N. Sairam Garu || Email: sridatta50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.

Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here

Saturday 13 May 2023

80 రోజుల్లో భూప్రదక్షిణ - అధ్యాయం 1

                                   



ముందుగా ఈ కథలోని ముఖ్య పాత్రలగురించి మాట్లాడుకుందాం. ఈయన పేరు ఫిలియాస్ ఫాగ్. ఈయన బ్రిటిష్ పౌరుడు. 7 Savel రోడ్ సెంట్రల్ లండన్ లో ఉంటాడు. చాలా అందంగా ఉంటాడు. మనిషి చాలా క్రమ శిక్షణతో చాలా ఖచ్చితంగా ఉంటాడు. అందరికీ కూడా ఫిలియాస్ ఫాగ్ అంటే ఎంతో గౌరవం. ఇతనుచాలా ధనవంతుడు. కానీ ఈ ధనం ఎంత సంపాదించాడో, ఎలా సంపాదించాడో అన్నది ఎవరికీ తెలియదు. ఇతనికి నా అన్న వారు ఎవరూ లేరు. స్నేహితులు గానీ బంధువులు గానీ ఎవరూ లేరు. ఖరీదైన సెంట్రల్ లండన్ లో ఈయన నివసిస్తూ ఉంటారు. ప్రతీ రోజూ ఈయన తప్పనిసరిగా రిఫార్మ్స్ క్లబ్ కి వెళతారు. ఈక్లబ్ లోనే అన్నీ న్యూస్ పేపర్లు చదువుతూంటాడు .అలాగే పేకాట కూడా ఆడుతూ ఉంటాడు. ప్రపంచంలో ఏ ప్రదేశా న్నైనా సరే, అక్కడిఅద్భుతాలన్నీ ఈయన ఎంతో చక్కగా వివరిస్తూ ఉంటాడు. అయితే, అతనికి అందరూ తెలిసిన వాళ్ళు కూడా ఏదో ఒకప్పుడు, ఈయన ఆ ప్రాంతానికి తప్పకవెళ్లి ఉంటారు, ఖచ్చితమైన వివరాలు ఇస్తున్నారు కదా అని అంటారు. యింకాబాగా తెలిసిన వాళ్ళు, అదేంటి మేము ఎన్నో ఏళ్ళనుంచి ఈయనని ఎరుగుదుము. ఈయన ఎప్పుడూ ఇంగ్లండును వదిలి వెళ్లనే లేదు, అని, వాదిస్తూ ఉండేవాళ్ళు.బహుశా, ఈయన తన మెదడులోనే ఇన్ని ప్రదేశాలకి ప్రత్యక్షంగా వెళ్లిఉంటారేమో అని ఇంకొకళ్ళు అనుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఫిలియాస్ ఫాగ్గురించి అందరూ రకరకాలుగా చెబుతూ ఉంటారు. కానీ అతను చాలా వ్యక్తిగతంగానే ఉంటాడు. అంటే, ఒంటరిగానే ఉంటాడు. స్నేహితులంటూ, బంధువులంటూ ఎవరూ లేరు. ఇంట్లో ఒక పనిమనిషి మాత్రమే ఉంటాడు. అన్నీ పనులూ ఈ పనివాడు చేస్తూఉంటాడు. గడియారంలో ముల్లు ఎంత క్రమ బద్ధంగా , ఒక్క సెకండ్ కూడా అటూ ఇటూ కాకుండా తిరుగుతూ ఉంటాయో, ఈ ఫిలియాస్ ఫాగ్ కూడా  అంత క్రమ శిక్షణ కలిగి ఉంటాడు. ప్రతీ రోజూ ఏ సమయంలో ఏ పనిచేస్తారో అదే సమయంలో అదే పని ఒక్క సెకండ్ అటూ ఇటూ తేడా లేకుండా అలాగే తూచా తప్పకుండా అదే విధంగా ఈ ఫిలియాస్ ఫాగ్ ఆచరిస్తూ, ప్రవర్తిస్తూ దినచర్య ని ఖచ్చితoగా పాటిస్తూ ఉంటాడు. ఇది ఈయన  గురించి చాలా మంది చేసి నటువంటి విశ్లేషణ. అయితే, ఒకరోజు పనిమనిషిని పనిలో నించి తొలగించడం జరిగింది. ఎందుకంటె షేవింగ్ చేసుకునే నీళ్లు, మామూలు వేడి కంటే ఎక్కువగా ఉన్నాయనే విషయంలో, ఆ పనివాడు తప్పు చేసాడని, అతనిని ఉద్యోగంలోంచి ఫిలియాస్ ఫాగ్  తొలగించాడు. మరి ప్రస్తుతం ఆయనకు రాబోయే కొత్త పనివాడి కోసం,పేరు సర్వెంట్ జోన్ పాస్పర్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రొద్దున్న పదకొండు, పదకొండున్నర మధ్యలో ఈయన ఆపాయిట్మెంట్యి వ్వడం జరిగింది. మాటిమాటికీ గడియారం చూసుకుంటూ ఉన్నాడు ఫిలియాస్ ఫాగ్. ఎందుకంటె ఖచ్చితంగా పదకొండు గంటల ముప్పై  నిముషాలకి ఆయన ఇంట్లోంచి బయలుదేరి, రిఫార్మ్స్ క్లబ్ కి వెళ్తాడు. ఈలోగా, అప్పుడే ఎవరో వచ్చినట్టుగా తలుపు తట్టుతున్న చప్పుడు వినిపించింది. ఎవరబ్బా అని బహుశా సర్వెంట్ జోన్ పాస్పర్ట్  అయి ఉంటాడని తలుపు తెరవగానే ఎదురుగా ముప్పై ఏళ్ళ ఆకర్షణీయంగా ఉన్న యువకుడు ఫిలియాస్ ఫాగ్ కి అభివాదం చేసాడు. నా పేరు జోన్ పాస్పర్ట్ అని అతను పరిచయం చేసుకునే  లోగానే, ఫిలియాస్ ఫాగ్ గారు మరి జాన్ అంటే బ్రిటిష్ వారి పేరు కదా? మరి నీవు ఫ్రెంచ్ వాడివి అంటున్నావు, మరి ఏమిటి విశేషం అంటే, నా పేరు జోన్ పాస్పర్ట్ . జాన్ కాదండీ. నేను ఫ్రెంచ్ వాడినే, అన్నాడు. కొన్నాళ్ళు నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ప్రొఫెషనల్  ఇ న్స్ట్రక్టర్ గా పనిచేసాను. కొన్నాళ్ళు సంగీత అభ్యాసం చేసాను. పాటలు పాడే వాడిని. కొన్నాళ్ళు పారిస్ లో ఫైర్ బ్రిగేడ్ లో ఇన్స్పెక్టర్ గా పనిచేసాను. కొన్నాళ్ళు సర్కస్ లో కూడా గుర్రపు స్వారీ చేస్తుండే వాడిని. కానీ, పనివాడిగా నా జీవితంలో నేనెప్పుడూ పని చేయలేదు. మీ గురించి నా మిత్రుడు ఎంతో గొప్పగా చెప్పాడు. మొత్తం లండన్ లో మీ అంత పెద్దమనిషి ఉండరని, క్రమశిక్షణకు మారుపేరని, నిక్కచ్చిగా ఉంటారని, ఇలా మీ గురించి ఎన్నో విషయాలు, నాకు ఆయన చెప్పారు. నేను ఇప్పటివరకు స్థిరం లేకుండా అక్కడా ఇక్కడా ఉద్యోగాలు చేసాను. మీ సంగతి విన్నాక ఇక్కడ మీ దగ్గర ప్రశాంతంగా పనివాడుగా చేరదామని అనుకున్నాను. కానీ నేను పనివాడుగా ఇంతవరకూ పని చేయలేదండీ. నాకు మాత్రం ఆ అనుభవం లేదు, అని గబగబా తనకి తెలిసిన విషయాలు చెప్పేసాడు. ఓహో, అలాగా,  రిఫార్మ్స్ క్లబ్ లో నామిత్రుడు నీ గురించి చెప్పాడు. నువ్వు ఫ్రెంచ్ దేశస్తుడని చాలా మర్యాదస్తుడవనీ, నాకే సరిగా సరిపోయే మనిషి అని, నాకు చెప్పడం జరిగింది, అని ఫిలియాస్ ఫాగ్ సమాధానమిచ్చాడు. ఫిలియాస్ ఫాగ్ కి ఎలాంటి పనివాడు కావాలో అని చెప్పబోయే సరికి, సర్వెంట్ జోన్ పాస్పర్ట్ నాకు అంతా అర్ధమయింది, అని చెప్పాడు. సరే యిప్పుడు టైం ఎంతైంది? అని అడగ్గా, జోన్ పాస్పర్ట్ తన జేబులోంచి  చిన్న గడియారాన్ని తీసి పదకొండు గంటల ఇరవై రెండు నిముషాలు అయిందని చెప్పాడు. నాలుగు నిముషాలు లేటుగా ఉంది. సరే నువ్వు పదకొండు గంటల ఇరవై ఆరు నిముషాల నుంచి ఈ ఉద్యోగంలో చేరినట్టుగా లెక్క. సరే. నేను వెళతాను, అని చెప్పి సరిగ్గా పదకొండు గంటల ముప్పై నిముషాలకి, నెత్తిమీద టోపీ పెట్టుకొని ఆయన ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు.చాలా క్లుప్తంగా జరిగాయి పరిచయాలు. 

