N. Sairam Garu || Email: sridatta50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.

Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here

Sunday 24 December 2017

Anagastami Vrata Kalpam book

If anyone is interested in Anagastami Vrata Kalpam book, it is available with Sairam garu.
Please contact him for copies.

His phone: +91 7901268716
Email: sridatta50@gmail.com

Thursday 21 December 2017

Monday 18 December 2017

దేవదత్తుని వృత్తాంతం - 16

దేవదత్తుని వృత్తాంతం - 16 


నాగనాథుని సమ్యక్ విచారణ


నాగనాథుడు తన మనోనేత్రాలకు కనపడినటువంటి దృశ్యాలను అందులోని వ్యక్తులను గురించి చాల తీక్షణంగా విమర్శను మొదలు పెట్టాడు. అయ్యో ఈ భారతదేశంలో సాక్షాత్తు భగవంతుడు 9సార్లు అవతారాలు ఎత్తి ఎన్నో రకములుగా ప్రజల్ని దుష్టులనుండి రక్షించి ధర్మస్థాపన కోసం మనుషుల యొక్క మనసుల్లో ఆలోచనలతో సహా ఎలా పవిత్రంగా ఉండాలో పవిత్రమైన తను మనుష్య జన్మను ఎత్తి ఆచరించి చూపించినప్పటికి కూడా ఈ ప్రజల్లో ఎటువంటి మార్పులేదేమిటి అనుకున్నాడు.

అంతేకాకుండా సాక్షాత్తు దత్తస్వామి కూడా ఎన్నో అవతరల్లో భూమిమీద ధర్మప్రచారం, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావించి అనేక కోట్ల మందుని ఉధ్ధరించిన్నప్పటికి వారి యొక్క ఉపదేశాలు స్వల్ప కాలంలోనే మరచి, ఆయన తత్వాన్ని వక్రీకరించి తమకు అనుగుణంగా మార్చుకొని చిన్న చిన్న మాయలతో అమాయక ప్రజల్ని తప్పుదారి పట్టింస్తున్నారు. వారు భ్రష్టులవడమే కాకుండా ప్రజలని కూడా మోసం చేస్తున్నారే. ఎన్నో శాస్త్రాలు చదివిన పండితులు కూడా చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. లోకంలో ముఖ్యంగా భారతదేశంలో గోమాతకి, స్త్రీమూర్తికి, భూమాతకి ఎటువంటి గౌరవం లేకుండా చేస్తున్నారే అని వాపోయాడు.


ఎంతో మంది మేము దత్త పురాణం108 సార్లు మిగతా పురాణాలు పారాయనము చేసాము అని గొప్పలు చెపుకుంటున్నారు. వారిలో కూడా ఇసుమంత అయినా మార్పు లేదు బాగా ధర్మ విరుధ్ధంగా ప్రవర్తిస్తున్నారు.ఈ మూర్ఖ ప్రజలు కూడా వాళ్ళు చేసే చిన్న చిన్న మాయలకు మర్మాలకు లోబడి పోయి అసలు తత్వాని మరిచి దారి తప్పి ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అని చాలా రకాలుగా ఆయన విమర్శ చేసుకోవడం మొదలు పెట్టాడు.

అయినా ప్రస్తుతం నా కర్తవ్యం ఏమిటి? ఎందుకు దేవదత్తుల వారు నన్ను ఈ విధముగా గమనించమని చెప్పారు దీనిలో అంతరార్దం ఏమిటి ?అని ఆలోచించ సాగాడు. ఎక్కడ చుసినా నాకు ఒక్కడు కూడ నిజమైన దత్త భక్తులు కనబడుట లేదు.ఎంత సేపు వారి ద్రుష్టి గొప్పలు చెప్పుకోవడం,డబ్బు సంపాదించు కోవడం తప్ప మరొకటి లేదు. నిజంగా దత్తుని గురించి ఆయన తత్వాన్ని గురించి ప్రజలకి మార్గోపదేశం చేసి సంఘాన్ని ఒక్క శాస్త్రీయపరమైన మార్గంలో ఎందుకు పెట్టడం లేదు అని అనుకున్నాడు.

శ్రీ దత్త పురాణంలో సాక్షాత్తు దత్త స్వామి ఎంతో శాస్త్రీయతతో ఎన్నో విషయాలు చెప్పారు.ఆ స్వామి నేను సాక్షాత్తు భగవంతుడిని అని ఎక్కడా చెప్పలేదు. మరి ఈ చిల్లర దేవ్వుళ్ళు అందరు కూడా ఈ దత్త స్వామిని మించిపోయి ఉన్నారు. కొన్ని వేల కోట్ల ధనాన్ని పోగు చేయటం, ఆస్తులను సంపాదించడం, తనని నమ్మిన అమాయక యువతులను శిష్యురాల్లుగా చేసుకొని మోసపూరితంగా వారిని ప్రభావితం చేసి చివరికి వారిని వివాహం కూడా చేసుకుంటుంన్నారు.వారి ధన, మానాన్ని కూడ హరించి వేస్తున్నారు కదా స్వామి ఎమిటి, ఎందుకు నాకు ఈ శిక్ష? అని ఆయన పరి పరి విధాలుగా ఆలోచించడం మొదలు పెట్టాడు. సాక్షాత్తు శ్రీ స్వామి వారు కురుపురంలో తపస్సు చేసిన ప్రదేశంలోను రుక్మిని పాండురంగ ఆలయం ఎదురుగా పశువుల కొట్టంలో స్వామి దర్బారు చేసిన ఆ ప్రాగణంలోనగనాధుడు తీవ్ర ధ్యానంలో నిమగ్నులయ్యారు.

ఆయన మనో నేత్రానికి శ్రీ దేవదత్తుల వారు కనిపించి "నాయనా, నాగనాధ నీ అంతరంగం నాకు అవగతమైనది నువ్వు సాక్షాత్తు దత్తాత్రేయ నిజమైన భక్తుడివి అందుకే నీకు ఇంత ఆవేదన నిర్వేదన కలుగుతున్నది. ఈ ప్రపంచంలో ముఖ్యంగా మన భారత దేశంలో కర్మ సిద్దాంతాన్ని మహా పండితులు కూడా అపార్ధం చేసుకొని వారికి ఉన్న వాక్చాతుర్యంతో వివిధ సిద్దాంతములను ప్రవేశపెడుతున్నారు. దతాత్రేయుని యొక్క వివిధ అవతారాలను కూడా వారి భక్తులు విమర్శిస్తున్నారు. అలాగే శ్రీ పాద శ్రీవల్లభ స్వామి వారి భక్తులు శ్రీ నరసింహ సరస్వతి గారిని, షిర్డీ సాయిబాబాను కూడా విమర్శిస్తు, విపరీతమైన వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. వారే ప్రస్తుతం సమాజంలో చాలా గొప్ప వ్యక్తులుగా చలామని అవుతున్నారు. సామాజికంగా,శాస్త్రీయపరంగా అన్ని విధాలుగా యుగాలు మారుతూన్నాయి ఎన్నో మార్పులు జరుగుతున్నాయి . దానికి అనుగుణంగా ఇప్పుడు పురాణ ప్రవచనాలు చెప్పేవారు శాస్త్రీయతను జోడించి చెప్పలేక పోతున్నారు, పురాణ ప్రవచనాలు తరతరాల నుంచి వస్తున్నఅదే బానిలో చెప్పుకుంటున్నారు.

విష్ణు భక్తులు ఒంటి మీద శంకు చక్రాలను వాతలుగా పెట్టుకొని శివుని యొక్క నామశరణం చేయకూడదని భక్తుల దగ్గర విపరితమైన ప్రమణాలు చేయిస్తున్నారు.శివ భక్తులు విష్ణు భక్తులను ధ్వేశించడం,వీర శైవులు విష్ణు భక్తులను సంహరించడం చేస్తున్నారు.ఈ భారత దేశానికి మత గురువులు చేసిన ద్రోహం ఇంక ఎవ్వరు చెయ్యలేదని చెప్పడం అతిసయోక్తి కాదు. ప్రస్తుతం భారత దేశంలో ఉన్న ఈ తరం పిల్లలు ప్రజ్ఞాపుత్రులు అని వారిని వ్యవరిస్తుంటారు. వాళ్ళందరు కూడ ఈ పురాణంలో ఉన్నవాటిని పుక్కిట పురాణాలుగా తీసి పారేస్తున్నారు. శాస్త్రీయ పరంగా వారు అడిగే ప్రశ్నలకు బహుముఖ పాడింత్యం ఉందని ప్రకటించుకున్న వారు కూడా ఏమి సమాధానం చెప్పలేక పోతున్నారు.వారందరు కూడా కీర్తికి ఆశపడో, డబ్బుకు ఆశపడో తమకు తోచిన విధంగా వారు చదువుకున్న పురాణాలకు వక్చ్యాతుర్యంతో వారికి అణుగుణంగా ఆలోచించే విధంగా తయారు చేస్తున్నారు. అందుకే ప్రస్తుతం భారతదేశంలో నాస్తికత్వం ప్రభలింది.వీరబ్రహ్మంగారు చెప్పిన విధంగానే కొన్ని వేల మంది దొంగ సాధువులు,సన్యాసులు,అవదూతలు సమాజాన్ని అనేక విధంగా బ్రష్టు పట్టిస్తూ సర్వ నాశనం చేస్తున్నారు.ఇటువంటి వారి దురాగతాలని బయటికి చెప్పేవారు ఎవరు లేరు. ఎందుకంటే వారందరికి కూడా కర్మ సింద్దంతం భయపెడుతు ఉంటుంది, కాని ఈ నవ యుగ నిర్మాణ శక్తిలో ఈ పాత శక్తులన్ని కూడ కొట్టుకు పోతాయి. సాక్షాత్తు శ్రీ దత్త స్వామి చెప్పిన విధంగా ఒక్క నూతన యుగ శక్తి నిర్మాణం జరుగుతుంది. దీనికి నాందిగా చాలా మంది మహత్ములు కృషి చేస్తున్నారు. అందులో చెప్పుకో దగ్గ మహత్ముడు పండిత శ్రీ రామశర్మ ఆచార్య. కానీ ఆయనకు కూడ చాలా భక్తి భావం ఉండి ప్రియ శిష్యులుగా ఉన్నవారికి కూడ వారికి తెలియకుండానే అహం పెరిగిపోతూ ఉన్నది. వీటనింటిని కూడ నువ్వు విశ్లేషించాలి దానికి తగినట్టువంటి పరిస్థితులను అవకాశాలని ఆ విచక్షణ శక్తిని ఆ విమర్శనాత్మకమైనటువంటి ఆ జ్ఞానాన్ని నీకు దత్త స్వామి అనుగ్రహిస్తున్నాడు.ఇవన్ని కూడ నీలోనే నిద్రాణ స్థితిలో ఉన్నాయి వాటికి ఇప్పుడు అంకురార్పన జరిగింది. కాబట్టే నువ్వు నన్ను దర్శించుకోగలిగావు, నేను కూడ పనిముట్టుని మాత్రమే సుమా. కాబట్టి నువ్వు ఈ దత్త స్వామి యొక్క నూతన యుగ శక్తి నిర్మాణాన్ని ప్రజలకి చెప్పాలి. ఈ కపట సాదు సన్యాసులు గురించి నీకు అనుభవంలో వచ్చినది వివిధ పాత్రల ద్వార తెలియజేయడం జరుగుతుంది.ఇటువంటి విషయాలన్నిటిని కూడ నువ్వు నిర్భయంగా నిర్మొహమాటంగా చెప్పవలసి ఉంటుంది. ఎన్నో విమర్శలు నీకు వస్తాయి కాని నువ్వు వాటికి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా భారత దేశంలో ఇటువంటి చేదు నిజాలని వినటానికి ఎవరు కూడ ఇష్టపడరు ఎందుకంటే తర తరాలుగా వారి పెద్దల నుంచి వచ్చినదే వాళ్ళు వల్లె వేస్తు ఉంటారు తప్ప వారిలో ఒక్క విమర్శనాత్మకమైనటువంటి జ్ఞానం ఉన్నప్పటికి కూడ వారికి ఎన్నో సందేహాలు ఉన్నప్పటికి వాటిని భయటికి చెప్పటానికి మాత్రం భయపడుతుంటారు కాబట్టి నువ్వు ఈ పనిని చేయడానికి ఎంచుకోబడ్డావు నాయనా కాబట్టి ఈ నిర్వేదాన్ని పోగొట్టుకో అని మరి కొన్ని యోగ రహాస్యాలు ఆయనకు వెల్లడించి ఆయన మాయమైపోయాడు."



Sunday 10 December 2017

Aayurvedam-01

 We are happy to announce telugu version of Aayurvedam series from now onwards in this site.
Please listen to Introduction and first part by Sairam garu today.

Click below links to listen.

https://drive.google.com/open?id=1NAfAwzq8kxSZfBlU6w2RLt702TrB9TG4  Aayurvedam Introduction - Sairam Nanduri 


https://drive.google.com/open?id=1-rujAtJ2YwOBYD20KYQQ9_KRnl7aDCP5  Aayurvedam Part-1 - Sairam Nanduri 


Sunday 3 December 2017

Datta Jayanthi Wishes

We wish all of our visitors Datta Jayanthi Subhakanshalu.
Today is auspicious Datta Jayanthi.


