N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Monday, 15 August 2016

SwamiNarayan - Episode 89



హిమ్మత్ నగర్ – జీవా పటేల్
హిమ్మత్ నగర్ అనే చిన్న గ్రామం నుంచి జీవా పటేల్ అనే ఒక చిన్న వ్యవసాయదారుడు స్వామి నారాయణ గారికి అవసరం ఉంటుంది అని చెప్పేసి ఒక శిలాఫలకాన్ని తన ఎడ్ల బండి  మీద తీసుకుని రావడానికి సిద్ధమయ్యాడు. కాని అతను, చుట్టు ప్రక్కల ఉన్న గ్రామస్థులు అందరు కలిసి  ఎంత ప్రయత్నించినా కూడా ఆ శిలాఫలకాన్ని ఆ ఎడ్లబండి మీద పెట్టలేక పోయారు. అప్పుడు జీవా పటేల్ ఎంతో ఆర్తితో స్వామి నారాయణ గారిని ప్రార్థించాడు. “స్వామీ ! నేను చేసిన సేవలో ఏదైనా తప్పు గాని దోషం గాని ఉందా? మరి ఎందుకు మీరు మాకు సాయం చేయలేక పోతున్నారు? ఇంత మంది వచ్చి ప్రయత్నించినా కూడా ఈ రాయిని మేము ఏమాత్రం కదలించ లేక పోతున్నాం’’ అని ప్రార్థిస్తూ తోటివారితో ప్రభుశ్రీ నామాన్ని తల్చుకుని మనం ఈ రాయిని ఎత్తుదాం అని చెప్పి స్వామి నారాయణ గారి నామం తల్చుకుంటూ అందరు కలిసి ఆ రాయిని ఎత్తగా ఆశ్చర్యంలో ఆశ్చర్యం ఏమిటంటే ఆ రాయి సులభంగా గాలిలోకి లేచింది. దాన్ని సునాయాసంగా బండిమీద తరలించి జీవా పటేల్ తన పనిని సాధించాడు. మందిర నిర్మాణ౦ జరుగుతున్న ప్రదేశానికి రాగానే అక్కడ ఉన్న ఒక సత్సంగి  ఆ శిలాఫలకాన్ని చూసి చాలా ఆశ్చర్య పడ్డాడు. అంత బరువైన ఆ శిలాఫలకాన్ని ఈ ఎడ్లు ఎలా మోశాయో, ఆ రాయిని ఎలా ఎత్తి ఈ ఎడ్ల బండి మీద పెట్టారో ఆయనకి నిజంగానే ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. 



జీవా పటేల్ జరిగిన సంగతంతా వివరించాడు. అది విని ఆయన కూడా చాలా ఆశ్చర్య పోయాడు. ఈ విధంగా వివిధ గ్రామాల నుంచి మందిర నిర్మాణానికి అవసరమయ్యే చిన్నా, చితక వస్తువులన్నీ కూడా గ్రామస్థులందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో తీసుకుని రాసాగారు. ఇలా ఈ మందిరం యొక్క నిర్మాణం భక్తుల యొక్క భక్తివిశ్వాసాల మీద, సేవా తత్పరత మీద ఆధార పడి చాలా తొందరగా మందిర నిర్మాణ కార్యక్రమాలు సాగిపోతూ ఉన్నాయి. జీవా పటేల్ అనే సాధారణమైన వ్యవసాయ దారుడు ఆ రాయిని తీసుకుని రావడం చూసి అక్కడ ఉన్న సత్స౦గులంతా చాలా ఆశ్చర్యపడిపోయారు. ఈ ఎడ్లు ఆ ఫలకాన్ని ఎలా బండిమీద లాక్కుంటూ వచ్చాయి? అని వాళ్ళలో వాళ్ళు పరిపరి విధాలా ప్రశ్నించుకో సాగారు.

