని వచ్చాడు.
“ప్రభుశ్రీ ! మిమ్మల్ని కలవడానికి అహ్మదాబాదు నుండి కర్నల్ వాకర్ అనే ఆంగ్లేయ దొరగారు వచ్చారు. ఆయన ఒక సందేశాన్ని మీ కోసం తెచ్చారు” అని చెప్పగా ఇంతలో కర్నల్ వాకర్  వచ్చి ప్రభుశ్రీకి నమస్కారం అని చెప్పి అతని తరఫున స్వామి నారాయణ గారి అనుచరులై నటువంటి ఉదయ్, మోతీరాం సోదరుడు ఈ విధంగా చెప్పారు. “ప్రభుశ్రీ ! మీమీద హత్యా ప్రయత్నాన్ని చేసిన పీష్వా తన రాజ్యాన్ని కోల్పోయాడు. ప్రస్తుతం అహ్మదాబాదు నగరం ఆంగ్లేయ అధికారియైన గవర్నర్ డన్లప్ గారి అధీనంలో ఉంది. మీమీద కుట్ర పన్నినందుకు పీష్వా గారు ప్రస్తుతం కారాగారం లోనే ఉన్నారు. సజ్జనుల మీద చేసినటువంటి హత్యా ప్రయత్నాలు ఈవిధంగా పరిగణిస్తాయని అందరు అనుకుంటున్నారు. అహ్మదాబాదు నగరంలో ప్రజలందరూ కూడా అహ్మదాబాదు నగరం మీ పాదస్పర్శ తో ఎప్పుడు పవిత్రమవుతుందా మీరు ఎప్పుడు అక్కడికి వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు. 


అక్కడి గవర్నర్ డన్లప్ గారు సహృదయులు. మీ గురించి చాలా వివరాలు, స్వామి నారాయణ సాంప్రదాయాలు వీటన్నింటి గురించి ఆయన ఆరా తీస్తూ ఉంటారు. మీరు చేస్తున్నటువంటి సామాజిక సేవ, భ్రూణ హత్యలు ముఖ్యంగా ఆడ శిశువుని హత్య చేయడం, సతీ సహగమనం , స్త్రీలకి విద్యా బోధనా, ఇంకా మరెన్నో సంస్కరణల గురించి విని మీ దర్శనం ఎప్పుడు కలుగుతుందా, మిమ్మల్నెప్పుడు చూస్తానా అని చాలా ఉత్సుకతో ఉన్నారు. అందుకని వారు ఈ ఆహ్వానాన్ని కర్నల్ వాకర్ ద్వారా పంపించారు. ఒక వేళ మీరు రాలేకపోతే స్వయంగా ఆయనే మీ దర్శనానికి వస్తారని కర్నల్ వాకర్ గారు మీకు చెప్పమన్నారు” అని వివరించారు. అందుకు ప్రభుశ్రీ నవ్వుతూ “గవర్నర్ గారంటే రాజుగారితో సమానమే కదా ! అటువంటప్పుడు మనం రాజుగారికి అంటే గవర్నర్ గారికి మనం కష్టం ఇవ్వకూడదు. కాబట్టి ఆయన ఆహ్వానాన్ని మన్నించి మనమే ఆయన్ని కలవడం బాగుంటుంది అని చెప్పి ఉదయ్ తో మేము గవర్నర్ గారి ఆహ్వానాన్ని అంగీకరించి ఆయన్ని కలవడానికి వస్తున్నాం అని చెప్పండి ‘అని అన్నారు. తర్వాత సత్సంగులతో, తన అనుచరులతో రేపు ప్రొద్దున్నే మనం ప్రాతఃకాలంలోనే బయలుదేరి అహ్మదాబాదుకి వెళ్దా౦, నా ఆశ్వాలని సిద్ధం చేయండి, మీరందరూ కూడా సిద్ధం కండి అహ్మదాబాదు వెళ్ళడానికి అని స్వామి వారు ఆదేశించారు. 

స్వామి నారాయణ గారు తన ఆహ్వానాన్ని మన్నించి అహ్మదాబాదు వస్తున్నందువల్ల అక్కడ గవర్నర్ డన్లప్ గారు చాలా సంతోషించారు. అంతే కాకుండా కర్నల్ వాకర్ ద్వారా ప్రభుశ్రీ చెప్పిన మాటలు విని ఇంకా ఎక్కువగా సంతోషించారు. “గవర్నర్ గారు సాక్షాత్తు రాజు గారితో సమానం కనుక ఆయన మన దగ్గరకి వచ్చి మనల్ని కలిసే కష్టం ఇవ్వకూడదు , మనమే వెళ్లి స్వయంగా ఆయన్ని కలవాలని చెప్పారని  కర్నల్ ద్వారా విన్న గవర్నర్ “అబ్బా ! ఈ స్వామి నారాయణ గారు ఎంత సంస్కారవంతుడు ! అయితే మనం ఆయన కోస౦ స్వాగత సత్కారాలని ఏర్పాటు చేసి నగరపు పొలిమేరల్లోనే మనం స్వామీజీని కలుద్దాం ! అక్కడనుంచి ఆయన్ని మనం సగౌరవంగా, రాచమర్యాదాలతో  నగరంలోకి తీసుకుని వద్దాం” అని ఆదేశించారు.

