N. Sairam Garu || Email: sridatta50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.

Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here

Tuesday 16 May 2023

8౦ రోజుల్లో భూప్రదక్షిణ - 3

              


పోయిన అధ్యాయం లో  అనగా పార్ట్ 2 మనం ఫిలియాస్ ఫాగ్, జోన్ పాస్ పర్ట్  ఏ విధంగా ఔదా ని రక్షించారు, ఏ విధంగా  అల్గహబాద్ చేరుకున్నారు అని తెలుసుకున్నా ము. కలకత్తాకి  చేరుకునే ప్రయాణంలో  ఔదా కి జరిగన విషయాలన్నీ  తెలిపారు. ఆమె చాలా కృతజత్యా భావం తెలిపింది. అనుకున్నట్టు గానే రైలు ఆ రోజు మధ్యాహ్నానికి  కలకత్తా  చేరింది  హాంగ్ కాంగ్ కి వెళ్ళే  ఓడ బయలు దేరుతుందని తెలిసాక ఆ ముగ్గురూా  కొంచెం అటూ ఇటూ  తిరుగుతూ ఓడ బయలు  దేరే  సమయానికి  వచ్చి ఎక్కారు.. ఆ ఓడ హాంగ్  కాంగ్ దేశానికి బయలుదేరింది. డిటెక్టివ్ ఫిక్స్ ఎలా అక్కడకి  చేరాడో తెలియదు కానీ అతడు కూడా హాంగ్కాంగ్ కి వెళ్ళే ఓడ ఎక్కాడు. వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో  వాళ్ళు ముగ్గురూ హాంగ్ కాంగ్ చేరి అక్కడ నించి యొకహోో మా (జపాన్) దేశానికి వెళ్ళే  ఓడనితప్పి  పోయారు. వాళ్ళు అనుకున్న దాని కన్నా  ఒక రోజు ఆలస్యంగా చేరినందు వల్ల తప్పిపోయారు. డిటెక్టివ్  ఫిక్స్ వీళ్ళు ఏం చేస్తారా  అని గమనిస్తున్నాడు. ఎందుకంటె హాంగ్ కాంగ్ బ్రిటిష్ వారి ఆధీనంలో  ఆఖరి డెస్డం.  టెలిగ్రాం ఆధిపత్యం లో వచ్చిందా లేదా  అని కనుక్కో వటానికి  వెళ్ళాడు. అక్కడ పోలీసు వాళ్ళు ఏమీ చెప్పలేదు. కాబట్టి ఫిలియాస్ ఫాగ్ వాళ్ళ ని అరెస్టు చేయలేక పోయినందుకు  చాలా ఆదుర్దా పడుతున్నాడు. కానీ అతను తప్పని సరిగా ఫిలియాస్ ఫాగ్ ని వెంబడంచి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. ఫిలియాస్ ఫాగ్, జోన్ పాస్ పర్ట్ వీళ్ళిద్దరూ కూడా  సీపోర్ట్ కి నెక్స్ట్  ఓడ  ఎప్పుడు వెళ్లుతుందని కనుక్కోవడానికి వెళ్లారు. వాళ్ళు వెళ్ళవలసిన గమ్యం యొకహోో మా. ఇది జపాన్నోఉంది. ఎక్కవలసిన, తప్పిపోయిన ఓడని పట్టుకోవాలి.. అక్కడ ఉన్న ఓడ యజమానిని  ఫిలియాస్ ఫాగ్, యొకహోో మా వెళ్ళే ఓడ ఎప్పుడుంది, అని అడిగారు. దానికి  సమాధానంగా ఆ ఓడ కెప్టెన్  రేపు ఉదయం బయలు దేరుతుందని చెప్పాడు. అదే మిటి ఈ రోజు ఉదయం బయలు దే రాలి కదా. అంటే నిజమేనండీ! అనుకోకుండా  ఓడకి కొన్ని   మరమ్మత్తులు  చేయవలసి వచ్చింది . అందు వలన ఆలస్య మవుతోంది. రేపు పొద్దున్నే బయలు దేరుతుందని చెప్పాడు. అప్ప టికే ఒకరోజు  వెనకబడి పోయారు. మరి జోన్ పాస్ పర్ట్ కి మాత్రం  ఎందుకో  సంతోషం కలిగంది. ఆ కెప్టెన్ కి ధన్యవాదాలు చెప్పాడు. ఆ తర్వాత డిటెక్టివ్  ఫిక్స్ కూడా హాంగ్  కాంగ్ కి ఆ టెలిగ్రాం ఎప్పుడు వస్తుందా .... ఎప్పుడు  అరెస్టు చేయాలా  అని ఎదురు చూస్తున్నాడు. ఈ విధంగా వీళ్ళు హాంగ్ కాంగ్ లో నే ఉండవలసి వచ్చింది. మామూలుగానే ఫిలియాస్ ఫాగ్ తానూ  బసచేసిన హోటల్ కి వెళ్ళాడు. జోన్ పాస్ పర్ట్  మాత్రం అసలు ఈ ఓడ ఎప్పు డు కరెక్టు గా  బయలుదేరుతుందో, మరమ్మత్తులు ఎంత వరకు వచ్చాయో అని మళ్ళీ ఒకసారి కనుక్కుందామని ఆ ఓడ కెప్టెన్ ని అడగగా రేపు పొద్దున్న దాకా ఆగవలసిన అవసరం లేదు. మరమ్మత్తులు చాలా తొందరగా జరుగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం కల్లా ఓడ ప్రయాణానికి సిద్ధం అవుతుందని చెప్పాడు. ఆ శుభవార్త విని జోన్ పస పర్ట్ చాలా సంతోషించాడు. ఎలా గైనా ఈ విషయాన్ని తన యజమానికి తెలపాలని నిశ్చయించుకుని వెంటనే హోటల్ వైపు వెళ్ళాడు.యిదంతా  గమనిస్తున్న  డిటెక్టివ్  ఫిక్స్ చాలా  నిరుత్సాహ పడ్డాడు  అయ్యో ! టెలిగ్రాం ఇప్పటిదాకా అందలేదు. ఈలోగా వీళ్ళు ఈ ఓడ పట్టుకుని యోకోహామా వెళ్ళితే నాకు వీళ్ళని అరెస్టు చేయడం సాధ్యం కాదు కదా ! ఎలాగైనా వాళ్ళని ఆపాలని ఆలోచిస్తూ కూర్చున్నాడు. అతనికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఈ జోన్ పాస్ పర్ట్  ఎలాగో కొంచెం  అమాయకుడి లాగానే కనిపిస్తున్నాడు.ఇతడిని కనుక ఈ రోజు నేను ఆపగలిగి తేా , అంటే ఫిలియాస్ ఫాగ్ కి  ఈ ఓడ ఈ సాయంత్రమే బయలు దేరుతుందనే విషయం తెలియకండా ఉండాలంటే, ఈ జోన్ పాస్ పర్ట్ ని ఎలాగైనా మాయమాటలతో మాయచేయాలని ఆలోచించి, మెలాగా  జోన్ పాస్ పర్ట్ తో నడుస్తూ మాటలు కలిపాడు. 

జోన్ పాస్ పర్ట్ డిటెక్టివ్  తో, "ఈ రోజు సాయంత్రమే ఈ ఓడ బయలుదేరుతుంది. ఈ విషయం మా యజమాని ఫిలియాస్ ఫాగ్ కి చెప్పాలి. లేకపోతే ఓడ ప్రయాణం  పొద్దున్న కాబట్టి అప్పటికి  సిద్ధమవ్వాలని అనుకంటాడు" అని సంతోషంగా చెప్పా డు.

ఆ మాట విని జోన్పాస్ పర్ట్ తో డిటెక్టివ్  ఫిక్స్ , "నేను  చాలా రోజులయింది  ఇంగ్లాండ్  వదిలి. ఒంటరిగా ఉన్నా ను. నాకు  ఏమీ తోచటం లేదు . పరిచయస్తులు కూడా  ఎవరూ లేరు.ఫిలియాస్ఫాగ్ ఉన్న హోటల్ దగ్గర  ఒక మంచి రెస్టా రంట్ ఉంది. అక్కడ కొంచెం  డ్రింక్స్ తీసుకుందాం. దయచేసి కొంత సమయం నాతో గడపండి" అని అభ్యర్థనగా అడిగారు  డిటెక్టివ్ ఫిక్స్. 

జోన్ పాస్ పర్ట్  కొద్దిగా  తటపటాయించాడు. "లేదండీ.  నేను మా యజమానికి ఈ విషయం తెలపాలి". 

"పరవాలేదులే. ఎక్కువసేపు గడపనఖ్ఖర్లేదు  కొద్దీ సేపు మాత్రమే కూర్చుందాం అని అన్నాడు. జోన్ పాస్ పర్ట్ తో. ఈ లోగా   డిటెక్టివ్  ఫిక్స్ ఆ బార్ యజమానితో జోన్పాస్ పర్ట్ కి  కొంచం ఘాటైన విస్కీని ఇ వ్వవలసిoదిగా పురమాయించాడు. 

ఇవేమీతెలియని జోన్ పాస్ పర్ట్ డిటెక్టివ్  ఫిక్స్ తెప్పించిన ఘాటైన విస్కీ ని సేవించాడు. ఇలాగే మాయమాటలు, కబుర్లు చెప్తూ చెప్తూ , జోన్ పాస్ పర్ట్ ని  గ్లాసు తర్వాత గ్లాసు అలా ఖాళి చేయిస్తూ వచ్చాడు. చివరకి పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే జోన్ పాస్ పర్ట్ ఒళ్ళు తెలియకుండా అలాగే టేబుల్ పైన సోలిపోయాడు.

