N. Sairam Garu || Email: sridatta50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.

Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here
Showing posts with label Spiritual Soup. Show all posts
Showing posts with label Spiritual Soup. Show all posts

Tuesday, 24 January 2017

Spiritual Soup-15

ధ్యానము - ఆధ్యాత్మిక భూమికలు (Dimensions)

లోబ్సంగ్ రంపా (Lobsang Rampa) గారి దర్శనము మరియు అయస్కాంత వ్యక్తి   దర్శనము, వారు  చెప్పిన మాటలు పదేపదే మననం చేసుకుంటూ నా నిత్యకృత్యాలలో మునిగిపోయాను. వారు ఆదేశించినట్టుగానే ధ్యానప్రక్రియ మొదలుపెట్టాను, కాని ఎంత ప్రయత్నించినా కూడా ధ్యానం మీద మనస్సు నిలిచేది కాదు. ధ్యానం మొదలుపెట్టగానే మనస్సు పరిపరివిధాలా పరిగెట్టేది, ఎన్నోసార్లు అభ్యంతర విషయాలపైకి కూడా వెళ్తుండేది. మనస్సు యొక్క పరిస్థితి చాలా విచిత్రంగా ఉంటుంది. ప్రతివ్యక్తీ కూడా ఎల్లవేళలా వర్తమానాన్ని వదిలి భూత, భవిష్యత్ కాలాలోనే జీవిస్తూ ఉంటాడు. భూతకాలంలో జరిగిన మంచికన్నా ఎక్కువగా చెడునీ, మనస్సుకి కష్టం కలిగించే విషయాలనే తలచుకుంటూ, ఏ వ్యక్తి వల్ల అలా బాధపడాల్సి వచ్చిందో ఆ వ్యక్తుల గురించి ఆలోచిస్తూ, వారిని నిందిస్తూ ఉంటారు. భవిష్యత్తులో కూడా ఇలాగే చెడు జరుగుతుందని ఆలోచిస్తూ ఉంటారు. కాని పొరబాటున కూడా మంచి గురించి ఆలోచించకుండా అడకత్తెరలో పోకచెక్కలాగా నలిగిపోతుంటారు. దీని మూలంగా వారిలో చెడుస్పందనలు కలుగుతూ ఉంటాయి. నిజానికి ఎవరైతే  వర్తమానకాలములో జీవిస్తారో వాళ్ళ జీవితాలు అద్భుతంగా ఉంటాయి. అది కాకుండా భూత, భవిష్యకాలంలో కూడా ఎవరు మంచి విషయాలు ఆలోచిస్తారో వారు మంచిస్పందనలు కలిగి ఎప్పుడూ సంతోషముగా ఉంటారు. కాని సగటు మానవుడు మాత్రము ఎప్పుడూ జరిగిపోయిన చెడూ, జరగబోయే చెడుని గురించ ఆలోచిస్తూ ఉండడము వల్ల మనస్సు నిలకడగా ఉండదు. అందుకనే మన పూర్వీకులు ఎప్పుడూ సత్సంగాలలో పాల్గొనడమో, మంచిపుస్తకాలు, ఆద్యాత్మిక పుస్తకాలో లేక మంచిపనులతో మనని ప్రభావితము చేసే   మహానుభావుల జీవితచరిత్రలో చదువుతూ ఉండేవారు. ఒక్కక్కసారి సినిమాల్లో చూపబడే భయంకరదృశ్యాలో లేక శృంగార సన్నివేశాలో చూసినప్పుడు మన మనస్సు వాటిచుట్టే తిరుగుతూ ధ్యానం మీద నిలకడ ఉండదు. ఇలాంటి కారణాల వల్లే కాబోలు నా మనస్సు నిలకడగా ఉండట్లేదు అని నేను అనుకుంటున్నాను. ఇలా ఆలోచిస్తూ ఉంటే ఒక్కక్కసారి మనస్సు అనవసరమయిన ఏ విషయాలు ఆలోచించకుండా ఉంటే ప్రశాంతముగా ఉంటుంది. అందుకనే సాధ్యమైనంతవరకు అవతలివ్యక్తుల సంభాషణలు నాకు నచ్చకపోతే వారికో నమస్కారం పెట్టి దూరంగా వెళ్ళిపోతాను. దాని మూలంగా వారి ప్రభావము నామీద పడకపోవడంవల్ల ధ్యానం కాస్త దారిలో పడుతుంది.

అలా నా ధ్యానం కొన్నిరోజులకి ఒక దారిన పడి నా మనస్సు ప్రశాంతంగా ఉంది, ఎటువంటి ఆలోచనలు లేవు. అలా ఉండగా ఒక రోజు నాకు మళ్ళీ అయస్కాంత వ్యక్తి దర్శనమయింది. అయితే చాలా తరచుగా అతను కనిపిస్తుండడం వల్ల మనస్సులో ఉత్సాహం ఉన్నా అది పైకి కనిపించని స్థితికి వచ్చాను. నన్ను చూసి ఆయన ఇలా అన్నారు, “నాయనా! నీవు మంచి స్థితికి వచ్చావు. ఇదివరకు ఎప్పుడూ ఏదో ఆందోళనగా, ఆలోచిస్తున్నట్టుగా ఉండేవాడివి. దాని మూలంగా భావతరంగాలలో మునిగి నీ దగ్గరలో ఉన్న నన్ను చూసేవాడివి కావు. ఇప్పుడు నిన్ను చూస్తే చాలా సంతోషంగా ఉంది”.  “ఇదివరకు కలసినప్పుడు మీరేన్నోవిషయాలు నాకు చెప్పారు. అవి అప్పుడు అర్థమయినట్టుగా అనిపించినా తర్వాత ఆలోచిస్తే కొన్ని అర్థం అయినట్లుగా లేవు. డైమెన్షన్స్ (Dimensions) అంటున్నారు, కాస్త ఈ డైమెన్షన్స్ ఏమిటో వివరంగా చెప్తారా” అని అడిగాను. “చాలా మంచి ప్రశ్న వేసావు నాయనా! కాని ఇక్కడ చిన్న చిక్కు ఉంది. పరమగుప్తమైన ఈ ఆధ్యాత్మిక విషయం మీ స్థాయికి దిగి వచ్చి మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అనేది అతికష్టమైన ప్రక్రియ. సంక్షిప్తమయిన భావాలకి సరయిన భాష కాని, పదాలు కాని మీ భాషలో ఉండవు. అందుకనే మేము చెప్పేది ఒకటయితే మీరర్థం చేసుకునేది ఇంకొకటి అవుతుంది. లోగడ కూడా ఆధ్యాత్మిక గ్రంథాలు వ్రాసినవారు సాధారణ మనుషులే కాని వారు ఉన్నతస్థాయిలో ఉండి వ్రాసిన పుస్తకాలు అవి. ఆ రోజుల్లో ఇప్పటిలాగా ప్రింటింగ్ సౌకర్యాలు లేవు. ఆ రోజుల్లో ప్రింటింగ్ సౌకర్యాలు లేకపోవడం వల్ల విషయజ్ఞానం ఒకరినుండి ఒకరికి శ్రుతిద్వారా వ్యాప్తి చెందుతుండేది. ఎంత బాగా చెప్పినా, అర్థమయినా ఒకరు చెప్పినదానికి ఇంకొకరు చెప్పినదానికి చాలా తేడా ఉండడంతో ప్రజలు సందిగ్ధావస్తలో ఉండేవాళ్ళు. ఆధ్యాత్మిక విషయాలు నీ స్థాయికి దిగి నీకర్థం అయ్యేలా చెప్పడం తప్పదు కాబట్టి సాధ్యమైనంతవరకూ నీకు అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీకు ఏ విషయమైనా కథల రూపంలో చెప్తే ఆసక్తిగా విని అర్థం చేసుకుంటారు. కాని ఆ కథలో ఉన్న నీతిని గురించి కాని దాన్ని జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి అని ఆలోచించరు. అయినా సరే నీవడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తాను.

లౌకికమూ, అలౌకికమూ అనే పదాలు నీకు తెలుసు కదా. అలౌకికము అంటే మాకు సమయము, ప్రదేశము అనేవి ఉండవు. అన్నీ కలిపి టైం అండ్ స్పేస్ అని చెప్తారు.  టైం అండ్ స్పేస్ అనే కాన్సెప్ట్ మాకు ఉండదు. అది మీ భాషలో చెప్పినా మీకర్థం కాదు. ఏ విషయాన్నయినా మీకు ముక్కలు, ముక్కలుగా చేసి , చిన్న భాగాలుగా చెప్పితే  కాని అర్థం కాదు.” అని అన్నప్పుడు నేను “మహాత్మా ! ముక్కలు ముక్కలు ఏమిటీ ? చిన్న భాగాలు ఏమిటీ నాకు అర్థం కాలేదు” అని చెప్పగా ఆయన నవ్వి “అదే చెప్పుతున్నాను, విను. ఉదాహరణకి కాలం అనేది ఒక ప్రవాహం. అది బ్రహ్మాండమయిన  మహా చైతన్య శక్తి, నిరంతరమూ సాగిపోతూనే ఉంటుంది. మీకు కాలం ఇలా వెళ్ళిపోతుంది అని చెప్తే అర్థం కాదు కదా అందుకనే దాన్ని సంవత్సరాలు, నెలలు,వారాలు, దినాలు, గంటలు, సెకన్లుగా విభజించాము. నిజానికి కాలం అలా ముక్కలు ముక్కలుగా ఉండదు. అది నిరంతరమూ ప్రవాహంలాగా సాగిపోతూ ఉంటుంది.అందుకనే మీ స్థాయికి వచ్చి మీకర్థంయ్యేట్టుగా లీనియర్ భాషలో చెప్పాల్సి వస్తుంది. మీ ఆలోచనలు ఒక రేఖ (లైన్) లాగా ఒకే డైమెన్షన్ లో ఉంటాయి అందుకనే మీకదే డైమెన్షన్లో  చెప్పాల్సి వస్తుంది.మీలో కొంతమంది నిరంతర సాధన వల్ల మా స్థాయికి చేరుకోగలుగుతారు. వారికి  భాషతో ప్రమేయం ఉండదు, నిశ్శబ్దంగా అన్నీ గమనిస్తూ ఉంటారు” అని వివరించారు.  “మహాత్మా! నాకు ఇప్పుడు కొంచెం కొంచెంగా అర్థం అవుతుంది కాని ప్రతీసారి డైమెన్షన్స్, లోవర్ డైమెన్షన్స్, అప్పర్ డైమెన్షన్స్ అంటారు. అవి ఏమిటీ ? ఎన్ని డైమెన్షన్స్ ఉంటాయి? అని అడగగా “నాయనా ! నిజానికి డైమెన్శన్స్ లో ఎన్నో రకాలు ఉండవు. కాలాన్ని గురించి లీనియర్ భాషలో ఎలా చెప్పానో అలాగే ఈ భూమికల గురించి కూడా నీకర్థంయ్యేట్టుగా చెప్తాను.  ఉదాహరణకి అక్షరాభ్యాసం చేసినప్పుడు మీరు పలకా బలపం పట్టుకుని అక్షరాలు నేర్చుకుంటారు. తర్వాత పెద్దయ్యాక మీకు భౌతికంగా వాటిని పట్టుకోనవసరం లేదు. అన్ని చదవగలుగుతారు, అంటే ఏమిటి ? మీరు పై స్థాయికి వచ్చినట్లే. ఆ స్థాయికి తగ్గట్లు మీరు చదువుకుంటారు. పైస్థాయికి వెళ్ళినప్పుడు మీరు ఏవైతే భౌతికంగా పలక మీద రాసారో అవి మీ మెదడులో కాని, మనస్సులో కాని ప్రతిష్టించి పోయి ఉంటాయి. అవి జ్ఞానము అనే చైతన్య స్థాయిలో ఉంటాయి.మీ శక్తి సామర్త్యాలని బట్టి మీరు ఏ భూమికలో ఉన్నప్పుడు ఆ భూమికకు తగ్గట్టుగా విషయం చెప్పబడుతుంది. ఒకటవ తరగతిలో చదువుతున్న విద్యార్థికి వృక్ష శాస్త్రము, జంతుశాస్త్రమో చెప్తే అర్థం అవుతుందా ?కాబట్టి భూమికల గురించి చెప్పాల్సి వచ్చింది. అంతే కాని లేక పొతే మీకర్థం కాదు. ఇంకా చెప్పాలంటే 1,2,3........10వ తరగతి ,కాలేజి విద్యలో, ఉన్నత విద్యలు అంటూ మీరు భౌతిక రూపంలో ఉన్న విషయాలు చదువుతున్నప్పుడు, అర్థం చేసుకుంటున్నప్పుడు   వాటి గురించి విస్తారంగా తెలుసుకోవాలంటే మీరున్న తరగతి నుంచి పై తరగతికి వెళ్ళాలి, అలా వెళ్లినపుడే  అవి మీకు అర్థం అవుతుంటాయి. అయితే మీరు క్రింద భూమికనుంచి పై భూమికకి వెళ్ళినప్పుడు మీ భూమికను బట్టి సరి అయిన పరిజ్ఞానం ఉంటుంది కాబట్టి విషయం మీకు సరిగ్గా అర్థమవుతుంది. అలాగే ఈ ఆధ్యాత్మికంలో కూడా ఉంటుంది” అని చెప్పారు. అప్పుడు “మహాత్మా ! కొంచెం కొంచెం అర్థమవుతుంది. ఇంకా మీరు దాని గురించి వివరంగా చెప్తారా” అని అడిగాను. ఆయన నవ్వి “సరే ! ఇంకా వివరంగా చెప్తాను” అని అన్నారు. “అయితే మానవులకి విజ్ఞానము అక్షరరూపంలో ఉంటుంది. మీరు మొదట్లో బడికి వెళ్ళినప్పుడు తెలుగులో అ,ఆ ,ఇ,ఈ లు,ఇంగ్లీషులో ఎ,బీ, సి, డి, లు అని చదువుతారు. దీన్నిబట్టి విజ్ఞానికి ఒక ఆకారం ఉంది అని తెలుస్తుంది. మీరు అమ్మ ,ఆవు అన్నప్పుడు మీకు మీ అమ్మగారు ,ఆవు ప్రత్యక్షమవుతారు. దీనివల్ల మీకేం తెలుస్తుంది ? అవ్యక్తంగా ఉన్నదాన్ని వ్యక్తపరచాలంటే నిరాకారంగా ఉన్నదానికి ఒక ఆకారం కలిపించి చెప్తేనే మీకర్థం అవుతుంది”. అవును మహాత్మా ! ఇప్పుడు కొంచెం కొంచెం అర్థం అవుతుంది. ఆ అక్షరాలను బట్టి మేము చదువుతాము.” “అంటే ఏమిటి మీరిప్పుడు చదివే అక్షరాలు ఒకప్పుడు అవి అక్షరాలుగా రానప్పుడు ఒక అవ్యక్తస్థితిలో ఉన్న శక్తిగానే  (invisible energy ) మీరు గమనించాలి. అంటే ప్రతి అక్షరంలో జ్ఞానము ఉంది, అది అవ్యక్తస్థితిలో ఉన్నపుడు  దాన్నే మనము చైతన్యశక్తి అని అంటాము . మీరు ఏదైనా పుస్తకాన్ని చదువుతున్నప్పుడు అందులో ఉన్న అక్షరాలూ , గీతలూ, బొమ్మలు మొదలైన సంకేతాలను బట్టే చదువుతారు కదా ! ఆ సంకేతాలని చదువుతూ ఉంటే మీరు ఆ చైతన్యంలో ఒక భాగమై జ్ఞానాన్ని పొందుతారు. జ్ఞానమూ, విజ్ఞానమూ ఏవైతే ఉన్నాయో అవి ఒక మహా చైతన్య స్థితిలో ఉన్నాయి.”

“మహాత్మా, ఇప్పుడు కొంచెం కొంచెంగా అర్థమవుతుంది” అని అన్నాను. దానికి ఆయన “నీవు ఎప్పుడైనా ఏ విషయాన్నైనా సరే విశ్లేషించుకోవాలి విమర్శించుకోవాలి. గురువులనే వారు ప్రత్యేకంగా ఉండరు, మీలోనే ఒక గురువుని భగవంతుడు ప్రతిష్టించాడు”  అనగా నేను “కొంచెం వివరించి చెప్పండి మహాత్మా” అని అడుగగా “నాయనా, ప్రతి మనిషిలో కూడా ఏ విషయమయినా ఒకే ఒకే కోణంలో మరియు  వివిధ కోణాల్లో చూసే సామర్ధ్యం ఉంటుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సింగిలారిటి ఉంటుంది అంతే కాకుండా మల్టీ డైమెన్షనల్గా  కూడా ఆలోచిస్తారు. మీరు కేవలం ఒకే భూమికలో ఉండి ఆలోచించారు, అప్పుడప్పుడు పైభూమికలలో కూడా వెళ్ళుతూ ఉంటారు. ఎవరైతే ఈ పైభూమికలలో  ఉండి అనుసంధానం కావించబడతారో వారికి ఎప్పటికీ అర్థం కాని విషయాలు అర్థం అవుతాయి.

పై భూమికలో వెళ్ళడం అంటే ఏమిటీ ? ఆ భూమికలో ఉన్న విషయజ్ఞానాన్ని గ్రహించడం, అంటే నేను ఇదివరకే చెప్పినట్లుగా క్రమక్రమంగా ఆధ్యాత్మిక స్థితిలో పైభూమికల్లో చేరుతుంటారు. అంటే మీలో ఏకాగ్రత పెరిగినప్పుడు, మంచి విషయాల గురించి   ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఒక్కొక్కసారి పైభూమికలో వెళ్ళుతూ ఉంటారు.”
“అయితే మహాత్మా ! మాలోనే కొంతమందిని ఋషులూ, యోగులూ,సిద్ధులూ  అని అంటారు మరి తేడా ఏమిటీ ?” అని అడిగాను. అప్పుడు ఆయన ఇలా అన్నారు “నాయనా. మీకు వారికి తేడా ఏమి లేదు. వారు కూడా మీ స్థాయినుంచి పైస్థాయికి వచ్చినవాళ్ళే. కాకపొతే మీకు వారికి తేడా ఏమిటంటే మీరు అప్పుడప్పుడు పై భూమికల్లోకి వెళ్లి అక్కడ మహా చైతన్య శక్తితో అనుసంధానించబడి ఎప్పటికి అర్థం కాని విషయాలను అర్థం చేసుకోగలుగుతారు. కాని అదే స్థితిలో మీరు ఎప్పుడూ ఉండరు. మామూలు స్థితికి వచ్చినప్పుడు కామ, క్రోధ, మద, లోభ, మోహ, మాత్సర్యాలకు అనుగుణంగానే మీరు ప్రవర్తిస్తూ ఉంటారు. కాని మీలో ఉన్న మామూలు మానవులే పైభూమికలో వెళ్ళినప్పుడు మహాచైతన్య శక్తితో నిరంతరమూ అనుసంధానించబడతారు కాబట్టి ప్రకృతిలో ఒక భాగామవుతారు. ప్రకృతి కూడా వారికి అనుగుణంగానే ఉంటుంది” అని వివరించారు. “కాని మహాత్మా !  విషయం పూర్తిగా అర్థమయినట్లుగా లేదు. కొంచెం స్పష్టంగా వివరిస్తారా, ఆ స్థాయికి వెళ్ళాలంటే ఏం చేయాలి” అని అడుగగా,
నాయనా ! నీకు మొదలే చెప్పాను. పై స్థాయిలో ఉన్న విషయాలు మీ స్థాయిలో  చెప్పాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందని.  అందుకు తగిన భాష ఉండదు.అయినా నీకు నేను   తప్పకుండా చెప్తాను”
అని చెప్పి ఆయన ఒక్క క్షణం ఆగారు. “నాయనా జాగ్రత్తగా విను.నేను చెప్పినట్లే భగవంతుని యొక్క మహాచైతన్యశక్తి , పరిశుద్ధమైనటువంటి శక్తి ఒక ఎనర్జీ రూపంలో ఉంటుంది. ఇవన్నీ కూడా మానవులలో ఎవరికైతే భేదభావాలు ఉండవో , సుఖదు:ఖాలని ఒకే రీతిగా భావిస్తారో, ఎవరికైతే వీరు మంచివాళ్ళు, వీరు చెడ్డవాళ్ళు , అంటరాని వాళ్లు, దుర్మార్గులు అనే భావన ఉండదో వారి మానసికశక్తి చాలా పరిశుద్ధంగా ఉండడమే కాకుండా ప్రకాశవంతంగా ఉంటుంది. అటువంటి ప్రకాశవంతమైన శక్తి ఎప్పుడైతే ఉంటుందో  వారు ఈ మహాచైతన్యశక్తితో అనుసంధానం కావించబడతారు.


