శ్రీ రాంలాల్ ప్రభుజి లీల - మోహిని కథ – 7 (ఆఖరి
భాగం)
(Concluding Part)
యదావిధిగా
వాళ్ళందరినీ లేపి జరిగిందంతా రవి కాంత్ వాళ్లకి చెప్పాడు. ఇదేమిటీ మేమెంత
ప్రయత్నించినా సరిగ్గా ఆవిడ వచ్చే సమయానికి బాగా నిద్ర పడుతుంది. ఆవిడ రావడం,
మీరిద్దరూ గంటలు గంటలు మాట్లాడుకోవడం మేము ఒక్క రోజైనా స్వయంగా మా కళ్ళతో
మేము చూడలేదు. “అమ్మ బాబోయ్ ! ఈ కామ పిశాచానికి చాలా శక్తి ఉన్నట్టుగా ఉంది.”
“హారీ భగవంతుడా ! ఇప్పుడేమిటీ మార్గం? ఏం చేయాలి? శ్రీ రాంలాల్ ప్రభువు గారిని
పూజించిన పూలలో ఎంతో శక్తి ఉందని మనం సంతోషించి పోయాం కాని ఆ కామ పిశాచి, ఆ మోహిని
ఆ పువ్వులనే నీ చేత్తో దూరంగా అవతల పారేసేటట్టు చేసిందే, ఏం చేయాలి ఇప్పుడు ?