Tuesday 19 September 2017

దేవదత్తుని వృత్తాంతం - 15

దేవదత్తుని వృత్తాంతం - 15

నాగనాథుని నిర్వేదన


దత్తస్వామి మరియు శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారికి భక్తుడైన నాగనాథునికి తాను చూస్తున్నదాంట్లో  దత్తభక్తులుగా తమని తాము చెప్పుకుంటున్న కపట స్వాములను తలచుకొని ఎంతో నిర్వేదన కలిగింది. ఒకప్పుడు పరశురాముడికి కూడా ఇలాంటి నిర్వేదన భావం కలిగింది. సాక్షాత్తు దత్తస్వామి అవతారమైన శ్రీపాదులు భూమిమీదకు వచ్చి ఎంతోమంది ప్రజలను ఉద్ధరించ వెళ్లిపోయిన అనతి కాలంలోనే ఇలాంటి వాళ్ళు ఎంత దుర్మార్గులుగా ప్రవర్తిస్తున్నారు. అసలు ఆ దత్తాతత్వాన్ని ఎవరు అర్థం చేసుకోవడం లేదేమిటి అని, శ్రీపాదుని      పేరు చెప్పుకొనో లేదా నృసింహ సరస్వతి పేరు చెప్పుకొనో, షిరిడీ సా యిబాబా మహిమల గురించి పైకి చెప్పుకొనో అమాయక ప్రజల విశ్వాసాలను సొమ్ముచేసుకుంటున్నది చూసి  చాలా మదన పడ్డాడు. అయితే అతనికి ఒక సారి సాక్షాత్ శ్రీపాద శ్రీవల్లభ స్వామి తపస్సు చేసుకొనే ప్రదేశానికి వెళ్లి అక్కడ కూడా ప్రస్తుత పరిస్థితులు ఎలావున్నాయి అని గమనించాలని సంకల్పం కలిగింది.

అతను తన సంకల్ప శక్తితో తత్ క్షణం స్వామివారు తపస్సు చేసుకున్న కురువపుర క్షేత్రానికి వెళ్లడం జరిగింది. అక్కడ సాక్షాత్తు శ్రీపాదులు తపస్సు చేసుకున్న ప్రాతం ఎటువంటి సౌకర్యాలు లేకుండా పురతనంగా ఉండటం గమనించాడు. కానీ అక్కడ నియమింపబడ్డ బ్రహ్మణోత్తములు శ్రద్ధగా మడికట్టుకొని ఆ కృష్ణానది  పాయ నుండి నీళ్లు తీసుకొచ్చి స్వామివారికి అభిషేకాలుచేస్తూ నిత్యపూజలు నిర్వహిస్తున్నారు.శ్రీవల్లభ స్వామివారు ఇచ్చిన ఆదేశాలప్రకారం ఒక కన్నడ బ్రాహ్మణ కుటుంబాన్ని కర్ణాటక రాష్ట్రంలోని ధార్వార్ నుండి తీసుకురావడం జరిగిందని ఆ వచ్చిన బ్రాహ్మణ కుటుంబం వారు అక్కడ పరిస్థితిని గమనించి నాలుగు వైపులా నీరువున్న ఆ ద్వీపాన్ని చూసి, మేము ఇక్కడ ఎలా జీవించగలం అని వాపోయారు.దత్త స్వామి ప్రియ శిష్యుడైన శ్రీ టెంబేస్వామి అక్కడి భక్తుల సహకారంతో శ్రీస్వామివారికి చిన్న ఆలయం కట్టించి, ఆ బ్రాహ్మణ కుటుంబాల అన్నదమ్ముల ఇద్దరికి నివాస యోగ్యమైన రెండు ఇళ్లను కట్టించి, వారి జీవనోపాదికై కొంత మంది భూస్వాముల సహాయంతో భూములను దానం చేయడం జరగడంతో వారు అక్కడే స్థిర నివాసం ఏర్పర్చుకోవడం జరిగింది. ఈ విధంగా స్వామి వారు ఆ రెండు కుటుంబాలను తన సేవకు నియమించుకున్నారు.

ఇప్పటికి ఆ కుటుంబాలకు చెందిన తరాలవారే వంతుల వారీగా స్వామివారి సేవచేసుకుంటూ భక్తులు ఇచ్చే కానుకలతో తమ జీవనాన్ని గడుపుకుంటున్నారు.భక్తులు ఇచ్చే సంబారాలతో మడికట్టుకొని చేసిన పదార్థములతో అన్నదానాలు చేస్తువున్నారు.ఆ కుటుంబీకులను భట్టాక కుటుంబీకులు అంటారు. స్వామివారు ప్రతినిత్యం కృష్ణా నదిలో స్నానం ఆచరించి సూర్యనమస్కారాలు చేసిన తరువాత నీటిమీద నడుచుకుంటూ రుక్మిణి పాండురంగని ఆలయానికి ఎదురుగా ఉన్న పశువుల పాకలో రోజూ దర్బార్ చేస్తుండేవారు అని తెలిసి అటుగా వెళ్లి చూసి నాగనాథునికి చాలా మనస్తాపం కలిగింది.ఆలయం పర్యవేక్షణ లేక పడుబడి, పశువులకు నివాసమై వాటి విసర్జన పదార్థములతో, భరించరాని దుర్గంధంతో నిండిఉన్నది.ఆలయంలో పూజావిధులు లేక పాడుబడివున్నది, పాండురంగని ఆలయం చూసి చాలా కలత చెందాడు.దత్త జయంతి రోజున, పుణ్య తిధుల రోజులలో అక్కడికి వచ్చిన భక్తులు సరైన వసతులు లేక రుక్మిణి ఆలయం వెనుక ఉన్న కాలి నడక దారిలో వచ్చి తొట్టిలో కూచుని కృష్ణా పాయనిదాటి వచ్చి శ్రీపాద స్వామిని దర్శించుకోడం గమనించాడు.ఆలయానికి వంశపారంపర్యంగా వస్తున్న ధర్మకర్తృత్వాన్ని నిర్లక్ష్యం చేస్తున్న కులకర్ణి కుటుంబాన్ని తలుచుకొని బాధవేసింది.ఆప్రదేశాన్ని పంచదేవపహాడ్ అని పిలుస్తారని తెలుసుకున్నాడు, కాలచక్రం అతని కళ్ళముందు వేగంగా తిరిగింది.

ఆయనకు ఒక సాధువు దత్తస్వామి భక్తుడు ఒకరు తన అనుచరులతో భక్తుల సౌకర్యార్థం ఆ ఆలయం వద్ద మెట్లు కట్టించి వారు తొట్టిల్లో ఆవలి వడ్డుకు చేరడానికి అనుకూలం కల్పించాలి అని  సంకల్పిచారు.స్థానికుల సహకారంతో ఆ జిల్లా అధికార యత్రాంగంతో సంప్రదించి ఆ ఆలయప్రాంగణాన్ని శుభ్రపరచి భక్తులద్వారా వచ్చిన విరాళాలు సేకరించి భక్తులకు సౌకర్యాలు కల్పించడం నాగనాథునికి సంతోషం కలిగించింది.మరియు శ్రీపీఠికాపురం సంస్థానం వారు ఈ ఆలయ ప్రగనంలో నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.ఈ ప్రక్రియ వెనుక ఒక బెంగాలీ సాధువు   యొక్క పట్టుదల శ్రమ ఉందని తెలిసి నాగనాథుడు సంతోషించాడు.కానీ నిధుల కొరత వల్ల ప్రతినిత్యం రుక్మిణీ పాండురంగని ఆలయం లో దీపారాధన కార్యక్రమం నిర్వహించడానికి సాధ్యపడలేదు.ఐతే పరిస్థితులు మెల్లగా మార్పులురావడం నాగనాథునికి సంతోషాన్ని ఇచ్చింది. స్వామి వారు తపస్సు చేసిన ప్రదేశంలోను, రుక్మిణీ ఆలయంలోను ధ్యానం చేసుకుంటూ సమయం గడపడం చేసాడు.

శ్రీవాసుదేవనంద సరస్వతి (శ్రీ టెంబే స్వామి)  ఏవిధంగా అయితే ధ్యానంలో శ్రీపాదస్వామి జన్మస్థానాన్ని కనుగొన్నారో అదేవిధంగా స్వామివారి తపస్సుచేసుకున్న స్థలం వెతుకుతూ పాండురంగని ఆలయానికి రావడం, అది క్రీస్తు శకం 1238వ సంవత్సరంలోనే నిర్మింపబడటం, అక్కడ బసచేసి స్వామివారు ధ్యానం లో శ్రీపాద స్వామి తపస్థానం, దర్బార్ ప్రదేశం, కురువపురం  కనుగొన్నారు అన్న విషయం నాగనాథుని మనోగతానికి అర్థం అయింది.
మిగిలిన విషయాలు తరువాయి భాగంలో.

Tuesday 12 September 2017

దేవదత్తుని వృత్తాంతం - 14

దేవదత్తుని వృత్తాంతం - 14


ఇలా ఆ స్వామి వారి నుండి. కబురు రాగానే సుమతి తల్లిదండ్రులు వారి కుమార్తె ని తీసుకొని ఆయన దగ్గరకు వెళ్ళటం జరిగింది. అప్పటికే రాత్రి 9:30 కావస్తున్నది. అక్కడ చాలా మంది భక్తులు  ఏవో భజనలు పాడుకుంటున్నారు. కొంత మంది ఉన్మాద స్థితి లో ఉండి ఎంతో పరవశంతో రకరకాల హావభావాలతో నాట్యం చేస్తున్నట్టుగా ఊగిపోతున్నారు మరియు పాటలు పాడుతున్నారు. ఎంతో కొంత కవిత్వం తెలిసిన వారు ఆ స్వామి వారి మీద  ఎన్నో పాటలు కట్టి మహిమలు పొగుడుతూ రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ  పాడుతున్నారు . ఆ స్వామి వారి మీద ఆఖరికి అష్టోత్తర శత నామావలి చదివి ఆయనకి హారతి ఇచ్చారు. చాలా మంది భక్తులు ఆ హారతి పళ్ళెంలో చాలా డబ్బులు వేయటం జరిగింది. వచ్చిన వాళ్ళందరికీ కాఫీలు, టిపినీలు సమర్పించుకున్నాక అందరూ వెళ్లిపోయారు. ఈ తతంగం అయిపోయే సరికి 10:30 అయింది. స్వామి వారు అందర్నీ పంపించివేసి సుమతి తల్లిదండ్రులను బయటికి పంపించివేశారు. మీ కుమార్తె కు వచ్చిన భయం ఏమీ లేదు నా రక్షణలో ఉంటుంది. మీరు సుఖంగా మీ ఇళ్లకు వెళ్ళండి అని చెప్పగా వారు అలాగే స్వామి అని బదులిచ్చి  నిష్క్రమించారు. కానీ ఇంటికి వెళ్ళాక రాదమ్మ గారు రహస్యంగా ఆ స్వామి వారు బస చేసిన ప్రదేశం దగ్గరకి వచ్చింది.


ఈ లోపల వల్లభదాసు అనుచరులందరు కూడా నిశ్శబ్దంగా ఎవరికి ఏ మాత్రం అనుమానం రాకుండా అక్కడే చుట్టుపక్కల తిరుగుతున్నారు. నిద్ర నటిస్తున్నారు. చాలా మంది సిఐడి పోలీసు శాఖ వారు మారువేశాల్లో జనం మధ్యలో తిరుగుతూ, అందరిని గమనిస్తూ, వాళ్ళు కూడా నిశ్శబ్దంగా వారికి వచ్చిన ఆదేశాల విధంగా వారి వారి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. కొంత మంది మహిళ పోలీసులు భజనలు చేస్తున్న వారిలో కలిసిపోయి ఎవరికి ఏ మాత్రం అనుమానం రాకుండా సుమతి ఉన్న గదిలోనే ఉండటం జరిగింది. ఆ గదిని ఆనుకొని ఉన్న గదిలో ఇంకొక మహిళా పోలీస్ మామూలు సాదాసీదా దుస్తుల్లో ఉండి అన్ని గమనిస్తుంది. అక్కడ ఒక స్త్రీ రహస్యంగా వచ్చి ఎవరు లేరనే ధీమాతో పాలలో పొట్లం లోని మందు కలపటం, ఆ కలిపిన మందు సుమతికి ఇవ్వబోతుందని గ్రహించిన ఆ మహిళ పొలీస్ నిశ్శబ్దంగా ఆ స్త్రీని వెనక నుంచి పట్టుకొని, నోరు నొక్కి ఆమె కాళ్ళు చేతులు కట్టి మామూలు పాలగ్లాసుని తీసుకొని సుమతి ఉన్న గదిలోకి వెళ్లి రహస్యంగా ఏం భయపడకు సుమతి నేను ఉన్నాను నీకు రక్షణగా అని చెప్పటంతో  ముందే పథకం అంతా తెలిసిన సుమతి నిబ్బరంగా ఉండిపోయింది. ఆ గది మొత్తం పోలిసు వారు మారు వేశాల్లో ఉండి అంతా గమనిస్తుండగా ఈ లోగా స్వామి వారు సుమతి ఉన్న గదిలోకి ప్రవేశించారు. ఒళ్ళంతా సుగంధ పరిమళాలు చల్లుకుని వచ్చి అతను వచ్చి రాగానే అమ్మాయి నీకు ఏం భయం లేదు నేను సాక్షాత్తు అవదూత స్వామిని కాబట్టి నీ వ్యాధిని నయం చేస్తాను నన్ను మాత్రం నువ్వు సేవించుకో అని సమీపంగా రాసాగాడు. అతని నోటినుంచి గంజాయి వాసన రావటంతో సుమతి తల తిప్పుకున్నది. మనసులో ఆమె శ్రీపాద శ్రీ వల్లభుల స్మరణ చేస్తోంది. ఎప్పుడైతే ఆ స్వామివారు ఎవరు లేరనే ధీమాతో వచ్చి ఇక్కడ నువ్వు ఎంత అల్లరి చేసినా ఎవరు నీ సహాయానికి రారు కాబట్టి మర్యాదగా నేను చెప్పిన మాట విను  అని ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. అదే సమయంలో ఆ గదిలో లైటు వెలిగి ఆ స్వామి వారికి అర్థం అయ్యే లోపలే పోలీసు వారు అతన్ని చుట్టు ముట్టి బందించివేశారు. అంతకుముందే వారు వచ్చి తమకు కావాల్సిన సాక్షాలన్నీ సేకరించారు. వారి అనుచరులని ముందే గుర్తు పట్టి బందించివేసి, వారిని ప్రశ్నించసాగారు.  ఇంతైనా కూడా ఆ స్వామివారి మత్తు ఇంకా దిగలేదు. సుమతి బయట ఉన్న తన తల్లిని కౌగిలించుకుని ఆ శ్రీ పాద శ్రీ వల్లభ స్వామిని స్మరించకుంటూ ఉన్నది.


