N. Sairam Garu || Email: sridatta50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.

Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here

Saturday 27 February 2016

ఆశావాది -నిరాశావాది

ఆశావాది  అంటే  జీవితంలో తను అనుకున్నది తప్పకుండా  సాధిస్తాననుకునే  ఒక ధృఢమైన ఆత్మవిశ్వాసం మరియు నమ్మకం వున్నవాడు ఆ పని చేయగలిగిన సామర్ధ్యం  కలిగినవాడు పట్టుదలగా  చేసేవాడు తన లక్ష్యం నెరవేరే వరకు కూడా ప్రయత్నాన్ని విరమించు కోకుండా చేసేవాడు . నిరాశావాది  దానికి భిన్నంగా ఉంటాడు. చెయ్యగలిగే సామర్ధ్యం వుండికూడా అతనిలో ఆత్మ విశ్వాసం తక్కువగా వుంటుంది , ఎప్పుడూ కూడా తన లక్ష్యాన్ని తాను చేరుకొలేనేమో అని భయం పట్టి పీడిస్తూ వుంటుంది . అటువంటి వాళ్ళు మన సమాజంలో కొకోల్లలుగా వున్నారు. వాళ్ళు జీవితంలో ఏ పనిని కూడా సాధించలేరు పైగా సాధించగలిగే  స్నేహితులని కూడా నిరాశ, నిరుత్సాహం పాలుచేస్తూ  వుంటారు . అలాంటి వాళ్ళ కథ ఈ రోజు తెలుసుకుందాం .

Saturday 20 February 2016

The Universal Principle of Exchange of Energy


Author: Nanduri Sri Sairam

The Universe is full of exchange of energies. There is a standard and universal principle in the nature and there is always exchange of energies. When we say exchange, this exchange takes place between two or more number of people. We are living in the society and we are not alone in the society. All of us are contributing something to the society and hence there is always exchange of energies. This is the guiding principle in the famous proverb which says “What you sow so shall you reap.” To make it very simple if you sow the seed of love, in return or in exchange you will get many folds of energy of love.

Tuesday 16 February 2016

Mohini Katha-03


శ్రీ రాంలాల్ ప్రభుజి లీల ­- మోహిని కథ – Part ౩

ఈ సంఘటనకి రవి కాంతు కొంచెం బిత్తరపడ్డాడు అదేమిటీ  ఎదురుగుండా నాకు అంత గోడ కనిపిస్తుండగా ఈ గోడలోంచి ఆవిడ ఎలా దూసుకుపోయింది? నా అనుమానం నిజం అయ్యింది.  ఈవిడ మనిషి కాదు. మనిషికి ఇదంతా సాధ్యం కాదు కదా! అని ఆలోచిస్తుండగానే  ఆవిడ క్షణంలో గోడలోంచి ఇటువైపు ప్రవేశించి అతని దగ్గరికి చేరి అతని వయోలిన్ డబ్బా పెట్టెని అందించింది. అతను ఆశ్చర్యపోయాడు. అది తనదే ఎక్కడో హైదర్బస్తీలోని తన అన్నగారి గదిలో తాను ఎక్కడో మూల దాచిపెట్టుకున్న వయోలిన్ డబ్బాని ఆవిడ ఎలా తీసుకువచ్చిందబ్బా? అని కొద్దిగా ఆశ్చర్యం పడడమే కాకుండా కొంచెం భయపడ్డాడు కూడా.  దానికావిడ నవ్వుతూ ఏం ఫరవాలేదు!  నాకు ఉన్న చాలా చిన్న శక్తిని మాత్రమే ఉపయోగించాను అంతే.  అయినా ఇవన్నీ మరిచిపోదాం. చక్కగా ఒక పాట పాడు. ఫలానా పాట  నాకు ఎంతో ఇష్టం అని చెప్పగా అతడు మరింత ఆశ్చర్యపడిపోయి ఆ వయొలిన్ బయటకు తీసి ఆవిడ కోరిక ప్రకారం ఆమెకి కావల్సిన పాటని వయొలిన్ మీద వాయించాడు.