అటువంటివారు మహిమలూ, లీలలూ అని ప్రత్యేకంగా వాటి వెంటపడరు. కాని ఈ మహిమలు ,అష్టశక్తులే వారి వెంటపడుతుంటాయి .ఆ మహానుభావులు అటువంటి శక్తికి లొంగక నిరతరమూ వారు ఈ చైతన్యశక్తితో అనుసంధానం కావించబడతారు. ఎటువంటి వికారాలు వారికి ఉండవు”, అని ఆయన వివరించారు. అప్పుడు ఆయన ఇంకొక విషయం కూడా చెప్పారు “నీకు ఇప్పుడు ఇన్ని విషయాలు చెప్పాను. ఇవన్నీ ఒక్కసారిగా అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి నేను చెప్పిన విషయాలన్నీ కూడా మరొక్కసారి విమర్శన చేసుకుని నీలో నువ్వే ప్రశ్నించుకో. నీలో ఒక అంతర్మధనం కలగాలి. కనుక నేను చెప్పిన విషయాలు ధ్యానపరంగా ఆలోచించు.నీవు ఎలాగో స్వాధ్యయనం చేస్తున్నావు కదా. దాని వల్ల నీకు ఎన్నో మంచి విషయాలు అర్థమవుతుంటాయి. ప్రస్తుతం నేను చెప్పిన విషయాలు విమర్శన చేసుకో” అని చెప్పి అయస్కాంత వ్యక్తి అదృశ్యమైపోయారు.

నాకు ఇదంతా కొంచెం అర్థమయినట్టుగా కొంచెం అర్థం కానట్టుగా ఉంది. ఏ విషయమైనా మనం చదివినప్పుడు పదిసార్లు మననం చేసుకుంటే కాని అర్థం కాదు. చిన్నప్పుడు మన పాఠ్యపుస్తకాలలోని విషయాలు మన మాస్టారుగారు చెప్తే ఒక్కసారికే మనకి అర్థం అయిపోయేవా? పదే పదే మనం చదివినప్పుడు మనకి అర్థం అయ్యేవి. ఒక్కొక్కసారి వేరే ఎవరైనా చెప్తే అర్థం అయ్యేవి కదా. ఈవిధంగా నేను ఆలోచిస్తూ అయస్కాంత వ్యక్తి మాటలు విమర్శించుకోవడం మొదలు పెట్టాను. అయస్కాంత వ్యక్తితో జరిగిన సంభాషణలను నేను పదే పదే మననం చేసుకుంటూ ఇంకా ఆయన చెప్పిన సమాధానాల్ని ఎక్కడ ఎలా విశ్లేశించుకోవాలో, ఎలా అర్థం చేసుకోవాలో అని నేను ఆలోచిస్తూ ఉన్నాను. అయితే నాలో ఉన్న ఏ గురువు కూడా అన్ని విషయాలు విశదీకరించి చెప్పరు. ఒక మార్గానికి నాలుగు మూలలు, నాలుగు దిక్కులు ఉంటే కేవలం ఒక్క మూల కాని, ఒక్క దిక్కు గాని చూపిస్తారు. దాన్ని బట్టి మిగతా దిక్కులని, మూలలని మనం కనుక్కోవాలి. ఎందుకంటే ఏ విషయము నిర్ధారణ చేసుకోవాలన్నా స్వానుభవం వల్ల ఒక ధృఢ నిర్ణయానికి కాని అభిప్రాయానికి కాని రావడం జరుగుతుంది.
ఏదో రోజులయితే గడిచిపోతున్నాయి, నా ధ్యానం సాఫీగా సాగటం లేదు. ఒక ప్రశ్నకి సమాధానం దొరికితే అందులోనుంచి ఇంకొక ప్రశ్న, అందులోంచి ఇంకొక ప్రశ్న, ఇలా గొలుసులలాగా పుట్టుకొస్తున్నాయి. పాపం! మనుష్యుల జీవితాలు ఇంతే కదా అని పరిపరివిధాలా ఆలోచిస్తున్నాను. మరి ఆయనేమో ఎవ్వరి గుణదోషాలు చూడవద్దు, పరిశుద్ధమైన ఆలోచనలు ఉండాలి అని అన్నారు. భగవంతుని మహాచైతన్యశక్తి అని అంటున్నారు.దీన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి. వేరే వాళ్లకి చెప్తున్నప్పుడు వారికి ఎలా అర్థమయ్యేటట్టు చెప్పాలి అని ఆలోచిస్తుండగా అనుకోకుండా నా దృష్టి "ఒక యోగి ఆత్మ కథ " (Autobiography of a yogi) మీద పడింది. 1971-72 సంవత్సరంలో నేను ఆ పుస్తకం చదవడం, ఆ తర్వాత యోగాడా సత్సంగ్ సొసైటీ లో దీక్ష తీసుకోవడం గురించి ఇదివరకే చెప్పాను. ఆ పుస్తకం చదువుతుండగా అందులోని ఒక సంఘటన నాకు జ్ఞాపకం వచ్చింది. అప్పుడు నాకు అర్థం అయింది. మనుష్యులకి ఏ విషయమైనా ఉపన్యాస ధోరణిలో కాకుండా కథల్లాగా చెప్తే తొందరగా అర్థం అవుతుంది, హృదయానికి హత్తుకుపోతుంది అని. అలాంటి ఒక ఘటన గుర్తుకి వచ్చింది. అది ఏమనగా గురుపరంపరలో అంటే యోగాడా సాంప్రదాయంలో మొట్టమొదటి గురువు మహావతార బాబాజి గారు. ఆయన్ని చాలా మంది దత్తాత్రేయుడిలాగానే భావిస్తుంటారు. ఆ మహావతార బాబాజిగారి ప్రియశిష్యుడు శ్రీ లాహిరి మహాశయులు, ఆయన శిష్యుడు శ్రీ యుక్తేశ్వరగిరి, ఆయన శిష్యుడు శ్రీ పరమహంసయోగానందగారు. లాహిరి మహాశాయులు గారు ఆయన గురువుగారిని ఎన్నో సార్లు చూడడం జరిగింది కాని యుక్తేశ్వరులుగారు ఆయన దర్శనం ఎప్పుడు కలుగుతుందా అని ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ఒకసారి గురువైన లాహిరి మహాశయులు గారు వారికి కాశిలో కుంభమేళ జరుగుతుంది నీవు వెళ్ళు అన్నట్టుగా టెలీపతి ద్వారా చెప్పారు. అది విని యుక్తేశ్వరులుగారు చాలా సంతోషపడి కుంభమేళయాత్రకి వెళ్ళారు. అయితే ఆయన మనస్సు మటుకు బాబాజీ గారిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆత్రుతగా ,ఆదుర్దాగా ఉంది. అనుకోకుండా ఆయన దృష్టి దూరంగా ఉన్న ఒక వ్యక్తి మీద పడింది. వెంటనే యుక్తేశ్వరగిరిగారికి ఆయన ఎవరో కాదు సాక్షాత్తు బాబాజి గారే అని అర్థమయింది. అక్కడ ఆయన ఒక కపట సన్యాసికి సేవ చేస్తున్నారు (అతను ఉత్త మోసగాడు , కపట సన్యాసి అని అందరికీ తెలుసు) యుక్తేశ్వర్ గారు కూడా ఒక్క క్షణం ఆశ్చర్య పోయారు. దైవ సమానమైన ఆ బాబాగారు ఈ కపట సన్యాసికి సేవ చేయడం ఏమిటీ అనే ఒక ప్రశ్న ఆయన మనస్సుకి వచ్చింది. దానికి సమాధానంగా బాబాగారు పంపిన వాణి కూడా అర్థం అయింది. ఆయన ఇలా చెప్పారు “నీ దృష్టిలో ఇతను కపట సన్యాసి కావచ్చు కాని నాకా భావన లేదు. ఇతను భోజనం చేసిన పాత్రలు నేను శుభ్రంగా కడిగి భ క్తిశ్రద్ధలతో ఈ బట్టతో తుడుస్తున్నాను, అంతేకాదు ఆయన విడిచిన మైలబట్టలు కూడా ఉతుకుతున్నాను. కూరగాయలు కొని వంట కూడా చేసి పెడ్తున్నాను”. అయితే యుక్తేశ్వరులుగారు మహాజ్ఞాని కాబట్టి తన తప్పు తెలుసుకున్నారు. ఇదే కాబోలు గుణదోషాలు ఎంచకూడదు అంటే అని నాకిప్పుడు ఈ కథ ద్వారా స్పష్టం అయింది. ఈ విధంగా విమర్శన చేసుకున్నప్పుడు తప్పకుండా ఆ దైవికశక్తి మనకు సహాయం చేస్తూ ఉంటుంది అది పుస్తక రూపంలో కావచ్చు వేరే ఏదైనా రూపంలో కావచ్చు మరి ఇంకొక విషయం కూడా నాకు అర్థమయింది. అది ఏమిటంటే జ్ఞానము అనేది ఒక మహా చైతన్యము. అది అంతరాంతరాలలో అవ్యక్త స్థితిలో ఉంటుంది అందుకే దానిని మహానుభావులు ప్రకాశంతో పోల్చారు. అది ఒక అవ్యక్త రూపంలో ఉన్నప్పుడు ఒక ధ్వని రూపంలో బయటపడ్తుంది. కాబట్టి ఈ ప్రపంచంలో ప్రధానమైనవి రెండే రెండు. వీటి వల్లే ఈ జగతి నడుస్తుంది అని నాకు అనిపించింది. ఒకటి విషయపరిజ్ఞానము అంటే ప్రకాశము, రెండవది ధ్వని (వ్యక్తస్థితిలో ఉన్నప్పుడు అది శక్తిరూపంలో మారినప్పుడు ధ్వనిరూపంలో బయటకు వస్తుంది) ఎవరైతే ఈ ప్రకాశాన్ని, ధ్వనినీ రెంటినీ సమన్వయపరచి అర్థం చేసుకుంటారో వారికి భగవంతుడి తత్త్వం పూర్తిగా అర్థం అవుతుంది అని నేను గ్రహించాను. అయితే మనకి కూడా ఏ అరిషడ్వర్గాలు లేనప్పుడే మనకి ఎదుటివారిలో లేని పోని గుణాలు కనిపించవు .

ఇదే సందర్భంలో నాకు ఇంకొక ఉదాహరణ త్రైలింగస్వామి గారిది, ఒక యోగి ఆత్మ కథలో చదివాను అది జ్ఞాపకం వచ్చింది.ఆయన కూడా ఒక యోగి, వారణాసిలో ఉంటుండేవారు. ఎప్పుడూ ఆ భగవంతుని యొక్క చైతన్యశక్తితో అనుసంధానించబడి బ్రహ్మానందస్థితిలోనే ఉండేవారు. ఎప్పుడూ అలౌకిక ప్రపంచంలోనే ఉంటూ, దిగంబరంగా తిరుగుతూ ఉండేవారు. వారణాసిలోనే ఒక ధూర్తుడు కూడా ఉండేవాడు.అతను సున్నపు భట్టిలో పని చేస్తూ ఉండేవాడు. ఈ స్వామిని చూసి ఎప్పుడూ వెటకారంగా మాట్లాడుతుండేవాడు. ఒకసారి ఆయనని ఆట పట్టించాలని ఆలోచించి మహాఆదరంగా ఆహ్వానించి సున్నపు నీటిని ఇచ్చి “ఒక గ్లాసు మజ్జిగ త్రాగండి” అని ఇచ్చాడు. మనస్సులో ఆనంద పడుతూ పైకి మటుకు “త్రాగండి స్వామి! ప్రత్యేకంగా మీకోసం తయారు చేసాను” అని అన్నాడు. స్వామి సరే అని త్రాగడం మొదలు పెట్టారో లేదో ఆ ధూర్తుడు “మంటలూ ! మంటలూ !” అని గట్టిగా అరుస్తూ, గంతులు వేస్తూ “స్వామీ ! రక్షించండి”  అని ఆయన కాళ్ళ మీద పడి ప్రాధేయపడ్డాడు. బ్రహ్మానంద స్థితిలో ఉన్న ఎవరినైనా మనం బాధపెట్టడానికి ప్రయత్నించినప్పుడు ఆ బాధ వాళ్లకి తగలకుండా మనకే తగులుతుంది అని నాకర్థమయింది. స్వామీజీ కొంచెంకూడా కోపం రాలేదు. “నాయనా, ఇలాంటి పనులు ఎన్నడూ చేయవద్దు.అందరిలో భగవంతుడు ఉన్నాడు” అని చెప్పారు. స్వామి వారు అతనికి ఎప్పుడైతే అభయం ఇచ్చారో అప్పుడు వెంటనే అతని బాధ తగ్గిపోయింది.

ప్రతి మనిషిలో కూడా భగవంతుడు చైతన్యస్థాయిలో ఉంటాడు. ఆ చైతన్యం ప్రతి మనిషిలో ప్రతిబింబిస్తుంది.  విషయపరిజ్ఞానం లేని వాళ్ళలో చైతన్యం మాయ అనే తెరలో కప్పబడి ఉంటుంది.ఎవరైనా మహాత్ములకి అపకారం చేసినప్పుడు దాని ఫలితం వాళ్ళ మీదకే వస్తుంది. అంటే మీలో ఉన్న బ్రహ్మపదార్ధం నాలో ఉన్న బ్రహ్మ పదార్ధం ఒకటే కాబట్టి నేనేవరికైనా అపకారం చేయాలని దెబ్బ కొట్టినప్పుడు అది నాకే తగిలి నన్నే ఎవరో దెబ్బ కొట్టినట్టుగా అనిపిస్తుంది. మనం భౌతికంగా ఆ బాధను అనుభవించకపోయినా బాధామయమైన స్పందన కలిగి ఎవరైతే కొట్టారో వారిలో ప్రతిష్టమైపోయి ఏదో ఒక రూపంలో బయటికి వస్తాయి. ఆ బాధ స్వయంగా అనుభవించే దాకా ఎదుటివారిని ఎంత బాధపెట్టాడో అర్థము కాదు. అందుకని మనం ఎవరిని కూడా అనవసరంగా బాధించకూడదు అని నాకు అర్థం అయింది. గుణదోషం ఉండకూడదు అంటే ఇదన్నమాట అని చెప్పి నేను విమర్శించుకున్నాను. ఒక విధంగా నాకు ఇటువంటి కథల వల్ల అయస్కాంత వ్యక్తి చెప్పిన మాటలు అర్థం చేసుకోవడం జరిగింది.


Monday, 23 January 2017

Spiritual Soup-14


స్పిరుచ్యువల్ సూప్ 14

ప్రతీ గురువారం మేము ఎవరో ఒకరి ఇంట్లో కలిసి గంటసేపు దత్తాత్రేయుడు, షిరిడీ సాయిబాబా, ఆధ్యాత్మిక గురువుల గురించి మాట్లాడుతూ ఉండేవాళ్లం. అందులో ఒక పదిహేను నిమిషాలు వేదాంతం, షిరిడీ సాయిబాబా చరిత్ర, గురు చరిత్ర, దత్తపురాణానికి సంబంధించిన చర్చ కూడా నడుస్తూ ఉండేది. కుంబ్లే, అనిల్, చారిగారు మా ఆధ్యాత్మిక బృందంలో సభ్యులు. ఒకసారి ఈస్టర్ పండుగ ముందు కుంబ్లేగారు ఫోన్ చేశారు. కుంబ్లేగారు ఒక ఇటాలియన్ టూరిస్ట్ కంపెనీలో కంప్యూటర్ డివిజన్లో పని చేస్తూ ఉండేవారు. నేషనల్ పార్కులో ఉన్న తమ కార్యాలయంలో రెండు కంప్యూటర్లలో సమస్య వచ్చింది, దాన్ని బాగు చేయడానికి యాజమాన్యం అక్కడికి పంపిస్తోందని ఫోన్ చేసి చెప్పారు. అయితే ఈస్టర్ పండుగ కాబట్టి ఒక్కరే వెళ్లడం ఎందుకు, ఎవరైనా స్నేహితులను కూడా వెంటబెట్టుకుని వెళ్లమన్నారంటూ నాకు చెప్పారు. నన్ను గుర్తుపెట్టుకుని రమ్మన్నందుకు నేను చాలా సంతోషపడ్డాను.