గవర్నర్ డన్లప్ గారికి ఏసుక్రీస్తు దర్శనం
మర్నాడు అనుకున్నవిధంగానే ప్రభుశ్రీ ప్రాతఃకాలంలోనే తన పరివారంతో ఆహ్మాదాబాదు నగరానికి ప్రయాణం కట్టారు. నగరపు పొలిమేరల్లో సాక్షాత్తు గవర్నర్ అయిన డన్లప్ గారు తన అనుచరులతో సహా వచ్చి సకల రాచమర్యాదలతో, మేళతాళాలతో ఊరేగింపుగా వెళ్లి, ఆయన్ని కలుసుకుని స్వాగతం చెప్పారు. “స్వామి నారాయణ గారూ ! మీరు మా అహ్మదాబాదు నగరానికి వచ్చారు, మీకు మేము హృదయపూర్వకంగా స్వాగతం చెప్తున్నాం , మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడకి వచ్చినందుకు మా ధన్యవాదాలు తెలుపుతున్నాం, మీరు ఒకవేళ రాలేక పోయి నట్లయితే మేమే మీ దర్శనానికి వద్దామనుకున్నాం. మీరే మా దగ్గరకి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది” అని చెప్పారు. ఆ మాటలకి ప్రభుశ్రీ నవ్వుతూ “గవర్నర్ గారంటే మాటలా ? సాక్షాత్తు రాజుగారితో సమానమే కదా ! రాజెప్పుడు తన ప్రజల శ్రేయస్సు కోసమే, వారి క్షేమం కోసమే ఆలోచిస్తూ ఉంటారు అటువంటి సహృదయులైన రాజుగారికి ప్రజలైన మేము మీకు తప్పకుండా మా సహకారాన్ని అందిస్తాం, మీకు తోడుగా ఉంటాం. మేము కూడా మీ ప్రజల్లో ఒకళ్ళం కదా !” అని చాలా వినయంగా బదులిచ్చారు.  అప్పుడు గవర్నర్ డన్లప్ గారు ఇలా అన్నారు “మేము జీసస్ క్రైస్తు ని ప్రార్థిస్తున్నప్పుడు కళ్ళు మూసుకుంటాం, అలా నేను కళ్ళు మూసుకుని ఆయన్ని ప్రార్థిస్తున్నప్పుడు నాకు మీరే కనిపించారు. అదే నాకు చాలా సంతోషంగా ఉంది. 

మీరు సామాన్య మానవులు కారు. మీరు సాక్షాత్తు భగవంతుని అంశతో పుట్టినవారు. ఆయన స్వరూపమే మీరు” అని ఎంతో శ్లాఘించారు. మేళతాళాలతో నగరంలో ప్రవేశించడానికి సన్నాహాలు మొదలైనాయి. ప్రభుశ్రీ స్వామి నారాయణ గారు అహ్మదాబాదుకి వచ్చేసినట్టుగా ఆ నగరంలోనే కాకుండా చుట్టుప్రక్కల గ్రామాల్లో కూడా ఈ వార్త వ్యాపించినందువల్ల జనాలు తండోపతండాలుగా, వేలాది సంఖ్యలో వచ్చారు. వీధులన్నీ జనంతో క్రిక్కిరిసి పోయినాయి. ప్రజలంతా మేడలు, మిద్దెలు ఎక్కి స్వామి నారాయణ గారికి జయజయధ్వానాలు పలికారు. స్వామి నారాయణ గారిని చూసిన వెంటనే చాలామందిలో పరివర్తన జరిగిపోయింది. అందరు కూడా ఒక విధమైన శాంతితో నిండి పోయారు. చాలా మందికి దివ్యమైన అనుభూతులు కలిగాయి. చాలా మందిలో మంచి ఉన్నతమైన సంస్కారాలు ఉద్భవించాయి . ఈ విధంగా స్వామి నారాయణ గారు పెద్ద ఊరేగింపుతో మేళతాళాలతో అహ్మదాబాదు నగర ప్రవేశం చేశారు.