Friday 5 February 2016

Mohini Katha-02


రాంలాల్ ప్రభుజి లీల ­- మోహిని కథ - Part 2

 “అలా చూస్తూ నిలబడ్డారేమిటీ! లోపలకి రండి” అని ఆవిడ ఆహ్వానించింది. చక్కటి పళ్ళవరస చిరునవ్వు నవ్వుతుంటే తళుక్కుమని మెరుస్తూ ఆకర్షిస్తున్నాయి. ఆమె యొక్క ప్రతి అణువులో అందం అలా ఉట్టి పడుతూ ఉంది. ఆ నడక... ఆ మాట ... ఆ ఎత్తు... ఆ అవయవ సౌష్టవం..... వర్ణించలేనంత  అందంగా ఉంది. ఏదో  ప్రబంధ కావ్యంలో  ఆవిడ నాయిక మాదిరిగాఒక గ్రీకు సౌందర్యరాశిలాగా అతనికి కనిపించసాగింది. ఏమిటి నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను?నాకు ఈ రోజు ఏమైందిఅని అతను మనస్సులో అనుకుoటున్నాడు. లోపలకు అడుగుపెట్టగానే దాదాపు ఒక పన్నెండు అంగుళాల దళసరి మెత్తటి తివాచి క్రింద నేలమీద పరచి ఉంది. అలాగే  పెద్ద రాజోచిత  సింహాసనాలు అక్కడ ఉన్నాయి. అదంతా మెత్తటి  మక్మల్ బట్టతో అలంకరించినట్టుగా ఉంది. అతన్ని ఆ ఆసనం మీద కూర్చోమని చెప్పిఆవిడ ఎదురుగా ఉన్న ఆ ఆసనం మీద కూర్చుని, “ఏమిటీ ఆలోచిస్తున్నారుపరధ్యానoలో ఉన్నారు. మీ చుట్టూ ఉన్న అందాన్ని మీరు ఆస్వాదించకుండా  ఏవేవో పాత ఆలోచనలలోకి మీరు ఎందుకు వెళుతున్నారు?” అని ప్రశ్నించింది. 

Kanvadah Maharshi - An autobiography of a Yogi

కణ్వద  మహర్షి- కణ సిద్ధాంతం – ప్రఖ్యాత శాస్త్రవేత్త లూథర్ బర్బంక్ చేసిన అద్భుత సృష్టి

కణ్వద  మహర్షితో పరిచయమయ్యాక ఆయన చెప్పిన విషయాలగురించి నేను చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండేవాడిని. ఆయన చెప్పిన ప్రకారం,ఒకసారి ధ్యాన స్థితిలో ఉండి ఆయన చెప్పిన విషయాలన్నీ నెమరు వేసుకుంటూ ఉండగా అంటే ముఖ్యంగా  జన్యు కణాలతో (genes), స్టెమ్ సెల్ల్స్(stem cells) తో మాట్లాడితే ఎటువంటి అవయవ లోపాలున్నా అవి సరి దిద్ద బడతాయి అని ఆయన  చెప్పిన విషయాలు నేను ఆలోచిస్తుండగా నాకు స్వామి పరమహంస యోగానంద గారు Yogada Satsang Society) తెలుగులో  రచించిన “ఒక యోగి ఆత్మ కథ” (“An autobiography of a Yogi”) అనే పుస్తకం గుర్తుకి వచ్చింది. అందులో శ్రీ పరమహంస యోగానంద గారు ఒక అద్భుతమైన సందర్భాన్ని ప్రస్తావించారు.

