కిర్లెన్స్ కెమెరా
(Kirlian's camera) - ఓంకారములో ఉన్న అద్భుతశక్తి
ఈ కిర్లిన్స్ కెమెరాని
సేమ్యన్ కిర్లెన్ (Semyon Kirlian) అనే రష్యన్ సైంటిస్ట్ 1939 లో
కనిపెట్టాడు. దీని సహాయంతో ఫొటోగ్రఫిక్ ప్లేట్ సహాయంతో పరిసర ప్రాంతంలో ఉన్న వస్తువులమీద, మొక్కలమీద
ఆయన పరిశోధన చేసారు. ఆరోగ్యంగా ఉన్న మొక్క యొక్క ఆకులని ఫోటో తీసినప్పుడు ఆ ఆకు
చుట్టూ ఒక కాంతి వలయం కనిపించింది,అది చాలా ప్రకాశవంతంగా ఉంది. అదే విధముగా ఒక
బలహీనమైన మొక్క యొక్క ఆకులని ఫోటో తీసినప్పుడు అదే కాంతి వలయం బలహీనంగా
కనిపించింది. దీనిని బట్టి మొక్క ఆరోగ్యంగా ఉన్నప్పుడు వాటి యొక్క కాంతి వలయం
ఎక్కువగా ఉంటుంది. అలాగే బలహీనంగా ఉన్న మొక్క యొక్క కాంతి వలయం బలహీనంగా ఉంటుంది
అని మనకి తెలుస్తుంది. ఇదే విధంగా మనుష్యుల యొక్క ఆరోగ్య స్థితిని బట్టి,
మనస్థితిని బట్టి కాంతి వలయాన్ని సమీక్షించ వచ్చు. అదృష్టవశాత్తు నేను ఒకానొక
సందర్భంలో ఈ కిర్లెన్స్ కెమెరాను చూడగలిగాను. ఈ కెమెరా ఉపయోగించి ఓంకారం మీద ఒక
డాక్టరుగారు చాలా పరిశోధనలు చేసారు. ఆ తరువాత తను కనుక్కున్న విషయాలను
జర్నలిస్టులందరినీ పిలిచి ఒక స్లైడ్ ప్రెజంటేషన్ ఇవ్వడం జరిగింది. మొదటగా ఒక చిన్న
రాయిని కిర్లెన్స్ కెమెరాతో ఫోటో తీసారు.
దాని చుట్టూ ఎటువంటి కాంతి వలయం లేదు. తరువాత దాని ఎదురుగా కూర్చుని కొన్ని సార్లు
ఓంకారం జపించి తిరిగి కిర్లెన్స్ కెమెరాతో ఫోటో తీయగా ఆ రాయి చుట్టూ ఒక కాంతి వలయం
ఏర్పడింది. వేరే ఏ శబ్దం ఆ రాయి ఎదురుగా వినిపించినా కాంతి వలయం రాలేదు. జర్నలిస్టులలో
ఉన్న కొంతమంది క్రైస్తవులు మేము ఆమెన్ (Amen) అంటాము కదా, ఆ శబ్దము ద్వారా
వస్తుందా అని అడిగారు. మరి కొంతమంది ముస్లిములు మేము అమీన్ (Ameen) అంటాము ఆ
శబ్దము ఉపయోగిస్తే కాంతి వలయము వస్తుందా అని అడిగారు. కాని ఓంకారము తప్ప ఏ శబ్దము
ఆ రాయి వద్ద జపించినా కాంతి వలయము రాలేదు. ఓంకారము లో అంతటి అద్భుతమైన విశ్వ
చైతన్యము ఇమిడి ఉంది అని ఆయన ఈ విషయము ద్వారా నిరూపణ చేసారు. అసలు ఈ సృష్టిలో మొదట
వచ్చిన శబ్దము ఓంకారమే, అదే ప్రణవనాదము.
ఆరాల మీద మరికొంత విశ్లేషణ
సాధారణముగా మనమంతా
కూర్చుని ఒక మంచి విషయాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు, లేక మంచి కార్యక్రమము
గురించి మాట్లాడుతున్నప్పుడు అందరిలో ఒక విధమైనటువంటి ఉత్సాహాము, ఆనందము, సంతోషము ఉంటుంది.