కంపెనీకి చెందిన ప్రత్యేక ఫ్లైట్లో కుంబ్లేగారు, నేను, చారితో పాటు మరొక మిత్రుడు కలిసి వెళ్లాం. ఆ ప్రాంతం ఒక తూనీగలా ఉంటుంది. ఫ్లైట్ లో గంట ప్రయాణం తర్వాత ఒక అడవి ప్రాంతంలో దిగాం. మేం దిగిన తర్వాత లాడ్జి నుంచి ప్రత్యేక జీపు మా కోసం వచ్చింది. ఆ వాహనానికి పైన మాత్రమే టార్పాలిన్ లాంటి కవర్ ఉంది. అటూ.. ఇటూ.. ఏమీ లేదు, దాన్ని చూసి మేం డ్రైవర్ ను అడిగాం “అరణ్యం మధ్య నుంచి మమ్మల్ని తీసుకువెళ్తున్నావు కదా, ఇక్కడ చాలా మృగాలన్నీ తిరుగుతున్నట్టు ఉన్నాయి.. ప్రమాదం లేదా ?” అప్పుడు డ్రైవర్ అన్నాడు.. 'కొన్ని కొన్ని పార్కుల్లో జంతువుల ప్రవర్తన ఒక్కోలా ఉంటుంది. అదే మసాయ్ మారా నేషనల్ పార్కులో మాత్రం మీరు ఇలాంటి జీపులో వెళ్లి ఉండేవారు కాదు. ఎందుకంటే మీరు ఈ పాటికే ఏ సింహం కడుపులోనో ఉండేవారు' అని చమత్కరించాడు. మేం కూడా అతనితో పాటు నవ్వుకుంటూ లాడ్జికి చేరాం. చాలా ఆకలి వేస్తూ ఉండడంతో మా కోసం ఏర్పాటు చేసిన వెజిటబుల్ శాండ్ విచ్ తిన్నాం. ఆ సమయంలో హోటల్ మేనేజర్ మేం తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. 'టెంట్ హౌస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే 'మసాయ్' అని పిలిస్తే ఆ తెగకు చెందిన రక్షకుడు వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తారు. కొసమెరుపుగా ఆయన మరొక విషయం చెప్పాడు. కొద్దిరోజుల క్రితం యూఎస్ నుంచి ఒక కుటుంబం వచ్చిందని, తాను చెప్పిన జాగ్రత్తలను ఆ ఫ్యామిలీలోని పిల్లలు పట్టించుకోకపోవడం ఒక పిల్లాడిని చిరుతపులో, సింహమే తినేసిందనడంతో మా అందరి గుండె ఝల్లుమంది. మాకు కేటాయించిన రూమ్ ఒక వైపు, క్యాబిన్ ఒకవైపు ఉంది. అప్పుడు ఇంకా చీకటి పడలేదు కాబట్టి మేము ఏమీ భయపడలేదు. ఈ లోపు కుంబ్లేగారు తాను వచ్చిన రిపేర్ పనిని చూసుకుంటానన్నారు. రేపు ఉదయం జంగిల్ సఫారీ ఏర్పాటు చేయాలని అక్కడి వాళ్లకు సూచించారు. ఈలోపు అక్కడ కూర్చుని మేం అంతా వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాం. కుంబ్లేగారు రెండు గంటల పాటు కష్టపడ్డ తర్వాత ఆ కంప్యూటర్ రిపేర్ అయింది. రాత్రి అయిన తర్వాత మా కోసం మసాయ్ వచ్చాడు. క్యాబిన్ నుంచి రూముకు బయలుదేరాం. నేను మాత్రం కాస్త భయంతో అటూ ఇటూ చూస్తూ అడుగులు ముందుకు వేస్తున్నాను. అక్కడ బలమైన టెంట్ ఏర్పాటు చేశారు. అదంతా చాలా శుభ్రంగా ఉంది. అక్కడ స్నానం చేసి కాసేపు విశ్రమించి మేమంతా రెస్టారెంటుకు వెళ్లాం. ఈ లోపు రెస్టారెంట్ మేనేజర్ వచ్చారు. 'లాడ్జిలో దిగిన వాళ్లందరూ వస్తున్నారు, నెగడు కూడా వేస్తున్నాము' కాబట్టి కాసేపు సరదాగా గడపాలని కోరారు. దాంతో నేను, చారి గారు కూడా వెళ్లి అక్కడ చాలాసేపు సరాదాగా ముచ్చటించుకున్నాం. అక్కడ ఒక సరస్సు కూడా ఉంది. లాడ్జ్ మేనేజర్ దగ్గరున్న ఇన్ ఫ్రారెడ్ బైనాక్యులర్ తో సరస్సు అందాలను, అందులో ఉన్న హిప్పోపోటమస్ లను అందరికీ చూపిస్తున్నారు. కాసేపటి తర్వాత మేమంతా మళ్లీ మా క్యాబిన్ కు వెళ్లిపోయాం. ఉదయం నుంచి అంతా అలిసిపోయాం కాబట్టి డిన్నర్ చేసి పడుకున్నాం.




నాకు సాధారణంగా అడవులంటే ఇష్టం. ఆ వాతావరణంలో మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మా వృత్తిలో ఎప్పుడూ ఆందోళనగా ఉండేది. అటువంటి ప్రపంచం నుంచి ఇలాంటి ప్రశాంతమైన అడవుల్లోకి రావడం, చెక్క గృహాల్లో నివాసం నాకు చాలా ఆనందంగా అనిపించింది. అయితే నేను ప్రకృతిని ఆస్వాదించేందుకు అక్కడున్న చెక్ ప్లాట్ ఫామ్ పైకి వచ్చాను. కీచురాళ్ల ధ్వనులు, సరస్సును, నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తున్నాను. అలా ఆలోచిస్తూ అక్కడే ఉన్న ఆరామ్ కుర్చీలో నిద్రామయ స్థితిలో ఉండగా, అకస్మాత్తుగా నాలో మంచి స్పందనలు అనుభూతిలోకి వచ్చాయి. నాకు మళ్లీ చాలా కాలం తర్వాత అయస్కాంత వ్యక్తి  దర్శనమైంది. ఏదో ఒక తెలియని హాయి మనస్సుకు అనిపించింది. ఆయనకు వినయంగా నమస్కరించారు. "నీకు ఇంకా చాలా విషయాలను చెప్పవలిసి ఉంది, అయితే పని ఒత్తిడిలో నీ మనసు వేరే ధ్యాసలో ఉండడం వల్ల నేను రాలేకపోయాను. ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉన్నావు కాబట్టి ఇది నాకు అనుకూలమైన పరిస్థితి. నీకు కొన్ని విషయాలను చెప్తాను " అని అయస్కాంత వ్యక్తి అన్నారు. అప్పుడు “మహాత్మా ప్రశాంతంగా ఉన్న నాకు ఒక్కడికే మీరు కనిపిస్తారా లేక ప్రశాంతంగా ఉన్న ప్రతీ ఒక్కరికీ మీ దర్శనం ఉంటుందా” అని అడిగాను. అప్పుడు ఆయన "మాకు ప్రతీ మానవుడు ఒక ప్రత్యేకమైనటువంటి, అద్భుతమైనటువంటి వాళ్లలానే కనిపిస్తారు. కానీ తటస్థ వైఖరి, జిజ్ఞాస ఉన్నవాళ్లకు, సంకుచితమైన ఆలోచనలకు దూరంగా ఉన్న నీలాంటివాళ్లకు మేం ఆకర్షింపబడతాం” అని ఆయన చెప్పుకొచ్చారు. “మీరు ఏ కొత్త విషయాలు తెలుసుకున్నా దాని గురించి ఆలోచిస్తారు, వెంటనే ఖండించరు, పరిపరివిధాల ఆలోచించి తటస్థ వైఖరిలో ఉంటారు కాబట్టే అలాంటివారి యొక్క తత్వానికి ఆకర్షితులవుతాం. అందుకే నేను నీకు కనిపిస్తున్నాను. నేను నీకు చెప్పిన విషయాలను నువ్వు జనాలకు వివరించాలి. నీలాంటి వాళ్లు వందలు, వేల మందికి మేం ఇలానే కనిపించి కొత్త విషయాలను చెప్తుంటాం. కానీ అది వాళ్లకు తెలియదు. వాళ్లే ఏదో కొత్త విషయాలు తెలుసుకుంటున్నట్టు, కొత్త పనులు చేస్తున్నట్టు అనుకుంటారు. కానీ నేను ప్రతీ మానవుడిలోనూ ఉంటాను. నేను లేకుండా ఏ జీవి కూడా ఉండదు. నీలో, నీ మిత్రులలో, సమస్త ప్రకృతిలో వ్యాపించి ఉన్నాను. నేను అయస్కాంత క్షేత్రాన్ని కాబట్టి నేను లేకుండా ఏదీ ఉండలేదు. ప్రస్తుతం ప్రపంచమంతా ఆధ్యాత్మికంగా, రాజకీయంగా, సామాజికంగా అల్లకల్లోలంగా కనిపిస్తున్నాయి. పెద్ద పండితులు, మహానుభావులకే అనేక విషయాలు అర్థం కావడం లేదు" అన్నారు.
అప్పుడు నేను మహాత్మా 'నేను కూడా చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వెళ్తూ ఉంటాను. అక్కడ ఒక గురువు గారు చెప్పిన మాటలకు విరుద్ధంగా మరొక గురువుగారు కొద్ది రోజుల తర్వాత మాట్లాడుతూ ఖండిస్తూ ఉంటారు. పరస్పర విరుద్ధ విషయాలను మేం తరచూ వింటూ ఉన్నాం కాబట్టి నాకు అర్థం కాని ఈ విషయాలను చెప్పమని' అయస్కాంత వ్యక్తిని నేను కోరాను. అప్పుడాయన అన్నారు "పుట్టినప్పటి నుంచి చాలామంది చాలా ఆలోచిస్తూ ఉంటారు. నేను ఎవరిని, నేను భూమిపైకి ఎందుకు వచ్చాను, భగవంతుడు ఉన్నాడా, నేను పోయిన తర్వాత ఏం జరుగుతుంది.. అనే ఆలోచనలతో ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే చాలాసార్లు లౌకిక ఆకర్షణలకు లోనై మార్గం తప్పుతూ ఉంటారు. మహానుభావులు చెప్పిన ప్రతీ విషయానికీ విజ్ఞానపరంగా సాక్ష్యాధారాలు కావాలని వాళ్లంతా అడుగుతూ ఉంటారు. నేను చెప్పినట్టు ప్రతీ వెయ్యి సంవత్సరాలకు ఒకసారి భూఅయస్కాంత క్షేత్రంలో మార్పులూ వస్తూ ఉంటాయి. అప్పుడు పాత నమ్మకాలన్నీ పోయి కొత్త ఆచారాలు వస్తూ ఉంటాయి. అయితే చాలా మంది కొత్త అయస్కాంత క్షేత్రంలోకి రావడానికి భయపడుతూ ఉంటారు, జంకుతారు. కొన్ని తరాలు అలా జరిగిపోయిన తర్వాత వాళ్లు కొత్త క్షేత్రానికి అలవాటు పడిపోతారు. సామూహిక ప్రజాచైతన్యాన్ని బట్టే మార్పులు ఉంటాయి. ఒక దేశంలోని ప్రాంతంలోనే అనేక మార్పులుంటాయి. అలాంటిది ఒక దేశానికి, మరొక దేశానికి కూడా చాలా తేడాలుంటాయి. ఒక ఊరిలో ఒక ప్రాంతానికి చెందిన వాళ్లు ఒకలా, మరొక ప్రాంతానికి చెందిన వాళ్లు మరొకలా ఉంటారు. ఇది ప్రకృతిలోని మార్పు కాదు. ఆ ప్రాంత ప్రజాచైతన్యం బట్టే భూమి యొక్క అయస్కాంత క్షేత్రం, లక్షణం మారుతూ ఉంటుంది. ఇక్కడ మంచి కానీ, చెడు కానీ భగవంతుడు నిర్ణయించడు. కేవలం అక్కడున్న ప్రజలే కారణం. అందుకే పరస్పర విరుద్ధమైన మార్పులు చూస్తూ ఉన్నాం. ఒక జాతి నమ్మిన విశ్వాసాన్ని ఇతరులు నమ్మకపోతే పెద్ద యుద్ధం జరుగుతుంది. ఇది ఆధ్యాత్మికస్థాయిలో తక్కువగా ఉన్నవాళ్ల స్థితి. ప్రస్తుతం మనం మూడో భూమికలో ఉన్నాం. ఇంగ్లిష్ లో చెప్పాలంటే థర్డ్ డైమన్షన్ లో (third dimension) ఉన్నాం. 1987 నుంచి మెల్లిమెల్లిగా ఆధ్యాత్మిక భూమికలోకి ప్రజలు వెళ్తున్నారు. కొంతమంది చాలా ఉన్నతంగా పెద్ద భూమికలైన నాలుగు, ఐదో భూమికల్లోకి వెళ్తూ ఉంటారు. వారియొక్క ఆధ్యాత్మికస్థాయి వృద్ధి పరుచుకోకుండా మళ్లీ మూడో డైమన్షన్ లోకి వచ్చేస్తూ ఉంటారు. అలా ఎప్పటికప్పుడు ఉన్నతస్థాయికి వెళ్తున్న వారిని మహాత్ములు, సత్పురుషులు, బుషులు అంటూ ఉంటాం. వారు మీలాగే పుట్టినప్పటికీ, నిరంతరసాధన చేస్తూ, పరమాత్మతతో అనుసంధానం కావడం వల్ల మహాత్ములుగా మారతారు. వాళ్లే సమాజంలో మార్పులు తీసుకువస్తారు.

ప్రస్తుతం రాజకీయ గందరగోళమే కాదు, ఆధ్యాత్మికంలోనూ గందరగోళం ఉంది. గురువులు పరస్పరమైన విరుద్ధ ప్రకటన చేయడం వల్ల కొంతమంది జనాలు కూడా వాళ్లకు వత్తాసు పలుకుతున్నారు. కేవలం మూడో భూమికలో ఉన్న జనాలు మాత్రమే ఒక వైపుకు అలా వెళ్లిపోతూ ఉంటారు. ఏ గురువు దగ్గర దైవీసంపద లక్షణాలు ఉంటాయో, ఎవరిదగ్గర బేధభావాలు ఉండవో వాళ్లను ఆశ్రయించాలి. వాళ్లు నివురు గప్పిన నిప్పులా ఉంటూ బయటపడరు. ఎవరి దగ్గరికి వెళ్తే మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుందో, ఆత్మశాంతిగా ఉంటుందో, మంచి విషయాలపై ఆసక్తి ఉంటుందో, అటువంటి వాళ్ల దగ్గరికి వెళ్లినప్పుడే కలుగుతుంది. 1987 నుంచి కొత్త యుగం (new age) మొదలైంది. దీని అర్థం ఏంటంటే ఈ భూమి యొక్క అయస్కాంత క్షేత్రం విశ్వమానవ యుగంగా మారుతోంది. దీనినే పోల్ షిఫ్టింగ్ అంటారు. అందుకే మానవుల్లో ఇలాంటి విపరీతమైన లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ కూడా సమసిపోతాయి. 1987 తర్వాత పుట్టిన వాళ్లలో కొంతమంది నాలుగో, ఐదో డైమన్షన్ లో పుడతారు. అలాంటి వాళ్లు చిరుప్రాయంలోనే అద్భుతాలు చేస్తూ ఉంటారు. కొంతమంది అద్భుతమైన చిత్రాలు గీస్తారు, మరికొంత మంది నేర్పుగా కారు నడుపుతారు, మరికొందరు పుణ్యతిధుల్లో ఉపవాసాలు ఉంటారు, కొందరు ఆసనాల్లో కూర్చుని భగవత్ ధ్యానంలో ఉంటారు. ఇటువంటి తత్వం ఉన్నవాళ్లు భూమిపై చాలామంది ఉన్నారు. వీళ్లే పూర్వం ఉన్నటువంటి పాత ఎనర్జీని మార్చేస్తూ ఉంటారు. ప్రతీ ఐదువేల ఏళ్లకు ఒకసారి భూమి యొక్క అయస్కాంత క్షేత్రం చాలా ఎక్కువగా మారుతుంది. ఆధ్యాత్మికానికి జాతి, కుల, ప్రాంత, మత బేధాలు ఉండవు. ఎవరైతే నూతనశక్తిని ధరిస్తున్నారో, వాళ్లకు ఇవన్నీ పట్టవు. వాళ్లలో ఈర్ష్య,అసూయ ద్వేషాలు ఉండవు. తల్లిదండ్రులు ఇలాంటి వాళ్లను గుర్తించి వాళ్లకు మంచి విషయాలను చెప్పడం, నేర్పించడం, ఆచరించి చూపించడం వల్ల ఆ పిల్లలు గొప్ప వారు అవుతారు. ఈ సమాజంలో అనూహ్యమైన మార్పులు తెస్తారు. ముఖ్యమైన మొదటి ఏడు సంవత్సరాల్లో ఎవరైతే తమ పిల్లలకు మంచి సంస్కారం, ఆహార అలవాట్లను నేర్పిస్తారో వాళ్లు ఎంతో ఎత్తకు ఎదుగుతారు, లేకపోతే చెడు అలవాట్లకు బారినపడి సమాజాన్నీ ఇబ్బందిపెడతారు. వాళ్లను తట్టుకోవడం కూడా కష్టం. అందుకే తల్లిదండ్రులు పిల్లల పెంపకం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రకృతిలో ఉన్న ఆహారాన్ని మీరు గుర్తించి తీసుకున్నప్పుడు మాత్రమే మీ శరీరంలోని అయస్కాంత క్షేత్రం కూడా బాగుంటుంది. పిల్లలకు ఇష్టం ఉన్నా లేకపోయినా కొంతమంది తల్లిదండ్రులు వాళ్ల వ్యక్తిగత ఇష్టాలను పిల్లలపై రుద్ది తినిపిస్తారు. ఎక్కువ కారం, తీపి, మాంసభక్షణ వంటివి చేయిస్తారు. పూర్వజన్మ సంస్కారంలో వాళ్లకు ఇష్టం ఉన్నా లేకపోయినా పిల్లల బలహీనత వల్ల వాళ్లపై రుద్దుతారు. వద్దని పిల్లలు ఎంత వద్దన్నా బలవంతంగా కొంతమంది తల్లిదండ్రులూ ఇస్తూ ఉంటారు. దీని వల్ల తామసిక భావాలు ఎక్కువైపోతాయి. లోపల ఉన్న కణాలన్నీ మారిపోతాయి. అందుకే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. తర్వాత పిల్లలు ఎటువంటి వాళ్లతో సహవాసం చేస్తున్నారో గమనించుకోవాలి. ఎలక్ట్రానిక్ వస్తువులు, టీవీల్లో వచ్చే ప్రసారలను కూడా సాధ్యమైనంతవరకూ దూరంగా ఉంచాలి. దీని వల్ల భావ కాలుష్యం ఎక్కువైపోతోంది. ఒక చిన్నారి లేత మనస్సులో ఒక భయంకర దృశ్యాన్ని చూపిస్తే వాళ్లు వేరే రకంగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంటుంది. అదే వాళ్ల మనసులో ముద్ర వేసుకుని ఉంటుంది. మంచి ఆధ్యాత్మిక విషయాలను హాస్యాస్పదం చేయడం వంటివి పిల్లల ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. జిహ్వకు రుచి కలిగినప్పుడు అది అలవాటుగా మారుతుంది. వీలైనంత వరకూ ప్రకృతికి దగ్గరగా ఉన్న ఆహారాలను, సాత్వికఆహారాలను తీసుకోవాలి. అటువంటి వాళ్ల వల్ల సమాజం బాగుటుంది. ఎప్పుడూ మంచిగా మాట్లాడడం, వాగ్దోషాలు చేయకుండా ఉండాలి. 1987 తర్వాత ప్రజల్లో మంచి చైతన్యం వస్తుందని" అయస్కాంత వ్యక్తి వివరించారు.

