N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Wednesday, 10 August 2016

SwamiNarayan - Episode 88



పాఠక్ వాడి
ప్రభుశ్రీ తన అనుచరులతో, సత్సంగులతో ఇలా అన్నారు ఇక్కడ మందిర నిర్మాణం సమిష్టి కృషితో సాధ్యమే అవుతుంది. కాని ఒకటి మాత్రం గుర్తుంచుకోండి. మందిర నిర్మాణంతో పని అయిపోదు. మందిర నిర్మాణం చాలా కష్టం. మందిరమంటే ఒక కర్మాగారం కాని, దుకాణం కాని ,ఇల్లు కాని కాదు. సాక్షాత్తు భగవంతుని యొక్క శక్తిపాతం అవుతుంది. సాక్షాత్తు భగవంతుడు ఇక్కడ ఉంటాడు. ఇక్కడ పూజా కార్యక్రమాలు, ఆరతి కార్యక్రమాలు, అన్నదానాలు ఇవన్నీ యథావిధిగా ఉండవలసివస్తుంది. కనుక దానికి కూడా మనం ఒక వ్యవస్థ తయారు చేయడం చాలా మంచిది. భక్తులు వస్తూ పోతూ ఉంటారు. వారికి కావాల్సిన సదుపాయాలూ, అన్నదానాలు అన్నీ కూడా ఈ ఖర్చులో ఉంటాయి కాబట్టి ఇదంతా మీరందరూ కూర్చుని, మాట్లాడుకుని ఆ తదుపరి  కార్యాక్రమాన్ని మనం ఎంచుకోవాల్సివస్తుంది. 


అప్పుడు దానిలో సత్సంగులు, అహ్మదాబాదు వాస్తవ్యులు “ప్రభుశ్రీ ! మనకు ఈ మందిర నిర్మాణానికి కావలసిన స్థలం పాఠక్ వాడి అని నేననుకుంటున్నాను అని చెప్పి అందరు కలిసి పాఠక్ వాడి దర్శించారు. స్వామీజీ పాఠక్ వాడి కి రావడం లేదని, వాళ్ళు ఈ ప్రదేశం వదిలి వెళ్ళిపోయారు అని  ప్రజల౦దరు  కూడా చెత్తాచెదారం అక్కడ వేస్తుంటారు . ఇది విశాలంగా కూడా ఉంటుంది. ప్రతి భూమికి కూడా ఒక సంస్కారం ఉంటుంది. ఒక శక్తి ఉంటుంది. ఈ  భూమికి కూడా అటువంటి సంస్కారం, శక్తి ఉంటాయి అని నేను నమ్ముతున్నాను కనుక ఆ పాఠక్ వాడినే మనం ఎన్నుకుంటే బాగుంటుంది!” అని తమ అభిప్రాయాన్ని వివరించారు. అవును. నిజమే ! ప్రతి భూమికి కూడా సంస్కారం, మంచి గుణాలు, మంచి లక్షణాలు, అవలక్షణాలు ప్రకృతిని అనుసరించే ఉంటాయి. అందుకనే కొందరి ఇళ్ళలో ఒక సద్భావన, మంచి గుణాలు, ప్రేమ, సుఖం, శాంతి ఉంటాయి. కొంత మంది ఇళ్ళలో ఎప్పుడు చూసినా దరిద్రం, అశాంతి , దెబ్బలాటలు, అనారోగ్యం ఇవన్నీ కూడా ఉంటాయి. ప్రతి మనిషికి ఏవిధంగా సంస్కారాలు౦టాయో అదే విధంగా ఈ భూమికి కూడా ప్రకృతిపరంగా అటువంటి సంస్కారాలే ఉంటాయి. నీవు చెప్పింది నిజమే, ఈ స్థలం మందిర నిర్మాణానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ దేవతలకి, దానవులకి, మానవులకి, పిశాచాలకి అందరికి కూడా సుఖమూ-శాంతి లభిస్తుంటాయి. వారికి కావాల్సినవన్నీ కూడా వారికి లభిస్తూ ఉంటాయి. కాబట్టి నీవు చెప్పిన విధంగానే మందిర నిర్మాణం కావిన్చావచ్చును అని స్వామి నారాయణ గారు ఏకీభవించారు.