జోన్ పాస్పర్ట్ మనసులో ఆయన గురించి ఈ విధంగా అనుకున్నాడు. ఈ మనిషి, ఒడ్డూ పొడుగూ చాలా అందంగా ఉన్నాడు. కళ్ళు చాలా ప్రశాంతంగా ఉన్నాయి. చాలా గౌరవంగా ఉన్నాడు. చాలా కలుపటంగా జరిగింది ఆయనతో మాట్లాడటం. ఈయన చాలా తక్కువగా మాట్లాడుతున్నాడు. ఈయన హావభావాలు తెలుసుకోవాలంటే చాలా కష్టం. బహుశా బ్రిటిష్ వారంతా ఇలాగే ఉంటారు కాబోలు. అతను ఏమి ఆలోచిస్తాడో మనకి ఏమీ తెలియదు కానీ, బయట మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఇతను నాకు తగిన యజమాని అని అనుకున్నాడు. ఇక్కడైనా నేను హాయిగా ప్రశాంతంగా ఉంటాను, నమ్మకస్తుడిగా ఉంటాను, అని జోన్ పాస్పర్ట్ అనుకుంటాడు.

ఇక జోన్ పాస్పర్ట్ గురించి మాట్లాడుకుందాం. జోన్ పాస్పర్ట్ ముప్పైఏళ్ళవాడు. ఆకర్షణీయమైన మొహాన్ని కలిగి ఉన్నాడు. చాలా బలిష్టంగా ఉన్నాడు. నీలి జుట్టు మాత్రం కొంచం చిందర వందరగా ఉంటుంది. జోన్ పాస్పర్ట్  ముందుగా ఆ యింటినంతా ఒక్కొక్క గదిలోకి వెళ్లి పరీక్షించాడు. అంతా చాలా శుభ్రంగా అమర్చినట్లుగా ఉంది. అంతా అయినాక తన గదిలోకి వచ్చాడు. తన గది కూడా చాలా శుభ్రంగా ఉంది. అక్కడ ఓకే పెద్ద గడియారం ఉంది. ఈ గడియారం కి సెకండ్ల ముల్లు చాలా పెద్దగా ఉంది. ఈ రెండు గడియారాలు ఖచ్చితమైన సమయాన్నే సూచిస్తూ ఉన్నాయి. మేడ మీద ఒక కాగితం అంటించబడి ఉంది. దానిపై జోన్ పాస్పర్ట్ దిన చర్య అంతా రాయడం జరిగింది. దానిని చూసుకుంటూ తన పిన్నిని తాను నిర్వహిస్తూ ఉండాలి. అంటే ఫిలియాస్ ఫాగ్ గారు ఎన్నింటికి లేస్తారు. నీళ్ల ఉష్ణోగ్రత ఎంత ఉండాలి. ఎన్నింటికి బ్రేక్ ఫాస్ట్ చేజేస్తారు. ఎన్నింటికి ఇంట్లోంచి బయిటికి వెళతారు. మళ్ళీ ఎన్నింటికి వస్తారు. యివన్నీ కూడా వివరంగా అక్కడ రాసి ఉన్నాయి. జోన్ జోన్ పాస్పర్ట్ కి చాలాసంతోషం వేసింది. ఈ మనిషి గడియారంలాగా ఖచ్చితంగా బాగా పని చేస్తూ ఉంటాడు. కాబట్టీ నేను అసలు సిసలైన యజమాని దగ్గరికే వచ్చాను,  అని అతను ఎంతో సంతోషపడ్డాడు.

