N. Sairam Garu || Email: sridatta50@gmail.com. Please visit our spdss.org website for more articles.

Our website is very young as it was launched at the end of July 2013 and we have to go a long way for which we seek your support in the form of suggestions and guidance. We have some interesting topics related to the spiritual science.

Our objective is to bring together the wisdom of our ancients with modern science.

Please subscribe to our YouTube channel - Spiritual Rainbow for more audio/video files: here
Showing posts with label Mohini Katha. Show all posts
Showing posts with label Mohini Katha. Show all posts

Monday, 25 April 2016

Mohini Katha-07


శ్రీ రాంలాల్ ప్రభుజి లీల ­- మోహిని కథ – 7 (ఆఖరి భాగం)
                       (Concluding Part)
యదావిధిగా వాళ్ళందరినీ లేపి జరిగిందంతా రవి కాంత్ వాళ్లకి చెప్పాడు. ఇదేమిటీ మేమెంత ప్రయత్నించినా సరిగ్గా ఆవిడ వచ్చే సమయానికి బాగా నిద్ర పడుతుంది. ఆవిడ రావడం, మీరిద్దరూ గంటలు గంటలు మాట్లాడుకోవడం మేము ఒక్క రోజైనా స్వయంగా  మా కళ్ళతో మేము చూడలేదు. “అమ్మ బాబోయ్ ! ఈ కామ పిశాచానికి చాలా శక్తి ఉన్నట్టుగా ఉంది.” “హారీ భగవంతుడా ! ఇప్పుడేమిటీ మార్గం? ఏం చేయాలి? శ్రీ రాంలాల్ ప్రభువు గారిని పూజించిన పూలలో ఎంతో శక్తి ఉందని మనం సంతోషించి పోయాం కాని ఆ కామ పిశాచి, ఆ మోహిని ఆ పువ్వులనే నీ చేత్తో దూరంగా అవతల పారేసేటట్టు చేసిందే, ఏం చేయాలి ఇప్పుడు ? 

Sunday, 27 March 2016

Mohini Katha-06


                             శ్రీ రాంలాల్ ప్రభు – మోహిని కథ- 6

ఈ విధంగా ఆ డాక్టర్ గారి కామ, క్రోధ, లోభ, మోహ మద మాత్సర్యాలు మరియూ ఆమె చేసుకున్న ప్రారబ్ధ కర్మలన్నీ కూడా నేను గ్రహించాను. ఆ బాధకి తట్టుకోలేక నేను తెల్లవారుఝామున ఒక పాడుబడ్డ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాను. కాని  భగవంతుని విధి విధానం బట్టి ఆత్మా హత్య చేసుకోవడం పాపం కదా ! మన కర్మలు మనం అనుభవించడమే మంచిది కదా ! ఈ విధంగా నాకు పిశాచ జన్మ వచ్చింది. కాని పూర్వ జన్మలో ఉన్న జ్ఞానం నశించ లేదు. నా సహజమైన సంస్కారాలు నాదగ్గరే ఉన్నాయి. నామీద నేను ప్రయోగించుకున్న విధి విధానం వల్ల డాక్టర్ గారి కామపరమైన కోరికలన్నీ కూడా నేను భరించవలసి వచ్చింది.

Saturday, 12 March 2016

Mohini Katha-05




 శ్రీ రాంలాల్ ప్రభు – మోహిని కథ- Part 5
ఇతను ఒక్క సారిగా చూశాడేమో ఉలిక్కి పడ్డాడు. ఆ అమ్మాయి ఎటువంటి భావాలు లేకుండా కేవలం నవ్వుతూ అతని వైపు చూస్తూ ఉంది. మీరేమేం మాట్లాడుకుంటున్నారో, ఏమేం చేస్తున్నారో, ఏమేం ఆలోచిస్తున్నారో నాకు  అంతా తెలుస్తూనే ఉంది. హనుమాన్ చాలీసా చేసినంత మాత్రాన నేను నీ దగ్గరకి రాను అని మీరు అనుకుంటున్నారు కదా ! అలా ఏమీ లేదు. 
మీరు హనుమాన్ చాలీసా చదివినా కూడా నేను నీ దగ్గరకి రాగలను చూడు ! నేను వస్తున్నాను అని అంటూ ఆమె ఆ కిటికీ నుంచి, ఆ గోడలోంచి ఆ గదిలోపల  ప్రవేశించి అతను పడుకున్న మంచం మీద కూర్చుంది. చూశావా ! నీకు నేను అప్పుడే చెప్పాను. నేను  సర్వ శక్తివంతురాలిని, ఏ పనైనా చేయ గలను  అని అప్పుడే చెప్పాను. అయినా మీకనుభవం లేదు కాబట్టి మీరు నమ్మడం కష్టమే. మీరు హనుమాన్ చాలీసా చదివారు. 

