ఈ విధంగా అనుకోకుండా విచిత్ర పరిస్థితులలో ఫిలియాస్ ఫాగ్, జోన్ పాస్ పర్ట్ వాళ్ళు మళ్ళీ ఆశ్చర్యంగా కలిశారు. కనాటికా ఓడలో వీళ్ళందరూ డిటెక్టివ్ ఫిక్స్ తో సహా శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళడానికి వాళ్ళ ప్రయాణం మొదలైంది. ఈ కనాటికా అనే ఓడ పసిఫిక్ మహా సముద్రంలో ప్రయాణిస్తుంది. అద్భుతమైన సాహసాలతో. ఈ విధంగా ప్రయాణిస్తున్నప్పుడు జోన్ పాస్ పర్ట్ అంతవరకూ కూడా డిటెక్టివ్ ఫిక్స్ గురించి ఆలోచించ లేదు. ఒకదాని తర్వాత ఒకటి సంఘటనలు గబగబా జరిగిపోయాయి. తన గొడవలో తానున్నాడు కాబట్టి ఈ ఫిక్స్ గురించి అంతగా పట్టించుకోలేదు. యిప్పుడు ఆలోచిస్తే, ఏమిటబ్బా! ఈ ఫిక్స్ అనేవాడు మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి మాతో పాటుగా వస్తున్నాడు. అక్కడ సూయెజ్ దగ్గర కలిసాడు. పరిచయం పెంచుకున్నాడు.యజమానిని గురించి వాకబు చేసాడు.మేము ఎక్కడికెళితే అక్కడ ప్రత్యక్షం అవుతున్నాడు. అసలు ఏమిటి ఉద్దేశ్యం? ఇతనిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఈ డిటెక్టివ్ ఫిక్స్ గురించి యిలా అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉన్నాడు. పాస్ పర్ట్ కి అర్ధం కానీ ఆశ్చర్యకర విషయం ఏమిటంటే ఎందుకు ఈ ఫిక్స్ నన్ను ఫిలియాస్ ఫాగ్ గారి దగ్గరకు వెళ్లకుండా ఆపి, బార్ కి తీసుకెళ్లి విపరీతంగా తాగించి, ఫిలియాస్ ఫాగ్ కి సమాచారం అందకుండా ఎందుకు చేసాడు. మేమంటే ఒక పందెం కోసం కాబట్టి యిలా అన్నిదేశాలూ ప్రయాణం చేస్తున్నాO. మరి ఈ ఫిక్స్ గారికి మాతో పాటుగా రావటానికి ఏమవసరం? యిలా మాతోపాటు అన్నిదేశాలు తిరగటం ఏమిటి అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉండగా, ఫిలియాస్ ఫాగ్ గారు గొంతు వినిపించింది. నేను, మేడం ఔదా కలిసి బయటికి వెళ్తున్నా0. రేపు పొద్దున్న 7.15 కి మళ్ళీ కలుద్దాం అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఫిలియాస్ ఫాగ్, మేడం ఔదా వీళ్ళిద్దరూ చాలా చనువుగా వుంటున్నారు. ఔదా ఎంతో అద్భుతమైన సౌందర్యవంతురాలు. ఆవిడ ఫిలియాస్ ఫాగ్ పట్ల చాలా ఆరాధనగా ఉంది. స్నేహపూర్వకంగా ఉంది. కృతజ్ఞత పూర్వకంగా ఉంది. కానీ ఫిలియాస్ మాత్రం ఆవిడని ఏమాత్రం గమనించటం లేదు. అని పాస్ పర్ట్ మనసులో అనుకుంటూ వున్నాడు. కానీ అతనికి ఒకటే ఒక ధ్యేయం. ఎలాగైనా ఫిలియాస్ ఫాగ్ తన పందేన్ని తప్పకుండా గెలవాలని, తన మూలంగా ఆయన ప్రయాణానికి ఎటువంటి ఆటంకమూ కలగకూడదని, జాగ్రత్తగా వుండాలని ఆలోచిస్తూ వున్నాడు. మొత్తానికి వాళ్లిద్దరూ శాన్ ఫ్రాన్సిస్కోచేరటం జరిగింది. ఈ విధంగా వారు ఎక్కిన ఓడ ఎటువంటి అవాంతరాలు లేకుండా, శాన్ ఫ్రాన్సిస్కో క్షేమంగా చేరింది.ఇక్కడ ఫిలియాస్ ఫాగ్ తన నోట్ బుక్ లో సోమవారం రెండు గంటలు ముందున్నాము. మంగళవారం మూడు గంటలు వెనక్కి వెళ్ళాము. బుధవారం శాన్ ఫ్రాన్సిస్కో కి అనుకున్న సమయం ప్రకారం చేరాము, అని రాసుకున్నాడు. అక్కడి నుంచి వారు న్యూయార్క్ వెళ్ళవలసి ఉంది. అదే రోజు సాయంత్రం 6 గంటలకి రైల్ లో శాన్ ఫ్రాన్సిస్కో నుంచి, న్యూయార్క్ కి తన ప్రయాణాన్నికొనసాగించారు. ఒకప్పుడు ఆరునెలలు పట్టేది. ఈ రైలు ప్రయాణానికి, కాకపొతే ఈ మధ్యనే యూనియన్ పసిఫిక్ రైల్వే వారి పుణ్యమా అని ప్రయాణం కేవలం ఏడు రోజులలోనే వాళ్ళు శాన్ ఫ్రాన్సిస్కో నించి న్యూయార్క్ కి వెళ్లగలుగు తున్నారు. ఎక్కడ ఆరు నెలలు, ఎక్కడ ఏడు రోజుల ప్రయాణం అనుకుని ఆశ్చర్యపడ్డారు. ఈ విధంగా వారి రైలు ప్రయాణము సాగుతోంది. ఫిలియాస్ ఫాగ్ గారు ఈ రైల్లో మోహమా అనే సెంట్రల్ స్టేషన్ చేరుకొని, అక్కడినించి న్యూయార్క్ కి చేరుకోవాలని ప్రణాళిక (పధకం) వేశారు.
