4వ అధ్యాయంలో, ఏ విధంగా ఘోరమైన ప్రమాదం నుండి, తప్పించుకుని,ఊపిరి పీల్చుకున్నారో తెలుసుకున్నాము. ఆ రైలు మొత్తం, శిధిలమైన ఆ వంతెన మీదుగా అతివేగంగా ప్రయాణించి, చివరి బోగీ సురక్షితంగా ఆ వంతెనని దాటాక, ప్రయాణీకులందరూ చూస్తుండగానే భయంకరమైన శబ్దంతో కిందవున్నఅగాధంలో ఆ వంతెన పడిపోయింది. ఈ విధంగా, జోన్ పాస్ పర్ట్ మొత్తానికి ఎలాగైతేనేఁ , అందరమూ ప్రమాదం నుంచి బయట పడ్డం కదా అని ఆలోచిస్తున్నాడు. ఆ తర్వాతి ప్రయాణం సుఖవంతంగా సాగింది. అటూ ఇటూ అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. కొలరాడో పర్వతాలు చాలా అందంగా ఉన్నాయి. రమణీయంగా వున్నాయి. కానీ జోన్స్ పాస్ పర్ట్ మాత్రం తన యజమానికి పోటీ గురించే ఆలోచిస్తున్నాడు. తాను డిటెక్టివ్ ఫిక్స్ ప్రక్కన కూర్చున్నా కూడా అతనితో మాట్లాడాటానికి మనసు ఇష్టపడటం లేదు. ఈ విధంగా ప్రయాణం సాగుతోంది. ఫిలియాస్ ఫాగ్ చాలా నిశ్చింతగా ఏమీ పట్టనట్లుగా మేడం ఔదా తో హాయిగా పేకాట ఆడుకుంటున్నాడు. డిటెక్టివ్ ఫిక్స్ చిన్న పిల్లవాడిలా కంపార్టుమెంటులో ఉయ్యాలలు ఊగుతుంటే, అతడి తల కూడా కిందకీ పైకి కదులుతోంది. అయితే పాస్ పర్ట్ మాత్రం ఇంకా ఆలోచిస్తున్నాడు. ఇంకా ఎటువంటి అవాంతరాలు వస్తాయో, అని మనసులో ఎందుకో అనుకుంటూ వున్నాడు. మూడు రోజులై, మూడు రాత్రులు ప్రయాణం తర్వాత వారు దాదాపు 2200 కిలోమీటర్లు పైన ప్రయాణం చేశారు వాళ్ళు. మిగిలిన ప్రయాణీకులు కూడా దాదాపు ఈ ప్రయాణానికి అలవాటు పడిపోయారు. సరిగ్గా పాస్ పర్ట్ ఊహించి నట్టుగా కొద్ది రోజుల్లోనే, ఆ రైలు కి రెండు వైపులనుంచీ పెద్దపెట్టున నినాదాలతో సూ ఇండియన్స్ వాళ్ళు బాణాలతోను, బల్లాల తోను,గుర్రాలమీద, వేగంగా వస్తూ ముందుకు రాసాగారు. ప్రయాణీకుల మీద బాణాల వర్షం కురిపించ సాగారు.
