N. Sairam Garu || Email: sridatta50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.

Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here

Wednesday 30 April 2014

గాయత్రి పరివార్ తో నా పరిచయం - సంజీవని విద్య శిబిరం



ఆధ్యాత్మిక  అనుభవాలు - విశేషాలు
గాయత్రి పరివార్ తో నా పరిచయం - సంజీవని విద్య శిబిరం

                నేను 2007 లో టాంజానియా నుంచి శాశ్వతంగా భారత దేశానికి తిరిగి రావడం జరిగింది. నాకు చిన్నప్పట్నుంచి ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి కాస్త ఎక్కువగా ఉండడం వల్ల నేను ఉద్యోగం లో కూడా చేరకుండా ఆధ్యాత్మిక విషయాల వైపే నా ధ్యాస మళ్ళించు కున్నాను. సమయంలో నాకు గాయత్రి పరివార్ తో పరిచయ భాగ్యం కలిగింది. వీరు హరిద్వార్ లో శాంతి కుంజ్ అనే ప్రదేశంలో 10 రోజుల పాటు సంజీవని విద్య అనే కార్యశాలని (work shop) ఆయోజన చేసారు .అందులో పాల్గొనటానికి నేను హరిద్వార్ వెళ్ళడం జరిగింది. అక్కడ గాయత్రి మంత్ర జపము, గాయత్రి హోమము వగైరా వగైరా ఎన్నోఆధ్యాత్మిక  కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి అవి నేను మీతో పంచుకో దలుచుకున్నాను.  

Wednesday 23 April 2014

మొక్కలకి ,వృక్షాలకి కూడా భావాలు , అనుభూతులు ఉంటాయా ?



 ఆధ్యాత్మిక  అనుభవాలు - విశేషాలు

మొక్కలకి ,వృక్షాలకి కూడా భావాలు , అనుభూతులు ఉంటాయా ?
నేను కిర్లిన్స్ కెమెరా గురించి చదవడం, దాన్ని చూడడమూ వీటి గురించి నేను మీకు వివరంగా చెప్పాను.  నేను 1977 సంవత్సరంలో ఒక సారి మద్రాస్ కు ఇంటర్వ్యూ నిమిత్తం వెళ్ళటం జరిగింది. నాకు సదా పుస్తకాలు చదివే అలవాటు ఉంది. సైకాలజీ ,పర సైకాలజీ, ఆధ్యాత్మిక , పౌరాణిక పుస్తకాలు చదువుతూ ఉంటాను. నేను ఊరికి వెళ్ళినా తప్పనిసరిగా పుస్తకాల దుకాణానికి వెళ్ళుతూ ఉంటాను. అయితే నాకు మద్రాస్ పుస్తక దుకాణంలో  Extra sensory perception  అనే ఒక అద్భుతమైన పుస్తకం కనిపించింది. నేను వెంటనే పుస్తకం కొన్నాను. అందులో నేను చదివిన ఒక అద్భుతమైన విషయం మీతో చెప్పాలని అనుకుంటున్నాను.

Sunday 20 April 2014

Malladi Govinda Deekshitulu Gaari Punarjanma



గోవింద దీక్షితులుగారి పునర్జన్మ - మాతా సుమతీ మహారాణి యొక్క అనుగ్రహం

ఒకసారి పిఠాపురంలో శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారి అరికాలికి ఒక పెద్ద గాయం అయింది. ఆయన డయాబ్టీస్ తో చాలా బాధ పడుతుండేవారు. ఆహార విషయాల్లో ఆయన నియమాలు పాటించక పోయేసరికి ఆయన ఆరోగ్యం చాలా క్షీణించింది. అయినా ఆయన తన దేహ స్థితిని మాత్రమూ గమనించే వారు కాదు. అరికాలిలో తగిలిన గాయం ఒక పెద్ద వ్రణమయి కూర్చుంది. ఆఖరికి అది లోపలంతా క్రుళ్లిపోయి gangrene లాగా అయింది . gangrene అంటే డేడ్ టిష్యూ అన్న మాట. అదే సమయానికి మధు మేహం కూడా ఉండడంతో చాలా అవస్థ పడుతుండే వారు. దానితో కుటుంబ సభ్యులంతా గాభరా పడి పోయారు.