ఈ విషయం తెలిసిన ప్రజలంతా, భక్తజనులంతా రావటం అక్కడ చేరిన ప్రజలందరికీ కూడా స్వామివారి అనుచరులు ఒక్కో క్కలు  స్వామివారి రహస్యాలు బయట పెట్టటం జరిగిపోయినాయి. సాయిబాబా భక్తునిగా చెప్పుకున్న ఆ జగతాప్ గారు చడీ చప్పుడు లేకుండా మాయమైపోయినాడు. ఆశ్రయం ఇచ్చినటువంటి శ్రీ  రంగారావుని విచారించగా  ఆయన ఏమీ తెలియని అమాయకుడని ఈ రంగబాబు రంగదాసు అనే ముఖ్య అనుచరుడు స్వామివారి కి లేనిపోని మహిమలు ఆపాదించటం వల్ల అతను తన ఇంటిని ఆ స్వామి వారి బస కింద ఇవ్వటానికి ఒప్పుకున్నాడని  తెలిసింది. ఈ కపట అవదూత గారిని సోదా చేసినప్పుడు పది లక్షల పైన రొక్కం, కొన్ని .కిలోల బంగారం, వెండి పోలీసు వారు పట్టుకున్నారు. చాలా గొడవ అయినాక స్వామి వారికి కర్ణాటక దేశంలో కూడా పెద్ద పెద్ద ఆస్థులున్నాయని కోట్ల విలువ చేసే భూములు ఉన్నాయని ఎన్నో రకాల అక్రమాలు చేశాడని తెలియటంతో అతనికి పడవలసిన కారాగార శిక్ష పడింది. పోలీసు వారు ప్రజాలనందర్ని ఉద్దేశించి ఇటువంటి కపట అవదూతలని, స్వాములని మీరు నమ్మవద్దు అని, పరి పరి విధాల వల్లభదాసు గారిని ఎంతో మెచ్చుకొని ఆయన అక్కన్నించి వెళ్లిపోయారు. అక్కడ ప్రజలందరూ కూడా  వల్లభదాసు గారిని చుట్టుముట్టి ఎంతో మెచ్చుకొన్నారు. సుమతి తల్లిదండ్రులు కూడా అభినందించారు.




అయితే వల్లభదాసు నిర్లిప్తంగా శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి ఇచ్చిన ప్రేరణ తొనే ఈ పనులు చేయగలిగానని తాను నిమిత్తమాత్రుణ్ణి అని ఏమి జరగనట్టుగానే ఆయన మాట్లాడారు. శ్రీ పాద శ్రీ వల్లభ స్వామిని లేదా దత్తాత్రేయ స్వామిని పట్టుకున్నప్పుడు ఇటువంటి మధ్యవర్తుల దగ్గరికి వెళ్లకూడదని సాక్షాత్తూ శ్రీ సాయి సచ్చరిత్ర లో కూడా నీకు నాకు మధ్యలో ఈ అడ్డుగోడలు ఎందుకని సాయి చెప్పినట్టు మరియు శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతం అనేక ఘట్టాలని ఆయన వివరిస్తూ అవదూత అనే పదానికి నిర్వచనం అంతా పోయిందని అవదూత అంటే పెంట కుప్పలపై బీడీ చుట్ట సిగరెట్లు ఏరుకొని మురుగు కాలువలో నీళ్లు తాగుతూ బండ బూతులు తిడుతూ జుట్టంతా చింపిరిగా ఉండి చినిగిపోయిన బట్టలతో స్నానం లేకుండా ఉండేవాడు తనలో తాను గొణుక్కుంటూ ఉండేవాడు అని ఈ కలియుగంలో అవదూతలకి నిర్వచనం ఇవ్వబడింది కానీ నిజానికిశ్రీ దత్త పురాణంలో సరె దత్త స్వామి వారునేను అవదూతను అని చెప్పుకోవడం జరగలేదు. అవదూత అంటే కేవలము శ్రీ దత్త స్వాముల వారే తప్ప ఇంకా ఎవరు కాదని, కేవలం దత్త స్వామి ఆశీర్వాదంతో  శ్రీ పాద శ్రీ వల్లభుల ఆశీర్వాదంతో మాత్రమే అనన్య భక్తి భావంతో ఉన్న వ్యక్తికి వెంకయ్య స్వామిగా అవదూత తత్వంతో ఉంటావని చెప్పటం తప్పితే , శ్రీ స్వామివారిని మించిన అవదూత రెండోవాడు లేడని, మీరు ఎప్పుడూ మూలాన్నే పట్టుకొని ఉండాలని మాయలు,మర్మాలు, గోసాయి చిటికెలు చేసేవారి దగ్గరికి కనీసం వెళ్ళను కూడా వెళ్లకూడదని , ఎంతో వినయంగా నమ్రతగా అక్కడికి వచ్చిన జనాన్ని అందర్నీ సంబోదిస్తూ చాలా చక్కగా చెప్పటం జరిగింది. అక్కడికి వచ్చిన వారందరు కూడా వల్లభదాసుకి, శ్రీ పాద శ్రీ వల్లభులకి జయ జయ ధ్వనులు పలుకుతూ తాము చేసిన తప్పుకి లెంపలు వేసుకొని, ఇంటికి వెళ్లి ఆ కపట అవదూత ఛాయా చిత్రాలసు అవతల పారవేసి కేవలం ముందు ఇక దత్తస్వామి అవతారాలు మాత్రమే పట్టుకుంటామని ఎంతో భక్తి భావంతో ప్రతిజ్ఞ చేశారు. ఇదంతా గమనిస్తున్న నాగనాథునికి శ్రీ వల్లభ దాసు చేసిన మంచి పనికి ఎంతో సంతోషించారు. అప్పటినుంచి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో నేను దత్త భక్తున్ని, అవదూతని అని చెప్పుకునేవారు దరిదాపుల్లో రాలేదు. అంతేకాదు చాలామంది దత్త భక్తులుగా, శ్రీ పాద భక్తులుగా మారిపోవటం జరిగింది.

Wednesday 23 August 2017

Vinayaka Chaviti Wishes


Happy Ganesh  Chaturdhi and Sripada Sreevallabha Jayanthi to readers.


Importance of Ganesh Chaturdhi - message from Sairam Garu:  Click here to listen.

Friday 11 August 2017

దేవదత్తుని వృత్తాంతం - 13

దేవదత్తుని వృత్తాంతం - 13



ఇదంతా చూస్తున్న నాగనాథునికి ఈ కొత్త శిరిడి సాయి బాబా భక్తుని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కలిగింది.  వెంటనే అతను ఆయన్ను ఆయన జీవిత చరిత్ర గురించి తెలుసుకోవాలని సంకల్పించ గానే ఆయనకు మనోనేత్రము ముందు చాలా స్పష్టంగా ఆయనను గురించిన విషయాలు  తెలిశాయి. అతని పేరు జగతాప్ అని భారత ప్రభుత్వం లో ఆర్మిలో కొంతకాలం పని చేసి రిటైర్ అయ్యారని పరమ శిరిడి బాబా భక్తుడని, ఆయనకు సాక్షాత్తు శిరిడీ సాయి బాబా సంస్థానం లో రాచ మర్యాదలతో అసలు సమాధి అంటే ప్రస్తుత సమాధి కింద ఉన్న మరొక సమాధి ఉంటుంది. అదే సాయి బాబా గారి అసలు సమాధి. ఆయనను అక్కడి దాకా ప్రవేశం నిరాటంకం గా ఉంటుంది అని తెలిసింది. అతను శిరిడీ కి ఎప్పుడు వెళ్లినా శ్రీ సాయిబాబాకు పెట్టిన పదార్థాలన్నింటిని ఆయనకు మరియు అతని అనుచరులకు వడ్డిస్తారని తెలిసింది. ఆయన చేతిలో అద్భుతమైన వ్యాధి నివారణ శక్తి ఉందని ప్రచారం జరిగింది. అనేకమంది ధనవంతులతో అతనికి పరిచయాలు ఉన్నాయని తెలిసింది. అయితే ఎవరైనా అతన్ని  వారి గ్రామాలకు, పట్టణాలకు గాని పిలిపించుకోవాలంటే ఆయన విమానంలో రాను పోను ప్రయాణ ఖర్చులు భరించాలి. ఖరీదైన హోటల్లో ఆయనకు బస.  24 గంటలు ఆయన ఉన్నంత వరకు కారు కేటాయించబడాలి అని ఆయనకి తెలుస్తూ ఉన్నాయి.  మరి ఆయన మహారాష్ట్ర వాసి అని గ్రహించారు. మరునాడు పెద్ద గుడారాలు వేయటం జరిగింది. అయితే ఇక్కడ ఎటువంటి రుసుము స్వీకరించబడలేదు కానీ మన ఆచారం ప్రకారం అక్కడకి వచ్చిన  రోగులందరు ఎంతో కొంత దక్షిణ, కొన్ని పలహారాలు ఇవి సమర్పించటానికి వచ్చారు. అంతక్రితం రోజు దత్త యజ్ఞం చేసిన ఒక వ్యక్తికి మెడ బాగం దగ్గర ఎముకలు అరిగి బాధ పడుతున్నాడని ముందుగా ఆయన్ని రమ్మని చెప్పి విభూతి తీసుకొని ఆయన నుదిటిపై పెట్టి ఆయన మెడ అంత రాస్తూ శ్రీ సాయి నాథుని పేరు 11 సార్లు ఆయనతో చెప్పించసాగారు.



ప్రతి రెండు నిమిషాలకు మీకు తగ్గిందా మీకు తగ్గిందా తగ్గిపోయిందా అని  అనటంతో అంతకుముందే చాలా పెద్ద మొత్తంలో దక్షిణ సమర్పించటంతో చాలా మోహమాటనికి తగ్గింది అని చెప్పటం నాగనాథునికి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆ వ్యక్తి యొక్క శ్రీమతి భర్త చెప్పింది నమ్మింది. ఆమె కూడా తనకి కింది భాగంలో చాలా బాధగా ఉందని చెప్పటంతో ఆయన ఒక్క క్షణం కూడా సందేహించకుండా వేల మంది చూస్తుండగా తన చేతిని ఆమె చీర లోపలి భాగం నుంచి పైకి వెళ్లి ఆమె తొడలను స్పర్శిస్థూ  ఆమె నడుము నొక్కుతూ శ్రీ సాయి నాథుని పేరు 11 సార్లు చెప్తూ విభూతి రాస్తూ మీకు తగ్గిందా తగ్గిందా అని అనడంతో ఆమె నిర్గాంతపోయింది. అంతమంది జనం ముందు ఈ విధంగా సాహస కృత్యం చేస్తాడని ఆమె ఏనాడు ఊహించలేదు. ఆమె గాబరా పడిపోయి తగ్గలేదు అంటే ఆ చేయిని ఇంకా ఎక్కడికి తీసుకువెళ్తాడో అని తగ్గింది తగ్గింది చెప్పటం, అతను మెల్లగా చేయి తీసేయటం జరిగే సరికి అక్కడ వల్లభదాసుకి, అతని అనుచరులకి భాద కలిగింది, కోపం కూడా వచ్చింది. ఇంకా అతన్ని లోతుగా పరిశీలిస్తే నాగనాథునికి అతను శిరిడి సాయిబాబా పరమ భక్తుడైన శివనేషన్ స్వామి ఒక తమిళుడు . శిరిడీ లో ఉన్న ఊరు స్థానం ఎదురుగా మెట్లదారికింద ఉన్న చిన్న గదిలో ఉంటూ బాబా గారిని గురించి కొన్ని ఏళ్లు ధ్యానము చేస్తున్న మహాత్ముడు. ఆయన పరమపదించాక శిరిడిలొనే ఒక చోట సమాధి చేసి అక్కడే ఒక ఆశ్రమం ఏర్పరచటం జరిగింది. అక్కడ శిరిడ సాయి బాబా తెలుగు చరిత్రను అనువదించి, ఎన్నో దత్త యజ్ఞాలు చేసిన  సాధకుడు దత్త యజ్ఞం చేస్తున్నప్పుడు కూడా ఆ బ్రాహ్మణుని భార్యతో ఇదే విదంగా ప్రవర్తించడం తో ఆమె సిగ్గుతో చితికిపోయింది.



