ఆలోచనలకు గల అద్భుతమైన శక్తి ( Power of Thoughts)
ఒక సారి ఒక
బాటసారి దారి తప్పి ఒక ఎడారిలో వెళ్ళాడు. అతను ఎంత నడిచినా కూడా అక్కడ కనుచూపు
మేరలో ఇసుక తిన్నెలు తప్ప ఏమీ కనిపించడం లేదు. మెల్ల మెల్లగా ఎండ ఎక్కువ
కాసాగింది. ఎక్కడైనా కాసేపు కూర్చుందాము అని అనుకుంటే ఎక్కడా నీడ అన్నమాట లేదు.
గత్యంతరం లేక అతను అలాగే ముందుకి వెళ్ళసాగాడు. కనుచూపు మేరలో అతనికి ఒక గ్రామం
కాని జలాశయం కాని కనిపించ లేదు. తానూ దారి తప్పి ఎడారిలో ప్రవేశించానని అప్పుడు
అతనికి అర్థం అయింది. ఎండ అతన్ని బాధించ సాగింది. చెమటలు పడ్తుండాలి. ఒళ్ళంతా మండ
సాగింది. పాదాలు మండుతున్నాయి, గొంతు ఎండుకు పోయింది, నాలుక పిడుచుకుకట్టుకు పోయింది.