ఫిలియాస్ ఫాగ్ గారు చాలా ఖచ్చితంగా ఉంటాడని మనం చెప్పు కున్నాం కదా. అంటే సరిగా పదకొండు గంటల ముప్పై నిముషాలకి ఆయన రిఫార్మ్స్ క్లబ్ కి వెళ్తాడు. ముందుగా ఎడమ పాదం పెడ్తారు. అది 575 సార్లు అయ్యేసరికి ఆయన రిఫార్మ్స్ క్లబ్ కి వెళతారు. ఆ తరువాత 575 సార్లు    తర్వాత కుడి పాదం పెట్టె సరికి, రిఫార్మ్స్ క్లబ్ ఎంట్రన్స్ గేట్ దగ్గర ఆయన చేరుతారు. అక్కడ ఆయన పదమూడు నిముషాలు తక్కువగా ఒంటి గంటకు అక్కడే మధ్యాహ్నం భోజనం అదే టేబుల్ మీద కుర్చీలో కూర్చుని  చేస్తారు. ఆ తర్వాత అక్కడే ఉన్న లైబ్రరీ లో పుస్తకాలు, మాగజైన్లు చదువుతూ ఉంటారు. సరిగా ఐదు గంటలకి ఆయన టీ సేవిస్తారు. ఆ తరువాత పది నిముషాల తక్కువ ఆరు గంటలకి రిఫార్మ్స్ క్లబ్ లో పేకాట ఆడే గదిలోకి ప్రతీ నిత్యం తాను కూర్చునే టేబుల్ కుర్చీ దగ్గర ఆయన కూర్చుంటారు. పేకాట ఆడినపుడు వచ్చే డబ్బుని, విరాళంగా పంచి ఇచ్చేస్తాడు.

ఫిలియాస్ ఫాగ్ గారితో విచిత్రమైనటువంటి పందెం :

ఆరోజు అక్టోబర్ 2, 1872 వ సంవత్సరం. ఫిలియాస్ ఫాగ్ పేకాట ఆడడానికి కూర్చునే సమయానికి  లండన్ లో చాలా మంది పెద్ద మనుషులు, ధనవంతులు వాళ్లంతా కూడా వచ్చి అక్కడే పేకాట ఆడుతూ ఉంటారు. ఆండ్రూస్ స్టువర్ట్, మరొక ధనవంతుడు సర్ రాల్ఫ్ గౌటీర్ (Sir Ralph Gautier) వీళ్లంతా ఖచ్చితమైన సమయానికి ఆడుకుంటూ ఉంటారు. ఆ రోజూ ఒక విచిత్రమైనటువంటి సంచలనాత్మకమైన వార్తా న్యూస్ పేపర్ లో వచ్చింది. ఆండ్రూ స్టువర్ట్ గట్టిగా చదువుతున్నాడు. సరిగా సెప్టెంబర్ 29 తేదీన బ్యాంక్ అఫ్ ఇంగ్లాండ్ లో 55,౦౦౦ పౌండ్స్ దొంగతనం జరిగిందనీ, ఆ దొంగతనం చేసినవాడు పెద్ద మనిషిలాగా కనిపిస్తున్నాడని, ఆయన అలా చదువుకుంటూ వెళుతున్నారు. మిగితా సభ్యులందరూ కూడా పేకాట ఆడటానికి సిద్ధమవుతుండగా ఆండ్రూ స్టీవర్ట్ ఇంకా చదువుతూనే ఉన్నాడు. ఆ దొంగతనం చేసిన వ్యక్తిని ఎవరైనా పట్టుకుంటేవారికి 2,000 పౌండ్స్ బహుమానంగా ఇస్తామని బ్యాంక్ అఫ్ ఇంగ్లాండ్  వారు  పత్రికా ముఖంగా తెలియజేసారు. ఇంగ్లాండ్ లోని ప్రఖ్యాతమైన డిటెక్టివ్ లు అందరూ కూడా ఎలాగైనా సరే ఈ దొంగని పట్టుకోవాలని, ఆ రెండువేల పౌండ్స్ బహుమతిని తీసుకోవాలని వాళ్ళ ప్రయత్నాలు మొదలు పెట్టారు.ఈ దొంగతనం చేసిన వ్యక్తి చాలా దర్జాగా, ఠీవిగా చాలా పెద్ద మనిషిలా ఉంటాడు, అని ఒక చిన్నపాటి వర్ణన కూడా చేశారు. 