ఇలా జగతాప్ గారు చేసిన చికిత్స లో చాలా మందికి  గుణం కనిపించలేదని , ఒక వేళ గుణం కనిపించకపోతే మీ ప్రారబ్ద కర్మ బలంగా ఉందని సాకుతో తప్పించుకొనేవాడు. ఇవన్నీ నాగనాథుని మనో నేత్రం ముందు ఒక చలన చిత్రం లాగా కన్పించసాగాయి. ఒకవేళ చిన్న చితక వ్యాధులు తగ్గే అవకాశం ఉన్న ఇదంతా ఆ జరిగిన అద్బుతాలని జగతాప్ గారికి ఆపాదించటం, బాబాని స్మరించకపోవటం చూసి కూడా ఆయన కొంతగా బాధ పడ్డాడు. ఈ ప్రారబ్ద కర్మ సిద్ధాంతం జనాలు ఎంతగా అపార్థం చేసుకుంటున్నారు. పండితులు కూడా విపరీతమైనటువంటి అసంబద్దమైనటువంటి  తర్కానికి అందనంతగా దత్త బోధనలకు వ్యతిరేకంగా పలు భాష్యాలు చెప్పటం కూడా ఆయనకు కించిత్తు భాద కలిగించింది. జనులు ముఖ్యంగా పండితులు పామరులు  కూడా ఎంతో అజ్ఞానంలో ఉన్నారు. సాక్షాత్తు దత్తుని నమ్ముకున్నవారు కూడా ఇటువంటి మధ్యవర్తుల ఛాయా చిత్రాలను పూజ మందిరంలో పెట్టుకోవటం వాళ్ళను ప్రార్థించటం, గది నిండా ఇటువంటి సాధువులు ఉండటం మధ్యలో శ్రీ పాద స్వామి మరియు దత్తాత్రేయుల వారి పటం ఉండటం చూసి ఆయన జనం ఎంతగా దత్తాత్రేయ తత్వానికి దూరంగా ఉన్నారా అని కూడా అనుకున్నారు. వల్లభ దాసు కూడా తన అనుచరులను ఆయన దగ్గరికి పంపటం, వారందరు వచ్చి జరుగుతున్న మోసాన్ని చెప్పటం ఈయన గ్రహించారు. అదే సమయంలో ఎంతో మంది మహిళలు వచ్చి జరుగుతున్న తతంగాన్ని ఫోటోల రూపంలో చిత్రీకరించడం అది ప్రతివాళ్ళు కూడా ఏదో మాములు విషయాన్ని గ్రహించినట్టుగా ఉన్నారు.



ఈలోగా ఆ స్వామి వారు సుమతి తండ్రికి కబురు చేసి ఏమయ్యా ఐదు రోజులు అయిపోయింది మరి ఎప్పుడు పంపిస్తావు వ్యాధి ముదిరితే కష్టం కదా అని చెప్పటంతో స్వామి నేను ఈ రాత్రి తీసుకొస్తాను అని చెప్పటం జరిగింది. సుమతి తండ్రి ఇంటికి వచ్చి రాధమ్మకి, సుమతికి కూడా చెప్పి స్వామి వారు రాత్రి తీసుకురమ్మన్నారు కాబట్టి మనం వెళ్దాం తప్పకుండా మన సుమతికి తెలియనటువంటి అంతులేని వ్యాధి తగ్గిపోతుందని నాకు నమ్మకం ఉందని పదే పదే చెప్పటం జరిగింది. అయితే రాధమ్మకి సుమతికి కూడా చాలా దైర్యం కలిగింది. శ్రీపాద స్వామి తమని తప్పకుండా కాపాడతాడానే ఒక గట్టి విశ్వాసం వారికి కలిగింది. ఆ ధైర్యంతోనే వారు రాత్రి తొమ్మిది గంటల తర్వాత వారి నివాస స్థానానికి వెళ్ళటం జరిగింది .

దేవదత్తుని వృత్తాంతం - 12

దేవదత్తుని వృత్తాంతం - 12

వల్లభదాసు పథకం,

 జిల్లా కలెక్టర్ గారు జవాబుగా ఇచ్చిన ఉత్తరంతో వల్లభదాసుకు దత్త ప్రభువు సహాయంతో సమస్య తొలగుతుంది అని నమ్మకం కుదిరి స్వామి వారి పూజలో నిమగ్నం అయ్యాడు. అదే సమయంలో సుమతి అనన్య భక్తితో శ్రీపాదశ్రీవల్లభ స్వామి వారి గురించి అహర్నిషలు ధ్యానం చేస్తోంది. జిల్లా కలక్టర్ గారు అన్ని జిల్లాల యంత్రాంగానికి కపట సన్యాసి చిత్ర పటాలతోసహ హెచ్చరికలు పంపారు. దాంతో రాష్ట్రయంత్రాంగం అంతా కదలింది. అయితే ఈవిషయాలను అన్నింటిని రక్షణ ద్రుష్ట్యా గోప్యంగా ఉంచడం జరిగింది. వాల్లు కొన్ని రహస్య వ్యూహాలు చేసి వాటికి అనుగుణంగా ఎంతో మంది ఈ చర్యల్లో పాల్గొనడానికి సాధారణ దుస్తుల్లో రావడం వంటి జాగ్రత్తలు కుడా తీసుకున్నారు.మరునాడు జరగబోయే దత్త యాగానికి వేలసంఖ్యలో భక్తులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులు చాలా మంది ముందుగానే ధన విరాళాలు, వస్తు విరాళాలు,యాగసామాగ్రి విరాళాలు ఇచ్చారు.  అక్కడ ధనవంతులైన భక్తులకు అగ్రస్థానం ఇవ్వడం జరిగింది. దాదాపు 20 కుండీల యాగం ప్రారంభం అయ్యింది. దీన్ని వీక్షించేందుకు ఎంతో మంది దత్త మహా యజ్ఞంలో  పరిపక్వత సాధించినటువంటి  ఘనాపాటీలు కూడా కర్ణాకర్ణిగా స్వామివారి గురించి విని అక్కడకు విచ్చేయడం జరిగింది, అసలు విషయాలు వారికి కూడా తెలియదు. ఈ ఘనాపాటీలు అందరూ వయోవృద్దులు, వారిని ఎవరు ఆహ్వానించక పోయినప్పటికి దత్తస్వామిపైన వున్న భక్తితో వారే స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి వచ్చారు. 




వయసు అనుభవము ఉన్న వృద్ధ బ్రాహ్మణులు అంతా అక్కడ జరిగే తంతు చూసి విస్తుపోయారు.అక్కడ ఎటువంటి మంత్రోచ్ఛటన లేదు, కాసేపు "దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర" అనే నామజపం, తరువాత ఆ సన్యాసి పేరుతో నామాజపం చేస్తూ అక్కడ వచ్చిన పేద, ధనిక అను భేదం లేకుండా అందరిచేత ఖరీదైన ఆవునెయ్యిని ఆహుతులుగా వెయిస్తున్నారు. భక్తి భావం లేకుండా హవనం పొడిని కూడా ఇష్టం వచ్చునట్టు యజ్ఞంలో చల్లడం చేస్తున్నారు.అక్కడ యజ్ఞ విధి అంతా విధి పూర్వకంగా కాకుండా, యాంత్రికంగా జరిగిపోతోంది. భక్తజనం కూడ క్రమశిక్షణ లేకుండా తోసుకోవడం వంటివి చేస్తున్నారు.


మన  సనాతన ధర్మంలో వేదాలకు, యాగాలు ఒక విశిష్టమైన స్తానం ఉన్నది.  దానిలో మంత్రశాస్త్రం ఒకభాగం, స్వయంగా దత్తస్వామి వారు వేదాలను ఎంతో గౌవరవించేవారు, గాయిత్రి యజ్ఞం విధిపూర్వకంగా చేస్తూవుండేవారు. ఎందుకంటే గాయత్రియందే సమస్త శాస్త్రం ఇమిడి ఉంది. శ్రీపాద చరితామృతంలో స్వామి స్వయంగా "అహర్నిశలు ఎవరతే నా నామజపం చేస్తారో వారికి స్వయంగా దర్శనం ఇస్తాను" అని చెప్పారు. కాని ఇక్కడ జరిగే ప్రక్రియ శాస్త్రవిరుద్ధంగా ఉన్నది. అక్కడ చేరిన బ్రహ్మణోత్తములు అంత నిర్ఘాంతపోయారు, దేశంలో జరిగే అన్ని యాగాలకు, హోమాలకు, తంతుకు విరుద్ధంగా ఇక్కడి ప్రక్రియలు జరుగుతున్నవి. కొన్ని లక్షలు ఖరీదు చేసే స్వఛ్చమయిన ఆవునెయ్యి ఇలా అగ్నిపాలు కావడం.చేసేవాళ్ళు కూడా యాంత్రికంగా చేయడం చూసి బ్రాహ్మణులంతా కూడా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. భక్తుల్లో కూడా కొందరుఆడా, మగ  తేడ తెలియని విధంగా  ఆధునిక దుస్తులు ధరించి పూజా విధానంలో పాల్గొని ఉండటం, శుచి శుభ్రం లేని పూజ విధానాలు వాళ్లకు భరించరాని విధంగా ఉన్నాయి. కానీ ఏమి అడ్డుచెప్తే ఏమిజరుగుతుందో అన్న భయం కూడా  వారిలో లేకపోలేదు.  గౌరవభంగం కాకూడదు అని బయటికి కూడా వెళ్ల లేక పోయారు, ఈ తతంగానికి వారు ప్రేక్షకపాత్ర పోషించ వలసి వచ్చింది.

బాగా అలంకరించి ఉన్న వేదికపై వెండి సింహాసనం మీద కూర్చుని ఆ సన్యాసి ఈ యాగాలనన్నింటిని గమనిస్తూ వున్నాడు.ఆయన చుట్టూ సపర్యలు చేస్తూ భక్తులు (ఎక్కువ భాగం స్త్రీలు) వున్నారు. కాసేపటికి ఆ సన్యాసి తన ఆంతరంగ గదిలోకి వెళ్లిపోయారు. కొంతమంది అధికమొత్తంలో దక్షిణ ఇచ్చిన వారతో సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది.  ఆసన్యాసి తాగిన చుట్టల భస్మం తీసుకుంటే ఉబ్బసవ్యాధి లాంటి పోతాయి అని అతని అనుచరులు ప్రచారం చేయడంతో చాలా మంది అక్కడ గుమికూడారు. దక్షిణ ఇచ్చిన భక్తులకు మాత్రమే ఆ స్వామి వారి తాగి విదిల్చిన చుట్టాలు, బీడీల, సిగిరెట్ల బూడిద పంచడం వాళ్ళు చాలా జాగ్రత్తగా భద్రపరుచుకొని దాన్ని ఇళ్లకు తీసుకు పోయే ప్రయత్నం చేయడం, ఇదంతా చూస్తున్న వల్లభదాసుకు చాలా బాధతోపాటు ఆగ్రహం కలిగింది.
మిగిలినది తరువాయి భాగంలో..

దేవదత్తుని వృత్తాంతం - 11

దేవ దత్తుని వృత్తాంతం 11
వల్లభదాసు యొక్క కీర్తి 


నాగనాథుడు తన మనో నేత్రానికి కనిపిస్తున్నఈ వ్యవహారాన్ని ఎంతో ఆసక్తిగా గమనిస్తూ వున్నాడు.  వల్లభదాసు రాజమ్మగారు వెల్లిన తదుపరి, స్నానానంతరం పూజా మందిరంలో శ్రీపాదవల్లభుని ముందు ధ్యానం లో కూచున్నారు. సమస్యల పరిష్కారానికి దత్త ధ్యానం చేయడం వల్లభదాసుకు అలవాటు. ఆరోజు ధ్యానానంతరం  వల్లభదాసు ధైర్యంగా వుండడం చూసి అతని అనుచరులు సంతోపడ్డారు.అతను తన ఆంతరంగిక అనుచరులను పిలిచి కొన్ని ఆదేశాలను ఇచ్చి పంపడం జరింది. తరువాత మరికొందరికి ఏవో ఉత్తరాలు రాసి ఇచ్చి పంపివేసారు. తరువాత కమలమ్మగారికి ఏవో ఆదేశాలను ఇచ్చి రాజమ్మగారి దగ్గరకు పంపారు. 