డిటెక్టివ్ ఫిక్స్ మాత్రం సంతోషంగా హమ్మయ్య! ఫిలియాస్ ఫాగ్ కి ఓడఈ సాయంత్రమే బయలు దేరుతుందన్న విషయం తెలియదు. కాబట్టి యింకా మరికొన్ని గంటలు ఆయన ఇక్కడే ఉంటాడు. రేపు పొద్దున్న వరకల్లా నాకు టెలిగ్రామ్ వస్తే, నేను ఇతన్ని అరెస్ట్ చేయవచ్చు, అని

విజయగర్వంతో అనుకుంటూ డిటెక్టివ్ ఫిక్స్ బార్ నించీ బయటికి వచ్చాడు. డిటెక్టివ్ ఫిక్స్ బయటికి వచ్చాక చాలా సంతోషంగా ఉన్నాడు. ఎప్పుడుటెలిగ్రామ్ వస్తుందా, ఫిలియాస్ ఫాగ్ ని ఎప్పుడు అరెస్ట్ చేస్తానా అని ఆలోచిస్తున్నాడు. పధకాలు వేస్తున్నాడు. ఇక్కడ ఫిలియాస్ ఫాగ్ కి తాను వెళ్లాల్సిన ఓడ కనాటికా ఆరోజు అంటే క్రితం రోజు సాయంత్రమే వెళ్లిందన్న విషయం తెలియదు. కాబట్టి పొద్దున్నే జోన్ పాస్ పర్ట్  కోసం వెతికాడు. కానీ అతను కనిపించలేదు. ఫిలియాస్ ఫాగ్, ఔదా ఆశ్చర్యపడుతున్నారు. ఎక్కడికెళ్లాడా అని. ఈలోగా ఫిలియాస్ ఫాగ్ తన

బాగ్ ని తానె చక్కగా, సర్దుకొని, హోటల్ బిల్ పే చేసి, సిపోర్ట్ (sea port)దగ్గరికి వెళ్ళగానే, 

 ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. తాను  ఇవ్వాళ పొద్దున్నే వెళ్ళవలసిన ఓడ కనాటికా నిన్న సాయంత్రమే మరమ్మతులు అయిన వెంటనే బయలు దేరి వెళ్లిందనీ, తెలిసింది. ఫిలియాస్ ఫాగ్ కించిత్తు ఆశ్చర్యపడ్డాడు. ఏమిటీ ఈ జోన్ పాస్ పెర్త్ కనిపించటం లేదు. ఎక్కడికి వెళ్ళాడు. ఏం చేస్తున్నాడు, అని ఆలోచిస్తున్నాడు. అక్కడ డిటెక్టివ్ ఫిక్స్ కూడా టెలిగ్రామ్ ఇంకా రాలేదు. అయినా ఈ ఫిలియాస్ ఫాగ్ ఏం చేస్తాడా అని, యొకఁలోహోమా (జపాన్ కి) ఎలా వెళ్తాడా అని అనుకుంటూ అతన్ని అనుసరిస్తూ ఉన్నాడు. అయితే ఫిలియాస్ ఫాగ్ మాత్రం ఏమాత్రం తొట్రుపాటు లేకుండా, మోహంలో ఎటువంటి హావభావాలు లేకుండా, అక్కడే ఉన్న ఒక ఓడ యజమానిని చూసి అతనిని అడిగాడు. తాను ఎక్కవలసిన కనాటికే ఓడ  నిన్ననే వెళ్ళిపోయింది. మరి నేను యొక్లహోమా కి వెళ్ళాలి, మరి నన్నుతీసుకెళ్తావా అని అడిగేసరికి ఆ ఓడ యజమాని ఒప్పుకున్నాడు. ఎందుకంటె ఫిలియాస్ ఫాగ్ ఆ ఓడ యజమానికి కొంచం ధారా ళంగానే ముట్టజెపుతున్నాడు.ఇతన్ని అనుసరిస్తున్న డిటెక్టివ్ ఫిక్స్, ఫిలియాస్ ఫాగ్ పధకాలు ఎప్పటికప్పుడు గమనిస్తున్నాడు కాబట్టి అదే చూసి చాలా ఆశ్చర్యపడ్డాడు. ఏమిటీ మనిషి. నాకు అంతు పట్టకుండా ఉన్నాడు. ఒక్క చోట కూడా ఆగకుండా యిలా చక చకా  ప్రయాణాలు ఏర్పాటు చేసుకునివెళ్ళిపోతున్నాడు. ఎలాగైనా సరే నేను కూడా ఇతనిని అనుసరిస్తూ, సమయం వచ్చినపుడు అరెస్ట్ చేయాలి అని అనికుంటూ ఉండగా, ఫిలియాస్ ఫాగ్, డిటెక్టివ్ ఫిక్స్ ని గుర్తుపట్టి, "ఏమిటీ! మీరు చాలా ఆదుర్దాగా కనిపిస్తున్నారు? ఏమిటి సంగతి" అంటే, 

 "అవునండీ నేను వెళ్ళవలసిన ఒక కనాటికా తప్పిపోయింది. యొక్లహోమా  వెళ్లాలని ఆలోచిస్తున్నాను", అన్నాడు.

"ఫరవాలేదు. మీరుకూడా మాతోపాటు రండి", అని ఫిలియాస్ ఫాగ్, ఫిక్స్ నికూడా తనతో పాటుగా తీసుకెళ్లడానికి ఒప్పుకున్నాడు. ఇలా ఆ ముగ్గురూ, ఓడ ప్రయాణం చేస్తూ యొక్లహోమా దిక్కుగా వెళ్తున్నారు.

ఇక్కడ జోన్ పాస్ పర్ట్ ఏం   చేస్తున్నాడో చూద్దాం. జోన్ పాస్ పర్ట్ కి ఆ బార్ లో కొన్ని గంటల తర్వాత మెలుకువ వచ్చింది. తలంతా దిమ్ముగా, నెప్పిగా ఉంది. ఏవిషయాలు కూడా గుర్తుకు రావటం లేదు. ఎక్కడున్నాడు? ఎలా వచ్చాడు? వంటివి అన్నీ మర్చిపోయాడు. బుర్ర అంతా గందరగోళం అయిపోయింది. కాసేపయాక జోన్ పాస్ పర్ట్ కి మెల్లి మెల్లిగా జరిగిన సంగతులన్నీ జ్ఞ్యాపకం రాసాగాయి. అతని మనసులో షిప్ అన్న విషయం రాగానే అతను కొంచం గాబరా 

 పడ్డాడు. అరెరే! నేను ఈ ఓడ కనాటికా సాయంత్రమే బయలు దేరుతుందని ఫిలియాస్ ఫాగ్ కి చెప్పాలనుకుంటూ బయటికి రాగానే, ఒక పెద్దమనిషి నన్ను పలకరించాడు. మనిద్దరం సూయజ్ లో కలుసుకున్నాం కదా. ఈజిప్ట్ Mr . ఫిక్స్ అంటారు అంటూ గుర్తుపట్టారా అని అడగడం, పాస్ పర్ట్ అవునవును మనం కలిసాం అంటూ మీ పేరు.... అంటూ తడబడగా అవును నా పేరు Mr. ఫిక్స్ అని చెప్పాడు ఆ వ్యక్తి. ఇప్పుడు నేను మా యజమానికి వెళ్లి

కనాటికా ఓడ ఈ రోజు రాత్రే బయలు దేరుతుందని చెప్పాలి. అందుకే త్వరగా వెళ్ళాలి అంటే  "ఏమిటయ్యా మీ యజమాని ఎక్కడా ఆగకుండా ఎక్కడెక్కడికో అలా అలా వెళ్ళిపోతున్నాడు. చాలా  విచిత్రమైన స్వభావం కూడా మీ యజమానిది" ? అన్నాడు. 

"నేను తొందరగా వెళ్లాలడి. ఈ కనాటిక ఓడ కి మరమ్మత్తులు వేగంగా జరిగి ఇవ్వాళ సాయంత్రానికే సిద్ధమవుతోంది. ఈ సంగతి మా యజమానికి చెప్పాలి వెంటనే నేను వెళ్ళాలి" అనడం  వెంటనే ఆ వ్యక్తి

"అలాగా! ఎలాగైనా సాయంత్రం వరకు టైముంది కదా! నాకేమీ తోచటం లేదు. ఒంటరిగా ఉన్నాను. చాలా రోజులైంది నా దేశం వదిలి అని అంటూ, మీ హోటల్ దగ్గర ఒక బార్ ఉంది. 

 అక్కడ మనిద్దరం డ్రింక్స్ తీసుకుందాం రండి "అని పిలవటం.

పాస్ పర్ట్    మొహమ్మాటంగా ఒప్పుకుని ఆ బార్ లోనికి వెళ్ళటగం, మితిమీరి తాగటం యివన్నీ మెల్లిగా పాస్ పెర్త్ కి జ్ఞ్యాపకం వచ్చాయి. హడావిడిగా లేచాడు. అయ్యో ! సమయం అయిపోతుంది. నేను వెళ్ళాలి అనుకుంటూ గబగబా ఫిలియాస్ ఫాగ్ బసచేసిన హోటల్ కి చేరాడు. అక్కడ ఎవరూ లేరు. పరుగెత్తుకుంటూ సీపోర్ట్ కి వెళ్ళాడు. అక్కడ ఓడ కానీ, ఫిలియాస్ ఫాగ్ కానీ, ఔదా కానీ ఎవరూ కనిపించలేదు. అయ్యో! ఏమైంది. ఇలా జరిగిందేమిటి

అనుకున్నాడు. క్రితంరోజే మరమ్మతులు జరిగిన ఓడ వెళ్లైపోయింది. పాస్ పర్ట్  కి ఏం చేయాలో పాలుపోలేదు. ఈలోగా ఇంకొక  ఓడ యొకఁలోహోమా కనిపించింది బయలు దేరబోతోంది. తనకి ముందే టిక్కెట్లు కొని ఉంచారు. కాబట్టి ఆ ఓడ ఎక్కి కూచున్నాడు పాస్ పర్ట్ .హాంగ్ కాంగ్ నుంచి యొక్లహోమా దిశగా వెళ్లే ఆ ఓడలో కూచుని తదుపరి ఏం చేయాలా అని

ఆలోచిస్తున్నాడు. తన ఈ పరిస్థితికి దిగులుగా చాలా బాధపడుతూ అయ్యో! ఎంత పొరపాటు చేసాను. ఆ ఫిక్స్ మూలంగా నా యజమానికి సరైన సమయానికి సమాచారం అందివ్వలేక పోయాను. మరి ఈ ఓడ కానటికా లో వారిద్దరూ ఫిలియాస్ ఫాగ్, ఔదా కనపడలేదు. ఏం చేయాలో తోచక ఒక్కడినే ఈ ఓడ ఎక్కేసాను. నా చేతిలో డబ్బులు కూడా లేవు అని పరిపరి విధాల ఆలోచిస్తూ యొక్లహోమా చేరాడు పాస్ పర్ట్ . చేరనైతే చేరాడు కానీ చేతిలో డబ్బులు లేవు. తాను వేసుకున్న యురోపెయన్ జాకెట్ వంటివి అమ్మేసి, అక్కడ చౌకరకమైన జపాన్