అప్పుడు నేను ఇలా ప్రశ్నించాను 'ఈ విషయాలన్నీ నేను ఏ విధంగా చెప్పాలి. నాకు అటువంటి జ్ఞానంలేదు. సామాన్యుడిని కాబట్టి నేను చెప్పిన విషయాలు ప్రజలు నమ్ముతారని లేదు కదా. నన్ను ఎందుకు నమ్ముతారు. నేను ఎందుకు చెప్పాలి' అని అడిగాను. అప్పుడు అయస్కాంత వ్యక్తి అన్నారు "నువ్వు ఎవరినీ మార్చాల్సిన ఉద్దేశంతో చెప్పాల్సిన పనిలేదు. ఇటువంటి కుతూహలం, జిజ్ఞాస ఉన్న నీలాంటి వాళ్లకు చెప్పు. అప్పుడు వాళ్లలో ఉన్న సందేహాలకు నివృత్తి అవుతుంది. నీ ద్వారా నేను చెప్పదలుచుకున్న విషయాలు వాళ్లకు చేరతాయి. అప్పుడు వాళ్లలో చైతన్యం వచ్చి మిగతా మార్గాలను అన్వేషిస్తారు. మనషులను నమ్మించే ప్రయత్నం మాత్రం చేయాల్సిన పనిలేదు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్లు. ఎవరికి ప్రాప్తం ఉంటుందో, ఎవరు ఈ శక్తికి ఆకర్షింపబడ్తారో వాళ్లకే తెలుస్తాయి. మూడో భూమికలో ఉన్నవాళ్లు పై స్థాయికి వెళ్తారు. అందుకని వేరే విషయాల గురించి ఆలోచించకుండా నీ పని నువ్వు చెయ్యి. ఏం జరుగుతుందో నీకు అనవసరం. నీకే కాదు ఎవరికైనా మేం ధ్యానస్థితిలో ఉన్నవాళ్లకు సమాధానాలు ఇస్తాం. కాకపోతే ప్రతీ విషయాన్నీ మీరు విమర్శగా చూసుకుంటే అన్ని విషయాలు మీకే బోధపడ్తాయి. ప్రస్తుతం ఇది సంధి గం. ఈ విపరీత పరిణామాలన్నీ తగ్గి 2020 సమయంలో మంచి మార్పులు జరుగుతాయి. ఎప్పటికప్పుడు మేము ఎవరికి ఇటువంటి జిజ్ఞాస ఉంటుందో వాళ్లను కలిసి ఈ విషయాలను చెప్తాం" అన్నారు.

సత్యం అనేది ప్రతీవారి నోట ఒకలా వస్తుంది. రంపా మహాశయులు కూడా ఇదే చెప్పారు, ఇప్పుడు ఈయన కూడా ఇదే చెబుతున్నారు. 'నేను ఆధ్యాత్మికంగా పై భూమికల్లో ఉన్న విషయాలను ఎలా చెప్పాలి. మూడో భూమికలో ఉన్న వాళ్లకు భాష ఉండదు కదా. పైస్థాయి విషయాలను కిందిస్థాయిలో వాళ్లకు ఎలా చెప్పాలి'. అని అడిగాను. "ఎవరు ఇటువంటి విషయాల పట్ల ఆకర్షింపబడతారో వాళ్లు ఇటువంటివన్నీ చక్కగా అర్థం చేసుకుంటారు, అపార్థం చేసుకోరని నాకు చెప్పారు. తర్వాత ఎప్పుడు నువ్వు ప్రశాంతంగా ధ్యానస్థితిలో ఉంటావో అప్పుడు ధ్యానప్రసారాలను నీకు పంపిస్తూ ఉంటాను. ఈ మధ్య నీకు ధ్యానప్రక్రియపై ఆసక్తి తగ్గింది. అందుకే ధ్యానంపై దృష్టి కేంద్రీకరించమని చెప్పడమే కాకుండా త్వరలోనే కలుస్తానని" అయస్కాంత వ్యక్తి అదృశ్యమయ్యారు.

మళ్లీ ఉదయం కాలకృత్యాలన్నీ తీర్చుకున్న తర్వాత  అల్పాహారం ముగించుకుని కొంత ఆహారాన్ని తీసుకుని అడవిలోని సఫారీకి బయలుదేరాం. సింహాలు ఎదురైతే భయపడొద్దు, ఏమీ అరవొద్దు, ప్రశాంతంగా ఉండమని జీపు డ్రైవర్ మాకు ముందే సూచించారు. మార్గమధ్యంలో జింకలు, నక్కలు, జిరాఫీలు కనిపించాయి. గుబురుగా ఉన్న ఒక చోట ఒక ఆడ సింహం తన పిల్లలతో విశ్రమిస్తూ ఉంది. దాన్ని మేం గమనించాం. చారి గారు ఫోటోలు కూడా తీశారు. ఒక అరగంట సేపు అక్కడక్కడ చూసుకుంటూ వచ్చేశాం. మళ్లీ టాంజానియా ఎయిర్ పోర్టుకు చేరుకున్నాం. అయస్కాంత వ్యక్తి, రంపా గారు చెప్పినట్టే ప్రతీ మనిషిలో అద్భుతమైన అయస్కాంత శక్తి ఉంటుంది. కొంత సాధన చేస్తే మూడో భూమిక నుంచి పైపైకి వెళ్లొచ్చు. సమాజ శ్రేయస్సుకు పాటుపడొచ్చు. మనం ప్రతీవ్యక్తిలో దైవాంశ ఉందని భావించినప్పుడు పరస్పర గౌరవభావంతో ఉంటారు. నాలాంటి వాళ్లు, నాకంటే ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్లకు రంపా, అయస్కాంత వ్యక్తి తారసపడి ఇలా బోధిస్తూనే ఉంటారని అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాను.

Monday, 31 October 2016

Spiritual Soup-13 part-2

Part - 2
తెల్లవారుఝామునే మా గురువుగారు "మనం చేరుకోవాల్సిన ప్రదేశానికి వచ్చేసాము, కనిపించే ఆ కొండ వెనుకే ఆ ప్రదేశం ఉంది" అని చూపగా మేము త్వరత్వరగా ఆ ప్రదేశానికి చేరుకున్నాము. అక్కడ మాకు ఒక మూలగా ఒక పెద్ద రాయి కనపడింది. దాన్ని దగ్గరగా వెళ్లి చూస్తే అక్కడ ఏదో ఒక చిన్న సందులోంచి సన్నటి వెలుగు కనపడింది.మేము ఒక్కొక్కరం ఆ సన్నటి ఇరుకు సందులోంచి లోపలకి వెళ్ళడం జరిగింది. అక్కడ మాకు ఒక అద్భుతదృశ్యం కనపడింది. ఆ గుహలోపల విశాలమయిన భవనం ఒకటి కనపడగా, మేమందరం ఆ భవనంలోకి  ప్రవేసించాము. అక్కడ చాలా వెలుతురు రావడం గమనించి మేము అంత వెలుగు ఎక్కడనుంచి వస్తోందా అని పైకి చూసాము. అక్కడ పైకప్పు ఒక వృత్తాకారపు ఆకారంలో (dome) ఉంది, దానిలోంచే ఆ  వెలుతురు వస్తోంది. అక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా, మనసుకి ఆహ్లాదకరంగా ఉంది. అక్కడ నేను అప్రయత్నంగా ఒక ప్లాట్ ఫారం లాగ ఉన్న ఒక బండ ఎక్కడం జరిగింది. దాని మీద పట్టుకుని నుంచోడానికి ఒక రైలింగ్ కూడా ఉంది. అలా ఎక్కగానే ఆ బండ పైకి లేవడం మొదలుపెట్టింది. ఈ రోజుల్లో లిఫ్ట్ మాదిరిగా ఉన్న ఆ బండ చాలా విశాలంగా, ద్వారబంధాలు లేకుండా ఉంది. అది అలా కదలడంతో నేను చాలా భయపడ్డాను. నా కంగారుని గమనించిన మా గురువుగారు పకపకా నవ్వుతూ "నువ్వేమి భయపడకు, ఏమి కాదు. దూకే ప్రయత్నం మాత్రం చెయ్యకు" అని చెప్పారు. అది క్రమక్రమంగా పైకి వెళుతూ, ఆ భవనం పై భాగానికి నా తల తగులుతుందేమో అని అనుకుంటుండగా ఆ బండ సరిగా పైభాగానికి 3, 4 అడుగుల దూరంలో ఆగిపోయింది. నేను కాస్త తేరుకుని మెల్లగా ఆ వెలుతురు వస్తున్నా ఆ పైకప్పుని ముట్టుకోగా అది చాలా చల్లగా ఉంది. నేను చాలా ఆశ్చర్యపోయాను, ఎందుకంటే మామూలుగా మనం ఇళ్ళల్లో వాడే బల్బులు చాలా వేడిగా ఉంటాయి కాని ఇది మాత్రం చాలా చల్లగా ఉంది. ఆ వెలుతురు కూడా చాలా ఆహ్లాదంగా ఉంది. నేనింక కిందకి వెళిపోతే బాగుండు అని అనుకుంటుండగా ఆ బండ మెల్లగా యధాస్థానానికి వెళ్ళిపోయింది. నేను వెంటనే కిందకి దిగిపోయాను. మా గురువుగారు "ఇలాంటి చాలా వింతలు ఉంటాయి ఇక్కడ, ముందుకు కదలండి" అని అనగా బయలుదేరాము.

మేము ఆ భవనపు రెండవ అంతర్భాగంలో ప్రవేసించాము, అక్కడ ఒక విశాలప్రాంగణంలో ఆడిటోరియంలాగ  ఉండి కుర్చీలు వేసి ఉన్నాయి. మేమందరం అక్కడ కాసేపు కూర్చుందామని నిర్ణయించుకుని కూర్చోగా ఎక్కడినుంచో ఒక స్వరం మాకు అర్థమయ్యే భాషలోనే ఇలా వినిపించింది "స్వాగతం మిత్రులారా, ఎప్పటికో ఒకసారు మీరు తప్పకుండా ఇక్కడికి వస్తారని మాకు తెలుసు. నాగరికతలో మేమెంతో అభివృద్ధి సాధించాము, మీరు చూస్తున్నటువంటి కాంతి మేము మీరు ఉత్పాదన చేసే విధంగా కాకుండా వేరే ప్రక్రియద్వారా తయారు చేస్తాము, వాటి ద్వారా ఎన్నో యంత్రాలను నడుపుతున్నాము. అయితే మేము ఏ విధంగా అభివృద్ధి చెందామో అదే విధంగా మా పొరుగుదేశాలు కూడా ఎంతో అభివృద్ధి చెందాయి. ఇపుడు అవన్నీ మీరు చూడబోతున్నారు, దయచేసి అందరు నిశ్చింతగా కూర్చోండి అని ప్రార్ధిస్తున్నాను". మేము యాంత్రికంగా మా కుర్చీలలో స్థిరపడిపోయాము. వెంటనే మా ముందు ఒక తెర ప్రత్యక్షమయ్యింది, దాని మీద ఎన్నో అద్భుతమయిన దృశ్యాలు కనపడటం మొదలుపెట్టాయి.   

దాంట్లో ఒకతను ఒక రాజకీయ నాయకుడిలా పెద్ద ఉపన్యాసం ఇస్తున్నాడు, ఎంతో ఆవేశంగా మాట్లాడుతున్నాడు. ప్రజలందరూ అక్కడ చేరి అతను చెప్పేది శ్రద్ధగా వింటూ మధ్యమధ్యలో చాలా క్రోధంతో అరుస్తున్నట్లు కనిపించింది. మాకేమి అర్థమయ్యిందంటే ఏదో ఒక దేశానికి సంబంధించిన నాయకుడు ప్రజలని ఉద్రేకపరిచి మాట్లాడుతున్నాడు. మరలా ఇంకొక దృశ్యం కనిపించింది, అది ఇంకొక దేశమనుకుంటాను, అక్కడ కూడా ఇలానే ఒక రాజకీయ నాయకుడు తన ప్రసంగంతో ప్రజలను రెచ్చగొడుతున్నాడు. ఇంకొక  దృశ్యంలో  వారు  కనిపెట్టిన  అత్యాధునిక  మారణాయుధాలని   ఆ  రెండు  దేశాలవారు  పరస్పరం  ఒకరి  మీద  ఒకరు  ప్రయోగించుకోవడం కనిపించింది. అక్కడ జరిగే విధ్వంసాన్ని మేము చూడలేకపోయాము. ఎత్తైన భవనాలు ఒక్క క్షణంలో కుప్పకూలిపోయాయి. ప్రజల హాహాకారాలు మిన్నుముట్టాయి. ఈలోపల ఇంకో దృశ్యం తేరా మీదకి వచ్చింది. అదొక  ఒక పెద్ద ప్రయోగశాల లాగ ఉంది, దాంట్లో శాస్త్రవేత్తలు, విజ్ఞానవేత్తలు అంతా హడావిడిగా కొన్ని పెట్టెల్లో వారు కనిపెట్టిన పరికరాలను సర్దుతున్నారు. కొంతమంది ఆధ్యాత్మిక గురువులు ఆ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సర్దిన పెట్టెలకు మూత బిగించి వాటిని ఎక్కడికో తీసుకెళ్తున్నట్లుగా మాకు అర్థమయ్యింది. వారిలో నాయకుడిలా అనిపించిన అతను విచారవదనంతో "మనం సంపాదించిన కీర్తి ప్రతిష్టలు, నాగరికత ఇలాంటి  యుద్ధాల వల్ల నాశనం అయిపోతున్నాయి. మనం కనిపెట్టిన పరికరాలన్నీ మనుష్యుల మరియు ప్రకృతి విధ్వంసానికే వాడుతున్నాం తప్ప మానవాళి ప్రయోజనానికి వాడట్లేదు. ఎప్పుడైతే మనం మనలోని మనోవికారాలని జయించలేదో, మానవాళికి ఇలాగే నాశనం తప్పదు" అని చెప్పడం జరిగింది. మా అందరి మనస్సు ఒకసారి విచారంతో నిండిపోయింది. మాటల్లో అర్థంకాని ఎన్నో విషయాలు మాకు బొమ్మల ద్వారా అర్థమయ్యాయి. మేమంతా మన నాగరికత శ్రేష్టమయినది అనుకుంటున్నాం కాని జరుగుతున్నది ఏమిటి అని అందరం ఒక్కసారిగా  మాలో మేము ప్రశ్నించుకోసాగాము. అపుడు మాకు ఒక గంభీరమయిన స్వరం ఇలా వినపడింది "ప్రియమయిన సోదరులారా, ఈపాటికి మీరు గ్రహించే ఉంటారు మేము భౌతికంగా, శాస్త్రీయంగా ఎన్నో ఉన్నత శిఖరాలు అందుకున్నాము. గొప్ప అస్త్రాలని, మనకి పనికొచ్చే పరికరాలను ఎన్నో కనుక్కున్నాము. అలాగే మా పొరుగుదేశాలు కూడా ఎన్నో కనుక్కున్నారు, కాని వాటిని ఒకరిని ఒకరు చంపుకోవడానికి మాత్రమే మేము వాడుకున్నాము. ఇక్కడి ఆధ్యాత్మిక గురువుల మాటలు మేమెవరూ పట్టించుకోలేదు. కొంతమంది స్వార్థరాజకీయ నాయకుల వల్ల, వాళ్ళ ప్రసంగాల వల్ల ప్రజల్లో ఉండే మంచితనం పోయి లోపల ఒక విధమయిన ఈర్ష్యాద్వేషాలు రెచ్చగొట్టబడతాయి. అప్పుడు వారు మంచి చెడు ఆలోచించకుండా ఒకరి మీద ఒకరు దాడి చెయ్యటం, కొన్నిసార్లు వారు ఉపయోగించిన మారణాయుధాలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే అవి మొత్తం దేశాన్నే క్షణంలో భస్మీపటలం చేస్తాయి. ఆ విషయం చెప్పడానికే మాలో కొంతమంది పెద్దలు రాబోయే తరాలు మేము చేసిన  తప్పు తెలుసుకుని, అదే తప్పును వారు చెయ్యకుండా ఉండాలనే ఉద్దేశంతో మేము మా విజ్ఞానం నుంచి కనిపెట్టిన పరికరాలని కూడా పెట్టెల్లో పెట్టుకుని ఎటువంటి మనుష్యులు రాలేనటువంటి ప్రదేశంలో నిక్షిప్తం చేసాము. టిబెట్లో మతగురువులు కొంతమందికి ఈ ప్రదేశం గురించి భావప్రసారాల ద్వారా తెలియజేశాము. మీరందరూ కూడా ఈ గుహని సందర్శించడానికి ఎన్నుకోబడినవారే. మనిషి ఎప్పుడైతే తనని తాను జయించలేకపోతాడో, తన మనసుని ఇంద్రియాలని నిగ్రహించుకోలేకపోతాడో, వాడు ప్రపంచానికి ఒక దుష్టశక్తిగా పరిణమిస్తాడు. ఒక దుష్టశక్తి వల్ల ఎంతోమంది నాశనం కాక తప్పదు. ఈ చిన్న సూత్రం మానుంచి రాబోయేతరాలవారు తెలుసుకుంటారని మేము ఈ ఏర్పాటు చేసాము. ఇక్కడకి మీరు రాగానే మీలో ఉన్న అయస్కాంత క్షేత్రం ద్వారా మేము సృష్టించిన పరికరాలన్నీ కూడా చైతన్యం పొంది పని చెయ్యటం ప్రారంభిస్తాయి. ఇపుడు మీరు చూస్తున్న వెలుతురు కూడా కొన్ని వందల ఏళ్ళ నుంచి ఏ మాత్రం ప్రకాశం తగ్గకుండా అలాగే ఉన్నది. ఇటువంటి అద్భుతమయిన జ్ఞానాన్ని సంపాదించి చివరికి మేమంతా ఒకరినొకరం నాశనం చేసుకున్నాము" అని ఎంతో బాధతో చెప్పారు. తరువాత అక్కడ తెర  మీద దృశ్యం ఆగిపోయింది.

ఆ తరువాత గుహలో మాకన్నా ఎన్నో తరాల ముందువాళ్ళు కనిపెట్టిన అద్భుత ఆవిష్కారాలు ఎన్నో చూడటం జరిగింది. ఎన్ని వస్తువులు చూసామన్నది ముఖ్యం కాదు, మనిషి సృష్టింపబడినప్పటినుంచి జరుగుతున్నది ఏమిటంటే, కొంతమంది స్వార్థపరులు బలహీనమయిన దేశాలను ఆక్రమించుకుని వారి నాగరికతను పూర్తిగా తుడిచివెయ్యడం, వారి నాగరికత కన్నా మా నాగరికత గొప్పది, మేము తలచుకుంటే ఏమైనా చెయ్యగలం అనుకునే దుష్టులే ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నారు, వీళ్ళు ఈ ప్రపంచాన్ని ఎన్నోసార్లు నాశనం చేస్తున్నారు. ఈ విధంగా ఎన్నో నాగరికతలు ఈ భూమిమీద నుంచి తుడిచివేయబడ్డాయి. వీటన్నిటికి సరైన సమాధానం ఏమిటంటే మనం ఆధ్యాత్మికంగా పరిణితి చెందాలి, మన మనసులో ప్రేమ, దయ అనే గుణాలని పెంచుకోవాలి. అటువంటి మార్పు మనం ఆధ్యాత్మిక గురువులతో సంబంధం పెట్టుకున్నపుడే మనలో ఆ మార్పు వస్తుంది. కాబట్టి ఇది మానవ జాతికి ఇదొక హెచ్చరిక. ఇంత జరుగుతున్నా కూడా మనుషుల్లో మార్పు రావట్లేదని నేను చాలా తీవ్రంగా ఆలోచించాను. ఈ విధంగా మేమెన్నో వస్తువులని చూసాము, వాటన్నిటిని నేను మాటల్లో చెప్పలేను కాని ఇపుడు మనం ఊరికే మనేమేదో గొప్ప విజ్ఞానాన్ని కనిపెట్టామని గర్వపడుతుంటాము కాని మనకన్నా ముందుతరాలవారు  ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందారు, అయితే దుశ్తశక్తులకి బలి అయిపోయారు. అయినా కూడా మనుషుల ప్రవృత్తిలో మార్పులేదు. ప్రకృతికి విరుద్ధంగానే మనుషులెపుడు వెళ్తూ ఉంటారు" అని ఆయన గంభీరంగా చెప్పారు. "ఆ తరువాత మేము ఆ గుహలోంచి బయటకు వచ్చేసి మా ఆశ్రమానికి చేరుకున్నాము. అయినా చైనా గూఢచారులు మేమేదో చేస్తున్నామని పసిగట్టారు. మా దేశం దురాక్రమణ అయినప్పటినుంచీ ఈ రోజు వరకు కూడా ఇలాంటి గుహ ఒకటి ఉందని వారికి తెలిసి వెతుకుతూనే ఉన్నారు కాని దాని స్థావరాన్ని తెలుసుకోలేకపోయారు. దాని యొక్క వివరాలని చెప్పమని ఎంతోమంది మతగురువులని వారు హింసించి, చంపెయ్యడం కూడా జరిగింది. ఈ విధంగా ఒకప్పుడు ప్రపంచానికే శాంతి దూతలుగా ఉండే మా టిబెట్ దేశంలో ప్రశాంతత, ఆధ్యాత్మికత మొత్తం తుడిచిపెట్టుకుపోయాయి. అయితే మా ఆధ్యాత్మిక గురువులు ముందు జాగ్రత్తగా మా వద్ద ఉన్న టిబెటియన్ సంస్కృతికి సంబందించిన చిహ్నాలు, మా నాగరికతను గుర్తుతెచ్చే వస్తువులను గుప్తపరిచి మంచిపని చేసారు. ఏదో ఒకరోజు దురాక్రమణదారులకి పతనం తప్పదు. మా మతగురువులు చెప్పినట్లు మాకు మంచిరోజులు వస్తాయి, మళ్లీ టిబెట్ ఏదో ఒక రోజు స్వాతంత్రాన్ని పొందుతుందనే ఆశతో మేమంతా ఎదురు చూస్తున్నాము.