రాజమ్మగారి కుమార్తె సుమతి చాల తెలివైన అమ్మాయి, లౌకికజ్ఞానం కలిగినది. శ్రీపాదుని పై అనన్య భక్తి కలిగినది  అయినందు వల్ల తనకు రాబోవు ప్రమాదము పసిగట్టి శ్రీపాదుని పరి పరి విదముల తనను కపాడమని వేడుకుంటోంది.తన తండ్రి, నాన్నమ్మగారు కపట సన్యసిని నమ్మడం ఆ అమ్మయికి ఎంతో అయిష్టతగా ఉంది.ఈ లోపు కమలమ్మగారి ద్వారా అందిన వల్లభదాసు ఆదేశాలను రాజమ్మ తన కుమార్తెకు  చేరవేసింది.  తరువాత తన భర్తను పిలిచి అతనికి  సుమతి గురిచి ఎదో చెప్పడంతో, ఆమె భర్త స్వామి వారి దగ్గరకు వెళ్ళి ఏదో సర్ది చెప్పడంతో ఆ కపట సన్యసి సరే అంటూ నాలుగు రోజుల తరువత అమ్మయిని వెంటపెట్టుకురమ్మన్నారు.ఇదంత చూసి రాజమ్మ తన కుమార్తె రక్షింపబడటానికి నాలుగు రోజుల సమయం దొరికినందుకు సంతసించింది. ఈలోపు వల్లభదాసు శ్రీపాదుని అండతో ఎదో ఒకటి చేసి తన కుమార్తెను రక్షిస్తాడు అని విశ్వసించింది.సుమతి ఈ విషయం తెలిసి ఈ అయిదు రోజులు శ్రీపాదుని ధ్యానంలో ఏకభుక్తం చేస్తూ తన సమయం గడపాలని నిర్ణయించుకుంది. ఆమె తండ్రి మరి కొంత మంది జనులు ఆ స్వామీజీపై మూఢవిశ్వాసం కలవారు అవడం చేత స్వామీజీకి లేని మహిమలు ఆపాదించి తెలిసిన బందు,మిత్రులకు ప్రచారం చేస్తున్నారు.

ఆరోజు మధ్యహ్న సమయంలో స్వామివారు దత్త హోమం చేస్తారు దానిలో పాల్గొనదలచిన వారు హోమమునకు కావలసిన నెయ్యి, ద్రవ్యాలతో రావలసిందిగా చాటింపువేసారు.అన్నదానంలో పాల్గునేవారిద్వారా, హోమంలో పాల్గునేవారి ద్వారా ఎంతో వ్యాపారం చుట్టుప్రక్కల దుకాణాలలో జరిగింది.పెద్ద సంఖ్యలో ధనిక, పేదా అను తేడా లేకుండా భక్త జనం గుమి కూడారు, పందిల్లు వేయపడ్డాయి,  అన్నదాన సామాగ్రి సమకూడింది. ముందుగా ధనం చెల్లించిన దుకాణదారులు  దుకాణాలలోనే స్వామి అనుచరులు నిర్దేసించిన విదంగా అమ్మకాలు జరుగుతున్నాయి. వాటిలో స్వామివారి చిత్రపటాలు, స్వామి వారి అభిషేకతీర్థం లాంటివి వేల సంఖ్యలో మూఢభక్తులకు అమ్మసాగారు. ఎంతో మంది  స్వామివారి సన్నిహితులు అయిన విధ్యావంతులు, అధికారులు కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. రక్షకశాఖాధికారి స్వామి వారి  భక్తుడు అవటం చేత   రక్షకభటులు కూడా ఎటువంటి గొడవలు జరగకుండా పర్యవేక్షిస్తున్నారు.

వల్లభ దాసు రాసి ఇచ్చిన ఉత్తరాలు జిల్లా అధికారికి అందించారు వల్లభదాసు అనుచరులు. అది చదివి ఆ అధికారి తన యంత్రాంగానికి చేయవలసిన పనులను పురమాయించారు. ఎప్పటిలాగా ఈసారి కూడా శ్రీపాదుని లీలల మహత్యం వెల్లడి కాబోతున్నందులకు వల్లభదాసు, అతని అనుచరులు ఎంతో ఆనందంతోను ఆసక్తితోను ఎదురు చూస్తున్నారు.

Wednesday 19 July 2017

దేవదత్తుని వృత్తాంతం - 10

దేవదత్తుని వృత్తాంతం - 10

వల్లభ దాసు యొక్క కీర్తి,

వల్లభదాసు కొద్ది మంది అనుచరులతో కలిసి తమని అవధూతగా చెప్పబడే సాధువు ఉన్న నివాసానికి చేరుకున్నాడు. ఆప్రాంతం అంతా అట్టహాసంగా, కోలహలంగా ఉన్నది. అక్కడ పందిరి వేసి ఉన్నది, దాని క్రింద ఆ కపట అవధూత అనుచరులు కూర్చొని అతని మహత్తున్ని పలురకాలుగా చెపుతూ వచ్చారు. ఆ సమయంలో ఆ స్వామి అభ్యంగన స్నానం చేస్తువున్నారు. ఆ స్వామి అభ్యంగన స్నానం చూడాలి అనుకున్నవారు 100 రూపాయలు చెెల్లించి స్వామి వారి దగ్గరకు వెళ్ళవచ్చు అని చెపుతున్నారు. ముందుగా స్త్రీలకు అవకాశం ఇచ్చారు. అక్కడి స్త్రీలందరు 100 రూపాయలు కట్టి స్వామివారు స్నానము చేస్తున్న గదిలోకి వెళ్ళ సాగారు.

స్వహస్తాలతో స్నానం చేయించాలి అనుకున్నవారు 500 రూపాయలు ఇచ్చి తమ చేతులతో స్వామికి భగవంతునికి  అభిషేకం చేసే భావంతో చేయవచ్చు అన్నారు. అలా చేసే వారికి కష్టాలు తొలగి, సిరి సంపదలు కలుగుతాయి అని ప్రచారం చేస్తున్నారు. జనం అంతా ఆ అవకాశం కోసం  500 రుసుము చెల్లించి ఆ కార్యక్రమంలో పల్గొనడం జరిగింది. ఎంతో మంది మహిళలు స్వామి వారి దగ్గరకు వెళ్లడం జరిగింది. పథకం ప్రకారం వల్లభదాసు తన సహచరులలో ఒకరి శ్రీమతిని ఆ కార్యక్రమం చూడటానికి పంపడం జరిగింది. ఆ గదిలో చాలా కోలాహలంగా ఉన్నది పురుషులెవ్వరికి ప్రవేశం లేదు. స్వామి వారు ధ్యాన స్థితిలో ఉన్నారు కేవలం గోచి గుడ్డను ధరించి జుట్టు జడలతో ధ్యాన స్థితిలో ఉన్నారు. ఖరీదైన అభ్యంగన సామగ్రి కొని స్త్రీలు లోన గుమిగూడారు, వారిలో కొందరు మహిళలు ఇది మహా భాగ్యం అని ప్రచారం చేస్తున్నారు.

ఈ కార్యక్రమంలో వల్లభదాసు అనుచరుని శ్రీమతి కమలమ్మ ముగ్గరు స్త్రీలను గమనించింది. వారు ముగ్గురు  పూనకం పట్టినట్టుగా ప్రవర్తిస్తున్నారు.వాళ్ళు మాకు ఉన్న కీళ్ల నొప్పుల జబ్బు ఎంత ఖర్చు చేసి వైద్యం చేసుకున్నాతగ్గనిది స్వామి వారి అభిషేకం లో పాల్గొనడం వల్ల ఈ మూడురోజుల్లో తగ్గింది అని ప్రచారం చేస్తున్నారు.స్వామి వారు కూడా స్త్రీలు చుట్టూ చేరి మర్ధనలు చేస్తూ స్నానం చేయిస్తూ ఉంటే తన్మయత్వంతో ఆనందిస్తున్నారు. ఇదంతా చూస్తన్న కమలమ్మగారికి చాలా జుగుప్సా భావం కలిగింది. ఈ తతంగం చూస్తున్న కమలమ్మగారికి అక్కడ ఉండాలని అనిపించలేదు. కానీ ఆమెకు  ఇంట్లో అత్త మామలైన పెద్దలను గౌరవించని, ప్రేమను పంచలేని  తనకు తెలిసిన మహిళలు కూడా స్వామి వారికి స్నానము చేయిస్తూ కనిపించారు. మధ్య మధ్యలో స్వామి వారు కళ్ళు తెరిచి ఆ ఆడవారిని కొడుతున్నాడు.

వారితో ఏవో పరాచకాలు ఆడుతూ వున్నాడు. ఇతనికి చేస్తున్న సేవ ఎందుకు అత్తమామలకు వీరు చేయలేక పోతున్నారు అని కమలమ్మ ఆలోచనలో పడ్డారు. ఇంక అక్కడ ఉండలేక వచ్చేస్తున్న ఆమెకు బయటి ఖాలీస్థలంలో నుంచి ఎదో వాగ్వివాదాలు  కిటికీ ద్వారా వినిపించాయి, ఆమె ఎవరి కంట పడకుండా అది ఏమిటి అని గమనించ సాగింది. మధ్య వయస్కుడైన ఒక స్వామి వారి అనుచరుడు ముగ్గురు మహిళలతో వాగ్వాదం చేస్తున్నారు. ఆ మహిళల్లో ఒక ఆవిడ ,"ఏమయ్యా రంగదాసు నువు చెప్పినట్లే మేము ఎంతో ప్రచారం చేసాము ఇప్పటికే నేను పదిమందిని స్వామి వైపు ఆకర్షితులను చేసాను, నా వాటా ఎందుకు ఇంకా ఇవ్వలేదు అన్నది, మిగిలిన మహిళలు లేని జబ్బులు చెప్పి స్వామి వారి అభిషేకం తో నయం అయ్యాయి అని చెప్తున్న మా మాటలకు ఎంతో మంది ఆకర్షితులు అవుతున్నారు మా వాటా ఇవ్వు అన్నారు. దానికి రంగదాసు "అమ్మ నా వాటా కూడా మూడువేల వరకు రాలేదు. అది వస్తే  కానీ నేను మీకు ఇవ్వలేను. ఈలోపు మీరు గొడవ చేస్తే ఎవరి కంట్లో అయిన పడితే మనకు దేహ శుద్ధి జరుగుతుంది. కాబట్టి దయ చేసి ఓపిక పట్టండి అని ప్రార్థించాడు." ఇది అంత గమనించిన కమలమ్మ మాట్లాడ కుండా మెల్లగా బయటకు వచ్చి వల్లభదాసు సహచరులను  సైగలతోబయటకు తీసుకు వచింది.ఇది అంత వల్లభదాసు గమనిస్తూనే వున్నారు.వల్లభదాసుకు కపట సన్యాసి విషయంలో ఉన్న అనుమానం నిజమని తేలింది. తదుపరి ప్రణాళిక ఏమిటా అని వల్లభదాసు ఆలోచనలో పడ్డారు. 


ఆరోజు సాయంత్రం వల్లభదాసు ఇంట్లో ఉండగా రాజమ్మ గారు వచ్చి " నాయనా ఎలాగైనా నువ్వే నా కూతుర్ని రక్షించాలి. మా ఇంట్లో ఎవరూ నామాట వినటం లేదు, నాకుతురికి  ఏవిధమైనటువంటి జబ్బు లేదు, కానీ మావారు, మా అత్తగారు అమాయకత్వంతో బయట వారి మటలు నమ్మి  ఈ స్వామి వారిని ఇంటికి పిలిపించి పాదపూజ చేసి 1116 సమర్పించారు. ఆ స్వామి వారి దృష్టి నా కుతురి మీద పడింది. అతను మా అత్తగారిని పిలిచి మీ మనవరాలిని చూసాను ఆమెకు మీకు తెలీకుండా ఒక రుగ్మత అనగా ఒక చెడు గాలి సోకింది. ఇది ఆమెకు కాని మీకు కాని తెలీకుండా అలా జరిగింది. మీరు ఆమెను కాపాడుకోండి అన్నాడు. దానికి మావాల్లు భయపడి మీరె ఏదో ఒకటి చేసి తనను కాపాడండి అన్నారు. దానికి అతను  రాత్రి సమయం 7 గంటల ప్రాతంలో మీ అమ్మాయిని నా దగ్గరకు తీసుకు రండి ఆమెకు నేను నయం చేస్తాను అన్నాడు. నాకెందుకో అతని ప్రవర్తన చూపులు నమ్మదగ్గవిగా అనిపించడం లేదు. తల్లిగా నాకు తెలుసు నాకుతురు ఆరోగ్యవంతురాలు, అతడు ఏదో చెడు ఉద్దేశంతో అలా అన్నట్టు నాకు అనిపిస్తూన్నది. కాబట్తి నువ్వే ఎదో ఒకటి చేసి నా బిడ్డను రక్షించు నాయనా వల్లభదాసు అని బ్రతిమాలుకున్నది. 


మొదటి రోజు స్వామి వారి దగ్గరకు వెల్లినప్పుడు స్వామి  ఇచ్చిన పాలు త్రాగి నా కూతురు మత్తుగా కూచున్న దగ్గరే నిద్రలోకి జారుకున్నది. ఆమెను ఏకాంతంగా గదిలొ వంటరిగా వుంచమని ఆమెకు ఎవో ప్రక్రియలు చేయలి అని చెప్పడంతో నాకు భయం అనిపించింది. దాంతో సమయస్ఫూర్తితో నేను ఈ రోజు పంచాంగం చూసాను మంచి రోజు కాదు అని ఒప్పించి మావరితో చెప్పి మా అమ్మాయిని ఇంటికి తీసుకు వచ్చాను. 

ఆ స్వామి రేపు అమ్మాయిని తీసుకు రమ్మని చెప్పాడు. కాబట్టి నువ్వే ఎదో ఒకటి చేసి నా బిడ్డను కాపాడు నాయనా వల్లభదాసు అని ఆర్తితో ప్రదేయపడింది. ఇది అంతా విన్న వల్లభ దాసు అమ్మా మీరు నిశ్చింతగా వెల్లండి దత్తుని దయతో శ్రీపాదుని అనుగ్రహంతో ఏదో ఒకటి చేసి మీ అమ్మాయిని రక్షిస్తాను అని అభయం ఇచ్చి పంపాడు.ఈ విషయం గోప్యంగా వుంచమని కూడా హెచ్చరించాడు. తరువాయి భాగం వచ్చే అధ్యాయములో ..