Thursday, 3 March 2016

Mohini Katha-04


శ్రీ రాంలాల్ ప్రభుజి లీల ­- మోహిని కథ – Part 4

అది 1958వ సంవత్సరం. మేము మా అమ్మగారి పుట్టిల్లైన హార్డికర్ బాఘ్ ఇంటికి తరచూ వెళ్ళుతూ ఉండేవాళ్ళం. చలి కాలం. ఆ రోజు రాత్రి మా అమ్మగారి చుట్టూ మేమంతా కూర్చుని సహజంగా పిల్లలకి కథలంటే చాలా ఇష్టంగా ఉంటుంది అందులో దయ్యాల కథలయితే మరీ ఆసక్తిగా ఉంటుంది. అందుకని మా అమ్మగారిని బలవంత పెడితే ఆవిడ ఈ కథ చెప్పడం  ప్రారంభించారు. ఇది నిజంగా జరిగిన కథ. 

ఆ రోజుల్లోఅంటే నైజాంనవాబు పరిపాలించిన రోజుల్లో, ఆయన రాజ్యంలో యదార్ధంగా (నిజంగా) జరిగిన సంఘటన. మొత్తం హైదరాబాదులోనే కాకుండా మహారాష్ట్ర, కర్నాటక రాజ్యాలలో కూడా ఈ కథ వ్యాపించి  ఒక సంచలనాన్ని కలిగించింది. ప్రజలంతా భయంతో గడ గడా వణికి పోయారు. ప్రతి ఇంట్లో ఈ కథనే ఆ రోజుల్లో చెప్పుకుంటూ ఉండేవాళ్ళని మా అమ్మగారు మాకు చెప్పడం జరిగింది. 

Tuesday, 16 February 2016

Mohini Katha-03


శ్రీ రాంలాల్ ప్రభుజి లీల ­- మోహిని కథ – Part ౩

ఈ సంఘటనకి రవి కాంతు కొంచెం బిత్తరపడ్డాడు అదేమిటీ  ఎదురుగుండా నాకు అంత గోడ కనిపిస్తుండగా ఈ గోడలోంచి ఆవిడ ఎలా దూసుకుపోయింది? నా అనుమానం నిజం అయ్యింది.  ఈవిడ మనిషి కాదు. మనిషికి ఇదంతా సాధ్యం కాదు కదా! అని ఆలోచిస్తుండగానే  ఆవిడ క్షణంలో గోడలోంచి ఇటువైపు ప్రవేశించి అతని దగ్గరికి చేరి అతని వయోలిన్ డబ్బా పెట్టెని అందించింది. అతను ఆశ్చర్యపోయాడు. అది తనదే ఎక్కడో హైదర్బస్తీలోని తన అన్నగారి గదిలో తాను ఎక్కడో మూల దాచిపెట్టుకున్న వయోలిన్ డబ్బాని ఆవిడ ఎలా తీసుకువచ్చిందబ్బా? అని కొద్దిగా ఆశ్చర్యం పడడమే కాకుండా కొంచెం భయపడ్డాడు కూడా.  దానికావిడ నవ్వుతూ ఏం ఫరవాలేదు!  నాకు ఉన్న చాలా చిన్న శక్తిని మాత్రమే ఉపయోగించాను అంతే.  అయినా ఇవన్నీ మరిచిపోదాం. చక్కగా ఒక పాట పాడు. ఫలానా పాట  నాకు ఎంతో ఇష్టం అని చెప్పగా అతడు మరింత ఆశ్చర్యపడిపోయి ఆ వయొలిన్ బయటకు తీసి ఆవిడ కోరిక ప్రకారం ఆమెకి కావల్సిన పాటని వయొలిన్ మీద వాయించాడు.

