N. Sairam Garu : +91 99631 18716 || Email: srnanduri50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.



Wednesday, 23 November 2016

SwamiNarayan - Episode 92




స్వామి నారాయణ గారు తన ఉత్తరాధికారిని నియమించడం, వారికి ఆదేశాలు ఇవ్వడం 
శ్రీ స్వామి నారాయణ గారి ఖ్యాతి, ప్రఖ్యాతి దేశం నలుమూలలా వ్యాపించింది . ఈ దేశంలోనే కాకుండా ఖండాంతరాల్లో కూడా ఆయన పేరు ప్రఖ్యాతులు వ్యాపించి అనేక లక్షలమంది ప్రజలు స్వామి నారాయణ గారి శిష్యులుగా మారారు. వారి సాంప్రదాయాన్ని పాటిస్తూ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద సంస్థని నిర్వహించడం కష్టం కనుక ఒక రోజు స్వామి నారాయణ గారు సభను ఏర్పాటు చేసి ఆ సమావేశంలో ఇదే ప్రస్తావన తీసుకుని వచ్చారు. మన స్వామి నారాయణ సంప్రదాయం దేశదేశాలా వ్యాపించి౦ది. దానితో పాటు నిర్వహణ అనేది కష్టంగా ఉంటుంది. పెద్ద చెట్టు కొమ్మలు దశదిశలా వ్యాపించినట్టుగా లక్షలాది మందులు ధర్మ మార్గానికి వచ్చారు. ఈ నిర్వహణ కోసం నేను నా ఉత్తరాధికారిని ప్రకటించవలసి వస్తుంది అని చెప్పగానే అందరూ ఒక్క పెట్టున “స్వామీ ! మీరు దయ చేసి ఇలా మాట్లాడకూడదు. మీరు లేకపోతె మాకు మార్గ దర్శనం చేసే వాళ్ళెవరూ ఉ౦డరు” అంటూ చాలా గొడవ చేశారు. స్వామి వారు ప్రశాంతంగా "శ్రీ రామానంద స్వామి గారు వారి తదనంతరం  నన్నెలా ఆయనకి ఉత్తరాధికారిగా చేశారో అలాగే నేను కూడా ఏదో ఒక రోజు చేయక తప్పదు.కనుక మీరు విచారించ వద్దు"అని చెప్పారు. అది విన్నాక ముక్తానంద స్వామి, బ్రహ్మానంద స్వామి, మిగతా అందరు కూడా ముక్త కంఠంతో మాలో ఎవరిని కూడా మీరు ఉత్తరాధికారిగా ప్రకటించవద్దు. 