Monday 17 July 2017

దేవదత్తుని వృత్తాంతం - 09

దేవదత్తుని వృత్తాంతం - 9

వల్లభ దాసు యొక్క కీర్తి,

పరమ భక్తుడు అయినటువంటి వల్లభ దాసు, దత్తాత్రేయుని యొక్క తత్వాన్ని బాగా  అర్థం చేసుకున్నాడు. అందుకనే  కేవలం శ్రీ దత్తాత్రేయుల వారే అవధూత రెండవ వారు లేరు అని పూర్తిగా ఆకళింపు చేసుకున్నారు. అయితే సమాజం లో ఎంతో కొంత సాధన చేసిన తర్వాత చిన్న చిన్న మహిమలు చేసే సన్యాసులు యోగులు తమని తాము అవధూతలుగా ప్రకటించుకునే వారు రోజు రోజు ఎక్కువ కావడం,  ప్రజాలుకుడా దత్తాత్రేయుని లక్ష్యంగా పెట్టుకు న్నప్పటికి ఆదారిలో వెడుతూ మధ్యలో ఇటువంటి చిన్న చిన్న మాయలు చేసే గోసాయిల మాయలో పడుతూ భ్రష్టులవుతున్నారే అనే తపన వల్లభ దాసు మనసులో ఉండేది. అమాయకులయిన ప్రజల ధనాన్ని మానాన్ని కూడా ఇటువంటి కపట అవధూతలు, కపట సన్యాసులు హరిస్తున్నారే అనే ఆక్రోశం యెంతో అతనికి వుండేది.

అందువల్ల వల్లభదాసు చుట్టు ప్రక్కల ఎవరైనా అలాంటి కపట అవధూతలు, సన్యాసులు, సాధువులు వచ్చి ప్రజల్ని మోసం చేస్తుంటే అతని అనుచరులు అతనితో చెప్పడంతో వల్లభదాసు అనుచరులతో వెళ్లి దత్తాత్రేయునిపై భారం వేసి వారి భరతం పట్టేవారు.దీని వల్ల చిల్లర స్వాముల  వెంట వెళ్లడం వారిని గురించి లేనిపోని మహిమలు ఆపాదించి ప్రచారం చేయడం లాంటివి చేసే దత్తాత్రేయుని తత్వాన్ని సరిగా అర్థం చేసుకోలేని పండితులకు వల్లభదాసు అంటే కన్నెర్రగా ఉండేది. కానీ వల్లభదాసుకి ముఖ్యంగా పామరులు, కర్షకులు ఎంతోమంది అనుచరులుగా అండగా ఉండటం వల్ల అతన్ని వాళ్ళు ఏమి చేయలేక పోయారు.


ఇలాగే ఒకసారి ఒక అతడు తనను తాను అవధూతగా ప్రకటించడం వల్ల చాలా మంది జనులు అతని దగ్గరకు వెళ్లడం జరిగింది. ఆ కపట అవధూత శిష్యులు ఆ అవధూతకు దక్షణగా వచ్చిన ధనాన్ని ఆశించి, దానికి గాను లేనిపోని మహిమలు కపట అవధూతకు ఆపాదించి ప్రచారం చేసేవారు. ఐతే అవధూత తత్వాన్ని పింగలనాగుడికి ఏవిధంగా అయితే స్వామి దత్తపురణం లో చెప్పారో అది అణువణువునా జీర్ణించుకునివున్న వల్లభదాసుకి ఇటువంటి అవధూతలను చూస్తే చాలా కోపంగా ఉండేది. అయితే వల్లభదాసుకు అక్కడ దత్తస్వామి ఒక చేత్తో సూర్యుణ్ణి ముట్టుకున్నారు, మరో చేత్తో అశుద్ధం పట్టుకున్నారు అన్న విషయం బుర్రలో బాగా నాటుకుంది. అందుకని ఒకసారి వల్లభదాసు తనను అవధూతగా చెప్పుకుంటున్న ఒక అతని దగ్గరకు వెళ్లడం జరిగింది. అక్కడ జరిగినవి తరువాయి భాగం వచ్చే అధ్యాయంలో చెప్పుకుందాం.

Monday 19 June 2017

Gayatri Mantra Mahima-6



గాయత్రి మంత్రం మహిమ
ఆర్య సమాజ స్థాపకుడైన స్వామి దయానంద సరస్వతి గారు గుజరాత్ రాష్ట్రంలో పుట్టారు. ఆయనకి చిన్నప్పట్నుంచే ఆధ్యాత్మికత అంటే చాలా ఆసక్తిగా ఉండేది. కుటుంబంలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక వాతావరణం ఉండడంతో అతనికి ఈ విషయాల మీద ఆసక్తిగా ఉండేది. అయితే ప్రతి భారతీయుడు హిమాలయ పర్వతాల గురించి ఎంతో గొప్పగా వింటూ ఉంటాడు. అక్కడ మహర్షులు, సాదువులు, సిద్ధపురుషులు, చాలా యోగ శక్తులున్నవాళ్ళు, నిరంతరం తపస్సు చేసుకుంటూ ఉంటారని మన పెద్దవాళ్ళు మనకి నిరంతరం చెప్తూ ఉండడం, పుస్తకాలలో కూడా అదే ప్రస్తావన ఉండడంతోటి ఆయనకి చాలా చిన్న వయస్సులోనే హిమాలయ పర్వతాలకి వెళ్లాలని, అక్కడ తన గురువుని వెతుక్కోవాలని చాలా ఆత్రుతగా ఉండేది. ఆయన మంచి ఆరోగ్యవంతుడుగా, దృఢ౦గా, దివ్యమైన ముఖ వర్చస్సుతో ఉండేవాడు.

Saturday 3 June 2017

దేవదత్తుని వృత్తాంతం - 08

దేవదత్తుని వృత్తాంతం - 8 



          ఈ విధంగా ఎంతో అద్భుతంగా వల్లభ దాసు శ్రీ దత్తాత్రేయుని అవధూత తత్వం చెప్పడం నాగనాథునికి చాలా సంతోషం కలిగింది. వల్లభ దాసు జీవితంలో కొన్ని ప్రధాన ఘట్టాల్ని అయన అవలోకించారు. వల్లభ దాసు ఒక పేద రైతు కుటుంబంలో పుట్టినప్పటికీ వారి తల్లిదండ్రులు ఎంతో ధర్మపరాయణులు. ఏదో విధంగా కొద్దిగా ఉన్న భూమిను సాగు చేసుకుంటూ సంతృప్తిగా జీవనం సాగిస్తున్నారు. వల్లభ దాసు తల్లిదండ్రుల వంశం అంతా కూడా సాక్షాత్తు శ్రీపాద శ్రీవల్లభుని భక్తులు. వారు ప్రతి రోజు దేవుడికి అంటే శ్రీపాద శ్రీవల్లభునికి నైవేద్యం పెట్టిన తర్వాతే వాళ్ళు భోజనం చేస్తూ ఉండేవారు. వారింటికి ఏ సమయంలో అతిథులు వచ్చినా వారికి కడుపు నిండా భోజనం పెట్టి పంపేవారు. ఇటువంటి మంచి సంస్కారమున్న ఇంట్లో పుట్టి ,పెరిగినందుకు వల్లభ దాసుకి ఆ దత్తుని మీద, ఆ శ్రీపాద శ్రీ వల్లభుని మీద ఎనలేని భక్తి భావం కలిగింది. అతనుకూడా ఎల్లప్పుడూ ఆ దత్తుని ధ్యాసలోనే, ధ్యానంలోనే గడుపుతూ ఉండేవాడు. ఇది చూసిన తల్లిదండ్రులకి తమ పుత్రుని మీద అమితమైన ప్రేమ కలిగింది. వాత్సల్యం పొంగి పొరలింది. వల్లభ దాసు గంటలు గంటల తరబడి ధ్యానం చేస్తూ ఉండేవాడు. అందరి పిల్లలలాగా అతను ఆటపాటల్లో సమయం గడపకుండా ఎక్కువగా ధ్యానంలోనూ, మరియూ ఆ చుట్టుప్రక్కల ఎక్కడైనా సరే ఎవరైనా పురాణ ప్రవచనాలు చెప్పుతున్నారంటే, ఎంత దూరమైనా అక్కడికి వెళ్లి వస్తుండే వాడు. ఆ ఊరి చివర ఉన్నశివాలయంలో వల్లభ దాసు వీళ్ళందరూ వెళ్లి ధ్యానం చేస్తుండేవాళ్ళు. 

ఒక సారి ఆ ఊరికి వచ్చిన ఒక అవధూతగా చెప్పబడే ఒక గురువు గారు తన శిష్య బృందంతో అక్కడ మకాం వేసి  భక్తులందరికీ ప్రత్యేక దర్శనాలు, పాదపూజలు ఇస్తుండేవాళ్ళు. ఆ అవదూతేంద్ర స్వామిగా చెప్పబడే అతని శిష్యులు చుట్టుప్రక్కల ఊళ్ళకి వెళ్లి తమ గురువుగారి గురించి చాలా గొప్పగా ప్రచారం చేయ సాగారు. తమ గురువుగారికి చాలా మహిమలు ఉన్నాయని, అతను సాక్షాత్తు దత్తాత్రేయుని అంశ కలిగిన అవధూత అని ప్రచారం చేయడంతో  చాలామంది ఆయన దర్శనానికి రావడం, అక్కడ పాద పూజ చేసినందుకు కొంత దక్షిణ ఇచ్చి, చేతికి తోరణం రక్షరేఖ కట్టినందుకు కొంత దక్షిణ, ఆయన దర్శనం ఇప్పించినందుకు ఆయన శిష్యులు భక్తుల దగ్గర్నుంచి  కొంత దక్షిణ డబ్బు రూపం లో, వస్తు రూపం లో సేకరించ సాగారు. ఒక సారి వల్లభ దాసు అక్కడికి వెళ్లి నప్పుడు, పిల్లవాని ముఖం లోని తేజస్సును గమనించి ఆ అవధూతానంద స్వామి వారు వల్లభ దాసుని పిలిచి, గౌరవించి తనతో పాటు రమ్మని ఆదేశించారు. వల్లభ దాసు కూడా మిగతా భక్తుల మాదిరిగానే ఆయన గురించి చాలా గొప్పగా ఊహించుకున్నాడు. ఆ గ్రామం నుండి వెళ్ళిపోతూ ఆ అవధూతానంద స్వామి వారు వల్లభ దాసుని కూడా తమతో పాటు తీసుకుని వెళ్లి పోయారు.
               
               ఆ అవధూతకి ఒక పెద్ద ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో కూడా చాలామంది సేవకులు ఉన్నారు. అందులో కొంత మంది వంట పని చేస్తూ ఉంటారు, కొంత మంది గురువు గారి  బట్టలు ఉతుకుతూ ఉంటారు,  ఆయనకి ఎంతో సేవ చేస్తూ ఉంటారు. ఒక రోజు ఆయన ఆశ్రమంలో భజనలు, కీర్తనలు అయిపోయినాక చుట్టుప్రక్కల గ్రామాల నుండి వచ్చిన భక్తులు తాము తెచ్చిన కానుకలు, దానదక్షిణలు సమర్పించి వెళ్లి పోయాక ఆ శిష్యులంతా గురువుగారికి వచ్చిన డబ్బులు లెక్క చెప్పడం ఇదంతా చూసిన వల్లభ దాసుకి కొంచెం నిరాశ కలిగింది. వారంతా భోజనం చేశాక గురువు గారి చుట్టూ మూగి యేవో భజనలు పాడసాగారు. ఆ అవధూతానంద స్వామి వారు వల్లభ దాసుని పిలిచి స్వయంగా తాను త్రాగుతున్న చిలుముని  త్రాగమని చెప్పారు. అంటే అక్కడ చుట్టూ  కూర్చుని ఉన్నఆ శిష్యులందరూ ఆ గంజాయిని త్రాగుతూ, ధూమపానం చేస్తూ ఆ మత్తులో పడి పాటలు పాడుతున్నారు, కొంత మంది గంతులు వేస్తున్నారు. ఇదంతా చూసిన వల్లభదాసు కి చాలా ఆశ్చర్యం వేసింది. అతను ససేమిరా తనకి ఇష్టం లేదని, తాను ఆ గంజాయిని త్రాగనని చెప్పాడు. ఏమీ ఫరవా లేదు, నీ ఇష్టదైవం కనిపిస్తాడు, త్రాగు అని ఎంత చెప్పినా వల్లభ దాసు తీసుకోలేదు.

Saturday 20 May 2017

Bhaarth Maata ki Jai!!

 Congratulations, salutations to govt of India and advocate Salvey. On behalf of our readers we sincerely thank the Govt. of India, specially external affairs minister Sushma Swaraj and Law minister Ravishankar Prasad and special thanks to advocate Harish Salvey for defending the case of Kulbhushan Jadhav in international court of justice.