ఆధ్యాత్మిక పానీయము - 19



విత్తనాలు - సంస్కారాలు

ఒక పౌర్ణమి రోజు రాత్రి నేను భోజనం చేసి తీరిగ్గా ఇంటి ముందున్న ఖాళీ ప్రదేశంలో పచార్లు చేస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నాను. పౌర్ణమి వెన్నెల మా ఇంటి ముందున్న రకరకాల మొక్కల మీద, నేల మీద తివాచీలా పరిచి ఉన్న గడ్డి మీద పడి చూడడానికి ఎంతో ఆహ్లాదంగా ఉంది. నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది. సమయంలో నాకు అయస్కాంత వ్యక్తి సాక్షాత్కారం జరిగింది. ఆయనకి నేను వినయంగా నమస్కరించి "మహాత్మా చాలా రోజుల తరువాత దర్శనం ఇచ్చారు. పౌర్ణమి వెన్నెల చూడండి ఎంత ఆహ్లాదంగా ఉందో, ఇటువంటి ప్రకృతి సౌందర్యానికి మనసు ప్రశాంతతో నిండిపోతుంది, ఏదో ఒక తెలియని ఆనందం అణువణువునా వ్యాపించిపోతుంది. మీ సాక్షాత్కారం జరిగే ప్రతిసారి నాకు ఇటువంటి స్పందనలే కలుగుతుంటాయి" అని అన్నాను.

Thursday 17 April 2014

హైదరాబాద్ కి బ్రహ్మశ్రీ స్వర్గీయ గోవింద దీక్షితులు గారి ఆగమనం



హైదరాబాద్ కి బ్రహ్మశ్రీ స్వర్గీయ గోవింద దీక్షితులు గారి ఆగమనం 

                    బహుశా 2009 డిసెంబర్ లో ఒక సారి శ్రీ గోవింద దీక్షితులు గారు హైదరాబాద్ రావడం జరిగింది. అప్పటికే నేను ఆయన్ని పిఠాపురంలో కలవడం జరిగింది. సాధారణంగా నేను దీక్షితులు గారు ఎప్పుడు కలిసినా ఆధ్యాత్మిక విషయాలన్నీ వైజ్ఞానిక దృష్టి కోణంతో చర్చిస్తుంటే గంటలు నిమిషాలలాగా గడిచి పోతూ ఉండేవి. సత్సంగ్ లో కూడా వివిధ విషయాలు మాట్లాడుతుండేవారు. ఆయన వ్రాసిన శ్రీపాద శ్రీ వల్లభ చరితామృతంగురించీ, దీక్షితులుగారి గురించి నాకు తెలిసిన దత్త బంధువులందరికీ నేను చెప్పాను. శ్రీ గోవింద దీక్షితులుగారి గురించీ, శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతం గురించి ప్రచారం చేసినందు వల్ల  దీక్షితులుగారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన్ని కలుసుకోవడానికి చాలా మంది వస్తుండేవాళ్ళు. ఆయనతో ఎంతో ఆసక్తికరమైన, ఆధ్యాత్మిక విషయాలు చర్చిస్తుండేవాళ్ళు. వచ్చిన వాళ్ళు ఎంతో భక్తితో ఎంతో కొంత దక్షిణ ఇస్తుండేవాళ్ళు. వచ్చిన దక్షిణతో వెంటనే చీరలు, రవిక బట్టలూ, గాజులూ ,పసుపు-కుంకుమ వగైరాలు తెప్పించి వచ్చిన స్త్రీలందరికీ పంచి పెడుతుండేవారు. ఆయన ప్రతీ స్త్రీని కూడా సుమతీ దేవి లాగా భావిస్తుండేవారు అని చెప్పటం జరిగింది