Mohini Katha-01

శ్రీ రాంలాల్ ప్రభుజి లీల ­- మోహిని కథ

రవికాంత్ మెల్లగా హైదర్బస్తి నుంచి బయలుదేరి దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీసుకి చేరాడుఅతను నిరుద్యోగిగా ఉన్నాడు మొన్ననే బీ.ఏ పాస్ అయ్యాడుఅతని దినచర్య ఏమిటి అంటే వివిధ కంపెనీలకి దరఖాస్తులు పంపుతూ ఉండడం. అలాగే ఆ రోజు పోస్ట్ ఆఫీస్ కి చేరి తను వ్రాసిన దరఖాస్తును పోస్ట్ చేసి ఇంక ఇంటికి బయలుదేరుదాము అని అనుకుంటుండగా ఒక మృదు మధురమైన స్త్రీ గొంతు, “ఏమండీఒకసారి మీ పెన్ను ఇస్తారా?” అని వినిపించింది. అతడు వెను వెOటనే చూడగానే ఒక విధమైన దిగ్భ్రాంతికి లోనయ్యాడు ఎదురుగుండా అద్భుతమైన సౌందర్యరాశి నవ్వుతూ కనిపించింది.

Tuesday 2 February 2016

Kana Siddhaantam-03


కణ్వద  మహర్షి- కణ సిద్ధాంతం 

జన్యు కణాల గురించి మరి కొంత సమాచారం  నేను కణ్వద మహర్షిగారితో సంభాషించాక అదంతా నెమరు వేస్తూ DNA గురించి ఎంతో ఆసక్తిగా చాలా విషయాలు తెలుసుకోవాలని పదే పదే దాని గురించి ఆలోచిస్తుండేవాడిని.
ఒక రోజు కంపాలలో (అంటే ఉగాండా యొక్క రాజధాని) ఒక ఉద్యానవనానికి (Botanical gardens) వెళ్లాను. అద్భుతం ఏమిటంటే అక్కడ ఒక రుద్రాక్ష వృక్షం ఉంది. అక్కడ కొంత మేర వరకు దట్టమైన అడవి ప్రాంతమున్నది. అక్కడే ఒక ఏకాంత ప్రదేశం చూసుకుని, అక్కడకి వెళ్లి ఒక విరిగిన వృక్షపు మాను (కొమ్మ) మీద కూర్చుని జన్యు కణాల గురించి ఆలోచిస్తున్నాను. అప్పుడు ఎదురుగా నాకు కణ్వద మహర్షి ప్రత్యక్షమయ్యారు. ఎటువంటి సంభాషణలు జరపకుండానే నాయనా ! నీవు జన్యు కణాల గురించే ఆలోచిస్తున్నావు కదా ! నేను వాటి గురించే మరి కొన్ని వివరాలు చెప్పడానికి వచ్చాను అని సరాసరి అసలు విషయానికే వచ్చేశారు. నాయనా ! లాహిరి ! ఈ రోజు నీ జీవితంలో మరపు రాని  అద్భుతమైన రోజుగా భావించ వచ్చును. అయితే ప్రస్తుతం నీవు కొంచెం సందిగ్ధావస్థలో ఉన్నావు. అది కొంచెం తగ్గించుకొని మనస్సుని ప్రశాంతంగా పెట్టుకో. అప్పుడే నేను చెప్పిన విషయాలు నీకు బోధ పడతాయి.

Monday 1 February 2016

Kana Siddhaantam-01



భగవంతుడి సృష్టి ఎంత వైరుధ్యమైనది, ఇంత అందమైన గులాబి మొక్కలకి ముళ్ళని కూడా ప్రసాదించాడు కదా" అని  నీవు మనస్సులో ఆలోచిస్తున్నావు కదా గులాబీలు అందరికీ ఇష్టం అవుతాయి కాని దానికున్న ముళ్ళు ఎవరికీ ఇష్టం ఉండదు. అయితే  నేను నా ప్రయోగాల ద్వారా పూల రంగుని మార్చ వచ్చునని ముళ్ళు కూడా లేకుండా గులాబీ మొక్కని సృష్టించ వచ్చునని కనుక్కున్నాను గులాబీ మొక్క విత్తనం ప్రారంభ దశలో కణ విభజన జరిగే సమయం లోనే జన్యు కణాల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం మార్చ గలిగితే మొక్కలో అనేకమైన అద్భుతాలు జరుగుతాయి. రంగు మారి పోతుంది మొక్కకి ముళ్ళు కూడా ఉండవు



అదే విధంగా మానవులలో కూడా చేయ వచ్చును.