     This is the first time in the history of India after gaining independence in 1947 this Government come forward and put all efforts to save the life of an ordinary Indian. We feel very proud, and we salute Govt. of India from bottom of our heart, our prime minister Narendra Modi and his entire team. Special thanks to his advocate Harish Salevy who hasn't taken any fee for this process. The entire nation of India is being praying for the life of the Sri Kulbhushan Jadhav. We continue to pray for his safe return. 

భారత్ మాతా కీ జై

శ్రీ కులబూషణ్ జాదవ్ గారి కోసం మనం అందరం ఆ భగవంతుని ప్రార్ధన చేద్దాం. ఆయన క్షేమంగా మళ్ళీ స్వదేశానికి రావాలని ,వాళ్ళ  కుటుంబ సభ్యులలో మళ్ళీ  ఆనందాన్ని రేకెత్తించాలని  ప్రార్ధన చేద్దాం.

భారత్ మాతా కీ జై.


విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్,  ప్రియ తమ  ప్రధాన మంత్రి నరేంద్ర మొది  ప్రభుత్వానికి మరియు  న్యాయవాది హరీశ్ సాల్వె గారికి అభివందనాలు.

అమాయకంగా పాకి స్తాన్ ఖైదులో మగ్గుతున్న శ్రీ కులబూషణ్ జాదవ్ గారి ప్రాణాలు కాపాడారు. ప్రత్యేకంగా  ప్రఖ్యాత  న్యాయవాది హరీశ్ సాల్వె గారికి మా అందరి తరపున  అభినందనలు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం.

Tuesday 9 May 2017

Gayatri Mantra Mahima-5




పండిత శ్రీ రామ శర్మ ఆచార్య – దయ్యాల కొంప
పరమ గురువు పండిత శ్రీ రామశర్మ ఆచార్య గారు గాయత్రి పరివార్  వ్యవస్థాపకులు . హరిద్వార్ లోని శాంతికుంజ్ సప్తఋషులు తపస్సు చేసిన పవిత్రమైన ప్రదేశ౦ ,విశ్వామిత్రుడు గాయత్రి మాతని ప్రత్యక్షం చేసుకున్నటువంటి పవిత్ర భూమిలో ఆయన గాయత్రి పరివార్ ని స్థాపించారు . శ్రీ రామశర్మ ఆచార్య గారు మధుర జిల్లాలో అవల్ఖేడ్ అనే గ్రామంలో జమిందారీ కుటుంబంలో జన్మించారు . పదిహేనేళ్ళ ప్రాయంలో ఆయనకి ఆయన గురువు గారైన సర్వేశ్వరానంద స్వామిని కలిసారు . 

Sunday 7 May 2017

దేవదత్తుని వృత్తాంతం - 07

దేవదత్తుని వృత్తాంతం – 7వ భాగం

దత్తాత్రేయులు వారు అభయమిచ్చాక పింగళ నాగుడు వారిని ఈవిధంగా ప్రశ్నించాడు. “స్వామీ ! మన సంఘంలో చాలా కట్టుబాట్లు ఉన్నాయి. వర్ణాశ్రమ ధర్మ పద్ధతులు ఉన్నాయి. వివిధ రకాల వర్ణాల వారికి వివిధ రకాలైన సాంఘికపరంగా ధర్మాలు ఉన్నాయి. ఈ నాలుగు వర్ణాశ్రమ ధర్మాలు మనందరమూ పాటించాల్సి వస్తుంది కదా ! మరి ఈ మహాయజ్ఞం లో సాక్షాత్తు మీరు ఈ సాంఘిక మర్యాదలను పాటించకుండా ఎన్నో చేస్తున్నారు. అక్కడికి వచ్చిన కుక్కల్ని తాకుతున్నారు. మధ్యమధ్య లో మీరు కుండలతో కల్లు త్రాగుతున్నారు. అంతే కాకుండా ఒక అందమైన యువతి కూడా మీ దగ్గరలోనే ఉన్నది. ఇదంతా చూస్తున్న నాకు మీ తత్వమేమిటో అర్థం కావడం లేదు. సాక్షాత్తు దేవతలు, గంధర్వులు, యక్షులు మీ చుట్టూతా మూగుతున్నారు. మీ ముగ్ధమోహన స్వరూపం చూస్తుంటే మా అందరికి  తనివి తీరడం లేదు.  మీలో ఎంతో కొంత గొప్పతనం  ఉంటే తప్ప సాక్షాత్తు సిద్ధులు, గంధర్వులు, సాధువులు, సత్పురుషులు, దేవతలు మీ దగ్గరకి రారు కదా ! మరి ఇదేమిటీ స్వామీ నాకేమీ అర్థం కావడం లేదు. ఇందులో ఏదో విశేషమర్మం ఉంది. దయ చేసి దాని ఈరు నాకు చెప్పండి అని ప్రశ్నించాడు.

దానికి సమాధానంగా దత్తాత్రేయుల వారు చిరునవ్వు నవ్వుతూ “ పింగళ నాగా! నీవు సత్పురుషుడివి. ఎంతో శ్రద్ధా భక్తులతో ఆచారాలని, సాంఘిక నియమాలన్నీ నీవు  పాటిస్తున్నావు. ఈ వర్ణాశ్రమ ధర్మాలు, పెద్దలు నియమించిన సాంఘిక కట్టుబాట్లన్నీ మీరందరూ  యథాతథంగా పాటించ వలసిందే ల్సిందే. అవి మీరు  దాటకూడదు. నాకు ఈ వర్ణాశ్రమ ధర్మాలు వర్తించవు. నేను వీటికి అతీతంగానే ఉంటాను. నాకు ఒక పని చేసినందు వల్ల పుణ్యం కానీ ఇంకొక పని చేసినందువల్ల పాపం కానీ ఈ రెండూ నాకు అంటవు. నేను ఒక చేత్తో సూర్యుణ్ణి తాకుతాను అని చెప్పగా పింగళ నాగునికి అద్భుతంగా ఆయన హస్తం అక్కడ సూర్యమండలాన్ని తాకడం గమనించాడు. నాయనా పింగళ నాగా ! నేను ఇంకొక చేత్తో అశుద్ధాన్ని కూడా ముట్టుకుంటాను అని చెప్పగానే రెండో చేయి ఆశుద్ధాన్ని ముట్టుకున్నట్టుగా కనిపించింది. నాకు ఈ రెండింటికీ ఏమీ భేదం లేదు. నాలాగా ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళనే అవధూతలుగా చెప్పుకోవాల్సి వస్తుంది. నాకు సాటి అయినవాడు నిజానికి ఈలోకంలో ఎవరూ లేడు. బాహ్యం గా నేను చేస్తున్నపనులు వాళ్ళు గమనించి నన్ను అనుకరించాలని ప్రయత్నం చేస్తే వాళ్లకి పతనం తప్పదు. వాళ్ళతో పాటు వాళ్ళ శిష్యులందరికీ కూడా పతనావస్థ  తప్పదు. నాకు కుక్కలకి, కల్లుకి , యువతులకి ఎటువంటి భేదం లేదు అని చెప్పి పింగళ నాగుని భ్రుకుటిని తాకగానే ఆయనకి స్వామి వారి దగ్గరున్న ఆ నాలుగు కుక్కలు కూడా చాలా అద్భుతమైన సిద్దులుగా కనిపించారు. అలాగే అక్కడ ప్రక్కనే  ఉన్న యువతి సాక్షాత్తు అనఘామాతగా దర్శనమిచ్చారు. అలాగే ఆయన త్రాగుతున్న కల్లు అమృతప్రాయంగా కనిపించింది. వెంటనే పింగళ నాగుడు వారందరికీ ఎంతో భక్తి శ్రద్ధలతో సాష్టాంగ దండ ప్రణామం చేశాడు.

తర్వాత వల్లభ దాసు “నాయనలారా ! విన్నారు కదా అవధూత తత్వం! స్వామి వారి తత్వం అర్థం చేసుకోవడం చాలా కష్టం. మీకు నేను కొంచెం మాత్రమే చెప్పగలిగాను. ఈ మాత్రమైనా మీరు అర్థం చేసుకున్నారంటే అవధూతలుగా చెప్పబడుతున్న ఎటువంటి వారి దగ్గరకైనా వెళ్లవలసిన అవసరం లేదు. అటువంటి అవధూతలు ప్రస్తుతం ఎక్కడా లేరు. ఆయన  సాక్షాత్తు వేదాల్లో, ఉపనిషత్తుల్లో చెప్పబడుతున్నటువంటి పరబ్రహ్మ స్వరూపం , అద్వితీయుడు, షడ్భావవికారాలు లేనివాడు, పుట్టుట- పెరుగుట- మరణించుట ఇటువంటివి ఏవీ ఆయనకి లేవు. కాబట్టి నాయనలారా,  నేను మొదట్నుంచి కూడా శ్రీపాద శ్రీ వల్లభ స్వామిని, ఆ దత్తప్రభువుని  మాత్రమే పట్టుకుని ఉంటాను. మనమందరం కూడా మూలాన్నే పట్టుకోవాలి. ఆ మూలం నుంచి వచ్చిన కొమ్మల్ని, ఆకుల్ని పట్టుకుని లాభం లేదు. ధృఢమైన ఆ మూలాధారం నుంచి ఊర్ధ్వముఖంగా వెళ్ళు తున్నటువంటి ఆ చైతన్యాన్ని మాత్రమే పట్టుకోవాలి” అని చెప్పగా అక్కడున్న భక్తులందరూ కూడా చాలా సంతోషించారు. ఈవిధంగా వల్లభ దాసు ఏమాత్రం శాస్త్రపరిజ్ఞానం లేకపోయినా ఎంతో చక్కగా దత్తాత్రేయుని యొక్క అవధూత తత్వాన్ని  చెప్పడం నాగానాథునికి చాలా ఆనందం కలిగింది. అందుకే ఈ వల్లభ దాసు, ఆయన శిష్యులందరూ కేవలం ఆ దత్తాత్రేయ ప్రభువుని మాత్రమే తమ గురువుగా చేసుకుని మరి అటు ఇటు ఎక్కడకి వెళ్ళకుండా నిరంతరం ఆయన నామస్మరణం చేసుకుంటూ ఉండడం నాగనాథునికి సంతోషంగా అనిపించింది. ఎంతో విజ్ఞానం కలిగి, శాస్త్రాలు చదివిన వేదపండితులు, విద్యావంతులు వీరందరూ మూలాన్ని పట్టుకోకుండా కొమ్మలు పట్టుకుని వేలాడుతున్నారేమిటీ అని కూడా అనిపించింది. కేవలం శాస్త్రాలు, దత్తపురాణాలు లేక దత్తుని అవతారాల చరిత్రలు చదివినంత మాత్రాన వాళ్ళలో మార్పు కలగడం లేదని నాగ నాథుడు బాధ పడ్డాడు. ఆశ్రమం చుట్టూ కూడా వలయాకారంగా ఎంతో అద్భుతమైన కాంతి పరివేష్టితాన్ని ఆయన చూసి చాలా సంతోష పడ్డాడు.  

దేవదత్తుని వృత్తాంతం - 06

                                     దేవదత్తుని వృత్తాంతం 6వ అధ్యాయం 


నాగనాథుని ఆవేదన

              ఈ విధంగా అందరిని గమనిస్తున్న నాగనాథునికి అయ్యో ! శ్రీపాదశ్రీవల్లభ స్వామి వారు జన్మించిన ఈ పిఠాపురంలో నిజమైన భక్తులున్నారా? అని ఆవేదన చెందుతున్నప్పుడు ఆయన మనోనేత్రానికి పిఠాపురం చివరగా ఉన్న ఒక వ్యక్తి వైపు ఆయన దృష్టి వెళ్ళింది. ఊరికి దూరంగా ఉన్నఒక మాలపల్లిని  ఆయన గమనించాడు. అక్కడ ఎంతో అందమైన కుటీరం లాగా ఒక ఇల్లు కనిపించింది. అది మునివాటిక లాగా ఉన్నది. ఆ వీధి అంతా ఎంతో పరిశుభ్రంగా ఉంది. ఆ వ్యక్తి యొక్క శరీరమంతాకూడా విద్యుల్లతలు కనిపించాయి. అతని శిరస్సు చుట్టూ ఒక దివ్య తేజస్సుకనిపించింది. ఆయన పేరు వల్లభ దాసు అని తెలుసుకున్నారు. అక్కడికి వెళ్ళగా ఎంతో పరిశుభ్రమైనటువంటి దుస్తులు ధరించి ఆ వల్లభ దాసు ఎదురుగుండా  చాలామంది కూర్చుని చక్కగా భజన చేస్తున్నారు. అక్కడ నాలుగు కుక్కలు నిశ్శబ్దంగా, ఎంతో శ్రద్ధగా వారు చేస్తున్నటువంటి భజనల్ని, కీర్తనలని వింటున్నాయి. వల్లభదాసు ఎంతో శ్రావ్యంగా తంబూరా మీటుతూ  దత్తాత్రేయుని మీద, శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి మీద తనకు తోచిన కీర్తనలు తమకు తోచిన శైలిలో పాడుతూ ఉన్నారు. ఆయన వాక్కులు బయటకి వస్తున్నప్పుడు వాటిలో ఎంతో శక్తివంతమైన విద్యుత్పుంజాలు కనిపించాయి. అవి అక్కడ కూర్చున్న మనుష్యులను తాకుతున్నాయి. వారిలో మానసికంగా , శారీరకంగా చాలా మంచి మార్పులు కనిపిస్తున్నాయి. నాగనాథునికి చాలా ఆశ్చర్యం వేసింది. ఈ వల్లభ దాసు ఎటువంటి శాస్త్రాలు  చదవలేదు. తాను నమ్ముకున్న శ్రీపాద శ్రీవల్లభుని మీద, దత్తాత్రేయుని మీద కీర్తనలు ఎంతో తన్మయత్వంతో చేస్తున్నాడు. నాగనాథుడు కూడా ఎంతో తన్మయత్వంతో ఆనందంగా  ఆ కీర్తనలని వింటున్నాడు.