 పొరుగున ఉన్న మీ భారతదేశము మా మతగురువులకి ఆశ్రయమిచ్చి వారిని కాపాడింది, చైనా వారి బెదిరింపులకి లొంగకుండా భారతదేశము చాలా సహాయం చేసింది. మాకు మీ దేశము చాలా విలువయిన కానుకలనిచ్చింది, దానిలో బుద్ధుడి యొక్క జ్ఞానాన్ని మాకు పంచి ఇవ్వడం అనేది ఎంతో అద్భుతమయిన విషయం. చూసావు కదా మనుషుల్లో మంచి మార్పు రావాలంటే ఆధ్యాత్మికతే శరణ్యం. మనం ఎప్పుడైతే మనసుని జాలి, కరుణ, దయ, ప్రేమ అనే మంచిగుణాలతో నింపుతామో అప్పుడే మనం మంచిని గ్రహించగలుగుతాము. లేకపోతే ప్రకృతికి విరుద్ధంగా వెళ్తే ఆ ప్రకృతే మనకు శత్రువుగా పరిణమిస్తుంది అనే విషయాన్ని ఈ మానవులు ఎప్పుడు గ్రహిస్తారో తెలియదు. కాని మంచి రోజులు రాబోతున్నాయి, 1985వ సంవత్సరంలో దానికి నాంది పడింది. నీకు ఇదివరకే అనేక విషయాలు అయస్కాంత వ్యక్తి చెప్పారు కదా, మరి కొన్ని విషయాలు నీకు త్వరలో తెలుస్తాయి. 

1987 నుంచి సంధియుగం ప్రారంభమయ్యింది, అది సుమారు  25 సంవత్సరాలు ఉండచ్చు, లేదంటే ఇంకా కొన్ని రోజులు పొడిగింపబడచ్చు. సమస్త మానవ చైతన్యస్థాయి మంచిభావాలతో నిండి ఉంటుందో అపుడు మాత్రమే మంచిమార్పులు రావటానికి నాంది పడుతుంది. ముందు ఎన్నో ప్రకృతి విరుద్ధమయిన కార్యక్రమాలు జరుగుతుంటాయి, దానిని చూసి మానవాళి ఎంతో భయపడుతుంది, ఆ తరువాత మంచి రోజులు తప్పక వస్తాయి. మంచి రోజులు త్వరగా  రావాలా లేక ఆలస్యంగా రావాలా అనేది సమస్త మానవాళి  చేతుల్లోనే ఉంది. నాయనా వేళ మించిపోతున్నది, ఇంక నువ్వు వెళ్లిరా, ముందు ముందు నీకు నేను ఆలోచన రూపంలో వస్తుంటాను. ఏ విషయం మీద ప్రశాంతమయిన మనసుతో నువ్వు ఆలోచిస్తూ ఉంటావో, వాటికి సమాధానాలు దొరుకుతాయి. నీకు మాత్రమే కాదు, ప్రపంచంలో చాలామందికి ఇలాంటి సందేశాలనే మేము పంపిస్తుంటాము, ఎందుకంటే ప్రస్తుతం మానవాళి ఆధ్యాత్మిక స్థాయి కొంచెం పెరిగే సూచనలు కనపడుతున్నాయి. నేను చెప్పినట్లుగా 1985లో బీజాలు పడ్డాయి, 1987లో మహానుభావుల సమావేశం జరిగి కొన్ని తీర్మానాలు తీసుకున్నారు. కాబట్టి నువ్వు నిశ్చింతగా ఉండు, ఎవరికైతే ఆధ్యాత్మిక జిజ్ఞాస ఉంటుందో, వారికి భావప్రసారాల ద్వారా మా సందేశాలు ఇస్తుంటాము. చాలామంది వారికి తెలియకుండానే మా సూచనలను పాటిస్తూ ఉంటారు. కొద్దిగా స్థాయి పెంచుకున్నవారు మాత్రం స్పృహతో ఏం జరుగుతోందా, ఈ సందేశం ఎక్కడనుంచి వస్తోంద అనేది తెలుసుకుంటారు. మరి ఇంక సెలవు" అని ఆయన క్షణంలో అదృశ్యం అయిపోయారు. 

ఈ అద్భుతమయిన అనుభూతిని  తలచుకుంటూ నేను తిరిగి నా గదికి వెళ్ళిపోయాను. అయితే తరువాత నేను చదివిన పుస్తకాల ద్వారా తెలిసినది ఏమిటంటే లోకంలో చాలామంది వ్యక్తులకి ఇలాంటి భావప్రసారాలు వస్తుంటాయి ఎందుకంటే మరి ప్రస్తుతం ఈ సంధియుగంలో light workers  ఇటువంటి సంకేతాలని యాంత్రికంగా తీసుకుని వారు చేస్తున్నామనే అనుకుంటారు. వాళ్ళచేత, వారిని పనిముట్లుగా వాడుకుని అదృశ్యరూపములో ఉన్న మహా చైతన్యం ఇటువంటి పనులు చేయిస్తోందని వారికి తెలియదు. నేను ఇవన్నీ ఆలోచిస్తూ పడుకున్నాను.


Saturday, 22 October 2016

Spiritual Soup-13

నేను టాంజానియాలో పని చేసేటప్పుడు ట్రైనింగ్ నిమిత్తం ఒకసారి నైరోబిలోని Amboseli నేషనల్ పార్క్ కి వెళ్ళడం జరిగింది. సుమారు ఏడుగురు సభ్యులతో ఛార్టర్డ్ విమానంలో నైరోబి నుంచి Amboseli నేషనల్ పార్క్ కి చేరుకున్నాము. సాధారణంగా ఇక్కడ శిక్షణ కార్యక్రమాలన్నీ అడవి ప్రాంతాలలోనే ఏర్పాటు చేస్తుంటారు. ఎందుకంటే అక్కడ ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉన్నందు వల్ల, అందరు మనసు విప్పి మాట్లాడుకుంటారని. ఈ కార్యక్రమాలు జరిగినపుడు ట్రైనీస్ వారి వారి జాతీయ దుస్తుల్లో వచ్చి ఈ కార్యక్రమాలలో పాల్గొంటారు. అక్కడ మాకు కేటాయించిన వసతి చాలా బాగుంది. మాకు శిక్షణ ఇచ్చే జెర్మనీ మహిళ కూడా చక్కగా మాట్లాడుతూ  మాలో కలసిపోయింది. ఈ పార్కులో మాకు ఎన్నో రకాల జంతువులు కనపడేవి. ఇక్కడ సాధు జంతువులు, క్రూర మృగాలు అన్ని కలిసే ఉండేవి. రోజు అల్పాహారం తరువాత సుమారు ఒక గంట వ్యాన్ ఎక్కి ఆ అడవిలో తిరుగుతుండేవాళ్ళము.

ఆ వ్యాన్ నడిపే అతను మసాయి తెగకు చెందినవాడు. వారు చాలా పొడవుగా, సుమారు 6.5' అడుగులకు తక్కువ ఉండరు. వారి ముక్కు చాలా సూటిగా ఉంటుంది. వీరు ఎర్రటి దుస్తులు వేసుకుని, చేతిలో ఎప్పుడు ఒక బల్లెం పట్టుకుని ఉంటారు. అతను మాకు అక్కడ అనేక విశేషాలు చూపుతూ ఉండేవాడు. ఇలా రోజు మా శిక్షణ కార్యక్రమానికి ముందు ఒక గంట, అయిపోయాక ఒక గంట మేము అడవిలో తిరుగుతుండేవాళ్ళము. అదొక అత్యద్భుతమైన అనుభవంగా నా మదిలో ముద్ర వేసుకుపోయింది. మాకిచ్చే శిక్షణ కూడా చాలా సహజంగా ఉండేది. భోజనం అయిన తరువాత మనం సహజంగా ఒక మత్తులో ఉంటాము. ఆ మత్తు వదలగొట్టడానికి మా శిక్షకురాలు  మాతో రకరకాల ఆటలు ఆడించేది. మాతో కలిసి ఆమె కూడా ఆడుతుండేది.

ఇలా జరుగుతుండగా ఒక రోజు సాయంత్రం నేను నా గది బయటకు వచ్చి, అలా వ్యాహ్యాళికి వెళ్ళడం జరిగింది. కొంచెం దూరం అలా వెళ్ళాక అక్కడ ఉన్న ఒక చిన్న రాయి మీద కూర్చుని ఇలా ఆలోచిస్తున్నాను "ఆహా, ఇక్కడ ప్రకృతి ఎంత ఆహ్లాదంగా ఉంది, మరి మన భారతదేశంలో జనసాంద్రత ఎక్కువగా ఉండటం వలన కాబోలు  ఇలాంటి ప్రదేశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడ చెట్లు నరకడం నిషేధింపబడింది, అందుకనే ఇక్కడ ప్రకృతి చాలా సమతుల్యంగా ఉంటుంది.ఇక్కడ ప్రకృతి నియమాలు కూడా చాలా బాగున్నాయి. ఎందుకంటే ఇక్కడ జంతువుల సంతానోత్పత్తి కూడా చాలా వేగంగా ఉంటుంది వేరే దేశాలతో పోలిస్తే. అందువల్ల ఇక్కడ జంతువుల జనాభా పెరిగిపోయి, వాటి ఆహరం తక్కువ అయిపోవడం కారణంగా జంతువులు వాటి ఆహరం కోసం ఒక దాని మీద ఒకటి దాడి చెయ్యటం మూలంగా వాటిలో కొన్ని గాయపడటం, మరి కొన్ని చనిపోవడం కూడా జరుగుతుంది. వీటిని నియత్రించడానికి ప్రకృతి క్రూర మృగాలను సృష్టించింది. ఈ క్రూర మృగాలు వాటికి ఆకలి వేసినప్పుడే వేరే ప్రాణులను వేటాడి చంపి తింటాయి. వాటికి ఒక్కసారి కడుపునిండాక అవి వేరే జంతువుల జోలికి పోవు. అటువంటి సమయంలో చిన్న చిన్న ప్రాణులు కూడా వాటి ముందు నుంచి ధైర్యంగా తిరుగుతుంటాయి. అప్పుడు ఆ క్రూరమృగాలు వాటి వైపు కన్నెత్తైనా చూడవు. మామూలుగా ఆహరం కోసం కొట్టుకుని చనిపోయే జంతువుల సంఖ్య కన్నా ఈ క్రూర మృగాల ఆహరం కోసం చనిపోయే జంతువుల సంఖ్య తక్కువే ఉంటుంది. ఈ రకంగా ప్రకృతి అపరిమితమయిన సంఖ్యని పరిమితం చేయడం కోసం(limitation  of  law ) ఇటువంటి క్రూర మృగాలని సృష్టించింది.  మరి మన మనుషుల సంగతేమిటి, మనమెంత విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నాము? ఎప్పుడు పడితే అప్పుడు ఆహరం తినటం, అలాగే అనారోగ్యం తెచ్చుకోవటం, చిన్న చిన్న విషయాలకి ఘర్షణ పడటం, కోపతాపాలు, ఇలా ఎన్నో ఉన్నాయి. మనుషులం అయిఉండి ఎందుకు మంచిని నేర్చుకోలేకపోతున్నాము, జంతువులకన్నా ఉన్నతమయిన జీవిగా మనిషి భావిస్తున్నపుడు మరి మనం ప్రాధమిక ప్రకృతి నియమాలని కూడా ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాము? అడవులను నరికి వేసి వాతావరణ కాలుష్యం చేస్తున్నాం, ఇష్టానుసారం సమయం సందర్భం లేకుండా తింటున్నాం, ఏమిటిదంతా " అని ఆలోచిస్తున్న సమయంలో నాకు ఎదురుగా అద్భుతమయిన ఒక తేజో వలయం కనపడింది. నేను అటువైపు చూస్తుండగా నేననుకున్నట్లుగానే సాదుపురుషుడు అయిన lobsang rampa గారు దర్శనమిచ్చారు.

ఆయన  చిరునవ్వు చూసి నాలో కూడా ఆనందం అనే తరంగం ఉప్పొంగింది. నేను ఆయనతో "మహాశయా చాలా రోజులకి దర్శనమిచ్చారు" అని నమస్కరించగా ఆయన నవ్వుతూ "నాయనా నేను నీ దగ్గిరకి చాలాసార్లు వచ్చాను కాని నేను వచ్చినపుడల్లా నీ మనసు ప్రశాంతంగా లేదు. ఎప్పుడైతే మనసు నిశ్చలంగా ఉంటుందో, అది నిశ్చలంగా ఉన్న నీళ్ళతో సమానము. అపుడు నీ ప్రతిబింబము, ఆ నీళ్ళల్లో ఉన్న వస్తువులు ఆ నీటిలో స్పష్టంగా కనిపిస్తాయి.  కాని ఎప్పుడైతే నీ మనసు చంచలంగా ఉంటుందో, మనం సరస్సులో ఒక రాయి వేస్తే తరంగాలు ఏర్పడి మన ప్రతిబింబము ఎట్లు కనపడదో అదే విధంగా నువ్వు ఆ పరిస్థితిలో ఉండి నన్ను చూడలేకపోయావు.  ఆహ్లాదకరమయిన ఈ వాతావరణము నీ స్వభావం మీద ప్రభావం చూపించడం వలన నీ మనస్సు ప్రశాంతంగా ఉంది. అందువల్లే నువ్వు నన్ను స్పష్టంగా చూడగలుగుతున్నావు. అందులో నేను నా తేజోమయ కాంతిని చాలావరకు తగ్గించుకునే వచ్చాను ఎందుకంటే ఆ కాంతిని మీ శరీరాలు భరించలేవు. ఇక్కడికి వచ్చినప్పటినుంచి నీ మనసులో ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తున్నాయి, మరి భగవంతుడు సృష్టించిన ఎన్నో ప్రాణులకన్నా ఉన్నతమయిన జన్మ మానవ జన్మే. కాని మానవుడిలో ఎప్పుడైతే స్వార్ధం పెరిగిపోతుందో, దురాశ ఎక్కువవుతుందో అప్పుడు ఆ మానవుడు మృగాని కన్నా హీనంగా ప్రవర్తిస్తాడు. ఇక్కడ జంతువులు ఆకలివేసినపుడు మాత్రమే పరిమిత సంఖ్యలో వేరే జంతువులను చంపటం అనే సూత్రాన్ని పాటిస్తాయి. కాని ఈ లోకంలో మానవులు ఎంత దురాశాపరులంటే వాళ్ళ కడుపు నిండి అన్ని సౌకర్యాలు ఉన్నా కూడా వాళ్ళ ముందు పదితరాల వరకు ఆస్తి సంపాదించుకోవాలి అనే ఒక కోరిక ఉంటుంది. దాని మూలంగా ప్రకృతికి విరుద్ధంగా సంఘంలో సమతూకం అనే న్యాయం తగ్గిపోతుంది. ఆఖరికి వారి జీవితమంతా నిరాశ నిస్పృహలతో, ఆందోళనతో నిండిపోతుంది. వారు పైకి ఎంత గంభీరంగా కనిపించినప్పటికీ, ఎంత సంపాదించినప్పటికీ వారికి ఎటువంటి సుఖముండదు. వారు చనిపోయాక కూడా ఈ ఐశ్వర్యాన్ని, కీర్తి ప్రతిష్టలని తీసుకుపోలేరు కదా. పోయాక కూడా వాళ్ళ గురించి జనం వారు తమకు చేసిన అన్యాయాల గురించి చెడుగానే చెప్పుకుంటారు. కాబట్టి మనుషుల్లో ముఖ్యంగా అహంకారం అనే గుణం చాపకింద నీరులానే ఉంటుంది. పూర్తిగా ఆ నీటిలో మీరు తడిసేదాక ఆ ప్రమాదస్థాయి మీకు తెలియదు. అటువంటి మనుషుల యొక్క body energy కూడా చాలా సాంద్రత (gross) కలిగి ఉంటాయి. అందుకనే ఈ మనుషులు ఏమనుకుంటారంటే "మేము చాలా శక్తివంతులం, చంద్రగ్రహానికి రాకెట్ పంపాము, వేరే గ్రహాలలోకి కూడా వెళ్తున్నాము, మేము ఏమైనా చెయ్యగలము" అని. కాని మీకన్నా ఎన్నో రెట్లు తెలివిగలవాళ్ళు, నాగరికులు, శక్తివంతులు ఈ భూలోకంలో ఎంతోమంది ఉన్నారు. అలాంటి నాగరికతలు ఎన్నో అంతరించిపోయాయి కూడా. ఎందుకంటే వారు వస్తుసంపదను భౌతికంగా చూసారు కాని పారమార్ధికంగా ఆలోచించలేదు. వారు కనిపెట్టిన అత్యాధునికమయిన ఆయుధాలు మీరు కనిపెట్టిన ఆయుధాల కన్నా ఎన్నో రెట్లు శక్తివంతమయినవి. కాని వారు ఆ ఆయుధాలను అధికార దర్పం కోసం వేరే దేశాల మీద ప్రయోగించి దుర్వినియోగ పరచడం, ఎదుటి దేశం వారు కూడా ఉన్నతస్థాయిలో అభివృద్ధి చెందినవారు కావడం వల్ల, వారు తిరిగి వీరిపై దాడి చెయ్యటం, ఈ విధంగా ఈ ప్రపంచం అంతా తాము  సంపాదించిన జ్ఞానాన్ని వేరొకరిని మట్టుపెట్టడానికే ఉపయోగించారు. అలా నాగరికతలు అంతరించిపోతున్నా కూడా మానవుడు తాను చేస్తున్న తప్పును తెలుసుకోలేకపోయాడు ఎందుకంటే ఈ అరిషడ్వర్గాలు అనేవి చాలా భయంకరంగా మనుషుల ప్రవృత్తిలో దాగుని ఉంటాయి. ఆ చెడు సంస్కారాలు ఉన్నంత కాలం వారు ఎంత భౌతికంగా ఎదిగినా, ఎంత గొప్పవారైన వారు తమ విజ్ఞానాన్ని విధ్వంసానికే వాడుకుంటారు. వాళ్ళల్లో ఆత్మజ్ఞానం లేనంత కాలం, సమాజం పట్ల, మానవుల పట్ల ప్రేమభావం లేనంత కాలం ఈ మానవులకి పురోగతి మాత్రం ఉండదు. వాటిని సాధించుకోవడానికి ఒకే ఒక మార్గం ఆధ్యాత్మిక మార్గం. అటువంటి ఆధ్యాత్మిక మార్గాన్ని బుద్ధ భగవానుడు ద్వారా మా టిబెట్ దేశం అంతా అంగీకరించి, ఆచరించింది. మేము అహింసావాదులం కాబట్టి మా వద్ద ఆయుధాల తయారి, వేరే దేశం మీద దండయాత్రలు చేయడం, తోటివారి మీద దాడి చేయడం అనేవి ఉండదు. ఆ బుద్ధుడు మాకు నేర్పిన అహింస, కరుణ, జాలి మాత్రమే మా నాగరికతలో ఉన్నాయి, కాని ఒక్కొక్కసారి దురాక్రమణ చేయాలని తలంపు ఉన్న దేశాలు మాలాంటి దేశాలమీద దాడి చేసినపుడు మా నాగరికత మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. మా పెద్దవారు సంపాదించిన ఆధ్యాత్మిక విజ్ఞానము సమస్తం భూమిమీద లేకుండా తుడిచిపెట్టుకుపోతుంది. ఇదివరకు ఇలా చాలాసార్లు జరిగింది, ఈ భూమి మీద సృష్టి మొదలయినప్పటి నుండి ఎన్నో గొప్ప జాతులు, నాగరికతలు ఇక్కడ వెలిసాయి. అయితే కొంతమంది అహింసామార్గంలో వారి నాగరికతను వృద్ధి పరచుకున్నారు, కొన్ని నాగరికతలు హింసామార్గంలో వెళ్లి అహింసావాదుల నాగరికతను పూర్తిగా తుడిచిపెట్టేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే చైనా చేతిలో టిబెట్ దేశం దురాక్రమణకు గురి అయ్యింది. దురదృష్టవశాత్తు ఏమి జరుగుతుందంటే మాలాంటి దేశాల్లో కూడా కొంతమంది విద్రోహులు ఉంటారు, వారు పొరుగున ఉన్న శత్రువులతో చేతులు కలిపి వారిని తమ దేశం మీద దాడి చేయడానికి సహాయపడతారు. బదులుగా ధనమో, లేక వారికి కావలసిన దాన్ని పొందుతారు. అయినా కూడా మేము అహింసా మార్గంలోనే వెళ్లిపోతుంటాము.