విశ్వాస ప్రభావం – ఫలితం
స్వామినారాయణ గారి అనుచరులంతా కలిసి మళ్ళీ గవర్నర్ డన్లప్ గారి దగ్గరకి వెళ్ళారు. తాము నిర్ణయించుకున్న స్థలం గురించి వాళ్ళు వివరించారు. అప్పుడు గవర్నర్ డన్లప్ గారు “ చాలా సంతోషం మీరు స్థలాన్ని నిర్ణయించు కున్నందుకు , మీరు స్థల నిర్దేశనం కూడా చేశారు. మరి మీకు ఎంత భూమి అవసరమో నాకు అది కూడా చెప్పితే బాగుంటుంది” అని అన్నారు.
ప్రభుశ్రీ “మాకు ఎంత భూమి అవసరమో మేము మాణిక్ కి చెప్తాం. మాణిక్ నిర్ణయిస్తుంది ఎంత భూమి కావాలో అన్నది” అని చెప్పారు.
“మాణిక్ ఎవరు?’’ అని డన్లప్ గారు అడగ్గా “అది మా గురువు గారి గుఱ్ఱం’’ అని చెప్పారు. అది విని డన్లప్ గారు, సత్సంగులు కూడా చాలా ఆశ్చర్య పడిపోయారు. అంతలో  ముక్తానంద స్వామి గారు “భగవాన్ స్వామి నారాయణ గారు అన్ని జీవులను కూడా నమ్ముతారు కాబట్టి మనం దేనికి సందేహించ వలసిన అవసరం లేదు మన మాణిక్ ఏ మనకి ఎంత స్థలం కావాలో నిర్ణయిస్తుంది” అని చెప్పారు.
“మీరు నిర్ణయించుకున్నారు కాబట్టి నేను దాని ప్రకారమే మీకు ఎంత భూమి కావాలో చెప్పాక నేను మీకు  దాన్ని సమర్పిస్తాను” అని గవర్నర్ డన్లప్ గారు చెప్పారు. అప్పుడు ప్రభుశ్రీ దానికి తగ్గట్టుగా ఆ స్థలాన్ని మీరు మాకు ఇచ్చినట్లుగా మాకు పత్రాలు కావాలి అని చెప్పారు. దాన్ని కర్నల్ వాకర్ గారు వాళ్లకి ఫలానా డాక్యుమెంట్స్ కావాలి అని గవర్నర్ గారికి వివరించారు.  
“సరే ! తప్పకుండా నేను మీకు ఆ డాక్యుమెంట్స్ అన్నీ99 సంవత్సరాలు ఆ భూమి మీకు చెందేటట్టుగా వ్రాసి ఇస్తాను” అని చెప్పారు.
ప్రభుశ్రీ గారు నవ్వుతూ “రేపు ఏం జరుగుతుందో మనకి తెలియదు. ఈ 99 ఏళ్ళలో ఎన్నో మార్పులు రావచ్చును. నేను ఉండక పోవచ్చును, మీరు కూడా ఉండక పోవచ్చును. ఎవరికి తెలుసు? అప్పుడు 99 ఏళ్ళ తర్వాత మేము వేరే భూమిని వెతుక్కోవాల్సి వస్తుంది. ఇక్కడ ఇన్ని ప్రయాసలతో నిర్మించే ఈ మందిరాన్ని మళ్ళీ వేరే చోటికి మార్చడం అనేది మాకు సాధ్యం కాదు. కాబట్టి మీరు ఆ భూమిని మాకు 99 ఏళ్ళకి కాకుండా శాశ్వతంగా చెందేటట్టు వ్రాసి ఇస్తే బాగుంటుంది” అని ఆయన సూచించారు.
అప్పుడు డన్లప్ గారు “ప్రభుశ్రీ ! నాకు భూమిని 99 ఏళ్ళ వరకే లీజ్ (lease) మీద ఇచ్చే అధికారం ఉంది అంతకు మించి లేదు. కావాలంటే నేను ఆ పత్రాలన్నింటినీ తయారు చేసి పంపుతాను. అక్కడ కనుక అనుమతి దొరికితే అది తీసుకుని ఆ భూమిని మీకు ధారాదత్తం చేయవచ్చును” అని విన్నవించారు.