అంటే దాని అర్థము అక్కడ ఎనర్జీ అద్భుతంగా ఉంటుంది. అందరి ఎనర్జీ కలిసి అంటే cumulative
energy వల్ల అక్కడ ఎనర్జీ యొక్క పరిమాణం చాలా పై స్థాయిలో ఉంటుంది. అటువంటి ప్రదేశంలో
ఆరా ప్రశాంతమైనటువంటి నీలిరంగు కలిగి ఉంటుంది. ఈ నీలిరంగు మనస్సు యొక్క
ప్రశాంతతని తెలియపరుస్తుంది. మనిషి
ఎప్పుడైతే చాలా ప్రశాంతంగా, హాయిగా ఉన్నప్పుడు
వారి యొక్క ఆరా ఈ నీలిరంగు కలిగిఉంటుంది. అయితే ఒక్కోసారి ఆకస్మాత్తుగా
అక్కడ ఉన్నటువంటి ఆనందకర వాతావరణంలో ఒక్కసారిగా స్తబ్ధత ఏర్పడుతుంది. దానికి కారణం
మీ ఇంటికి ఒక కోప స్వభావం, ఈర్ష్య, అసూయలు కలిగినటువంటి వ్యక్తి వస్తూ ఉంటాడు.
అతను ప్రతి మనిషిలో చెడు చూస్తాడు తప్ప మంచి చూడదు. ఎప్పుడు చాలా గంభీరంగా ఉంటాడు,
చాలా తక్కువగా నవ్వుతూ ఉంటాడు. అటువంటి వ్యక్తి మీ ఇంటి గేట్ దగ్గర ఉండగానే యిక్కడ
ఏదైతే ప్రశాంత వాతావరణంలో నీలపు ఆరాలో కొంత మట్టి రంగు చేరడం జరుగుతుంది. అతని
స్వభావంలో ఉన్న నెగటివ్ ఎనర్జీ కారణంగా అతను కొంతదూరంలో ఉండగానే ఇక్కడ సామూహికంగా
కూర్చున్న వారిలో కొంత మార్పు వస్తుంది. తీరా అతను మీరు కూర్చున్న గదిలోకి
వచ్చేసరికి మెల్లమెల్లగా ఆ ప్రదేశము ఆరా యొక్క స్వరూపం మారుతూ ఉంటుంది. ఇక్కడ
కూర్చున్న వ్యక్తులలో కనుక ఎవరైనా ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు అతి ప్రశాంతమైన
మనస్సు కలవారు కనక ఉంటే ఆ వచ్చే వారి
యొక్క స్వభావపు ప్రభావము చాలా మటుకు
తక్కువగా ఉంటుంది. అలా కాని పక్షంలో అందరు కూడా ఒక్కసారి మౌనంగా ఉంటారు, ఏమి
మాట్లాడరు. అంతే కాకుండా అక్కడ ఎవరికి
వారు ఎప్పుడు అక్కడ నుంచి వెళ్ళిపోదామా అనే స్థితిలో ఉండి ఒక్కసారిగా లేచి నాకేదో పని ఉంది అని చెప్పడం
మీరు చాలాసార్లు గమనించే ఉంటారు. రెండవ విషయం
ఏమిటంటే ఈ వచ్చిన మనిషి ఎప్పుడు వెళ్ళిపోతాడా అని కూడా మన మనస్సులో అనిపిస్తూ ఉంటుది. దానికి
కారణమేమిటంటే మన అందరిలో కూడా అయస్కాంత
శక్తి ఉంటుంది. ఇది చాలా
సున్నితమైన సూక్ష్మమైన భూమికలో ఉంటుంది. అయితే ఏ విధంగానైతే మన భౌతిక ప్రపంచంలో
ఉన్న ఆయస్కాంతమునకు మరొక ఆయస్కాంతాన్ని దగ్గరకు తెచ్చినప్పుడు ఏ విధంగా అయస్కాంత
క్షేత్రాలలో మార్పు జరుగుతుందో అంటే ఆకర్షణ, వికర్షణ ఉంటుందో సరిగ్గా ఇలాంటి
మార్పులే మనుషుల్లో కూడా జరుగుతాయి. ఒక మనిషిలోని అయస్కాంత క్షేత్రము వలన ఇద్దరు మనుషులు