అప్పుడు దాంట్లో కొన్ని కొన్ని వాస్తవాలు కూడా బయటపడ్డాయి. జీవా భాయి స్వామి నారాయణ గారి నామం తల్చుకుని తోటి గ్రామస్థుల సహాయంతో ఆ శిలాఫలకాన్ని బండి మీద అయితే పెట్ట గలిగాడు కాని అది ఎంతో దూరం లాగలేక పోయింది. కాని అతని భక్తిభావం ఏమాత్రం తగ్గలేదు. స్వామి నారాయణ గారిని గట్టిగా ప్రార్థించి తానే ఎడ్ల స్థానంలో నిల్చుని , బంధాలు కట్టుకుని స్వామి నారాయణ గారిని తల్చుకుంటూ ఆ ఎడ్ల బండిని లాగడానికి ప్రయత్నం చేయసాగాడు. ఇలా ఆ బండిని లాగుతూ మధ్య దారిలో ఒక గ్రామంలో ఒకరి ఇంటి దగ్గర ఆగి మంచినీళ్ళు కావాలని అడిగి దాహం తీర్చుకుని మళ్ళీ బండిని లాగడానికి సిద్ధమయ్యాడు. ఇదంతా చూస్తున్న కొంతమంది వచ్చి నీవెందుకు ఇలా చేస్తున్నావు? నీవెందుకు ఈ ఎడ్ల బండిని లాగుతున్నావు? నీ ఎడ్లు ఏమయ్యాయి? అని అడిగారు. నా ఎడ్లు వాటి శక్తికి మించిన ఈ బరువును  మోయలేక పోతున్నాయి. మరి స్వామి వారి పనిలో ఎటువంటి జీవహింస జరగకూడదు అని సెలవిచ్చారు కాబట్టి నేను ఈ ఎడ్లను కష్ట పెట్ట లేను. వాటి ప్రాణాలను హరించే పని చేయను. అందుకనే వాటి స్థానంలో నన్ను నేను బంధించుకుని స్వామి నారాయణ గారి నామజపం చేసుకుంటూ ఈ బండిని లాగుతున్నాను అని చెప్పాడు.

తోటి గ్రామస్థులంతా అతని భక్తిశ్రద్ధలకి ఆశ్చర్య పడిపోయి “ జీవా పటేల్ గారూ ! మీకు మేము మా బలిష్టమైన ఎడ్లని కూడా ఇస్తాం కాబట్టి మీరు బంధ విముక్తులై మా ఎడ్లని కూడా తీసుకోండి, మమ్మల్ని కూడా ఈ మంచి పనిలో పాలు పంచుకోనీయండి. మాకు కూడా కొంత పుణ్యం వస్తుంది ” అని ప్రార్థించారు. జీవా పటేల్ వారి ప్రార్థనలను మన్నించి ఆయన బంధవిముక్తులై ఆ గ్రామస్థులు ఇచ్చిన ఎడ్లను బండికి కట్టి వాటి సహాయంతో ఆ శిలాఫలకాన్ని మందిర నిర్మాణ ప్రదేశానికి తీసుకుని వచ్చాడు. ఈ విధంగా అమాయకులైన గ్రామస్థులు, చిన్నా చితక, శ్రీ మంతులు అందరు కూడా స్వామి నారాయణ గారి సత్కార్యంలో పాలు పంచుకున్నారు. మొత్తానికి  మందిర నిర్మాణం శరవేగంగా జరిగిపోయింది. ఆనంద్, ఆనంద్జీ.

మాయా నందన్ , ఇంకా చాలా మంది సత్సంగుల పర్యవేక్షణతో, శ్రద్ధాభక్తులతో, క్రమశిక్షణతో అన్ని పనులు సక్రమంగా జరిగిపోయినాయి. ఈ వార్త స్వామి నారాయణ గారి దగ్గరకి చేరింది. అప్పుడు ఆయన ఆనంద, ఆనంద్ జీ , మాయనందన్ స్వామి వీరందరితో మన మందిర నిర్మాణం పూర్తయింది. విగ్రహ ప్రతిష్ఠ మిగిలింది కనుక నర నారాయణుని విగ్రహ ప్రతిష్ఠ  కి ముహూర్తం చెప్పండి అని అనగా వారందరూ కలిసి ముహూర్తాన్ని నిర్ణయించారు. స్వామి వెంటనే మరి మీరందరూ ఈ అహ్మదాబాదు నగరమే కాకుండా కచ్ ప్రాంతంలో, సూరత్ ప్రాంతంలో, సౌరాష్ట్రలో , ముంబయి లో , గుజరాతు అంతటా విగ్రహ ప్రతిష్ఠ జరగబోయే సమయం, తేది అందరికి తెలియపరచి వారందరినీ ఆహ్వానించ వలసిందిగా ఆదేశించారు. ఆ  మందిర నిర్మాణంలో జీవా పటేల్ తీసుకుని వచ్చిన ఆ పెద్ద శిలని ప్రత్యేక స్థలంలో పెట్టి అతని పేరు దాని మీద చెక్కాలని వారు నిశ్చయించు కున్నారు. అతని అనన్య భక్తి శ్రద్ధలకి , విశ్వాసానికి అది తార్కాణంగా మిగిలి పోతుంది. చుట్టు ప్రక్కల అనేక గ్రామాలనుంచి, నగరాలనుంచి, పట్టణాల నుంచి , దేశపు నలుమూలల నుంచి ప్రజలు తండోప తండాలుగా నర నారాయణ విగ్రహ ప్రతిష్ఠ చూడడానికి జనులు రాసాగారు. ఇంతమంది వేలాది మంది ప్రజలకి ప్రభుశ్రీ గారు మనం కంకర్య అనే ప్రదేశంలో వారికి అన్నీ ఏర్పాట్లు చేద్దాం.