జాకెట్ ని కొన్నాడు. మిగిలిన డబ్బు చేతిలో పెట్టుకున్నాడు. కానీ ఆ డబ్బు కూడా సరిపోదని తెలుసు. ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఓడ దిగి ఊరంతా తిరుగుతూ అటూ ఇటూ చూసాడు. అక్కడ కొన్ని పోస్టర్లు కనిపించాయి. Mr . Bettle Cock గారి అద్భుతమైన సర్కస్ చివరిరోజు ప్రదర్శన. ఈ ప్రదర్శన తర్వాత మేము అమెరికాకి వెళ్ళిపోతున్నాము. మాకు చాలా మంది సర్కస్ లో పనిచేయడానికి కావాలి. అందులో కలౌన్స్ అంటే నవ్వించే వాళ్ళు, రకరకాల విన్యాసాలు చేసే వారు, సింహాలను ఆడించే వీసాలు అలా కావాలన్నారు. పాస్ పర్ట్ ఈ  సర్కస్ వాళ్ళు అమెరికా వెళ్తున్నారు కదా! వీళ్ళ ట్రూపులో చేరి వీళ్ళతో పాటుగా అమెరికాకి వెళ్లి, అక్కడి నుంచీ లండన్ చేరుకోవాలి అనుకుని, ఆ సర్కస్ యజమాని దగ్గరకు వెళ్ళాడు. తన సంగతంతా వివరంగా చెప్పాడు. ఓహో!  నువ్వు ఫ్రెంచ్ వాడివా. అయితే నువ్వు నా సర్కస్ లో కలౌమ్ గా వుండాలన్నమాట. ఇంకా చిన్న చిన్న పనులు కూడా చేయాలి. ఉదాహరణకి పెద్దపులులని చూసుకోవటం వంటివి కూడా చేయాలి అని చెప్పాడు ఆ సర్కస్ యజమాని. నిజానికి పాస్ పర్ట్ కి ఈ సర్కస్ యజమాని ప్రతిపాదన ఏమాత్రమూ నచ్చలేదు. కానీ గత్యంతరం  లేదు కాబట్టి అలాగే అని ఒప్పుకున్నాడు. పాస్ పర్ట్బ చాలా బలిష్టంగా ఉంటాడు కాబట్టి ఆ రోజు సర్కస్ లో హ్యూమన్ పిరమిడ్ లో బేస్ పిరమిడ్ గా నిలబడ్డాడు. అతని


బలమైన భుజస్కందాల మీద మిగిలిన మనుషులు ఎక్కారు. అలా ఒకరి తర్వాత ఒకరు

వారి స్థానాల నెంచుకుని, హ్యూమన్ పిరమిడ్ ఏర్పడింది. ప్రేక్షకులందరూ చూస్తున్నారు.

ఇక్కడ ఫిలియాస్ ఫాగ్ సంగతికొస్తే, వాళ్ళు యొక్లహోమా చేరగానే, వెనకే వచ్చిన కనాటికా ఓడ  దగ్గరకెళ్ళి, అక్కడినుంచి ఎవరెవరు ప్రయాణీకులు వచ్చారా అని విచారించగా, హాంగ్  కాంగ్ నుంచి, యొక్లహోమా కి పాస్  పర్ట్ కూడా  వచ్చినట్లుగా తెలిసింది. అయితే ఫిలియాస్ ఫాగ్ ఆలోచిస్తూ  పాస్ పర్ట్  దగ్గర డబ్బులు ఏమీ లేవు కదా! ఇక్కడకు వచ్చి ఏం  చేస్తున్నాడు అని అనుకున్నాడు. సరేనని ఔదాతో పాటుగా ఊరుచూడటానికి బయలు దేరాడు. గత్యంతరం లేక డిటెక్టివ్ ఫిక్స్ కూడా వాళ్ళ వెంటా ఉన్నాడు. యిప్పుడు ఫిక్స్ జపాన్ లో ఉన్నాడు కాబట్టి ఫిలియాస్ ఫాగ్ ని అరెస్ట్ చేసే అవకాశం లేదు. అలా తిరుగుతూ అక్కడ జరుగుతున్న అద్భుతమైన సర్కస్  ప్రదర్శన  పోస్టర్లు చూసాడు. సర్కస్ కి వెళదాం  అని ఔదాతో సహా ఆ

సర్కస్  ప్రదర్శనకు వెళ్ళటం జరిగింది. అతని మనసులో ఏదో ఒక ప్రేరణ వుంది. ఈ సర్కస్ లో   పాస్ పర్ట్  ఏమైనా  దొరుకుతాడేమో అని మనసులో అనిపించింది. ప్రేక్షకుల్లో కూర్చుని  ఫిలియాస్ ఫాగ్ సర్కస్ చూస్తున్నాడు.

హ్యూమన్ పిరమిడ్ లో కింద నిలుచున్న పాస్ పర్ట్  ప్రేక్షకుల్లో కూర్చున్న తన యజమాని ఫిలియాస్ ఫాగ్ ని చూడగానే ఒక్కసారిగా గావుకేక వేసాడు. ఒక్కసారిగా హ్యూమన్ పిరమిడ్ నుంచి బయటికి వచ్చేసరికి పాస్ పర్ట్ ని ఆధారంగా చేసుకుని అతని భుజాలపైన నిలబడిన వారందరూ ఒక్కసారిగా హాహాకారాలు చేస్తూ డాంమని కింద పడిపోయారు. ఇవేవీ గమనించకుండా పాస్ పర్ట్  ప్రేక్షకులలో కూర్చున్న తన యజమాని ఫిలియాస్ ఫాగ్ ని కలిసాడు. ఆసర్కస్ యజమానికి క్షమాపణ చెప్పే ఆలోచన కూడా లేకుండా, అక్కడినుంచి అందరూ బయటపడ్డారు.

ఈ విధంగా ఎలాగైతేనేమి, విచిత్ర పరిస్థితులలో ఫిలియాస్ ఫాగ్, ఔదాలను పాస్ పర్ట్  కలవటం జరిగింది. విధిలేని పరిస్థితులలో డిటెక్టీస్ ఫిక్స్  కూడా వీరితో పాటుగా ప్రయాణం చేయటం తప్పలేదు. జరిగిందంతా ఫిలియాస్ ఫాగ్, పాస్ పర్ట్  వాళ్ళు మాట్లాడుకున్నారు. కానీ అందులో ఫిలియాస్ఫాగ్, ఫిక్స్ గురించి చెప్పటం మర్చిపోయాడు. తాను  ఏవిధమైన పరిస్థితుల్లో యోక్లాజ్హోమా చేరాడు, ఇక్కడకు చేరాక సర్కస్ లో చేరడం, హ్యూమన్ పిరమిడ్ లో తాను  పాల్గొనడానికి కారణం. ఒక వ్యక్తి జబ్బు పడేసరికి, ఆ స్థానంలో తనను తీసుకోవటం, ఆ సర్కస్ లో ఉన్నపుడు ప్రేక్షకులలో కూర్చున్న తమరిని  నేను చూడటం, మీ దగ్గరకు ఒక్క ఉదుటున పరుగెత్తి రావటం వంటివి అలా జరిగాయి, అని చెప్పాడు పాస్ పర్ట్  ఫిలియాస్  ఫాగ్  తో.  పాస్ పర్ట్  తో నేను ఆరు రోజుల తర్వాత యొక్లహోమా చేరాక, తర్వాత కనాటిక ఓడలో నీ పేరు చూసి నువ్వు కూడా యొక్లహోమా  చేరినట్లుగా తెలిసింది. నువ్వున్న ఈ సర్కస్ కి  అనుకోకుండా రావటం, నిన్ను చూడటం జరిగింది అనుకుంటూ మాట్లాడుకోసాగారు.

26 నవంబర్:- ఈ కనాటికా ఓడలో యొక్లహోమా నుంచి పసిఫిక్ మహా సముద్రం మీదుగా శాన్ ఫ్రాన్సిస్కో ప్రయాణం చేయాలి. అందరూ బయలుదేరారు.


                                                            ***************

Sunday 14 May 2023

80 రోజుల్లో భూప్రదక్షిణ - అధ్యాయం 2

                       

                                  ఫిలియాస్ ఫాగ్ ,  జోన్ పాస్ పర్ట్

అక్టోబర్ 9 : స్కాట్లాండ్ యార్డ్ డిటెక్టివ్ ఫిక్స్ ఒక నిర్ణయానికి వచ్చేసాడు. రిఫార్మ్స్ క్లబ్ లో ఒక పెద్ద మనిషిగా చెలామణి అవుతున్నఫిలియాస్ ఫాగ్ అనే అతను బ్యాంక్ అఫ్ ఇంగ్లాండ్ నుంచి  55౦౦౦ పౌండ్స్ దొంగలించాడని నిర్ధారణకు వచ్చేసాడు డిటెక్టివ్ ఫిక్స్. అతను ఎలాగైనా సరే ఈ ఫిలియాస్ ఫాగ్ వెంటబడి, పట్టుకొని అతన్ని అరెస్ట్ చేసి 2000 పౌండ్స్ ని తీసుకోవాలనే  పథకంలో ఉన్నాడు. ఈ విషయాలన్నీ ఫిలియాస్ ఫాగ్ కి కానీ, జోన్ పాస్ పర్ట్ కి  కానీ ఏమీ తెలియవు. ప్రస్తుతం వాళ్లిద్దరూ ఇటలీ చేరుకుని, మంగోలియా అనే ఓడలో బొంబాయి కి వెళ్ళవలసింది అన్నమాట. ఎలాగైతే నేమి ఇటలీ లో మంగోలియా ఓడని వాళ్ళు ఎక్కారు. డిటెక్టివ్ ఫిక్స్ ఎలాగైతేనేమి వాళ్ళని పట్టుకోవాలని అక్కడికి చేరాడు. అలా చేరుకొని ఆ ప్రయాణికుల్ని బాగా  పరిశీలనగా చూస్తూ ఉన్నాడు. అతనికి హఠాత్తుగా సూయెజ్ దగ్గర ఫిలియాస్ ఫాగ్ మరియు జోన్ పాస్ పర్ట్  వాళ్ళని కనుగొన్నాడు. అక్కడ సూయెజ్ లో వాళ్ళని పట్టుకొని సంభాషణలు మొదలు పెట్టాడు. అభివాదాలు చేసి "ఏమిటీ మీరు యిక్కడ సూయెజ్ లో బోలెడు చూడవలసినవి చాలా ప్రదేశాలున్నాయి కదా. మరి మీరు ఇవేవీ చూడకుండా  ఇంత హడావిడిగా ఉన్నారేంటి?" అని ప్రశ్నించాడు. 

