80 రోజుల్లో భూప్రదక్షిణ అనే అద్భుతమైన, సాహసోపేతమైన నవల నాచిన్నతనంలో సుమారు 1960 - 62 మధ్యకాలంలో ఆంధ్ర పత్రికలో సీరియల్ గా ప్రచురింపబడింది. ఈ నవలని ప్రముఖ ఫ్రెంచ్ రచయిత జూల్స్ వెర్నె "అరౌండ్ ది వరల్డ్ ఇన్ 80 డేస్" అనే శీర్షికతో 1872 లో రాశారు. ఈ నవల ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులని సంపాదించుకుంది. ఈ నవల భూగోళశాస్త్రం తో పాటుగా ఎన్నో సాహస కృత్యాలతో ఎంతో ఉత్కంఠ భరితంగాసాగుతుంది. ప్రస్తుతం మన బాలసాహిత్యంలో ఇటువంటి విజ్ఞాన పరమైనవి, పిల్లలలో పుస్తక పఠనంలో ఆసక్తిని కలిగించేవి లభ్యం కావటం లేదు. అందుకని ఈ నవలని తెలుగు పాఠకులకి, చిన్నలకీ ,పెద్దలకీ పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో అక్షర రూపంలో మరియు శ్రవణ గ్రంథ రూపం లో తెలుగులో అనువాదం చేయటం జరిగింది. ఆ రోజుల్లో ఈ చిన్న పిల్లల్నే కాక పెద్దవాళ్ళని కూడా ఆకర్షించింది.
ఇన్నేళ్ల తర్వాత ఈ కథని మీముందు గ్రంథ రూపంలో తెస్తున్నాం. ఈ నవల చదివి మీరంతా ఆనందిస్తారని భావిస్తున్నాము.
***********