ఆండ్రూస్ స్టీవర్ట్ చదువుతూ అంత పెద్ద విశాల ప్రపంచంలో వాడు ఎక్కడ దాక్కుంటాడో, దొంగని ఎలా పెట్టుకుంటారో, ఏమిటో అని అన్నాడు. 

"అసలు ప్రపంచం అంత పెద్దది కాదండీ" అని ఫిలియాస్ ఫాగ్ జవాబిచ్చాడు. 

"ఏమిటి ? ప్రపంచం అంత పెద్దదిగా లేదా. ఏం మాట్లాడుతున్నారండీ ఫిలియాస్ ఫాగ్

గారు"?  అనగా 

"లేదండీ ప్రపంచం నిజానికి అంత పెద్దగా లేదు. అది చాలా చిన్నగానే ఉందని" చాలా ధీమాగా ఫిలియాస్ ఫాగ్ గారు జవాబిచ్చారు. 

దానికి సమాధానంగా సర్ రాల్ఫ్ గౌటీస్ (Sir Ralph Gautier) "ఒకప్పుడు బి హోమి చాలా విశాలంగా ఉండేది. కానీ ప్రస్తుతం అది చిన్నగా అయింది. అని మీరు చెపుతున్నంతచిన్నగా  కాలేదండీ". ఈ విధంగా పరస్పరంగా అనుకున్నారు. 

ఫిలియాస్ ఫాగ్ మా  త్రం "ఏం లేదండీ. ప్రపంచం చిన్నదై పోయింది. నిజం చెప్పాలంటే మనం 8౦ రోజుల్లో భూమినంతా ప్రదక్షిణ చేయవచ్చు", అని ధీమాగా చెప్పాడు.

ఈ ఇద్దరి సంభాషణ మిగితా సభ్యులందరూ కూడా చాలా ఆసక్తిగా, శ్రద్ధగా వింటున్నారు. అదేమిటి, 80 రోజుల్లో మొత్తం భూప్రదక్షిణ ఎలాచేస్తాము. మధ్యలో అవాంతరాలు రావచ్చు. ప్రకృతి వైపరీత్యాలు రావచ్చు. ఓడలు మర్మత్తుకి గురికావచ్చు. ఇన్ని ఉన్నాయి కదా. అలాగని గట్టిగా ఎలా చెప్పగలుగుతారంటే, ఈ అవాoతారాలన్నీ దృష్టిలో పెట్టుకొనే మనం ౮౦ రోజుల్లో మొత్తం భూప్రదక్షిణ చేయొచ్చు, అని ఫిలియాస్ ఫాగ్ గట్టిగా చెప్పాడు. దానికి గౌటీర్ (Gautier) వారు గట్టిగా నవ్వారు. అది చాలా కష్టం. 80 రోజులలో భూప్రదక్షిణ మాత్రం జరగదు అని అన్నారు. జరుగుతుంది అని అన్నారు ఫిలియాస్ ఫాగ్.