అక్కడ వృక్షాలు చాలా ఉన్నాయి కాబట్టి వార్లు వృక్షఛాయలో సేద తీర్చుకుంటారు. అక్కడే కంకర్యలో ప్రక్కనే ఒక పెద్ద సరోవరం కూడా ఉంది. ఆ సరోవరపు చుట్టు ప్రక్కల అన్ని ప్రదేశాల్ని మనం శుభ్రపరుద్దాం. సాక్షాత్తు నర నారాయణ స్వాముల వారు , బదరికావనంలో ఉండే స్వాముల వారు స్వయంగా విచ్చేస్తారు. ఈ సరోవరాన్నే మనం మానస సరోవరంలాగా భావించాలి. అక్కడ మానస సరోవరంలో స్నానం చేస్తే ఏవిధంగా పుణ్యం వస్తుందో అదే విధంగా ఈ సరస్సులో స్నానం చేసినా అంతే  పుణ్యం వస్తుంది. కనుక మీరంతా కలిసి దాన్ని శుభ్రం చేయండి ఇది కూడా ఆ బదరికా వనం లాగే ఆ భూమిలో ఎటువంటి సంస్కారం ఉందో, ఎటువంటి శక్తి ఉందో, అటువంటి శక్తి సంస్కారాలు అన్ని కూడా ఇక్కడ ఈ భూమికి కూడా ఆపాదించబడతాయి అని స్వామి నారాయణ గారు సెలవిచ్చారు. అంతే కాకుండా వృద్ధులు, ధన ప్రయాసలకి, ఋణప్రయాసలకి, ప్రయాణ  ప్రయాసలకి తట్టుకోలేనివాళ్ళు, స్వయంగా మానస సరోవరానికి వెళ్ళలేని వాళ్ళు , బదరికా వనానికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడకి వచ్చినా  అదే ఫలితాన్ని వాళ్ళు పొందవచ్చును అనే వరాన్ని కూడా ఆయన ప్రసాదించారు.

 ప్రభుశ్రీ “ఈ మందిర నిర్మాణానికి ఎవరెవరైతే కృషి చేశారో సాధువులు, సంతులు, గ్రామస్థులు, కర్షకులు, శిల్పులు అందరిని మీరు దయ చేసి పిలవండి. నేను అందరిని కలవదలచుకున్నాను”అని చెప్పారు.