జరిగిన ఈ హఠాత్పరిమాణానికి ఈ కూర్చున్న ప్రయాణీకులందరూ ఒక్క సారిగా ఉలిక్కిపడ్డారు. అందులోని కొందరు ధైర్యస్తులు తమ పిస్టళ్లను తీసి ఆ న్యూ ఇండియన్స్ మీద కాల్చటం మొదలు పెట్టారు. ఈ ఇధంగా అనేకమంది, స్యూ ఇండియన్స్ పట్టాల వెంబడి రెండువైపులా, గట్టిగా అరుస్తూ బాణాలు వదులుతూ వున్నారు. గుర్రాలు కూడా చాలా వేగంగా కదులుతున్నాయి. చివరికి వారు ఆ ఇంజిన్ లోనికి ఎక్కటం, ఆ ఇంజిన్ డ్రైవర్లని వారు గట్టిగా తాళ్లతో కట్టేసి, ఆ రైలు నుండి బయటికి తోసివేసారు. ఈ దెబ్బకి మెల్లి మెల్లి గా అందరూ కొంత తేరుకున్నారు. అయితే ఆ దగ్గరలోనే పోర్ట్ కెనీ అనే ప్రాంతంలో ఈ మిలిటరీ సైనికులు ఉన్నారు. వాళ్లంతా కూడా ఈ రైలు చప్పుడు, దానిలోంచి పిస్తోళ్ళ చప్పుళ్ళకి, స్యూ ఇండియన్స్ చేస్తున్న నినాదాలు అరుపులూ కేకలూ విని, ఏమిటా అని వారు బయటికి వచ్చి, ఆ స్యూ ఇండియన్స్ మీద వారు కూడా తూటాలా వర్షం కురిపించారు. ఈలోగా ఈ స్యూ ఇండియన్స్ లో కొంతమంది, వారి లోవున్న ఒక నాయకుడు, చూడు, ఈ రైల్ లో ఉన్న ఒకతను మనల్ని చాలా యిబ్బంది పెడుతున్నాడు. అతన్ని పట్టుకుని పారిపోదాం పదండి అని చెప్పి , ధైర్యస్తులైన యిద్దరు ప్రయాణీకులను వారు పట్టుకున్నారు. వాళ్ళని రక్షించడానికి వెళ్లిన పాస్ పర్ట్ ని కూడా గట్టిగా పట్టుకుని, కిందకి దింపి, ఆ ముగ్గురినీ వాళ్ళ గుర్రాలమీద ఎక్కించుకుని, అడవుల్లోకి పారిపోయారు. ఎందుకంటె ఈ మిలిటరీ వాళ్ళు కూడా గుర్రాల మీద రావటంతో స్యూ ఇండియన్స్ పారిపోయారు. ఈ పరిణామానికి మేడం ఔదా చాలా విచారపడింది. అయ్యో! పాస్ పర్ట్ సహాయం చేయబోయి, తానే ఇరుక్కున్నాడే... ఎలా? అని ఎంతో బాధపడుతూ ఉంది. ఎందుకంటె మేడం ఔదా కి పాస్ పర్ట్ పట్ల ఎంతో మంచి అభిప్రాయం ఉంది. ఎందుకంటె ఎప్పుడైతే స్యూ ఇండియన్స్, ఇంజిన్ డ్రైవర్లను బయటికి విసిరి వేసారో మరి ఆ రైలు ని ఆపాలి కదా మరి ఎలా ఆపాలి. అందరూతలపట్టుకున్నారు. డ్రైవర్లు లేకుండానే ఆ ట్రైను ప్రయాణం చేస్తున్నప్పుడు, పాస్ పర్ట్ కి ఒక ఆలోచన వచ్చింది. అతను చాలా బలిష్టంగా ఉంటాడు కాబట్టి, తన కంపార్ట్మెంట్ తలుపు తెరిచి, చాలా ధైర్యంగా, ఆ కారేజీ కిందికి వెళ్లి, బలవంతుడు కాబట్టి, మెల్ల మెల్లగా, ఇంజిన్ దిశగా పాక్కుంటూ వెళ్లి, సరిగా ఇంజిన్ దగ్గర బోగీ కి వచ్చి, ఇంజిన్ కీ, బోగీలకీ వున్న లింకు ని తన బలిష్టమైన చేతులతో విడ దీసాడు. ఇతడు చేసిన అద్భుతమైన సాహసం వల్ల , మెల్లగా ఆ భోగీలన్నీ ఆగి పోయాయి. అందుకని, మిగతా ప్రయాణీకులూ, మేడం ఔదా కూడా, పాస్ పర్ట్ తన ప్రాణానికి తెగించి ఇంతమందిని కాపాడాడు. ఆఖరికి ఈ స్యూఇండియన్స్ పట్టుకెళ్ళిపోయారే అని బాధపడ సాగారు. అప్పుడు ఫిలియాస్ ఫాగ్ వచ్చి, ఏం ఫరవాలేదు. నేను వాళ్ళని తీసుకువస్తాను. పాస్ పార్ట్ , బతికున్నా ,చనిపోయినా సరే తీసుకు వస్తాను. అని ధైర్యంగా చెప్పాడు. అతడిని చూసి ఇతడే నాకు తగిన కథానాయకుడు. ఇతనికి