మేమందరం సర్వసంగ పరిత్యాగం చేసిన వాళ్ళం కనుక మాకు ధనం, కీర్తి తో ప్రమేయం లేదు. కేవలం మీరు చెప్పిన సాంప్రదాయాన్నే ప్రజల్లో విస్తరింప చేయడమే మా ధ్యేయం కనుక మాకు ఎటువంటి అధికారం వద్దు, వద్దు అని చెప్పి అందరూ స్వామి వారిని బ్రతిమిలాడసాగారు. స్వామి నారాయణ గారు అలాగే అని చెప్పారు కాని అందులో ముక్తానంద స్వామి వారు సభను ఉద్దేశించి “స్వామీ ! మీ వంశం లోని వారే గృహస్థాశ్రమం లో ఉండి కూడా సాధు ధర్మాన్ని చాలాచక్కగా నిర్వర్తిస్తున్నారు. వారి సత్ప్రవర్తన ఇంత కాలంగా మీము అంతా గమనిస్తూనే ఉన్నాం. వారినే మీరు ఉత్తరాధికారిగా ప్రకటిస్తే మా అందరికీ సంతోషంగా ఉంటుంది. ప్రభుశ్రీ ! మీరు ఆలోచించండి” అని చెప్పారు. స్వామి నారాయణ గారు తన పరివారం వైపు తిరిగి “రాం ప్రసాద్ అన్నా, ఇచ్చారాం అన్నా !  మీరిద్దరూ నాకొక వరాన్ని ప్రసాదించాలి” అన్నారు. వారిద్దరూ ఏక కంఠంతో “అయ్యో ! తప్పకుండా !” అని అన్నారు. మీరు మమ్మల్ని ఆజ్ఞాపించండి. అర్థించవలసిన పని లేదు. అలా అయితే మీరిద్దరు కూడా మీ కుమారులని నాకు దానం చేయండి అని కోరారు. వారిద్దరూ సంతోషంగా “అలాగే ! మీరు చెప్పినట్లుగానే మేము చేస్తాం” అని చెప్పారు. అప్పుడు రాం ప్రసాద్ కొడుకు,  ఇచ్చారాం  కొడుకు వీరిద్దరిని ఉద్దేశించి “అయోధ్యా  ప్రసాద్ గారూ ! రఘువీర్ గారూ ! మీరిద్దరూ ఇక్కడకి రండి. అయోధ్యా ప్రసాద్ గారూ ! మీరిలా ఉత్తరం వైపు కూర్చోండి. రఘువీర్ గారూ ! మీరలా దక్షిణం వైపు కూర్చోండి” అని చెప్పారు. స్వామి నారాయణ గారు చెప్పినట్లుగా వారలాగే కూర్చున్నారు. అప్పుడు సత్సంగులని, అక్కడ ఉన్న పరివారాన్ని ఉద్దేశించి “మీరందరూ కొంత మంది ఉత్తరం వైపు, కొంత మంది దక్షిణం వైపు కూర్చోండి” అని ప్రార్థి౦ఛారు. అందరూ అలాగే కూర్చున్నారు. అప్పుడు సభను ఉద్దేశించి “చెప్పండి ! ఇప్పుడు ఎలా ఉంది?” అని అడిగారు. వెంటనే అందరూ బాగానే ఉంది అని సమాధానం చెప్పారు. మన సంస్థను నిర్వహించడం చాలా కష్టం కనుక దీన్ని నేను రెండు భాగాలుగా చేస్తున్నాను. ఉత్తర దిశని అయోధ్యా ప్రసాద్ గారు చూసుకుంటారు. దక్షిణ దిశని రఘువీర్ గారు చూసుకుంటారు. కాబట్టి  మీరంతా అయోధ్యా ప్రసాద్ గారు చెప్పినట్టుగా మరియూ రఘువీర్ గారు చెప్పినట్టుగా మీరు వాళ్ళనే గురువుగార్లగా భావించి వారి నుంచే ఇకముందు మీరు దీక్ష తీసుకోవలసింది అని ఆదేశించారు. అందరూ కూడా స్వామి వారు చెప్పిన ఆదేశాన్ని మేము తప్పకుండా పాటిస్తాం అని ఏక కంఠంతో చెప్పారు. “జై స్వామి నారాయణ” అంటూ పెద్దపట్టున హర్షధ్వానాలు చేశారు.
స్వామి నారాయణ గారు సత్సంగులతో అయోధ్యా  ప్రసాద్ తో , రఘువీర్ తో ఇది నిర్వహణ సౌలభ్యం కోసమే ఇది విభజించబడింది. మనం దీన్ని వేరే దృష్టి తో చూడకూడదు. అయోధ్యాప్రసాద్ , రఘువీర్ మీరిద్దరూ కూడా  స్వామి నారాయణ సాంప్రదాయాన్నిచక్కగా పాటిస్తూ దాన్ని ఇంకా  విస్తరింప చేయాలనే ఉద్దేశంతో చేసిన విభజన తప్ప అన్యథా కాదు. మీరిద్దరు  కూడా నాకు సమానులు. కాబట్టి మీరిద్దరూ దీన్ని నా ఆజ్ఞగా భావించి మీ విధులన్నీ మీరు చక్కగా నిర్వర్తించుకోవాలి. ఉత్తర విభాగం వైపు వాళ్ళు దక్షిణ విభాగం వైపు వెళ్ళవచ్చు.అలాగే దక్షిణ విభాగం వైపు వాళ్ళు ఉత్తర విభాగం వైపు వెళ్ళవచ్చు. అవన్నీ కూడా దస్తావేజులో పొందుపరిచాను. ఎటువంటి అనుమానాలకి, సందేహాలకి, వివాదాలకి తావు లేకుండా అన్ని వివరాలు నేను దానిలో పొందుపరిచాను. అంతే కాకుండా ఈ సాంప్రదాయానికి వ్యతిరేకంగా మరొక సాంప్రదాయం నెలకొల్ప బడడం అనేది స్వామి ద్రోహం క్రిందే భావించ బడుతుంది. ఎటువంటి పరిస్థితుల్లోను స్వామి నారాయణ గారి సాంప్రదాయం మారడానికి వీల్లేదు. అన్ని వివరాలు నేను సవివరంగా దీనిలో పొందుపరిచాను. అందుకని  మీరందరు కూడా ముందు ముందు  కలిసిమెలిసి సమాజ సేవ కోసం మనం ఇప్పుడెలా పాటుపడుతున్నామో అలాగే సోదర భావంతో కలిసి మెలిసి ఇక ముందు కూడా పాటుపడాలి అని ఆయన ప్రేమపూర్వక సందేశాన్ని ఇవ్వగా అయోధ్యాప్రసాద్, రఘువీర్ వీరిద్దరు కూడా సభాముఖంగా శ్రీ స్వామి నారాయణ గారి  సాంప్రదాయాన్ని యథాతథంగా, వారి ఆజ్ఞానుసారంగా, వారి ఆశీర్వాదంతో  మేము నడుచుకుంటూ సమాజంలో అందరికి యథావిధిగా ఈ సాంప్రదాయాన్ని విస్తరిస్తాం , దీని గౌరవాన్ని కాపాడుతాం అని మేము ప్రతిజ్ఞ చేస్తున్నామని చెప్పి వారు వివరించారు.