యిద్దరు పట్టుదలగా మాట్లాడుతుంటే, పంతాలు పట్టింపులు పెరుగుతున్నాయి. సభ్యులందరు ఆతృతగా ఏం జరుగుతుందో అని చూస్తూ వింటున్నారు. అయితే, ఆ పని నీవు చేయగలవా? అని గౌటీర్ వారు సవాలు విసిరారు. 4000 పౌండ్స్ పందెం కడతానన్నారు. ఫిలియాస్ ఫాగ్ అన్నారు, నేనే చేస్తాను. కానీ పందెం నేను 20000 పౌండ్స్ కడతాను, అని అయన దృడంగా

చెప్పారు. ఎప్పుడు అని అడగ్గా యిప్పుడే పందెం మొదలవుతుంది, అని ఫిలియాస్ ఫాగ్ దృడంగా చెప్పాడు. పందెం ఈ రోజునుంచే ప్రారంభం. సరిగ్గా పావు తక్కువ ఎనిమిదికి నేను డోవర్ (Dowar) స్టేషన్ నుంచి  బయలు దేరుతాను.ఈ రోజూ అక్టోబర్ 2nd. నేను మళ్ళీ 21st డిసెంబర్ కల్లా వెనక్కి వస్తాను. ఒక వేళ అలా కానీ పక్షంలో నేను యిప్పుడే చెక్ రాసిస్తున్నాను ౨౦౦౦౦ పౌండ్స్ కి. రాలేకపోతే ఈ పౌండ్స్ మీ సొంతమవుతాయి, అని తన జేబులోని ఒక చిన్న నోట్ బుక్ తీసుకుని ఈ వివరాలన్నీ ఫిలియాస్ ఫాగ్ గారు రాసుకున్నారు. సరిగా డిసెంబర్ 21st 8.45 పీఎం (PM) కి రిఫార్మ్స్ క్లబ్ లోకి నేను వస్తాను. అప్పుడే కలుద్దాం, అని చెప్పాడు.

ఫిలియాస్ ఫాగ్ గారు ఈ మాటలు చెపుతూ వెంటనే అక్కడినుంచి లేచి తన టోపీ పెట్టుకుని రిఫార్మ్స్ క్లబ్ నుంచి బయిటికి వెళ్లిపోయారు.

సరిగా ఎనిమిది గంటల పది నిముషాలకి ఇంటికొచ్చిన ఫిలియాస్ ఫాగ్ ను చూసి

జోన్ పాస్ పెర్త్ చాలా ఆశ్చర్య పడ్డాడు. 

ఫిలియాస్ ఫాగ్ గారు

వెంటనే పాస్ పెర్త్ టోనీ చెప్పాడు, "మనం ఒక పది నిముషాలలో ఇంట్లోంచి

బయటకు వెళుతున్నాము. Dowar స్టేషన్ లో మనం ట్రైన్ పట్టుకుని పదకొండు గంటలకి మనం కారు పట్టుకుని సింప్లీ మనం చేరాలి. పది నిముషాలు సమయం ఇస్తున్నాను. అంతా గబగబా సద్దేసేయి. ఎక్కువ బట్టలు ఏమీ పెట్టుకోకు. మనం దారిలోనే కొనుకుందాం. మనం 80 రోజులలో మొత్తం ఈ భూప్రదక్షిణ చేయబోతున్నాము. అందుకనే మనం సామాన్లు కూడా తీసుకెళ్లక్కర్లేదు," అని చెప్డ్పాడు ఫిలియాస్ ఫాగ్.

జోన్ పాస్ పెర్త్ కి తల తిరిగిపోయింది. అతనికి ప్రపంచం తలకిందులయినట్టుగా అయింది. ఏమీ అర్ధం కావడంలేదు. కానీ ఫిలియాస్ ఫాగ్లో ఎటువంటి హావభావాలు లేవు. ఆయన నింపాదిగా తన గదిలోపలికి వెళ్ళిపోయాడు. 