దానికి సమాధానంగా జోన్ పాస్ పర్ట్, "ఏం   లేదండి, మా యజమాని గారు ఈ 80 రోజుల్లో మొత్తం భూప్రదక్షిణ చేయాలనుకుంటున్నారు. నాకూ చూడాలని ఉంటుంది కానీ మరి నేను మా యజమానితో పాటు వెళ్ళాలి కదా, అందుకే నాకు ఈ సూయెజ్ ని చూసే అవకాశం లేదు", అని చెప్పాడు. 

 డిటెక్టివ్ ఫిక్స్ కి తన అనుమానం రూడి అయింది. ఏమీతెలియని వాడిలా, "అదేమిటీ ? మీ యజమాని గారి దగ్గర చాలా డబ్బులున్నట్టున్నాయి కదా! " 

"చాలా ధనవంతులు అయినా ఇదేమిటయ్యా ? ఇన్నిమంచి మంచి ప్రదేశాలు చూడకుండా, 80 రోజుల్లో భూప్రదక్షిణ చేస్తే ఏం వస్తుంది?  దానివల్ల ఏం లాభం? ఎందుకు మీ యజమాని అంత ఆత్రుత పడుతున్నాడు?" అని అడిగాడు.          

జోన్ పాస్ పర్ట్,   "ఏమోనండీ నాకేం తెలీదు. నేనిప్పుడు గబగబా మా యజమాని దగ్గరికి వెళ్ళాలి. ఔను ఇంతకీ మీరు..... మీరు ........ అంటూంటే 

"నేను ఫిక్స్ ని. నన్ను ఫిక్స్ " అని పిలుస్తే చాలు. 

"నా పేరు జోన్ పాస్ పర్ట్  అని తనను తాను  పరిచయం చేసుకున్నాడు. అయితే మరి నేను వెళ్ళొస్తాను" అని చెప్పి వెళుతుంటే బహుశా "నేను కూడా నీతో పాటు వస్తానని అనుకుంటాను, మళ్ళీ మనం కలుద్దామ ఆని" చెప్పాడు ఫిక్స్.

అక్టోబర్ 10. : మొత్తానికి సూయెజ్ నుంచి కూడా బొంబాయి దిశగా ప్రయాణం సాగించింది. డిటెక్టివ్ ఫిక్స్ ఆలోచిస్తూ ఉన్నాడు. తనకి టెలిగ్రామ్  వస్తే కానీ అతను ఫిలియాస్ ఫాగ్ ని అరెస్ట్ చేయడానికి కుదరనే కుదరదు.  ఏమిటబ్బా, ఇతనితో పాటు నేను కూడా వెళ్ళవలసి వస్తుంది. టెలిగ్రామ్ ఇంకా రాలేదు  అని  అతను పరి పరి విదాలు ఆలోచిస్తూ అతను కూడా ఆ ఓడలో ప్రయాణం సాగించాడు. 

అక్టోబర్ 2౦: మంగోలియా ఓడ బొంబాయి తీరాన్ని చేరుకుంటుంది. ఈలోగా ఫిలియాస్ ఫాగ్ గారు తన చిన్న నోట్ బుక్ లో తన ప్రయాణ ప్రణాళికని రాసుకుంటున్నాడు. ఏ రోజు ఎన్ని గంటలకు ఎక్కడ తిరిగాడో, ఏ ఓడ ఎక్కాడు, ఏ విధమైన ప్రయాణం చేస్తున్నాడని , అన్నిరాసుకుంటున్నాడు.

జోన్ పాస్ పర్ట్    కూడా ఆలోచిస్తున్నాడు. మా మాస్టర్ గారు రెండు రోజుల ముందే ఉన్నారు. మా యజమానిగారు అనుకున్న దానికన్నా, కానీ ఎలాగైనా సరే ఈయన ఒప్పందం గెలవాలి లేకపోతే చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. వాతావరణం సరిగ్గా లేక పోయినా , రైలు లైన్ సరిగ్గా లేక పోయినా చాలా కష్టం కదా ! అని తన పెట్టెలో తన యజమాని పెట్టిన ఇరవై వేల పౌండ్స్ గురించి జాగ్రత్తగా చూసుకోవాలని అనుకున్నాడు. ఇవేవి  పట్టనట్టుగా ఫిలియాస్ఫాగ్ నోట్ బుక్ లో అన్ని వివరాలు రాసుకుంటూ తోటి ప్రయాణీకులతో చక్కగా పేకాట ఆడుతూ సరదాగా కాలం గడుపుతూ ఉన్నాడు. ఏమీ పట్టనట్టుగా యిలా ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండగా 20 అక్టోబర్ న  బొంబాయి కి ఈ మంగోలియా అనే ఓడ చేరింది. ఫిలియాస్ ఫాగ్ , జోన్ పాస్ పర్ట్ ఇద్దరూ కూడా బొంబాయి స్టేషన్ కి వెళ్లారు. అనుకున్న ప్రకారమే ఆ రైలు సిద్ధంగా ఉంది. ఆ రైలు ఎక్కారు. వారు అలా ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. అంతా బాగుంది అని  అనుకున్నప్పుడు కొంత దూరం వెళ్ళాక ఆ ఇంజిన్ డ్రైవర్, రైలు ఆపి ప్రయాణీకులను ఉద్దేశించి, "ఈ ప్రయాణం ఇంకా ముందుకి సాగదు. ముందు మరమ్మత్తులు సాగుతున్నాయి. రైల్వే ట్రాక్ ఇంకా పూర్తిగా వేయలేదు.ముందు స్టేషన్ కి మీరు  వెళ్లాలంటే యిక్కడే దిగి మీ ప్రయాణాలు మీరు చేసుకోవాలి", అని చెప్పాడు. 

దాంతో జోన్ పాస్ పర్ట్ కి చాలా దిగులు వేసింది"అయ్యో! భగవంతుడా !" ఏమిటి ఇలా జరుగుతోంది! అని అనుకున్నాడు. అయితే ప్రయాణీకులంతా ఎవరి ప్రయాణ సన్నాహాలు వాళ్ళు చేసుకుంటున్నారు. వీళ్ళు అక్కడినుంచి కలకత్తా మీదుగా అలాహాబాదు వెళ్లాలన్నమాట. అర్ధాంతరంగా రైలు ఆగింది. నింపాదిగా ఉన్నాడు ఫిలియాస్ ఫాగ్. డిటెక్టివ్ ఫిక్స్ కూడా ఆలోచిస్తున్నాడు. మిగిలిన ప్రయాణీకులని గమనిస్తూ ఉన్నాడు. కొంతమంది ఎడ్లబండిలో వెళ్తున్నారు. కొంతమంది రిక్షాలో వెళ్లిపోతున్నారు.  అక్కడే ఏనుగు నడిపే వాడు ఉన్నాడు.  ఫిలియాస్ ఫాగ్ అతని దగ్గరికి వెళ్లి బేరం మొదలు పెట్టాడు. అలాహాబాద్ వెళ్ళాలి మేము. నువ్వు చూస్తున్నావు కదా ఈ ఏనుగుని నేను కొంటాను. నీకు కావలసిన డబ్బు ఇస్తాను. నువ్వే మమ్మల్ని అలాహాబాద్ చేర్చాలి, అని బేరం పెట్టాడు. ఆ మావటి వాడు తాను అనుకున్నదాని కన్నా ఫిలియాస్ ఫాగ్ ఎక్కువ ధనం ఇస్తానని అనగానే, ఆ ఏనుగుని అమ్మేశాడు. కానీ మరి తాను మావటి వాడుగా వుండి  అలాహాబాద్ వస్తాను అని అన్నాడు. ఇలా జరుగుతూ కొంతదూరం ప్రయాణం చేసే సరికి, పెద్ద అడవిలోకి ప్రవేశించారు. సింహాల అరుపులు వినిపిస్తున్నాయి. చీకటిగా ఉంది. ఆ అందమైన ఏనుగు పేరు పూని. మావటివాఁడు దానికి కొంత విశ్రాంతి యివ్వాలని ఒక చెట్టు కింద ఆపారు. ఆ చీకట్లో వాళ్ళు అలాగే ఉండిపోయారు. అలా ఎవరి ఆలోచనల్లో  వారు ఉండగా పెద్ద కోలాహలం, అరుపులు, కేకలు, డప్పులు, వాయిద్యాలు, మోతలుఅన్నీ వినిపిస్తున్నాయి. 

వీళ్ళందరూ ఆశ్చర్య పడ్డారు ఏమిటా హడావిడి అని. అదేమిటో నేను కనుక్కుని వస్తానని, మీరిక్కడ ఉండండని మావటి వాడు దగ్గరలో ఆ కోలాహలం కనిపిస్తున్న ఆ ఊరి వైపుగా వెళ్ళాడు. అక్కడంతా జనాలు ఉన్నారు. దూరంగా కాగడాల వెలుతురు. ఆ వెలుగులో కొన్ని దృశ్యాలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. అందరూ హుషారుగా, పిచ్చి పెట్టినట్లుగా గంతులు వేస్తున్నారు. మామూలు పరిస్థితిలో వున్నట్టుగా నాకు కనిపించటంలేదు. ఈ లోగా మావటివాఁడు వచ్చాడు. "అయ్యా! ఈ వూళ్ళో ముసలి రాజుగారు చనిపోయారు. ఆయనని దహనం చేయాలి". 

"అయితే మరి అంత హడావిడి ఏమిటి? ఆ జనం అంతా బాగా తాగినట్లుగా నృత్యాలు చేస్తున్నారు, అరుపులు, కేకలు ఏమిటి? అంటే..... 