“సరే ! అలాగయితే మీరు ఆ పత్రాలు చేయించండి” అని ప్రభుశ్రీ గారు అనుమతించారు. తర్వాత ప్రభుశ్రీ తన శిష్యులతో, సత్సంగులతో మీరంతా పాఠక్ వాడికి వెళ్లి మన మాణిక్ తో “నీవు నిస్వార్థం గా మన మందిర నిర్మాణానికి భూమి ఎంత అవసరమో అంత వరకే నీవు తిరిగి నిర్దేశించ వలసింది. మనం స్వార్థం గా ఉంటె మనకి నష్టం వస్తుంది కాబట్టి నిస్వార్థంగా ఎంత భూమి అవసరం అంతే తీసుకుందాం అని దాన్ని హెచ్చరించి “ ఇక వెళ్లి రా “ అని పంపించివేశారు. అప్పుడు మాణిక్ ప్రభుశ్రీ ఆదేశాన్ని గ్రహించి పాఠక్ వాడిలో చక్రభ్రమణం చేయ సాగింది.  చక్రభ్రమణం అయిపోయినాక సత్సంగులందరు కూడా ముఖ్యంగా ఆలయ నిర్మాణానికి పూనుకున్నటువంటి ఆనంద్ గారు “ ప్రభుశ్రీ ! మనకి ఆలయ నిర్మాణానికి కావలసినంత స్థలం మనకి దొరికింది. ఈ మాణిక్ చూపించినంత స్థలం మనకి సరిపోతుంది అని వివరించ సాగాడు. దానిలో కొంత మంది సత్సంగులు గురూజీ ! మనం అంతా ప్రయత్నాలు చేస్తున్నాం కదా ! మరి మనకి ఇంగ్లాండ్ నుంచి ఆ పత్రాలు ఇంకా రాలేదు” అని అన్నారు.
“మనం ఏ పనైతే సంపూర్ణ భక్తితో, విశ్వాసంతో, ఒక మంచి సంకల్పంతో ఒక మంచి పనిని మనం చేయాలి అని అనుకున్నప్పుడు దానికి ధ్యేయం ఉంటుంది. దానికి ఎప్పుడు భగవంతుని ఆశీర్వాదం ఉంటుంది. మనకి తప్పకుండా ఆ భూమి లభిస్తుంది” అని స్వామి నారాయణ గారు చెప్పారు. అంతలోనే ఒక వార్తాహరుడు వచ్చి “ ప్రభుశ్రీ ! గవర్నర్ డన్లప్  గారి దగ్గర్నుంచి మిమ్మల్ని రమ్మని ఆదేశం వచ్చింది”  అనుకున్నట్టుగానే ఇంగ్లాండ్ నుంచి మీకా భూమి శాశ్వతంగా దానదత్తం చేయబడింది అని పత్రాలు వచ్చాయి కాబట్టి మీరు రావాల్సింది” అని ఆ పత్రాన్ని ఇచ్చాడు. సత్సగులందరూ కూడా ఎంతో సంతోష పడ్డారు, ఆనంద పడ్డారు, ఆశ్చర్య పడ్డారు. అందరు కలిసి గవర్నర్ డన్లప్ గారి దగ్గరకి వెళ్ళారు.
 ఆయన చాలా సంతోషంతో “ నేను మీ గురించి అన్ని వివరాలు వ్రాసి ఇంగ్లాండ్ కి పంపించాను. ప్రభుత్వం సంతోషంగా మీకు ఆ భూమిని ధారాదత్తం చేస్తున్నట్టుగా పత్రాలు వచ్చాయి స్వామీజీ ! మీరు దయ చేసి స్వీకరించ వలసిందిగా ప్రార్థించారు. అంతే కాదు ప్రభూ ! ఆ మందిర నిర్మాణానికి మీకు ఎంత డబ్బు అవసరమో అంత డబ్బు ఇవ్వడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది . మీరు అంచనా వేసి ఎంత కావాలో చెప్పవలసింది” అని ప్రార్థించారు. అప్పుడు ప్రభుశ్రీ గవర్నర్ డన్లప్ గారికి ధన్యవాదాలు తెలిపారు.