భయం కూడా లేదు. అని మేడం ఔదా మనసులో ఫిలియాస్ ఫాగ్ గురించి అనుకుంటూ ఆనందపడింది. కృతజ్ఞతా భావంతో పొంగిపోయింది. అయితే ఫిలియాస్ ఫాగ్ తనతో పాటు కొంతమంది సైనికులు తోడుగా వస్తే, వాళ్ళని రక్షించి వెనక్కి తీసుకురాగలము అన్నాడు. దానికి సైనికులుసిద్ధపడ్డారు. ముప్పైమంది సైనికులు, ఫిలియాస్ ఫాగ్ స్యూ ఇండియన్స్ తీసుకెళ్లిన పాస్ పర్ట్, ని, మిగిలిన ప్రయాణీకులనూ తీసుకు రావడానికి అందరూ కలిసి అడవుల్లోకి వెళ్లారు. ఆ రోజు సాయంత్రం అయిపోయినా ఇంకా ఫిలియాస్ ఫాగ్ వాళ్ళు వెనక్కి రాలేదు. మేడం ఔదా, డిటెక్టివ్ ఫిక్స్ అక్కడే స్టేషన్లో ఉన్నారు.
వారు ఆ రాత్రంతా చలికి గజగజా వణుకుతూ అలాగే కూచున్నారు. మేడం ఔదా ఫిలియాస్ ఫాగ్, పాస్ పర్ట్ ల గురించి ఆలోచిస్తోంది. సరిగ్గా సూర్యోదయం అయ్యేసరికి, అక్కడ అరుపులూ, కేకలూ వినిపించే సరికి, ఏం జరిగిందా అని చూసేసరికి ఫిలియాస్ ఫాగ్ అందరికన్నా ముందున్నాడు. సైనికులు వెనక పాస్ పర్ట్ మిగిలిన యిద్దరు ప్రయాణీకులు. వెనక్కి క్షేమంగా రావటం, సంతోషంతో హర్షద్వానాలతో మారుమోగిపోయింది. మేడం ఔదా చాలా సంతోషించింది. వీరందరూ వెనక్కి క్షేమంగా రావటం చూసి గట్టిగా ఆనందంతో అరిచింది. అమ్మయ్యా ! క్షేమంగా వెనక్కి వచ్చేసారు అని. అందరూ వీరు వెనక్కి రావడం చూసి ఊపిరి పీల్చుకున్నారు.
ఇప్పుడు తాము ముందుకి ప్రయాణం ఎలా కొనసాగించాలా అని ఆలోచనలో ఉన్నారు. డిటెక్టివ్ ఫిక్స్ బయటికి వెళ్ళాడు. ఎవరితోనో మాట్లాడాడు. అతనిని తీసుకుని వెనక్కి వచ్చాడు. అతను ఈ విధంగా చెప్పాడు. ఇతను స్లెడ్జి ని నడుపుతాడు. విపరీతమైన మంచు కురిసి, ప్రయాణం ఆగిపోయినపుడు తన స్లెడ్జి మీద ప్రయాణీకులని, ఆ తర్వాతి స్టేషన్ కి తరలిస్తూ ఉంటాడు, అని పరిచయం చేసాడు. వీళ్ళు అంటే ఫిలియాస్ ఫాగ్ వాళ్ళు వయా చికాగో, న్యూయార్క్ కివెళ్లాలని ఆలోచన అన్నమాట. సరేనని అంతనితో బేరం కుదుర్చుకుని, ఈ ప్రయాణీకులంతా ఎక్కారు. చాలా మందే ఎక్కారు. అది చాలా వేగంగా ప్రయాణిస్తుంది. కానీ చాలా చల్లగా వుంది. వెచ్చని దుస్తులు కప్పుకున్నప్పటికీ కూడా చాలా చలి గా ఉండాలి. ప్రయాణీకులందరూ ఒకరితో ఒకరు మాటలు లేకుండా, బిగుసుకు పోయి వున్నారు. మొత్తానికి వారు అనుకున్న స్టేషన్ కి చేరుకున్నారు.చాలాపెద్ద మొత్తంలో స్లెడ్జి నడిపే యజమానికి ధనాన్ని ముట్టజెప్పాడు. డిటెక్టివ్ ఫిక్స్ కి మాత్రం ఈ ఫిలియాస్ ఫాగ్ మనస్తత్వం ఏమీఅర్ధం కావటం లేదు. ఎందుకంటె ఫోర్ట్ కీనీ స్టేషన్ లో ఫిలియాస్ ఫాగ్ఆ స్టేషన్ మాస్టారుతో న్యూయార్క్ వెళ్ళటానికి రైలు ఎప్పుడుందని అడిగితే అదే రోజు సాయంతరం ఉందని చెప్పాడు. ఫిక్స్ సాయంతరం రైలు కె బయలు దేరుతారని అనుకున్నాడు. కానీ, ఫిలియాస్ ఫాగ్ మాత్రం తన ప్రయత్నాల్ని మానుకోలేదు. అప్పటికే ప్రయాణంలో 24 గంటలు వెనక్కి వున్నారు. దానికి తానే బాధ్యుణ్ణి కదా అని పాస్ పర్ట్ లోలోపల ఎంతో బాధపడుతున్నాడు.