ఒకసారి నా చిన్నతనంలో నాకు మా గురువుగారు mingyar dondup దగ్గరనుండి రమ్మని కబురు రాగా నేను వెళ్ళడం జరిగింది. ఆయనే నాకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి నా 3వ కన్ను తెరిపించడం ద్వారా నాకున్న ప్రత్యేక శక్తులతో అపుడప్పుడు కొన్ని మంచి పనులు చేయిస్తుండేవారు. నేను ఎందుకింత అకస్మాత్తుగా నన్ను రమ్మన్నారా అని ఆలోచిస్తూ ఆయన వద్దకు వెళ్లి వినయంగా నమస్కరించి నుంచున్నాను. ఆయన నన్ను సాదరంగా "రా lobsang rampa, కూర్చో" అని తనకు దగ్గరలో ఉన్న ఆసనం మీద నన్ను కూర్చోమని, గంభీర స్వరంతో "lobsang rampa, మనం ఊహించినట్లుగానే మన పొరుగు దేశమయిన చైనా వారు మన దేశాన్ని ఏ క్షణంలోనైనా ఆక్రమించుకునే ప్రయత్నంలో ఉన్నారు. మేమంతా కూడా మానసికశక్తి ద్వారా ఈ దురాక్రమణ ఇప్పుడే జరగదు, మరి కొంత కాలం పట్టచ్చు అనుకున్నాము కాని కొన్ని విచిత్ర పరిస్థితుల వల్ల వారు కొంచెం ముందుగానే దాడికి దిగుతున్నారని మాకు సమాచారం అందింది. 

వారి యొక్క భావతరంగాల ద్వారా మాకు వారి ఆలోచన తెలిసిపోయింది. దురదృష్టవశాత్తు మన ప్రజలంతా అహింసావాదులే, మనం ఎటువంటి ఆయుధాలని సృష్టించుకోలేదు. ఆధ్యాత్మికంగా మనమెంతో పురోగామించాము. మన నాగరికతను, మన సంస్కృతిని ప్రతిబింబించే వస్తువులను సేకరించి ఒక రహస్యప్రదేశంలో దాచుకోవలసిన అవసరం ఇప్పుడు ఉంది. ఇదివరకు కూడా మన పెద్దవారు, మనకన్నా ఎంతో అభివృద్ధి చెందిన జాతివారు కూడా ఈ విధంగానే చేసారు కాని ఇప్పటికి అవన్నీ ఎక్కడ దాచారో ఎంతమంది అన్వేషించినా తెలియరాలేదు.  అదృష్టవశాత్తు నేను చిన్న వయసులోనే మా గురువుగారి ఆశీర్వాదంతో అటువంటి ప్రదేశానికి వెళ్ళటం జరిగింది. ఆ ప్రదేశంలో  వారు రాబోయే తరానికి ఇచ్చినటువంటి సంకేతాలు ఎన్నో ఉన్నాయి" అని చెప్పగా నేను చాలా ఆశ్చర్యపోయి గురువుగారు "మీరు ఎన్నో నమ్మశక్యంకాని విషయాలు చెప్తున్నారు, నాకేమి అర్థం కావట్లేదు. మీరు ఆ ప్రదేశాన్ని చూసారా, అది ఎక్కడ ఉంది" అని అడగ్గా "lobsang ఎందుకంత ఆదుర్దా పడతావు, నేను నీకు అంతా వివరంగా చెప్తాను, నిన్ను అందుకోసమే పిలిచాను. మనం చాలా రహస్యంగా అటువంటి  ప్రదేశానికి వెళ్ళవలసి ఉన్నది. ఆ ప్రదేశం ఏమిటి, ఎక్కడుంది ఆ రహస్యాలను మాత్రం బయటకు చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే మన చుట్టూ కూడా పొరుగు దేశపు గూఢచారులు ఉన్నారు, వారు మన ప్రతి కదలికను గమనిస్తున్నారు. మనం వనమూలికలను సేకరించడానికి ఎత్తైన ప్రదేశాలకు వెడుతుంటాము కదా, అలాగే ఇప్పుడు కూడా వెళ్తున్నట్లు మనం వారిని ఏమార్చి ఆ రహస్య ప్రదేశానికి వెళ్ళవలిసి ఉన్నది. నేనన్ని సిద్దంచేసే ఉంచుతాను, నీకు కబురు చెయ్యగానే నువ్వు ఏమి తెలియనట్లు రావాలి" అని ఆజ్ఞాపించారు. ఆ తరువాత యధాప్రకారంగా ఆయన "థమ్సా" అనే పానీయాన్ని తెప్పించగా దానిని సేవిస్తూ కొన్ని క్షణాలు గడిపాము.

మా గురువుగారు ఎందుకో కొంత విచారంగా ఉన్నారు. "Lobsang నువ్వు వెళ్ళడానికి సమయం అయ్యింది, వెళ్లిరా" అని నన్ను పంపించి వేసారు. కొద్దిరోజుల తరువాత నేను ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. నాకు ఆ రహస్య ప్రదేశంలో ఏముంటుందో అనే కుతూహలం బాగా పెరిగిపోయింది. నేను గురువుగారి ఆదేశం ప్రకారం ఆయన చెప్పిన చోటుకి చేరుకున్నాను. అప్పటికే ఆయన అక్కడ ఒక బృందంతో సిద్ధంగా ఉన్నారు. మా వీపున చిన్న చిన్న బుట్టలు కట్టుకుని వనమూలికల సేకరణకు వెళ్తున్నట్లుగా మేము పర్వతప్రాంతాల వైపు ప్రయాణం మొదలుపెట్టాము. అలా ప్రయాణిస్తూ మేము చాల పైకి వెళ్ళిపోయాము. అక్కడ వాతావరణములో చాలా మార్పు వచ్చింది, చలి విపరీతంగా పెరిగిపోయింది.  ఎక్కడ చూసిన అగాధాలు, పర్వత శిఖరాలే  కనిపిస్తున్నాయి. మా గురువుగారు మా అందరికి ఆయన తెచ్చిన పానీయాన్నిఇచ్చి తాగమన్నారు, అది తాగగా ఆ చలిబాధ నుంచి మాకు విముక్తి లభించింది. ఇంకా అలా పైపైకి వెళితే అక్కడ ప్రాణ వాయువు తగ్గిపోతుంది, అటువంటి ప్రదేశానికి వెళ్ళాలంటే ముందుగా ప్రత్యేకమయిన శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. 

అవన్నీ నాకు మా గురువుగారు ముందే చెప్పడం మూలంగా, ఆ వాతావరణానికి తగ్గట్లుగా నా శరీరాన్ని సిద్ధపరచుకున్నాను. అయినా కూడా కొన్ని సందర్భాలలో ఆ చలిని తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. అక్కడ వీచే చల్లటిగాలులు మన శరీరాన్ని కోసివేస్తున్నట్లుగా అనిపిస్తుంది, అందుకే శరీరమంతా ఉన్ని దుస్తులతో కప్పుకోవాల్సి వస్తుంది. ఇలా మేము పది రోజులు ప్రయాణం చేసాక ఒక ఉన్నత శిఖరపు అంచుకు చేరుకున్నాము. అక్కడ కిందకు చూస్తే ఒక సెలయేరు భూమి మీద ప్రవహించడం మాకు కనిపిస్తోంది. మేమందరం ఒక తాడుని మా నడుములకు కట్టుకుని ఆ పర్వతం అధిరోహించడం మొదలు పెట్టాము. దీనిని నేను చాలా కష్టతరమయిన యాత్రగా భావించాను,కాకపోతే గురువుగారు ఉన్నారనే ధైర్యంతో పెద్దగా భయపడలేదు.  అతి కష్టం మీద మేము ఆ పర్వతానికి ఆవలి వైపుకి చేరుకున్నాము. ఆ రోజు రాత్రికి మేము అక్కడే గుడారం వేసుకుని విశ్రమించాము.





Saturday, 6 August 2016

Spiritual Soup-12

Part-12 బుద్ధదేవుడి ఆలయం

నేను టాంజానియాలో ఉనప్పుడు ప్రతి ఆదివారము ఒక పెద్ద బుద్ధుడి ఆలయానికి వెళ్ళేవాడిని. మొట్టమొదటి సారిగా అనఘాష్టమీ వ్రత పూజకి పువ్వులు అవసరం ఏర్పడి మా మిత్రుడితో పాటు ఆలయానికి వెళ్ళడం జరిగింది, విశాలమయిన ప్రాంగణంలో రకరకాల పూల చెట్లతో చాల ఆహ్లాదకరంగా ఉంది. పువ్వులు కోసుకున్నాక బుద్ధుడి ఆలయంలోకి వెళ్ళాము. అక్కడ ఉన్న బుద్ధుడి విగ్రహం వర్ణించలేనంత అందంగా ఉంది. ఆలయ పరిసరప్రాంతాలు చాలా శుభ్రంగా ఉన్నాయి. బుద్ధుడి ముందు సాధకులు పొద్దునే వచ్చి ధ్యానం చేసుకుంటున్నారు. వారిలో ఆఫ్రికాన్స్ కూడా ఉండటం విశేషం. ఆ బుద్ధుడి మోహంలో ఉన్న ప్రశాంతత మనలో ఏదో తెలియని, చెప్పలేని శాంతిని ప్రసాదిస్తుంది. 

అక్కడ ఏ  పూజ కార్యక్రమాలు లాంటి ఆర్భాటాలు ఉండవు. అక్కడే ఒక వట మహావృక్షం ఉన్నది, అది చాల పెద్ద పెద్ద ఊడలతో ఉంది. వచ్చినవారు దాని చుట్తో ప్రదక్షిణాలు చేస్తుంటారు. ఆలయానికి ముందు ఒక విశాలమయిన ధ్యానమందిరం  ఉంది. అక్కడ జరగబోయే కార్యక్రమాల వివరాలు ఒక కాగితం మీద అంటించబడి ఉన్నాయి. రాబోయే ఆదివారము బెల్జియం బుద్ధిష్టు సన్యాసి ఒకరు ధ్యాన ప్రక్రియ గురించి, ఆయన సాధన గురించి చెప్పడానికి వస్తున్నారని చదివాను. ఆ ఆదివారము నేను బుద్ధ ఆలయానికి  వెళ్ళగా ఒక పది నిమిషాల తరువాత కారులో ఈ బుద్ధ సన్యాసి వచ్చారు.

ఈ బౌద్ధ సన్యాసి సన్నగా, తెల్లగా, పొడుగ్గా ఎంతో హుందాగా మొహంలోఒక మంచి తేజస్సుతో కనిపించారు. ఆయనతో పాటుగా ఇంకొక బౌద్ధ సన్యాసి కూడా వచ్చారు, ఈయనకి చెవికి పోగులు ఉన్నాయి. వాళ్ళిద్దరూ కూడా బెల్జియం వాస్తవ్యులని తెలిసింది. బౌద్ధ మతం బెల్జియం మరియు సౌత్ ఆఫ్రికాలో కూడా దాని ఉనికిని కాపాడుకుంటూ వచ్చింది. ఈ రెండు దేశాలలో కూడా మరీ ముఖ్యంగా సౌత్ ఆఫ్రికాలో బౌద్ధ మత ఆధ్యాత్మిక కేంద్రాలు శిక్షణా తరగతులని నిర్వహిస్తుంటాయని విని ఆశ్చర్యపోయాను. ఇద్దరు సన్యాసులు ధ్యాన మందిరంలోనికి ప్రవేశించాక చిన్న సన్యాసి తన జీన్ ప్యాంటును విప్పేసి లుంగి కట్టుకున్నాడు. మేమంతా ఆయన మధ్యలో ఉండగా ఎదురు ఎదురుగా 2 వరసలలో కూర్చున్నాము. దాదాపు మాలాగా వచ్చినటువంటి వాళ్ళు ఒక పదిమంది ఉంటారు. బౌద్ధ సన్యాసి పద్మాసనంలో ధ్యాన స్థితిలో ఉండి మమ్మల్ని కూడా అదే మాదిరిగా కూర్చోమని చెప్పారు. 

చక్కటి సంగీతం మొదలుకాగానే ఆయన కూర్చునే లయబద్ధంగా ముందుకి వెనక్కి శరీరాన్ని కదిలిస్తూ ధ్యానం చేస్సారు. వారిద్దరి కదలికలు చాల హ్యుద్యంగా రమ్యంగా ఉన్నాయి, ఆ సంగీతం కూడా మనసుకి ఎంతో హాయిగా ఉంది. మంచి అగరుబత్తీల వాసన, మధ్య మధ్యలో బుద్ధుడి ప్రవచనాలు, వాటికి ఆంగ్ల భాషలో అర్థాన్ని అక్కడే ఉన్న సింహళ దేశం నుంచి వచ్చిన బౌద్ధ మతగురువు చెప్పసాగారు. ఆ తరువాత బెల్జియం సన్యాసులు ఇద్దరూ కూడా మాకు ముందు ఉండి ఒక విచిత్రమయిన నాట్య భంగిమలతో సంగీతానికి లయ బద్ధంగా ముందుకి అడుగులు వేస్తుండగా మేము వారిని అనుసరించాము. వారు వేసే అడుగులు, వారి యొక్క కదలికలు  చాలా అందంగా, హుందాగా ఉన్నాయి. మనస్సునిండా ఒక విధమయిన ప్రశాంతత ఏర్పడింది  ఆ కార్యక్రమం అయ్యాక నేను పెద్ద సన్యాసిని పరిచయం చేసుకొని కొన్ని వివరాలు తెలుసుకున్నాను.

వాళ్ళిద్దరూ కూడా మోరోగోరో పట్టణములో ఒక పెద్ద NGO  సంస్థలో పని చేస్తున్నారుట. వారు ప్రత్యేకంగా ఒక జాతికి చెందిన ఎలుకలకి శిక్షణ ఇస్తూ ఉంటారుట. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో యుద్ధాలు, బాంబు దాడులు, శత్రువులు రాకుండా భూమి లోపల బాంబులు(landmines) పెట్టటం సర్వసాధారణం అయిపోయింది. తెలిసీతెలియని వాళ్ళు అక్కడ అడుగు పెట్టగానే అవి పేలి కొన్ని సార్లు కొన్ని వందలమంది చావుకి కారణం అవుతున్నాయి. ఎక్కడెక్కడ వీటిని పెట్టారో కనుక్కోవడం మనుషులకి కష్టం కాని జంతువులకి సులభం. వీరు ఆ ఎలుకలకి ఏ విధంగా శిక్షణ ఇస్తారు అని నేను అడిగినప్పుడు, ఎలుకల మీదకి సన్నటి, మెత్తటి, పొడవాటి తాళ్ళని కడతారు. ఒక ప్రాంతం ఎంచుకుని అక్కడే భూమిలోపల     పనిచెయ్యని డమ్మి landmines ని పాతిపెడతారు. ఈ ఎలుకల వెంట పొడవాటి తాడు చేతిలో పట్టుకుని వాటిని వెంబడిస్తూ ఉంటారు వీరు. ఆ ఎలుకలు సరిగ్గా ఈ land mines  పాతిన చోటికి వచ్చి, వాసన చూసి వాటిని పసిగడతాయి. ఎలుకల బరువు తక్కువగా ఉన్నందు వల్ల నిజమైన landmines మీద వెళ్ళిన వాటికి ఎటువంటి ప్రమాదం జరగదు. ఈ విధంగా ప్రపంచంలో వారు వివిధ దేశాలలో ఉన్నటువంటి ఇటువంటి సమస్యలని పరిష్కరించటానికి ప్రత్యేకంగా వెళ్లి ఆ దేశాలకి సహాయం చేస్తుంటారు. 

నాకు నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. ఒక చిన్న ఎలుక కొన్ని లక్షలమంది ప్రాణాలని ఎలా కాపాడుతున్నాయి, ఈ రోజుల్లో మనుషులు మనుష్యులని అతి దారుణంగా, రకరకాల మారణాయుధాలతో అతి క్రూరంగా చంపుతుంటే ఒక చిన్న ప్రాణి,ఒక అల్ప జీవిగా భావించే ఎలుక మనకి నిజంగా ప్రాణ దానం చేయటం అనేది అసలైన మానవత్వంగా, దైవత్వంగా మనం భావించాల్సి వస్తుంది. అహింసని బోధించే బుద్ధుడి యొక్క ఈ అనుచరిలద్దరూ ఎంతో ఓర్పు, సహనంతో ఎలుకలకి శిక్షణ ఇస్తున్నారంటే మరి వారిని మనం దైవ మానవులుగా పేర్కొనక తప్పదు. ఈ విధంగా మానవాళికి ఎన్నో రకాలుగా విచిత్రమయిన పద్ధతిలో ఎటువంటి ప్రచారం లేకుండా ఎంతో సహాయం కానీ, ప్రాణదానం చెయ్యడం కానీ సామాన్య విషయం కాదు. 