"ఏమీలేదు.... భార్యను కూడా దహనం చేస్తారు. ఈ ముసలి రాజుగారి భార్య చాలా చిన్నది. బొంబాయిలో ఒక ధనవంతుడైన వర్తకుడి కుటుంబంలో పుట్టింది; పాశ్చాత్య  విద్యలన్నీ నేర్చుకుంది. ఆంగ్ల భాష అనర్గళంగా మాట్లాడగలదు . యూరోపియన్ పద్ధతులన్నీ తెలుసు. తండ్రి పోయిన తర్వాత అనుకోని పరిస్థితుల్లో  ఈ ముసలి రాజుగారితో వివాహం అయి, యువరాణి అయింది. పెళ్ళైన మూడు నెలలకే ఆ ముసలి రాజు గారు  చనిపోయారుట. ఆయన చితి మీద దహనం చేయడానికి యువరాణిని కూడా తీసుకొచ్చారు. అందుకే అక్కడ, అరుపులు, కేకల తో, తాగి నృత్యాలు చేస్తున్నారు" అంటూ మావటివాఁడు విషయం చెప్పేసరికి ఫిలియాస్ ఫాగ్ కి చాలా కోపం వచ్చింది. "ఇదేమిటి? ఈ వింతఆచారం ఏమిటి? అమానుషం. మానవులు బతికున్న ఆ అమ్మాయ్హిని సజీవంగా దహనం చేయడం ఏమిటి? ఎలాగైనా సరే ఆ అమ్మాయిని రక్షించే తీరుతాను" అనిచెప్పాడు. దానికి సమాధానంగా ఆ మావటివాఁడు, " బాబూ! అక్కడికి వెళ్లారంటే, మీమాట విన్నారంటే వాళ్ళందరూ కలిసి మిమ్మల్ని చంపేస్తారు. ఇది ఎప్పడినించో వస్తున్న ఆచారం. మీరు చెప్పినట్లు ఎవరూ వినరు, జాగ్రత్త " అన్నాడు

"నేను మిమ్మల్నెవరినీ రమ్మనటం లేదు. నేనొక్కడినే వెళ్లి ఆమెని రక్షిస్తాను అని ఫిలియాస్ ఫాగ్ చెప్పాడు. దానికి సమాధానంగా

జోన్ పాస్ పర్ట్ " అయ్యా! నేను కూడా మీతో పాటు మీకు సహాయంగా వస్తాను" అని చెప్పటం జరిగింది. 

ఆ యువరాణి గారి పేరు ఔదా! జోన్ పాస్పర్ట్,  ఫిలియాస్ ఫాగ్ ఈ ఇద్దరూ కూడా ఆ యువరాణి ని ఎలా రక్షించాలి అని ఆలోచిస్తున్నారు. జనం అంతా విపరీతంగా ఉన్నారు. తెల్లవారేసరికి ఈ సతీ సహగమనం చేసేయాలి. జనం అంతా చాలా విపరీతంగా ప్రవర్తిస్తున్నారు. యిప్పుడు కనక వెళ్తే  ప్రమాదం అని గమనించారు.  ఫిలియాస్ ఫాగ్ చాలా సేపు చూసాడు. అతనిలో ఒక్కసారిగా ఆవేశం వచ్చేసింది. వెంటనే అతను ఆ జనం మధ్యలోకి ఉరికాడు. ఈలోగా జనం అంతా ఆశ్చర్యపోతూ అరుపులు, కేకలూ మొదలు పెట్టారు. ఎదురుగా ఉన్న దృశ్యం చూసేసరికి ప్రజలకీ, ఫిలియాస్ ఫాగ్ కి, ఈ యిద్దరికీ చాలా ఆశ్చర్యం వేసింది. అక్కడ చనిపోయారన్న ఆ ముసలి రాజావారు నిజానికి చని పోలేదు. అతడు అమాంతంగా చితినుండి లేచి, ముందే కట్టలు విప్పుకున్నాడు కాబోలు, ఔదా ని చేతితో పట్టుకుని జనానికి దూరంగా అక్కడి నుంచి వేగంగా పరుగెత్తి పారి పోసాగారు. కాసేపటికి ఫిలియాస్ ఫాగ్ కి అర్ధమైంది, ఆశ్చర్యం వేసింది.  ఆ పరుగెత్తి వెళ్ళిపోతున్నవాడు జోన్ పాస్ పర్ట్ అని . లోగడ యితడు ఎన్నో రకాల ఉద్యోగాలు చేశాడు కదా? అన్నింట్లో అనుభవం ఉంది. అన్ని వృత్తుల్లో ఉన్నాడు. అని గమనించి తాను కూడా బయలుదేరి ఆ ఫూని, ఆ ఏనుగు పేరు ఫూని అని చెప్పున్నాము కదా! అక్కడికి బయల్దేరారు. ఆ చీకట్లో అందరూ, తమ ప్రయాణాన్ని సాగించి, తెల్లవారు ఝామున అలాహాబాద్ కి చేరారు. అలాహాబాద్ నించి వారు కలకత్తా కి వెళ్ళాలి. ఫిలియాస్ ఫాగ్ చాలా సంతోషించి ఆ మావటి వాడితో, " ఈ ఏనుగుని నీకు బహుమతిగా యిచ్చేస్తున్నాను. నువ్వు నాకు డబ్బులేమీ ఇవ్వక్కర్లేదు". అని చెప్పాడు.

 ఆ మావటివాఁడు పదే పదే కృతజ్ఞతలు చెప్తూ చాలా చాలా సంతోషించాడు.  మళ్ళీ ఆ ఏనుగుకి  యజమాని అయ్యాడు కదా! హాయిగా ఆ ఏనుగు మీద తిరిగి వెనక్కి వెళ్ళి పోయాడు. 

ఔదా రాణికి అప్పుడప్పుడే తెలివి వచ్చింది. హౌరాకి వెళ్ళవలసిన రైలు సమయానికి వచ్చింది. రైల్లోకి ఎక్కాక జరిగిన సంగతంతా ఫిలియాస్ ఫాగ్, మరియు, జోన్ పాస్ పర్ట్ లు వివరించగా ఔదా రాణి గారికి చాలా ఆశ్చర్యం వేసింది. ఎంతో కృతజ్ఞతా భావం గుబాళించింది. అదేమిటి, ముక్కూ మొహం ఎలియని ఈ పరదేశీయులు ప్రాణాలకు తెగించి నన్ను ఈ విధంగా రక్షించారు... అని కృతజ్ఞతా భావం కలిగి ఉంది. ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ తెల్లవారు ఝాము అయ్యేసరికి హౌరాలో దిగారు. కలకత్తా నుంచీ వాళ్ళు హాంగ్ కాంగ్  వెళ్లే ఓడను పట్టుకోవాలన్నమాట. అదృష్టం కొద్దీ వీళ్ళు వెళ్లే సరికి ఆ ఓడ  మధ్యాన్నం 12 గంటలకు బయలు దేరుతుందని చెప్పారు. వీళ్ళకి సమయం చాలా ఉందన్న మాట. 

  


మరి ఈ సమాచారం డిటెక్టివ్ ఫిక్స్ కి ఎలా తెగెలిసిందో తెలియదు కానీ అతను కూడా వీళ్ళతో పాటు ఇదే ఓడ ఎక్కి హాంగ్  కాంగ్ కి బయలు దేరాడు. హాంగ్ కాంగ్ కి బయలు దేరిన ఓడ కొంత సమయం సింగపూర్ లో ఆగింది. డిటెక్టివ్ ఫిక్స్ ఒకటే మదన పడ సాగాడు. ఏమిటీ టెలిగ్రామ్ ఇంకా  రానే రాలేదు. మరి టెలిగ్రామ్ వస్తే కానీ నేనేమీ చేయలేను. హాంగ్ కాంగ్ కూడా ప్రస్తుతం బ్రిటిష్ వారి ఆధీనంలోనే ఉంది కదా!. బహుశా నేను హాంగ్గ్ కాంగ్ వెళ్లేసరికి టెలిగ్రామ్ వచ్చే ఉంటుంది. ఎలాగైనా సరే నేను ఫిలియాస్ ఫాగ్ ని అరెస్ట్ చేయిస్తాను అనే తన పధకాలు తాను వేసుకుంటూనే ఉన్నాడు. అయితే స్ ఫాగ్ ని అరెస్ట్ చేయిస్తాను అనే తన పధకాలు తాను వేసుకుంటూనే ఉన్నాడు. అయితే హాంగ్ కాంగ్ నించే వాళ్ళు జపాన్  వెళ్ళవలసిన ఓడ ఎక్కాల్సింది. కానీ దురదృష్ట వశాత్తు వాతావరణ పరిస్థితులు సరిగా లేనందు వలన వీళ్ళెక్కిన ఓడ ఒక రోజు ఆలస్యంగా హాంగ్కాంగ్ కి చేరింది. అప్పుడు జోన్ పాస్ పర్ట్ చాలా నిరుత్సాహపడ్డాడు.

"అయ్యో! నా యజమాని పందెం ఓడిపోతాడేమో! ఇప్పుడెలా? ఒకరోజు మనకి పోయింది". అంటే ఫిలియాస్ ఫాగ్ ఎటువంటి త్రొట్రుపాటు లేకుండా, ఆ పార్టీలోనే ఒక చోట వున్న  యజమాని దగ్గరకెళ్ళి ,యోక్లోహోమాకి వెళ్లే ఓడ ఎప్పుడు బయలు దేరుతుంది?" అని అడిగాడు. "

"రేపు పొద్దున్నే బయలు దేరుతుంది. ఎందుకంటె ఈ ఓడలో కొన్ని మరమత్తులు జరగాల్సి ఉన్నాయి  ఆ మరమ్మత్తులన్నీ  చేసే సరికి ఆలస్యమవుతుంది. అవన్నీ అయ్యాక బయలు దేరుతాము,"అని చెప్పాడు ఆ బోటు యజమాని. అంటే వీళ్ళు ఈ ఓడ ఎక్కి యొకఁలోహోమా అంటే జపాను చేరి అక్కడ హాంగ్  కాంగ్ తప్పిపోయిన ఓడ ఎక్కి పై (ముందు) ప్రయాణం చేసుకోవాలన్న మాట. ఆ పడవ యజమాని అలా చెప్పేసరికి జోన్ పాస్ పర్ట్  ఎందుకో సంతోషించాడు. ఆ పడవ యజమానికి ధన్యవాదాలు చెప్పాడు. ఫిలియాస్ ఫాగ్ కొంచెం ఆశ్చర్యపడ్డా బయటికి ఏమీ మాట్లాడలేదు. ఈ విధంగా వారంతా వెనక్కి వెళ్లిపోయారు. అంటే 6 నవంబర్ న వాళ్ళు చేరి ఆ ఓడని ఎక్కవలసిందే . కానీ వాతావరణం ప్రతికూలంగా ఉండటం వలన వాళ్ళు 7 నవంబర్ కి చేరేసరికి ఆ ఓడ వాళ్ళని వదిలేసి హాంగ్ కాంగ్ కి వెళ్ళిపోయింది. అందుకే ఫిలియాస్ ఫాగ్ యింకొక ఓడని ఎక్కి హాంగ్ కాంగ్ కి వెళ్లి అక్కడ ఆ పెద్ద ఓడని ఎక్కాలని ప్రయత్నం అన్నమాట. ఈ వివరాలన్నీ ఫిలియాస్ ఫాగ్ తన నోట్ బుక్ డైరీ లో ఎప్పటికప్పుడు రాసుకుంటూ వున్నారు.