అటువంటి సమయంలోనే ఈ స్లెడ్జి మీద ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నారు. తప్పని సరిగా ఫిక్స్ వాళ్ళతో పాటుగా ప్రయాణించి, వీళ్ళు ఎప్పుడైతే ఇంగ్లాండ్ లో అడుగు పెడ్తారో అప్పుడు అరెస్ట్ చేసేస్తాను, అని మనసులో అనుకుంటూ వున్నాడు. వీళ్ళు స్టేషన్ చేరుకోగానే చికా గో వెళ్ళడానికి రైలు సిద్ధంగా వుంది. అక్కడి నుంచి వెంటనే న్యూయార్క్ వెళ్ళటానికి కూడా రైలు సిద్ధంగా ఉండటం సంభవించింది. ఆ విధంగా న్యూయార్క్ కూడా చేరుకోవటం వీలైంది. ఈ విధంగా వాళ్లకి ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా ఫిలియాస్ ఫాగ్ ముందుచూపు, నాయకత్వ లక్షణాల వల్ల ఒహామా అనే స్టేషన్ నుంచి చికా గో, అక్కడి నించి, న్యూయార్క్ కి 11 గంటలకి 11 డిసెంబర్ న చేరారు. అక్కడినించి చైనా అనే ఓడ ఎక్కి లివర్పూల్ కి వెళ్లాలన్నమాట. కానీ వీళ్ళు ఆ ఓడ ఎక్కాలని, ఓడరేవుకి 45 నిముషాలు ఆలస్యంగా వెళ్లారు. దాంతో ఆ చైనా అనే ఓడ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మళ్ళీ అక్కడినించి, ఒక పెద్ద అవాంతరాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. పాస్ పర్ట్ చాలా గాబరా పడసాగాడు. ప్రయాణం చివరగా చాలా దగ్గరికి వచ్చేసాము అక్కడినించి వాళ్ళు లివర్ పూల్ కి వెళ్ళాలి. అక్కడి నుంచి ఎక్కువ సమయం పట్టదు లండన్ చేరుకోవటానికి. అయ్యో! ఈ అవాంతరం వచ్చిందేమిటి, అనుకున్నాడు. ఫిలియాస్ ఫాగ్ మాత్రం చాలా ధైర్యంగా, గంభీరంగా ఉన్నాడు. అతడు అక్కడే వున్న ఒక ఓడ యజమాని దగ్గరకు వెళ్ళటం జరిగింది. ఫిలియాస్ ఫాగ్ అతనిని మీరు లివర్పూల్ కి తీసుకెళ్తారా అని అడిగితే వారిలో ఎవరూ కూడా కుదరదు అని చెప్పారు. ఎవరూ ఒప్పుకోలేదు. ఆఖరికి ఫిలియాస్ ఫాగ్ సామాన్లను మోసుకెళ్లే ఓడ ఉంటె కార్గోషిప్ దగ్గరికెళ్లి అతనితో బేరమాడాడు. కెప్టెన్ ఆ కూడా పారిస్ కి వెళ్లాలని, 20 డిసెంబర్ కల్లా ఈ సరుకులన్నిటినీ అక్కడి వారికి అందజేయాలని, కాబట్టి తానూ రావటం కష్టం,వారిని తీసుకెళ్లలేనని, నిర్మహమాటంగా చెప్పాడు. అప్పుడు