Friday, 5 February 2016

Mohini Katha-02


రాంలాల్ ప్రభుజి లీల ­- మోహిని కథ - Part 2

 “అలా చూస్తూ నిలబడ్డారేమిటీ! లోపలకి రండి” అని ఆవిడ ఆహ్వానించింది. చక్కటి పళ్ళవరస చిరునవ్వు నవ్వుతుంటే తళుక్కుమని మెరుస్తూ ఆకర్షిస్తున్నాయి. ఆమె యొక్క ప్రతి అణువులో అందం అలా ఉట్టి పడుతూ ఉంది. ఆ నడక... ఆ మాట ... ఆ ఎత్తు... ఆ అవయవ సౌష్టవం..... వర్ణించలేనంత  అందంగా ఉంది. ఏదో  ప్రబంధ కావ్యంలో  ఆవిడ నాయిక మాదిరిగాఒక గ్రీకు సౌందర్యరాశిలాగా అతనికి కనిపించసాగింది. ఏమిటి నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను?నాకు ఈ రోజు ఏమైందిఅని అతను మనస్సులో అనుకుoటున్నాడు. లోపలకు అడుగుపెట్టగానే దాదాపు ఒక పన్నెండు అంగుళాల దళసరి మెత్తటి తివాచి క్రింద నేలమీద పరచి ఉంది. అలాగే  పెద్ద రాజోచిత  సింహాసనాలు అక్కడ ఉన్నాయి. అదంతా మెత్తటి  మక్మల్ బట్టతో అలంకరించినట్టుగా ఉంది. అతన్ని ఆ ఆసనం మీద కూర్చోమని చెప్పిఆవిడ ఎదురుగా ఉన్న ఆ ఆసనం మీద కూర్చుని, “ఏమిటీ ఆలోచిస్తున్నారుపరధ్యానoలో ఉన్నారు. మీ చుట్టూ ఉన్న అందాన్ని మీరు ఆస్వాదించకుండా  ఏవేవో పాత ఆలోచనలలోకి మీరు ఎందుకు వెళుతున్నారు?” అని ప్రశ్నించింది. 

Mohini Katha-01

శ్రీ రాంలాల్ ప్రభుజి లీల ­- మోహిని కథ

రవికాంత్ మెల్లగా హైదర్బస్తి నుంచి బయలుదేరి దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీసుకి చేరాడుఅతను నిరుద్యోగిగా ఉన్నాడు మొన్ననే బీ.ఏ పాస్ అయ్యాడుఅతని దినచర్య ఏమిటి అంటే వివిధ కంపెనీలకి దరఖాస్తులు పంపుతూ ఉండడం. అలాగే ఆ రోజు పోస్ట్ ఆఫీస్ కి చేరి తను వ్రాసిన దరఖాస్తును పోస్ట్ చేసి ఇంక ఇంటికి బయలుదేరుదాము అని అనుకుంటుండగా ఒక మృదు మధురమైన స్త్రీ గొంతు, “ఏమండీఒకసారి మీ పెన్ను ఇస్తారా?” అని వినిపించింది. అతడు వెను వెOటనే చూడగానే ఒక విధమైన దిగ్భ్రాంతికి లోనయ్యాడు ఎదురుగుండా అద్భుతమైన సౌందర్యరాశి నవ్వుతూ కనిపించింది.

Thursday, 7 January 2016

Mohini Katha - Intro



ప్రస్తావన
అందరిలో ఆది గురువైనట్టి శ్రీ దత్తాత్రేయ స్వామి వారు అనేక అవతారాలు ఎత్తారు. అందులో కొన్ని అవతారాలు గుప్తంగా ఉండి పోయాయి. కొన్ని సంపూర్ణ కథలతో, కళలతో అవతారాలు ఎత్తితే, కొన్ని అంశావతారాలుగా చెప్పబడుతున్నాయి. అందులో ఒక అంశావతారంగా భావించబడే సిద్ధ పురుషుడే ఈ రాంలాల్ ప్రభువు. ఈయన జీవిత విశేషాలు మేము ధారావాహి లాగా త్వరలోనే మా వెబ్ సైట్ ద్వారా మీముందు ఉంచబోతున్నాము. 

నిజానికి ఈయన చరిత్ర ఏన్ణార్థం (వన్ అండ్ హాఫ్ ఇయర్స్) క్రిందే సిద్ధంగా ఉన్నా కొన్ని అనివార్య కారణాల వల్ల మేము మీ ముందు తీసుకు రాలేక పోయాము. (తెలుగులో టైపు చేసే వారు దొరకనందు వల్ల) ఆయన జీవిత చరిత్ర చెప్పబోయే ముందు ఆయన చేసిన ఒక అద్భుతమైన లీలను మీ ముందు ఉంచబోతున్నాము. ఇది చదివి మీరందరూ కూడా ఆనందించండి .

ఈయన గురించి శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి వారి చరితామృతంలో వివరించబడింది.