“ప్రభుశ్రీ ! వేలాదిమంది ప్రజలు వస్తుంటారు. ఇంత మందితో మీకు మాట్లాడడ౦ కష్టం కదా !” అని అనగా ప్రభుశ్రీ నేనెప్పుడూ నా ఆలోచనల మధ్యే గడపాలి అని కోరుకుంటాను. అందరిని కలవాలని కోరుకుంటాను. నాకు ఇరవై నాలుగు గంటలు వారి సాన్నిధ్యం లోనే విశ్రాంతి లభిస్తుంది కనుక మీరేమీ సందేహం పడకుండా ఇక్కడ అందరినీ పిలవవలసింది. ఇక్కడ ఎవరు వచ్చి దర్శనం చేసుకున్నా నర నారాయణులు ఆశీర్వాదం, మనం భక్తులతో పాటు ఈ మందిర నిర్మాణానికి ఎవరెవరైతే సహకరించారో వారందరికీ కాకుండా ఈ రాళ్ళు రప్పలు మోసుకొచ్చినటువంటి పశువులకి కూడా చాలా పుణ్యం కలుగుతుంది. ఆ భక్తులందరూ కూడా ఇక్కడ జరిగిన శిల్ప సౌందర్యాలని వాళ్ళు  గ్రహిస్తూ ఉంటారు కాబట్టి వారందరిని కూడా పిలవండి అని చెప్పారు. సాధువులందరు కూడా అక్కడికి వచ్చారు. అందులో జీవా పటేల్ గారు తెచ్చినటువంటి ఆ పెద్ద శిలాఫలక౦ ప్రత్యేకంగా స్తంభం లాగా చెక్కబడింది అని చెప్పారు. అప్పుడు ప్రభుశ్రీ “నాకు తెలుసు అందుకని దీన్ని ప్రత్యేకంగా భావించవలసి వస్తుంది’’ అని అంటే అలాగే మిగతా వారందరు శిలాఫలకాలని  తెచ్చిన వారందరికి స్వామి వారు ప్రతి  మనిషికి పేరు పేరునా పిలిచి, వారందరి మెడలో పూలహారాలు వేసి సత్కరించారు.  చాలా మెచ్చుకున్నారు. ఈవిధంగా ప్రభుశ్రీ అందరికి పేరుపేరునా ధన్యవాదాలు చెప్పారు.
ఆ రోజు రాత్రి పెద్ద జలసాగా అక్కడే అందరు కూడా నేల మీదే తల దాచుకున్నారు. ఎందుకో మొట్ట మొదటిసారిగా అక్కడ చాలా చలిగా ఉ౦డాలి. అందరు చలికి తట్టుకోలేక గజగజా వణికిపోతున్నారు. అయినా వారు మాకు ఇక్కడే బాగుంది అని స్వామి నారాయణ నామజపం చేసుకుంటూ కూర్చున్నారు. స్వామి నారాయణ గారు కూడా అందరితోపాటు అలాగే కూర్చున్నారు. ఇంతలో కర్నల్ వాకర్ గారు వచ్చి, స్వామి నారాయణ గారికి నమస్కరించి “ప్రభుశ్రీ ! మీరందరు కష్ట పడుతున్నారు. మాకు చాలా కష్టంగా ఉంది. ఇక్కడ చాలా చలిగా ఉంది కాబట్టి మీకు కావలసిన సౌకర్యాలన్నీ మేము ఏర్పాటు చేయాలి అని అనుకుంటున్నాం కాబట్టి సెలవియ్యండి’’ అని ప్రార్థించారు. అప్పుడు ప్రభుశ్రీ ఇలా అన్నారు. మీరు మా గురించి ఆలోచిస్తున్నారు. మాకు చాలా సంతోషం. ఇక్కడ సాక్షాత్తు హిమాలయ పర్వతాలలో ఉన్నట్టి  నర నారాయణులే ఇక్కడికి విచ్చేస్తున్నారు కనుక ఆ హిమాలయాలలో ఉన్న శీతలం ఆ చలి కూడా ఇక్కడకి రావడం జరిగింది. అదే మేము మా ప్రసాదంగా భావిస్తున్నాం. అదే విధంగా మీరు మా సౌకర్యాలకోసం ఏర్పాట్లు చేస్తాం అని అంటున్నారు కాబట్టి మేము వాటిని అవహేళన చేయ దలచు కోలేదు. మీరేం చేయదలచుకున్నారో మీరు చేయండి మాకేమీ అభ్యంతరం  లేదు అని సెలవిచ్చారు. కర్నల్ వాకర్ గారు స్వామీజీ కి నమస్కరించి అలాగే ! మాకు తోచి౦ది మేము చేస్తాం ! అని చెప్పి వెళ్లి పోయారు. మరి నర నారాయణులు శీతల ప్రదేశంలో ఉంటారు కాబట్టి ఆయన ఆగమనానికి చిహ్నంగా కాబోలు అక్కడి వాతావరణం అంతా చల్లగా అయిపోయింది. ఇది విన్న భక్తులంతా చాలా ఆనంద పడిపోయారు. సాక్షాత్తు నారా నారాయణు లే మరియూ ఈకంకర్య ప్రదేశం బదరికా వనంగా మారిపోయినందుకు చాలా సంతోష పడిపోయారు.