ఫిలియాస్ ఫాగ్ మీతో పాటు మేము వస్తాము. నువ్వు ఎక్కడికెళ్తే అక్కడికి వస్తాము. అంటే నీ ప్రయాణం పారిస్ కి కదా, అక్కడికి వస్తాము. మేము నలుగురం వున్నాము. ఒక్కొక్కరికీ నీకు రెండు వేల డాలర్ చొప్పున ముట్టజెప్తాను. మమ్మల్ని తీసుకెళ్తావా అని అడిగాడు. ఆ కెప్టెన్ చాలా ఆశ్చర్య పడ్డాడు. ఏమిటీ ఇంత డబ్బిస్తానంటున్నాడు ఇతను. కెప్టెన్ సరే అలాగే తీసుకెళ్తానని చెప్పటం, ఆ మాటలు వింటున్న ఫిక్స్ కి మతిపోవటం జరిగింది.అదేమిటి, ఈ కార్గోషిప్ లో పారిస్ కి వెళ్ళటం ఏమిటి? ఎక్కడికో, ఎవరికీ తెలియని ప్రదేశానికి వెళ్లి పారిపోవాలని అనుకుంటున్నాడేమో.... నాకు వేరే గత్యంతరం లేదు. నేను ఇతని చుట్టూ తిరిగినా అతనివెంటే వెళ్లి, ఏదో ఒక రోజు తప్పకుండా అరెస్ట్ చేయాల్సి వస్తుంది కదా అనుకున్నాడు.
సరే! అందరూ ఆ కార్గోషిప్ ఎక్కారు. ఈ లోగా ఫిలియాస్ ఫాగ్ ఏం చేస్తాడా అని ఫిక్స్, పాస్ పర్ట్ అందరూ కూడా ఆలోచిస్తూ వున్నారు. ఎప్పటి మాదిరిగానే ఫిలియాస్ ఫాగ్ తన భావాలని బయటికి కానీ, ఎవరికైనా గానీ చెప్పలేదు. ఆ కార్గోషిప్ ని నడుపుతున్న ఆ ఓడ లోని నావికులందరి దగ్గరికీ వెళ్లి ఆ నాయకుడి తో మీరు మమ్మల్ని లివర్ పూల్ కి తీసుకు వెళ్తే, మీకు బోలెడంత డబ్బిస్తానని, ఎంతో డబ్బుని ఆశగా చూపించాడు. ఆ ఓడని నడుపుతున్న నావికులందరూ చాలా ఆశ్చర్యపడ్డారు. ఇతనేమిటి ఇంత డబ్బు ఆశ జూపుతున్నాడు, అని వాళ్లలో వాళ్ళు మాట్లాడుకుని వాళ్ళందరూ ఒక్క మాటగా మిమ్మల్ని తప్పకుండా లివర్ పూల్ తీసుకెళ్తామని చెప్పారు. నావికులందరూ ఆ కెప్టెన్ దగ్గర కెళ్ళి మూకుమ్మడిగా పట్టుకుని కాళ్ళు చేతులూ కట్టేసి తీసుకెళ్లి గదిలో పడేసి తాళం వేశారు. అతను లోపల్నుంచి అరుపులు, కేకలు పెడుతున్నా కూడా, ఎవరూ పట్టించుకోలేదు. పారిస్ కి బదులుగా ఈ ఓడ లివర్ పూల్ వైపుగా ప్రయాణ౦ సాగించింది. నిజంగా ఈ డిటెక్టివ్ ఫిక్స్ కి మతిపోయింది. పాస్ పర్ట్ కి తన యజమాని పట్ల ఎంతో గౌరవం పెరిగింది. ఫిలియాస్ ఫాగ్ గురించి అలా ఆలోచిస్తూ వున్నాడు.
****************