Nanduri Vamsha Charitra -audio -1 

nanduri Vamsha charitra - audio - ankitam


 

Nanduri Vamsha Charitra audio - Ankitam

Saturday 13 May 2023

80 రోజుల్లో భూప్రదక్షిణ - అధ్యాయం 1

                                   



ముందుగా ఈ కథలోని ముఖ్య పాత్రలగురించి మాట్లాడుకుందాం. ఈయన పేరు ఫిలియాస్ ఫాగ్. ఈయన బ్రిటిష్ పౌరుడు. 7 Savel రోడ్ సెంట్రల్ లండన్ లో ఉంటాడు. చాలా అందంగా ఉంటాడు. మనిషి చాలా క్రమ శిక్షణతో చాలా ఖచ్చితంగా ఉంటాడు. అందరికీ కూడా ఫిలియాస్ ఫాగ్ అంటే ఎంతో గౌరవం. ఇతనుచాలా ధనవంతుడు. కానీ ఈ ధనం ఎంత సంపాదించాడో, ఎలా సంపాదించాడో అన్నది ఎవరికీ తెలియదు. ఇతనికి నా అన్న వారు ఎవరూ లేరు. స్నేహితులు గానీ బంధువులు గానీ ఎవరూ లేరు. ఖరీదైన సెంట్రల్ లండన్ లో ఈయన నివసిస్తూ ఉంటారు. ప్రతీ రోజూ ఈయన తప్పనిసరిగా రిఫార్మ్స్ క్లబ్ కి వెళతారు. ఈక్లబ్ లోనే అన్నీ న్యూస్ పేపర్లు చదువుతూంటాడు .అలాగే పేకాట కూడా ఆడుతూ ఉంటాడు. ప్రపంచంలో ఏ ప్రదేశా న్నైనా సరే, అక్కడిఅద్భుతాలన్నీ ఈయన ఎంతో చక్కగా వివరిస్తూ ఉంటాడు. అయితే, అతనికి అందరూ తెలిసిన వాళ్ళు కూడా ఏదో ఒకప్పుడు, ఈయన ఆ ప్రాంతానికి తప్పకవెళ్లి ఉంటారు, ఖచ్చితమైన వివరాలు ఇస్తున్నారు కదా అని అంటారు. యింకాబాగా తెలిసిన వాళ్ళు, అదేంటి మేము ఎన్నో ఏళ్ళనుంచి ఈయనని ఎరుగుదుము. ఈయన ఎప్పుడూ ఇంగ్లండును వదిలి వెళ్లనే లేదు, అని, వాదిస్తూ ఉండేవాళ్ళు.బహుశా, ఈయన తన మెదడులోనే ఇన్ని ప్రదేశాలకి ప్రత్యక్షంగా వెళ్లిఉంటారేమో అని ఇంకొకళ్ళు అనుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఫిలియాస్ ఫాగ్గురించి అందరూ రకరకాలుగా చెబుతూ ఉంటారు. కానీ అతను చాలా వ్యక్తిగతంగానే ఉంటాడు. అంటే, ఒంటరిగానే ఉంటాడు. స్నేహితులంటూ, బంధువులంటూ ఎవరూ లేరు. ఇంట్లో ఒక పనిమనిషి మాత్రమే ఉంటాడు. అన్నీ పనులూ ఈ పనివాడు చేస్తూఉంటాడు. గడియారంలో ముల్లు ఎంత క్రమ బద్ధంగా , ఒక్క సెకండ్ కూడా అటూ ఇటూ కాకుండా తిరుగుతూ ఉంటాయో, ఈ ఫిలియాస్ ఫాగ్ కూడా  అంత క్రమ శిక్షణ కలిగి ఉంటాడు. ప్రతీ రోజూ ఏ సమయంలో ఏ పనిచేస్తారో అదే సమయంలో అదే పని ఒక్క సెకండ్ అటూ ఇటూ తేడా లేకుండా అలాగే తూచా తప్పకుండా అదే విధంగా ఈ ఫిలియాస్ ఫాగ్ ఆచరిస్తూ, ప్రవర్తిస్తూ దినచర్య ని ఖచ్చితoగా పాటిస్తూ ఉంటాడు. ఇది ఈయన  గురించి చాలా మంది చేసి నటువంటి విశ్లేషణ. అయితే, ఒకరోజు పనిమనిషిని పనిలో నించి తొలగించడం జరిగింది. ఎందుకంటె షేవింగ్ చేసుకునే నీళ్లు, మామూలు వేడి కంటే ఎక్కువగా ఉన్నాయనే విషయంలో, ఆ పనివాడు తప్పు చేసాడని, అతనిని ఉద్యోగంలోంచి ఫిలియాస్ ఫాగ్  తొలగించాడు. మరి ప్రస్తుతం ఆయనకు రాబోయే కొత్త పనివాడి కోసం,పేరు సర్వెంట్ జోన్ పాస్పర్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రొద్దున్న పదకొండు, పదకొండున్నర మధ్యలో ఈయన ఆపాయిట్మెంట్యి వ్వడం జరిగింది. మాటిమాటికీ గడియారం చూసుకుంటూ ఉన్నాడు ఫిలియాస్ ఫాగ్. ఎందుకంటె ఖచ్చితంగా పదకొండు గంటల ముప్పై  నిముషాలకి ఆయన ఇంట్లోంచి బయలుదేరి, రిఫార్మ్స్ క్లబ్ కి వెళ్తాడు. ఈలోగా, అప్పుడే ఎవరో వచ్చినట్టుగా తలుపు తట్టుతున్న చప్పుడు వినిపించింది. ఎవరబ్బా అని బహుశా సర్వెంట్ జోన్ పాస్పర్ట్  అయి ఉంటాడని తలుపు తెరవగానే ఎదురుగా ముప్పై ఏళ్ళ ఆకర్షణీయంగా ఉన్న యువకుడు ఫిలియాస్ ఫాగ్ కి అభివాదం చేసాడు. నా పేరు జోన్ పాస్పర్ట్ అని అతను పరిచయం చేసుకునే  లోగానే, ఫిలియాస్ ఫాగ్ గారు మరి జాన్ అంటే బ్రిటిష్ వారి పేరు కదా? మరి నీవు ఫ్రెంచ్ వాడివి అంటున్నావు, మరి ఏమిటి విశేషం అంటే, నా పేరు జోన్ పాస్పర్ట్ . జాన్ కాదండీ. నేను ఫ్రెంచ్ వాడినే, అన్నాడు. కొన్నాళ్ళు నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ప్రొఫెషనల్  ఇ న్స్ట్రక్టర్ గా పనిచేసాను. కొన్నాళ్ళు సంగీత అభ్యాసం చేసాను. పాటలు పాడే వాడిని. కొన్నాళ్ళు పారిస్ లో ఫైర్ బ్రిగేడ్ లో ఇన్స్పెక్టర్ గా పనిచేసాను. కొన్నాళ్ళు సర్కస్ లో కూడా గుర్రపు స్వారీ చేస్తుండే వాడిని. కానీ, పనివాడిగా నా జీవితంలో నేనెప్పుడూ పని చేయలేదు. మీ గురించి నా మిత్రుడు ఎంతో గొప్పగా చెప్పాడు. మొత్తం లండన్ లో మీ అంత పెద్దమనిషి ఉండరని, క్రమశిక్షణకు మారుపేరని, నిక్కచ్చిగా ఉంటారని, ఇలా మీ గురించి ఎన్నో విషయాలు, నాకు ఆయన చెప్పారు. నేను ఇప్పటివరకు స్థిరం లేకుండా అక్కడా ఇక్కడా ఉద్యోగాలు చేసాను. మీ సంగతి విన్నాక ఇక్కడ మీ దగ్గర ప్రశాంతంగా పనివాడుగా చేరదామని అనుకున్నాను. కానీ నేను పనివాడుగా ఇంతవరకూ పని చేయలేదండీ. నాకు మాత్రం ఆ అనుభవం లేదు, అని గబగబా తనకి తెలిసిన విషయాలు చెప్పేసాడు. ఓహో, అలాగా,  రిఫార్మ్స్ క్లబ్ లో నామిత్రుడు నీ గురించి చెప్పాడు. నువ్వు ఫ్రెంచ్ దేశస్తుడని చాలా మర్యాదస్తుడవనీ, నాకే సరిగా సరిపోయే మనిషి అని, నాకు చెప్పడం జరిగింది, అని ఫిలియాస్ ఫాగ్ సమాధానమిచ్చాడు. ఫిలియాస్ ఫాగ్ కి ఎలాంటి పనివాడు కావాలో అని చెప్పబోయే సరికి, సర్వెంట్ జోన్ పాస్పర్ట్ నాకు అంతా అర్ధమయింది, అని చెప్పాడు. సరే యిప్పుడు టైం ఎంతైంది? అని అడగ్గా, జోన్ పాస్పర్ట్ తన జేబులోంచి  చిన్న గడియారాన్ని తీసి పదకొండు గంటల ఇరవై రెండు నిముషాలు అయిందని చెప్పాడు. నాలుగు నిముషాలు లేటుగా ఉంది. సరే నువ్వు పదకొండు గంటల ఇరవై ఆరు నిముషాల నుంచి ఈ ఉద్యోగంలో చేరినట్టుగా లెక్క. సరే. నేను వెళతాను, అని చెప్పి సరిగ్గా పదకొండు గంటల ముప్పై నిముషాలకి, నెత్తిమీద టోపీ పెట్టుకొని ఆయన ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు.చాలా క్లుప్తంగా జరిగాయి పరిచయాలు. 