పరస్పరం కొంత దూరంలో ఉన్నప్పుడు లేక కొంత దగ్గరగా వచ్చినప్పుడు వాళ్ళలో వాళ్లకి
తెలియకుండానే వారిలోని అయస్కాంత
క్షేత్రాలు ప్రభావితం చేయబడతాయి. మనము మంచి మనస్సుతో నిష్కల్మష హృదయంతో అందరినీ
ప్రేమించే శాంత స్వభావుల యొక్క క్షేత్రానికి దగ్గరగా ఉన్నప్పుడు, లేదా అటువంటి
వ్యక్తి మన దగ్గరలో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మనలో ఉన్నటువంటి ఏదైనా ఆందోళన,
ఆత్రుత, అశాంతిలాంటి భావాలు పోయి ఒక్క పది
నిమిషాలలోనే మన మనస్థితి మారిపోతుంది. ఎందుకంటే ఇక్కడ శాంతము, మంచితనము, ప్రేమ,
జాలి ,కరుణ, ఇటువంటి భావాలు ఉన్నటువంటి మనిషి యొక్క అయస్కాంత క్షేత్రము చాలా ధృడముగా,
బలముగా , స్వచ్చముగా ఉంటుంది. కాబట్టి అటువంటి అయస్కాంత క్షేత్రం ఉన్న వ్యక్తి తనకన్నా
తక్కువ స్థాయిలో ఉన్న అయస్కాంత క్షేత్రం వ్యక్తి తన దగ్గరకు వచ్చినప్పుడు వారిలో
ఉన్నటువంటి అశాంతి, భయము, కోపము, ఆందోళన ఇటువంటి నెగటివ్ ఎనర్జీలని మార్చి వేసి కొద్ది క్షణాలలోనే అటువంటి వ్యక్తి
మనస్థితిలో మార్పు తెస్తాడు. అయితే ఈ విషయాలన్నీ మీరు విన్నాక, చదివినాక, మీరు స్పృహలో ఉండి గమనించండి. కొంతమంది
పాజిటివ్ ఎనర్జీ కలిగిన వ్యక్తుల దగ్గర మనం ఉన్నప్పుడు మనలో తక్కువ స్థాయిలో
ఉన్నటువంటి ఎనర్జీ పెరిగిపోయి వారితో సమానంగా
ఆనందంగా, ఉత్సాహంగా కబుర్లు చెబుతూ ఉంటాము. అలాగే ఒక్కొక్క వ్యక్తి
దగ్గర నెగటివ్ ఎనర్జీలు పైస్థాయిలో ఉంటాయి,
అంటే కామ,క్రోధ, లోభ, మద, మోహ , మాత్సర్యాలు, ఇలాంటి భావాలు చాలా ఘనీభవించి ఎక్కువ
సాంద్రత కలిగిన అయస్కాంత క్షేత్రము ఉన్నవారు. అటువంటి వ్యక్తి దగ్గరకి వెళ్ళినప్పుడు మనలో ఉన్నటువంటి
సాత్వికత అనండి, ప్రశాంతత అనండి, ఇటువంటి పాజిటివ్ ఎనర్జీలు అన్నీ కూడా మాయమైపోయి
మనలో తెలియని మార్పు వచ్చేస్తుంది. పది నిమిషాలలో మనలో కూడా నిరాసక్తత , ఏదో
చెప్పలేనటువంటి అశాంతి కలుగుతుంది. అందుకనే మన పెద్దలు సజ్జన సాంగత్యం చేయండి అని
ఎప్పుడూ చెబుతూ ఉంటారు. మనకి ఒక్కొక్కసారి ఏ పురాణాలు చదవలేని పరిస్థితి ఉంటుంది,
జపం చేసే పరిస్థితి ఉండదు, అటువంటప్పుడు మనం చేయగలిగేది ఒక్కటే ఒక్క పని సజ్జన సాంగత్యంలో ఉండడం మాత్రమే. అలా
ఉన్నప్పుడు మన అయస్కాంత క్షేత్రం మెల్లమెల్లగా మంచి వైపు ఆకర్షించబడి మన యొక్క
భూమికలో మార్పు వస్తుంది. ఈ విధంగా నేను ఆరాల గురించి విశ్లేషించుకుంటూ ఉన్నాను.