బుద్ధుడు బోధించే అహింస, కరుణ మరియు నిష్కల్మషమయిన ప్రేమలో అంతే బ్రహ్మాండమైనటువంటి విశ్వశ్రేయస్సు దాగి ఉందని నేను అనుకున్నాను. ఒక చిన్న సహాయం చేస్తేనే మనము మన పేర్లను శిలా ఫలకం మీద రాయించుకుని, ప్రచారము చేస్తాము కాని ఇటువంటి నిస్వార్దులయిన అజ్ఞాతంగా ఉండే ఎందరో మహానుభావులకి మనమంతా కూడా రుణపడి ఉంటాము. ఎన్నో విషయాలు ఇటువంటివి మననం చేసుకుంటూ నేను ఇంటికి చేరిపోయాను. మామూలు చిన్న చిన్న ప్రాణులలో మనం చూస్తున్న  పరస్పర సహకారం, ప్రేమ అనేది మనుష్యులలో ఎందుకు లేదు, మానవత్వం పోయి మనం ఎందుకు రాక్షసత్వంగా మారిపోయాము అని ఆలోచిస్తుండగా నా మనసులో గాడంగా ముద్ర వేసుకున్న ఒక చిన్న సంఘటన జ్ఞాపకం వచ్చింది.

పక్షుల సంఘీభావం

నేను ఉద్యోగరిత్యా హనుమకొండలోని లస్కరు బజారులో ఒక ఇంట్లో ఉండేవాడిని. మేము భోజనం చేసే గదిలో ఒక సీలింగ్ ఫ్యాను ఉండేది. ఆ గదిలో ఒక మూల చిన్న సందులో ఒక ఊర పిచ్చుక కుటుంబం ఉండేది. అవి మెల్లగా అక్కడే గూడు కట్టుకుని వాటి మానన అవి ఉండేవి. అవి ఉన్నంత సేపు మేము ఫ్యాను వాడే వాళ్ళము కాదు. ఎందుకంటే ఇదివరలో ఆ పక్షులకు దెబ్బ తగలడం, అవి కింద పది బాధపడటం వాళ్ళ వాటి మీద జాలితో మేము జాగ్రత్తగా ఉండేవాళ్ళం. మేము మా నిత్య వ్యవహారంలో వాటిని పెద్దగా పట్టించుకోలేదు కాని నేను మాత్రం ఆ గదిలో ఉన్నంత సేపు వాటినే గమనిస్తూ ఉండేవాడిని. ఒకసారి వాటిలో ఆడ పక్షి గుడ్లు పెట్టింది, వాటిమీదే పొదగడానికి కూర్చుని ఉండేది. మగ పక్షి  ఆహరం తెచ్చేది. కొన్నిరోజులకి గుడ్లు పొదిగి పిల్లలు పెద్దవి అయ్యాయి, వాటి అరుపులు మాకు వినిపిస్తూ ఉండేవి. ఇంతలో అనుకోని ఒక ప్రమాదం జరిగినిది, ఫ్యాను వెయ్యడం, ఆ మగపక్షి నోట్లో ఆహరం పట్టుకుని రావటం, అకస్మాత్తుగా ఫ్యాన్ రెక్క తగలడం, ఆ పక్షి కింద పడి గాయంతో విలవిలలాడి చనిపోవడం జరిగింది. 

ఇది గమనించిన నేను, మా కుటుంబం చాల బాధపడ్డాము. పాపం ఆ పిల్లల గతి ఏమిటా అని ఆందోళన చెందాము. ఇంతలో ఒక ఆశ్చర్యమైన విషయం జరిగింది. ఇంకొక జంట పక్షులలోని మగ పక్షి నోట్లో ఆహరం పెట్టుకుని ఎంతో ప్రేమగా తల్లి పక్షికి, పిల్లలకి ఆహరం అందివ్వసాగింది. ఇది గమనించిన నాకు వాటి యొక్క సంఘీభావం, సహకారం చూసి ఒక విధమైనటువంటి సంతోషం కలిగింది.

ఇటువంటి ఉన్నతమైన సంస్కారం మన మనుషులలో లేకపోవటం చాల బాధ అనిపించింది. మానవులలో ఒక కుటుంబం అనాధ అయిపోతే తోటి మానవులు సహాయం చేసే సామర్థ్యం ఉండి కూడా ఏ మాత్రం సహాయం చేయకపోగా వారిని చాలా హీనంగా చూస్తుంటారు, ఆహా మానవత్వమా ఎక్కడ దాగి ఉన్నావు, మానవుని కన్నా తక్కువ స్థాయిలో ఉన్నాయనుకునే ఈ మూగ జీవులలో బ్రతికి ఉన్నావా. మరి మనం మంచి పుస్తకాలు  చదువుతూ కూడా, మంచి ఉదాహరణలు నలుగురుకి చెప్తుంటాం కానీ ఆచరణ మాత్రం శూన్యం కదా. ఓ దత్త బంధువులారా మనమందరం కూడా దత్తతత్వాన్ని అర్థం చేసుకుని కాంతిమయ శరీరధారులుగా మారదాము.  చీకటిని తిట్టుకునే బదులు ఒక చిన్న కొవ్వొత్తిని వెలిగిద్దాము.

ఒక సమూహంగా ఏర్పడి ఒక 100000 కొవ్వొత్తుల కాంతిని సమాజంలో విస్తరింపచేద్దాము. తోటి దరిద్రనారాయణుల పట్ల, అభాగ్యులపట్ల ఎంతో కొంత సామాజిక సేవ చేద్దాము. దత్త మహా ప్రభువు, "నాకు గుడులు గోపురాలు కట్టించండి, వెండి బంగారు తొడుగులు వెయ్యండి' అని ఎప్పుడు కూడా అడగలేదు. మానవ సేవయే మాధవ సేవ అని ఆయన మనకి నీతి వాక్యాన్ని అందించారు. దానికి ఉదాహరణ సాయిబాబా జీవితం. కాని మనమిప్పుడు ఏమి చేస్తున్నాం, ఆ స్వామికి ఇష్టంలేనటువంటి కానుకలని సమర్పించడం, స్వామిని భాగ్యవంతుడిని చెయ్యడం, మరల అధికారం కోసం దెబ్బలాడుకోవడం ప్రస్తుతం పరిపాటి అయిపొయింది. దీనికి తార్కాణంగా దత్త మహా ప్రభువు యొక్క ముఖ్యమయిన అవతారాలు, గుప్త అవతారాలు, అంశ అవతారాలు యొక్క జీవితమే మనకు ఆచరణీయము.

Sunday, 31 July 2016

Spiritual Soup-11


Part 11 - విద్యారణ్య స్వాములవారు

మనలో చాలామందికి విద్యారణ్యస్వాములవారు పరిచయమే అనుకుంటాను. ఈ మహానుభావులే శ్రీ నృసింహ సరస్వతిగారికి కాశీలో గురువుగా ఉండి ఆయనకి మార్గదర్శకత్వం చేసారు. వీరే హిందూ సామ్రాజ్య మరియు హిందూ మత పతనాన్ని నిరోధించి లక్ష్మికటాక్షాన్ని పొంది, హరిహర బుక్కా రాయులుచే విజయనగర మహా సామ్రాజ్యానికి బీజం వేసారు. వీరు శ్రీ విద్య మరియు గాయత్రి ఉపాసకులు.

మహర్షులు, సిద్హులు, యోగులు మరియు గొప్ప మతాధిపతులు వీరందరూ కూడా దేశభక్తిలో అందరి కన్నాకూడా ముందే ఉంటారు. సామాన్య ప్రజానీకంలో మరియు కుటిల రాజకీయ నాయకుల దృష్టిలో పైవర్గం వారందరూ కూడా ముక్కుమూసుకుని అడవులలో సమాజానికి దూరంగా ఉంటూ ఏవో సాధన చేసుకుంటూ ఉంటారు అనే భావన ఉంది. కాని నిజానికి అది పూర్తిగా అబద్ధం అని చెప్పుకోవాలి. పైన చెప్పిన మహానువభావులందరూ కూడా నిస్వార్ధంగా దేశం కొరకు, సమాజం కొరకు సమస్త విశ్వమానవాళి యొక్క శ్రేయస్సు కొరకు  అహర్నిశలు ఎన్నో రకాలుగా సాధనలు చేస్తూ తద్వారా సంప్రాప్తించిన సమస్త పుణ్యాన్ని సమాజానికి ధారపోస్తూ ఉంటారు. 

వారిని మించిన దేశభక్తులు ఎవరు లేరు, అందుకే రాజకీయ నాయకులకే కాకుండా సామాన్య ప్రజానికానికి కూడా ఈ మహానుభావులదరు కూడా ఎందుకు రాజకీయ విషయాలలో జోక్యం చేసుకుంటారు అనే భావన ఉన్నది. తెలుగు భాష క్షుణ్ణంగా వచ్చినవారికి మరియు మన భారత దేశ ఉన్నతమయిన సంస్కృతి సాంప్రదాయాలు, నాగరికత, ఆధ్యాత్మికత, మన దేశ చరిత్రలో ఆసక్తి ఉన్నవారికి మాత్రమే మనకి ఉన్న ప్రామాణిక గ్రంధాల ద్వార ఈ విషయం   అర్థం అవుతుంది.   

విద్యారణ్య స్వాములవారి పూర్వనామం మాధవాచార్యులు. మంచి సంపన్న వర్గంలో పుట్టినవారు. వీరు రాఘవేంద్ర స్వామి మఠానికి  మతాధి కారిగా ఉన్నపుడు గాయత్రి ఉపాసన నియమ నిష్టలతో చాలా కతోరమైన సాధన చేసారు. గాయత్రి మంత్రానికి 24 అక్షరాలు ఉంటాయి, అక్షరానికి లక్ష చప్పున 24 లక్షలసార్లు జపం చేసినప్పుడు ఈ మంత్రం సిద్ధిస్తుంది, దీనినే మహా పునశ్చరణ అంటారు.

 మంత్రం సిద్ధించినపుడు, ఉపాసన ఫలించినపుడు ఆ గాయత్రి దేవి సాక్షాత్కారం జరుగుతుంది. మాధవాచార్యులు ఇటువంటి మహా పునశ్చరణ చే శాక ఎంతో ఆర్తిగా మాత దర్శనం కోసం తపించినా కూడా ఆయనకి నిరాశే మిగిలింది. అప్పటి చారిత్రాత్మక పరిస్థితులు భారత దేశపు ఉనికికే ప్రమాదం తెచ్చిపెట్టేలా ఉన్నాయి.  హిందూ మతంలో ఇటువంటి భిన్నమయిన సంప్రదాయాలు, అనైక్యత, రాజుల మధ్య అంత:కలహాలు, ఇదే అదనుగా తురుష్కులు భారత దేశం మీద దండయాత్ర చేయడం  భారతదేశాన్ని కొల్లగొట్టడం, హిందువుల ధన, మాన ప్రాణాలను హరించడం, కొన్ని లక్షల మందిని బలవంతంగా భయపెట్టి మతంలోకి మార్చడం, ఇవన్ని కూడా  విద్యారణ్య స్వాములవారిని కలవపరిచాయి. ఎలాగయినా భారతదేశం ఉనికిని, మన సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం ఆయన ప్రత్యేకంగా శ్రీవిద్య గాయత్రి ఉపాసనలు ప్రారంభించారు.

వీటన్నిటికి కూడా ఎంతో ధనం అవసరం కాబట్టి ఆయన ప్రత్యేకంగా లక్ష్మి సాధన ఎంతో కాలం చేయగా చివరకి లక్ష్మి దేవి ప్రత్యక్షం అయ్యింది. అప్పుడు స్వామి తన కోరికను వివరించగా లక్ష్మి దేవి ఈ జన్మలో అది నీకు సాధ్యం కాదు, వచ్చే జన్మలో అది అనుగ్రహిస్తాను అని చెప్పింది. దానికి ఆయన వెంటనే తన పవిత్రమైన యజ్ఞోపవీతాన్ని త్యజించి "తల్లి, ఇప్పుడు నేను సన్యసిస్తున్నాను, కాబట్టి నాకిది మరొక జన్మ, నన్ను అనుగ్రహించు" అని ప్రార్ధించారు. ఆవిడ ఎంతో ప్రసన్నురాలై ఆయనకి ఆ శక్తిని ప్రసాదించింది. ఆ శక్తి ప్రభావం వాళ్ళ విద్యారణ్య స్వాములవారికి భూగర్భంలో ఉన్న గుప్త నిధి నిక్షేపాలు, ఖరీదైన రకరకాల నవరత్నాలు కనిపిస్తూ ఉంటాయి, అవన్నీ కూడా ఆయన స్వాధీనంలోకి వచ్చేవి. వాటినే ఆయన హరిహర రాయులు, బుక్క రాయులనే ఇద్దరు అన్నదమ్ములకి ఇచ్చి వారి చేత విజయనగర సామ్రాజ్య స్థాపనకి నాంది పలికారు. 

ఈ కారణాల వల్లనే ఆయన గాయత్రి సాధన ఫలించక పోవటం వాళ్ళ చాలా నిరాశ పడ్డారు. చుట్టూ ఉన్న భయంకరమైన దుష్ట రాక్షస, మాయ మరియు అసురి శక్తులను నాశనం చేయడానికి కావలసినంత శక్తిని ఈ సాధన ద్వారా ఆయన సంపాదించటానికి చివరకి గృహస్థాశ్రమం కూడా త్యజించి సన్యాసం పుచ్చుకున్నారు.  ఎంతో బాధతో ఆయన కొంత కాలం కాశీలో గడపడానికి నిశ్చయించి కాశీలో నివాసం  ఏర్పరచుకున్నారు. అక్కడే ఆయనకి ఒక తాంత్రికుడు తారసిల్లాడు, ఆ తాంత్రికుడు "వామాచారం"లో భైరవ సాధనలో భైరవుడి కటాక్షం పొందాడు. ఆయన మాధవచారిని చూసి మహానుభావా మిమ్మల్ని చూడగానే మీరు చాలా గొప్పవారని, మహా తపస్సంపన్నులు అని, మహా యోగులని తెలుస్తున్నది. కాని ఎందుచేతనో మీరు చాలా విచారవదనంతో కనిపిస్తున్నారు, అది నా అంతర్దృష్టికి  గోచరం అవుతున్నది. స్వామి మీరు ఎందుకంత విచారంగా ఉన్నారు, దయ చేసి నాకు చెప్పండి నాకు తోచిన సహాయం తప్పకుండా చేస్తాను" అని అన్నారు. అప్పుడు మాధవాచార్యులు ఈ విధంగా చెప్పారు, "అయ్యా మహానుభావా మీరు కూడా మంచి తాంత్రిక విద్యలో ప్రవీణులని తెలుస్తూనే ఉనాది. మీరనుకున్నట్లుగానే నాకు ఒక మానసిక వ్యధ ఉన్నది. దానికి కారణం నాకు తెలియట్లేదు. 

నేను ఎంతో నియమ నిష్టలతో గాయత్రి ఉపాసన చేసాను. కఠోర మయిన నియమాలతో గాయత్రి మంత్రాన్ని ఒక మహా పునశ్చరణ పూర్తి చేసాను కాని ఎందువల్లో కాని నాకు ఆ తల్లి ప్రసన్నురాలు అవలేదు (ప్రత్యక్షము కాలేదు). కొంత కాలం కాశీవాసం చెయ్యాలని ఇక్కడకి వచ్చాను" అని పలికారు. అప్పుడు ఆ తాంత్రికుడు "మహానుభావా నేను మీకు భైరవ ఉపాసన పద్ధతి చెప్తాను, ఆ సాధన వల్ల భైరవుని ప్రత్యక్షం చేసుకుని మీ సమస్యకి పరిష్కారం అడగండి. తప్పకుండ మీకు పరిష్కారం దొరుకుతుంది. వామాచార సాధనాలు చాల తొందరగా ఫలిస్తాయి, అదే దక్షిణాచార (సాత్విక పూజలు) పద్ధతిలో చాల కాలం పడుతుంది" అని చెప్పారు. మాధవాచార్యులు తాంత్రికుడు చెప్పిన విధంగా అర్థరాత్రి శ్మశానంలో ఒంటరిగా భైరవ ఉపాసన మొదలుపెట్టారు. ఇలా ఆరు నెలలు గడవగా ఒక అర్థరాత్రి సమయంలో "నాయనా మాధవాచార్య , ఎందుకు నా గురించి సాధన చేస్తున్నావు, నీ సాధన ఫలించింది నేను ఎంతో ప్రసన్నుడను అయ్యాను, నీకేమి కావాలో చెప్పు" అని ఒక గంభీర స్వరం వినిపించింది. మాధవాచార్యులు కళ్ళు తెరిచి చూడగా అక్కడ ఆయనకి ఎవరు కనపడలేదు. 

అప్పుడు వారు "భైరవా నీవెందుకు నా వెనుక నుండి మాట్లాడుతున్నావు, ముఖాముఖీ రావచ్చును కదా" అని అడిగారు. దానికి భైరవుడు "స్వామీ, మీరెంతో తపస్సంపన్నులు, శ్రీ విద్య, గాయత్రి ఉపాసకులు. అటువంటి మీ శక్తీ ముందు అల్పశక్తుడను  అయిన నేను మీ ముందుకు రాలేను, మీ శక్తిని నేను తట్టుకోలేను" అని వివరించారు. "మీ కోరిక ఏమిటో చెప్పండి, నాకు సాధ్యం అయితే చేసిపెడతాను కాని నా కన్నా కూడా మీరు చాలా శక్తివంతులు".  

దానికి మాధవాచార్యులు చాలా ఆశ్చర్యపోయారు. "భైరవ మీ అనుగ్రహాన్ని పొందినందుకు చాలా సంతోషం. మీరు చెప్పిన సమాధానం చాలా ఆశ్చర్యంగా ఉంది, నేను మీరు అన్నట్లుగానే ఒక మహా పురశ్చరణ చేసాను కాని ఎందుకో ఆ తల్లి నాకు ప్రత్యక్షం కాలేదు. దానికి కారణం నాకు తెలియట్లేదు, దయచేసి దానికి మీరు సమాధానం చెప్పగలిగితే అదే మీరిచ్చే వరంగా భావిస్తాను" అని అన్నారు. అందుకు భైరవుడు "ప్రతి మనిషి కూడా ఎన్నో కోట్ల జన్మలు ఎత్తుతూ ఉంటారు, వాటిలో కొన్నిసార్లు దుష్కర్మలు చేస్తుంటారు, మహా పర్వతాల పంక్తితో సమానంగా ప్రారబ్ధ కర్మలు పోగు చేసుకుంటారు.  అవి మహా పర్వత శ్రేణిలాగ వ్యాపించి ఉంటాయి. ఏ సాధన, వ్రతాలు, నోములు చేసినా ప్రారబ్ధ కర్మ పూర్తిగా దగ్ధం కానంత వరకు మీకు ఫలితం దక్కదు. అందుకు దేవుడిని నిందించి లాభం లేదు, మా నవులు మరల కొత్త దుష్కర్మలు మాత్రం చెయ్యకూడదు. ఇంకొక పక్క మంచిపనుల వల్ల, దానాల వల్ల ప్రారబ్ధ కర్మలు తగ్గించుకుంటూ ఉండాలి.