జోన్ పాస్పర్ట్ మనసులో ఆయన గురించి ఈ విధంగా అనుకున్నాడు. ఈ మనిషి, ఒడ్డూ పొడుగూ చాలా అందంగా ఉన్నాడు. కళ్ళు చాలా ప్రశాంతంగా ఉన్నాయి. చాలా గౌరవంగా ఉన్నాడు. చాలా కలుపటంగా జరిగింది ఆయనతో మాట్లాడటం. ఈయన చాలా తక్కువగా మాట్లాడుతున్నాడు. ఈయన హావభావాలు తెలుసుకోవాలంటే చాలా కష్టం. బహుశా బ్రిటిష్ వారంతా ఇలాగే ఉంటారు కాబోలు. అతను ఏమి ఆలోచిస్తాడో మనకి ఏమీ తెలియదు కానీ, బయట మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఇతను నాకు తగిన యజమాని అని అనుకున్నాడు. ఇక్కడైనా నేను హాయిగా ప్రశాంతంగా ఉంటాను, నమ్మకస్తుడిగా ఉంటాను, అని జోన్ పాస్పర్ట్ అనుకుంటాడు.

ఇక జోన్ పాస్పర్ట్ గురించి మాట్లాడుకుందాం. జోన్ పాస్పర్ట్ ముప్పైఏళ్ళవాడు. ఆకర్షణీయమైన మొహాన్ని కలిగి ఉన్నాడు. చాలా బలిష్టంగా ఉన్నాడు. నీలి జుట్టు మాత్రం కొంచం చిందర వందరగా ఉంటుంది. జోన్ పాస్పర్ట్  ముందుగా ఆ యింటినంతా ఒక్కొక్క గదిలోకి వెళ్లి పరీక్షించాడు. అంతా చాలా శుభ్రంగా అమర్చినట్లుగా ఉంది. అంతా అయినాక తన గదిలోకి వచ్చాడు. తన గది కూడా చాలా శుభ్రంగా ఉంది. అక్కడ ఓకే పెద్ద గడియారం ఉంది. ఈ గడియారం కి సెకండ్ల ముల్లు చాలా పెద్దగా ఉంది. ఈ రెండు గడియారాలు ఖచ్చితమైన సమయాన్నే సూచిస్తూ ఉన్నాయి. మేడ మీద ఒక కాగితం అంటించబడి ఉంది. దానిపై జోన్ పాస్పర్ట్ దిన చర్య అంతా రాయడం జరిగింది. దానిని చూసుకుంటూ తన పిన్నిని తాను నిర్వహిస్తూ ఉండాలి. అంటే ఫిలియాస్ ఫాగ్ గారు ఎన్నింటికి లేస్తారు. నీళ్ల ఉష్ణోగ్రత ఎంత ఉండాలి. ఎన్నింటికి బ్రేక్ ఫాస్ట్ చేజేస్తారు. ఎన్నింటికి ఇంట్లోంచి బయిటికి వెళతారు. మళ్ళీ ఎన్నింటికి వస్తారు. యివన్నీ కూడా వివరంగా అక్కడ రాసి ఉన్నాయి. జోన్ జోన్ పాస్పర్ట్ కి చాలాసంతోషం వేసింది. ఈ మనిషి గడియారంలాగా ఖచ్చితంగా బాగా పని చేస్తూ ఉంటాడు. కాబట్టీ నేను అసలు సిసలైన యజమాని దగ్గరికే వచ్చాను,  అని అతను ఎంతో సంతోషపడ్డాడు.

ఫిలియాస్ ఫాగ్ గారు చాలా ఖచ్చితంగా ఉంటాడని మనం చెప్పు కున్నాం కదా. అంటే సరిగా పదకొండు గంటల ముప్పై నిముషాలకి ఆయన రిఫార్మ్స్ క్లబ్ కి వెళ్తాడు. ముందుగా ఎడమ పాదం పెడ్తారు. అది 575 సార్లు అయ్యేసరికి ఆయన రిఫార్మ్స్ క్లబ్ కి వెళతారు. ఆ తరువాత 575 సార్లు    తర్వాత కుడి పాదం పెట్టె సరికి, రిఫార్మ్స్ క్లబ్ ఎంట్రన్స్ గేట్ దగ్గర ఆయన చేరుతారు. అక్కడ ఆయన పదమూడు నిముషాలు తక్కువగా ఒంటి గంటకు అక్కడే మధ్యాహ్నం భోజనం అదే టేబుల్ మీద కుర్చీలో కూర్చుని  చేస్తారు. ఆ తర్వాత అక్కడే ఉన్న లైబ్రరీ లో పుస్తకాలు, మాగజైన్లు చదువుతూ ఉంటారు. సరిగా ఐదు గంటలకి ఆయన టీ సేవిస్తారు. ఆ తరువాత పది నిముషాల తక్కువ ఆరు గంటలకి రిఫార్మ్స్ క్లబ్ లో పేకాట ఆడే గదిలోకి ప్రతీ నిత్యం తాను కూర్చునే టేబుల్ కుర్చీ దగ్గర ఆయన కూర్చుంటారు. పేకాట ఆడినపుడు వచ్చే డబ్బుని, విరాళంగా పంచి ఇచ్చేస్తాడు.

ఫిలియాస్ ఫాగ్ గారితో విచిత్రమైనటువంటి పందెం :

ఆరోజు అక్టోబర్ 2, 1872 వ సంవత్సరం. ఫిలియాస్ ఫాగ్ పేకాట ఆడడానికి కూర్చునే సమయానికి  లండన్ లో చాలా మంది పెద్ద మనుషులు, ధనవంతులు వాళ్లంతా కూడా వచ్చి అక్కడే పేకాట ఆడుతూ ఉంటారు. ఆండ్రూస్ స్టువర్ట్, మరొక ధనవంతుడు సర్ రాల్ఫ్ గౌటీర్ (Sir Ralph Gautier) వీళ్లంతా ఖచ్చితమైన సమయానికి ఆడుకుంటూ ఉంటారు. ఆ రోజూ ఒక విచిత్రమైనటువంటి సంచలనాత్మకమైన వార్తా న్యూస్ పేపర్ లో వచ్చింది. ఆండ్రూ స్టువర్ట్ గట్టిగా చదువుతున్నాడు. సరిగా సెప్టెంబర్ 29 తేదీన బ్యాంక్ అఫ్ ఇంగ్లాండ్ లో 55,౦౦౦ పౌండ్స్ దొంగతనం జరిగిందనీ, ఆ దొంగతనం చేసినవాడు పెద్ద మనిషిలాగా కనిపిస్తున్నాడని, ఆయన అలా చదువుకుంటూ వెళుతున్నారు. మిగితా సభ్యులందరూ కూడా పేకాట ఆడటానికి సిద్ధమవుతుండగా ఆండ్రూ స్టీవర్ట్ ఇంకా చదువుతూనే ఉన్నాడు. ఆ దొంగతనం చేసిన వ్యక్తిని ఎవరైనా పట్టుకుంటేవారికి 2,000 పౌండ్స్ బహుమానంగా ఇస్తామని బ్యాంక్ అఫ్ ఇంగ్లాండ్  వారు  పత్రికా ముఖంగా తెలియజేసారు. ఇంగ్లాండ్ లోని ప్రఖ్యాతమైన డిటెక్టివ్ లు అందరూ కూడా ఎలాగైనా సరే ఈ దొంగని పట్టుకోవాలని, ఆ రెండువేల పౌండ్స్ బహుమతిని తీసుకోవాలని వాళ్ళ ప్రయత్నాలు మొదలు పెట్టారు.ఈ దొంగతనం చేసిన వ్యక్తి చాలా దర్జాగా, ఠీవిగా చాలా పెద్ద మనిషిలా ఉంటాడు, అని ఒక చిన్నపాటి వర్ణన కూడా చేశారు. 

ఆండ్రూస్ స్టీవర్ట్ చదువుతూ అంత పెద్ద విశాల ప్రపంచంలో వాడు ఎక్కడ దాక్కుంటాడో, దొంగని ఎలా పెట్టుకుంటారో, ఏమిటో అని అన్నాడు. 

"అసలు ప్రపంచం అంత పెద్దది కాదండీ" అని ఫిలియాస్ ఫాగ్ జవాబిచ్చాడు. 

"ఏమిటి ? ప్రపంచం అంత పెద్దదిగా లేదా. ఏం మాట్లాడుతున్నారండీ ఫిలియాస్ ఫాగ్

గారు"?  అనగా 

"లేదండీ ప్రపంచం నిజానికి అంత పెద్దగా లేదు. అది చాలా చిన్నగానే ఉందని" చాలా ధీమాగా ఫిలియాస్ ఫాగ్ గారు జవాబిచ్చారు. 

దానికి సమాధానంగా సర్ రాల్ఫ్ గౌటీస్ (Sir Ralph Gautier) "ఒకప్పుడు బి హోమి చాలా విశాలంగా ఉండేది. కానీ ప్రస్తుతం అది చిన్నగా అయింది. అని మీరు చెపుతున్నంతచిన్నగా  కాలేదండీ". ఈ విధంగా పరస్పరంగా అనుకున్నారు. 

ఫిలియాస్ ఫాగ్ మా  త్రం "ఏం లేదండీ. ప్రపంచం చిన్నదై పోయింది. నిజం చెప్పాలంటే మనం 8౦ రోజుల్లో భూమినంతా ప్రదక్షిణ చేయవచ్చు", అని ధీమాగా చెప్పాడు.

ఈ ఇద్దరి సంభాషణ మిగితా సభ్యులందరూ కూడా చాలా ఆసక్తిగా, శ్రద్ధగా వింటున్నారు. అదేమిటి, 80 రోజుల్లో మొత్తం భూప్రదక్షిణ ఎలాచేస్తాము. మధ్యలో అవాంతరాలు రావచ్చు. ప్రకృతి వైపరీత్యాలు రావచ్చు. ఓడలు మర్మత్తుకి గురికావచ్చు. ఇన్ని ఉన్నాయి కదా. అలాగని గట్టిగా ఎలా చెప్పగలుగుతారంటే, ఈ అవాoతారాలన్నీ దృష్టిలో పెట్టుకొనే మనం ౮౦ రోజుల్లో మొత్తం భూప్రదక్షిణ చేయొచ్చు, అని ఫిలియాస్ ఫాగ్ గట్టిగా చెప్పాడు. దానికి గౌటీర్ (Gautier) వారు గట్టిగా నవ్వారు. అది చాలా కష్టం. 80 రోజులలో భూప్రదక్షిణ మాత్రం జరగదు అని అన్నారు. జరుగుతుంది అని అన్నారు ఫిలియాస్ ఫాగ్.