ప్రయాణం చాలా సాఫీగా సాగుతోంది. అద్భుతమైన ప్రకృతి ఇరువైపులా కనిపిస్తోంది. పాస్ పర్ట్ మాత్రం ఫిక్స్ ప్రక్కనే కూర్చున్నాడు కానీ డిటెక్టీస్ ఫిక్స్ అయితే యిప్పుడు చాలా కోపంగా ఉన్నాడు. అతడు చాలా దుర్మార్గంగా కుట్ర పన్నిన విధానం తనకి నచ్చలేదు. అతని విధానం పై మంచివాడు కాదన్న ఒక అభిప్రాయం వచ్చింది కాబట్టి పాస్ పర్ట్ బిగదీసుకుని కూర్చున్నాడు. ఒక గంట తర్వాత బ్రహ్మాండం గా మంచు కురవడం మొదలు పెట్టింది కానీ రైలు మాత్రం ఎక్కడా ఆగలేదు. మర్నాడు 6 గంటలకి కూర్చున్న పాస్ పర్ట్ కి ఎదురుగా ఉన్న కుర్చీ కి తన తల బలంగా కొట్టుకోవటంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు. ఎందుకు రైలు ఆగిందా అని చూస్తే, ఎదురుగుండా కొన్ని వందల సంఖ్యలో అడవి దున్నలు వైల్డ్ (wild) buffallos రైలు పట్టాలని దాటుతూంటే ఈ అధునాతనమైన ఈ రైలు పట్టాలపై అడ్డంగా ఈ అడవి దున్నలు అడ్డం రావటం ఏమిటని గట్టిగా అరిచాడు. కానీ ఆ ఇంజిన్ డ్రైవర్ చాలా తాపీగా సమాధానం యిస్తూ, మనం ఏమీ చేయ లేమండీ! ముందుకి వెళ్ళ నిస్తే ఇంజిన్ దెబ్బతింటుంది. అందుకే అవి వెళ్లేంత వరకు ఆగటం తప్ప మనమేమీ చేయలేము, అన్నాడు. పాస్ పర్ట్ కి కూడా ఏం చేయాలో తెలియలేదు. సరిగా మూడు గంటల సమయం తీసుకున్నాయి. అడవి దున్నలు ఆ రైల్వే ట్రాక్ దాటటానికి ఆ తర్వాత ఎటువంటి అవాంతరాలు లేకుండా ప్రయాణం కొనసాగింది. ఈ రైలు ప్రయాణంలో కనిపిస్తున్న అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని ఏమాత్రం గమనించ కుండా, మేడం ఔదాకి పేకాట ఎలా ఆడాలో చాలా శ్రద్ధగా నేర్పిస్తున్నాడు. ఆ అమ్మాయి కూడా చాలా తెలివి కలది కాబట్టి చురుగ్గా, త్వరగా నేర్చుకుంటోంది. యిద్దరూ ఆ పేకాటలోనే మునిగి పోయారు. చుట్టూ పక్కల పరిసరాలపై వారిద్దరికీ ఎటువంటి ఆసక్తి లేకుండా, పూర్తిగా ఆటలో మునిగి పోయారు. పాస్ పర్ట్ ఆలోచనలు మాత్రం చాలా రకాలుగా వున్నాయి. ఎక్కువగా ఎలాగైనా సరే తన యజమాని ఈ పోటీని గెలవాలని ఆలోచిస్తున్నాడు. అకస్మాత్తుగా పాస్ పర్ట్ నిద్రనుంచి లేచాడు. ఎందుకంటె ఆ రైల్ ఒక్క కుదుపుతో ఉన్నటుంది ఆగిపోయింది కాబట్టి. ఆ కుదుపుకి ఒక్కసారిగా మెలకువ వచ్చి లేవటం జరిగింది. ఏం జరిగిందా అని అతను ఆలోచిస్తూ ఉంటే ఆ పక్కస్టేషన్ లో ఉండే Medicine Bow అన్నతను ఈ ఇంజిన్ డ్రైవర్తో ఇలాచెప్పాడు. ఇంకా ముందుకి మీరు వెళ్ళటం అంత మంచిది కాదు. ఇంకొంత దూరంలో ఉన్న బ్రిడ్జి చాలా పాతది. మీరు వెళ్లే రైలు బరువు ఆ బ్రిడ్జి తట్టుకోలేదు. దానికి మర్మత్తులూ అవీ చేయాలి. అది చాలా సమయం పడుతుంది.