ఇదిగో అటుగా చూడు నీకు దివ్యదృష్టిని ప్రసాదిస్తున్నాను" అని భైరవుడు చెప్పగా అటు చూడగా మాధవాచార్యులకి ఎదురుగుండా  భగభగా మండుతున్నటువంటి పర్వతశ్రేణుల వలె ఉన్న ఆయన ప్రారబ్ధ కర్మ కనపడటం, అది మొత్తం భస్మం అయిపోవటం కనిపించింది. అపుడు భైరవుడు, "స్వామీ చూసారా ఎంతటి వారికైనా ప్రారబ్ధ కర్మ తప్పదు. ఇపుడు మీ ప్రారబ్ధ కర్మ పూర్తిగా ధ్వంసం అయిపొయింది. మీరిక నిశ్చింతగా మీ సాధన ప్రారంబించండి, ఆ గాయత్రి మాత మిమ్మల్ని తప్పకుండ అనుగ్రహిస్తుంది, వెళ్లి రండి" అని చెప్పారు.



మాధవాచార్యులు మరల మంత్రాలయం వెళ్లి తన దీక్షను పున: ప్రారంబించగా గాయత్రి మాత ప్రసన్నురాలై, ఆయనకి ప్రత్యక్షమయ్యి ఆయనను సంపూర్ణంగా ఆశీర్వదించింది. దీనివల్ల మనకి తెలిసింది ఏమిటంటే ఆ దత్తకృపకి మనం పాత్రులు అవ్వాలంటే శ్రద్ధ సహనంతో, నిదిధ్యాసతో అనగా ప్రతి వస్తువులో భగవంతుడిని దర్శించాలి. ఆ బ్రహ్మతత్వం సర్వజగత్తులో వ్యాపించి ఉంది అని భావించి నిరంతర సాధన ద్వారా మన ప్రారబ్ధ కర్మను దహించుకుంటూ కొత్త దుష్కర్మలను చెయ్యకుండా ప్రతి క్షణం ఆ దత్త తత్వానికి అనుసంధానంగా మన చిత్తాన్ని లగ్నం చెయ్యాలి. అంతే కాని మనం ఎన్ని మంచి పనులు చేసిన కూడా స్వామివారి అనుగ్రహం కలగట్లేదు అనే సంశయాన్ని, నిరాశని దగ్గరకి రానివ్వకూడదు.

Spiritual Soup-10

Part 10 - గాణగాపూర్ యాత్ర

నేను యుగాండలోఉండగా గురుచరిత్ర పారాయణం చాలా శ్రద్ధగా క్రమం తప్పకుండా చేస్తుండే వాడిని . అప్పుడే నాకు శ్రీ నృసింహ సరస్వతి గారు తపస్సు చేసుకున్న గంధర్వపురం (ప్రస్తుతం గాణగాపూర్) వెళ్ళాలనే సంకల్పము కలిగింది. ఇది కురువపుర యాత్రకి ముందు జరిగింది. కాని అక్కడికి ఎలా వెళ్ళాలి అని వాళ్ల్లని, వీళ్ళని అడగటం సంభవించింది. ఆ రోజుల్లో నేను ధ్యానం ఎక్కువగా చేస్తుండేవాడిని. తెల్లవారు ఝామున 3 గంటలుకు లేచి స్నానం చేసి ఎక్కువగా అమ్మవారి ధ్యానం చేస్తుండేవాడిని. అప్పట్లో నాకు తెలియకుండానే అంతర్గతంగా ఒక మంచి ఆధ్యాత్మిక పరంగా "హీలర్" ని కావలి అనే కోరిక సహజంగా ఉండేది.

 గాణగాపూర్ యాత్ర గురించి నేను ఆలోచిస్తుండగా మా ఆధ్యాత్మిక గురువుగారు స్వామీజీ రమణి గారి ఆంతరంగిక శిష్యుడయిన శ్రీ కులకర్ణి గారు వారి కుమార్తె వివాహం నిమిత్తమై గుల్బర్గా వెళ్తునట్లుగా తెలిసింది. వారు నన్ను కూడా వారితో రమ్మని ఆహ్వానించడం జరిగింది. నా రెండవ కుమారుడైన చిరంజీవి కమల్ కాంత్ ని తోడుగా తీసుకోనివారి వాహనంలో మేము గుల్బర్గా బయలుదేరాము. కులకర్ణి గారు నాకు మంచి మిత్రుడు మరియు గొప్ప దత్త భక్తులు.
ఆ విధంగా శ్రీ నృసింహ సరస్వతి స్వామీ వారు నా సంకల్పాన్ని చిగురింప చేసారు. గుల్బర్గాలో పెళ్లి వారితో పాటు ఒక రాత్రి మంచి హోటల్ గదిలోనే గడిపాము. 

మరునాడు పొద్దున్నే కులకర్ణి గారు నన్ను, మా అబ్బాయిని బస్టాండు దగ్గర దింపి వెళ్ళిపోయారు. అక్కడినుండి పాసింజర్ బస్సులో కొంత దూరం ప్రయాణించి ఒక కూడలి దగ్గిర దిగి మరల ఒక ఆటో మాట్లాడుకుని గాణగాపురం చేరుకున్నాము. అప్పట్లో బస్సు సౌకర్యము కాని, సత్రాల సౌకర్యము కాని పెద్దగా ఉండేది కాదు. అక్కడకి చేరాక వసతి కోసం వెతగ్గా ఎటువంటి సౌకర్యాలు లేని ఒక గృహస్థు ఇంట్లో వసతి దొరికింది. అక్కడినుంచి ఆలయానికి వెళ్లి చింతామణి గణపతి స్వామి వారిని దర్శించుకుని, అక్కడే కూర్చుని గురుచరిత్ర పారాయణం చేస్తుండగా ఒక అర్చకుడు (భట్టుగారు అనుకుంట) శ్రీ స్వామి వారు మద్యాహ్నం పూట మారువేషంలో వచ్చి  ప్రసాదాన్ని స్వీకరిస్తారని చెప్పి దానికి కొంత డబ్బు తీసుకుని వారి ఇంట్లోనే పెరుగన్నం  ప్రసాదంగా వండి తీసుకొచ్చారు. సరిగ్గా ఒంటిగంట ప్రాంతంలో అనుకుంటాను ఆయన వచ్చి మమ్మల్ని ఒక పెద్ద అరుగు మీద నిలబెట్టారు. చేతిలో ప్రసాదాన్ని ఉంచారు, ఆ సమయాని కి చాలామంది జనం ప్రసాదం కోసం గుంపులుగా వచ్చారు. నాలాగ చాలామంది ప్రసాదాన్ని పట్టుకుని అక్కడ జనానికి పంచడం మొదలుపెట్టారు. ఈ వందలమంది జనసమూహంలో దత్తత్రేయులవారు ఏ రూపంలో వస్తారో అనేది అంతుపట్టని విషయం. ప్రతి వారిని కూడా దత్తస్వామిగానే భావించి ఎంతో భక్తి భావంతో అక్కడ భక్తులు ప్రసాదం పంచుతూ ఉంటారు. ఆ ప్రసాదాన్ని జనమంతా వెళ్ళిపోయాక నేను కొంచెం సేవించాను. నాకు ఏమాత్రం పుల్లగా ఉన్న పెరుగు అస్సలు సహించదు. కాని దత్తుడు వారి భక్తుల చేత వారికి ఇష్టం లేని పనులన్ని చేయిస్తుంటారు. ఆ పెరుగు చెప్పలేనంత పుల్లగా ఉన్నది.

 మాములుగా అయితే ఆ ప్రసాదాన్ని తిరస్కరించేవాడిని కాని ఇక్కడ ఆ పని చెయ్యలేము కదా, అది ఎలాగో అలాగా మింగేసాను. నాకు ఈ రకంగా దత్తుడు చాల రకాలుగా పరీక్షలు పెట్టాడు కొన్ని తెలిసి, కొన్ని తెలియకుండా. వాటి యొక్క రహస్యం చాలా ఏళ్ళకి కాని నాకు తెలియలేదు. జిహ్వ చాపల్యం ఉండకూడదని అన్ని రకాల రుచులను, అన్ని రకాల అనుభవాలను ఆస్వాదించాలని అవన్నీ కూడా ముందు ముందు చాలా చక్కటి మధుర ఫలాలని అందిస్తాయని, ఆ దత్తుడి యొక్క తత్వాన్ని అనుభవ పూర్వకంగా తెలియ చెప్పారు.
ప్రతీవారి జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. కొంతమంది విమర్శనాత్మకముగా పరిశీలించి దత్తుడి యొక్క తత్వాన్ని తెలుసుకుని కష్టము, సుఖము అనేవి లేవని, అవి కేవలం మనం ఊహించుకునే అవాస్తవాలని తెలుసుకుని కష్టాలు అనుకున్నవి వచ్చినపుడు క్రుంగిపోవటము కాని మనసుకి ఆనందం కలిగినపుడు సంతోషపడటం కాని చెయ్యకుండా  దేని ప్రభావానికి లోనుకాకుండా కేవలం ప్రేక్షకపాత్రనే వహిస్తుంటారు. దత్త మహా ప్రభువు యొక్క బోధనా పద్ధతులన్నీ చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి.

 అనుభవాల ద్వారానే మనకి లౌకిక, అలౌకిక విషయాల గురించి స్వానుభవంగా నేర్పుతుంటారు. మనలో ఉన్న అహంకారం అనే కల్మషాన్ని కొన్నిసార్లు కఠిన పరీక్షల ద్వారా కడిగివేస్తుంటారు.ఎంతో మంది గురుచరిత్ర, సాయి చరిత్ర, దత్త చరిత్రల పారాయణాలు చేస్తుంటారు. కాని వారిలో ఈషణ మాత్రం కూడా మానసికంగా కాని, ఆధ్యాత్మికంగా కాని ఏమాత్రం మార్పు ఉండదు. ఎందుకంటె వారు కేవలం యాంత్రికంగానే చదువుతూ ఉంటారే తప్ప చదివిన ఒక అధ్యాయాన్ని గురించి ధ్యాన స్థితిలోకి వెళ్లి మనస్సు నిశ్చలంగా చేసుకుని స్వామి వారు ఏమి చెప్పదల్చుకున్నారు అనే  దాని గురించి మాత్రం విమర్శన చేసుకోరు. అందువల్ల వారిలో ఎటువంటి మార్పు కూడా ఉండదు. మనం ఒక పరీక్షలో ప్రధమశ్రేణిలో ఉత్తీర్ణత సాధించాలంటే దాని వెనుక ఎంతో కఠోర పరిశ్రమ, శ్రద్ధ ఏకాగ్రతతో పాటు, ఒకటే ధ్యాసలో చదివే విషయాలని పూర్తిగా ఆకళింపు చేసుకోక తప్పదు. అదే విధంగా దత్త అనుగ్రహ పరీక్షలో మనం ఎన్ని అవరోధాలు వచ్చినా కూడా ధృడ భక్తితో, విశ్వాసంతో, ఏకాగ్రతతో, నిధి ధ్యాసతో ఆ దత్త మహా ప్రభువు యొక్క తత్వాన్ని అర్థం చేసుకోగలిగి, ఆయన అనుగ్రహానికి పాత్రులం కావాలి. అంతే కాని మనం పారాయణాలు ఎన్నిసార్లు చేసిన కూడా మనకి ఆశించిన ఫలితం దక్కదు. ఆయన చెప్పిన తత్వాన్ని మనం ఆచరణలో పెట్టినప్పుడు మనం ఎక్కువ మార్కులు సంపాదించుకుంటాము. అందుకే శ్రద్ధ, సహనం, ఈ రెండు సూత్రాలను శ్రీ సాయి బాబా చెప్పడం జరిగింది.

దత్త పరీక్ష

"నమస్తే భగవాన్ దేవా దత్తాత్రేయ జగత్ప్రభో
సర్వబాధాప్రసమనమ్ కురుశాన్తిం ప్రయచ్చమే"



అనే ఈ శ్లోకాన్ని శ్రద్ధగా పఠిస్తూ చేతిలో జపమాలతో గుడి పక్కనే ఉన్న పెద్ద వటవృక్షం చుట్టూ 108 ప్రదక్షిణాలు చేసాను. ఎలాగైనా సరే గురుచరిత్ర పారాయణం నేను ఉన్న 2,3 రోజుల్లో పూర్తి చెయ్యాలని ధృడ సంకల్పంతో ఉన్నాను. పట్టువస్త్రం లుంగీగా కట్టుకుని, పట్టు ఉత్తరీయం కప్పుకుని మెడలో రుదాక్షమాల మరియు పద్మ/సరస్వతి మాల ధరించి చాల నిష్టగా ఆలయంలోనే పారాయణం సాగించాను. మరల సాయంత్రం నేను ఉన్న వసతి గృహంలోనే పారాయణం ప్రారంభించాను. అదే ఆవరణలో కూడా ఒక ఔదుంబర వృక్షం ఉంది. ఇంతలో ఆకస్మాత్హుగా విద్యుత్హు పోయింది. దానికి తోడు ఆస్థాన గాయకుల రూపంలో దోమల దాడి విజ్రుంబించింది. పైగా ఉక్కపోత, ఆ రాత్రి అంతా కూడా ఒక్క క్షణం నిద్రపట్టలేదు. 

తెల్లవారి లేచేసరికి విపరీతమైన వొళ్ళు నొప్పులు, దానికి తోడు జ్వరం వచ్చి చాల నిస్సత్తువగా ఉండిపోయాను. పారాయణం అనుకున్నట్లుగా సాగలేదు కాని ఒక మొండి పట్టుదల వచ్చింది. దత్త మహా ప్రభు, నువ్వు పెట్టే పరీక్షలకి నేను తట్టుకునే ధైర్యం కూడా నువ్వే ప్రసాదించాలి అనుకుని కాలకృత్యాలు తీర్చుకుని  గుర్రపు బండి మీద నేను, మా అబ్బాయి సంగమం దగ్గరకి వెళ్ళాము. ఇదే భీమ అమరజా రెండు కలిసే చోటు. అక్కడ చాలమంది, ముఖ్యంగా మహారాష్ట్ర, కన్నడిగులు చిన్న దీపం వెలిగించి ఔదుంబర వృక్షం కింద ఎంతో శ్రద్దగా గురుచరిత్ర పారాయణం చేస్తూ కనిపించారు. వాళ్ళ శ్రద్ధ భక్తులకి నేను నిజంగా ఆశ్చర్య పోయాను. వారి అకుంఠిత దీక్షముందు నేను పడ్డ బాధ చాలా అల్పంగా అనిపించింది. అక్కడే కాసేపు కూర్చుని నా పారాయణ మరల ప్రారంభించాను. 

కొద్దిసేపు గడిచాక మరల ఆలయంలో ప్రవేశించి స్వామివారిని దర్శించుకుని పారాయణ కొనసాగించాను. అంతా క్రితం రోజు రాత్రి మొట్టమొదటిసారిగా పల్లకిసేవ, ఆ గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణాలు, పాట పాడటం, కొంత మంది మనుషులు అక్కడే కింద పడుకుని ఉండడం ఇది అంతా గమనించాను. నాకు  కూడా మనసులో ఈ పల్లకి సేవలో ఒక చిన్న పాత్ర దొరికితే బాగుండేది కదా అని అనిపించింది. అదే రోజు మధ్యాహ్నం గుడి ప్రాంగణంలో చాల మంది ఏదో దయ్యం పట్టినట్లు నేల మీద దొర్లుతూ హృదయవిదారకంగా అరుస్తూ కనిపించారు. తర్వాత నాకు తెలిసింది ఏమనగా ఈ క్షేత్రంలోని శ్రీ నృసిమ్హసరస్వతి స్వామీ వారు ఈ పిశాచ బాధలని నివారిస్తూ ఉంటారని, ఉన్నత  స్థాయిలో ఉన్నదత్త సాధకులకు సాక్షాత్తు దత్త మహాప్రభు తన నోరు పెద్దగా చేసి భూత ప్రేత పిశాచాలను మింగివేస్తూ ఉంటారు అని. ఆ విధంగా వారు పిశాచత్వాన్ని  పోగొడుతూ ఉంటారని తెలుస్తూ ఉంది. ఈలోగా పల్లకి ఉత్సవం ప్రారంభం కాబోతోంది. నేను ఆలయం అరుగు మీద కూర్చుని  తదేకంగా అటే చూస్తున్నాను. పల్లకి సిద్ధంగా ఉంది, దాని ముందు ఇద్దరు వ్యక్తులు రెండు ప్రభలను పట్టుకుని సిద్ధంగా ఉన్నారు. ఇంతలో వారిలో ఒకతను నా దిశగా చూసి రమ్మని  సైగ చేసారు. నేను వెంటనే నా వెనక్కి తిరిగి ఎవరిని పిలుస్తున్నారా అని చూస్తున్నాను.

అపుడు మా అబ్బాయి మిమ్మల్నే పిలుస్తున్నారు అని చెప్పాడు. అప్పటికి నేను అతి కష్టం మీద శ్రద్దగా పారాయణం పూర్తి చేయటం జరిగింది. నేను వెంటనే ఆ వ్యక్తి దగ్గిరకి వెళ్ళగా అతను నా చేతికి ఆ ప్రభను నాకు ఇచ్చాడు, నేను సంబ్రమాశ్చర్యాలతో ఆ పల్లకి ముందు నడుస్తుండగా పల్లకి మా వెంట రాసాగింది. నేల మీద చాలామంది భక్తులు సాష్టాంగ దండ ప్రణామాలతో పడుకుని ఉన్నారు. వాళ్ళందరిని దాటుకుంటూ 2 ప్రదక్షిణాలు చేయడం, ఆ తరువాత నాకు పల్లకిలో ఉన్న స్వామివారిని స్పర్శించాలని అనిపించింది. వెంటనే నా పక్కన అతను నన్ను అదే మాదిరిగా చెయ్యమని సలహా ఇచ్చాడు. నేను, మా అబ్బాయి స్వామి వారి పాదాలకు  నమస్కారం చేసుకున్నాము. నాకిది ఒక అద్భుతమైన లీల, చాలా మాములుగానే జరిగినట్లుగా అనిపించింది. 

నేను నా శారీరక బాధలని అధిగమించి, ఎంతో ఆర్తితో గురుచరిత్ర పారాయణం పూర్తిచేయటం, దాని అనుగ్రహ ఫలంగా స్వామి వారి పల్లకి సేవలో పాలుపంచుకోవటం ఒక మరువలేని అనుభూతి. ఇలాగే చాలాసార్లు దత్త మహా ప్రభు ఇలాంటి పరీక్షలు మనకి పెడుతూ ఉంటారు.అవన్నీ కూడా చివరకి వారి అనుగ్రహఫల సంప్రాప్తికే అని తరువాత తెలుస్తుంది. ఒక్కొక్కసారి మనం ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో కాలం పూజించినా కూడా ఫలితము కనిపించదు, అటువంటప్పుడు మనకి తెలియని ఒక సంసాయత్మక స్థితిలో ఉండిపోటాము. దానికి కారణాలు మనకి తెలిసిరావు, దానికి తార్కాణము మనము ముందు చెప్పుకుందాము.