కణ్వదమహర్షి కణ సిద్ధాంతం - 2
కణ్వదమహర్షి చెప్పిన విషయాలన్నీ కూడా నేను చాలా దీర్ఘంగా (లోతుగా deep ) విమర్శించుకుంటూ నేను నా గదిలోనే గడిపాను. తెల్లవారుఝామునే లేచి కాలకృత్యాలు తీర్చుకుని, గురుద్వారాలో అల్పాహారం తిని. ఇంకా నైరోబీకి బయల్దేరుదామని కారు దగ్గరకి వెళ్లాను. మరి ఏ కారణాల వల్లో తెలియదు కాని ఎంత ప్రయత్నం చేసినా కారు ఇంజను స్టార్ట్ కాక పోవడంతో ఆ ప్రయత్నం విరమించుకుని నేను నా గదిలోకి వెళ్లి ప్రశాంతంగా కూర్చున్నాను. ఆ రోజు శనివారం నేను నైరోబీకి కాస్త ఆలస్యంగా వెళ్ళినా ఫరవాలేదని నిశ్చింతతో గదిలోనే ఉండిపోయాను. మనస్సు ప్రశాంతంగా ఉంది. మనస్సు లోపల ప్రశ్నల మీద ప్రశ్నలు వస్తున్నాయి. అనుకోకుండా ఎంతో అద్భుతంగా కణ్వద మహర్షి గదిలో దర్శనమిచ్చారు.