జోన్ పాస్ పెర్త్ మనసులో ఆలోచనలు పెరుగుతున్నాయి. ఇదేంట్రా భగవంతుడా స్థిరమైన ఉద్యోగం తో యేవో పనులు చేస్తూ హాయిగా ఈ ఫిలియాస్ ఫాగ్ గారి దగ్గర ప్రశాంతంగా జీవనం గడుపుదామంటే, ఈయన ప్రతి రోజూ అదే సమయానికి ఖచ్చితంగా అన్ని పనులు చేస్తుంటాడని , అని నేను హాయిగా ఉందామంటే, ఇదేమిటి ఈయన 80 రోజుల్లో భూప్రదక్షిణ అంటాడు, అని ఆలోచిస్తూ, ఆశ్చర్యపడ్డాడు. అయినా తన పని తానూ చేసుకుంటూ ఉన్నాడు. సరిగా పది నిముషాలలో అంతా సద్దుకున్నారు. ఫిలియాస్ ఫాగ్ గారు మరియు జోన్ పాస్ పర్ట్ బాగ్ లు తెచ్చారు. ఆ బాగ్ లో 20000 పౌండ్స్ఉ న్నాయి. అది కూడా ఒక చిన్న పాకెట్ లో పెట్టారు. జాగ్రత్త  అని ఫిలియాస్ఫాగ్ అన్నాడు. ఒక పది నిముషాల్లో రైల్వే స్టేషన్  కి వెళ్ళటం, రైల్ ఎక్కడం జరిగి పోయింది.  

ఈ ఫిలియాస్ ఫాగ్ ,రిఫార్మ్స్ క్లబ్ మెంబర్   80 రోజుల్లో భూప్రదక్షిణ ప్రపంచ యాత్ర అంతా చేస్తున్నట్టుగా మొత్తం లండన్ అంతా మారుమోగిపోయింది. మరుసటి రోజూ పేపర్లలో  కూడా వచ్చేసింది. కానీ ఈ విషయాలు వీరిద్దరికీ తెలీదు. ఇదంతా గమనిస్తున్నటువంటి స్కాట్లాండ్ డిటెక్టివ్ ఫిక్స్ (Fix)  ఒక ఖచ్చితమైన అభిప్రాయానికి వచ్చాడు. దొంగ చాలా హుందాగా ఉంటాడు. పెద్ద మనిషి తరహాగా ఉంటాడు. అంటే ఈ లక్షణాలన్నీ కూడా రిఫార్మ్స్ క్లబ్  మెంబర్ అయినటువంటి ఫిలియాస్ ఫాగ్ గారికి వర్తిస్తాయి. అందుకనే  ఆయన వెంటనే ఈ భూప్రదక్షిణ  అనే నెపంతో డబ్బులన్నీ కాజేసి బయలుదేరుతున్నారు. కాబట్టి తప్పకుండా ఫిలియాస్ ఫాగ్ దొంగ అయి ఉంటాడని, డిటెక్టివ్ ఫిక్స్ ఒక నిర్ధారణకు వచ్చేసాడు. 

ఫిలియాస్ ఫాగ్ గారి ఈ ప్రయాణం గురించి నలుగురూ నాలుగు విధాలుగా మాట్లాడుకోవటం మొదలు పెట్టారు. కొంతమంది ఫిలియాస్ ఫాగ్ ఒక పిచ్చివాడని చెప్పారు. కొంతమంది కాదు, కాదు   అతను మేధావి అని, అతను అన్ని ప్రణాళికలు చాలా పకడ్బందీగా వేస్తుంటాడని, యిలా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇది జరిగిన కొద్ది  రోజుల్లో ఒక ప్రముఖమైనటువంటి వార్త వచ్చింది. అది డిటెక్టివ్ ఫిక్స్  అనే ఆయన చెప్పిన సమాచారం ప్రకారంగా "దొంగ యొక్క ఆనవాళ్ళన్నీ తెలిస్తే ఆయన వ్యక్తిత్వాన్ని గమనిస్తే ఖచ్చితంగా నా అనుమానమంతా రిఫార్మ్స్  క్లబ్ లో గౌరవనీయులు అయినటువంటి ఈ ఫిలియాస్ ఫాగ్ అనేవ్యక్తి వైపే నా దృష్టి అంతా కేంద్రీకరింప బడింది. అతనే తప్పకుండా ఈ పని చేసి, భూప్రదక్షిణ అనే నెపంతో ఇలా హఠాత్తుగా బయలుదేరడానికి కారణం", అని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ వార్తా పత్రికల్లో ప్రముఖంగా ప్రచురింప బడింది. ఈ విధంగా ఫిలియాస్ ఫాగ్ గురించి రకరకాలుగా జనాలు అనుకుంటున్నారు. ఈ వార్త అందరి నోళ్ళలో పడింది.


************