ఒహామా కి మేము టెలిగ్రామ్ లు కూడా ఇచ్చాము. సహాయం కోసం. కాబట్టి మీరు జాగ్రత్తగా వుండండి. అని చెప్పటంతో పాస్ పెర్త్ తో పాటు మిగిలిన పాసెంజర్లు కూడా ఈ విషయం విని హడలిపోయారు. ఇంత చలిలో, ఇంత మంచులో ఎలా ఉండాలి. అయితే మేము ఈ ప్రయాణాన్ని ముందుకి ఎలా సాగించాలి అని బెంబేలెత్తిపోయారు. గొడవ చేస్తున్నారు. ఈలోగా ఇంజిన్ డ్రైవర్ కి ఒక ఆలోచన వచ్చింది. ఈ రైలుని ఒక రెండు కిలోమీటర్లు వెన్నక్కి తీసుకెళ్లి చాలా వేగంగా ముందుకు౭ తీసుకెళ్తూ, ఆ బ్రిడ్జి ని మనం దాటవచ్చు. మనం దాటాక ఆ బ్రిడ్జి పడిపోయినా ఫరవాలేదు, అని ఆలోచించాడు. దానికి అతని అసిస్టెంట్ కూడా ఒప్పుకున్నాడు. ఈ మాటలు విన్న పాస్ పర్ట్ కి మతిపోయింది. అలాకాదు మనందరం రైలు దిగి ఆ బ్రిడ్జి ఎలాగోలా దాటితే బరువు తక్కువగాఉంటుంది. కాబట్టి ఈ రైలు శుభంగా బ్రిడ్జి మీదనించి వచ్చినా ప్రమాదం ఉండదు. కానీ ఆ అసిస్టెంట్ మాత్రం లేదు లేదు ఆ ఇంజిన్ డ్రైవర్ చెప్పిన సలహానే బాగుంది. చాలా వేగంతో కనక మనం వెళ్ళ గలిగితే చాలా సులభంగా మనం బ్రిడ్జి ని దాటగలం. ఆ తర్వాత ఆ బ్రిడ్జి కూలిపోయినా మనకి సమస్య లేదుకదా! కాబట్టి ఇంజిన్ డ్రైవర్ చెప్పిన ప్రకారం ఈ సలహా చాలా బాగుందని అన్నాడు. ఈ మాటలకి పాస్ పర్ట్ కి మతిపోయింది. ఏం చేయాలో అర్ధం కాలేదు. మిగతా ప్రయాణీకులందరూ కూడా ఈ పధకం చాలా బాగుంది. ఇంజిన్ డ్రైవర్ చెప్పిన సలహా బాగుందని అందరూ కూడా ఒప్పేసుకున్నారు.రైలు ఎప్పుడైతే వేగంగా ప్రయాణం చేస్తుందో అపుడు దాని బరువు తగ్గిపోతుంది. మెల్లిగా ప్రయాణం చేసినప్పుడు బరువుగా ఉంటుంది.
కాబట్టి, బ్రిడ్జి కూలిపోయే అవకాశం ఉంటుంది అన్న సిద్దాంతం ప్రకారం ఆ ఇంజిన్ డ్రైవర్ చాలా హుషారుగా, ఆ హారన్ గట్టిగా నొక్కి ఒక రెండు కిలోమీటర్లు ఆ ఇంజిన్ ని వెనక వైపుకి నడిపించాడు. ఎంత వేగంగా సాధ్యమైతే అంత వేగంగా రైలు ని ముందుకి నడిపించాడు. పాస్ పర్ట్ గుండె చాలా వేగంగా కొట్టుకో సాగింది. వేగంగా ఆ రైలు బ్రిడ్జి మీద ప్రయాణించి, బ్రిడ్జి దాటగానే వెనక్కి చూస్తే ఆ బ్రిడ్జి పెద్ద శబ్దంతో ఒక్కసారిగా కూలిపోయి, కిందవున్న అగాధంలో పడిపోయింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
************