యిద్దరు పట్టుదలగా మాట్లాడుతుంటే, పంతాలు పట్టింపులు పెరుగుతున్నాయి. సభ్యులందరు ఆతృతగా ఏం జరుగుతుందో అని చూస్తూ వింటున్నారు. అయితే, ఆ పని నీవు చేయగలవా? అని గౌటీర్ వారు సవాలు విసిరారు. 4000 పౌండ్స్ పందెం కడతానన్నారు. ఫిలియాస్ ఫాగ్ అన్నారు, నేనే చేస్తాను. కానీ పందెం నేను 20000 పౌండ్స్ కడతాను, అని అయన దృడంగా

చెప్పారు. ఎప్పుడు అని అడగ్గా యిప్పుడే పందెం మొదలవుతుంది, అని ఫిలియాస్ ఫాగ్ దృడంగా చెప్పాడు. పందెం ఈ రోజునుంచే ప్రారంభం. సరిగ్గా పావు తక్కువ ఎనిమిదికి నేను డోవర్ (Dowar) స్టేషన్ నుంచి  బయలు దేరుతాను.ఈ రోజూ అక్టోబర్ 2nd. నేను మళ్ళీ 21st డిసెంబర్ కల్లా వెనక్కి వస్తాను. ఒక వేళ అలా కానీ పక్షంలో నేను యిప్పుడే చెక్ రాసిస్తున్నాను ౨౦౦౦౦ పౌండ్స్ కి. రాలేకపోతే ఈ పౌండ్స్ మీ సొంతమవుతాయి, అని తన జేబులోని ఒక చిన్న నోట్ బుక్ తీసుకుని ఈ వివరాలన్నీ ఫిలియాస్ ఫాగ్ గారు రాసుకున్నారు. సరిగా డిసెంబర్ 21st 8.45 పీఎం (PM) కి రిఫార్మ్స్ క్లబ్ లోకి నేను వస్తాను. అప్పుడే కలుద్దాం, అని చెప్పాడు.

ఫిలియాస్ ఫాగ్ గారు ఈ మాటలు చెపుతూ వెంటనే అక్కడినుంచి లేచి తన టోపీ పెట్టుకుని రిఫార్మ్స్ క్లబ్ నుంచి బయిటికి వెళ్లిపోయారు.

సరిగా ఎనిమిది గంటల పది నిముషాలకి ఇంటికొచ్చిన ఫిలియాస్ ఫాగ్ ను చూసి

జోన్ పాస్ పెర్త్ చాలా ఆశ్చర్య పడ్డాడు. 

ఫిలియాస్ ఫాగ్ గారు

వెంటనే పాస్ పెర్త్ టోనీ చెప్పాడు, "మనం ఒక పది నిముషాలలో ఇంట్లోంచి

బయటకు వెళుతున్నాము. Dowar స్టేషన్ లో మనం ట్రైన్ పట్టుకుని పదకొండు గంటలకి మనం కారు పట్టుకుని సింప్లీ మనం చేరాలి. పది నిముషాలు సమయం ఇస్తున్నాను. అంతా గబగబా సద్దేసేయి. ఎక్కువ బట్టలు ఏమీ పెట్టుకోకు. మనం దారిలోనే కొనుకుందాం. మనం 80 రోజులలో మొత్తం ఈ భూప్రదక్షిణ చేయబోతున్నాము. అందుకనే మనం సామాన్లు కూడా తీసుకెళ్లక్కర్లేదు," అని చెప్డ్పాడు ఫిలియాస్ ఫాగ్.

జోన్ పాస్ పెర్త్ కి తల తిరిగిపోయింది. అతనికి ప్రపంచం తలకిందులయినట్టుగా అయింది. ఏమీ అర్ధం కావడంలేదు. కానీ ఫిలియాస్ ఫాగ్లో ఎటువంటి హావభావాలు లేవు. ఆయన నింపాదిగా తన గదిలోపలికి వెళ్ళిపోయాడు. 

జోన్ పాస్ పెర్త్ మనసులో ఆలోచనలు పెరుగుతున్నాయి. ఇదేంట్రా భగవంతుడా స్థిరమైన ఉద్యోగం తో యేవో పనులు చేస్తూ హాయిగా ఈ ఫిలియాస్ ఫాగ్ గారి దగ్గర ప్రశాంతంగా జీవనం గడుపుదామంటే, ఈయన ప్రతి రోజూ అదే సమయానికి ఖచ్చితంగా అన్ని పనులు చేస్తుంటాడని , అని నేను హాయిగా ఉందామంటే, ఇదేమిటి ఈయన 80 రోజుల్లో భూప్రదక్షిణ అంటాడు, అని ఆలోచిస్తూ, ఆశ్చర్యపడ్డాడు. అయినా తన పని తానూ చేసుకుంటూ ఉన్నాడు. సరిగా పది నిముషాలలో అంతా సద్దుకున్నారు. ఫిలియాస్ ఫాగ్ గారు మరియు జోన్ పాస్ పర్ట్ బాగ్ లు తెచ్చారు. ఆ బాగ్ లో 20000 పౌండ్స్ఉ న్నాయి. అది కూడా ఒక చిన్న పాకెట్ లో పెట్టారు. జాగ్రత్త  అని ఫిలియాస్ఫాగ్ అన్నాడు. ఒక పది నిముషాల్లో రైల్వే స్టేషన్  కి వెళ్ళటం, రైల్ ఎక్కడం జరిగి పోయింది.  

ఈ ఫిలియాస్ ఫాగ్ ,రిఫార్మ్స్ క్లబ్ మెంబర్   80 రోజుల్లో భూప్రదక్షిణ ప్రపంచ యాత్ర అంతా చేస్తున్నట్టుగా మొత్తం లండన్ అంతా మారుమోగిపోయింది. మరుసటి రోజూ పేపర్లలో  కూడా వచ్చేసింది. కానీ ఈ విషయాలు వీరిద్దరికీ తెలీదు. ఇదంతా గమనిస్తున్నటువంటి స్కాట్లాండ్ డిటెక్టివ్ ఫిక్స్ (Fix)  ఒక ఖచ్చితమైన అభిప్రాయానికి వచ్చాడు. దొంగ చాలా హుందాగా ఉంటాడు. పెద్ద మనిషి తరహాగా ఉంటాడు. అంటే ఈ లక్షణాలన్నీ కూడా రిఫార్మ్స్ క్లబ్  మెంబర్ అయినటువంటి ఫిలియాస్ ఫాగ్ గారికి వర్తిస్తాయి. అందుకనే  ఆయన వెంటనే ఈ భూప్రదక్షిణ  అనే నెపంతో డబ్బులన్నీ కాజేసి బయలుదేరుతున్నారు. కాబట్టి తప్పకుండా ఫిలియాస్ ఫాగ్ దొంగ అయి ఉంటాడని, డిటెక్టివ్ ఫిక్స్ ఒక నిర్ధారణకు వచ్చేసాడు. 

ఫిలియాస్ ఫాగ్ గారి ఈ ప్రయాణం గురించి నలుగురూ నాలుగు విధాలుగా మాట్లాడుకోవటం మొదలు పెట్టారు. కొంతమంది ఫిలియాస్ ఫాగ్ ఒక పిచ్చివాడని చెప్పారు. కొంతమంది కాదు, కాదు   అతను మేధావి అని, అతను అన్ని ప్రణాళికలు చాలా పకడ్బందీగా వేస్తుంటాడని, యిలా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇది జరిగిన కొద్ది  రోజుల్లో ఒక ప్రముఖమైనటువంటి వార్త వచ్చింది. అది డిటెక్టివ్ ఫిక్స్  అనే ఆయన చెప్పిన సమాచారం ప్రకారంగా "దొంగ యొక్క ఆనవాళ్ళన్నీ తెలిస్తే ఆయన వ్యక్తిత్వాన్ని గమనిస్తే ఖచ్చితంగా నా అనుమానమంతా రిఫార్మ్స్  క్లబ్ లో గౌరవనీయులు అయినటువంటి ఈ ఫిలియాస్ ఫాగ్ అనేవ్యక్తి వైపే నా దృష్టి అంతా కేంద్రీకరింప బడింది. అతనే తప్పకుండా ఈ పని చేసి, భూప్రదక్షిణ అనే నెపంతో ఇలా హఠాత్తుగా బయలుదేరడానికి కారణం", అని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ వార్తా పత్రికల్లో ప్రముఖంగా ప్రచురింప బడింది. ఈ విధంగా ఫిలియాస్ ఫాగ్ గురించి రకరకాలుగా జనాలు అనుకుంటున్నారు. ఈ వార్త అందరి నోళ్ళలో పడింది.


************ 


Monday 8 May 2023

80 రోజుల్లో భూప్రదక్షిణ - పరిచయం

 80 రోజుల్లో భూప్రదక్షిణ అనే అద్భుతమైన, సాహసోపేతమైన నవల నాచిన్నతనంలో సుమారు 1960 - 62 మధ్యకాలంలో ఆంధ్ర పత్రికలో సీరియల్ గా ప్రచురింపబడింది. ఈ నవలని ప్రముఖ ఫ్రెంచ్ రచయిత జూల్స్ వెర్నె "అరౌండ్ ది వరల్డ్ ఇన్ 80 డేస్"  అనే శీర్షికతో 1872 లో రాశారు. ఈ నవల ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులని సంపాదించుకుంది. ఈ నవల భూగోళశాస్త్రం తో పాటుగా ఎన్నో సాహస కృత్యాలతో ఎంతో ఉత్కంఠ భరితంగాసాగుతుంది. ప్రస్తుతం మన బాలసాహిత్యంలో ఇటువంటి విజ్ఞాన పరమైనవి, పిల్లలలో పుస్తక పఠనంలో ఆసక్తిని కలిగించేవి లభ్యం కావటం లేదు. అందుకని ఈ నవలని తెలుగు పాఠకులకి, చిన్నలకీ ,పెద్దలకీ పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో అక్షర రూపంలో మరియు శ్రవణ గ్రంథ రూపం లో తెలుగులో అనువాదం చేయటం జరిగింది. ఆ రోజుల్లో ఈ   చిన్న పిల్లల్నే కాక పెద్దవాళ్ళని కూడా ఆకర్షించింది.

ఇన్నేళ్ల తర్వాత ఈ కథని మీముందు గ్రంథ రూపంలో తెస్తున్నాం. ఈ నవల చదివి  మీరంతా ఆనందిస్తారని భావిస్తున్నాము. 

                                                                               ***********