              కీర్తనలు, భజనలు అయిపోయినాక అక్కడ చేరిన భక్తులు “మహాత్మా ! మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. వాటికి సమాధానాలు మీరే చెప్పాలి” అని ప్రశ్నించారు. దానికి  సమాధానంగా ఎంతో ప్రశాంతంగా “నాయనలారా ! తప్పకుండా అడగండి. నేను సమాధానాలు చెప్పి మీ సందేహాలని తీరుస్తాను” అని చెప్పాడు. వెంటనే వారిలో ఒకడు స్వామీ ! ఈ పిఠాపురంలో ఒక అవధూత ఉన్నారని అందరూ చెప్పు కుంటున్నారు. అక్కడ కూడా జనం చాలా విపరీతంగా వెళ్ళుతున్నారు. ఒక సారి నేను కూడా అక్కడకి వెళ్ళడం జరిగింది. ఆయన ఒక మంచం మీద ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఆ తర్వాత అక్కడనుంచి నేను వచ్చేశాను. అసలు అవధూత అంటే ఏమిటి స్వామి? ఆ తత్వం ఏమిటో మీరు మాకు చెప్పగలరా ? అని ఎంతో వినయంగా అడిగాడు. దానికి సమాధానంగా “నీవు చూసిన వ్యక్తి మంచి సాధువు. అతను ఎప్పుడూ తాను అవధూత అని చెప్పుకోలేదు. అక్కడ చేరిన ప్రజలు ఆతని గురించి అలా ప్రచారం చేస్తున్నారు. ఆతను సహృదయుడు, ఎంతో నెమ్మదస్తుడు, వృద్ధుడు. నాయనా! ఈ పీఠికాపురం లో సుమతీ మహారాణి గారి దగ్గరకి ఒక సాధువు యాచించడానికి వచ్చాడు. అప్పుడు సుమతీ మహారాణి గారు అతనికి భిక్ష ఇచ్చినప్పుడు ఆ వచ్చిన సాధువు “అమ్మా ! నీకేం వరం వరం కావాలో కోరుకో ! అని అన్నాడు. సుమతీ మహారాణి గారు ఎంతో వినయంగా  “నాయనా ! నన్ను ‘అమ్మా’ అని పిలిచావు. అది సార్థకం చేయి’, అని సుమతీ మహారాణి గారు అన్నారు. అంటే తనకి పుత్రుడుగా జన్మించమని అన్నారు. అప్పుడు ఆ సాధువు తన నిజ రూపాన్ని చూపించాడు. ఆయన మరెవరో కాదు సాక్షాత్తు దత్తాత్రేయుడు. అవధూత రూపంలో వచ్చాడు. తల్లీ ! నీకు నావంటి పుత్రుడే జన్మిస్తాడు అని చెప్పాడు. కాని దత్తాత్రేయుడి లాంటి వ్యక్తి , అవధూత ఇంకొకడు లేదు కాబట్టి ఆయనే స్వయంగా శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారిలా ఆమె గర్భం నుంచి జన్మించారు. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? సాక్షాత్తు దత్తాత్రేయుల వారి రూపమే సంపూర్ణమైనటువంటి అవధూత. ఇంకా ఈ ప్రపంచంలో తనలాంటి అవధూత ఇంకొకడు లేదు కాబట్టి ఆయనే స్వయంగా జన్మించవలసి వచ్చింది. అయితే తనని ఎవరైతే చాలా భక్తిగా, శ్రద్ధతో సేవించారో శ్రీపాద శ్రీవల్లభుల స్వామి వారు  వారిని ఆశీర్వదించి వారికి కొన్నిమహిమలు, మంచి శక్తులూ, సిద్ధులూ వచ్చే జన్మలో కలుగుతాయని ఆశీర్వదించారు కాబట్టి అందులో ఒకతను శ్రీ వెంకయ్య గారనే ఆతను అవధూతగా జన్మించడం అనేది కేవలం శ్రీపాద శ్రీవల్లభుల వారి వాక్కు వల్లనే సుమా ! అని చెప్పాడు.




                  దానికి ఒక వ్యక్తి “స్వామీ ! అసలు అవధూత తత్వం ఏమిటీ?” అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా వల్లభ దాసు “నాయనా ! దానికి సమాధానం చెప్తాను శ్రద్ధగా విను. అవధూత తత్వం గురించి చెప్పడం అనేది చాలా కష్టపరమైన విషయం. నాకున్న బుద్ధీ, పరిజ్ఞానంతో శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారిఆశీర్వాదం, అనుగ్రహంతో ఆయన నానోట పలికించ బోయే వాక్కు మాత్రమే నేను మీకు చెప్పగలను అని చెప్పి, కొచెం సేపు కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుని అప్పుడు ఇలా చెప్ప సాగారు. పూర్వం పరశురాముడు శ్రీ దత్తస్వామిని ప్రధానంగా పెట్టుకుని ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టాడు. సాక్షాత్తు శ్రీ దత్తాత్రేయుల వారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైనటువంటి యజ్ఞాన్ని చేశారు. సమస్త దేవతలు, మహర్షులు, సిద్ధులు, సాధువులు, మనుష్యులు అందరూ కూడా ఆ యజ్ఞానికి విచ్చేశారు. ఆ యజ్ఞంలో పింగళనాగుడు అనే ఒక బ్రాహ్మణుడికి కూడా కొంత అర్చకత్వం లభించింది. ఈ పింగళనాగుడు ఒక మహానుభావుడు. ఎన్నో శాస్త్రాలు చదివిన వాడు. అయితే అయన గమనిస్తున్న కొన్ని విషయాలను చూసి చాల ఆశ్చర్య పడి పోయాడు. ఒక రోజు దత్తాత్రేయ ప్రభువు అమలక వృక్షం క్రింద విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో పింగళ నాగుడు వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో చేతులు కట్టుకుని “మహాత్మా ! మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని వచ్చాను. మీరు కోపగించకుండా ఉంటే అడుగుతాను” అని చెప్పగా శ్రీ దత్తాత్రేయుల వారు చిరునవ్వు నవ్వుతూ “పింగళ నాగా! ఎటువంటి సందేహాలు పెట్టుకోవద్దు. తప్పకుండా నీవు అడుగు. నేను జవాబు చెప్తాను” అని చెప్పారు.

దేవదత్తుని వృత్తాంతం - 05

                    దేవదత్తుని వృత్తాంతం –  ఐదవ  భాగం (తరువాయి భాగం)

   శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారి తపన (continued)


             అక్కడే ఉన్న ఒక వైద్యుడు దీక్షితులు గారి అభిమాని. హాస్పిటల్ లోనికి ఆయన్ని తీసుకుని వెళ్ళారు. దురదృష్టవశాత్తు మల్లాది గోవింద దీక్షితులు గారికి కనీసం ఆ హాస్పిటల్ లో ఒక మంచమైనా దొరకలేదు. అందుకని ఆయన్ని క్రిందనే పడుకోబెట్టారు. అదే ఊళ్ళో ఆ డాక్టర్ గారు ఉంటారు కాబట్టి ఆయన గురువుగారికి సకల సపరిచర్యలు చేయడం, ప్రొద్దున్నే ఆయనకి కావలసిన అల్పాహారం ఇవ్వడం, మరి అప్పటికే ఆయన కాలు చాలా భయంకరంగా వాచి పోయి ప్రమాదకరమైన పరిస్థితిలో ఉండడం, ఖరీదైన మందులు ఆయనకి ఇవ్వడం, ఇదంతా నాగనాథుడు గమనిస్తూనే ఉన్నాడు


ఋణానుబంధం

                  నాగనాథుడు కొద్దిగా భూతకాలంలోనికి వెళ్ళడం, అక్కడ గుజరాత్ నుండి రాజకుమారి అనే ఆవిడ, భాగ్యనగరం నుండి ప్రసిద్ధులైనటువంటి ఒక హోమియోపతి వైద్యుడు, మరియొక యువకుడు ఆ దత్తుని సంస్థలో కలవడం, ఎన్నో విషయాలు శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారు వారితో చర్చించడం, వాళ్లకి శ్రీ గోవింద దీక్షితులు గారితో అనుబంధం కలవడం, ఆ సందర్భంలో శ్రీ గోవింద దీక్షితులు గారు రాజకుమారి తో తన గురువు గారి దగ్గర్నుంచి తీసుకుని వచ్చిన అసలైన శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతం ఇచ్చి దాన్ని హిందీ భాషలోనికి అనువదించమని సూచించడం, వీడ్కోలు సమయంలో ఒక ఔదుంబర మొక్కని కూడా వారికి ప్రసాదించడం, ఎంతో అభిమానంతో వారిద్దరినీ సాగనంపడం, ఇవన్నీ నాగనాథుడు చూస్తూనే ఉన్నాడు. రాజకుమారిగారి అంతఃకరణ ఎంతో పరిశుద్ధంగా ఉండడం, ఇన్నేళ్ళ నుంచి హిందీ భాషలోనికి అనువాదం చేస్తామని చెప్పినవారు ఆ పనినే చేయకపోవడం, దాన్ని ఎంతో సమర్థవంతంగా రెండు నెలలోనే రాజకుమారిగారు హింది భాష లోనికి అనువాదం చేయడం, ఆ రోజు శ్రీ గోవింద దీక్షితులు గారు ఎంతో సంతోషపడడం నాగనాథుని కంటికి కనిపించింది. అంతే కాక వారు దాన్ని హరబాబా గారికి పంపించడం, ఆయన త్వరలోనే దాన్ని పుస్తకరూపంలో ముద్రిస్తామని చెప్పడం, అయన మనోగతానికి అర్థమైంది. శ్రీ గోవింద దీక్షితులు గారి పరిస్థితి తెలిసిన ఆ రాజ కుమారి గారు వెంటనే ఆయనకి దాదాపు లక్ష రూపాయల దాకా ఆయన బ్యాంకు లో డిపాజిట్ చేయడం, అంతా చూసిన నాగనాథుడు ‘ఆహా ! ఇంకా ఈలోకం లో మంచివాళ్ళు ఉన్నారు కదా !” అని అనుకున్నాడు. మంచి హృదయం, శ్రీపాద శ్రీ వల్లభుల వారి పట్ల ఎంతో గౌరవం ఉన్న వాళ్ళు ఆయన కంటికి కనిపించినందు వల్ల ఆయన చాలా సంతోషపడ్డారు.


                   ఇక్కడ శ్రీ మల్లాది గోవింద దీక్షితులుగారికి వైద్యం చేస్తున్నటువంటి వైద్యుడు ఆయనలో ఏమాత్రం మార్పు కనిపించక పోవడంతో కాస్త భయపడ్డాడు. అప్పుడు శ్రీ దీక్షితులు గారు నాకు భాగ్యనగరంలో ఉన్న డాక్టర్ శాంతిస్వరూప్ గారి మందులే కావాలి అని చెప్పడం, ఆ డాక్టర్ గారు అక్కడ్నుంచే ఆ రిపోర్ట్ లన్నీ చెప్పడం, డాక్టర్ శాంతిస్వరూప్ గారు భాగ్యనగరం నుండే మందులు చెప్పడం, ఆ మందులు ఆయన వాడడం, సరిగ్గా రెండు వారాలలోనే శ్రీ దీక్షితులుగారి కాలు నయమైపోయి, స్వస్థత చేకూరడం నాగనాథుడు గమనించాడు. ఒకవైపు అదే ఊళ్ళో ఉంటున్న దత్త సంస్థ కాని, శ్రీపాద శ్రీవల్లభ సంస్థ కాని ఏమీ పట్టించుకోక పోవడం, ఎక్కడ్నుంచో ముక్కు-ముఖం తెలియని వాళ్ళు వచ్చి శ్రీ దీక్షితులుగారితో అనుబంధం పెంచుకోవడం, సమయానికి వారు ఆయనకి ఆర్ధిక సహాయం చేయడం చూసిన నాగనాథుడు “ఆహా ! ఏమీ ఈ తేడా ! ఏమి ఈ విచిత్రం !” అని అనుకున్నాడు. వారిద్దరిని కూడా ఆయన ఎన్నోరకాలుగా ఆశీర్వదించాడు.  


             అటు దత్తుని సంస్థ వారు, ఇటు శ్రీపాద శ్రీవల్లభ సంస్థ వారు శ్రీ గోవింద దీక్షితులు గారిని కేవలం పిచ్చివాడి మాదిరిగానే చూడడం, అలాగే ఆయన వెనుక ఆయన గురించి మాట్లాడడం చూసి నాగనాథుని మనస్సుకి కొంచెం ఆవేదన కలిగింది. “అయ్యో ! వీళ్ళు ఎంత పాపకర్మలని పెంచుకుంటున్నారు ! ఇది వీరి అమాయకత్వమా లేక అహంకారమా?” అని ఆయన మీమాంసలో పడ్డారు.