‘’గవర్నర్ గారూ ! మీరు ఇచ్చిన ప్రోత్సాహానికే మాకు చాలా సంతోషంగా ఉంది.  కాని మా మందిర నిర్మాణం  మా సత్సంగులు, సాధువులు, సన్యాసులు, గ్రామస్థులు ఈ ప్రజలందరి శ్రద్ధ, భక్తి, విశ్వాసం, ప్రేమ , సేవ అనే సంపదతో మాత్రమే జరుగుతుంది, ప్రభుత్వం ఇచ్చే దానం మాకు అవసరం లేదు అయినా మేము మీరు చెప్పిన ప్రతిపాదనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక్కడ ప్రజలందరి యొక్క సేవా తత్పరతో , వారి శ్రమదానంతో మాత్రమే ఇక్కడ మందిర నిర్మాణం జరుగుతుంది. కనుక మీ ప్రభుత్వ ఖజానా నుంచి మాకు ఏ మాత్రం ధనం అవసరం లేదు” అని చెప్పారు. ప్రభుశ్రీ మాటలు విన్నాక గవర్నర్ డన్లప్ గారు చాలా ఆశ్చర్య పడ్డారు. ఆశ్చర్యం కన్నా ఆయనకి పట్టరాని సంతోషం వేసింది. ఆయనకి స్వామి నారాయణ గారి పట్ల ఉండే గౌరవం ఇప్పుడు పది రెట్లు పెరిగిపోయింది.
ప్రభుశ్రీ తన శిష్యులతో “మంచి కార్యాన్ని మనం వెంటనే ప్రారంభించాలి. ఎటువంటి ఆలస్యం చేయకూడదు. ఆనంద స్వామి వారు మొత్తం నకాషా అంతా తయారు చేసి పెట్టారు. ఎక్కడ ద్వారం ఉండాలి, ఎక్కడ ఏం ఉండాలి  ఇలాంటివన్నీ ఆయన మొదలే ఆ నకాశా తయారు చేసి ఉంచారు. కాబట్టి మనం పనిని తొందరగా మొదలు పెట్టితే బాగా ఉంటుంది” అని స్వామి నారాయణ గారు అందరికి తగిన సూచనలిచ్చారు. అలాగే మనం ఇక్కడ ఏ దేవతను ప్రతిష్టించాలి అనేది కూడా మనం ఆలోచించాలి. అని చెప్పగా స్వామి నారాయణ గారు ఏం చెప్తారా  వినాలని అందరు కుతూహలంగా ఉన్నారు. అప్పుడు స్వామి నారాయణ గారు “ఈ భారత నందనానికి అధిపతులు సాక్షాత్తు నర నారాయణులు కాబట్టి మనం ఈ మందిరంలో నారాయణుడి విగ్రహమొకటి ప్రతిష్టించాలి” అని చెప్పగా అందరు కూడా ప్రభుశ్రీ తో ఏకగ్రీవంగా అంగీకరించారు. అందరు “ శ్రీ  స్వామి నారాయణ గారికి జై” , శ్రీ నరనారాయణుడికి జై’ అంటూ జయజయ ధ్వానాలు చేయడం మొదలుపెట్టారు. భగవాన్ శ్రీ స్వామి నారాయణ గారు అహ్మదాబాదు లో పాఠక్ వాడి దగ్గర పెద్ద మందిర నిర్మాణం చేయిస్తున్నారని విని అహ్మదాబాదు నగరమే కాకుండా చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా తండోపతండాలుగా జనాలు తమ వ౦తు సాయ౦ చేయడానికి వచ్చారు. మందిర నిర్మాణానికి చాలా సామగ్రి అవసర౦ ఉ౦టు౦ది. స్తంభాలు చేయడానికి రాళ్ళు, మిగతా పరికరాలు ఎన్నో అవసరం ఉంటాయి. అక్కడ పని చేసేవారికి ఆహార ధాన్యాలు, మంచి నీళ్ళ వసతి, ఇలా చాలా చిన్నా , పెద్ద కార్యక్రమాలు , సహాయాలు అవసరం అవుతాయి కనుక వేలాదిగ్రామాలనుంచి తమకు తోచిన సరుకులు అన్నీ బళ్ళలో పెట్టి స్వామి నారాయణ గారి మందిర నిర్మాణ దిశలో బయల్దేరారు. ప్రేమానంద స్వామి గారు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. సత్సంగులు కూడా క్రమశిక్షణతో అన్ని చోట్లా ఉండి, అన్ని రకాల పనుల్లో పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు.